టీఎంసీ నేత దారుణ హత్య.. ఐదుగురు అరెస్ట్‌ | Local TMC Leader Beaten To Death In West Bengal Birbhum, Five Arrested In This Incident | Sakshi
Sakshi News home page

టీఎంసీ నేత దారుణ హత్య.. ఐదుగురు అరెస్ట్‌

Published Mon, Nov 4 2024 8:30 AM | Last Updated on Mon, Nov 4 2024 10:18 AM

TMC Leader Beaten to Death

బీర్భూమ్: పశ్చిమ బెంగాల్‌లో మరోదారుణం చోటుచేసుకుంది. బీర్భూమ్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన నేత హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోల్‌పూర్ పట్టణ సమీపంలోని పరుల్‌దంగా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

టీఎంసీ నేత సమీర్ తాండర్ (40) తన ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. సమీర్ తాండర్ కంకలితల పంచాయతీ సభ్యునిగా ఉన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన బుర్ద్వాన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ, మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమీర్ తాండార్ కుమారుడు ప్రతీక్ తాండర్ మాట్లాడుతూ గ్రామస్తులు కొందరు తన తండ్రిపై దాడి చేశారని, వెంటనే తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించినా ప్రయోజనం లేకపోయిందన్నారు.

గ్రామంలో తలెత్తిన గొడవల కారణంగానే తాండర్‌పై దాడి  జరిగివుండవచ్చని  తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వికాస్ రాయ్ చౌదరి  పేర్కొన్నారు. ఈ  ఘటనపై వెంటనే విచారణ  చేపట్టి, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఈ దాడిలో ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: అమెరికా నుంచి లారెన్స్‌బిష్ణోయ్‌ తమ్ముడి బెదిరింపులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement