![Congress Leader Was Brutally Assassinated In Jagtial District](/styles/webp/s3/article_images/2024/10/22/Congress-Leader-_1.jpg.webp?itok=rN3K2p04)
సాక్షి, జగిత్యాల జిల్లా: జగిత్యాల రూరల్ జాబితాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను కారుతో వెనుక నుంచి ఢీకొట్టి, సంతోష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. కత్తిపోట్లకు గురైన గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. పాత కక్షలతోనే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పలుమార్లు సంతోష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా గంగారెడ్డి ఉన్నారు. ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. గంగారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జగిత్యాలలో బీఆర్‌ఎస్ రాజ్యం నడుస్తోందా?: జీవన్‌రెడ్డి ఆగ్రహం
జగిత్యాలలో బీఆర్‌ఎస్ రాజ్యం నడుస్తోందా? అంటూ పోలీసులపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల- ధర్మపురి రహదారిపై ఆయన బైఠాయించారు. బీఆర్‌ఎస్ నేతలే హత్య చేయించారని ఆరోపించారు.
![రాజకీయ కక్షతోనే మారు గంగారెడ్డిపై దాడి](https://www.sakshi.com/s3fs-public/inline-images/cr.jpg)
ఇదీ చదవండి: రూ.20 కోట్ల భూ కుంభకోణం
Comments
Please login to add a commentAdd a comment