ఏం కష్టమొచ్చిందో.. దంపతుల ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు | Wife And Husband Died In Siddipet District | Sakshi
Sakshi News home page

ఏం కష్టమొచ్చిందో.. దంపతుల ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు

Published Sun, Mar 16 2025 9:39 PM | Last Updated on Sun, Mar 16 2025 9:40 PM

Wife And Husband Died In Siddipet District

సిద్దిపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో దంపతులు ఆత్మ హత్య చేసుకున్నారు. ముందుగా భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఆపై భార్త కూడా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. తొగుట మండలం ఎల్లారెడ్డిలో ఈ దారుణం జరిగింది. కెమ్మసారం భాగ్య పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 

దీన్ని చూసిన భర్త నాగరాజ్‌.. భార్య లేని జీవితం వద్దకుని అతను కూడా పురుగుల మందు సేవించాడు. దాంతో నాగరాజ్ కూడా తనువు చాలించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆ దంపతులకున్న నలుగురు పిల్లలు అనాథులుగా మారిపోయారు. అమ్మా‍, నాన్న ఇక తమతో ఉండరని తెలిసి రోదిస్తున్నారు. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement