
జగిత్యాల: జిల్లాలోని పొలాసలో దారుణం చోటు చేసుకుంది. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది భార్య. భర్త కమాలకర్ కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అవ్వగా, మరో పెళ్లి చేసుకున్నాడనేది కూడా ఆమె ఆరోపిస్తోంది. తమను రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని, అందుచేత భర్తపై పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు భార్య చెబుతోంది.
గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసై తమను వేధిస్తున్నాడని భార్య పేర్కొంది. భార్యా పిల్లలను కొడుతుండటంతో ఓపిక నశించి కమలాకర్ పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు చెబుతోంది. పిల్లలతో కలిసి కమాలకర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు భార్య స్పష్టం చేసింది. ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమాలకర్ పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment