jagityal
-
ఒకే ఆక్సిజన్ సిలిండర్ ఇద్దరు రోగులకు మార్చి మార్చి పెట్టిన సిబ్బంది
-
బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వపై కేసు!
బిగ్‌బాస్ కంటెస్టెంట్, యూట్యూబర్ గంగవ్వ చిక్కుల్లో పడింది. వీడియోల పేరుతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారంటూ గంగవ్వతో పాటు మరో యూట్యూబర్ రాజుపై కేసు నమోదు అయింది. యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ ఫిర్యాదు మేరకు జగిత్యాల అటవీ శాఖ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. వినోదం కోసం చిలుకను హింసించారని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఏం జరిగింది?2022 లో గంగవ్వ, రాజు కలిసి ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్ లో గంగవ్వ చిలుక పంచాంగం అనే వీడియో చేశారు. అందులో గంగవ్వ, రాజు జ్యోతిష్కులుగా నటిస్తూ చిలుకను ఉపయోగించారు. ఇలా వినోదం కోసం చిలుకను పంజరంలో బంధించడం వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 షెడ్యూల్ IV కింద నేరమని గౌతమ్ ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. (చదవండి: మొన్న బెయిల్‌పై వచ్చిన నటుడు.. ఇంతలోనే మూడో పెళ్లితో వైరల్)బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వగంగవ్వ ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది. బిగ్‌బాస్ సీజన్ 4లో గంగవ్వ తొలిసారి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లింది. అయితే అక్కడి వాతావరణం పడక అనారోగ్యం బారిన పడడంతో మధ్యలోనే ఆమెను బయటకు పంపించేశారు. మళ్లీ సీజన్ 8లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది. -
లేటు ఎందుకని అడిగితే.. ప్రజావాణిలో అధికారుల మధ్య లొల్లి
-
ప్రాణాలకు తెగించిన లైన్ మెన్
-
ప్రభుత్వ ఆసుపత్రిలో స్కాం పై విచారణ వేగవంతం
-
నేడు జగిత్యాలకు పీఎం మోదీ
-
ధర్మపురం నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ
-
'ఏపీ పాలకులకంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఎక్కువ ముంచారు'
జగిత్యాల: గతంలో ఏపీ పాలకులకంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఎక్కువ ముంచారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇందిరమ్మ కాలంలో జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఇందిరమ్మ రాజ్యంలో లక్షల మందిని జైళ్లలో ఉంచారని మండిపడ్డారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని చెప్పారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు తేడా ఏంటో ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. 'తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు?. ఎవరి చేతిలో అధికారం ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందో ప్రజలు తెలుసుకోవాలి. ఎవరు నిజమైన సిపాయిలో ప్రజలు గుర్తించాలి. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని చీకటి రోజులే. ఏం మేలు జరిగిందని మళ్లీ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. నీళ్ల పన్ను లేని రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే.' అని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.. రైతు బంధు ఉండాలా? వద్దా..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రైతు బంధును రూ.16 వేలు చేస్తామని ప్రకటించారు. ధరణి స్థానంలో భూమాత తెస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. కానీ అది భూమాత కాదు భూమేత అని ఎద్దేవా చేశారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమేనని చెప్పారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే అంతా ఆగమాగమేనని పేర్కొన్నారు. ఒకే ఒక్క ఆయుధం ఓటు.. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వచ్చాయని ఆగమాగం కావొద్దని ప్రజలకు సూచించారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గమనించండి.. ఓటు వేసే ముందు ఆలోచించి వేయండని సూచించారు. ప్రజలకు ఒకే ఒక్క ఆయుధం ఓటు.. వేసే ఓటులో తేడా వస్తే ఐదేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. దుబ్బాకలో జరిగిన ఎన్నికల సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 'ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్లు చూపించేవారు వస్తారు.. వారి మాటలు నమ్మకండి. మీరు వేసే ఓటు ఐదేళ్ల తలరాతను మారుస్తుంది. ఆలోచించి ఓటు వేస్తే దేశం ముందుకు సాగుతుంది. ఓటు వేసే ముందు అభ్యర్థి వెనుక పార్టీ చరిత్రను గమనించండి. ఎన్నికలు వచ్చాయంటే అబద్ధాలు చెబుతుంటారు. ఎంతో పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. మళ్లీ ఆగమైతే రాష్ట్రం వెనక్కిపోతుంది. పదేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం.' అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదీ చదవండి: ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్ -
కంటి డాక్టర్‌కు పొలిటికల్ కష్టాలు
సాక్షి, జగిత్యాల : ఆయనో నేత్ర వైద్యుడు. ఎంతో ఓపికగా కళ్ళ ఆపరేషన్లు చేస్తారు. కాని ఎమ్మెల్యేగా ఆయన సహనం కోల్పోతుంటారు. తప్పుల్ని ఎత్తి చూపినవారిని ఆవేశంతో బెదిరిస్తారు. తనమీద ఫిర్యాదులు చేస్తే మళ్ళీ బెదిరిస్తారు. తప్పుల మీద తప్పులు చేస్తున్నారయన. ఎన్నికల వేళ ఆయన చేస్తున్న తప్పులు ఎక్కడికి దారి తీస్తాయో అని అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన చేస్తున్న తప్పులు ఏంటి? ఎవరిని బెదిరిస్తున్నారు? ఎన్నికలు జరిగే తేదీలతో ఒకసారి షెడ్యూల్ విడుదలయ్యాక ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల నిబంధనావళి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులెవ్వరికైనా ఒకేవిధంగా వర్తిస్తాయి. ఒకరికెక్కువ, ఇంకొకరికి తక్కువ అనే మినహాయింపులేమీ ఉండవు. కానీ జగిత్యాల అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నేత్ర వైద్యుడు డాక్టర్ సంజయ్‌కుమార్ ఎలక్షన్ కోడ్ తనకు వర్తించదన్నట్లుగా వ్యవహరిస్తూ కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు. ఎన్నికల వేళ ఓట్ల వేట కొనసాగిస్తూ.... తన కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. అసలు పార్టీ కార్యాలయంలో ఆ చెక్కులుండటమే తప్పంటే.. చెక్కుల పంపిణీపై ఫిర్యాదు చేసిన వారిని సదరు ఎమ్మెల్యే బెదిరించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ గురించి గుంటి జగదీశ్వర్ అనే ఓ లాయర్ జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు ఎన్నికల కమిషన్ నోటీసులిచ్చింది. అది కాస్తా ఆ నేత్రవైద్యుడిలో అసహనానికి కారణమైంది. దాంతో.. జగిత్యాల శివార్లలోని రాజేశుడి గుట్ట ఆలయంలో పూజారిగా కూడా పనిచేసే సదరు అడ్వకేట్ గుంటి జగదీశ్వర్ దగ్గరకు హుటాహూటీన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెళ్లారు. అక్కడున్న మీడియా కెమెరాలను రికార్డ్ చేయొద్దంటూ హుకుం జారీ చేశారు. దైవ నామస్మరణతో మారుమ్రోగుతున్న మైకులనూ ఆపేయించారు. ఎన్నికల వేళ ఎమ్మెల్యే ఆఫీస్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడమే తప్పంటే.. గుడికెళ్లి రాజకీయాలు మాట్లాడుతూ తనను ఎమ్మెల్యే బెదిరించాడని లాయర్ కమ్ పూజారి గుంటి జగదీశ్వర్ చెబుతున్నారు. నేత్ర వైద్యుడిగా ఎంతో ఓపికతో కళ్ల ఆపరేషన్స్ చేసే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.. రాజకీయాలకు వచ్చే వరకు అసహనంతో, ఆగ్రహంతో ఎందుకు సహనాన్ని కోల్పోతున్నారనే చర్చ జగిత్యాల సర్కిల్స్ లో మొదలైంది. ఇప్పటివరకూ జగిత్యాలలో టఫ్ ఫైట్ ఉంటుందనుకుంటున్న సమయంలో.. ఎమ్మెల్యే ఆగ్రహావేశాలు పార్టీకి నష్టం మరింతగా జరుగుతుందనే అభిప్రాయాలు గులాబీ వర్గాల్లోనే చర్చకొస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎన్నికల నుంచి అనర్హుడిగా ప్రకటించాలని ఆయన బాధితుడు గుంటి జగదీశ్వర్ ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాడు. డాక్టర్ సంజయ్ కుమార్ గతంలోనూ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్నారు. మెడికల్ కళాశాల భవనానికి భూమిపూజ చేస్తున్న సమయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, కోరుట్ల శాసనసభ్యుడైన విద్యాసాగర్ రావు నేతృత్వంలో పనులను ప్రారంభించారు. ఆ శిలాఫలకంపై క్యాబినెట్ హోదా కల్గిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావా వసంత పేరును ముద్రించకపోవడం వివాదానికి కారణమైంది. అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు స్వయంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని ఈవిషయమై మందలించారు. జడ్పీ చైర్ పర్సన్ పేరు ముద్రించాకే శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తన ఎమ్మెల్యే సీటుకి అడ్డు పడుతుందన్న నాటి ప్రచారం నేపథ్యంలో.. ప్రోటోకాల్‌ను కూడా ఉల్లంఘించి దావా వసంత పేరును శిలాఫలకంపై ముద్రించకపోవడంపై జగిత్యాల ఎమ్మెల్యే గురించి బీఆర్ఎస్ వర్గాల్లోనే పెద్ద చర్చ జరిగింది. గతంలోనూ పలుమార్లు తానేం మాట్లాడుతున్నానో తనే గుర్తించలేని స్థితిలో.. చెప్పాలనుకునేదొకటి, చెప్పేదొకటన్నట్టు మీడియా అటెన్షన్‌కు డాక్టర్ సంజయ్ కుమార్ టార్గెట్‌గా మారారు. తీరా ఇప్పుడు ఎన్నికల వేళ తత్తర పడుతున్న సీన్స్ పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. కానీ, ఈ విషయాలు ఎమ్మెల్యేకు చెబితే మళ్లీ దాని గురించి ఏమనుకుంటారోనని.. ఆయన్ను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్న ఆయన శ్రేయోభిలాషులు కూడా చెప్పడానికి సందేహిస్తున్నారట. మొత్తంగా గెలుపు అవకాశాలున్న చోట.. కోడ్ ఉల్లంఘనలు.. పైగా అహంకారపు బెదిరింపులు.. తప్పుల మీద తప్పులు చేస్తూ.. ఎలక్షన్ టైమ్‌లో ఇవేం తలనొప్పులని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నాయట. -
ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న నైనా జైశ్వాల్
ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొలువైన శ్రీలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దైవదర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైనాకు ఆశీర్వాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది ఆమెను శాలువాతో సన్మానించారు. శ్రీలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం నైనా జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘‘అలలకు అలుపు లేదు.. శిలలకు చూపు లేదు.. కాలాలకు రూపు లేదు.. మౌనానికి భాష లేదు.. కానీ, ఆ గోవింద నామాలకు అంతులేదు’’ అంటూ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. సర్వేజనా సుఖీనోభవంతని తాను కోరుకున్నానని ఆమె చెప్పారు. కాగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్.. చదువుల తల్లి.. కుంగుబాటుకు లోనైన బలహీన మనస్కుల్లో సానుకూల దృక్పథాన్ని నింపే మోటివేషనల్ స్పీకర్.. ‘వరల్డ్ పీస్ అంబాసిడర్’గా గుర్తింపు పొందారు నైనా. 17 ఏళ్ల వయసులో పీహెచ్డీ మొదలుపెట్టిన ఆమె 22 ఏళ్లకు పూర్తి చేసి డాక్టరేట్ సాధించారు. దేశంలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు. నైనా జైశ్వాల్ స్ఫూర్తిదాయక ఇంటర్వ్యూ -
పిడుగు పడి కాలిపోయిన కొబ్బరి చెట్టు..
-
గ్రామాల్లోనే ధాన్యాన్ని కొనే ఒకే రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్
-
జగిత్యాల జిల్లా రాయపట్నంలోని శివాలయం లో చోరీ
-
చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ పూజలు
జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లా టీఆర్‌నగర్‌లో మృతదేహం దగ్గర పూజలు చేయడం కలకలం సృష్టించింది. అనారోగ్యంతో చనిపోయిన రమేష్ అనే వ్యక్తిని బతికిస్తానంటూ పుల్లయ్య అనే వ్యక్తి పూజలు చేయడం ప్రారంభించాడు. మంత్రాల కారణంగానే రమేష్ చనిపోయాడన్న పుల్లయ్య ఉదయం నుంచి రమేష్ మృతదేహం వద్ద పూజలు నిర్వహించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. -
జగిత్యాలలో అరుదైన చేప
-
భార్యపై అనుమానం.. గొడ్డలితో నరికి
సాక్షి, జగిత్యాల : అనుమానం పెనుభూతం అయింది. మద్యంమత్తు, కుటుంబకలహాలతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు భర్త. జగిత్యాల జిల్లా చెర్లపల్లిలో భార్యను గొడ్డలితో భర్త శంకరయ్య దారుణంగా నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. తల్లి హత్య తండ్రి కటకటాల పాలు కావడంతో ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కుమంటూ బోరున విలపించారు. జిగిత్యాల జిల్లాలో భార్య భర్త దారుణంగా హత్య చేయడం కలకలం సృష్టిస్తుంది. అంబారిపేటకు చెందిన సుజాతకు వెలగటూర్ మండలం చెర్లపల్లి కి చెందిన శంకరయ్యతో 16ఏళ్ళ క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కొడుకు జన్మించారు. సాఫీగా సాగుతున్న కాపురంలో మద్యం మత్తు కుటుంబ కలహాలకు దారి తీసింది. ఉపాధి నిమిత్తం ముంబైకి వెళ్లిన భర్త తాను సంపాదించిన సొమ్ము తాగుడికే ఖర్చు చేసేవాడు. కూలీ పనితో సుజాత ఇద్దరు కొడుకులను పోషిస్తున్నది. వారం రోజుల క్రితం ముంబై నుంచి ఇంటికి చేరిన శంకరయ్య భార్యపై అనుమానం పెంచుకుని గొడవపడ్డాడు. తాగొచ్చి భర్త గొడవ పడటంతో భయంతో సుజాత రాత్రంతా వేరే వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. తెల్లవారుజామున ఇంటికి రాగా మద్యం మత్తులో ఆగ్రహంతో ఉన్న భర్త శంకరయ్య భార్యను నరికి చంపాడు. భార్య ప్రాణాలు పోయాక అక్కడే కొద్దిసేపు గొడ్డలి పట్టుకొని కూర్చుండిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చే లోపే శంకరయ్య నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్టు తెలిపారు. మద్యం మత్తు, ఆర్థిక ఇబ్బందులు పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి భార్య ప్రాణాలు తీయడంతో వారి ఇద్దరు కొడుకులు అనాధలుగా మారారు. ఏం జరిగిందో తెలియక ఇద్దరు కొడుకులు అభిరామ్, అజాయ్ దిక్కులు చూస్తూ బోరున విలపించారు. ఊహ తెలియని ఆ పిల్లలు రాత్రి అమ్మ నాన్న గొడవ పడ్డారని తెలిపారు. ఏటో వెళ్లిపోయిన అమ్మ, తెల్లారేసరికి బాత్ రూమ్ వద్ద పడిపోయి ఉందని పెద్ద కొడుకు అభిరామ్ తెలిపారు. స్థానికంగా ఉండని భర్త, భార్యపై అనుమానం తెంచుకొని నిత్యం గొడవ పడేవాడిని స్థానికులు తెలిపారు. శంకరయ్యకు ఇదివరకు ఓ పెళ్లి కాగ విడాకులు తీసుకొని సుజాతను రెండో వివాహం చేసుకున్నాడని చెప్పారు. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలి మరణంతో కలతచెంది..
సాక్షి, జగిత్యాల: ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో కలతచెందిన ఓ యువకు డు శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరివేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపించాడు. జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన మానాల లస్మయ్య–అమృతవ్వ దంపతుల మూడో కుమారుడు రాకేశ్ (21), అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఉపాధి నిమిత్తం రాకేశ్ రెండేళ్లుగా దుబాయిలో ఉంటున్నాడు. ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారనే కారణంతో రాకేశ్ ప్రేమించిన యువతి (21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన రాకేశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దుబాయి క్యాంపులోని గదిలో శనివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు ముందు రాకేశ్ సెల్ఫీ వీడియో తీస్తూ ‘కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నాం. ఈ రోజు నా నుంచి దూరమయ్యింది. అమ్మాయి లేని జీవితం నాకొద్దు. బై మమ్మీ ఐ మిస్ యూ’అంటూ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు దుబాయి వెళ్లి తమ బతుకులు మార్చుతాడనుకుంటే తన జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకోవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య
-
జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య
సాక్షి, కరీంనగర్: జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. శివ వీధిలో నివాసం ఉండే దంపతులు గంజి రాంబాబు (49), లావణ్య (47) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కరోనా ప్రభావం, ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ముంబాయిలో ఓ యాడ్ ఏజెన్సీలో పని చేసే దంపతులు రాంబాబు తండ్రి రాజేశం పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా స్వస్థలం జగిత్యాలకు వచ్చారు. కొన్ని రోజుల క్రితం దంపతులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంటి నుంచి బయటికి వెళ్లలేదు. మరోవైపు కరోనా ప్రభావంతో ఉన్న ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో ఉన్న ఇంటిని సైతం రాంబాబు..తన సోదరులు విక్రయించే ప్రయత్నం చేయగా గొడవలు జరిగినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెంది వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి దంపతులిద్దరూ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు మున్సిపల్ సిబ్బంది సాయంతో తలుపులు తొలగించి చూడగా... ఇద్దరు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించారు. సంతానలేమి కరోనా ప్రభావం ఆర్థిక ఇబ్బందులే దంపతులు ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అదృష్టం.. తృటిలో తప్పిన ప్రమాదం
-
కరోనా బాధితుడికి 1.5 కోట్ల బిల్లు మాఫీ!
సాధారణ సమయాల్లోనే చిన్న చిన్న జబ్బులకు సైతం వేల కొద్ది రూపాయల బిల్లు వసూలు చేసే ఆస్పత్రులను మనం చూస్తూనే ఉంటాం. ఇక కరోనా కాలంలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఓ ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ పేషెంట్ చికిత్స కోసం ఖర్చు అయిన భారీ మొత్తం... అక్షరాలా కోటిన్నర రూపాయల బిల్లును మాఫీ చేసి ఆదర్శప్రాయంగా నిలిచింది. ఉపాధి కోసం తమ దేశానికి వచ్చిన తెలంగాణ వాసికి ఊరట కల్పించింది. ఈ ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్: ఉపాధి కోసం దుబాయ్ బాట పట్టిన జగిత్యాల వాసికి మహమ్మారి కరోనా సోకింది. పనిచేస్తే గానీ నాలుగు రాళ్లు సంపాదించలేని స్థితిలో ప్రాణాంతక వైరస్ బారి నుంచి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. గల్ఫ్ కార్మికుల పరిరక్షణ సొసైటీ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త గుండెల్లి నరసింహ ముందుకు వచ్చారు. చొరవ తీసుకుని కోవిడ్ బాధితుడిని ఆల్ ఖలీజ్ రోడ్డులోని దుబాయ్ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం ఈ విషయాన్ని దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ వాలంటీర్ సుమంత్‌రెడ్డి దృష్టికి వెళ్లారు. బాధితుడికి ఆస్పత్రి బిల్లు కట్టే స్థోమత లేదని చెప్పడంతో సుమంత్‌రెడ్డి ఓ ట్రస్టుతో విషయం గురించి చర్చించి.. కన్సుల్(లేబర్) ఆఫ్ ఇండియన్ కాన్సులేట్ హర్జీత్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు స్పందించిన హర్జీత్ దుబాయ్ ఆస్పత్రి యాజమన్యానికి లేఖ రాయడంతో సానుకూల స్పందన వచ్చింది. దాదాపు రెండున్నర నెలలకు పైగా కరోనా పేషెంట్‌కు చికిత్స అందించిన ఆస్పత్రి 7,62,555 దీరాంలు(మన కరెన్సీలో సుమారు రూ. 1.52 కోట్లు) బిల్లును మాఫీ చేసింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం బాధితుడిని డిశ్చార్జ్ చేసింది. (‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’) ఈ నేపథ్యంలో జగిత్యాల వాసితో పాటు అతడి అటెండెంట్‌కు సైతం ఇండియా వెళ్లేందుకు దాతలు టికెట్లు బుక్ చేశారు. దీంతో వారిద్దరు ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో గల వారి స్వస్థలానికి పయనమయ్యారు. 14 రోజుల పాటు వీరిద్దరు క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం మంద భీంరెడ్డి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. -
హాస్టల్లో పేలిన సిలిండర్
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానీనగర్‌లో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం లో సోమవారం సిలిండర్ పేలింది. దీంతో రేకులషెడ్డు, భవనం కాంపౌండ్‌వాల్ కూలిపోయాయి. కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ప్రిన్సిపాల్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వసతి గృహంలో 400 మంది విద్యార్థినులున్నారు. సాయంత్రం వంటమనిషి అనసూర్య వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్‌కు మంటలు అంటుకోవడంతో అక్కడే ఉన్న ప్రిన్సిపాల్ మాధవికి విషయం చెప్పింది. అప్రమత్తమైన ఆమె విద్యార్థినులను వెంటనే బయటకు వెళ్లాలని సూచించడంతో వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఇంతలోనే భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మిగతా సిలిండర్లను తొలగించారు. భయాందోళనతో కన్నీరుమున్నీరవుతున్న విద్యార్థినులను వారు ఓదార్చారు. బాధ్యులపై చర్యలు: కొప్పుల ఘటన స్థలాన్ని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం రాత్రి సందర్శించారు. ఘటన జరిగిన తీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పదిళ్లకో బెల్టు షాపు..
ఈయన పేరు మల్లేశం. భార్య పేరు సాయమ్మ. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. రోజువారీ కూలీనే వీరి జీవనాధారం. వీరి ఇంటి పక్కనే బెల్ట్‌షాప్ ఉంది. మల్లేశం ప్రతిరోజూ తాగుడుకు రూ.250 నుంచి రూ.300 దాకా ఖర్చు చేయడం మొదలెట్టాడు. మెల్లమెల్లగా కూలీకి వెళ్లడమే మానేశాడు. సాయమ్మ ఒక్కతే కూలీకి వెళ్లి భర్త, పిల్లలను సాకాల్సిన దుస్థితి. తాగుడు మానేయాలని భర్తతో సాయమ్మ తరచూ గొడవపడేది. పది రోజుల కింద ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పట్టపగలే తాగిన మత్తులో ఉన్న మల్లేశం.. సాయమ్మను కత్తితో పొడిచి చంపాడు. తర్వాత తాను పొడుచుకుని ఆసుపత్రి పాలయ్యాడు! కోరుట్ల : ఇలాంటి అఘాయిత్యాలు ఒకట్రెండు కాదు.. పది రోజులకో నేరం.. నెలకో ఘోరం అక్కడ కామన్‌గా మారిపోయాయి. మద్యం ఏరులై పారుతుండటంతో ఆ మత్తులో చిక్కి కూలీలు చిత్తయిపోతున్నారు. ఇదెక్కడో అడవుల్లోని తండాలోనో, మారుమూల ఊరిలోనో జరుగుతున్న తంతు కాదు.. జగిత్యాల జిల్లా కోరుట్ల పరిధిలోని అల్లమయ్యగుట్టలో లిక్కర్ సృష్టిస్తున్న బీభత్సం! పది ఇళ్లకో బెల్ట్ షాపు: అల్లమయ్యగుట్ట కాలనీలో సుమారు 300 ఇళ్లు ఉండగా.. బెల్టు షాపులు 30 ఉన్నాయి. జనాభా 1,200 నుంచి 1,500 వరకు ఉంటుంది. కాలనీలో ఉన్నవారంతా రోజువారీ కూలీలే. ఉదయం లేచింది.. మొదలు సాయంత్రం వరకు అంతా పనిచేసి రాత్రి వేళ ఇంటికి చేరుకుంటారు. కాయకష్టం మరిచిపోవడానికి కూలీలు మద్యానికి అలవాటు పడ్డారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకున్న కొందరు బెల్ట్‌షాపులు ఇబ్బడిముబ్బడిగా తెరిచారు. గల్లీకో బెల్ట్‌షాపులు ఏర్పాటయ్యాయి. చిన్నచిన్న కిరాణా షాపుల్లో.. టేలల్లో.. ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ 24 గంటలు మద్యం(చీప్ లిక్కర్) అందుబాటులో ఉంటుంది. అది తాగి కూలీలు మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. తాగి గొడవలు పడటం.. పొద్దంతా కష్టించి సంపాదించిన డబ్బులు మద్యానికి ఖర్చు చేస్తుండటంతో కాలనీవాసుల బతుకులు చితికిపోతున్నాయి. మూడొంతుల కూలి మద్యానికే.. అల్లమయ్యగుట్ట కాలనీవాసులు రోజువారీ సంపాదించే కూలి డబ్బులో మూడొంతులు మద్యం కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. ఒక్కో బెల్ట్ షాపుకు మద్యం అమ్మకాలతో రోజుకు కనీసం రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు ఆదాయం ఉంటోంది. ఈ లెక్కన 30 బెల్ట్ షాపులకు కాలనీ వాసులు కూలీనాలి చేసి సంపాదించిన డబ్బుల్లోంచి ప్రతీరోజు రూ.60 వేల దాకా చేరుతోంది. ఇలా కాలనీవాసులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. అనేక నేరాలు జరుగుతున్నాయి. ‘మామూళ్ల’.. మత్తు! అల్లమయ్యగుట్ట కాలనీలో సగానికిపైగా జనం మద్యం మత్తులో మునిగి తేలుతుండగా.. అడ్డగోలుగా వెలిసిన బెల్ట్ షాపులను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మాముళ్ల మత్తులో జోగుతోంది. ఈ కాలనీని ఆనుకుని ఉన్న వేములవాడ ప్రధాన రహదారి వెంట దాదాపు నాలుగు బెల్ట్‌షాపులు ఉన్నాయి. కాలనీలో సుమారు 14 వీధులు ఉండగా వీధికి రెండు చొప్పున బెల్ట్‌షాపులు వెలిశాయి. వీటన్నింటికీ కోరుట్లలోని వైన్ షాపుల నుంచి మద్యం సరాఫరా అవుతోంది. ఈ విషయం తెలిసినా వైన్ షాపుల నుంచి నెలవారీ మాముళ్లు అందుతుండటంతో ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలనీకి చెందిన యువకులే అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించిన దాఖలాలు లేవు. ఆడోళ్లకు భద్రత లేదు మా కాలనీలో ఎక్కడపడితే అక్కడ మందు దొరుకుతంది. మొగోళ్లు పనులు బంద్ చేసి చీప్ లిక్కర్ తాగుతున్నరు. పొద్దస్తమానం తాగడంతో ఆడోళ్లు పరేషాన్ అవుతున్నరు. ఎప్పుడు ఆడోళ్ల మీద ఏం ఘోరం జరుగుతుందోనని భయపడుతున్నం. – ఎల్లవ్వ, అల్లమయ్యగుట్ట కాలనీ 24 గంటలు మందు.. కాలనీలో అంతా కూలీనాలి చేసుకునేటోళ్లమే. పెళ్లాం.. మెగుడు కలిసి పనిచేస్తే వచ్చేది రూ.500. అందులో తాగుడుకే సగం డబ్బులు పోతున్నయ్. కాలనీలో ఎక్కడపడితే అక్కడ లిక్కర్ అమ్ముతున్నరు. - వీరభద్ర నగేశ్, అల్లమయ్యగుట్ట కాలనీ -
ఆపద 'మొక్క'లవాడు!
జగిత్యాల అగ్రికల్చర్: ఆ గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలంటే, ఆలయ పరిసరాల్లో ఓ మొక్క నాటాల్సిందే. పూజకు తీసుకువచ్చే తాంబూలంలో కొబ్బరికాయకు బదులు ఓ మొక్క పెట్టుకురావాల్సిందే.కొబ్బరికాయ కొడితే మనలోని అహంకారం దూరమవుతుందని పెద్దలు చెబుతుంటే.. ఆ దేవాలయ కమిటీ మాత్రం కొబ్బరికాయకు బదులు ఓ మొక్క నాటితే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని చెబుతుంది. దీంతో, దేవాలయానికి వచ్చే భక్తులు ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటుతున్నారు. ఫలితంగా ఆలయ పరిసరాలంతా పచ్చని చెట్లతో కళకళలాడుతూ ప్రకృతి ఆనందం పరవశిస్తోంది. ఆ దేవాలయమే జగిత్యాల జిల్లా కేంద్రానికి 5 కి.మీ దూరంలో ఉన్న లక్ష్మీపూర్ శ్రీలక్ష్మీవేంకటేశ్వర ఆలయం. గుట్టపై నిర్మించిన దేవాలయం లక్ష్మీపూర్ గ్రామస్తులు ప్రభుత్వ సహాయం లేకుండా 2005లో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దాదాపు రూ.20 లక్షల వ్యయంతో ఆధునిక హంగులతో నిర్మించుకున్నారు. ఆలయంలో జరిగే రోజువారీ పూజా కార్యక్రమాల కోసం చందాలు పోగు చేసి రూ.12 లక్షలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీని ద్వారా ఏటా వచ్చే వడ్డీతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఏటా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర కల్యాణం వైభవంగా జరిపిస్తున్నారు. కార్యక్రమంలో భక్తులు అన్నదానంతోపాటు, మరో రూ.2 లక్షల వరకు స్వామివారి కల్యాణానికి కానుకలుగా వస్తుంటాయి. ఆలయ కమిటీని రెండేళ్లకోమారు అన్నికులాల నుంచి ఎన్నుకుంటారు. ఆలయ కమిటీ ప్రతీ శనివారం ఆలయ ఆవరణలో భజన చేయడమే కాకుండా, దేవాలయ అభివృద్ధిపై చర్చిస్తారు. ఈ కమిటీ సమావేశానికి ఒక్క నిమిషం ఆలస్యమైన రూ 100 జరిమానా విధించుకుని, ఆ జరిమానాను సైతం దేవుడి హుండీలో వేస్తుండటం విశేషం. పచ్చని చెట్ల మధ్య భక్తుల ధ్యానం ఆ దేవాలయానికి వచ్చిన భక్తుల్లో కొందరు ఉదయం, సాయంత్రం వేళల్లో పచ్చని చెట్ల మధ్య యోగాతో పాటు ధ్యానం చేస్తుంటారు. ఓ వైపు గుట్టపైన ఉండటం, మరో వైపు చల్లని గాలులు వీస్తుండటంతో, రక రకాల దీక్షలు తీసుకునే స్వాములు సైతం ఇక్కడే సేద తీరుతుంటారు. గుట్ట చుట్టూ పచ్చని పొలాలు, పంటలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. అందుకే దేవాలయానికి వచ్చే భక్తులు ఒక్క మొక్క నాటితే, ప్రతీసారి దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి కంటే ముందు తను నాటిన మొక్కనే ఎలా ఉందో చూసుకుంటున్నారని దేవాలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. పూజారి ప్రోద్బలంతో పచ్చని చెట్లు రిటైర్డ్ వ్యవసాయ విస్తీరణాదికారి, దేవాలయ పూజారి అయిన కూర్మాచలం రంగాచార్యులు ప్రోద్బలంతో దేవాలయ కమిటీ ఆలయ పరిసరాల్లో పచ్చదనానికి కృషి చేస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హారితహారంతో సంబంధం లేకుండా, ప్రతి ఏటా ఆలయం పరిసరాల్లో కనీసం 200–300 రకాల మొక్కలు నాటుతుంటారు. దీనివల్ల దేవాలయమంతా మామిడి, జామ, ఉసిరి, మేడిచెట్టు, అల్లనేరడి, పత్రి పండు, మారేడుకాయ వంటి పండ్లు, గులాబీ, చేమంతి, మల్లె, మందారం వంటి పూలతోపాటు, వేప, టేకు వంటి నీడనీచ్చె చెట్లు అలంకరణ మొక్కలు కూడా భక్తులకు కనువిందు చేస్తుంటాయి. చెట్లు ఎండిపోకుండా డ్రిప్‌తో నీటి సౌకర్యం కూడా కల్పించడం గమనార్హం. -
కలిచివేసిన ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, గొల్లపల్లి: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. గొల్లపల్లి మండలం చిల్వకుడూరు గ్రామ శివారులోని వంతెన వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదంలో గొల్లపల్లి మండలం చెందొలి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు చిప్ప రాములు, చిప్ప సందీప్, చిప్ప వినోద్‌లు మృతి చెందారు. మృతులు జగిత్యాల నుండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే ముగ్గురూ ప్రాణాలు వదిలారు. బైకు పక్కనే మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడం అందరినీ కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలవడంతో చెందొలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కోతిని మింగిన కొండచిలువ
జగిత్యాలక్రైం: మానవజాతి ఆకారంతోనే వికృతచేష్టలు చేసే కోతి హఠాత్తుగా కొండచిలువ కంటపడటంతో అది కోతిని మింగేసిన సంఘటన జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వెల్దుర్తి గ్రామ శివారులోని జాబితాపూర్ ఊర చెరువు పక్కన ఓ భారీ కొండచిలువ కోతిని మింగి అస్వస్థతతో రోడ్డు పక్కన ఉండటం గ్రామస్తుల కంట పడింది. ఆందోళన చెందిన వారు కొండచిలువను చంపగా దాని కడుపులోంచి కోతి బయటపడటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. -
ఒంటరిని చేసి..
- అత్తారింట్లో ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య - మృతురాలికి రెండు నెలల బాబు - దుబాయ్‌లో చిన్నారి తండ్రి - మాతృదినోత్సవానికి ఒక రోజు ముందు ఘటన జగిత్యాల రూరల్: తల్లి చేతి గోరు ముద్దలు తినాల్సిన చిన్నారి ఒంటరయ్యాడు. అప్పటి వరకు అమ్మ ఒడిలో ఆటలాడిన పసివాడు నిమిషాల వ్యవధిలో మాతృ ప్రేమకు దూరమయ్యాడు. అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారిని వదిలి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి పొద్దు పోయాక చోటు చేసుకుంది. మాతృ దినోత్సవానికి ఒక రోజు ముందే జరిగిన ఈ ఘటనల అందరిని కలిచివేసింది. జగిత్యాల పట్టణంలోని సాయిబాబా ఆలయ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటున్న బొమ్మకంటి నవ్య(27) శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నిర్మల్ జిల్లా బజార్హత్నూర్ మండలం దహెగం గ్రామానికి చెందిన నవ్యను మూడు సంవత్సరాల క్రితం జగిత్యాల పట్టణానికి చెందిన బొమ్మకంటి ధీరజ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం అయినప్పటి నుంచి ధీరజ్, నవ్యలు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవలే దుబాయ్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ధీరజ్‌కు ఉద్యోగం రావడంతో ఆరు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. నవ్య రెండు నెలల క్రితం బాబుకు జన్మనివ్వడంతో 21వ రోజు మార్చి 16న జరుగగా ధీరజ్ వచ్చి వెళ్లాడు. జగిత్యాలలోని ఓ అపార్ట్మెంట్లో అత్త శాంతతో కలిసి ఉంటున్న నవ్య తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం గ్రామంలో ఓ చిన్నపాటి గొడవతో మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి మానసికంగా ఇబ్బంది పడుతున్న నవ్య అపార్ట్మెంట్లో కూడా ఒంటరిగా ఉండేది. శుక్రవారం సాయంత్రం మూడున్నర గంటల సమయంలో అత్త శాంత పని నిమిత్తం బయటకు వెళ్లగా నవ్య రెండు నెలల కుమారుడిని పక్క ఇంట్లో వారికి ఇచ్చి మళ్లీ వస్తానని చెప్పి బెడ్రూంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్త శాంత నాలుగు గంటల సమయంలో ఇంట్లోకి వచ్చేసరికి నవ్య మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్ధలికి చేరుకున్న డీఎస్పీ కరుణాకర్, రూరల్ సీఐ శ్రీనివాస్‌చౌదరి, ఎస్సై కృష్ణలు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. దుబాయ్‌లో ఉన్న భర్త ధీరజ్‌కు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. -
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆ గ్రామ ప్రజలకు కొత్త కష్టం
-
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ, ఇద్దరు మృతి
జగిత్యాల: జిల్లాలోని మేడిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో లారీ డ్రైవర్, క్లీనర్లు మృతి చెందారు. కాగా, బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది గాయాలపాలైయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
విద్యుదాఘాతానికి యువరైతు బలి
జగిత్యాల: అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలం శానబండలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణు(32) పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
సెల్‌ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
జగిత్యాల: సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఉదయం జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాలలో చోటు చేసుకుంది. స్ధానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తిరుపతి ఏడో తరగతి చదువుతున్నాడు. తన స్నేహితులందరికీ వద్ద సెల్‌ఫోన్ ఉందని.. తనకూ ఓ సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగాడు. చిన్నవయసులో ఫోన్ ఇవ్వడం మంచిది కాదని భావించిన తల్లిదండ్రులు అప్పుడే వద్దని చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన తిరుపతి బుధవారం ఉదయం పాఠశాల ఆవరణలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు ప్రధానోపాధ్యాయునికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలాన్నిపరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జగిత్యాలలో ప్రేమజంట ఆత్మహత్య
-
జగిత్యాలలో ప్రేమజంట ఆత్మహత్య
జగిత్యాల : జగిత్యాల జిల్లాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. మెట్పల్లి మండలం గాజులపేటలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాయిరాజు, మనీషా అనే ప్రేమజంట శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్లోకి దూకారు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కెనాల్ సమీపంలో సూసైడ్ నోట్ దొరికినట్లు తెలుస్తోంది. ఇరువురి కుటుంబ సభ్యులు తమ ప్రేమకు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పునర్విభజనతో కరీంనగర్‌కు ప్రయోజనం చేకూరుతుంది
-
మినహాయిస్తే మేలు..
విద్యాసంస్థల భవనాల్లో కార్యాలయాలు వద్దన ప్రభుత్వం పెద్దపల్లి ఐటీఐ భవనంలో సాగుతున్న కలెక్టరేట్ పనులు భవిత పాఠశాల భవనం ఎస్ఎస్ఏకు కేటాయింపు వసతిగృహాలను తరలించే యోచనలోనే అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సంఘాలు పెద్దపల్లిరూరల్/జగిత్యాల అర్బన్ : ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన భవనాల్లో కొత్త జిల్లాలకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. విద్యాసంస్థల భవనాలను తీసుకోవడాన్ని నిరసిస్తూ పలుచోట్ల విద్యార్థులు ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం విద్యాసంస్థలను నిర్వహిస్తున్న భవనాలను మినహాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అలాంటి భవనాలను ఎంపిక చేస్తే.. వాటి స్థానంలో ప్రత్యామ్నాయం చూడాలని సూచించింది. అయితే జగిత్యాల, పెద్దపల్లిలో పలు విద్యాసంస్థల భవనాల్లో మాత్రం పనులు యథాతథంగా కొనసాగుతుండటం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. పెద్దపల్లి ఐటీఐలో కలెక్టరేట్.. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ భవనాల్లోనే కలెక్టరేట్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించడంతో పనులు చకాచకా సాగుతున్నాయి. ఐటీఐలో ప్రభుత్వ కార్యాలయాలు వద్దని, వసతిగహాలకు మినహాయింపు ఇవ్వాలని పెద్దపల్లిలో విద్యార్థులు ఆందోళనలకు దిగిన విషయం విదితమే. అయినా పెద్దపల్లిలో జిల్లా కార్యాలయాలకు కేటాయించిన విద్యాసంస్థలు, వసతిగహ భవనాల్లోనే కొత్త కార్యాలయాల పనులను అధికారులు కొనసాగిస్తున్నారు. పెద్దపల్లిలో 52 ఏళ్ల క్రితం ఏర్పాౖటెన ఐటీఐ ఇప్పుడు క్యూఐసీ (క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కు ఎంపికైంది. ఇందులో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు విద్యార్థుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి తరుణంలో ఐటీఐ భవనాల్లో కలెక్టరేట్‌కు అనుగుణంగా పనులు చేపడుతున్నారు. ఐటీఐ విద్యార్థులను ఆవరణలోని షెడ్లలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న ఐటీఐ చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఆదాయం రావడంతోపాటు విద్యార్థుల అవసరాలకు తగ్గట్టు నిర్మాణాలు చేసుకునేందుకు వీలుండేదంటున్నారు. ప్రభుత్వాదేశాలను ఇక్కడి అధికారులు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం విద్యాసంస్థలను మినహాయించాలని ఇచ్చిన ఆదేశాల మేరకైనా ఐటీఐలో నిర్మాణాలు ఆపితే బాగుండేదని ప్రిన్సిపాల్ సురేందర్ అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో... పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో ఆర్ఐవో, ఆర్వీఈవో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాలేజీలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇబ్బందులు ఎదురవుతాయని కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. భవిత కేంద్రంలో... పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో బుద్ధిమాంద్యం, ప్రత్యేకావసరాలు గల పిల్లలకోసం నిర్మించిన భవిత కేంద్రాన్ని ఖాళీ చేయించి సర్వశిక్షాభియాన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవిత కేంద్రాన్ని ఏదైనా పాఠశాల ఆవరణలోకి మార్చాలని సూచించారు. అయితే బుద్ధిమాంద్యం, వైకల్యం గల పిల్లలకోసం ర్యాంపును నిర్మించి పైపులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవేవీ పట్టని అధికారులు ఖాళీ చేయాలంటూ ఆదేశాలివ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 16మంది విద్యార్థులున్నారు. తప్పనిసరైతే ప్రత్యామ్నాయ భవనంలో పిల్లల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టిన తర్వాతే అందులోకి పంపాలని కోరుతున్నారు. ప్రగతినగర్ హాస్టల్‌పై కన్ను.. పెద్దపల్లి ప్రగతినగర్ చౌరస్తావద్ద కొత్తగా నిర్మించిన ఎస్సీ బాలుర వసతిగహాన్ని అన్ని ఇంజనీరింగ్ శాఖల ఎస్ఈలకు కేటాయించారు. ఈ హాస్టల్లో ఉన్న విద్యార్థులను సమీపంలోని ఎస్సీ హాస్టల్–2కు పంపించే యోచనలో ఉన్నారు. రాజీవ్ రహదారి పక్కనే ఉండటంతో ఈ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకే అధికారులు మొగ్గు చూపుతున్నారు. అయితే కొత్త హాస్టల్లో నీటివసతి ఉందని, అవసరమైతే ఎస్సీ హాస్టల్–2నే ఇందులోకి మార్చి, అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నా అభ్యంతరం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. తమను ఇబ్బందులకు గురిచేసి తమ చదువులను పాడు చేయవద్దని వేడుకుంటున్నారు. ఆదేశాలు అందలేదు.. –అశోక్‌కుమార్, ఆర్డీఓ జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు విద్యాసంస్థలను మినహాయింపు ఇవ్వాలనే ఆదేశాలేమీ అందలేదు. ప్రభుత్వ ఐటీఐలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టరేట్ కార్యాలయ పనులు సాగుతున్నాయి. ప్రగతినగర్ వసతిగహంతోపాటు రంగంపల్లిలోని ఆనంద నిలయంలోనూ కార్యాలయాల ఏర్పాటు చేస్తాం. విద్యార్థుల పరిస్థితి ఎలా? జగిత్యాల అర్బన్ : జగిత్యాలలోని ఎస్టీ హాస్టల్‌ను జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి కేటాయించారు. హాస్టల్లో 96 మంది విద్యార్థులు ఉంటున్నారు. పక్కన ఎస్సీ–1, ఎస్సీ–2 వసతిగహాలు ఉన్నాయి. ఎస్సీ–1 హాస్టల్లో ఉన్న 70 మంది విద్యార్థులను ఎస్సీ–2 హాస్టల్‌కు తరలించారు. ఎస్సీ–1 భవనంలోకి ఎస్టీ విద్యార్థులను తరలించారు. ఎస్సీ–2 హాస్టల్లో ఉన్న 70 మంది, ఎస్సీ–1లోని 70 మంది మొత్తం 140 మంది విద్యార్థులు ఒకే వసతిగహంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నూతన బిల్డింగ్‌లో కొనసాగుతున్న ఎస్సీ హాస్టల్ వసతిగహాన్ని పాత ఎస్సీ హాస్టల్–1లోకి కేటాయించారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందులో మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. పాతభవనం కావడంతో బాత్రూమ్లు సక్రమంగా లేవు. రూములు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. వంటగదులు అనుకూలంగా లేవు. నీటివసతి లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఎస్టీ హాస్టల్ భవనంలో ఎస్పీ, ఏఎస్పీ ఆఫీసులతోపాటు ఇతర చాంబర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.6లక్షల వ్యయంతో మరమ్మతులు చేపడుతున్నారు. గదులను కూల్చి చాంబర్లకు అనుకూలమైన రీతిలో కడుతున్నారు. ఇప్పటికే సగం మేర మరమ్మతులు పూర్తిచేశారు. విద్యాసంస్థల భవనాలను మినహాయించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. -
జగిత్యాల మార్కెట్ కమిటీచైర్మన్‌గా శీలం ప్రియాంక
జగిత్యాల రూరల్: జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్‌గా శీలం ప్రియాంక, వైస్‌చైర్మన్‌గా ఖాజా లియాకత్‌అలీ మొసిన్ ఎంపికయ్యారు. డైరెక్టర్లుగా బోనగిరి నారాయణ(అంతర్గాం), బోడుగం మహేందర్‌రెడ్డి(లక్ష్మీపూర్), గడ్డం రమణారెడ్డి (తక్కళ్లపల్లి), పునుగోటి కమలాకర్‌రావు (మోరపల్లి), నాడెం శంకర్ (తాటిపల్లి), కచ్చు లత, దేవరశెట్టి జనార్దన్, రంగు వేణుగోపాల్(జగిత్యాల)ను నియమించారు. -
ముళ్లపొదల్లో పసికూన
ఆడపిల్ల అని బయటపడేసిన వైనం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం లింగనిర్ధారణ కోసం ఆస్పత్రికి తరలింపు జగిత్యాల అర్బన్ : ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మీ జన్మించిందనే ఆనందంలో సంబరాలుచేసుకుంటారు. జగిత్యాలలో ఓ జంట ఆడపిల్ల పుట్టిందని ఆస్యహించుకుంది. ఆ పసికూనను బయటపడేసింది. మనసును కదిలించిన ఈ సంఘటన వివరాలు ఇవీ.. మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మికి చెందిన నాలుగో వార్డులో కళాశాల వెనుక వైపు ఓముళ్లపొదల్లో శనివారం పసికూన పడిఉంది. అక్కడే చిన్నారులు ఆడుకుంటున్నారు. పందులు ఆ పసికందును నొటకరుచుకువచ్చి చిందరవందర చేస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన చిన్నారులు ఇంట్లోని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పందులను వెళ్లగొట్టారు. వెంటనే చైర్పర్సన్ విజయలక్ష్మికి సమాచారం అందించారు. ఆమె సీఐ కరుణాకర్‌రావుకు ఫోన్లో సమాచారం అందించారు. పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని పసికూన మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆడపిల్లపై సంశయం విద్యానగర్‌లో ముళ్లపొదల్లో దొరికిన పసికందు ఆడపిల్లనా, మగపిల్లనా అని సంశయం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు మాత్రం ఆడపిల్ల అని చెప్పినప్పటికీ పందులు పూర్తిగా మార్మాలయాలను పీక్కు తినడంతో నిర్ధారణ కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్య సిబ్బంది అందుబాటులో లేక నిర్ధారణ కోసం మృతదేహాన్ని భద్రపరిచినట్లు ఎస్సై రాజేశ్వర్ తెలిపారు. స్థానికులు మాత్రం ఆడపిల్లనేనని మొదట్లో చూసినట్లు వారు వివరించారు. -
తెలంగాణ పక్షపాతి వైఎస్సార్
వైఎస్సార్ చొరవతోనే ప్రాజెక్ట్‌లరూపకల్పన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి జగిత్యాల రూరల్: తెలంగాణకు సాగునీర ందించాలనే సంకల్పంతో ప్రాజెక్ట్‌ల రూపకల్పన చేసిన రాజశేఖరరెడ్డి రైతుపక్షపాతిగా నిలిచారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలోని తన నివాసగృహంలో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌తోకలిసి వైఎస్సార్ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ప్రమాణస్వీకారం చేసి వ్యవసాయానికి 9గంటల ఉచితవిద్యుత్ ఇచ్చారని కొనియాడారు. పంటకు మద్దతు ధర కల్పించడం, రుణమాఫీ కల్పించి రైతుల్లో వ్యవసాయంపై నమ్మకం కలిగేలా చేశారన్నారు. వైఎస్సార్ భౌతికంగా దూరమైనా ప్రజలమదిలో ఇంకా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సంక్షేమపథకాలు దేశప్రతిష్టతను పెంపొందించాయన్నారు. నిరుపేద విద్యార్థులకు చదువు దూరంకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. 108 ద్వారా ఎంతో మందికి ప్రాణాలు కాపాడిన ఘనత వైఎస్సార్‌దేనని, 108కు వైఎస్సార్ అంబులెన్స్‌గా నామకరణం చేయాలని కోరారు. తెలంగాణలోని ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా తీసుకురావాలని ఎంతో కృషి చేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎల్లంపల్లి నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందన్నారు. సారంగాపూర్ జెడ్పీటీసీ భూక్య సరళ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, వైస్ ఎంపీపీ గంగం మహేశ్, నాయకులు గర్వందుల నరేశ్‌గౌడ్, గోపి రాజేశ్, ముకేశ్‌ఖన్నా పాల్గొన్నారు. -
పెరగనున్న కోర్టుల సంఖ్య
అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీ కలిసి నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వం ఒక్కో జిల్లా కేంద్రంలో దాదాపు 13 కోర్టులు జగిత్యాల జోన్ : కొత్త జిల్లాలుగా మారనున్న జగిత్యాల, పెద్దపల్లి పట్టణాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటు, సిబ్బందిని నియమించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాల్లో కోర్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని న్యాయవాదులు అంటున్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు, రవాణా భారం తగ్గించేందుకు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మరిన్ని కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీలు కలిసి నూతన కోర్టుల ఏర్పాటుపై హైకోర్టుకు నివేదిక ఇవ్వగానే, కోర్టుల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం ఉన్న కోర్టులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా ప్రధాన న్యాయస్థానంతో పాటు మొదటి, మూడవ అదనపు కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టు, ఎసీబీ కోర్టు, ఐదు మేజిస్ట్రేట్ కోర్టులు, రెండు సబ్ కోర్టులు, ఒక సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, వినియోగదారుల ఫోరం, లోక్ అదాలత్‌లు ఉన్నాయి. జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, వేములవాడ, హుస్నాబాద్‌లలో మేజిస్ట్రేట్ కోర్టులు ఉండగా, మంథని, పెద్దపల్లిలలో మేజిస్ట్రేట్ కోర్టులతో పాటు సబ్ కోర్టులు ఉన్నాయి. సిరిసిల్లలో సబ్ కోర్టుతో పాటు రెండు మేజిస్ట్రేట్ కోర్టులు, హుజురాబాద్‌లో సబ్ కోర్టులో పాటు మూడు మేజిస్ట్రేట్ కోర్టులు, గోదావరిఖనిలో అదనపు జిల్లా కోర్టుతో పాటు మేజిస్ట్రేట్ కోర్టు, జగిత్యాలలో అదనపు జిల్లా కోర్టుతో పాటు సబ్ కోర్టు, మూడు మేజిస్ట్రేట్ కోర్టులు, ఒక సెకండ్ క్లాస్ కోర్టులు ఉన్నాయి. జగిత్యాల, పెద్దపల్లిలో పెరగనున్న కోర్టుల సంఖ్య జగిత్యాలలో ప్రస్తుతం ఉన్న ఆరు కోర్టులకు, పెద్దపల్లిలో ఉన్న రెండు కోర్టులకు అదనంగా వినియోగదారుల ఫోరం, ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టు, జిల్లా ప్రధాన న్యాయస్థానం, ఎకై ్సజ్ కోర్టు, పీసీఆర్ కోర్టు, లేబర్ కోర్టు, పర్మినెంట్ లోక్‌అదాలత్‌లు రానున్నాయి. నూతన జిల్లాలోని మండలాల సంఖ్య తక్కువగా ఉండటంతో, కొత్తగా ఏర్పాటు చేసే కోర్టులను అయా జిల్లాలోని ఇతర మండలాల్లో కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, రామగుండం తదితర ప్రాంతాల్లో మరిన్ని కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. జగిత్యాల జిల్లాలో మెట్పల్లిలో సబ్‌కోర్టు, ధర్మపురి, కొండగట్టులో మున్సిఫ్ కోర్టులు ఏర్పాటు చేసే అలోచనలు సైతం ఉన్నాయి. పూర్తి స్థాయి నివేదిక అందగానే.. అయా ప్రాంతాల్లోని బార్ అసోసియేషన్ల న్యాయవాదులు, ప్రజాప్రతినిధుల నుంచి కొత్త కోర్టులకు సంబంధించిన విషయాలను రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో పాటు న్యాయశాఖ కార్యదర్శి సేకరిస్తారు. నివేదికను హైకోర్టుతో పాటు ప్రభుత్వానికి అందజేస్తారు. కొత్త జిల్లాల్లో నూతన కోర్టులు ఏర్పాటు చేయడం లేదంటే ఉన్న కోర్టులను ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. జగిత్యాలలో కొత్త కోర్టులు ఏర్పడే అవకాశం ఉన్నందున జగిత్యాల న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో ఉన్న జగిత్యాల స్పెషల్ సబ్ జైలును ధరూర్ క్యాంప్‌కు తరలించాలని ప్రభుత్వానికి విన్నవించారు. కోర్టుల ఏర్పాటుతో సత్వర న్యాయం – బండ భాస్కర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, జగిత్యాల కొత్త కోర్టులను స్వాగతిస్తున్నాం. కొత్త కోర్టుల ఏర్పాటుతో కక్షిదారులకు రవాణాభారం తగ్గడమే కాకుండా సత్వర న్యాయం అందే అవకాశాలున్నాయి. ఒక్కో జిల్లాకు దాదాపు 13 కోర్టులు వచ్చే అవకాశం ఉంది. అవసరమైన మండలాల్లో సైతం కోర్టులు ఏర్పాటు చేయాలి. పెండింగ్ భారం తగ్గుతుంది –కటుకం చంద్రమోహన్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, జగిత్యాల కొన్ని కేసుల్లో కక్షిదారులు కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్తున్నారు. కొత్త కోర్టుల ద్వారా ఏ జిల్లాలో కేసులను ఆ జిల్లాలోనే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. కోర్టులతో పాటు జడ్జి పోస్టులను పెంచితే కక్షిదారులకు సత్వర న్యాయం జరుగనుంది. -
నాగదేవతల విగ్రహాలు ధ్వంసం
వీహెచ్‌పీ, బీజేపీ నాయకుల ఆందోళన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు జగిత్యాల అర్బన్ : జగిత్యాల పట్టణం మంచినీళ్ల బావి సమీపంలోని మడలేశ్వరస్వామి ఆలయం ఆవరణలోని రావిచెట్టు కింద ఉన్న నాగదేవతల విగ్రహాలను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న రజక సంఘం నాయకులు వీహెచ్‌పీ, బీజేపీ నాయకులతో కలిసి నిజమాబాద్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఓ పథకం ప్రకారమే దుండగులు విగ్రహాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. స్థానిక ఎస్సై శివకృష్ణ అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పేందుకు యత్నించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేవరకు ఇక్కడి నుంచి కదలమని భీష్మించారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ కరుణాకర్‌రావుకు ఫిర్యాదు చేశారు.మంచినీళ్ల బావి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
అధికారులపై సభ్యుల ఆగ్రహం
రుణమాఫీ తీరుపై కాంగ్రెస్ వాకౌట్ జగిత్యాల రూరల్ : జగిత్యాల మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల పని తీరుపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీపీ గర్వందుల మానస అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. అన్ని అర్హతలున్న 66 మంది రైతులకు రుణమాఫీ కాలేదని బాలపల్లి సర్పంచ్ గుంటి గంగారాం, వడగండ్ల పంట నష్టపరిహారం అంద లేదని వెల్దుర్తి సర్పంచ్ పోతుగంటి సత్యనారాయణ ప్రశ్నించారు. నివేదిక సమర్పించామని విడుదల కాగానే అందిస్తామని ఏవో రాంచంద్రం తెలిపారు. పశువైద్యాధికారి అజారోద్దీన్ మాట్లాడుతూ మండలంలో 14 వేల పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశామని చెబుతుండగా టీకాలు సరిపోక గొర్రెలకాపరులు ప్రై వేటు షాపుల్లో కొనుగోలు చేస్తున్నారని బాలపల్లి సర్పంచ్ గంగారాం నిలదీశారు. డెప్యూటీ డీఈవో హాజరుకాకపోవడంతో ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించిన వారినే పాఠశాలల్లో హెల్పర్లుగా నియమించాలని మోతె ఎంపీటీసీ శ్రీరాముల గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు గంగం మహేశ్, హబ్సీపూర్ ఎంపీటీసీ ముస్కు దామోదర్‌రెడ్డి, ధరూర్ ఎంపీటీసీ శీలం సురేందర్ కోరగా ఎంఈవో హామీ ఇచ్చారు. ధరూర్‌కు కేటాయించిన డీజీబీ బ్యాంక్‌ను వెంటనే గ్రామంలో ఏర్పాటు చేయించాలని ఎంపీటీసీ శీలం సురేందర్, మోతె ఎంపీటీసీ శ్రీరాముల గంగాధర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రజాప్రతినిధులు చూడాలని ఎంపీపీ కోరారు. టీఆర్‌నగర్‌కు నిధులు కేటాయించాలని సర్పంచ్ కొండ శ్రీనివాస్ కోరారు. చెరువులు, కుంటలు నింపకుండా ఎస్సారెస్పీ నీటిని ఎల్ఎండీకి తరలించడంపై కాంగ్రెస్ ఎంపీటీసీలు, సర్పంచులు సభను బహిష్కరించారు. కార్యాలయం బయట నినాదాలు చేశారు. జెడ్పీటీసీ పెండెం నాగలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీల్లో అందిస్తున్న భోజనానికి బదులు సరుకులు నేరుగా ఇవ్వాలని కోరగా సాధ్యం కాదని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ తెలిపారు. పొలాసలోని రెండు అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా పని చేయడం లేదని సర్పంచ్ చిర్ర నరేశ్ సభ దష్టికి తీసుకువచ్చారు. చెరువులు, కుంటలు ఎస్సారెస్పీ నీటితో నింపాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. మిషన్ కాకతీయ ద్వారా జరిగిన పనుల్లో నాణ్యత లేదని ఎంపీటీసీ రాజన్న, నర్సింగాపూర్ ఎంపీటీసీ రొండి రాజనర్సయ్య అధికారుల దష్టికి తీసుకెళ్లారు. ఎంపీడీవో శ్రీలతరెడ్డి, డాక్టర్ జైపాల్‌రెడ్డి, ఏఈలు సదాశివరెడ్డి, రఘునందన్, శంషేర్‌అలీ, దివ్యశ్రీ, కుమారస్వామి, ఆయాగ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
ఇక జగిత్యాల జిల్లా
మారనున్న రూపురేఖలు దసరాకు ఆవిర్భావం జగిత్యాల అర్బన్: కొత్త జిల్లాలపై వచ్చేవారమే నోటిఫికేషన్ రానుంది. జగిత్యాల ఇక జిల్లా కేంద్రంగా మారనుంది. ప్రభుత్వం 23 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ఇప్పటికే సీసీఎల్ఏ నోటిఫికేషన్ జారీచేసింది. విజయదశమి నుంచి నూతన జిల్లా కేంద్రాల పరిపాలన చేపట్టేందుకు రెవెన్యూ, సీసీఎల్ఏ ఇప్పటికే సన్నాహాలు పూర్తిచేసింది. అవసరమైన మౌలిక వసతులు, ప్రత్యావ్నూయ ఏర్పాట్ల బాధ్యతలు కలెక్టర్లకు అప్పగించింది. అధికారులు, ఉద్యోగుల రేషనలైజేషన్ కోసం ప్రభుత్వం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది. కరీంనగర్ తర్వాత జిల్లాలో జగిత్యాల అతిపెద్ద పట్టణం. గ్రేడ్–1 మున్సిపాలిటీ కూడా. జిల్లా ఏర్పాటుపై ఇప్పటికే సబ్‌కలెక్టర్ శశాంక నివేదిక అందజేశారు. ఈ ప్రాంతంలోని 20 మండలాలను కలుపుతూ జిల్లా చేయొచ్చని ప్రతిపాదించారు. జగిత్యాలలో జగిత్యాల అర్బన్, రాయికల్, సారంగాపూర్, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ధర్మపురి, పెగడపల్లి, మల్యాల, కొడిమ్యాల, కథలాపూర్, మేడిపల్లి, కోరుట్ల అర్బన్, మెట్పల్లి అర్బన్, ధర్మారం, వెల్గటూర్తో పాటు కొత్తగా జగిత్యాల రూరల్, కోరుట్ల రూరల్, మెట్పల్లి రూరల్, బుగ్గారం మండలాలుగా ఏర్పాటుచేసి కొత్త జిల్లాలో కలపనున్నారు.ప్రస్తుతం జిల్లాల జాబితాలో సిరిసిల్లకు చోటు దక్కకపోవడంతో మరిన్ని మండలాలు జగిత్యాల కలిసే అవకాశాలు ఉన్నాయి. అంతేగాకుండా రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో ఒకటి జగిత్యాల కాగా, రెండోది కోరుట్లగా అధికారులు నిర్ణయించారు. నూకపల్లిలో కలక్టరేట్ జగిత్యాల కలక్టరేట్ సముదాయాన్ని పట్టణానికి 10 కి.మీ దూరంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (న్యాక్) భవన ంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. కానీ.. ఇది దూరంగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కలక్టరేట్ ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయి. ధరూర్‌లో స్థలఅన్వేషణ జగిత్యాల కలెక్టర్ కార్యాలయం కోసం పట్టణంలోని ధరూర్ క్యాంపులోని 75 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇందులో కలక్టరేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మారనున్న రూపురేఖలు ప్రస్తుతం టవర్‌సర్కిల్ నుంచి ఎటు 3 కి.మీ ప్రాంతంలో విస్తరించి ఉంది. 38 వార్డులు ఉండగా 1,00,863 జనాభా కలిగి ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో చుట్టూ గ్రామాలైన మోతె, తిప్పన్నపేట, చల్గల్, లింగంపేట, హుస్నాబాద్, పూర్తిస్థాయిలో విలీనం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో పట్టణ జనాభా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా జగిత్యాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. జిల్లా కేంద్రం కానుండటంతో విద్య, వైద్య సౌకర్యాలూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. చదువుల కోవెలగా.. జగిత్యాల డివిజన్ కేంద్రం ఇప్పటికే చదువుల కోవెలగా పేరుగాంచింది. కొండగట్టులోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలతో పాటు పొలాసలో వ్యవసాయ పరిశోధన స్థానం, అగ్రికల్చర్ కాలేజీ, బీఎస్సీ నర్సింగ్ కళాశాలతో పాటు ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలూ ఉన్నాయి. జిల్లా కేంద్రంగా మారితే మరిన్ని కళాశాలు వచ్చే అవకాశాలున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రముఖ కవులు కేవీ.నరేందర్, బీఎస్.రావ¬లు, సంగవేని రవీంద్ర, చరిత్రకారులు జైశెట్టి రమణయ్య వీరు కరీంనగర్ జిల్లాలో ప్రాముఖ్యం సంపాదించారు. వీరు జగిత్యాల ప్రాంతానికి చెందిన వారు. పట్టణంలో ముఖ్యంగా ఖిల్లా పర్యాటక కేంద్రంగా మారనుంది. జగిత్యాలలోని చింతకుంట చెరువును సైతం మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చనున్నారు. వ్యవసాయం జగిత్యాల జిల్లా పరిధిలో ముఖ్యంగా వరి ప్రధానమైన పంట. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీరు సుమారు 3 లక్షల ఎకరాల్లో సాగునీరు అందుతుంది. ఇక్కడ ప్రధానమైన పంట వరి కావడంతో పాటు పత్తి కూడా ఎక్కువ శాతం పండిస్తుంటారు. ఆరుతడి పంటల్లో మొక్కజొన్న, శెనగ తదితర పంటలు వేస్తుంటారు. ఆలయాలు జగిత్యాల జిల్లాలో ప్రముఖ ఆలయాలైన కొండగట్టుతో పాటు ధర్మపురి దేవస్థానం కూడా ఇందులో వస్తుంది. రెండు దేవాలయాలు ప్రధానమైనవి. -
రెండు ముక్కలే..!
సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై వెనక్కు తగ్గిన సర్కారు ఆయా మండలాలు కరీంనగర్‌లోనే కొనసాగింపు జగిత్యాల జిల్లా స్వరూపంపై స్పష్టత మ్యాపులు సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం ఉద్యోగుల విభజన కసరత్తులో బిజీబిజీ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు తగిన మండలాలు లేకపోవడం, చొప్పదండి నియోజకవర్గంలోని మండలాల ప్రజలు సిరిసిల్ల జిల్లాలో కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న కరీంనగర్ జిల్లాను రెండు ముక్కలుగా విభజించి కరీంనగర్, జగిత్యాల జిల్లాలుగా మాత్రమే ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గతంలో ప్రతిపాదిత సిరిసిల్ల జిల్లాలోని మండలాలను పూర్తిగా కరీంనగర్ జిల్లాలోనే కలపాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి కలెక్టర్ నీతూప్రసాద్‌కు సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ కరీంనగర్, జగిత్యాల జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో రెవెన్యూ, ఎన్ఐసీ అధికారులు కరీంనగర్, జగిత్యాల ప్రతిపాదిత జిల్లాల మ్యాపులను సిద్ధం చేయడంతోపాటు ఏ జిల్లాకు ఎంతమంది ఉద్యోగులను కేటాయించాలనే కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్లో 28, జగిత్యాలో 16 మండలాలు ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న 57 మండలాలను నాలుగు ప్రతిపాదిత జిల్లాలకు సర్దుబాటు చేశారు. భూపాలపల్లి జిల్లాలో నాలుగు, వరంగల్ జిల్లాలో ఐదు, సిద్దిపేట జిల్లాలో నాలుగు మండలాలను కలపాలని ప్రతిపాదించారు. అట్లాగే 16 మండలాలతో జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. ఇవిపోగా మిగిలిన 28 మండలాలను కరీంనగర్ జిల్లాలో కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలను సిద్దిపేట జిల్లాలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట మండలాలను వరంగల్ జిల్లాకు కేటాయించారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోకవర్గాల్లోని 12 మండలాలతోపాటు వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి మండలాలు, చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలను జగిత్యాల జిల్లాలో కలపాలని సూచించారు. పైన పేర్కొన్న మండలాలు పోగా ప్రస్తుత జిల్లాలోని 28 మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని ప్రతిపాదించారు. ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని, రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా మార్పులు చేర్పులుంటాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడేవరకు మార్పులుండే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. కొత్త మండలాలపై సందిగ్ధత కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతమున్న 57 మండలాలకు తోడు అదనంగా మరో 17 కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇందులో ఒక్క సిరిసిల్ల డివిజన్‌లోనే ఆరు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అట్లాగే ప్రస్తుతమున్న కరీంనగర్ మండలాలన్ని కొత్తగా నాలుగు మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రామగుండం మండలాన్ని మూడుగా విభజించాలని సూచించారు. పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ మండలాలను రెండుగా విభజించాలని పేర్కొన్నారు. కొత్త మండలాల సంఖ్యను కుదించాలని ఇటీవల ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మళ్లీ మండలాలను కుదించే పనిలో పడ్డారు. ఇటీవల ప్రతిపాదించిన 17 మండలాలను తాజాగా ఎనిమిది నుంచి పదికి కుదించాలని యోచిస్తున్నారు. సోమవారం నాటికి ఈ ప్రక్రియకు తుదిరూపు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోవైపు బెజ్జంకి, ఇల్లంతకుంట, హుస్నాబాద్ మండలాలను సిద్దిపేట జిల్లాలో ప్రతిపాదించినప్పటికీ స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికే వదిలేశామని జిల్లా అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఉద్యోగుల విభజన షురూ... రెవెన్యూ డివిజన్, ఆ పైస్థాయి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని రెండు జిల్లాలకు విభజించే పనిలో పడ్డారు. జిల్లావ్యాప్తంగా 54 శాఖల వివరాలను సేకరించగా 7732 మంది ఉద్యోగులున్నట్లు గుర్తించారు. వీరిని కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు కేటాయించే కసరత్తు కొనసాగిస్తున్నారు. గతంలో కరీంనగర్ జిల్లాకు 2085 మంది, జగిత్యాల జిల్లాకు 2072 మంది, సిరిసిల్ల జిల్లాకు 2053 మందిని కేటాయిచాలని ప్రతిపాదించారు. తాజాగా సిరిసిల్లకు కేటాయించిన వారిని మిగిలిన రెండు జిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు. -
నగల దుకాణంలో చోరీకి విఫలయత్నం
జగిత్యాల అర్బన్ : పట్టణంలోని నడిబొడ్డున టవర్ ఏరియాలోని బాలాజీ జువెల్లరీ షాపులో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. లాకర్ తెరవకపోవడంతో ఎలాంటి సొమ్ము పోలేదు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని బాలాజీ జువెల్లర్స్ యజమాని తిమ్మరాజు వెంకటస్వామి బుధవారం రాత్రి రోజూ లాగానే ఇంటికి వెళ్లే సమయంలో బంగారం తదితర వస్తువులు లాకర్లో పెట్టి షాపు మూసివేసి వెళ్లాడు. దొంగలు షాపు పైకి ఎక్కి చెక్కలు ఊడదీసి లోపలికి వెళ్లారు. అందులో ఉన్న సామగ్రిని చెల్లాచెదరు చేశారు. లాకర్‌ను పగులగొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. వెంకటస్వామి గురువారం ఉదయం షాపుకు వచి తెరిచి చూసేసరికి వస్తువులన్నీ చెల్లచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డున దొంగలు చోరీకి యత్నించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
పేలిన జిలెటిన్‌స్టిక్స్..ఒకరి మృతి
జగిత్యాల: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం మోతె గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బండరాళ్ల మధ్య పెట్టిన జిలెటిన్‌స్టిక్స్ అకస్మాత్తుగా పేలి శ్రీనివాస్(25) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా..అశోక్(30) అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన అశోక్‌ను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి స్వస్థలం ధర్మపురి మండలం చిన్నాపూర్ గ్రామం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జగిత్యాల తహశీల్దార్ ఆఫీస్ జప్తు
జగిత్యాల: కరీంనగర్ జిల్లా జిగిత్యాల తహశీల్దార్ కార్యాలయం, కార్యాలయంలోని ఫర్నిచర్‌ను శుక్రవారం కోర్టు ఆదేశాల మేరకు జప్తు చేశారు. లింగంపేట చెరువు ముంపు బాధితుల పరిహారాన్ని రూ.3కోట్ల మేరకు చెల్లించాలని జిల్లా సెషన్స్ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. వీటిని అమలు చేయకపోవడంతో శుక్రవారం రెవెన్యూ ఆస్తులను జప్తు చేశారు. -
ఆర్టీఏ కార్యాలయంలో దూసుకెళ్లిన కారు...
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జగిత్యాల ఆర్టీఏ కార్యాలయంలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవింగ్ టెస్ట్ చేస్తుండగా కార్యాలయంలోకి వచ్చిన ప్రజలుపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆర్టీఏ కార్యాలయానికి చేరుకుని... జరిగిన ఘటనపై విచారిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
సబ్‌కలెక్టర్ ఎదురుచూపులు!
గ్రామసందర్శనకు సకాలంలో హాజరుకాని వైనం జగిత్యాల రూరల్ : గ్రామసందర్శనకు అధికారులు సకాలంలో హాజరుకాకపోవడంతో జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంకకు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉదయం 10 గంటలకు గ్రామ సందర్శన ప్రారంభంకావాల్సి ఉండగా.. 10.10 గంటలకు సబ్‌కలెక్టర్ గ్రామానికి చేరుకున్నారు. అధికారులెవరూ లేకపోవడంతో అరగంటపాటు గ్రామపంచాయతీలోనే ఎదురుచూశారు. ఎంఈవో మద్దెల నారాయణ హాజరుకాగా 10.45 గంటలకు ఎంపీడీవో శ్రీలతరెడ్డి వచ్చారు. ఇద్దరు అధికారులను వెంటబెట్టుకుని ప్రాథమిక పాఠశాల తనిఖీకి వెళ్లగా.. 11 గంటలకు ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ హాజరయ్యారు. అరుుతే అధికారులను మందలించకుండానే సబ్‌కలెక్టర్ గ్రామసందర్శనలో పాల్గొన్నారు. -
లారీ, మోపెడ్ ఢీ..చెలరేగిన మంటలు
కరీంనగర్ జిల్లా: జగిత్యాల సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో పెనుప్రమాదం తప్పింది. పాతబస్టాండు వద్ద లారీ, ఓ మోపెడ్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో మోపెడ్‌పై పెట్రోలు తీసుకెళ్తుండటంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. -
సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య
జగిత్యాల : పెద్దలు తీసుకునే చిన్నపాటి నిర్ణయాల వల్ల... అవి నచ్చని చిన్నారులు బలన్మారణాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆ కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంటోంది. తాజాగా సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌కు జరిగిన ఘటనతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. రోహిత్ (17) గత కొంతకాలంగా సెల్‌ఫోన్ కావాలని అడుగుతున్నాడు. దీనికి తల్లిదండ్రులు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపనికి గురైన రోహిత్ బుధవారం ఇంట్లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు గదిలోంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చూసే సరికి రోహిత్ మరణించి ఉన్నాడు. -
పెళ్లి.. పెటాకులు కావొద్దు
►వివాహమైన ఏడాదిలోనే మనస్పర్థలు ►కోర్టు మెట్లెక్కుతున్న దంపతులు ►విచారణలో 800ల కేసులు ►భార్యాభర్తలను కలిపేందుకు జడ్జిల ప్రయత్నం ‘హైదరాబాద్‌లో స్టాఫ్‌వేర్ ఉద్యోగం చేసే ఓ యువకుడికి ఏడాది క్రితం పెళ్లయింది. భార్య రోజూ ఫోన్లో మాట్లాడుతుండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య అగాథం పెరిగింది. ఏడాది లోపే విడాకుల కోసం భర్త కోర్టులో కేసు వేశాడు.’ ‘తనకు నచ్చిన వస్తువులు కొనుక్కోనీయడం లేదు.. ప్రతి దానికి తల్లిని అడుగుతున్నాడు.. వేరు కాపురం పెడదామంటే ఒప్పుకోవడం లేదు.. భర్తతో ఉండలేనంటూ ఓ భార్య కోర్టులో కేసు వేసింది.’ ఇలా జిల్లాలోని ఐదు సబ్‌కోర్టులు, ఒక ఫ్యామిలీ కోర్టులో వందలాది విడాకుల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 800 కేసులు విచారణలో ఉన్నట్లు న్యాయవాదులు పేర్కొంటున్నారు. - జగిత్యాల జోన్ సమన్వయంతో పరిష్కరించుకోవాలి ఆలుమగల మధ్య వచ్చే వివాదాలు పెద్దవేమీ కావు.. సమన్వయం లేకుండా, అనాలోచితం గా వాటిని ముదిరే స్థాయికి తీసుకుపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.. వాటిని భార్యాభర్తలే కూర్చుని సమన్వయం తో పరిష్కరించుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావని న్యాయమూర్తులు, న్యాయవాదులు చెపుతున్నారు. ముందుగా ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవాలి.. ఒకరి ఇష్టాఇష్టాలను మరొకరు తెలుసుకోవాలి.. అందుకు అనుగుణంగా మసలుకుంటే జీవితం ఆనందదాయకంగా మారుతుందని పేర్కొంటున్నారు. భార్య అయినా.. భర్త అయినా ఎదుటివారి లోపాలను ఎత్తిచూపే ముందు ఆ లోపాలకు తానెంత కారణమో తెలుసుకుంటే మంచిదని అంటున్నారు. ఇలా సమాలోచనతో ఉంటే భార్యభర్తలు కోర్టుమెట్లు ఎక్కకుండా సంసారంలో సరిగమలు పాడుకోవచ్చని వివరిస్తున్నారు. జగిత్యాల కోర్టులోనే 120 కేసులు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, మంథని, హుజూరాబాద్ సబ్కోర్టులలో దాదాపు 800 వరకు విడాకుల కేసుల విచారణలో ఉన్నాయి. అందులో ఒక్క జగిత్యాల సబ్కోర్టులోనే 120 వరకు విడాకుల కేసులు ఉండడం గమనార్హం. ఇక కోర్టుకు రాకుండా పెద్దమనుషులు, పోలీస్స్టేషన్లు, నోటరీ అడ్వకేట్ల వద్ద ఇంతకు విడాకులు తీసుకుంటున్న వారు రెట్టింపు స్థాయిలో ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. పెద్దమనుషులు, పోలీస్స్టేషన్లలో చేసిన విడాకులకు చట్టబద్ధత లేకపోవడంతో బయట రాజీ కుదుర్చుకుని విడాకుల కోసం కోర్టుకు వచ్చేవారి సంఖ్య ఇటీవల పెరిగింది. అయితే ఈ కేసులను విచారించే జడ్జిలు వెంటనే విడాకులు మంజూరు చేయకుండా భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలను పోగొట్టి వారు కలిసి బతికేలా ప్రయత్నిస్తున్నారు. చదువుకున్న భార్యాభర్తలకు, పిల్లలు ఉండి విడిపోవాలనుకుంటున్నవారికి స్వయంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కేసు పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమనుకుంటే తప్ప విడాకులకు అనుమతి ఇవ్వడంలేదు. అపనమ్మకం.. ‘మాంగళ్యం తంతునాం.. మహజీవన హేతునాం’ అంటూ మూడుముళ్లతో ఏడడుగులు నడిచి ఒక్కటవుతున్న దంపతులు మూణాళ్లకే ఎడ ముఖం, పెడముఖంగా ఉంటున్నారు. ఏడాదిలోపే విడాకుల కోసం కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరగడం ఇటీవల పరిపాటిగా మారింది. భార్యాభర్తల మధ్య పెరుగుతున్న అపనమ్మకాలు, ఆధిపత్య పోరు వంటి కారణాలు అనురాగాలు, అప్యాయతలు దూరం చేస్తున్నాయి. పచ్చని కాపురాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. విడిపోయే ఆలోచనే చేయొద్దు భార్యాభర్తలు ఏ సమస్య వచ్చినా విడిపోయే దిశలో అసలు ఆలోచించనేవద్దు. సమస్యలను, లోటుపాట్లను సరిదిద్దుకోవాలే కానీ తెగేదాకా లాగి విడిపోవడం మంచిది కాదు. కూర్చుని మాట్లాడుకుంటే ఎంతటి సమస్య అయినా తీరిపోతుంది. - తాండ్ర సురేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, జగిత్యాల సమస్యలు నీటి బుడగలు భార్యాభర్తల మధ్య ఏర్పడే సమస్యలు నీటి బుడగల్లాంటివి. అవి అలా వచ్చి ఇలా వెళతారుు. వాటిని పెద్దగా చేసి తెగే వరకు లాగవద్దు. ఏ సమస్య ఉన్నా ముందుగా దంపతులిద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. అవసరమైతేనే తల్లితండ్రుల వరకు వెళ్లాలి. - డబ్బు లక్ష్మారెడ్డి, సీనియర్ న్యాయవాది, జగిత్యాల -
సీఎల్పీ లీడర్.. టీపీసీసీ చీఫ్!
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డికి పార్టీలో ప్రధానమైన పదవి లభిస్తుందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ గాలిలో జిల్లాలోని సిట్టింగ్ స్థానాలన్నీ ‘చే’జారిపోగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు. తన నాయకత్వ పటిమతో కారు జోరును తట్టుకుని నిలిచిన ఆయన జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌కు ధీటైన వాగ్ధాటి, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడు జీవన్‌రెడ్డి అని, ఆయనకు సీఎల్పీ బాధ్యతలు అప్పగిస్తే భవిష్యత్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ నాయకుల్లో గతంలో అసెంబ్లీలో గట్టిగా గళమెత్తింది జీవన్‌రెడ్డి అనే టాక్ ఉండటం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్.రాజశేఖరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి హయాంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల ప్రసంగాలకు జీవన్‌రెడ్డి ధీటుగా సమాధానం ఇచ్చారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి అసెంబ్లీ టైగర్‌గా పేరు తెచ్చుకున్న విషయాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. గతంలో కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నువ్వా.. నేనా అనే రీతిలో కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి పోరాడిన విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం తెలంగాణలో గెలుపొందిన కాంగ్రెస్ నేతల్లో ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో ప్రథముడు కె.జానారెడ్డి కాగా, ఆరుసార్లు అసెంబ్లీకి వెళ్లిన వారిలో జీవన్‌రెడ్డి ఒక్కరే ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులను సమర్థంగా నిర్వహించిన అనుభవం సైతంకు ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానవర్గం జీవన్‌రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందండం, సాక్షాత్తు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయన సారథ్యంపై సొంత పార్టీలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీపీసీసీ చైర్మన్ సీటు నుంచి పొన్నాలను దించడం ఖాయమనే వాదనలు వినిస్తున్నాయి. దీంతో జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా.. లేదా పార్టీ సారథిగా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ రెండింటిలో ఏదో ఒక పదవి కచ్చితంగా దక్కుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత రెండు రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్న జీవన్‌రెడ్డిని పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పదవుల విషయం చర్చకు వస్తోంది. జీవన్‌రెడ్డి మాత్రం తనకు పదవి వచ్చినా.. రాకున్నా ప్రజల తరఫున పోరాడుతూ పార్టీ పటిష్టం కావడానికి కృషి చేస్తానని తనను కలిసిన వారితో చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో జీవన్‌రెడ్డి సమావేశం కానున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో తీసుకునే కీలక నిర్ణయాలు అధిష్టానానికి నివేదించనున్నట్టు సమాచారం. -
జగిత్యాలలో భారీ చోరీ
జగిత్యాల అర్బన్, న్యూస్‌లైన్ : పట్టణంలోని విద్యానగర్‌లో రెండిళ్లలో ఏకకాలంలో దొంగలు పడ్డారు. సుమారు 11 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.50 వేలు దోచుకెళ్లారు. విద్యానగర్‌కు చెందిన కందుకూరి గంగారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సోమవారం సాయంత్రం గంగారెడ్డి అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు ఇంటికి తాళమేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి 3.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకోగా.. తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లిచూడగా.. బీరువాలోని 8 తులాల బంగారు గొలుసు, నెక్లెస్, ముత్యాలహారం, మాటిలతోపాటు రూ.50 వేలు ఎత్తుకెళ్లారు. అలాగే అదే ప్రాంతానికి చెందిన గోపు రాజన్న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే దొంగలు చొరబడ్డారు. ఇంట్లోని 80 తులాల వెండి, 3 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు బోరుమన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ కిరణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని గంగారెడ్డి, రాజన్న ఇళ్లను పరిశీలించారు. కరీంనగర్ నుంచి క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. జగిత్యాలలో ఇటీవల దొంగతనాలు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న క్రమంలో ఇకేసారి రెండిళ్లలో చోరీలు జరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. -
పసుపు రైతు విలాపం
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ : పసుపు ధర కొన్నేళ్లు బంగారంతో పోటీపడి రైతుల్లో ఆశలు చిగురింపజేసింది. నాలుగేళ్ల క్రితం క్వింటాల్‌కు రూ.17 వేలు పలికింది. చాలా మంది రైతులు ఈ పంటసాగువైపు మొగ్గు చూపారు. ఫలి తంగా జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ, ఆనాటి ధరలు ఎప్పుడూ లభించడం లేదు సరికదా... రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. మరుసటి ఏడాది క్వింటాల్‌కు రూ.10 వేలు అనంతరం రూ.5 వేలకు పడిపోయాయి. దీంతో రైతులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ధర పెరగకపోతుందా? అనే ఆశతో జిల్లాలోని చాలా మంది రైతులు పసుపులో తేమ లేకుండా చేసి, కోల్డ్స్టోరేజీలతోపాటు ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. అయినా వారికి ఫలితం దక్కేలా లేదు. సీజన్లో క్వింటాల్‌కు రూ.7 నుంచి రూ.8 వేలు ఉన్న ధర ప్రస్తుతం రూ.4 నుంచి రూ.6 వేల మధ్య కదలాడుతూ రైతులను నిరాశలో ముంచుతోంది. జిల్లాలో 70 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతోంది. ఒక్కో ఎకరాకు రూ.70 వేల వరకు పెట్టుబడి అవుతోంది. కోళ్ల, పశువుల ఎరువు పోయించడంతోపాటు విత్తనాలు, కూలీల ఖర్చు పెరగడంతో పెట్టుబడి భారీగా పెరిగింది. జిల్లాలో గతేడాది అక్కడక్కడా పంటకు తెగుళ్లు సోకినప్పటికీ చాలా చోట్ల ఎకరాకు 15 క్వింటాళ్లకు పైగా (పచ్చి పసుపు) దిగుబడి వచ్చింది. పసుపును సుగంధ ద్రవ్యాల్లో, రంగుల పరిశ్రమలో విపరీతంగా ఉపయోగిస్తున్నప్పటికీ, అంతర్జాతీయుంగా డిమాండ్ లేదనే సాకుతో వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. 3 లక్షల బస్తాల నిల్వలు సీజన్లో రేటు లేకపోవడంతో జిల్లాలోని రైతులు 3 లక్షల బస్తాల పసుపు ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. ఒక్కో బస్తా 80 కిలోల నుంచి క్వింటాల్ వరకు ఉంటుంది. పండిన పసుపు అమ్ముడుపోకపోవడంతో రైతులు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉండడంతో రబీ సీజన్‌కు సైతం మళ్లీ కొత్తగా అప్పు చేసే పరిస్థితి. పెద్ద రైతులే కాకుండా చిన్న రైతులు సైతం ధర పెరగకపోతుందా అని నిల్వ చేయడంతో చేతిలో డబ్బులు లేక నెట్టుకువస్తున్నారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్, సారంగాపూర్ మండలం అర్పపల్లి, రాయికల్ మండలం ఇటిక్యాల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, ధర్మారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి మండలాల్లో రైతుల వద్ద భారీగా పసుపు నిల్వలు ఉన్నాయి. రైతులకు తోడు వ్యాపారులు కూడా భారీగానే పసుపు ఉత్పత్తులు నిల్వ చేశారు. మరో రెండు నెలల్లో ఈ సీజన్లో వేసిన పసుపు పంట చేతికి అందే అవకాశం ఉండడంతో... గతేడాది పంట నిల్వ ఉన్న రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నేరుగా మహారాష్ట్రలోని సాంగ్లీ, తమిళనాడులోని ఇరోడ్ మార్కెట్లో పసుపు విక్రయించుకుందామనుకున్నా ధర రూ.5 నుంచి రూ.6 వేల మధ్యలోనే ఉండడంతో ఏం చేయాలా? అని తలలు పట్టుకుంటున్నారు. పసుపు మద్దతు ధర పెంచాలని రైతులు స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యలో కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలుస్తున్నప్పటికీ ప్రయోజనం కలగడం లేదు. -
వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ మూడో ఏడాది చదువుతున్న అజ్మీరా మంజుల(20) ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం రావోజీపేటకు చెందిన ఆమె శనివారం రాత్రి హాస్టల్లో తోటి విద్యార్థులతో కలిసి నిద్రించినా, ఆదివారం ఉదయం కనిపించలేదు. దీంతో వారు హాస్టల్లో వెతకగా.. ఖాళీగా ఉన్న మరో గదిలో ఫ్యాన్‌కు చున్నీ, నైలాన్ తాడుతో ఉరివేసుకుని కనిపించింది. కాగా, మంజుల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థినులు, అధ్యాపకులు పేర్కొన్నారు. కానీ, మంజుల మృతిపై ఆమె తల్లిదండ్రులు లక్ష్మీబాయి, పంతులునాయక్ అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, అంతటి అనారోగ్య సమస్యలేవీ ఆమెకు లేవన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వాణిజ్యపరంగానే హైదరాబాద్ అభివృద్ధి: టి.జీవన్‌రెడ్డి
జగిత్యాల(కరీంనగర్), న్యూస్‌లైన్ : రాష్ట్రంలో 60 ఏళ్లలో సీమాంధ్ర పాలకుల వల్ల హైదరాబాద్ నగరంతోపాటు రంగారెడ్డి జిల్లా వాణిజ్యపరంగా మాత్రమే అభివృద్ధి చెందిందని, ఆ రెండు ప్రాంతాల్లోని ప్రజలు అభివృద్ధి చెందలేదని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిప్పన్నపేట గ్రామ సమీపంలో నిర్వహించిన రాజీవ్‌గాంధీ జయంత్యుత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీమాంధ్రలో ప్రతి జిల్లాకు జిల్లా కార్యాలయాలుంటే రంగారెడ్డి జిల్లాలో మాత్రం జిల్లా కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోందని తెలిపారు. అక్కడున్న జిల్లా కార్యాలయాన్ని అప్పటి సీఎం చంద్రబాబు జాతీయస్థాయి ఐటీఐకి అప్పగించి రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను మాత్రం వాణిజ్య వ్యాపారవేత్తలకు అప్పజెప్పిన ఘనుడని విమర్శించారు. సీమాంధ్ర నాయకులే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూములు కొనుగోలు చేసి అభివృద్ధి చెందారే తప్ప తెలంగాణ ప్రజలను మాత్రం అభివృద్ధి చెందనివ్వలేదని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల వల్లే దేశంలో బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు అభివృద్ధి చెందారని, ప్రస్తుతం సోనియాగాంధీ తెలంగాణ నిర్ణయాన్ని ప్రకటించి తెలంగాణ ప్రజల కోసం మాటతప్పని నాయకురాలిగా చరిత్రలో నిలబడతారని పేర్కొన్నారు.