ఆడపిల్ల పుట్టిందని అమానుషం | Woman brutally beaten by hockey stick by brother-in-law, allegedly for giving birth to a girl, over dowry | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల పుట్టిందని అమానుషం

Published Sat, Jul 15 2017 10:57 AM | Last Updated on Fri, May 25 2018 12:54 PM

ఆడపిల్ల పుట్టిందని అమానుషం - Sakshi

ఆడపిల్ల పుట్టిందని అమానుషం

పంజాబ్: ఆడపిల్ల పుట్టిందనే నెపంతో అమానుషానికి పాల్పడిందో కుటుంబం. సమీప బంధువు, మరో వ్యక్తి ఓ మహిళపై హాకీ స్టిక్స్‌తో విచక్షణారహితంగా దాడి చేయడం ఆందోళన రేపుతోంది.  పంజాబ్‌లోని పాటియాలాలో  ఈ దారుణం చోటుచేసుకుంది.  బహిరంగంగా ఆమెపై ఆ దుర్మార్గులు దారుణంగా దాడి చేస్తోంటే,  అడ్డుకునేందుకు  ఎవరూ ముందుకు రాలేదు.   ఇపుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

తాజా నివేదికల ప్రకారం మీనా కశ్యప్‌, దల్జీత్‌ సింగ్‌ కు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. పెళ్లి అయన దగ్గర్నుంచి  అత్తింటివారు మీనాను కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఈ  వేధింపులు  మితిమీరడంతో మీనా, దల్జీత్‌ వేరు  కాపురముంటున్నారు. ఇంతలో మీనా ఈ  మధ్యనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  అంతే దీన్ని సాకుగా చేసుకున్న ఆ కుటుంబం మరింత రెచ్చిపోయింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ దల‍్జీత్‌ సోదరుడు, అతని స్నేహితుడు ఆమెను హాకీస్టిక్‌లతో  అతి దారుణంగా కొట్టారు. హృదయ విదారకంగా అరిచి గగ్గోలు పెడుతున్నా ..ఎంత  వేడుకున్నా వదిలిపెట్టలేదు.   సోషల​ మీడియాలో వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను  అరెస్టు చేశారు.  ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.   దర్యాప్తు జరుగుతోందని  పోలీసులు తెలిపారు.
ఈ విషయమే గత ఏడాదిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని ,కానీ ఎలాంటి ఫలితంలేదని మీనా తండ్రి వాపోయారు.  రూ.7లక్షల కట్నాన్ని డిమాండ్‌ చేశారని  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement