బాలునిపై అత్యాచారం కేసులో తీర్పు
జగిత్యాల జోన్: బాలునిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితునికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జగిత్యాల ప్రధాన న్యాయమూర్తి, జిల్లా పోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి నీలిమ సోమవారం తీర్పు చెప్పారు. మెట్‌పల్లి సీఐ నిరంజన్ రెడ్డి కథనం ప్రకారం.. 2019 ఏప్రిల్ 4న జిల్లాలోని మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామ శివారులోని మామిడి తోటలో కాయలు తెంపుకొందామంటూ అదే గ్రామానికి చెందిన గోగుల సాయికుమార్.. ఒక బాలుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు.
అక్కడ బాలునిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితుని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్‌ఐ పృథీ్వధర్ కేసు నమోదు చేశారు. కేసు విచారణ చేపట్టిన అప్పటి సీఐ రవికుమార్ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి.. నిందితుడు సాయికుమార్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment