beaten
-
టీఎంసీ నేత దారుణ హత్య.. ఐదుగురు అరెస్ట్
బీర్భూమ్: పశ్చిమ బెంగాల్లో మరోదారుణం చోటుచేసుకుంది. బీర్భూమ్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన నేత హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోల్పూర్ పట్టణ సమీపంలోని పరుల్‌దంగా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.టీఎంసీ నేత సమీర్ తాండర్ (40) తన ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. సమీర్ తాండర్ కంకలితల పంచాయతీ సభ్యునిగా ఉన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన బుర్ద్వాన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ, మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమీర్ తాండార్ కుమారుడు ప్రతీక్ తాండర్ మాట్లాడుతూ గ్రామస్తులు కొందరు తన తండ్రిపై దాడి చేశారని, వెంటనే తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించినా ప్రయోజనం లేకపోయిందన్నారు.గ్రామంలో తలెత్తిన గొడవల కారణంగానే తాండర్పై దాడి జరిగివుండవచ్చని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వికాస్ రాయ్ చౌదరి పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఈ దాడిలో ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: అమెరికా నుంచి లారెన్స్‌బిష్ణోయ్ తమ్ముడి బెదిరింపులు -
కన్న పిల్లలను చితకబాదిన తల్లి.. వీడియో తీసిన తండ్రి
ముంబై: మహారాష్ట్రలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ తల్లి కనికరం లేకుండా తన ఇద్దరు పిల్లలపై ఇష్టానుసారంగా చేయి చేసుకుంది. కన్న ప్రేమను మరిచి బెల్టుతో కొడుకు, కూతురిని చితకబాదింది. పిల్లలు దెబ్బలతో అల్లాడిపోతుంటే, ఈ తతంగాన్నంతా తండ్రి తన ఫోన్లో వీడియో తీస్తూ.. భార్యను ఆపకపోవడం కొసమెరుపు.ముంబైలోని వాన్రాయ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఓ మహిళ తన కూతురు, కొడుకును తీవ్రంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లలు గుక్కపట్టి ఏడుస్తూ, కొట్టవద్దని తల్లిని వేడుకోవడం వీడియోలో కనిపిస్తోంది. అయినా ఆగని ఆ మహిళ వారిని చెంపదెబ్బలు, బెల్టుతో చితకబాదింది. ఇక ఆ ఘోరాన్ని ఆపాల్సింది పోయి.. ఈ దృశ్యాలను కన్న తండ్రి వీడియో తీశాడు. వీడియో రికార్డ్ చేయమని తన భర్తను ఆమె కోరడం స్పష్టంగా వినిపిస్తోంది. అయితే చాలా రోజుల నుంచి వివాహిత తన పిల్లలపై ఈ విధంగానే ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.వీడియో వైరల్ అవ్వడంతో రిటైర్డ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌జె కథవాలా ఈ వ్యవహారంపై బాలల రక్షణ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ముంబై పోలీసు కమిషనర్‌కు కూడా లేఖ రాశారు.చర్య తీసుకోవాలని కోరుతూ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఒక కాపీని పంపినట్లు రిటైర్డ్ జడ్జి కథవాలా తెలిపారు.మరోవైపు భార్యాభర్తలిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, తల్లిదండ్రులు.. పిల్లల స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వీడియో 2022 సంవత్సరానికి చెందినదని, ఇప్పుడు బయటపడిందని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు పిల్లలిద్దరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించారు. -
బెంగాల్: యువతిని చితకబాదిన ఘటనపై దుమారం
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో ఓ వీడియో దుమారం రేపుతోంది. ఓ యువతిని రోడ్డుపై పడేసి కర్ర విరిగేలా చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.యువతిని కొడుతుండగా చుట్టూ నిలబడిన వారంతా చూస్తూ ఉండిపోయారు తప్ప ఆపడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఈ ఘటన బెంగాల్లో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితి తెలియజేస్తోందని మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు. ‘ఈ వీడియోలో యువతిని దారుణంగా కొడుతున్నది చోప్రా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తృణమూల్ ఎమ్మెల్యే హమిదుర్ రెహ్మాన్ అనుచరుడు తేజ్ముల్ అనే వ్యక్తి. ఇతను తన ‘ఇన్సాఫ్’ సభల ద్వారా పంచాయితీలు చేసి అక్కడికక్కడే శిక్షలు విధిస్తుంటాడు. This is the ugly face of Mamata Banerjee’s rule in West Bengal.The guy in the video, who is beating up a woman mercilessly, is Tajemul (popular as JCB in the area). He is famous for giving quick justice through his ‘insaf’ sabha and is a close associate of Chopra MLA Hamidur… pic.twitter.com/fuQ8dVO5Mr— Amit Malviya (@amitmalviya) June 30, 2024తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ఈ తరహా షరియా కోర్టులున్నాయని భారత ప్రజలు మొత్తం గుర్తించాలి. బెంగాల్లో ప్రతి గ్రామంలో ‘సందేశ్‌ఖాలీ’తరహా ఘటనలు జరుగుతున్నాయి. మమత పాలన వెస్ట్‌బెంగాల్‌కు ఒక శాపం’అని మాలవ్య ట్వీట్లో ఫైర్ అయ్యారు. మరోపక్క సీపీఎం నేతలు కూడా యువతిని కొడుతున్న వీడియోపై స్పందించారు. బెంగాల్లో బుల్డోజర్ జస్టిస్ రాజ్యమేలుతోందని సీపీఎం స్టేట్ సెక్రటరీ ఎండీ సలీమ్ ఎక్స్(ట్విటర్)లో విమర్శించారు. కాగా, యువతిని చితకబాదిన ఘటన ఈ వారాంతంలోనే జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏ కారణంతో కొడుతున్నారనేది తెలియరాలేదు. Not even #KangarooCourt ! Summary trial and punishment handed out by d @AITCofficial goon nicknamed JCB.Literally bulldozer justice at Chopra under @MamataOfficial rule. pic.twitter.com/TwJEThOUhi— Md Salim (@salimdotcomrade) June 30, 2024 -
పొలం కోసం కొట్టి.. చంపేశారు!
రెండెకరాల పొలం కోసం రక్తసంబంధీకుడిపైనే కర్ర లతో విరుచుకుపడ్డారు. కన్నవాళ్లు కాళ్లా.. వేళ్లా పడ్డా కనికరించలేదు.. కన్నూ.. మిన్నూ కానక.. ఎక్కడపడితే అక్కడ పది మందికిపైగా మూకుమ్మడిగా విచక్షణారహితంగా దాడి చేయడంతో చెవులు, నోట్లో నుంచి రక్తం కారి.. నిస్సహాయ స్థితిలో స్పృహ కోల్పోవడంతో వదిలేశారు. చివరికి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయువు కోల్పోయాడు.మక్తల్/ ఊట్కూర్/నారాయణపేట: నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో అమానుష ఘటన చోటుచేసుకుంది. రెండెకరాల భూమి కోసం.. ఒక్కడిని చేసి దాయాదులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. చిన్నపొర్ల గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు ఇద్దరు భార్యలు బాలమ్మ, తిప్పమ్మ. వీరు గతంలోనే మృతి చెందారు. మొదటి భార్య బాలమ్మకు ఒక కొడుకు గువ్వల ఎర్రగండ్ల సంజప్ప కాగా.. రెండో భార్య తిప్పమ్మకు ఇద్దరు కుమారులు పెద్ద సవారప్ప, చిన్న సవారప్ప.లక్ష్మణ్‌కు 9 ఎకరాల భూమి ఉండగా.. మూడు భాగాలుగా విభజించి ముగ్గురు కుమారులపై మూడు ఎకరాల చొప్పున పట్టా చేయించారు. దీనిపై కొంత కాలంగా మొదటి భార్య కుమారుడు ఎర్రగండ్ల సంజప్ప.. తొమ్మిది ఎకరాలను ఇద్దరి భార్యల పిల్లలకు రెండు భాగాలుగా విభజించి.. నాలుగున్నర ఎకరాల చొప్పున భాగ పరిష్కారం చేయాలని వాదిస్తూ వస్తున్నాడు. ఆ లెక్కన తనకు నాలుగున్నర ఎకరాలు, రెండో భార్య ఇద్దరు కుమారులకు కలిపి నాలుగున్నర ఎకరాలు దక్కాలని వాదిస్తూ వచ్చిన ఎర్రగండ్ల సంజప్ప ఆమధ్యన మృతిచెందాడు. అప్పటి నుంచి సమస్య పరిష్కారం కాకుండా పోయింది. విత్తనాలు చల్లేందుకు రాగా.. ఈ క్రమంలోనే భూ సమస్య ఉందని 20 రోజుల క్రితం ఇరు వర్గాల వారు ఊట్కూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. రెండు రోజు ల క్రితం విత్తనాలు వేసుకుంటామని పెద్ద సవార ప్ప, చిన్న సవారప్ప మక్తల్ సీఐ, ఊట్కూర్ ఎస్ఐలను అడగగా.. ఎవరి పేరు మీద పట్టా ఉంటే వారు వేసుకోండని సూచించారు. దీంతో గురువారం సాయంత్రం పొలంలో విత్తనాలు వేసేందుకు పెద్ద సవారప్ప, ఆయన కుమారుడు సంజీవ్(28), చిన్న సవారప్ప కలిసి ట్రాక్టర్ తీసుకువెళ్లారు.ఈ విషయం తెలు సుకున్న ఎర్రగండ్ల సంజప్ప కుమారులు గుట్టప్ప, ఆటో సంజప్ప, కుటుంబసభ్యులు గువ్వల శేఖర్, పెద్ద సంజప్ప, చిన్న సంజప్ప, ఆశప్ప, మారుతి, పెద్ద సవారప్ప, కిష్టప్ప, శ్రీను, రేణుక, సుజాత, బుజ్జమ్మ, అర్చన, అంజమ్మ, మౌనిక, వెంకటమ్మ, లక్ష్మి పొలం దగ్గరికి వచ్చారు. విత్తనాలు ఎందుకు వేస్తున్నావని సంజీవ్‌ను ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే సంజీవ్‌పై అవతలి వర్గం వారు కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడే ఉన్న గువ్వల ఎర్రగండ్ల సంజప్ప చిన్నమ్మ కవిత మనుమడిని కొట్టొద్దని కాళ్లపై పడినా పట్టించుకోలేదు. వెంటనే తమకు పరిచయం ఉన్న పెద్దజట్రం గ్రామ ఎంపీటీసీ సభ్యుడు కిరణ్‌కు సమాచారం అందించగా.. ఆయన ఊట్కూర్ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచి్చనట్లు తెలుస్తోంది. ‘100’కి డయల్ చేసినా స్పందించలే.. చిన్నపొర్లలో పొలం దగ్గర ఘర్షణ జరుగుతుందని సమీపంలోని వారు డయల్ 100కు సమాచారం ఇచి్చనా, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా సంజీవ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా ఆలస్యంగా వచ్చింది. అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సంజీవ్‌కు భార్య అనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో ఉద్రిక్తత హత్య ఘటన దరిమిలా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మక్తల్, ఊట్కూర్, మాగనూర్, కృష్ణ పోలీసులు అక్కడికి చేరుకొని పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై బంధువు కవిత పోలీసులకు ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఊట్కూర్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. కాగా, పోస్టుమార్టం అనంతరం సంజీవ్ మృతదేహం గ్రామానికి తీసుకురాగా, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే సంజీవ్ మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపిస్తూ ఎస్ఐని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఎస్ఐపై సస్పెన్షన్ వేటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎస్ఐ బిజ్జ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ మల్టీ జోన్–2 ఐజీ జి.సుధీర్‌బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై ఫిర్యాదు అందినా తక్షణ మే స్పందించకుండా తీవ్ర నిర్లక్ష్యం, దురుసుగా ప్రవర్తించినట్లు ఐజీపీ దృష్టికి వచి్చనట్టు ఉత్తుర్వుల్లో పేర్కొన్నట్టు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. నలుగురి అరెస్టు.. ముగ్గురు పరారీలో ఊట్కూరు ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులపై కేసు నమోదు కాగా శుక్రవారం నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ4 చిన్న సంజప్ప, ఏ5 గుడి ఆశప్ప, ఏ6 గువ్వల శ్రీను, ఏ7 గువ్వల కిష్టప్పను అరెస్టు చేసినట్లు ఐజీపీ సు«దీర్‌బాబు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. -
‘‘స్వాతి మలివాల్‌కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
న్యూఢిల్లీ: ఎంపీ స్వాతి మలివాల్‌కు మే13వ తేదీ సీఎం కేజ్రీవాల్ అపాయింట్మెంట్ లేదని సీఎం సహాయకుడు బిభవ్‌కుమార్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ రోజున ఆమె సీఎం ఇంటి వద్ద భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. మలివాల్‌పై 13న సీఎం ఇంట్లో దాడి జరిగిన కేసులో కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం(మే17) అరెస్టు చేశారు.బిభవ్ అరెస్టయిన వెంటనే ఆయన న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా బిభవ్‌కుమార్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎంపీ స్వాతిమలివాల్ సీఎం ఇంటికి వచ్చినరోజుకు సంబంధించి సోషల్‌మీడియాలో సర్క్యులేషన్లో ఉన్న వీడియోలను కోర్టుకు సమర్పించారు. అసలు స్వాతి మలివాల్‌పై సీఎం ఇంట్లో ఎలాంటి దాడి జరగలేదని తెలిపారు. -
కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడి
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇంకా ఎన్నికల జరగని నియోజకవర్గాల్లో నేతలు ప్రచారాలు సాగిస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీలో మే 25న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈశాన్య ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడి జరిగింది.జవహర్ లాల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నేత, నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్తార్ నగర్లో కన్హయ్య కుమార్‌కు పూలమాల వేసే నెపంతో వచ్చిన కొందరు వ్యక్తులు అతనిని చెప్పుతో కొట్టారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్‌పై కూడా వారు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయమై ఆ కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో కన్హయ్య కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కొందరు పూలదండలతో రావడం కనిపిస్తుంది. వీరు కన్హయ్యకు పూలమాల వేయకుండా, అతనిపై దాడి చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే అక్కడే ఉన్న కన్హయ్య కుమార్ మద్దతుదారులు వెంటనే ఒక యువకుడిని పట్టుకున్నారు.బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని కన్హయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. తనకు అమితంగా పెరుగుతున్న ప్రజాదరణ చూసి, సిట్టింగ్ ఎంపీ తివారీ నిరుత్సాహానికి గురయ్యారని, అందుకే తనపై దాడి చేసేందుకు గూండాలను పంపారని కన్హయ్య పేర్కొన్నారు. మే 25న ఓటింగ్ ద్వారా ప్రజలు దీనికి సమాధానం చెబుతారని అన్నారు.ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో మే 25న ఓటింగ్ జరగనుంది. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి బీజేపీ.. మనోజ్ తివారీని అభ్యర్థిగా నిలబెట్టగా, కాంగ్రెస్ ఈ స్థానం నుంచి కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించింది. ఈ సీటులో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని సమాచారం. కన్హయ్య తన రాజకీయాలను జేఎన్‌యూ నుంచి ప్రారంభించారు. మనోజ్ తివారీ నటుడు, గాయకుడు. రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. -
వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ దళిత కుటుంబంపై దాష్టీకం జరిగింది. వేధింపుల కేసులో రాజీకి రావాలంటూ ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని తల్లిని వివస్త్రని చేశారు. 'నా బిడ్డను విపరీతంగా కొట్టారు. కాపాడుకోలేకపోయా. మా ఇంటిని కూల్చివేశారు. ఇంట్లో వస్తువులన్నీ పాడు చేశారు. అడ్డుగా వెళ్లిన నన్ను వివస్త్రను చేశారు’’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది బాధిత మహిళ. పోలీసులు వచ్చి టవల్ అందించేంతవరకు ఆమె నగ్నంగానే ఉండిపోయారు. తన వేధింపుల కేసులో రాజీకి రావాలని తమ సోదరిపై ఒత్తిడి పెంచారని బాధితురాలి సోదరి తెలిపింది. వేధింపులకు గురిచేస్తున్నారని 2019లో మృతుని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో రాజీకి రావాలని కోరుతూ బాధిత కుటుంబంపై ఓ గుంపు దాడి చేసిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి మరో ఇద్దరు సోదరులను వెతుకుతూ వారి బంధువుల ఇళ్లలో కూడా నిందితులు విధ్వంసం సృష్టించారు. ఇళ్లలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. తమ భర్తలపై దాడి చేసి, పిల్లలను చంపబోయినట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. పోలీసు బలగాలు చేరేవరకు గ్రామంలో అల్లకల్లోలం సృష్టించారని స్థానికులు తెలిపారు. జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి, నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రక్షిస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చాక.. మృతునికి అంత్యక్రియలు జరిపారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా దూమారం రేపింది. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దళితులకు రక్షణ కరువైందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. దళితులపై దాడుల్లో రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. ఘటనపై స్పందించిన ప్రభుత్వం దోషులపై కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పింది. ఇలాంటి దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఎన్నికలు జరనున్న నేపథ్యంలో నేరాలకు రాజకీయ తెరలేపుతోందని ఆరోపించింది. రెండు వర్గాల మధ్య గొడవల తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తాజా ఘటన జరిగిందని మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ రాజకీయంగా ఉపయోగించుకునే కుట్ర పన్నుతోందని అన్నారు. ఇదీ చదవండి: మేకలు, పావురాలు చోరీ?.. దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి.. -
ఏమైందో తెలియదు..! నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్ని చితక్కొట్టారు..
అమెరికాలోని న్యూయార్క్‌లో దారుణం జరిగింది. ఐదుగురు యువకులు కలిసి వృద్ధుడైన ఓ క్యాబ్ డ్రైవర్‌ను దారుణంగా కొట్టారు. నడిరోడ్డులో 60 ఏళ్ల వృద్ధునిపై విచక్షణా రహితంగా పిడిగుద్దులు కురిపించారు. బూటు కాలుతో తంతూ ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులు కలిసి దాడి చేశారు. నగరంలోని సిక్స్త్ అవెన్యూ 34 వ కూడలికి సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఫైరవుతున్నారు. వీడియో ప్రకారం ఐదుగురు కలిసి క్యాబ్ డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. వారి దెబ్బలను తట్టుకోలేక ఆ వృద్ధుడు తనను తాను రక్షించుకోవడానికి తలపై చేతులు పెట్టుకుని దీనంగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఓ మహిళ పిడిగుద్దులను భరించలేక క్యాబ్ వైపు వంగి పడిపోయాడు. ఈ దృశ్యాలు సదరు వీక్షకున్ని ఆలోచింపజేశాయి. ఈ వీడియో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట క్యాబ్ డ్రైవర్‌కు యువకులకు మధ్య వాగ్వాదం నడిచిందని తెలిపారు. అనంతరం దాడి జరిగినట్లు పేర్కొన్నారు. Just another day in NYC.... A group of thugs beat up a 60 year old taxi cab driver in Manhattan in broad daylight. Last year a 52 year old NYC cab driver was beaten to death by a group of teens. pic.twitter.com/v9SQAkCWcN — Leftism (@LeftismForU) July 28, 2023 తీవ్రంగా గాయపడిన వృద్ధున్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. హోవార్డ్ కొలీ, నటాలీ మోర్గాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ బ్రూక్లిన్కు చెందినవారిగా గుర్తించారు. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ -
Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ఘటన వెలు గుచూసింది. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చిన ఓ పర్యాటకుడిపై స్థానిక యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. పర్యాటకుడిని వెంబడించి మరీ కర్రలు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఇదంతా మంగళవారం ఉదయం జరగ్గా.. దాడికి సంబంధించిన దృశ్యాలు ఓ షాప్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తాజ్‌మహల్ చూసేందుకు ఆదివారం ఆగ్రా వచ్చాడు. ఈ క్రమంలో తాజ్‌గంజ్ ప్రాంతంలోని బసాయ్ చౌకీ వద్ద కారులో వెళ్తుండగా పక్కన నడుచుకుంటూ వెళ్తున్న భక్తులను తన వాహనం తాకింది. పర్యాటకుడు కారు ఆపి వాళ్లకు క్షమాపణలు చెప్పాడు. అయినా వారు వినిపించుకోకుండా దుర్భాషలాడుతూ దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు భయంతో అతడు దగ్గర్లోని ఓ స్వీట్ షాప్‌లోకి పరుగెత్తాడు. అతన్ని వెంబడించిన దుండగులు షాప్‌లోకి చొరబడి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. తప్పు అయ్యింది, క్షమించాలని వేడుకున్నా వదల్లేదు. కొంత సమయం పాటు అతన్ని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయారు. Video from Agra . Tourist Beaten by Locals. #shameful #SeemaHaider #KiritSomaiya #Agra #DelhiFloods pic.twitter.com/zuXq7qdwLN — देश सर्वप्रथम (@deshsarvpratham) July 18, 2023 దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తమలో ఒకడిని కారుతో ఢీ కొట్టాడన్న కారణంతోనే దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తాజ్‌మహల్ గొప్ప పర్యటక ప్రాంతమని, దీనిని చూసేందుకు రోజు వేలల్లో టూరిస్టులు వస్తుంటారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. पर्यटक के साथ मारपीट से संबंधित वायरल वीडियो का स्वत: संज्ञान लेकर, #थाना_ताजगंज पुलिस द्वारा तत्काल अभियोग पंजीकृत कर, 03 टीमों का गठन करते हुए, 05 आरोपियों को हिरासत में लिया गया है व अन्य आरोपियों की गिरफ्तारी हेतु लगातार प्रयास किया जा रहा है। pic.twitter.com/yoyjGb6J3d — POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) July 17, 2023 -
బొట్టు పెట్టుకుని స్కూల్‌కు వచ్చిందని కొట్టడంతో బాలిక ఆత్మహత్య
రాంచీ: ఝార్ఖండ్‌లోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. నుదుటిపై బొట్టు పెట్టుకుని వచ్చిందని బాలికను ఉపాధ్యాయుడు కొట్టాడు. ఈ ఘటనను అవమానంగా భావించిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అమానవీయ ఘటన ధన్‌బాద్‌లోని తెతుల్ మరిలో జరిగింది. ఈ ఘటనపై బాలల హక్కుల జాతీయ కమిషన్ ఛైర్పర్సన్ ప్రియాంక్ కనుంగో స్పందించారు. దర్యాప్తు నిమిత్తం తమ టీం ధన్‌బాద్‌కు వెళ్తుందని ట్వీట్ చేశారు. చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ చీఫ్ ఉత్తమ్ ముఖర్జీ కూడా ఈ ఘనటపై స్పందించారు. పాఠశాలకు సీబీఎస్ఈ బోర్డు గుర్తింపు కూడా లేదని చెప్పారు. బాలిక ఆత్మహత్యకు కారణమైన టీచర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇది తీవ్రమైన ఘటన అని అన్నారు. జిల్లా విద్యాశాధికారిని కలిసి ఆయన దృష్టికి తెచ్చామని చెప్పారు.బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించామని ఆయన చెప్పారు. బాలిక మృతిపై బాధిత తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల యాజమాన్యంపై ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. 15 రౌండ్ల కాల్పులు.. కస్టడీలోనే ఖతం చేశారు -
వెంబడించి వేధించడంతో..పోకిరిని చెప్పుతో..
కాలేజీ నుంచి హాస్టల్‌కి వెళ్తున్న విద్యార్థిని ఓ వ్యక్తి వెంటపడి వేధించడం ప్రారంభించాడు. ఓపిక నశించిన ఆ అమ్మాయి ఆ వ్యక్తిని చెప్పుతో ఎడాపెడా వాయించింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కాలేజీ విద్యార్థిని హాస్టల్ నుంచి కాలేజికి వెళ్తుండగా ఓ యువకుడు ఆమె వెంటపడి వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె కేకలు వేసి చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేసింది. దీంతో స్థానికులు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె అందరి ముందే అతడి చెంప చెల్లుమనిపించింది. తన కాలికి ఉన్న చెప్పుతో అతడి ముఖంపై ఎడాపెడా వాయించి తన కోపం తీర్చుకుంది. ఇక ఆ యువకుడు చేసేదేం లేక చూస్తు కూర్చున్నాడు. తనను వదిలేయమని ప్రాథేయపడ్డాడు. అయితే స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని నజీర్‌గా గుర్తించారు పోలీసులు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అవుతుండటంతో ఈ ఘటన వెలుగు చూసింది. (చదవండి: అదుపుతప్పి..వాహనాలపైకి దూసుకెళ్లి..) -
నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం: వీడియో వైరల్
దేశ రాజధాని ఢిల్లీ ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు ఓ కారుని ఫాలో అవ్వుతూ..నడి రోడ్డుపై ఆ కారుని బలవంతంగా ఆపించి గుండాయిజానికి దిగారు. ఆ తర్వాత సదరు కారు డ్రైవర్ని కారులోంచి దిగమని చెప్పి కొట్టడం, తిట్టడం వంటివి చేశారు. ఎందుకు అలా చేస్తున్నారో చెప్పమని కోరినా.. వినిపించుకోకుండా తమ పైశాచికత్వాన్ని అంతా అతనిపై చూపించారు. చివరికి అతను క్షమించమని ప్రాధేయపడటంతో వదిలేశారు. ఈ ఘటన మొత్తం ఢిల్లీలోని నాంగ్లోయ్ మెట్రో రైల్వేస్టేషన్ వద్ద జరిగింది. సదరు బాధిడతుడు ఆ సంఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ సదరు వ్యక్తులపై సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాడు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరేంద్ర కే సింగ్ నిందితులను అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు. (చదవండి: ట్రైయిన్‌లో మరో అసభ్యకర ఘటన.. మద్యం మత్తులో టికెట్ ఎగ్జామినర్..) -
దొంగను కొట్టి చంపిన గ్రామస్థులు
-
క్లాస్ రూం చుట్టూ పరిగెత్తించి మరీ టీచర్‌పై దాడి..పేరెంట్స్ అరెస్టు
టీచర్ని చితకబాదిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏకంగా క్లాస్ రూమ్ చుట్టూ పరిగెత్తించి మరీ చితకబాదారు విద్యార్థి తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..తమిళనాడుతో స్కూల్లో టీచర్‌పై రెండో తరగతి విద్యార్థి పేరెంట్స్ దారుణంగా దాడి చేశారు. విద్యార్థి తల్లిందండ్రలు నేరుగా ఉపాధ్యాయుడి క్లాస్ రూం వద్దకు వచ్చి మరీ గొడవకు దిగారు. మా పిల్లలను కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు?..అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ టీచర్ని క్లాస్‌లోనే విద్యార్థులందరి ముందు పరిగెత్తించి మరీ దారుణంగా కొట్టారు. ఆఖరికి సమీపంలోని ఇటుక రాయిని కూడా తీసుకుని ఆయన మీదకు విసిరే యత్నం చేశారు. అందుకు సంబంధించిన మూడు నిమిషాల వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు బాధిత ఉపాధ్యాయుడుని ఆర్ భరత్‌గా గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన ఆ విద్యార్థి తల్లిదండ్రులతో పాటు ఆచిన్నారి తాతయ్యను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడమేగాక దాడికి పాల్పడినందుకు గాను వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విచారణలో..సదరు విద్యార్థి క్లాస్‌లో సరిగా వినకపోవడం, ఇతర పిల్లలను కొట్టడం వంటివి చేయడంతో టీచర్ ఆమెను సీటు మారమని చెప్పారు. ఐతే సీటు మారుతున్న క్రమంలో ఆ చిన్నారి పడిపోయింది. కానీ ఆ చిన్నారి ఇంటికి వెళ్లి తనను టీచర్ కొట్టాడంటూ.. వాళ్ల తాతయ్యకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు మా పిల్లలనే కొడతావ అంటూ టీచర్‌పైకి దాడికి దిగారని పోలీసులు తెలిపారు. (చదవండి: ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుకి కలత చెంది యువకుడు బలవన్మరణం) -
భార్యపై చేయి చేసుకున్నానని.. ఆవేదనతో భర్త..
సాక్షి, అల్వాల్: క్షణికావేశంలో భార్యపై చేయి చేసుకున్నానని మనస్తాపానికిలోనైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సురేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన సురేంద్రకుమార్ (35) బసంతి దంపతులు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చారు. సురేంద్రకుమార్ జీడిమెట్లలోని సూపర్ మార్కెట్లో ఉద్యోగం చేస్తుండగా అతడి భార్య బసంతి ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేసేది. ఇటీవల బసంతి ఉద్యోగం మానేసింది. అప్పటికే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో భార్య ఉద్యోగం మానేయడంతో ఆగ్రహానికిలోనైన సురేంద్రకుమార్ ఆదివారం చేయి చేసుకున్నాడు. దీంతో మానసిక వేధనకు లోనైన అతను భార్య, కుమార్తెలను బెడ్రూంలో వేసి బయటి నుంచి గడియ పెట్టి హాల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బసంతి తెలిసిన వారికి ఫోన్ చేసి సమాచారం అందించింది. వారు ఇంటికి వచ్చి చూడగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్‌లో కాళ్లను దాచి..) -
Video: ‘తప్పతాగి వేధింపులు.. నడిరోడ్డుపై చెప్పుతో దంచికొట్టింది’
బెంగళూరు: రోడ్లు, బస్సులు, రైళ్లల్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలు, యువతులు మహిళలు అనే తేడా లేకుండా పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఓ మహిళ మందుబాబును ఊరికే వదలకుండా అందరి ముందే బడిత పూజ చేసింది. ధార్వాడ్ జిల్లాలో ఫుల్‌గా తాగిన ఓ వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్న మహిళలను అడ్డగించి వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. అంతేగాక వారి ఫోన్ నెంబర్లు అడుగుతూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన ఓ మహిళ అతడిని పట్టుకొని ఏకంగా చెప్పుతో కొట్టింది. నడి రోడ్డుపై కూర్చొబెట్టి అతడి తల, ముఖంపై దాడి చేసింది. అందరూ చూస్తుండగానే అతడి ముఖాన్ని పచ్చడి చేసింది. చట్టు పక్కల ఉన్నవారు సైతం ఆమెకు మద్దతుగా నిలిచారు. మహిళ పిచ్చి పిచ్చిగా కొడుతున్నా.. సదరు వ్యక్తి కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీనిని స్థానికులు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. A man in an inebriated state was misbehaving with women in #Dharward. He was going on asking mobile phone numbers of women. He was beaten with slippers. Incident happened at Subhas road. pic.twitter.com/9WlGplQvjL — Imran Khan (@KeypadGuerilla) December 30, 2022 -
కిడ్నాప్ హైడ్రామా.. యువకుడిని చితకబాది కారులో ఎత్తుకెళ్లిన యువకులు
సాక్షి, నిజామాబాద్: యువకుడి కిడ్నాప్ హైడ్రామా జిల్లాలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం క్రేటా కారులో వచ్చిన ముగ్గురు ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న నరేశ్‌ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. యువకుడిని చితకబాది కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. అక్కడున్న వారు కారు ఫొటోలను మీడియా, పోలీసులకు పంపించారు. దీంతో మూడోటౌన్ ఎస్సై శ్రావణ్‌కుమార్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పెట్రోకారు బృందంతో పాటు మరో మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కారు నంబర్ ఆధారంగా బోధన్ వీడీసీ అధ్యక్షుడు బాగ య్యదిగా గుర్తించారు. పోలీసులు బాగయ్యను ఫోన్ లో విచారించగా తన అల్లుడైన అఖిలేష్ యాదవ్ ఉదయం ఇంటి నుంచి కారు తీసుకువెళ్లినట్లు చెప్పారు. అఖిలేష్‌యాదవ్‌తో పాటు అతని స్నేహితులు నిఖిల్, సాయికృష్ణ ఉన్నారు. పోలీసులు బాగయ్య కుమారుడు భరత్‌ను పిలిపించి ఫోన్లో కాన్ఫరెన్స్ కలిపి అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడించగా తాను బోధన్‌కు వస్తున్నట్లు చెప్పాడు. పోలీసులు అఖిలేష్‌యాదవ్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. కారును స్వాధీనం చేసుకొని, యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో నరేశ్‌ను ఎడపల్లి మధ్యలో దింపేశారు. కాగా నన్నెవరూ కిడ్నాప్ చేయలేదని బాధితుడు నరేశ్ పోలీసులకు తెలిపాడు. అందరం కలిసి మాట్లాడుకున్న తర్వాత ఎడపల్లి మధ్యలో విడిచిపెట్టారని చెప్పాడు. ఎవరినీ తాను టీజ్ చేయలేదని, నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ఎలాంటి కిడ్నాప్ జరగలేదన్నారు. ప్రేమ వ్యవహారం మాట్లాడినట్లు తెలిపారు. చదవండి: ఇటీవలే యువకుడితో నిశ్చితార్థం.. తల్లి దగ్గరకు వెళ్లొచ్చి.. -
లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు
బెంగళూరు: పిల్లలకు పాఠాలు బోధించాల్సిన హెడ్ మాస్టర్ పైశాచికంగా ప్రవర్తించాడు. స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థినులు అంతా కలిసి అతనికి తగిన బుద్ధి చెప్పారు. తమను వేధిస్తున్న హెడ్ మాస్టర్ వద్దకు కర్రలతో వెళ్లి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కర్ణాటక మండ్య జిల్లా కట్టేరి గ్రామంలోని ఓ పాఠశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. #mandya A senior teacher of a govt school in Kattigeri beaten up by students before handing him over to police.There were several complaints of sexual misconduct against Chinmayanand.Yesterday,students got together & hit him with sticks for harassing a girl student #Karnataka pic.twitter.com/ud2WSMCkLx — Imran Khan (@KeypadGuerilla) December 15, 2022 -
యూపీలో దారుణం.. యువకుడ్ని చితకబాది మొహంపై మూత్ర విసర్జన..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ గోండా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడిపై మరికొంతమంది యువకుల గ్యాంగ్ దాడి చేసింది. అనంతరం అతడిపై సదరు గ్యాంగ్‌లోని వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఘటన జరిగిన రెండు వారాల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన అనంతరం పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడ్ని అరెస్టు చేశారు. అతని పేరు కప్తాన్ సింగ్ అని వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే బాధితుడి ఇంటికివెళ్లి కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే స్థానికంగా ఉండే రెండు గ్యాంగ్‌లు ఆధిపత్యం కోసం తరచూ గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 31న కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వర్గానికి కప్తాన్ సింగ్ నాయకత్వం వహించగా.. మరో వర్గానికి బాధితుడు శివ సింగ్ లీడర్‌గా ఉన్నాడు. ఈ గొడవలో శివ గ్యాంగ్ ఓడిపోయింది. దీంతో అతడ్ని చితకబాది మూత్ర విసర్జన చేసింది కప్తాన్ సింగ్ గ్యాంగ్. శివ సింగ్, కప్తాన్ సింగ్‌లపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కప్తాన్ సింగ్ ఇటీవలే బెయిల్‌పై విడుదలై బయటకి వచ్చినట్లు వివరించారు. ఓ హత్య చేసింది తానే అని ఒప్పుకోవాలని శివ సింగ్‌ను కప్తాన్ సింగ్ బెదిరించినట్లు పేర్కొన్నారు. చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా -
జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా నిరసనలు...ఈడ్చుకెళ్లి చితకబాది...: వీడియో వైరల్
బ్రిటన్: యూకేలోని మాంచెస్టర్‌లోని చైనా దౌత్య కార్యాలయం వద్ద చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా కొంతమంది నిరసనలు చేపట్టారు. ఈ మేరకు ఆ నిరసనకారులు రాయబార కార్యాలయం గేటు వద్ద జిన్‌పింగ్ ఫోటోతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేసి... ఒక గుంపుగా నిరసనలు చేపట్టి చోరబడేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న మాంచెస్టర్ పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని నియంత్రించే నిమిత్తం వారిపై దాడి చేశారు. చైనాలోని పాలక కమ్యునిస్ట్ పార్టీ చైనాని నాశనం చేస్తుందంటూ విమర్శిస్తూ....కిరీటాన్ని ధరించి ఉన్న జిన్‌పింగ్ ఫోటో పోస్టర్లను పట్టుకుని నిరసనలు చేశారు. దీంతో మాంచెస్టర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన అక్టోబర్16, 2022న ఆదివారం మధ్యాహ్నా 3 గం.లకు జరిగిందని తెలిపారు. ఈ విషయమై మాంచెస్టర్‌లోని చైనా దౌత్యకార్యాలయం, బీజింగ్‌లోని విదేశీ కార్యాలయం ఇంకా స్పందించాల్సి ఉంది. 1) Shocking video showing someone from the #China's Consulate in Manchester, UK, kicking down pro-democracy signs. A protestor then appears to have been dragged behind the Consulate gates and beaten by consulate staff. Via @McWLuke pic.twitter.com/FJ03xMm9fT — Trending News (@Trendings911) October 17, 2022 (చదవండి: ఆ దేవాలయంలో బుద్ధుడికి వైన్‌ని నైవేద్యంగా ఎందుకు పెడతారంటే......) -
అల్లరి చేస్తున్నారని.. విద్యార్థులను చితకబాదిన హెచ్ఎం
సాక్షి, ఖమ్మం: పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వస్తున్నా... మిగతా వారిలో మార్పు రావడం లేదు. దండన లేని బోధన అందించాలని ప్రభుత్వం, విద్యారంగ నిపుణులు చెబుతున్నా ఉపాధ్యాయులు తీరు మార్చుకోవడం లేదు. ఖమ్మం 4వ డివిజన్ పాండురంగాపురం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాఠశాలలోని 5వ తరగతిలో 22మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, మంగళవారం మధ్యాహ్నం పిల్లలు అల్లరి చేస్తున్నారంటూ తరగతి గదికి చేరుకున్న హెచ్ఎం చంద్రు.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదాడు. ఆ సమయంలో గది తలుపులు మూసి మరీ కొట్టడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా రోదించారు. పిల్లలను విపరీతంగా కొట్టడంతో శరీరంపై వాతలు తేలగా పాఠశాల సమయం ముగిసినా ఇంటికి వెళ్లకుండా రోదిస్తూ కూర్చున్నారు. దీంతో కొందరు తల్లిదండ్రులు చేరుకోగా విషయం తెలియడంతో మిగతా వారికి కూడా సమాచారం ఇచ్చారు. ఈమేరకు తల్లిదండ్రులంతా చేరుకుని ప్రధానోపాధ్యాయుడు చంద్రుపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. కొందరు ఆయనపై చేయి కూడా చేసుకున్నట్లు తెలిసింది. చివరకు హెచ్ఎం దివ్యాంగుడని తోటి ఉపాధ్యాయులు నచ్చచెప్పడంతో తల్లిదండ్రులు రెండు గంటల అనంతరం శాంతించారు. ఇటీవలే ఆయన బదిలీల్లో భద్రాది కొత్తగూడెం జిల్లా నుండి పాండురంగాపురం వచ్చారు. ఈ ఘటనపై ఎంఈఓ శ్రీనివాస్‌ను ఫోన్ ద్వారా వివరణ కోరగా తనకు విషయం ఇప్పుడే తెలిసిందని, పూర్తిస్థాయిలో సమాచారం తెలుసుకుంటానని వెల్లడించారు. చదవండి: పెంపుడు కుక్క చనిపోయిందని.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య -
డోంట్ బీ ప్రాంక్..సరదా కాస్త సీరియస్ ఇష్యూగా..
సాక్షి, హైదరాబాద్, హిమాయత్‌నగర్: అది జడ్చర్ల బస్టాండ్. గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా కొందరు యువకులు ప్రత్యక్షమై భిక్షాటన పేరిట ప్రయాణికులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ప్రారంభించారు. డబ్బులు అడుక్కుంటూ మహిళల పాదాల మీద పడ్డారు. వీరి ప్రవర్తన శృతి మించడంతో ప్రయాణికుల్లో సహనం నశించి వారిని పట్టుకుని చితకబాదారు. దాంతో యువకులు ఇదంతా ప్రాంక్ అని రహస్యంగా వీడియో చిత్రీకరణ చేస్తున్నామని వివరించారు. దీంతో మరింత అసహనానికి గురైన ప్రయాణికులు వారిని పోలీసులకు అప్పగించబోయారు. అయితే వారు కాళ్లావేళ్లా పడి బతిమాలాడడంతో వదిలేశారు. ఒకటి కాదు రెండూ కాదు ప్రాంక్ వీడియోల పేరిట పలువురు చెలరేగిపోతున్న సంఘటనలు నగరం చుట్టుపక్కల తరచు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో ప్రాంక్ వీడియో సృష్టించిన వివాదంతో మరోసారి ఈ ప్రాంక్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. . ప్రాంక్...యాక్... ఇలాంటి వీడియోలకు మంచి వ్యూస్ వస్తుండడంతో అనేక మంది యూ ట్యూబర్స్ ప్రాంక్ బాట పడుతున్నారు. వీరిలో కొందరు పరిధిలో ఉండి పెద్దగా ఇబ్బంది పెట్టని ప్రాంక్ వీడియోలు చేస్తుండగా మరికొందరు మాత్రం మరీ బరి తెగిస్తున్నారు. ఓ లేడీ యూట్యూబర్ తాను చేసే ఓ గేమ్‌షో కోసం జనాల మధ్య వీడియోస్ చేస్తుంది. మెట్రో రైలులో కింద కూర్చుని కర్చీఫ్ వేసుకుని అడుక్కోవడం మొదలుకుని మెట్రో రైలులో వీరి టీమ్‌కు చెందిన అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకోవడం, ఇతరులను ముద్దు అడగడం వంటివీ చేయిస్తోంది. ఫిర్యాదు చేస్తే చర్యలు... ప్రాంక్ వీడియోల పేరుతో పబ్లిక్ ప్రదేశాలు సహా ఎక్కడా అశ్లీలం, అభ్యంతరకరమైన కార్యకలాపాలకు పాల్పడకూడదు. ఇటీవల ఇలాంటి వీడియోలు యూట్యూబ్‌లోనూ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. ప్రాంక్స్ వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. వీటి ఆధారంగా కేసులు నమోదు చేసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రై మ్ ఏసీపీ -
మహిళతో అసభ్యకర ప్రవర్తన.. పోలీసును చెప్పుతో కొట్టిన వీరనారి..
లక్నో: అతనో పోలీస్.. ప్రజలకు రక్షణగా ఉండాల్సిందిపోయి.. తాగిన మైకంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను బలంగా తోసేశాడు.. చివరకు ఆమె వీరనారిలా పోరాడింది. అందరూ చూస్తుండగానే పోలీసును తన చెప్పుతో చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ పోలీస్ కానిస్టేబుల్ మద్యం సేవించి హల్ చల్ చేశాడు. చార్ బాగ్ రైల్వే స్టేషన్లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ప్రతిఘటనకు దిగింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు, మహిళపై తన ప్రతాపం చూపించాడు. లాఠీతో దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలో మహిళను తోసివేయగా ఆమె కిందపడిపోయింది. అనంతరం పైకి లేచిన సదరు మహిళ.. పోలీసులపై చెప్పుతో దాడికి దిగింది. ఈ సందర్భంలో వారి పక్కనే ఉన్న మరో మహిళా పోలీస్.. అతడిని వారిస్తున్న అదేమీ పట్టించుకోకుండా వారిపై కానిస్టేబుల్ దాడి చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఇతర పోలీసులు వచ్చి అతడిని అడ్డుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ తతంగమంతా అక్కడ ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. Drunk Black Sheep Beaten By Brave People. Sometimes We Need To Fight With Powerful To Raise Our Voice. Incident : Lucknow's Char Bagh station pic.twitter.com/KCPR2XBK2I — Binita Bhil (@BhilBinita) March 18, 2022 -
సెల్‌ఫోన్ దొంగిలించాడని కొట్టి చంపేశారు
దుండిగల్: సెల్‌ఫోన్ దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తిని తల్లి కొడుకులు కలిసి తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు.. హత్యానేరం నుంచి తప్పించుకునేందుకు మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు కూపీ లాగడంతో అసలు హంతకులు పట్టుబడిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురానికి చెందిన దండసాయి రమేష్ (35) వృత్తిరీత్యా హోటళ్లల్లో చెఫ్‌గా పని చేసేవాడు. నగరానికి వలస వచ్చిన అతను సూరారం కాలనీలో ఉంటూ స్థానికంగా ఉంటున్న హోటళ్లల్లో పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితం గండిమైసమ్మలోని జెఎంజే టిఫిన్ సెంటర్లో చెఫ్‌గా చేరాడు. అయితే డిసెంబరు 26న హోటల్లో సెల్‌ఫోన్, నగదు చోరీకి గురయ్యాయి. రమేష్‌పై అనుమానంతో హోటల్ నిర్వాహకుడు రాకేశ్, అతని తల్లి భాగ్యలక్ష్మి అతన్ని చేతులు కట్టేసి కొట్టారు. అయినా ఒప్పుకోకపోవడంతో వెదురు కట్టెలతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో హత్యానేరం నుండి తప్పించుకునేందుకు రాకేష్ అతని స్నేహి తులు వెంకటసాయి, వినయ్, మున్నా, సతీశ్, సంపత్, అజారుద్దీన్లు మృతదేహాన్ని బహదూర్‌పల్లి సాయినాథ్ సొసైటీలో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. పట్టుబడిందిలా.. సాయినాథ్ సొసైటీలోని రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దుండిగల్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేశారు. కాగా మృతుడి ప్యాంట్‌జేబులో లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రమేష్ పలు హోటళ్లలో చెఫ్‌గా పని చేసేవాడని తెలుసుకున్నారు. గండిమైసమ్మలోని జెఎంజే హోటల్లో పని చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు స్థానికులను విచారించగా గొడవ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా రమేష్‌ను కొడుతున్న దృశ్యాలు లభించాయి. దీంతో హోటల్ నిర్వాహకుడు రాకేశ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందాడని, మృతదేహాన్ని సాయినాథ్ సొసైటీ సమీపంలో పడేసినట్లు అంగీకరించాడు. దీంతో రాకేశ్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా రాకేశ్ తల్లి భాగ్యలక్ష్మి పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
తప్పతాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ.. మాజీ ఎంపీని చితకబాదిన ఓనర్
చెన్నై: మందుబాబులు తప్ప తాగి.. తమ ఇంటికి బదులు వేరే వాళ్ల ఇంట్లోకి వెళ్లి.. గొడవ చేయడం.. ఆనక ఆ ఇంటి వారి చేతులో దెబ్బలు తినే సన్నివేశాలను ఎక్కువగా సినిమాలో చూస్తుంటా. రియాలిటీలో కూడా అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. మాజీ ఎంపీ ఒకరు తప్ప తాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ రచ్చ చేయడంతో ఆగ్రహించిన సదరు ఇంటి యాజమాని.. మాజీ ఎంపీని చికతబాదాడు. ఆ వివరాలు.. (చదవండి: ‘రూ.30 లక్షలు కట్టు.. గవర్నమెంట్ జాబ్ పక్కా’) ఈ సంఘటన దీపావళి పండుగ నాడు చోటు చేసుకుంది. అన్నాడీఎంకే మాజీ ఎంపీ గోపాలకృష్ణన్ ఫుల్లుగా మద్యం సేవించి.. ఆ మత్తులో మదురై నీలగిరి ముత్యాలమ్మన్‌పేట్‌లోని ఓ నివాసంలోకి ప్రవేశించారు. వచ్చిన వ్యక్తి ఎంపీ అని వారికి తెలియదు. తాగిన మత్తులో వచ్చి ఉంటాడు అని భావించిన ఆ ఇంటి సభ్యులు బయటకు వెళ్లాల్సిందిగా కోరారు. కానీ గోపాలకృష్ణన్ వారి మాట వినకుండా.. ఆ ఇంట్లో రచ్చ చేశాడు. తాగుబోతు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఆగ్రహించిన ఆ కుటుంబ యజమాని ఎంపీని చితకబాదాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. (చదవండి: మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు... ) ఫిర్యాదుదారుడి ఇంటికి చేరుకున్న పోలీసులు గోపాలకృష్ణన్‌ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన మాజీ మంత్రి అని తెలిపారు. అనంతరం గోపాలకృష్ణన్‌ని కూనూర్ ఆస్పత్రిలో చేర్చారు. చదవండి: ‘దొంగ’ తెలివి.. అమ్మవారికి మొక్కి పని కానిచ్చేశాడు.. వైరలైన దృశ్యాలు -
వీడియో: కన్న కూతురిని చితకబాదుతూ తండ్రి పైశాచిక ఆనందం
సాక్షి, మెదక్: తాగిన మైకంలో కన్న కూతురిని తండ్రి చితకబాదిన ఘటన మెదక్ పట్టణంలో సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు. పట్టణానికి చెందిన మాడిశెట్టి నాగరాజు, భార్య మౌనిక దంపతులకు ఇద్దరు పిల్లలు. రెండు నెలలుగా నాగరాజు మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా భార్యతో ఉంటానని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూతురు గగనశ్రీతో మరో మహిళ వద్దకు వెళ్లిన నాగరాజు, చిన్నారిని విచక్షణ రహితంగా చితకబాదాడు. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో నాగరాజుపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. చదవండి: Gachibowli: భారీ చోరీకి పాల్పడిన ‘నేపాల్’ వాచ్మెన్ దంపతులు -
తాలిబన్ల అరాచకం: జర్నలిస్టులకు చిత్రహింసలు
కాబూల్: తాలిబన్లు రెచ్చిపోయారు. వారికి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న మహిళల నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను చితకబదారు. రక్తమొచ్చేలా దాడి చేశారు. వారిని దాడి చేసి బంధించిన చిత్రాలను తాలిబన్లు విడుదల చేశారు. అఫ్గానిస్తాన్‌లో మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయింది. వెస్ట్రన్ కాబూల్‌లోని కార్ట్-ఈ-చార్ ప్రాంతంలో బుధవారం మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను తాలిబన్లు ఎత్తుకెళ్లిపోయారు. చదవండి: లోకేశ్‌కి ఎలా అల్లరి చేయాలో చంద్రబాబు శిక్షణ అనంతరం ఓ గదిలో బంధించి చితకబాదారు. వారి దుస్తులు విప్పేసి రక్తమొచ్చేలా తీవ్రంగా దాడి చేశారు. తాలిబన్లు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులు తఖి దర్యాబీ, నిమతుల్లా నక్తీ. జర్నలిస్టు వృత్తిని ఎగతాళి చేస్తూ దారుణంగా హింసించారని బాధిత జర్నలిస్టులు తెలిపారు. తమ పాలనలో మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లదని తాలిబన్లు ప్రకటించారు. అయినా జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారిద్దరితో పాటు మరికొందరు జర్నలిస్టులను ఎత్తుకెళ్లి అనంతరం విడిచి పెట్టారని చెప్పారు. దర్యాబీ, నక్దీ ఓ ఛానల్లో వీడియో ఎడిటర్లుగా పని చేస్తున్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారి చెర నుంచి విడుదలైన అనంతరం బాధితుడు నక్దీ మీడియాతో మాట్లాడారు. ‘ఒక తాలిబన్ నా తలపై కాలు పెట్టి నలిపేశాడు. మొఖాన్ని కూడా చిదిమేశాడు. తర్వాత తలపై తన్నాడు. నన్ను చంపేస్తారని అనుకున్నా’ అని వాపోయాడు. ‘నువ్వు వీడియోలు చిత్రీకరించవద్దు’ అని హెచ్చరించినట్లు తెలిపాడు. ఈ ఘటనపై జర్నలిస్టు లోకం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వీరిపై దాడిని జర్నలిస్ట్ లోకం ఖండిస్తోంది. Send our journalists to hospital. pic.twitter.com/W3GQ34BPtl — Zaki Daryabi (@ZDaryabi) September 8, 2021 -
కుటుంబ సభ్యుల క్రూరత్వం, ఫోన్లో మాట్లాడుతున్నారని..
భోపాల్: దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు రూపొందించిన వారి పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా వారి రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు, ఇంకెన్నో కార్యక్రమాలు చేపడుతున్నా అవేవి వారిని కాపాడలేకపోతున్నాయనే చెప్పాలి. ఓ వైపు బయట వాళ్ల నుంచి లైంగిక దాడులు, మరో వైపు కుటుంబ సభ్యుల నుంచి ఆచారాలు పేరుతో ఆగడాలు.. ఇలా వాళ్లపై హింసాకాండలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఓ యువతిని కుటుంబ సభ్యులే చెట్టుకు వేలాడదీసి కర్రలతో కొట్టగా.. తాజాగా సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అనే సందేహం కలిగేలా.. బంధువులతో ఫోన్లో మాట్టాడారని నేపంతో కుటుంబ సభ్యులే యువతులపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఇద్దరు యువతులు వారి బంధువులతో ఫోన్ మాట్లాడుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కోపంతో ఆ యువతులను ఇంట్లోని వారే దారుణంగా హింసించారు. కాగా వీడియో బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో.. యువతులు కొట్టకండి అని కుటుంబ సభ్యులను వేడుకుంటున్నా కనికరం లేకుండా వాళ్లను కర్రలు, రాళ్ళతో కొట్టారు. వారిని హింసించిన వారిలో ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం. తాండా పోలీస్ స్టేషన్ అధికారుల ప్రకారం.. ఈ సంఘటన జూన్ 22 న పీపాల్వా గ్రామంలో జరగగా, వీడియో కాస్త జూన్ 25 న పోలీసులకు చేరింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. I have received another complaint of a woman being brutally beaten up by a mob. If anyone can update me on this case : wrt location and date. What kind of a barbaric society have we become, the person is laughing while filming this! No fear of the law? Contempt of SC judgments! pic.twitter.com/kl1CNUIs6S— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) July 4, 2021 -
వైరల్: పాపం.. మూగజీవి.. మీరు మనుషులా.. రాక్షసులా..
తిరువనంతపురం: శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తారు. అవి, తన యజమాని పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకే, చాలా మంది డాక్టర్లు కుక్కను పెంచుకోవడం వలన మానసిక సమస్యలు, ఒత్తిడి దూరమవుతాయని చెప్తుంటారు. అయితే, ఇలాంటి మూగ జీవిపట్ల కొంత మంది యువకులు ప్రవర్తించిన తీరు షాకింగ్‌కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. కేరళలోని ఆదిమలాతురా అనే గ్రామానికి చెందిన క్రిస్తురాజ్ అనే వ్యక్తి లాబ్రాడార్ జాతికి చెందిన ఒక శునకాన్ని పెంచుకుంటున్నాడు. దాన్ని ‘బ్రూనో’ అని ప్రేమగా పిలుచుకునేవాడు. ప్రస్తుతం దానికి 9 ఏళ్లు. వారి ఇల్లు బీచ్‌కి దగ్గరగా ఉంటుంది. బ్రూనోను క్రిస్తురాజ్ కుటుంబ సభ్యులు ప్రతిరోజు బీచ్‌కి వాకింగ్‌కి తీసుకెళ్తుంటారు. అది ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉండేది. ఒకవేళ, కుక్క ఎప్పుడైనా, బయటకు వెళ్తె.. క్రిస్తు గట్టిగా పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేసేది. ఈ క్రమంలో ఒకరోజు.. బ్రూనో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. క్రిస్తురాజ్ బ్రూనోను ఎంత పిలిచిన రాలేదు. చాలా సేపు గడిచిపోయింది. దీంతో, క్రిస్తురాజ్ తనశునకాన్ని వెతుక్కుంటూ బీచ్ దగ్గరకు వెళ్లాడు. అయితే, అక్కడ సంఘటన చూసి షాక్‌కు గురయ్యాడు. అక్కడ ముగ్గురు యువకులు, బ్రూనోను, ఒక కొక్కెనికి వేలాడదీశారు. అంతటితో ఆగకుండా, ఒకరి తర్వాత మరొకరు ఆ కుక్కను అతి క్రూరంగా కొడుతున్నారు. పాపం.. అది ఆ దెబ్బలకు తాళలేక విలవిల్లాడుతూ.. ప్రాణాలను విడిచింది. అది చూడగానే, వణికి పోయిన యజమాని ఏంచేయాలో తెలియక, ఆ సంఘటనను వీడియో తీశాడు. ఇంటికి చేరుకున్న తర్వాత తన సోదరితో జరిగిన దారుణాన్ని చెప్పాడు. వెంటనే వారు, ఆ ముగ్గురు దుర్మార్గులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు ఆ నిందితులను అదుపులోనికి తీసుకుని, జంతులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద పలు కేసులను నమోదు చేశారు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఆ దుర్మార్గులను చంపేయాలి..’, ‘మూగజీవి పట్ల అంత క్రూరంగా ఎలా ప్రవర్తించారు..’, ‘బ్రూనోకు న్యాయం జరగాలి..’ ‘ఘోరం.. మీరు మనుషులా.. రాక్షసులా..అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: అందుకే నా పిల్లలతో కలిసి అశ్లీల వీడియోలు చూస్తా.. -
వైరల్ వీడియో: పోలీస్‌పై గ్రామస్థుల విచక్షణ రహిత దాడి
-
Viral Video: పోలీస్ అధికారిపై కర్రలతో గ్రామస్తుల దాడి
భోపాల్: విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారిపై స్థానికులు విచక్షణ రహితంగా దాడికి తెగబడిన ఘటన శుక్రవారం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌కు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛతర్‌పూర్‌లోని జామ్‌తులి గ్రామంలో కోవిడ్ కర్ఫ్యూని ఉల్లంఘించి కొంతమంది వ్యక్తులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన గ్రామంలోని కొంతమంది మూకుమ్మడిగా పోలీస్ దగ్గరకు వెళ్లి అతనిపై దాడికి తెగబడ్డారు. కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొడుతూ విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను జాతీయ మీడియా సంస్థ తన ట్విటర్లో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరలవుతోంది. 7 సెక్షన్ల నిడివిగల ఈ వీడియోలో గాయాలతో పోలీస్ కిందపడిపోయి లేవడానికి ఇబ్బందిపడుతున్నట్లు కనిపిస్తోంది. అంతేగాక పోలీస్‌ను కొట్టడానికి వచ్చిన వారిలో ఓ వ్యక్తికి తలపై గాయాలయి ఉన్నాయి. కాగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం, స్థానికులు మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. అయితే, ఈ దాడికి పాల్పడిన వారిలో ఏ ఒక్కరూ కూడా మాస్క్ ధరించలేదు. దీనికితోడు వారంతా అసభ్య పదజాలంతో మాట్లాడటం కెమెరాలో రికార్డయ్యింది. కాగా పోలీస్ ఓ వ్యక్తి తలపై పోలీస్ గట్టిగా కొట్టాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అందుకే అతనిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. కానీ పోలీసుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తను కేవలం షాప్‌లు మూసేయాలని చెప్పినందుకు కోపంతో తనపై దాడి చేశారని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై డీఎస్పీ శశాంక్ విలేకరులతో మాట్లాడుతూ.. జామ్‌తులి గ్రామంలో కోవిడ్ కర్ఫ్యూ ఉల్లంఘించబడుతోందని తమకు సమాచారం అందిందన్నారు. వెంటనే పోలీసులు బృందం అక్కడికి వెళ్లిందని, దుకాణాలను మూసివేయమని చెప్పడంతో కొంతమంది కోపం తెచ్చుకొని సిబ్బందిని కొట్టారని వెల్లడించారు. తామింకా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు, పూర్తి వివరాలు సేకరించగా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
దారుణం: విద్యార్థిని చితక్కొట్టిన వాచ్మెన్
గాజువాక: సెలవు రోజున విద్యార్ధి గోడ దూకి పాఠశాలలోకి వచ్చాడనే కోపంతో విద్యార్థిని ఓ వాచ్మెన్ చితక్కొట్టాడు. వీపు, చేతులు, కాళ్లపై తీవ్రంగా కొట్టడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. వెంటనే వాచ్మెన్పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా గాజువాకలో జరిగింది. అయితే వాచ్మెన్ దాడి చేసిన విషయం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పలేదు. రాత్రి చొక్కా తీసి నిద్రిస్తున్న సమయంలో ఒంటిప్తె ఉన్న దెబ్బలు చూసి తల్లి అడగడంతో ఈ విషయం బయటపడింది. గాజువాక బీసీ రోడ్డులో ఉన్న మార్వెల్ పాఠశాలలో చ్తెతన్య ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కొంతమంది విద్యార్థులతో కలసి ఆడుకునేందుకు పాఠశాలకు వచ్చాడు. అయితే వాచ్మెన్ అనుమతి తీసుకుని లోనికి వెళ్లి ఆడుకుంటున్న సమయంలో వేరే అబ్బాయి వచ్చాడు. పాఠశాలలలో ఉన్న బస్సు ఎక్కి హారన్ కొట్టడంతో వాచ్‌మెన్‌కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే కర్రతో చితకబాదాడని బాధిత విద్యార్థి ఆరోపించాడు. ఇంటికెళ్లినా విద్యార్థి వాచ్మెన్ కొట్టిన విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే రాత్రి నిద్రిస్తుండగా తల్లి సత్యగౌరి చూసి ప్రశ్నించగా ఈ విషయం బయటకు వచ్చింది. తెల్లారి వెంటనే పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. బాధిత విద్యార్ధి తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్‌ను నిలదీశారు. తప్పు చేస్తే ఇంత దారుణంగా వాచ్మెన్ కొడతారా అని అడిగారు. విద్యార్ధుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా.. అంటూ నిలదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్‌తో మాట్లాడి వాచ్‌మెన్‌ను పిలిపించారు. అయితే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే వాచ్మెన్ దారుణంగా కొట్టాడని వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య చదవండి: ముగ్గురి గ్యాంగ్ రూ.3 కోట్ల మోసం -
క్యాన్సర్‌ను జయించాను
సంజయ్ దత్ క్యాన్సర్‌ను జయించారు. ఈ శుభవార్తను ఆయన తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆగస్ట్‌లో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నప్పుడు ఊపిరి ఆడకపోవడంతో ఆసుపత్రిలో చేరారాయన. అప్పుడే ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తెలిసింది. కొన్ని రోజులు చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి, చికిత్స తీసుకున్నారు సంజయ్ దత్. చికిత్సకు ఆయన శరీరం సరిగ్గా స్పందించడంతో త్వరగా కోలుకున్నారని తెలుస్తోంది. క్యాన్సర్ నుంచి కోలుకున్న విషయాన్ని తన పిల్లలు షహ్రాన్, ఇక్రా పుట్టినరోజు (బుధవారం) సందర్భంగా ప్రకటించారు సంజయ్ దత్. ఈ సందర్భంగా సంజయ్ దత్ మాట్లాడుతూ – ‘‘గత కొన్ని నెలలు నాకు, మా కుటుంబానికి చాలా కష్టమైన రోజులు. ధైర్యంగా నిలబడగలిగేవాళ్లకే పెద్ద పెద్ద సమస్యలిస్తాడట దేవుడు. ఇందులోనుంచి పోరాడి విజేతగా నిలబడ్డాను. ఇదే మా పిల్లలకు నేను ఇస్తున్న పుట్టినరోజు కానుక. అలాగే నేను క్యాన్సర్ నుంచి బయటపడ్డానంటే కారణం నా కుటుంబం, నా బంధువులు, నా కోసం ప్రార్థించిన అభిమానులు. మీ ప్రేమే నన్ను ఆరోగ్యంగా ఉంచగలిగింది. మీ ప్రేమకు ధన్యవాదాలు’’ అన్నారు. -
యువకుడిని చితకబాదిన మహిళా ఎస్సై
భువనేశ్వర్: భూవివాదం పరిష్కరించండంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. న్యాయం చేయాల్సిన ఎస్సై కాస్తా.. సదరు యువకుడిపై అమానుషకర రీతిలో దాడి చేసిన సంఘటన సంచలనం రేపింది. వివరాలు.. తరలసరువా గ్రామానికి చెందిన రాజు మహంత్ అనే యువకుడు భూతగదా పరిష్కారం కోసం కియోంజార్ జిల్లాలోని పటనా పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అయితే న్యాయం చేయాల్సిన ఎస్సై సంధ్యరాణి జెన సదరు యువకుడిపై దాడి చేసింది. దారుణంగా కొట్టి హింసించింది. ఇంత జరుగుతుంటే పోలీసు స్టేషన్‌లోని మిగితా సిబ్బంది సైలెంట్‌గా చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు అడ్డు చెప్పలేదు. సంధ్య రాణి యువకుడిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నత అధికారులు ఈ ఘటనపై స్పందించారు. సదరు అధికారిణిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.. -
ఎమ్మెల్యేను తరిమి కొట్టిన జనాలు..!?
జైపూర్ : ప్రజాస్వామ్య దేశంలో అప్పుడప్పుడు నాయకులు ఓటరు దేవుళ్ల అసంతృప్తిని చవిచూడక తప్పదు. కానీ ఓటర్లు రెబల్‌గా మారి నేతలను తరిమి కొట్టడం మాత్రం ఎప్పుడు చూడలేదు. ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్ ప్రజలు ఒక ఎమ్మెల్మేను తరిమి తరిమి కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అంతేకాక ఈ వీడియోలో ఉన్న నేత రాజస్థాన్ దౌసా ప్రాంతానికి చెందిన శంకర్ లాల్ శర్మ అనే బీజేపీ ఎమ్మెల్యేగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జులై 13నుంచి ఇప్పటి వరకూ ఈ వీడియోను దాదాపు 60 వేల మంది చూశారు. అయితే అసలు విషయం తాజాగా బయటపడింది. ఆ వీడియోలో తెల్లని కుర్తా పైజామా ధరించిన వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే అని.. కానీ అతను దౌసా ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే మాత్రం కాదని వెల్లడైంది. వీడియోలో జనాలు వెంటబడి మరి తరుముతున్న వ్యక్తి గంగాపూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అని బయటపడింది. ఈ విషయం గురించి దౌసా బీజేపీ ఎమ్మెల్యే శంకర్ లాల్ శర్మ స్పందిస్తూ.. ‘నా పేరు మీద ప్రచారం అవుతున్న ఈ వీడియో ఏప్రిల్ నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. కానీ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. వైరల్ టెస్ట్‌లో ఈ విషయం తెటతెల్లమయ్యింది. నా పేరు మీద ఇలా నకిలీ వీడియోలను ప్రచారం చేసినందుకు గాను మా పార్టీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన కూడా తెలిపారు. వీడియోలో ఉన్నది నేను కాదు. ఆ వీడియోలో జనాలు తరిమికొడుతున్న వ్యక్తి ఎవరో తెలుసుకోమని నా పార్టీ కార్యకర్తలకు చెప్పాను. వారి పరిశీలనలో జనాలు తరుముతున్న వ్యక్తి గంగాపూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రంకేశ్ మీనా అని తేలింది. ఈ వీడియోను భారత్ బంద్ సందర్భంగా తీశారు. సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ చట్టానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన నేపధ్యంలో నిరసన తెలుపుతుండగా తీసిన వీడియో ఇది. ఈ వీడియోలో జనాలు తరిమికొడుతున్నది కాంగ్రెస్ నేత రంకేశ్ మీనానే’ అని తెలిపారు. రంకేశ్ మీనా 2009లో బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అయితే ఈ వీడియో విషయం గురించి రంకేష్ను సంప్రదించగా అతడు దీని గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. -
డీజిల్ దొంగలించారని.. బట్టలు విప్పించి..
జబల్పూర్ : డీజిల్ దొంగలించారన్న నెపంలో పనివాళ్లను బట్టలు విప్పించి మరీ చావబాదారు యాజమాని అతని మిత్రుడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాండ్ల జిల్లాకు చెందిన సురేష్ ఠాకూర్, అశిష్ గాండ్, గోలు ఠాకూర్లు జబల్పూర్లోని గుడ్డు శర్మకు ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే జూలై 11 రాత్రిన కంపెనీకి చెందిన 120లీటర్ల డీజిల్ ఆ ముగ్గురు దొంగలించారని ఆరోపిస్తూ.. యాజమాని గుడ్డు శర్మ వారి బట్టలు విప్పించి బేస్‌బాల్ బ్యాట్‌తో చితకబాదాబడు. గుడ్డు శర్మతో పాటు అతని మిత్రుడు శేరు కూడా వారిని తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో విషయం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులు గుడ్డు శర్మ, అతని మిత్రుడు శేరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
నాడు కరుణానిధిని చావ బాదారు!
సాక్షి, చెన్నై : ద్రవిడ రాజకీయాల్లో చురుగ్గా తిరుగుతున్న ఎం. కరుణానిధికి కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిశ్చయించారు. చిదంబరంకు చెందిన ప్రముఖ గాయకుడు సుందరనార్ కూతురు పద్మావతిని ఖాయం చేశారు. 1944, సెప్టెంబర్‌లో పెళ్లి జరిగింది. అప్పటికే అభ్యుదయ భావాలు కలిగిన కరుణానిధి, ద్రవిడ ఉద్యమ స్ఫూర్తితో మంగళసూత్రం కట్టకుండా, పురోహితుడు లేకుండా వేదికపై దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. దాంతో కొత్త జీవితం ప్రారంభమైంది. 1924, జూన్‌లో జన్మించిన కరుణానిధికి 20 ఏళ్లు పూర్తిగా నిండలేదు. ద్రావిడ రాజకీయాల్లో 14వ ఏటనే ప్రవేశించిన ఆయన అప్పటికే నాటకాలు, కవిత్వం రాయడం ప్రారంభించారు. ఆత్మాభిమానం ఎక్కువగా కలిగిన కరుణానిధి తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నారు. తాను అమితంగా ప్రేమించే భార్య కోసం సంపాదనామార్గం వెతుక్కోవాలనుకున్నారు. ద్రావిడ నడగార్ కళగం (ద్రావిడ నటుల బృందం)తో నాటక రచయితగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ నాటకాల్లో కరుణానిధి కూడా నటించాలని వారు షరతుపెట్టారు. అందుకు అంగీకరించిన ఆయన తన ఇద్దరు మిత్రులతో కలిసి నాటకానికి నెల రోజుల ముందుగా వెల్లుపూర్ వెళ్లారు. అక్కడ వారు ముగ్గురు నాటక ట్రూప్ మేనేజర్ చూపించిన ఓ చిన్న గదిలో ఉన్నారు. తగిన రిహార్సల్స్ అనంతరం వారు ‘పళనియప్పన్’ నాటకాన్ని వేశారు. కొన్ని ప్రదర్శనలకు పెరియార్ రామస్వామి, అన్నా దురైలు వచ్చి నాటకాన్ని వీక్షించారు. అయినప్పటికీ ఆ నాటకం ఫ్లాప్ అయింది. వెల్లుపూర్ అప్పటికే కులాల వారిగా విభజన చెంది ఉంది. అప్పుడే నాగపట్టినం నుంచి కూడా ఓ డ్రామా కంపెనీ వెల్లుపూర్ వచ్చింది. దానిపేరు ‘పరప్పసంగ’. అంటే పెరాయియార్ బాలలు అని అర్థం. షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించే తమిళ దళితుల్లో పరాయార్లు, పెరాయియార్లు, అరుంధతియార్లు అంటూ మూడు ఉప కులాలు ఉన్నాయి. ఆ కులం వారు తప్పకుండా వీక్షించే విధంగా వారు నాటక సంఘానికి ఆ పేరు పెట్టుకున్నారు. ద్రావిడ ఉద్యమాన్ని విస్తరించేందుకు, తమ నాటకాలకు ప్రాచుర్యం కల్పించేందుకు ద్రావిడ అంటే దళిత ఉద్యమమని కూడా కరుణానిధి పేర్కొన్నారు. అక్కడి నుంచి కరుణానిధి నాటక బృందం పాండిచ్చేరి వెళ్లింది. అక్కడ వారి నాటకం విజయవంతం అయింది. అక్కడ ఓ న్యాయవాది కోరిక మేరకు కరుణానిధి ‘తోజిలాలర్ మిత్రన్’ అనే తమిళ పత్రికలో ఓ వ్యాసం రాశారు. దానికి ‘దట్ పెన్’ అని పేరు పెట్టారు. శబర్మతి ఆశ్రమంలో జాతిపిత గాంధీజీ కోల్పోయిన పెన్ను ఆయన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్లుగా వ్యాసం రాశారు. అది కాంగ్రెస్ కార్యకర్తలకు ఆగ్రహం కలిగించింది. ఆ తర్వాత పాండిచ్చేరిలో ఏర్పాటు చేసిన ద్రావిడ సభలో కరుణానిధితోపాటు పెరియార్ రామస్వామి, అన్నాదురై, తదితర ద్రవిడ నేతలు పాల్గొన్నారు. ఆ సభకు హాజరైన అశేష జనవాహిణిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పొల్గొని ‘ద్రావిడియన్ లీడర్స్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. అన్నాదురై మైకుపట్టుకొని మాట్లాడుతూ పిలువడం తమిళుల సంస్కృతి అని, పొమ్మనడం కాదని హితవు చెప్పారు. ఇంతలో వేదిక సమీపంలో ద్రావిడ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ జెండాను విరిచేశారు. వేదికను ధ్వంసం చేశారు. ద్రావిడ నాయకులను కార్యకర్తలు అక్కడి నుంచి తప్పించి పరిచయస్తుల ఇళ్లలో దాచారు. తనపై దాడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను తప్పించుకుంటూ కరుణానిధి పరుగెత్తారు. ఈ క్రమంలో ఆయన తన బృందం నుంచి వేరుపడి ఒంటరి వాడయ్యారు. ఎవరైనా తనను ఆదుకుంటారేమోనని చూశారు. అలాంటి పరిస్థితి కనిపించలేదు. తాను పరుగెత్తి అలసిపోతున్న సమయంలో ఓ ఇంటి తలుపులు తెరచి ఉండడం, ఆ ఇంటి ముందు ఇద్దరు మహిళలు నిలిచి ఉండడం కనిపించింది. ఆ మహిళలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. గుడ్డిగా ఆ ఇంటిలోకి పరుగెత్తారు. వెన్నంటే వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు కరుణానిధిని బయటకు ఈడ్చుకొచ్చి చితకబాదారు. ఆయన స్పృహతప్పి పోయారు. చనిపోయారనుకొని అతన్ని పక్కనే ఉన్న కాల్వలో పడేసి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లిపోయారు. రెండు గంటల తర్వాత మురికి కాల్వలో పడి ఉన్న కరుణానిధికి స్పృహ వచ్చింది. ఆందోళనతో ఆయనవైపు చూస్తున్న ఓ మధ్య వయస్కురాలు, ఓ యువతి కరుణానిధిని కాల్వలో నుంచి బయటకుతీసి ఇంట్లోకి తీసుకెళ్లారు. స్నానం చేయించి శుభ్రమైన బట్టలిచ్చి ఓ రిక్షా ఎక్కించి మరి పెరియార్ ఇంటికి పంపించారు. అక్కడ అప్పటికే కరుణానిధి కోసం పెరియార్, అన్నాదురైలు ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. కరుణానిధి గాయాలకు ప్రథమ చికిత్స చేసిన పెరియార్ తన వెంట రావాల్సిందిగా కరుణానిధిని తీసుకెళ్లారు. అక్కడే ఆయన తదుపరి యాత్ర ప్రారంభమైంది. ఈరోడు నుంచి వెలువడుతున్న పరియార్ మాగజైన్ ‘కుడియారసు’లో కరుణానిధి అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరారు. అక్కడ ఏడాదిపాటు మాగజైన్కు వ్యాసాలు, కథలు రాస్తూ గడిపారు. అప్పటికే కోయంబత్తూరులో ప్రసిద్ధి చెందిన చలనచిత్ర నిర్మాణ సంస్థ ‘జూపిటర్ ఫిల్మ్స్’ నుంచి పిలుపు వచ్చింది. ఆ విషయాన్ని కరుణానిధి, పెరియార్‌కు తెలిపారు. ఆయన వెన్నతట్టి పంపించారు. అక్కడే కరుణానిధి జీవితం మరో మలుపు తిరిగింది. 1947లో విడుదలైన ‘రాజకుమారి’ చిత్రానికి కరుణానిధి తొలిసారిగా స్క్రీన్ ప్లే రాశారు. అలా అయన తన జీవితకాలంలో 39 సినిమాలకు స్క్రీన్‌ప్లే అందించారు. 1969లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన కరుణానిధి మొత్తం ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన రాజకీయ జీవితంపై వచ్చిన ‘ఏ లైఫ్ ఇన్ పాలిటిక్స్’ అనే పుస్తకంలోని అంశాలే ఇవి. సంధ్యా రవిశంకర్ రాసిన ఈ పుస్తకాన్ని హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురించింది. ఇటీవలే విడుదలైన ఈ పుస్తకం 479 రూపాయలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంది. -
పోలీస్ అధికారి మీద పడి చితకొట్టాడు.. వైరల్
లివర్‌పూల్(ఇంగ్లాండ్) : నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ పోలీసు అధికారి మీద పడి పిడి గుద్దులు కురిపొంచాడో వ్యక్తి. అక్కడున్న వారు అతన్ని పక్కకు లాగడంతో ఆ అధికారి పరిస్థితి చావుతప్పి కన్నులొట్ట పోయినట్లైంది. స్వల్ప గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ నగరానికి దగ్గరలోని ఓ రోడ్డుపై పోలీసు అధికారి కేయిత్ కెల్లెట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు . అదే సమయంలో అటు వైపుగా మోటార్ బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తిపై అనుమానంతో ఆపి వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించాల్సిందిగా కోరాడు. దీంతో కోపోద్రిక్తుడైన వాహనదారుడు పోలీసు అధికారిని దుర్భాషలాడటమే కాకుండా మీద పడి పిడిగుద్దులు గుద్దటం మొదలుపెట్టాడు. ఆ దెబ్బలు తాళలేకపోయిన అధికారి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇది గమనించిన అక్కడి వారు ఆ వ్యక్తిని విడిపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు బైకు యాజమానిని విడిపించి అటు నుంచి అటే పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని మెర్సీసైడ్‌కు చెందిన మాగ్హల్గా పోలీసులు గుర్తించారు. బైకుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడం, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై చెయ్యి చేసుకోవడం వంటి నేరాల కింద అతనికి శిక్ష పడింది. ఈ దృశ్యాలన్నింటిని అటువైపుగా వెళుతున్న ఓ వాహనదారుడు తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
అపుడు ఇండిగో..ఇపుడు ఉబెర్
సాక్షి, బెంగళూరు: ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఆగడాల పర్వం కొనసాగుతుండగానే బెంగళూరులో టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ డ్రైవర్ల దాష్టీకం ఒకటి వెలుగు చూసింది. సీట్ బెల్ట్ అడిగిన పాపానికి ఒక ప్రయాణికుడిపై అమానుషంగా దాడిచేసిన ఘటన ఆందోళన రేపింది. బాధితుడు దావే బెనర్జీ తనపై జరిగిన దాడి సంగతిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాదాపు 20మంది ఉబెర్ డ్రైవర్లు మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారంటూ ట్విట్టర్లో ఫోటోలను పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ ఉదంతంపై ఉబెర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే..పోలీసులకు ఫిర్యాదు చేసుకోమంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఆరోపించారు. సంఘటన పూర్వాపరాల్లోకి వెడితే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త దావే బెనర్జీ ముంబైనుంచి విమానంలో రాత్రి 9గంటలకు బెంగళూరు చేరుకున్నారు. అక్కడనుంచి ఇంటికి వెళ్లేందుకు ఉబెర్ బుక్ చేసుకున్నారు. కారు వెనకు సీటులో సీట్ బెల్ట్ లేకపోవడాన్ని గమనించి ఉబెర్ డ్రైవర్ని ప్రశ్నించారు. రెండుసార్లు అడిగినా సమాధానం లేకపోవడంతో ఆయన..డ్రైవర్ని భుజంతట్టి ..కారు ఆపమని కోరారు. అంతే ఆగ్రహంతో ఊగిపోతూ కారు దిగిన క్యాబ్ డ్రైవర్ ఇతర డ్రైవర్లను పిలిచి మరీ బెనర్జీపై దాడికి దిగారు. 20మంది డ్రైవర్లు సుమారు 40 నిమిషాలపాటు తమ అఘాయిత్యాన్ని కొనసాగించారు. ఎట్టకేలకు వారినుంచి బయటపడి మరో క్యాబ్ బుక్ చేసుకుని ఇంటి చేరారు బెనర్జీ. ఈ ఘటనపై బాధితుడి భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయపోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఈ విషయంలో దుమారం రేగడంతో దిగి వచ్చిన ఉబెర్ ఒక ప్రకటన చేసింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని, దాడి ఘటనలో న్యాయ విచారణకు సహకరిస్తామని ప్రకటించింది. అయితే తమకు ఇంతవరకు తమకు ఎలాంటి ఫిర్యాదు లేదనీ, ఫిర్యాదు అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని బెంగుళూర్ నార్త్ ఈస్ట్ డివిజన్ పోలీసు అధికారులు తెలిపారు. Got beaten up by a mob of 20+ #Uber drivers at #Bangalore Airport last night for demanding seatbelts. Uber SOS said 'we can't help, call the police'. @dkhos @amijain1 @ShaileshSawlani @FreeseChristian @Uber_BLR @UberINSupport @timesofindia @ndtv @BlrCityPolice @CPBlr @firstpost pic.twitter.com/QghDMlgYzX — Dave Banerjee (@DaveBanerjee) November 14, 2017 That’s your response? I reached out to you and you did jack. The worst was after my call to you. https://t.co/z3iDVAwQ82 — Dave Banerjee (@DaveBanerjee) November 14, 2017 -
ఇంగ్లీషులో మాట్లాడాడని..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంగ్లంలో మాట్లాడడం తప్పనిసరిగా మారిపోయిన ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కేవలం ఆంగ్లంలో మాట్లాడడమే కాదు.. మరింత పరిజ్ఞనాన్ని అలవర్చుకోవడం చాలా అవసరం. అయితే విచిత్రంగా ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటమే ఓ యువకుడికి చేదు అనుభవంగా మిగిల్చింది. దేశరాజధాని ఢిల్లీ నగరంలో కన్నాట్ ప్లేస్‌లో శనివారం ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నోయిడా నివాసి వరుణ్ గులాటి (22) తన స్నేహితుడితో కలిసి స్థానిక ఫైవ్ స్టార్ హోటల్కివెళ్లాడు. ఫ్రెండ్ దన్ కారులో తన స్నేహితుడు అమన్‌ను విడిచిపెట్టడానికి పెట్టిన అనంతరం తిరిగి వెళుతుండగా అయిదుగురు వ్యక్తులు గులాటిని చుట్టుముట్టారు. ఇంగ్లీషులో ఎందుకు మాట్లాడుతున్నావంటూ వాదనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చేసుకుంది. దీంతో వారు తీవ్రంగా దాడి చేసి గాయపర్చారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. అయితే గులాటి అప్రమత్తంగా వ్యవహరించి దుండగుల వాహనాల నెంబర్లను నోట్ చేసుకోవడంతో నిందితుల్లో ముగ్గురు పోలీసులకు చిక్కారు. బాధితుడి ఫిర్యాదు, వాహనాల నెంబర్ ప్లేట్ ఆధారంగా ముగ్గరు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మిగిలినవారికోసం గాలిస్తున్నామన్నారు. -
నేనెవరో తెలుసా..?
♦ స్పెషల్ పార్టీ పోలీసునంటూ యువకుడి హల్చెల్ ♦ వ్యాపారులను బెదిరించిన వైనం ♦ నకిలీ ఖాకీని గుర్తించి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు ♦ కురవి పోలీసులకు అప్పగింత కురవి(డోర్నకల్): సినీఫక్కీలో వ్యాపారులను మోసగిం చి డబ్బు గుంజాలని చూసిన ఓ నకిలీ పోలీసును ప్రజలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. చిన్నచిన్న కిరాణం దుకాణా లు.. పాన్‌షాపులు.. గ్రామాల్లోని దుకాణాల వద్దకు వెళ్లి స్పెషల్ పార్టీ పోలీసునంటూ బెదిరింపులకు పాల్ప డుతూ.. డబ్బులు వసూలు చేస్తున్న ఓ యువకుడి బండారం బయటపడింది. స్పెషల్ పార్టీ పోలీస్‌నంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి శుక్రవారం మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో యువకులకు పట్టుపట్టాడు. గ్రామస్తుల క£ý నం ప్రకారం.. కురవి మండలం కొత్తూరు (జీ) శివారు పిల్లిగుండ్ల తండాకు చెందిన బానోతు రమేష్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ చుట్టు పక్కల గ్రామాల్లో స్పెషల్ పార్టీ పోలీసునంటూ కొద్ది రోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కొంతకాలంగా ఇదే తంతు.. బానోతు రమేష్ మండలంలోని గుట్కాలు, అంబర్ప్యాకె ట్లు అమ్మే షాపుల వద్దకు వెళ్తుంటాడు. షాపుల్లోకి వెళ్లి గు ట్కా ఉందా..? అంబర్ప్యాకెట్ ఉందా? అని అడగడం, వారు ఇచ్చేసరికి నేను స్పెషల్ పార్టీ పోలీసునని, అక్రమ దందా చేస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. చిన్న చిన్న షాపుల యజమానులు కేసులకు బయపడి ఈ నకిలీ పోలీస్‌కు ఆమ్యామ్యాలు ఇచ్చుకోవడం చేస్తున్నారు. ఇదే అలవాటుగా మార్చుకున్న రమేష్ రోజుకో ఊరికి వెళ్లి దందా చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మొగిలిచర్లలో తిరుగుతున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం మొగిలిచర్ల గ్రామంలో ఓషాపు యజమానిని బెదిరించిన విషయం తెలిసిన యువకులు, ద్విచక్రవాహనంపై మొగిలిచర్లలో సంచరి స్తున్న రమేష్‌ను గుర్తించారు. వెంటనే అతడి వద్దకు వెళ్లి ద్విచక్రవాహన తాళాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ ‘‘ఎవడ్రా నాబండి తాళం తీస్తారా? నేను ఎవరినో తెలుసా..? స్పెషల్ పార్టీ పోలీసుని..’’ అని గట్టిగా అరిచాడు. దీంతో యువకులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం మొగిలిచర్ల మార్గంలో వెళ్తున్న కురవి ఎస్సై తీగల రమేష్‌కు పోలీస్‌నంటూ బెదిరింపులకు పాల్పడుతున్న రమేష్‌ను అప్పగించారు. నకిలీ పోలీస్ అవతారం ఎత్తిన రమేష్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణ చేపడుతాం.. స్పెషల్ పార్టీ పోలీసునని దుకాణాదారుల నుంచి నగదు వసూలు చేస్తున్న రమేష్ విషచమై కురవి ఎస్సై తీగల అశోక్‌ను వివరణ కోరగా.. ఆయన మాట్లాడారు. రమేష్ అనే యువకుడిని గ్రామస్తులు అప్పగించారని, విచారణ చేసి ఆయనపై కేసు నమోదు చేస్తామని వివరించారు. -
ఆడపిల్ల పుట్టిందని అమానుషం
పంజాబ్: ఆడపిల్ల పుట్టిందనే నెపంతో అమానుషానికి పాల్పడిందో కుటుంబం. సమీప బంధువు, మరో వ్యక్తి ఓ మహిళపై హాకీ స్టిక్స్‌తో విచక్షణారహితంగా దాడి చేయడం ఆందోళన రేపుతోంది. పంజాబ్‌లోని పాటియాలాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బహిరంగంగా ఆమెపై ఆ దుర్మార్గులు దారుణంగా దాడి చేస్తోంటే, అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇపుడు ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. తాజా నివేదికల ప్రకారం మీనా కశ్యప్, దల్జీత్ సింగ్ కు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. పెళ్లి అయన దగ్గర్నుంచి అత్తింటివారు మీనాను కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు మితిమీరడంతో మీనా, దల్జీత్ వేరు కాపురముంటున్నారు. ఇంతలో మీనా ఈ మధ్యనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతే దీన్ని సాకుగా చేసుకున్న ఆ కుటుంబం మరింత రెచ్చిపోయింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ దల్జీత్ సోదరుడు, అతని స్నేహితుడు ఆమెను హాకీస్టిక్‌లతో అతి దారుణంగా కొట్టారు. హృదయ విదారకంగా అరిచి గగ్గోలు పెడుతున్నా ..ఎంత వేడుకున్నా వదిలిపెట్టలేదు. సోషల మీడియాలో వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ విషయమే గత ఏడాదిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని ,కానీ ఎలాంటి ఫలితంలేదని మీనా తండ్రి వాపోయారు. రూ.7లక్షల కట్నాన్ని డిమాండ్ చేశారని తెలిపారు. -
ఆడపిల్ల పుట్టిందని అమానుషం
-
రాజస్థాన్‌లో దారుణం..యువకుడి మృతి
జైపూర్: రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఆవులను తరలిస్తున్న ముస్లిం యువకులపై గో రక్షక దళ సభ్యులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో అయిదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఓయువకుడు మరణించాడు. అల్వార్ జిల్లాలో శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఈ షాకింగ్ వీడియె ఇపుడు నెట్లో చక్కర్లుకొడుతోంది. స్థానిక పోలీస్అధికారి రమేష్ చాంద్ సినీశ్వర్ అందించిన వివరాల ప్రకారం జాతీయ రహదారి జుగువాస్ వద్ద నాలుగు వాహనాలను గోరక్షక దళ్ సభ్యులు అటకాయించారు. దాదాపు 15మంది ముస్లిం యువకులపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. వీరి దాడిలో తీవ్రంగా గాయపడిన పెహ్లూ ఖాన్ అనేయువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. దీంతో నిందితులపై హత్య కేసుతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలుగా స్థానిక పోలీసులు గుర్తించిన పోలీసులు వీరిపై కేసులు నమోదుచేశారు. అటు ఆవులను అక్రమంగా తరలిస్తున్న కేసులో ముస్లింయువకులపై కూడా కేసులు నమోదుచేశారు. -
అదనపు కట్నం కోసం ఇల్లాలిపై టార్చర్
-
సెమీస్‌లో యూకీ ఓటమి
న్యూఢిల్లీ: జుహై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో యూకీ 3–6, 5–7తో టాప్ సీడ్ ఎవగెని డాన్స్కాయ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. -
దబంగ్ ముంబై చేతిలో పంజాబ్ వారియర్స్ ఓటమి
ఛండీగఢ్: హాకీ ఇండియా లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ వారియర్స్‌కు దబంగ్ ముంబై జట్టు షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 2–1తో గెలుపొందింది. ఓటమి తప్పదనుకున్న తరుణంలో 60వ నిమిషంలో రాబర్ట్ కెంపర్‌మన్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం)తో ముంబైని గెలిపించాడు. పంజాబ్ జట్టు తరఫున మింక్ వాన్‌డెర్ వీర్డెన్ 37వ ని.లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌తో కళింగ లాన్సర్స్ తలపడుతుంది. -
దంగల్ పరాజయాల బాట
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో యూపీ దంగల్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ నింజాస్ జట్టు 4–3తో యూపీ దంగల్ జట్టుపై విజయం సాధించింది. ఈ సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ యూపీ దంగల్ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ముంబై మహారథి జట్టు, కలర్స్ ఢిల్లీ సుల్తాన్స్ జట్టుతో తలపడుతుంది. -
లలిత్‌బాబు ఓటమి
న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబుకు ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన ఐదో రౌండ్ మ్యాచ్‌లో నేషనల్ చాంపియన్ మురళీ కార్తికేయన్... రెండో సీడ్ లలిత్‌బాబు (3.5)పై విజయం సాధించాడు. దీంతో 5 పాయింట్లు సాధించి కార్తికేయన్ ఈ టోర్నీలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. -
బీచ్‌లో నిర్మాత బర్త్‌డే, టీడీపీ ఎమ్మెల్సీ వీరంగం
-
బీచ్‌లో టీడీపీ ఎమ్మెల్సీ సతీశ్ వీరంగం
-
బీచ్‌లో టీడీపీ ఎమ్మెల్సీ సతీశ్ వీరంగం
గుంటూరు : అధికారంలో ఉన్నామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. మొన్న కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రివాల్వర్‌లో కాల్పులు జరిపి హల్చల్ చేయగా, తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ బాపట్ల బీచ్‌లో వీరంగం సృష్టించారు. బాపట్ల సూర్యలంక బీచ్‌లో హరిత రిసార్ట్స్ డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస్‌పై దాడి చేశారు. గదిలోకి లాక్కెళ్లి మరీ అతడిని చితకాబాదారు. శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురు సిబ్బందిపైనా ఎమ్మెల్సీ దాడి చేశారు. వివరాల్లోకి వెళితే... హరిత రిసార్ట్స్‌లో నిర్మాత కొరటాల సందీప్ పుట్టినరోజు వేడుకకు వచ్చిన అతిథులకు సరైన ఏర్పాటు చేయలేదని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. బీచ్‌లో క్యాంప్ ఫైర్ వేసి స్నేహితులతో కలిసి ఎమ్మెల్సీ సతీశ్ చిందులు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు బాగోలేదంటూ ఎమ్మెల్సీ అక్కడి సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. అయితే దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన హరిత రిసార్ట్స్ ఉద్యోగులకు చుక్కెదురు అయింది. తెల్లవారేవరకూ పీఎస్‌లోనే ఉంచిన పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. కాగా ఈ వార్త రాస్తే మీ సంగతి చూస్తానంటూ విలేకర్లపై ఎమ్మెల్సీ సతీశ్ బెదిరింపులకు దిగారు. కాగా ఎమ్మెల్సీ గతంలో కూడా విలేకర్లతో దురుసుగా ప్రవర్తించారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసి, వేషాలు వేస్తే తాటతీస్తానంటూ బెదిరించారు కూడా. ఇక నిర్మాత కొరటాల సందీప్ గతంలో బాపట్లలోని ఓ లాడ్జిలో పేకాడుతూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. -
శ్రీనివాస్ పరాజయం
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యారుు. 69 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ మెలిపాక శ్రీనివాస్ తొలి రౌండ్లో మిలాన్ ప్రాట్ (ఫ్రాన్స) చేతిలో ఓడిపోగా... 64 కేజీల విభాగంలో ఆశిష్ అర్మేనియా బాక్సర్ టోనీ గాల్స్టయాన్పై గెలిచాడు. -
మళ్లీ ఓడిన ప్రత్యూష
న్యూఢిల్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మారుు బొడ్డ ప్రత్యూష నాలుగో పరాజయాన్ని చవిచూసింది. కిరణ్ మనీషా మొహంతితో సోమవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ప్రత్యూష 48 ఎత్తుల్లో ఓడిపోరుుంది. ఐదో రౌండ్ తర్వాత ప్రత్యూష అర పారుుంట్తో 12వ స్థానంలో కొనసాగుతోంది. పద్మిని రౌత్ నాలుగు పారుుంట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. 3.5 పారుుంట్లతో విజయలక్ష్మి సుబ్బరామన్, సౌమ్య స్వామినాథన్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. -
భారత్‌కు తొలి ఓటమి
సింగపూర్: మహిళల ఆసియా చాంపియన్స ట్రోఫీ లో భారత హాకీ జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 2-3 తేడాతో చైనా చేతిలో పోరాడి ఓడింది. నేడు (శనివారం) జరిగే ఫైనల్లోనూ భారత జట్టు చైనానే ఎదుర్కోనుంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరి నిమిషాల్లో విజయానికి కావాల్సిన గోల్ చేసి చైనా గట్టెక్కింది. భారత్ తరఫున పూనమ్ రాణి (52వ నిమిషంలో), వందన కటారియా (55) గోల్స్ చేశారు. -
తొలి రౌండ్లోనే దీపికకు షాక్
కై రో: భారత టాప్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్‌కు వాడి డగ్లా ఓపెన్‌లో అనూహ్య పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన తొలి రౌండ్లో క్వాలిఫయర్ మరియమ్ మెట్వాలీ (ఈజిప్ట్) చేతిలో 11-5, 11-9, 6-11, 7-11, 8-11 తేడాతో దీపిక ఓడింది. తొలి రెండు గేమ్స్ సులువుగానే నెగ్గినా ఆ తర్వాత మాత్రం ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో వరుసగా మూడు గేమ్‌లను కోల్పోరుుంది. ఇక దీపిక ఓటమితో ఈ ఈవెంట్లో భారత్ పోరాటం ముగిసింది. -
డెన్మార్క్ ఓపెన్ రెండో రౌండ్లో ఓటమి
-
విద్యార్ధిని చావబాదిన లెక్చరర్
-
సింధుకు షాక్
డెన్మార్క్ ఓపెన్ రెండో రౌండ్లో ఓటమి ఒడెన్‌స: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పోరాటం ముగిసింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, హైదరాబాదీ స్టార్ పి.వి.సింధు రెండో రౌండ్లో కంగుతింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆరో సీడ్ సింధుకు అన్‌సీడెడ్ జపాన్ క్రీడాకారిణి సయాక సాటో షాకిచ్చింది. భారత స్టార్ 13-21, 23-21, 18-21తో సయాక చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌లో సయాక జోరుతో సింధు తేరుకోలేకపోరుుంది. రెండో గేమ్‌లోనూ ఒక దశలో వెనకబడ్డ సింధు... చివర్లో పుంజుకుని ఆశలు నిలుపుకుంది. అరుుతే మూడో గేమ్‌లో 18-18తో స్కోరు సమంగా ఉన్న దశలో సయాక అద్భుతంగా ఆడి వరుసగా మూడు పారుుంట్లతో సింధుకు షాక్ ఇచ్చింది. పురుషుల ఈవెంట్లోనూ భారత క్రీడాకారులకు నిరాశే ఎదురైంది. అజయ్ జయరామ్‌తో పాటు హెచ్.ఎస్.ప్రణయ్ టోర్నీ నుంచి నిష్ర్కమించారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అజయ్ జయరామ్ 21-23, 15-21తో యుకిషి (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. ప్రణయ్ 10-21, 20-22తో టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో కంగుతిన్నాడు. -
సెమీస్ లో ఓడిన సౌరవ్ ఘోశల్
మకావు: భారత స్టార్ స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోశల్ మకావు ఓపెన్ సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. రెండో సీడ్‌గా బరిలోకి దిగన తను 11-8, 4-11, 7-11, 0-11 తేడాతో డారిల్ సెల్బీ (ఇంగ్లండ్) చేతిలో ఓడాడు. తొలి గేమ్‌లో మాత్రమే ఆకట్టుకున్న ఈ జాతీయ చాంపియన్ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లను కోల్పోయాడు. చివరి గేమ్లోనరుుతే సెల్బీ ధాటికి ఒక్క పారుుంట్‌ను కూడా సాధించలేదు. -
బిహార్‌లో కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు
న్యూఢిల్లీ: యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో గోవులను కబేళాలకు తరలిస్తున్నారనే ఆరోపణలతో గోసంరక్షకులు చట్టాలను చేతుల్లోకి నిందితులను కట్టేసి చితక్కొడుతుండగా, అదే బాటలో బిహార్ ప్రజలు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. బిహార్‌లో మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై నిందితులను చావుదెబ్బలుకొడుతున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు వినిపిస్తున్నా దానికి సంబంధించిన వీడియో మాత్రం మీడియాకు చిక్కడం ఇదే తొలిసారి. బిహార్‌లోని చాప్రా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సైకిల్ మోటార్‌పై వెళుతున్న ఓ యువకుడిని పట్టుకొని మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడనే ఆరోపణలతో అతడిని చెట్టుకు కట్టేసి చేతులతో, కర్రలతో నలుగురైదుగురు చితకబాదారు. బిహార్ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించిన తర్వాత ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి. గోరక్షకుల దాడులపై దేశవ్యాప్తంగా గగ్గోలు ఎత్తడంతో 'కొట్టండికానీ ఎముకలిరిగేలా కాదు. కొట్టండికానీ వీడియోలు తీయకండి' అని విశ్వహిందూ పరిషత్ నాయకులు గోసంరక్షకులకు ఇచ్చిన పిలుపు ఇంకా బిహార్‌కు చేరినట్లు లేదు. ఎవరో ఈ దాడిని వీడియో తీసి మరీ పోస్ట్ చేశారు. -
రోకలిబండతో బాది భార్యను హతమార్చాడు
బంజారాహిల్స్ : భార్యపై అనుమానంతో రోకలిబండతో తలపై బాది అమానుషంగా హత్య చేసిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని సయ్యద్ నగర్లో నివసించే సయ్యద్ అక్రం(35) నాంపల్లిలోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు. తొమ్మిదేళ్ల క్రితం షాహినాబేగం(30)తో వివాహం కాగా వీరికి ముగ్గురు పిల్లలున్నారు. షాహినాబేగం శనివారం ఉదయం కూతురిని సమీపంలో ఉండే ప్రియదర్శిని స్కూల్లో వదిలేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా అక్రం ఆమెతో గొడవపడ్డాడు. ఆవేశంలో సమీపంలో ఉన్న రోకలిబండతో ఆమె తలపై అందరూ చూస్తుండగానే బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై తలపగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు అక్కడి నుంచి పరారుకాగా పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. గత ఆదివారం కూడా భార్య భర్తల మధ్య తీవ్ర గొడవకాగా ఆమె అలిగి పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు మాట్లాడి నచ్చజెప్పి ఆమెను మళ్లీ భర్త వద్దకు పంపించారు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంపట్ల మృతురాలి తల్లిదండ్రులు, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమికుడు, స్నేహితులు కలిసి చంపారు
గురుగ్రామ్ : కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి ఒక అమ్మాయిని చంపిన దారుణ ఘటన యూపీలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. చనిపోయిన అమ్మాయి ప్రత్యర్ధులతో తలపడినట్లు వివరించారు. ఐరన్ రాడ్‌తో ప్రత్యర్ధులు గాయపర్చడంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితం అమ్మాయి బాయ్ ఫ్రెండుతో గొడవపడిందని, గురువారం తెల్లవారుజామున ఆ గొడవ పెద్దది కావడంతో అబ్బాయితో పాటు అతని స్నేహితులు కలిసి ఆమెను చంపినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిపై హత్య, కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలిక కిడ్నాప్.. తండ్రి హత్య!
కలహండి: ఒడీషాలోని కలహండి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ పద్నాలుగేళ్ల గిరిజన బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. విడిపించడానికి వెళ్లిన తండ్రిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కలహండి జిల్లాలోని సనచెరగావ్ గ్రామానికి చెందిన దయానిధి మాఝి(50) కూతురు ఈ నెల 22 నుంచి కనిపించకుండా పోయింది. కూతురు కోసం వెతుకుతున్న దయానిధి.. సోమవారం కిడ్నాప్ చేసిన దుండగులను గుర్తించి విడిపించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో దుండగులు దయానిధిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానిక జిల్లా అసుపత్రిలో చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో దయానిధిని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం దయానిధి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి బాలిక కిడ్నాప్, తండ్రి హత్యలపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై దిలిప్ కుమార్ తెలిపాడు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. -
భారత మహిళలకు మరో ఓటమి
హాస్టింగ్స్: న్యూజిలాండ్‌లో జరుగుతోన్న హాక్స్‌బే కప్ టోర్నమెంట్లో భారత మహిళల హాకి జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ 1-2తేడాతో చైనా చేతిలో ఓడిపోయింది. తొలుత చైనా కన్నా ముందే 19వ నిమిషంలో రాణి చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన భారత్ 1-0 ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయింది. వెంటనే చైనా క్రీడాకారిణి యూ కియాన్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించడంతో స్కోరు 1-1తో సమమైంది. అయితే చివరి క్వార్టర్లో వాంగ్ మెంగ్యూ(85వ ని.) గోల్ చేయడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. దీనికి ముందు భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. -
వైద్యుడిని కొట్టి చంపేశారు
న్యూఢిల్లీ: స్వల్పవివాదానికే కొంతమంది వ్యక్తులు వైద్యుడిని కొట్టిచంపిన వైనం కలకలం రేపింది. ఢిల్లీకి చెందిన దంతవైద్యుడు డాక్టర్ పంకజ్ నారంగ్ (40) పై దాడిచేసిన కొంతమంది వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఇద్దరు బాల నేరస్తులు కూడా ఉన్నారు. దక్షిణ ఢిల్లీలోని వికాసపురి కాలనీలో గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం భారత్ బంగ్లా టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ తరువాత, నారంగ్ కుమారుడు బుధవారం రాత్రి ఇంటి బాల్కనీ లో క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి అటుగా వెళుతున్న నిందితులకు తగిలింది. అంతే వివాదం రాజుకుంది. అప్పటికి సద్దు మణిగిన వారు బైకు అక్కడే వదిలేసి పారిపోయారు. అనంతరం అర్థరాత్రి దాటిన తర్వాత దాదాపు 12 మందితో కలిసి కర్రలు, రాడ్లతో వైద్యుని ఇంటిపై దాడికి దిగారు. అడ్డొచ్చిన వారిని సైతం నెట్టివేసి, వైద్యుడిని బయటికి లాక్కొచ్చి విచక్షణరహితంగా కొట్టారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు చికిత్స నిమిత్తం వైద్యుడిని ఆసుపత్రికి తరలించినా, తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచాడు. డాక్టర్ నారంగ్‌కు భార్య, కొడుకు ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నజీర్ సహా అనుమానితులుగా నలుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు బాలనేరస్థులను గుర్తించారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి పుష్పేంద్రకుమార్ తెలిపారు. కేసు నమోదుచేశామని విచారణ కొనసాగుతుందన్నారు. -
వీళ్లు.. మనుషులా.. రాక్షసులా?
అలీగఢ్: పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాడనే నెపంతో ఓ వ్యక్తిని చితక్కొట్టారు. ఏమాత్రం జాలి, కరుణ దయ లేకుండా నిర్ధాక్షిణ్యంగా కిందపడేసి చావు దెబ్బలు కొట్టారు. ఇంత జరుగుతున్న అక్కడ చుట్టూఉన్నవారంతా తాఫీగా ప్రేక్షకులుగా చూస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూసిన ఈ వీడియో పలువురికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ వీడియోలో చూపించిన ప్రకారం ఓ యువకుడిని ముందుగా కిందపడేశారు. మరో వ్యక్తి అతడిని కదలకుండా పట్టుకోగా ఓ వ్యక్తి చేతిలో పెద్ద కర్ర తీసుకొని గొడ్డును బాదినట్లు బాదాడు. ఆ తర్వాత ఓ రాయి తీసుకొచ్చి కాళ్లపైన, ముఖంపైన అదే పనిగా దాడి చేశాడు. దీంతో ఆ యువకుడు సొమ్మసిల్లిపోయాడు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
దొంగల బీభత్సం.. ముగ్గురు హతం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దొంగలు రెచ్చిపోయారు. మాందాసౌర్ గ్రామంలో చోరీకి యత్నించిన వ్యక్తులను అడ్డుకోవడంతో ఆదివారం రాత్రి పెద్ద ఘర్షణ చోటుచేసుకుంది. తమను అడ్డుకున్న గ్రామస్తులపై దొంగలు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక పిల్లవాడు సహా, అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామస్తులు ముగ్గురు దొంగలను పట్టుకొని కొట్టిచంపారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు గ్రామంలో మోహరించారు. పోలీసు ఉన్నతాధికారులు అందించిన సమాచరం ప్రకారం.. మాందాసౌర్ గ్రామంలో దొంగతనానికి ఎగబడిన వ్యక్తులను గ్రామస్తులు గమనించారు. వారిని తీవ్రంగా ప్రతిఘటించడంతో రెచ్చిపోయిన దొంగలు కాల్పులకు పాల్పడ్డారు. బీభత్సం సృష్టించిన ఈ ఘటనలో అయిదుగురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒక పిల్లవాడు కూడా ఉండడంతో స్థానికులు సహనాన్ని కోల్పోయారు. దొంగలను పట్టుకొని తీవ్రంగా కొట్టడంతో ముగ్గురు దొంగలు అక్కడిక్కడే చనిపోయారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు నేరస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని ఎస్పీ మనోజ్ శర్మ తెలిపారు. గాయపడిన గ్రామస్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
వృద్ధుడిని కొట్టి చంపారు
లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని షామిలి జిల్లాలో దారుణం జరిగింది. స్వల్ప వివాదానికి దళిత వృద్ధుడిని కొట్టి చంపిన వైనం ఆందోళన రేపింది. మంగే రామ్ (60 )పై రోషన్, శేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో మాంగే రామ్ అక్కడిక్కడే చనిపోయాడు. అకారణంగా తన సోదరుడిని కొట్టి చంపారని మృతుడు సోదరుడు రామ్ నివాస్ ఆరోపించారు. అతని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. -
తోటి విద్యార్థిని కొట్టి చంపేశాడు..
చెన్నై: తమిళనాడులో తిరుపూర్ నగరంలోని ఒక పాఠశాల లో ఆరేళ్ల బాలుడిని తోటి విద్యార్థి కొట్టి చంపాడు. స్థానికులను షాక్‌కు గురి చేసిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సీనియర్ పోలీసు అధికారి అందించిన వివరాల ప్రకారం.... బుధవారం ఉదయం క్లాసులు ప్రారంభానికి ముందే స్కూలు ఆవరణలో ఒకటవ తరగతి విద్యార్థి శివరామ్, మరో విద్యార్థి(12 ) మధ్య ఘర్షణ జరిగింది. దీంతో చిన్నవాడైన శివరామ్‌ను తోటి విద్యార్థి కిందపడేసి దాడి చేశాడు. తీవ్రంగా కొట్టి గ్రౌండ్ నుంచి ఈడ్చుకుంటూ వెళ్లి భవనం వెనుక ఉన్న టాయిలెట్లో పడేశాడు. అక్కడితో ఆగిపోలేదు. శివరామ్ తలని అక్కడున్న పెద్ద రాయికేసి కొట్టి బాదాడు. రక్తమోడుతున్న ఆ బాలుడిని అలాగే వదిలేసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో శివరామ్, అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. దీన్నిగమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయుడికి సమాచారం అందించారు. శివరామ్ ను తిరుపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఈ మొత్తం సంఘటనను 11 ఏళ్ల అమ్మాయి తరగతి కిటికీలో నుంచి చూడడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆ బాలిక అందించిన సమాచారం ఆధారంగా పోలీస్ కమిషనర్ ఆధ్యర్వంలో పాఠశాలలో ప్రాథమిక విచారణ నిర్వహించారు. అనంతరం హత్యకేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడిపై సెక్షన్ 302 (హత్య) కింద అభియోగాలను నమోదు చేసి జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచారు. ఈ సంఘటన తరువాత పాఠశాలకు కొద్ది రోజులు సెలవులు ప్రకటించినట్టు సమాచారం. -
సిగ్గు... సిగ్గు...
► నాలుగో వన్డేలో భారత్ అనూహ్య పరాజయం ► 25 పరుగులతో ఆసీస్ గెలుపు ► పనికి రాని కోహ్లి, ధావన్ సెంచరీలు ► ఆఖరి వన్డే శనివారం 76 బంతుల్లో చేయాల్సిన పరుగులు 72, రన్‌రేట్ ఆరుకంటే తక్కువ, చేతిలో 9 వికెట్లు...ఈ స్థితిలో ఏ జట్టయినా మ్యాచ్ ఓడిపోతుందా..! పటిష్ట జట్లతో తలపడినా పసి కూనలు కూడా సంచలనం కోసం పట్టుదలగా ఆడతాయి. కానీ భారత స్టార్ బ్యాట్స్‌మెన్ మాత్రం బొక్కబోర్లా పడిపోయారు. 46 పరుగుల వ్యవధిలో అన్ని వికెట్లూ చేజార్చుకొని ఓటమిని కావలించుకున్నారు. ఫించ్ సెంచరీ, వార్నర్ మెరుపులతో ఆస్ట్రేలియా ఏకంగా 349 పరుగుల కొండలాంటి లక్ష్యం భారత్ ముందుంచింది. ఫామ్‌లోకి వచ్చిన ధావన్, ఫామ్ అంటిపెట్టుకునే ఉన్న కోహ్లి శతకాల మోతతో స్కోరును 277 పరుగుల దాకా తెచ్చాక ఇక గెలుపు ఖాయమనిపించింది. కానీ భారత్ చేతకానితనం, ఆసీస్ పోరాటం కలిసి ఫలితాన్ని మనకు వ్యతిరేకంగా మార్చి పడేశాయి. కాన్బెర్రా: కచ్చితంగా గెలుస్తారనుకున్న మ్యాచ్‌లో ధోని సేన భంగపడింది. గత మూడు వన్డేలలో 300 పరుగుల స్కోరును కాపాడుకోలేకపోయిన టీమిండియా ఈసారి అంతకంటే భారీ స్కోరును ఛేదించే ప్రయత్నం చేసినా... చివరకు ఓటమి తప్పలేదు. బుధవారం ఇక్కడి మనుకా ఓవల్ మైదానంలో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 25 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (107 బంతుల్లో 107; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా, డేవిడ్ వార్నర్ (92 బంతుల్లో 93; 12 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో చేజార్చుకున్నాడు. ఇషాంత్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 49.2 ఓవర్లలో 323 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (113 బంతుల్లో 126; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (92 బంతుల్లో 106; 11 ఫోర్లు, 1 సిక్స్) శతకాలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 177 బంతుల్లోనే 212 పరుగులు జోడించడం విశేషం. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేన్ రిచర్డ్సన్ (5/68) కీలక వికెట్లు తీసి భారత్‌ను పడగొట్టాడు. తాజా ఫలితంతో సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యం 4-0కు చేరగా... చివరి వన్డే శనివారం జరుగుతుంది. ఆసీస్‌కు శుభారంభం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్, ఫించ్ శుభారంభం ఇచ్చారు. భువనేశ్వర్ వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు బాదిన వార్నర్... ఉమేశ్ వేసిన తర్వాతి ఓవర్లో మరో మూడు బౌండరీలు కొట్టాడు. కొద్ది సేపటికి జడేజాకు కూడా ఇదే ఫలితాన్ని అతను రుచి చూపించాడు. మరో వైపు ఫించ్ కూడా జోరు పెంచాడు. భువీ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 16 పరుగులు రాబట్టాడు. చివరకు వార్నర్‌ను ఇషాంత్ బౌల్డ్ చేయడంతో ఈ భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మరోవైపు 97 బంతుల్లో ఫించ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్మిత్ (29 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఇదే జోరును కొనసాగించాడు. స్మిత్, మిషెల్ మార్ష్ (33) కలిసి 7 ఓవర్లలో 67 పరుగులు జత చేశారు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ (20 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) తనదైన శైలిలో చెలరేగడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ఇషాంత్ వేసిన 50వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 18 పరుగులు కొల్లగొట్టడం విశేషం. ఆస్ట్రేలియా చివరి 10 ఓవర్లలో 111 పరుగులు చేసింది. చెలరేగిన ధావన్, కోహ్లి ఆసీస్ స్పిన్నర్ లయోన్‌తో బౌలింగ్ ప్రారంభించగా భారత్ అతని 2 ఓవర్లలోనే 23 పరుగులు రాబట్టి మెరుపు ఆరంభం చేసింది. మరోసారి ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రిచర్డ్సన్ ఓవర్లో 2 సిక్సర్లు, ఫోర్ బాది అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఈ దశలో జత కలిసిన ధావన్, కోహ్లి ఆసీస్ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్నారు. చక్కటి షాట్లు ఆడుతూ, అవసరమైన చోట ధాటిని పెంచుతూ, బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయారు. 92 బంతుల్లోనే ఈ భాగస్వామ్యం వంద పరుగులకు చేరింది. ఈ క్రమంలో ముందుగా 92 బంతుల్లో ధావన్ సెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత కోహ్లి 84 బంతుల్లో ఆ మైలురాయిని అందుకున్నాడు. అనంతరం భారత్ పతనానికి ధావన్ వికెట్‌తో హేస్టింగ్స్ శ్రీకారం చుట్టాడు. ఆ దశలో... 37.2 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు 277/1...తర్వాతి బంతిని కట్ చేయబోయి బ్యాక్వర్డ్ పాయింట్లో ధావన్ క్యాచ్ ఇచ్చాడు. అయితే మరో మూడు బంతులకు ధోని (0) అవుట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వికెట్‌కు దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి ధోని కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. మరో పరుగు తర్వాత అనవసరపు షాట్‌కు ప్రయత్నించి కోహ్లి మిడాఫ్‌లో ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను స్మిత్ అందుకోవడంతో ఆ జట్టులో ఉత్సాహం పెరిగింది. అంతే...ఆ తర్వాత ఆస్ట్రేలియా మరో అవకాశం ఇవ్వకుండా భారత్ ఇన్నింగ్స్‌ను చుట్టేసింది. ‘తప్పనిసరి’ అయితేనే బరిలోకి దిగుతానని చెప్పిన రహానే (2) క్రీజ్‌లోకి రాక తప్పలేదు. అయినా అతనూ ఓటమిని తప్పించలేకపోయాడు. 18ఆస్ట్రేలియాకు సొంతగడ్డపై ఇది వరుసగా 18వ విజయం. 4 వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి నాలుగో స్థానానికి (25 సెంచరీలు) చేరుకున్నాడు. సచిన్ (49), పాంటింగ్ (30), జయసూర్య (28) అతనికంటే ముందుండగా...సంగక్కర కూడా 25 సెంచరీలే చేశాడు. నిర్లక్ష్యానికి పరాకాష్ట! ఏ ఆటలో అయినా గెలుపోటములు సహజం. భారత జట్టు క్రికెట్ మ్యాచ్ ఓడిపోవడం ఇవాళ కొత్తేం కాదు. ఆ మాట కొస్తే ఆస్ట్రేలియాలో వారం రోజుల్లో మూడు వన్డేలు ఓడిపోయారు. సిరీస్ ఓడిపోయిన తర్వాత నాలుగో మ్యాచ్ గెలిస్తే ఎంత? గెలవకపోతే ఎంత? కానీ సగటు భారత క్రికెట్ అభిమాని ఎవరైనా సరే ఈ మ్యాచ్ చూస్తే బాధతో తల్లడిల్లిపోతాడు. కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న అభిమాని ఆనందాన్ని కేవలం అరగంటలో ఆవిరి చేశారు. రోహిత్ శర్మ సంచలన షాట్లతో అద్భుతమైన ఆరంభాన్ని అందించాక... శిఖర్ ధావన్, కోహ్లి తమ కెరీర్లోనే గుర్తుంచుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరూ షాట్లు ఆడిన తీరు చూస్తే లక్ష్యం నాలుగొందలైనా ఊదిపారేయొచ్చని అనిపించింది. 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 37వ ఓవర్ ముగిసేసరికి 274 పరుగులు చేసింది. అంటే ఇక 78 బంతుల్లో 75 పరుగులు చేస్తే గెలుస్తాం. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో మ్యాచ్ పోగొట్టుకునే జట్టు ఏదీ ఉండదేమో. ఫామ్‌లో ఉన్న రహానే గాయం కారణంగా బ్యాటింగ్ చేస్తాడో లేదో తెలియని స్థితి. అందుకే కోహ్లి, ధావన్‌ల అద్భుత భాగస్వామ్యం చూస్తే ముచ్చటేసింది. కానీ బాగా ఆడుతున్న సమయంలో ఏదో ఒక తిక్క షాట్ ఆడి అవుటవ్వడం ధావన్‌కు కొత్తేం కాదు. ఈసారి కూడా అదే చేశాడు. విజయం సాధించేశామనే ధీమాతో నిర్లక్ష్యపు షాట్ ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ షాట్లు ఆడతారా? ఆస్ట్రేలియా క్రికెటర్లకు చిన్న అవకాశం దొరికితే మ్యాచ్‌ను లాగేసుకుంటారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ తరఫున ఉత్తమ బౌలర్ హేస్టింగ్స్. తన చివరి ఓవర్లో ధావన్‌తో పాటు ధోనిని కూడా అతను ఆఖరి బంతికి అవుట్ చేశాడు. నిజానికి ఈ ఓవర్ తర్వాత ఆస్ట్రేలియా ఎవరితో బౌలింగ్ చేయించాలో కూడా తెలియని స్థితి. కానీ ధోని అత్యంత నిర్లక్ష్యంగా ఆడి అవుటయ్యాడు. ఇప్పటికే తప్పుకోవాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈ షాట్ తన కెరీర్ ముగింపును మరింత వేగవంతం చేసినా ఆశ్చర్యం లేదు. ఇక ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే కోహ్లి కూడా పేలవంగా ఆడి అవుటయ్యాడు. అప్పటివరకూ ఒక్క చిన్న తప్పు కూడా లేకుండా కచ్చితమైన షాట్లు ఆడిన కోహ్లి... ఇలాంటి లూజ్ షాట్ ఆడతాడని కనీసం ఊహించలేం. కెప్టెన్‌కే బాధ్యత లేనప్పుడు నాకెందుకు అనుకున్నాడా? లేక దురదృష్టమా? దీనికి సమాధానం కోహ్లి ఒక్కడికే తెలుసు. రాత్రికి రాత్రే హీరోలు కాలేరు రవీంద్ర జడేజా ఇటీవల కాలంలో నిలకడగా ఆడుతున్న బ్యాట్స్‌మెన్. అనుభవం కూడా ఉంది. అందుకే అతను జాగ్రత్తగా ఒక ఎండ్‌లో నిలబడ్డాడు. రహానే కనీసం బ్యాట్ పట్టుకునే స్థితిలో లేకపోయినా వచ్చి ఆడినందుకు అభినందించాలి. కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్య నాలుగు కుట్లు పడ్డా... పెయిన్ కిల్లర్ తీసుకుని వచ్చి ఆడాడు. కాబట్టి అతని నుంచి పెద్దగా ఆశించడం కూడా తప్పు. కానీ గుర్కీరత్, రిషి ధావన్ అనే ఇద్దరు కొత్త క్రికెటర్లు మాత్రం దారుణంగా నిరాశపరిచారు. ఇద్దరిలోనూ మంచి నైపుణ్యం ఉంది. దేశవాళీ క్రికెట్లో అద రగొట్టారు. క్రీజులోకి వచ్చాక చక్కటి షాట్లతో చెరో బౌండరీ కూడా కొట్టారు. సింగిల్స్ తీసి జడేజాకు స్ట్రయికింగ్ ఇస్తే పని పూర్తయ్యేది. కానీ రాత్రికి రాత్రే హీరోలు కావాలనే తపనేమో... భారీ షాట్ల కోసం ప్రయత్నించి అవుటయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా ఆడే కుర్రాళ్లకు భారత జట్టులో చోటు కల్పించడం కూడా అనవసరం. ‘తోక’కు ఏమైందో... టి20 క్రికెట్... ముఖ్యంగా ఐపీఎల్ వచ్చాక బౌలర్లంతా నెట్స్‌లో కొద్దిసేపైనా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సెంచరీలు బాదిన బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్‌లు కూడా ఏ మాత్రం తెలివి చూపించలేదు. అందరూ భారీ షాట్లకే వెళ్లారు. ఫలితం ఓ ఎండ్‌లో జడేజా బొమ్మలా నిలబడిపోయాడు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే ఏ క్రికెటర్ అయినా బాధ్యతగా ఆడాలి. ‘ఇలాగే ఆడు’ అని ఎవరూ బొట్టుపెట్టి చెప్పరు. ఓ ఎండ్‌లో టపటపా వికెట్లు పడుతుంటే కనీసం జడేజా వెళ్లి ఎవరినీ గైడ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్, డెరైక్టర్ ఏమైనా చెప్పారో లేదో తెలియదు. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో కేవలం 25 పరుగుల తేడాతో ఓడిపోవడం పెద్ద విషయంలా కనిపించకపోవచ్చు. కానీ ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు ఆడిన తీరు... నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇటీవలి కాలంలోనే అత్యంత చెత్త ప్రదర్శన. పూర్తిగా బాధ్యతారాహిత్యం. -సాక్షి క్రీడావిభాగం స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఇషాంత్ 93; ఫించ్ (సి) ఇషాంత్ (బి) ఉమేశ్ 107; మార్ష్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 33; స్మిత్ (సి) గుర్కీరత్ (బి) ఇషాంత్ 51; మ్యాక్స్‌వెల్ (సి) (సబ్) పాండే (బి) ఇషాంత్ 41; బెయిలీ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 10; ఫాల్క్‌నర్ (బి) ఉమేశ్ 0; వేడ్ (రనౌట్) 0; హేస్టింగ్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 348. వికెట్ల పతనం: 1-187; 2-221; 3-288; 4-298; 5-319; 6-319; 7-321; 8-348. బౌలింగ్: ఉమేశ్ 10-1-67-3; భువనేశ్వర్ 8-0-69-0; ఇషాంత్ 10-0-77-4; గుర్కీరత్ 3-0-24-0; రిషి ధావన్ 9-0-53-0; జడేజా 10-0-51-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వేడ్ (బి) రిచర్డ్సన్ 41; శిఖర్ ధావన్ (సి) బెయిలీ (బి) హేస్టింగ్స్ 126; కోహ్లి (సి) స్మిత్ (బి) రిచర్డ్సన్ 106; ధోని (సి) వేడ్ (బి) హేస్టింగ్స్ 0; గుర్కీరత్ (సి) (సబ్) షాన్‌మార్ష్ (బి) లయోన్ 5; జడేజా (నాటౌట్) 24; రహానే (సి) స్మిత్ (బి) రిచర్డ్సన్ 2; రిషి ధావన్ (సి) వార్నర్ (బి) రిచర్డ్సన్ 9; భువనేశ్వర్ (సి) స్మిత్ (బి) రిచర్డ్సన్ 2; ఉమేశ్ (సి) బెయిలీ (బి) మార్ష్ 2; ఇషాంత్ (సి) వేడ్ (బి) మార్ష్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 323. వికెట్ల పతనం: 1-65; 2-277; 3-277; 4-278; 5-286; 6-294; 7-308; 8- 311; 9-315; 10-323. బౌలింగ్: లయోన్ 10-0-76-1; రిచర్డ్సన్ 10-1-68-5; హేస్టింగ్స్ 10-2-50-2; ఫాల్క్‌నర్ 7-0-48-0; మార్ష్ 9.2-0-55-2; మ్యాక్స్‌వెల్ 1-0-10-0; స్మిత్ 2-0-16-0. -
తెరపైకొచ్చిన మరో బీఫ్ వివాదం
భోపాల్: 'బీఫ్' వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో ఓ ముస్లింజంటపై గో రక్షణ సమతి సభ్యులు దాడికి దిగడం ఆందోళన రేపింది. బ్యాగులో బీఫ్ ఉందని ఆరోపిస్తూ రైల్లో ప్రయాణిస్తున్న ముస్లిం దంపతులపై సమితి కార్యకర్తలు దాడి చేసి ఘోరంగా అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని హర్డా జిల్లాలో ఖిర్కియా రైల్వే స్టేషన్లో ఈనెల 13న ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మహమ్మద్ హుస్సేన్ (43), అతని భార్య నసీమ్ బానో (38) కుషినగర్ ఎక్స్‌ప్రెస్ లో తమ సొంత గ్రామం హర్దాకి బయలుదేరారు. ఇంతలో కొంతమంది కార్యకర్తలు రైల్లోకి చొరబడి ఈ దంపతుల బ్యాగులను తనిఖీ చేయడం మొదలు పెట్టారు. దీన్నిఅడ్డుకున్న నజీమాను నెట్టేశారు. ఆవుమాంసం వున్న బ్యాగ్ ఏదంటూ గలాటా సృష్టించారు. అక్రమంగా గోమాంసం తీసుకెడుతున్నావంటూ ఆరోపించారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించిన తోటి ప్రయాణికులు కూడా అడ్డుకున్నారు. దీంతో వారు మరింత రెచ్చిపోయి ఆ దంపతులను చావ బాదారు. వారి బ్యాగులను విసిరి పారేశారు. చివరికి రైల్వే పోలీస్ ను కూడా తోసేసి బీభత్సం సృష్టించారు. ఒక నల్లబ్యాగును దొరకబుచ్చుకుని అందులో గో మాంసం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు హుస్సేన్ కూడా తమ బంధువులకు సమాచారం అందించాడు. రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఖిర్కియా రేల్వే స్టేషన్ లో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. సుమారు పదిహేనుమంది ప్లాట్ ఫాం దగ్గరకు చేరుకోని సమితి సభ్యులను ప్రశ్నించడంతో ఘర్షణ వాతారణం నెలకొంది. దీంతో రంగంలోకి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పరీక్షల నిమిత్తం బ్యాగును ల్యాబ్ కు పంపారు. అయితే సదరు బ్యాగులో గో మాంసం లేదని పరీక్షల్లో తేలిందని పోలీసు అధికారి తెలిపారు. ముస్లిం జంట ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజపుత్, సంతోష్ ను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసామని, మరో అయిదుగురి కోసం గాలిస్తున్నామన్నారు. మరోవైపు గుర్తు తెలియని బ్యాగ్ యజమానులపై కూడా కేసులు నమోదు చేశారు. తన భార్యను విచక్షణా రహితంగా కొట్టుకుంటూ తోసేసారని, అడ్డుకున్న తనపై దాడిచేశారని మొహమ్మద్ వాపోయాడు. తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారన్నాడు. వారు చెపుతున్న బ్యాగు తమది కాదని హుస్సేన వాదిస్తున్నాడు. కాగా బీఫ్ తింటున్నాడనే ఆరోపణలతో ఓ ముస్లింవ్యక్తిని కొట్టి చంపిన 'దాద్రి' ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. -
కన్నబిడ్డపై తల్లిదండ్రుల కర్కశత్వం
-
తరగతి గదిలో మూత్రం పోసిందని...
-
మహిళపై పోలీసుల దాష్టీకం
సాక్షి, విజయవాడ: రాత్రిపూట ఇంటికెళ్తున్న మహిళపై విజయవాడ నగర కమిషనరేట్ పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. మద్యం సేవించి గలాటా చేస్తోందంటూ చితకబాది కేసు నమోదు చేశారు. తనకు అన్యాయం జరిగిందని కమిషనర్‌కు చెప్పడానికి వెళ్తే మరోసారి ఆమెను తీవ్రంగా కొట్టారు. దీంతో బాధిత మహిళ గాయాలతోనే విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల సహకారంతో ఏసీబీ న్యాయమూర్తికి ఫిర్యాదు చేసింది. న్యాయమూర్తి కేసును విచారణకు స్వీకరించి ఈ నెల 26కు వాయిదా వేశారు. వైద్యం చేయించుకోవాలని, ఆమెకు చేసిన ట్రీట్మెంట్ రికార్డులు కోర్టుకు సమర్పించాలని వైద్యులను ఆదేశించారు. ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ప్రాంగణంలో విలేకరులకు వివరించింది. రాత్రిపూట వెళ్తుంటే చితకబాదారు: విజయవాడలోని రామలింగేశ్వరనగర్‌లోని రఘురోడ్డులో తాను నివాసముంటున్నానని బాధిత మహిళ తెలిపింది. ఈ నెల 22న రాత్రి 11 గంటలకు పడమటలోని ఓ కల్యాణ మండపంలో పని చేసుకొని ఇంటికి వెళ్లేందుకు అక్కడి బస్టాండ్ వద్దకు చేరుకున్నానని, ఈ క్రమంలో నలుగురు యువకులు తనను అనుసరించారని తెలిపింది. విషయాన్ని అక్కడే నైట్‌డ్యూటీ విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లకు తెలుపగా.. పడమట ఎస్ఐ మోహన్‌రావు వస్తున్నారని అక్కడే ఉండాలని చెప్పారంది. ఎస్ఐ వచ్చి తనను అనుసరించిన యువకుల్ని విచారించి పంపించారని, అనంతరం తనను స్టేషన్‌కు తరలించి చితకబాది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వెళ్లిపొమ్మన్నారని తెలిపింది. దీనిపై నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడానికి కమిషనరేట్‌కు వెళ్లగా అక్కడి సిబ్బంది వెనక్కు పంపేశారంది. అనంతరం ఆస్పత్రికి వెళితే గేటు వద్ద ఎస్ఐ మోహన్‌రావు, ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుకొని బలవంతంగా జీపులో ఎక్కించి రామవరప్పాడు రింగ్ వద్ద మళ్లీ కొట్టి బలవంతంగా మందు తాగించి తప్పుడు కేసు పెట్టినట్లు బాధితురాలు వివరించింది. ఆమె ఓ వ్యభిచారిణి: దామోదర్, పడమట సీఐ ఆ మహిళ ఓ వ్యభిచారిణి. ఆమె గురించి రామలింగేశ్వరనగర్లో విచారిస్తే ఎవరైనా చెబుతారు. పడమట సెంటర్లో మద్యం సేవించి గలాటా సృష్టిస్తుంటే మా ఎస్ఐ వెళ్లి స్టేషన్‌కు తీసుకువచ్చి సెక్షన్ 294 కింద వ్యభిచారం కేసు నమోదు చేశారు. మా సిబ్బంది ఆమెను కొట్టి గాయపర్చలేదు. ఇదంతా ఆమె కావాలనే చేస్తోంది. -
పోకిరోడికి చెప్పుతో గుణపాఠం చెప్పిన మహిళ
-
దొంగ అనుకొని మూగవాడిని చంపేశారు
మదనపల్లె (చిత్తూరు) : రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మూగ యువకుడిని దొంగ అనే నెపంతో స్థానికులు కొట్టిచంపారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలోని రంగనాథ పెట్రోల్ బంక్ వెనుక భాగంలో జరిగింది. స్థానికంగా నివాసముంటున్న షేక్ చాంద్‌పాషా (24) లారీ క్లీనర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి తన అక్క ఇంటికి వెళ్లి వస్తున్న సమయంలో కొందరు స్థానికులు అడ్డుకొని ఎక్కడికి వెళ్లి వస్తున్నావని ప్రశ్నించారు. అతడు మూగవాడు కావడంతో సమాధానం చెప్పలేదు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు అతడిపై విరుచుకుపడ్డారు. మూగవాడు అనే విషయం తెలియక, అతన్ని దొంగగా భావించి తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక అతను మృతిచెందాడు. విషయం తెలుసుకున్న చాంద్‌పాషా తండ్రి అన్వర్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో మహిళలు కూడా పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పోలీసులే కొట్టి, నగ్నంగా ఊరేగించారు..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని దన్కౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. తమ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయటానికి వెళ్లిన ఓ దళిత కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. యూపీ రాజధాని లక్నోకు కూతవేటులో దూరంలోనే ఈ అమానుషం చోటు చేసుకుంది. ఆ దళిత దంపతుల పట్ల పోలీసులు అతి కిరాతకంగా ప్రవర్తించారు. స్టేషన్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చి... నడి రోడ్డు మీద వారిపై తమ ప్రతాపం చూపారు. వారిని వివస్త్రలను చేసి చితకబాదిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణాన్ని ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో చిత్రీకరించి ఆన్లైన్లో పెట్టడంతో.. పోలీసుల వైఖరిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని దన్కౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సునీల్ గౌతమ్ అనే వ్యక్తి ఇంట్లో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. ఆ విషయంపై ఫిర్యాదు చేయడానికి అతడు తన భార్య, మరి కొందరు బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే విధుల్లో ఉన్న స్టేషన్ ఆఫీసర్ ప్రవీణ్ యాదవ్ కేసు నమోదు చేయడానికి నిరాకరించాడు. అంతేకాకుండా వారిపట్ల నిర్లక్ష్యంగా , అవహేళనగా మాట్లాడాడు. దీంతో తమ ఫిర్యాదును స్వీకరించి... కేసు నమోదు ఎందుకు చేయరో చెప్పాలని సునీల్ తదితరులు ఆ పోలీస్ అధికారిని నిలదీశారు. అంతే.... ఖాకీ అధికారికి ఎక్కడలేని కోపమొచ్చింది. నన్నే ఎదిరించి మాట్లాడతావా అంటూ చెలరేగిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోతూ వారిపై దాడికి దిగాడు. స్టేషన్లో ఉన్న మరికొందరు ఖాకీలు ఆ అధికారికి తోడయ్యారు. పోలీసులందరూ కలిసి ఒక్కసారిగా సునీల్ కుటుంబ సభ్యులు, బంధువులపై దాడి చేసి.... వారిని కొట్టుకుంటూ రోడ్డు మీదికి ఈడ్చుకొచ్చారు. అంతేకాకుండా సభ్య సమాజం నివ్వెరపోయేలా దారుణానికి ఒడిగట్టారు. అంతా చూస్తుండగానే చేతిలో చంటిబిడ్డతో ఉన్న సునీల్ భార్య చీరను లాగి పడేశారు. ఈ చర్యను అడ్డుకున్నవారిని చితక్కొట్టారు. అడ్డుపడిన సునీల్ బట్టలను కూడా చించేశారు. ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసులు అంతటితో ఊరుకోకుండా సునీల్ పై, అతని భార్య, బంధువులపై క్రిమినల్ కేసులు బనాయించినట్టు సమాచారం. అటు ఒక్క పక్క చంటిబిడ్డను, మరోపక్క తన దేహాన్ని, ఇంకో పక్క తన భర్తను కాపాడుకోవడానికి ఆ దళిత మహిళ పడిన ఆరాటం ..చేసిన పోరాటం ఇపుడు సోషల్ మీడియాలో పలువురిని దిగ్భ్రాంతికి, విస్మయానికి గురి చేసింది. షేమ్ ఇండియా అంటూ విరుచుకుపడుతున్నారు. ఒక పసిబిడ్డ తన అమ్మానాన్నల అభిమానాన్న, గౌరవాన్ని కాపాడిందంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇదేనా మన డిజిటల్ ఇండియా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై యూపీ సర్కారు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలకు భిన్నంగా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయని పేర్కొంది. మరోవైపు బాధితుడు సునీల్ కూడా పోలీసుల చర్యను నిరసిస్తూ తామే నగ్నంగా మారి నిరసన తెలియ చేశామని తెలిపినట్టు తెలుస్తోంది. -
విద్యార్థినిలపై ఖాకీల దాష్టీకం
జైపూర్: విద్యా బుద్ధులు చెప్పడానికి ఉపాధ్యాయులు కావాలని అడిగిన పాపానికి పదవ తరగతి విద్యార్థినిలపై ఖాకీలు దాష్టీకాన్ని ప్రదర్శించారు. వీధి రౌడీల్లా బాలికల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. రాజస్థాన్ లోని మారు మూల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 14 , 16 ఏళ్ల బాలికలపై స్థానిక పోలీసులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. టాంక్ జిల్లా చురు గ్రామంలోని సెంకండరీ స్కూల్లో 10వ తరగతి చదువుకునే సుమారు 300 మంది విద్యార్థులకు గాను కేవలం ఏడుగురే ఉపాధ్యాయులు ఉన్నారు. దీంతో రానున్న పబ్లిక్ పరీక్షల్ని ఎలా ఎదుర్కోవాలనే ఆవేదనతో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. టీచర్లను నియమించాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సెప్టెంబర్ 29న దాదాపు వందమంది విద్యార్థినులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు విచక్షణారహితంగా ఆందోళన చేస్తున్న బాలికలపై విరుచుకుపడ్డారు. నోటికొచ్చిన బూతులు తిడుతూ బూటు కాళ్లతో తొక్కారు. లాఠీచార్జి చేసి విద్యార్థినిలను లాగి పడేశారు. అంతటితో ఖాకీల ప్రకోపం చల్లారలేదు. సారా ప్యాకెట్లను అమ్మాయిల మీదకు విసిరి వికృతంగా ప్రవర్తించారు. అనంతరం కొంతమంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేశారు. విద్యార్థినులు రెచ్చగొట్టారనే అరోపణలతో కేసులు పెట్టారు. ఖాకీ క్రౌర్యంపై మీడియా ముందు విద్యార్థినులు బావురుమన్నారు. తమను ఘోరంగా అవమానించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బూటు కాళ్లతో తొక్కడం మూలంగా ఇప్పటికీ నడవలేకపోతున్నానని మరో విద్యార్థిని వాపోయింది. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తమకు టీచర్లు కావాలని అడిగామన్నారు. ఉపాధ్యాయులు లేకపోతే పదవతరగతి పరీక్షలు ఎలా రాయాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉదంతంపై మానవ హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు స్పందించాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై అక్రమ కేసులు బనాయించడంపై మండిపడ్డారు. కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘ నేత కవిత శ్రీవాస్తవ సంబంధిత పోలీస్ ఆఫీసర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు విద్యార్థినిలపై లాఠీచార్జి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని జిల్లా కలెక్టర్ రేఖా గుప్త ప్రకటించారు. -
కిందపడేసి కొడుతూ కాలితో తన్ని.. ఉమ్మేశాడు
రియాద్: సౌదీ అరేబియాలో ఓ భారతీయుడిపై దాడి జరిగింది. విచక్షణ రహితంగా ఓ అరబ్ ఇంజినీర్ చేసిన ఈ దాడిని పలువురు ఖండించగా అతడిపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చి పలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. మక్కా మసీదు ప్రాంతంలో ఓ నిర్మాణం విస్తరణకు సంబంధించిన పనులను అరబ్ దేశానికి చెందిన ఇంజినీర్ భారతీయుడికి అప్పగించాడు. అయితే, తాను నిర్ణయించిన సమయానికి పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఇంజినీర్ ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణ రహితంగా భారతీయ యువకుడిపై దాడి చేశాడు. కిందపడేసి కొడుతూ కాలితో తన్ని ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా అతడిపై ఉమ్మి కూడా వేశాడు. రెండు నిమిషాలపాటు రికార్డయిన ఈ వీడియోను ఓ కెనడా జర్నలిస్టు తారేక్ ఫతా తన ఫేస్బుక్ పేజీలో పెట్టాడు. దీంతో ఆ వీడియో బయటకు వచ్చి ఆ ఇంజినీర్ నిర్వాకంపట్ల విమర్శలు వచ్చాయి. సౌదీకి చెందిన కార్మిక శాఖ డైరెక్టర్ జనరల్ ఘటన స్థలికి వెళ్లి వివరాలు సేకరించి దర్యాప్తుకు ఆదేశించారు. అయితే, ఆ ఇంజినీర్ మాత్రం బాధితుడికి క్షమాపణలు చెప్పాడని, దర్యాప్తు మాత్రం చట్ట ప్రకారం జరుగుతుందని చెప్పారు.