హైదరాబాద్: మద్యం తాగి అక్కను వేధిస్తున్నాడన్న కారణంతో బావను కర్రతో కొట్టి హత్య చేసిన బావమరిదిని సైదాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణికాలనీలో నివాసముంటున్న ఆటోడ్రైవర్ రత్నావత్ పాండు బుధవారం రాత్రి పీకల దాకా తాగి వచ్చి తన భార్య బుజ్జితో గొడవపడ్డాడు. దీంతో అక్కడే సమీపంలో నివాసముంటున్న ఆయన బావమరిది లక్ష్మణ్ ఇంటికి వచ్చి వారిని విడిపించే ప్రయత్నం చేశాడు. అయినా పాండు వినకపోవడంతో పక్కనే ఉన్న వెదురు కర్రతో తలపై కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో పాండు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.