
తల్లి మృతి, పిల్లల పరిస్థితి విషమం
జగిత్యాల జిల్లా మద్దులపల్లిలో దారుణం
పెగడపల్లి: ఇద్దరు పిల్లలకు విషంమిచ్చి తల్లి తను కూడా తాగింది. ఈ ఘటనలో తల్లి మృతిచెందగా, ఇద్దరు పిల్లలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పెగడపల్లి ఎస్సై రవికిరణ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కంబాల తిరుపతికి జగిత్యాలకు చెందిన హారికతో సుమారు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు కృష్ణంత్ (10), కూతురు మాయంతలక్ష్మి (8) ఉన్నారు. పిల్లలిద్దరూ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు.
తిరుపతి, హారిక వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో తిరుపతి ఒగ్గు కథలు చెప్పేందుకు వెళ్తుంటాడు. గురువారం మధ్యాహ్నం తిరుపతి ఒగ్గు కథ చెప్పేందుకు వెళ్లాడు. ఏం జరిగిందో ఏమోగానీ సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో హారిక (30) తన ఇద్దరు పిల్లలకూ గడ్డి మందు తాగించి తానూ తాగింది. విషయాన్ని వెంటనే తిరుపతికి వీడియోకాల్ చేసి చెప్పింది.
కంగారుపడిన తిరుపతి గ్రామంలోని సమీప బంధువుకు తెలపడంతో ఆయన హుటాహుటిన ఇంటికి వెళ్లేసరికి పిల్లలతోపాటు హారిక అపస్మారక స్థితిలో కనిపించింది. వారిని చికిత్స నిమిత్తం ముందుగా జగిత్యాల.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం హారిక మృతి చెందింది. ఆమె సోదరుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మరింత సమాచారం సేకరించేందుకు హారికతోపాటు తిరుపతి సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment