
సాక్షి,మహబూబ్ నగర్: జిల్లాలో దారుణం జరిగింది. మటన్ కూర వండలేదని భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త.
సీరోల్ ఎస్సై సీఎహెచ్ నాగేష్ వివరాల మేరకు.. సీరోల్ మండల కేంద్రానికి చెందిన ఎం కళావతి,ఎం బాలు భార్యభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో బాలుకి నాన్ వెజ్ తినాలని బుద్ధి పుట్టింది. ముందుగా చికెన్ కూర తిందామని అనుకున్నాడు. అసలే బర్డ్ ఫ్లూ అంటున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని షాపుకెళ్లి మటన్ కూర తెచ్చాడు.
మటన్ తినాలని ఉంది. అందుకే మటన్ తెచ్చా. వెంటనే మటన్ కూర చేయమని భార్యను కోరాడు. అందుకు భార్య అంగీకరించలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో నిందితుడు బాలుకి కోపం నషాళానికి అంటింది. ఏం చేయాలే పాలుపోలేదు. పట్టరాని కోపంతో భార్య కళావతిని వెనక్కి నెట్టాడు. ఫలితంగా బాధితురాలు ప్రాణాలు పోగొట్టుకుంది. భర్త నెట్టడంతో బాధితురాలి తలకి బలమైన గాయాలయ్యాయి. అక్కడికక్కడే మరణించింది. అనంతరం బాలు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment