
సాక్షి, జగిత్యాల జిల్లా: ఆస్తి కోసం అన్నను సొంత చెల్లెళ్లు మట్టుబెట్టిన ఘటన జగిత్యాల పోచమ్మవాడలో జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నపై ఇద్దరు చెల్లెళ్లు.. దాడి చేసి, హత్య చేశారు. అన్న జంగిలి శ్రీనివాస్‌పై ఇద్దరు చెల్లెళ్లు శారదా, వరలక్ష్మి కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
యువకుడిపై హత్యాయత్నం
మరో ఘటనలో గోదావరిఖని గాంధీనగర్‌కు చెందిన ఖలీం అనే యువకుడిపై శనివారం హత్యాయత్నం జరిగిందని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. అతనికి వరుసకు సోదరులయ్యే మహమ్మద్ గౌస్, మహమ్మద్ అంకూస్ కత్తితో దాడి చేశారన్నారు. ఖలీం గొంతు భాగంలో బలమైన గాయాలయ్యాయని, ఆస్తి తగాదాల వల్లే ఈ సంఘటన జరిగినట్లు పేర్కొన్నారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment