జగిత్యాల అర్బన్, న్యూస్‌లైన్ : పట్టణంలోని విద్యానగర్‌లో రెండిళ్లలో ఏకకాలంలో దొంగలు పడ్డారు. సుమారు 11 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.50 వేలు దోచుకెళ్లారు. విద్యానగర్‌కు చెందిన కందుకూరి గంగారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సోమవారం సాయంత్రం గంగారెడ్డి అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు ఇంటికి తాళమేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి 3.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకోగా.. తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లిచూడగా.. బీరువాలోని 8 తులాల బంగారు గొలుసు, నెక్లెస్, ముత్యాలహారం, మాటిలతోపాటు రూ.50 వేలు ఎత్తుకెళ్లారు.
అలాగే అదే ప్రాంతానికి చెందిన గోపు రాజన్న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే దొంగలు చొరబడ్డారు. ఇంట్లోని 80 తులాల వెండి, 3 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు బోరుమన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ కిరణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని గంగారెడ్డి, రాజన్న ఇళ్లను పరిశీలించారు. కరీంనగర్ నుంచి క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. జగిత్యాలలో ఇటీవల దొంగతనాలు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న క్రమంలో ఇకేసారి రెండిళ్లలో చోరీలు జరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
జగిత్యాలలో భారీ చోరీ
Published Wed, Dec 11 2013 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement