
ప్రియుడితో కలిసి భార్య స్కెచ్
తప్పించుకున్న భర్త పోలీసులకు ఫిర్యాదు
కేసు ఛేదించిన పోలీసులు
మునిపల్లి(అందోల్): కట్టుకున్న భర్తను కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి భార్య కుట్ర చేసిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన భర్త తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుదేరా ఎస్‌ఐ రాజేశ్ నాయక్ కథనం ప్రకారం... పెద్దగోపులారం గ్రామానికి చెందిన కొమిశెట్టిపల్లి రవి ఝరాసంగం మండలంలోని దేవరాంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఎప్పటిలాగే ఈ నెల 22న బైక్‌పై వెళ్లి విధులు నిర్వహించుకొని బుదేరా నుంచి గోపులారానికి వస్తున్న క్రమంలో నల్ల రంగు తార్ కార్‌తో రవిబైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయారు. బైక్‌పై నుంచి కిందడిన రవి అప్రమత్తమై తప్పించుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్రాక్ డిటేల్స్ ద్వారా నేరస్తులను గుర్తించారు. హత్య చేయడానికి గల ముఖ్య కారణం రవి భార్య హరితనే తేల్చారు. హరిత సంగారెడ్డికి చెందిన మిర్‌దొడ్డి సాయి ప్రదీప్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
దీంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకొని ప్రియుడుతో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. దీంతో ఏ1గా హరిత, ఏ2 మిరుదొడ్డి సాయి ప్రదీప్, ఏ3 దాసోజీ సాయికిరణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. అక్కడి నుంచి జైలుకు పంపించారు. చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్‌ఐ ఎం. రాజేశ్ నాయక్, కానిస్టేబుల్స్ పాండు, తుకారాం, హనీఫ్, సునీల్‌లను కొండాపూర్ సీఐ వెంకటేశం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment