brother-in-law
-
బావమరిది కళ్లలో ఆనందం కోసం..!
మార్కాపురం రూరల్: బావమరిది కళ్లలో ఆనందం కోసం ప్రభుత్వ నిధులతో బావ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం మార్కాపురం ప్రాంతంలో వివాదాస్పదమైంది. మండలంలోని దరిమడుగు గ్రామానికి చెందిన ఒక టీడీపీ నేత ఏకంగా 10 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో బావమరిది ఇంటి వరకూ రోడ్డు వేయిస్తున్నాడు. ఇప్పటికే మట్టిరోడ్డు తవ్వి కంకరచిప్స్ వేశారు. రేపోమాపో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిచేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు గ్రామస్తులు, టీడీపీ గ్రామ కార్యకర్తలు సైతం ఆశ్చర్యం,. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్‌రోడ్డు నుంచి సరిగ్గా బావమరిది ఇంటివరకూ రోడ్డు ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ టీడీపీ నేత వ్యవహారశైలితో ఆ గ్రామంతో పాటు టీడీపీ మండల నాయకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పంచాయతీలో ఎస్సీకాలనీతో పాటు గ్రామంలో పలు అంతర్గత రోడ్లు అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ పంచాయతీలోనే ఉన్న ఆటోనగర్‌లో రోడ్లు లేక డ్రైవర్లు, వాహనాల యజమానులు, కార్మికులు అవస్ధలు పడుతున్నారు. ఇవన్నీ ఆ టీడీపీ నేతకు కనిపించడం లేదా..? అని గ్రామస్తులతో పాటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే మండిపడుతున్నారు. బావమరిది కోసం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో సుమారు 200 మీటర్ల రోడ్డు నిర్మిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పలు ఎస్సీకాలనీల ప్రజలు సమస్యలతో సతమతమవుతుండగా, బావమరిది కోసం ప్రభుత్వ నిధులతో టీడీపీ నేత రోడ్డు నిర్మించడం తీవ్రస్థాయిలో విమర్శలకు తావిస్తోంది. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. -
మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని మరదలుకు చెప్పి
వేములవాడ అర్బన్: రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని.. ఇప్పుడు మోసం చేశాడని యువతి మేనబావ ఇంటి ఎదుట బైఠాయించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌కు చెందిన తన మేనబావ ఎదురుగట్ల రాము అదేకాలనీలో నివసిస్తున్న తన మేనమామ కూతురు గౌతమిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. రెండేళ్లుగా ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించాడని ఆ యువతి వాపోయింది. తన తల్లిమాటలు విని తప్పించుకు తిరుగుతున్నాడని గౌతమి ఆవేదన చెందింది. చదవండి: హుజురాబాద్.. తుపాకులు అప్పగించాలె.. లేదంటే ఈ విషయమై నాలుగు రోజుల కిందట గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేశ్ ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపింది. అయినప్పటికీ రాము మారకపోవడంతో బుధవారం ఉదయం ఈ విషయమై గౌతమి అడిగేందుకు వెళ్లడంతో ఇంటికి తాళం వేసి తల్లికుమారుడు వెళ్లిపోయారని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు మేనబావ ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట -
పీఎన్బీ స్కాం సంచలనం : నీరవ్‌కు భారీ షాక్
సాక్షి, ముంబై: బ్యాంకింగ్ రంగాన్ని పట్టికుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ నేర చరిత్ర మూలంగా తమ జీవితాలు నాశనమైపోయాయంటూ నీరవ్ సోదరి పూర్వి, ఆమె భర్త మైయాంక్ మెహతా సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలను ఇస్తామంటూ అప్రూవర్‌గా మారేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. పీఎన్బీ స్కాం, నీరవ్ నుంచి తమను దూరం చేయాలని కోరుతూ పూర్వి మోదీ, ఆమె భర్త కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఈ కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని, సాక్ష్యాలను అందించేందుకు అంగీకరించారు. అతని నేరపూరిత కార్యకలాపాలు మూలంగా తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు స్థంభించి పోయాయని వాపోయారు. ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వీరిని ప్రాసిక్యూషన్ సాక్షులుగా ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు అనుమతించింది. క్షమాపణ తెలిపిన తరువాత నీరవ్ చెల్లెలు పూర్వి మోడీ, ఆమె భర్తను అప్రూవర్లుగా అంగీకరించాలని కోర్టు తెలిపింది. ప్రస్తుతం బెల్జియం పౌరసత్వంతో ఆదేశంలో ఉన్న పూర్వి మోదీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా పీఎన్బీ స్కాంలో నీరవ్ మోడీ , అతని మామ మెహుల్ చోక్సీ, కొంతమంది బ్యాంకు అధికారులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలతో పీఎన్బీని రూ .14 వేల కోట్లకు ముంచేశాడు. అనంతరం విదేశాలకు పారిపోయిన నీరవ్‌ను 2019 మార్చిలో భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్ జైల్లో ఉన్న నీరవ్‌ను భారత్‌కు అప్పగించే అంశం విచారణలో ఉంది. -
భార్య కాపురానికి రాలేదని.. బావమరిది కొడుకును..!
సాక్షి, హైదరాబాద్ : భార్య కాపురానికి రావడం లేదని ఓ ప్రబుద్ధుడు ఏకంగా బావమరిది కొడుకును ఎత్తుకెళ్లాడు. 20 నెలల చిన్నారిని అపహరించి.. తన భార్యను కాపురానికి పంపిస్తేనే బాలుడిని తల్లిదండ్రులకు ఇస్తానని బెదిరింపులకు దిగాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అజీజ్ నగర్ గేట్ సమీపంలోని గోల్డెన్ ఫామ్‌లో ఉంటూ కూలి చేసుకునే యాలాల మండలానికి చెందిన కృష్ణకు, భాగ్యలక్ష్మి అనే మహిళతో వివాహం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా భాగ్యలక్ష్మికి కృష్ణ గతంలో విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మి తన అన్న దగ్గర ఉంటున్నారు. భాగ్యలక్ష్మికి ఆమె అన్న దగ్గర ఉండటంతో ఆగ్రహించిన కృష్ణ.. 20 నెలల అన్న కొడుకును ఎత్తుకెళ్లాడు. ‘మీ చెల్లెల్ని నాతో కాపురానికి పంపిస్తేనే.. కొడుకును ఇస్తాను’ అంటూ అతను భాగ్యలక్ష్మి అన్నకు ఫోన్ చేసి బెదిరించాడు. ఆ తర్వాత కృష్ణ మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన భాగ్యలక్ష్మి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తల్లి
ఉదయ్‌పూర్: రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం అల్లుడితో కలిసి కన్నా కొడుకునే చంపించింది ఓ తల్లి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్‌ఘడ్ జిల్లా చోటిసాద్రి గ్రామానికి చెందిన మోహిత్(21) తన తల్లి ప్రేమ్‌లత సుతార్‌తో తరచూ గొడవ పడేవాడు. తండ్రి చనిపోయాక ఈ గొడవ మరింత ముదిరింది. దీంతో విసుగు చెందిన ప్రేమ్‌లత కూతురి దగ్గరికి వెళ్లి అక్కడే ఉంటుంది. కాగా నెల రోజుల క్రితం ఆమె తన ఊళ్లో ఉన్న భూమిని అమ్మడానికి ప్రయత్నించింది. దీనికి మోహిత్ అడ్డుపడ్డాడు. దీంతో ఎలాగైనా కొడుకు అడ్డుతొలగించుకోవాలని అల్లుడితో కలిసి కుట్రపన్నింది. మోహిత్‌ను అంతమొందించడం కోసం అదే ప్రాంతానికి చెందిన రౌడీ గణపత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఆశ్రయించారు. హత్య కోసం అతనితో లక్ష రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. యాభైవేల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఈ నెల 6న మోహిత్ గ్రామానికి దగ్గరలో ఉన్న దాబాకి వెళ్లాడు. అక్కడే ఉన్న గణపత్, అనిల్‌లు ప్లాన్ ప్రకారం మోహిత్‌కి మద్యం తాగించారు. మోహిత్ మత్తులోకి వెళ్లాక ఇద్దరు కలిసి గొంతు పిసికి చంపేశారు. సీసీ పుటేజీ సాయంతో నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. -
తమ్ముడి భార్య పై అన్నఅత్యాచారం
-
తమ్ముడి భార్యపై అన్న అత్యాచారం
సాక్షి, బులంద్‌షెహర్ : ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై అరాచకాలు, అకృత్యాలు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. తాజాగా బులంద్‌షెహర్ పట్టణంలోని ఒక మహిళపై ఆమె బావ (భర్త అన్న), అతని స్నేహితుడు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనపై తండ్రితో కలిసి బాధితురాలు కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న బాధితురాలికి రషీద్అనే యువకుడితో వివాహం అయింది. వివాహం అయిన రెండో రోజే అమెపై భర్త అన్న, అతని స్నేహితుడు అత్యాచారం చేశారు. ఈ ఘటన తరువాత వారం రోజులకే భర్త బాధితురాలికి ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. దీనిపై బాధితురాలు డిసెంబర్ 11న కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చొరవతో.. భర్త, అతని అన్న, స్నేహితుడు, ఇతర కుటంబ సభ్యులపై కేసు నమోదు అయింది. పెళ్లయిన రెండోరోజే భర్త.. ఆమెను ఇంట్లో వదలిపెట్టి బయటకు వెళ్లాడు. సరిగ్గా ఇదే సమయంలో బావ మహమ్మద్ రఖీబ్, అతని స్నేహితుడు ఇంట్లోకి వచ్చారు. ఇద్దరూ కలిసి నన్ను బలవంతంగా గదిలోకి ఎత్తుకెళ్లి నాపై ఒకరితరువాత ఒకరు అత్యాచారం చేశారు. అదే సమయంలో రఖీబ్ అత్యాచారం చస్తున్న సమయంలో అతని స్నేహితుడు మొబైల్లో వీడియో తీశాడని చెప్పారు. ఈ ఘటనను ఎక్కడైనా చెబితే.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు బాధిత యువతి తెలిపింది. ఈఘటన మొత్తం భర్తకు చెప్పాకే తెలిసింది.. అతని మోసం. అతనికి అప్పటికే వివాహం అయిందని.. అన్న కోసమే నిన్ను ఇక్కడకు తీసుకువచ్చానని చెప్పారు. ఇక అక్కడ ఉండి లాభం లేదనుకుని.. పారిపోయి పుట్టింటికి వచ్చి.. తల్లిదండ్రుల సాయంతో కేసు పెట్టినట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా.. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఆ యువతి చెప్పేదంతా కట్టుకథ అని రషీద్ తల్లి కొట్టిపారేసింది. ‘నా కుమారుడు రషీద్‌కు ఎప్పుడో వివాహమైంది. అతడు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకుంటాడు. ఆమె చెప్పేదంతా పచ్చి అబద్దం. నా కుమారులిద్దరూ అమాయకులు’ అని ఆమె చెబుతోంది. -
ఆడపిల్ల పుట్టిందని అమానుషం
పంజాబ్: ఆడపిల్ల పుట్టిందనే నెపంతో అమానుషానికి పాల్పడిందో కుటుంబం. సమీప బంధువు, మరో వ్యక్తి ఓ మహిళపై హాకీ స్టిక్స్‌తో విచక్షణారహితంగా దాడి చేయడం ఆందోళన రేపుతోంది. పంజాబ్‌లోని పాటియాలాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బహిరంగంగా ఆమెపై ఆ దుర్మార్గులు దారుణంగా దాడి చేస్తోంటే, అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇపుడు ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. తాజా నివేదికల ప్రకారం మీనా కశ్యప్, దల్జీత్ సింగ్ కు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. పెళ్లి అయన దగ్గర్నుంచి అత్తింటివారు మీనాను కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు మితిమీరడంతో మీనా, దల్జీత్ వేరు కాపురముంటున్నారు. ఇంతలో మీనా ఈ మధ్యనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతే దీన్ని సాకుగా చేసుకున్న ఆ కుటుంబం మరింత రెచ్చిపోయింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ దల్జీత్ సోదరుడు, అతని స్నేహితుడు ఆమెను హాకీస్టిక్‌లతో అతి దారుణంగా కొట్టారు. హృదయ విదారకంగా అరిచి గగ్గోలు పెడుతున్నా ..ఎంత వేడుకున్నా వదిలిపెట్టలేదు. సోషల మీడియాలో వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ విషయమే గత ఏడాదిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని ,కానీ ఎలాంటి ఫలితంలేదని మీనా తండ్రి వాపోయారు. రూ.7లక్షల కట్నాన్ని డిమాండ్ చేశారని తెలిపారు. -
మరిదే హతమార్చాడు!
►గిరిజన మహిళ హత్యకేసులో వీడిన మిస్టరీ ►నిందితుడు అరెస్టు.. నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు వెల్లడి కౌడిపల్లి: గిరిజన మహిళ హత్య కేసులో దాదాపు నెల రోజులకు మిస్టరీ వీడింది. కోరిక తీర్చలేదన్న కోపంతో మరిదే ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చినట్టు నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు తెలిపారు. మంగళవారం ఆయన ఎస్ఐ శ్రీనివాస్‌తో కలిసి కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించి వెల్లడించిన వివరాలు ఇలా... మహ్మద్‌నగర్ పంచాయతీ పరిధి మొండితండాకు చెందిన మూడ్ సాలి (56) గత నెల 8వ తేదీ రాత్రి హత్యకు గురైంది. ఈ ఘటన మరుసటి రోజు వెలుగు చూసింది. మూడు సాలి తన పొలంలోని కూరగాయలను రోజూ వెంకట్రావ్‌పేటగేట్ వద్దకు వెళ్లి విక్రయించి రాత్రికి తిరిగి ఇంటికి వచ్చేది. రోజూ మాదిరిగానే గత నెల 8న కూరగాయలు అమ్మేందుకు వెళ్లిన సాలి రాత్రికి ఇంటికి రాలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం రైస్‌మిల్ సమీపంలోని వాగులో సాలి మృతదేహాన్ని గుర్తించారు. సాలిపై అదే తండాకు చెందిన వరుసకు మరిది (పాలివారు) అయిన మూడ్ జగన్ (46) గత కొన్నాళ్లుగా కన్నేశాడు. ఆ రోజు జగన్ రాత్రి వ్యవసాయం పొలం వద్దకు వచ్చాడు. ఇంతలో సాలి కూరగాయలు అమ్ముకుని ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది. సమీపంలో ఎవరు లేని విషయాన్ని గమనించిన జగన్ తన కోరిక తీర్చాలని సాలిని బలవంత పెట్టాడు. ఆమె లొంగకపోవడంతో వాగువైపు ఎత్తుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఆమె అరుపులు ఎవరికి విన్పించలేదు. ఆమె గొంతు పిసకడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె మర్మాంగంలో కట్టెతో కెలికాడు. ఒంటిపై ఉన్న దుస్తులతో ఆమె గొంతుకు కట్టి ఊపిరాడకుండా చేశాడు. ఒకవేళ బతికి ఉండే జరిగిన విషయం తండాలో చెబుతుందని భయపడి ఆమె వద్ద ఉన్న బస్తాలో నుంచి అరకిలో బాటుతో ముఖం, తలపై కొట్టి చంపాడు. అక్కడి నుంచి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తండావాసులు మృతదేహం గుర్తించడంతో పోలీసులు, జాగిలం, క్లూస్‌టీంతో విచారణ నిర్వహించారు. జాగిలం జగన్ ఇంటివద్దకు, మృతురాలి ఇంటివద్దకు వెళ్లి ఆగింది. ఈ క్రమంలో పోలీసులు అనుమానంతో జగన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు చెప్పారు. మృతురాలికి భర్త పూల్‌సింగ్ ఇద్దరు కొడుకులు కోడళ్లు ఉన్నారు. -
గోవా సీఎంపై ఢిల్లీ సీఎం విమర్శలు
పనాజి: గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అవినీతి కేసులో పట్టుపడ్డ ఆయన బంధువును తిరిగి ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకోవడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుపట్టారు. దీనితో ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న సందేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇదే స్థానంలో తన బందువు ఉంటే ఈ పాటికి జైలులో ఉండేవాడని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. గోవాలోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన కోలంగేట్ లోని హోటల్ ప్రతినిథులలో మాట్లాడుతూ ఆయన ఈవ్యాఖ్యలు చేశారు. గోవా సీఎంకు బావ అయిన దిలిప్ మాలవంకర్ ఆ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో పని చేస్తున్నారు. గతేడాది ఆయన రూ. లక్ష లంచం తీసుకుంటూ తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ కేసులో సస్పెండ్ అయ్యారు. -
బావమరిది చేతిలో బావ హతం
హైదరాబాద్: మద్యం తాగి అక్కను వేధిస్తున్నాడన్న కారణంతో బావను కర్రతో కొట్టి హత్య చేసిన బావమరిదిని సైదాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణికాలనీలో నివాసముంటున్న ఆటోడ్రైవర్ రత్నావత్ పాండు బుధవారం రాత్రి పీకల దాకా తాగి వచ్చి తన భార్య బుజ్జితో గొడవపడ్డాడు. దీంతో అక్కడే సమీపంలో నివాసముంటున్న ఆయన బావమరిది లక్ష్మణ్ ఇంటికి వచ్చి వారిని విడిపించే ప్రయత్నం చేశాడు. అయినా పాండు వినకపోవడంతో పక్కనే ఉన్న వెదురు కర్రతో తలపై కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో పాండు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.