
యెమెన్ అల్-ఖైదా శాఖ నేత ఖలిద్ అల్ బతర్ఫీ మృతి చెందాడు. ఆదివారం అర్థరాత్రి ఉగ్రవాదులు ఈ సమాచారాన్ని అందించారు. అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) గ్రూపులో అల్-ఖైదాకు నాయకత్వం వహిస్తున్న ఖలిద్ అల్ బతర్ఫీపై యూఎస్‌ఏ ప్రభుత్వం ఐదు మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. ఏక్యూఏపీ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హత్య అనంతరం ఈ తీవ్రవాద గ్రూపును అత్యంత ప్రమాదకరశాఖగా పరిగణిస్తున్నారు.
అల్-ఖైదా తాజాగా దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేసింది. దానిలో ఖలిద్ అల్ బతర్ఫీ శరీరానికి అల్‌ఖైదా జెండాను చుట్టినట్లు కనిపిస్తోంది. ఖలిద్ అల్ బతర్ఫీ కి 40 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ‘సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ రంజాన్ మాసం సందర్భంగా దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసింది. యెమెన్‌లో సోమవారం నుంచి ముస్లింల పవిత్ర మాసం ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment