gold necklace
-
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి. -
యాదాద్రీశుడికి నిజాం తరపున బంగారు హారం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి వారికి నిజాం కుటుంబం తరపున ప్రిన్సెస్ బేగం సాహిబా ఎస్రా బిర్గెన్ బంగారు హారాన్ని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు ద్వారా అందజేశారు. ఈ హారాన్ని ఆదివారం కిషన్‌రావు ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. శ్రీస్వామి వారి ప్రధానాలయం ప్రారంభమైన తరువాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.4లక్షల విలువైన 67 గ్రాముల బంగారు హారాన్ని నిజాం కుటుంబం తరపున పంపించారని ఆలయాధికారులు వెల్లడించారు. -
దుర్గమ్మకు కానుకగా రూ. 5 లక్షల స్వర్ణ హారం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు రూ.5 లక్షల విలువైన బంగారు డైమండ్ కంఠాభరణాన్ని శుక్రవారం కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన మహాలక్ష్మయ్య దంపతులు శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చి ఆలయ ఈవో భ్రమరాంబ, ప్రధాన అర్చకులు లింగంభోట్ల దుర్గాప్రసాద్‌లకు డైమండ్ హారాన్ని అందచేశారు. దాతలకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు, పాలక మండలి సభ్యురాలు కటకం శ్రీదేవి అమ్మవారి చిత్రపటం, ప్రపాదం, శేషవస్త్రాలను అందజేశారు. ఈవోకు బంగారు హారాన్ని అందచేస్తున్న దాతలు -
'కస్టమ్స్'.. తీర్చేయాప్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి దుబాయ్‌లో తన మేనమామ ఇంట్లో విందుకు హాజరైంది. వారిచ్చిన బంగారు నెక్లెస్‌ను వేసుకుని శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే కస్టమ్స్‌వాళ్లు సరైన పత్రాలు లేవని భారీగా పన్ను విధించారు. హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్యాసింజర్‌కు దుబాయ్ ఎయిర్‌పోర్టులో మరో భారతీయుడు ఒక బ్యాగు ఇచ్చి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తమ వాళ్లకు ఇవ్వాలని కోరాడు. అలా తెచ్చి కస్టమ్స్ అధికారుల తనిఖీలో అందులో బంగా రం ఉండటంతో జైలుపాలయ్యాడు. విదేశీ వస్తువులు భారత్‌కు తీసుకొచ్చే విషయంలో నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన లేకపోవడంతో ఒక్కోసారి అమాయకులు కస్టమ్స్ వద్ద తీవ్ర ఇబ్బందులు పడటం, అధిక పన్ను చెల్లించాల్సి రావడం, కొన్ని సందర్భాల్లో అరెస్టు కావడం జరుగుతోంది. విదేశాలకు వెళ్లేవారు లగేజీ, వస్తువుల విషయంలో నిబంధనలను యాప్ ద్వారా తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు. నిబంధనలు ఇవీ... 1 రెండు లీటర్ల లిక్కర్, 100 సిగరెట్లు, ఒక ల్యాప్‌టాప్, ఒక ఫోన్ మాత్రమే తీసుకొస్తే పన్ను విధించరు. రెండో ఫోన్, రెండో ల్యాప్‌టాప్ తీసుకొస్తే దాని ఖరీదు రూ.50 వేలు దాటితే కస్టమ్స్ డ్యూటీ 38.5 శాతం చెల్లించాలి. 2 కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపు అస్సలుండదు. ఉదాహరణకు.. కొందరు టీవీలు తెచ్చుకుంటారు. దాని ధర రూ.50 వేలలోపు ఉన్నా అధికారులు చెప్పినంత డ్యూటీ కట్టాల్సిందే. 3 చాలామంది మహిళలు విదేశాల్లో నగలు కొనుగోలు చేసి వేసుకుని వస్తుంటారు. విదేశాల్లో ఏడాదికిపైగా ఉండి భారత్ తిరిగి వచి్చన మహిళలకు 40 గ్రాముల (విలువ రూ.లక్ష మాత్రమే) వరకు బంగారానికి డ్యూటీ ఉండదు. విలువ రూ.లక్ష దాటితే 38.5 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. పురుషులకైతే ఇది 20 గ్రాములకే పరిమితం. 4 విదేశాల నుంచి బంగారు బిస్కెట్లు తీసుకొచ్చేవారు ఇమిగ్రేషన్ కౌంటర్లోనే కస్టమ్స్ అధికారులను సంప్రదించి డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి. దాని ఆధారంగా ఎంత పన్ను కట్టాలో అధికారులు చెబుతారు. అది కట్టి బయటికి రావాల్సి ఉంటుంది. కట్టకుంటే అక్రమ రవాణాగా పరిగణించి అరెస్టు చేస్తారు. ఎలాంటి డిక్లరేషన్ చేయాల్సిన అవసరం లేనివాళ్లు గ్రీన్ చానల్ ద్వారా బయటికి రావొచ్చు. 5 విదేశీ నగదు విషయంలోనూ 5,000 డాలర్ల కంటే నగదు, 10,000 డాలర్ల చెక్ కంటే అధికంగా ఉండకూడదు. వీటిని కరెన్సీ డిక్లరేషన్ ఫారం తీసుకుని అందులో పొందుపరచాలి. విదేశాలకు వెళ్లే సమయంలో ఫారిన్ కరెన్సీ విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. కానీ, దాన్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చారన్న విషయంపై సరైన పత్రాలు çసమర్పించాలి. ఒకవేళ ఇండియన్ కరెన్సీని తీసుకెళ్లాలంటే మాత్రం రూ.25 వేల కంటే అధికంగా అనుమతించరు. 6 విదేశాల్లో విందులకు, వివాహాలకు హాజరయ్యే మహిళలకు తాము వెంట తీసుకెళ్లే నగల విషయంలో జాగ్రత్త అవసరం. ఎంత విలువైన నగలను తీసుకెళ్తున్నామన్నది ముఖ్యం. ప్రభుత్వ ఆమోదం పొందిన సంస్థల ద్వారా ఎంత బంగారం తీసుకెళ్తున్నా మన్నది సరి్టఫై చేయించుకోవాలి. దాన్ని ఎక్స్పోర్ట్ డిపార్చర్ ఆఫీసర్ వద్ద సరి్టఫై చేయించుకుని తీసుకెళ్లొచ్చు. వచ్చే సమయంలో దాన్ని చూపిస్తే ఎలాంటి అనుమానాలు రాకుండా ఉంటాయి. 7 ఇలాంటి నిబంధనలు పాటిస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రావు. మరిన్ని వివరాలకు http://www.cbic.gov.in/ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. 8 విదేశీయులు లేదా విదేశాల్లో కొంతకాలం ఉండి ఇండియాకు వచ్చేవారు ఏమేం తీసుకొచ్చే విషయంలో అనుమానాల నివృత్తికి యాప్ కూడా ఉంది. ‘ఇండియన్ కస్టమ్స్ ట్రావెల్ గైడ్ యాప్’ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
బుట్ట బొమ్మలకు హారాలు
బుట్ట బొమ్మలకు బుట్టలకొద్ది అందాన్ని జత చే యడానికే అన్నట్టు ఇప్పుడు మెడ వంపుల్లోనూ బుట్టలు చేరాయి.హృదయానికి అలంకారంగా అమరాయి. చెవులకు ఎన్ని రకాల హ్యాంగింగ్స్ ఉన్న బుట్టలదే ఇప్పటికీ అగ్రస్థానం. అందుకే బుట్టలు బంగారంతోనే కాదు ఫ్యాషన్ జువెల్రీలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయి. హారాలుగా అందాన్ని పెంచాయి. ►ఒక బుట్టతో హారాలు వచ్చాయి. అవి బంగారంలోనూ, ఇమిటేషన్ జువెల్రీలోనూ రూపుకట్టాయి. ►ఇప్పుడు సిల్వర్, థ్రెడ్.. ఫ్యాషన్ జువెల్రీలోనూ బుట్టల హంగులు కొత్తగా చేరాయి. ►చిన్న చిన్న పూసలు అవి ఎరుపు, పసుపు, పచ్చ రంగుల్లోవి ఎంచుకొని హారంగా గుచ్చాలి. వాటికి బ్రాస్, సిల్వర్ బుట్టలను మధ్య మధ్యలో జత చేయాలి. ►పూసలు, కుందన్స్‌తో హారాలు చేయించుకుంటే వాటి రంగుతో పోలి ఉండే బుట్టల లాకెట్‌ను జత చేస్తే చాలు. హారానికి ఫలితంగా ధరించినవారి అందం రెట్టింపు అవుతుంది. -
ఖాతాదారులకు ‘శ్రీరామ్’ చెల్లింపులు
మధిర, న్యూస్‌లైన్: స్థానిక శ్రీరామ్ సిటీ గోల్డ్ ఫైనాన్స్ కార్యాలయంలో బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి రుణాలు పొందిన ఖాతాదారులకు యాజమాన్యం నగదు చెల్లింపులు చేస్తోంది. ఈ కార్యాలయంలో వందలాది మంది సన్న, చిన్నకారు రైతులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు తాక ట్టు పెట్టిన బంగారు ఆభరణాలు గత నెల 7వ తేదీ తెల్లవారుజామున చోరీకి గురైన విషయం విదితమే. నిందితుడు 425 మందికి చెందిన 8.513 కిలోల బంగారు ఆభరణాలు, కొంత నగదు చోరీ చేశారు. ఈ చోరీ జరిగి 47 రోజులు గడుస్తోంది. అయితే రుణాలు చెల్లిస్తాం.. తాకట్టుపెట్టిన తమ బంగారం తమకు ఇవ్వాలని ఖాతాదారులు గత కొద్దిరోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల ఒత్తిడి మేరకు శ్రీరామ్ కంపెనీ యాజమాన్యం వారి లావాదేవీలు పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. ఈక్రమంలో కంపెనీ ప్రధాన, జోనల్ కార్యాలయాల ఉన్నత ఉద్యోగుల ఆదేశాలమేరకు మధిర పట్టణంలోని కార్యాలయ మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో ఖాతాదారుల లావాదేవీలను పరిశీలిస్తున్నారు. నష్టపోతున్న ఖాతాదారులు : చోరీ సంఘటనలో బంగారు ఆభరణాలు కోల్పోయిన ఖాతాదారులకు శ్రీరామ్ కంపెనీ ఒక్కో గ్రాము బంగారానికి రూ.2,750చొప్పున చెల్లించేందుకు ముందుకు వచ్చింది. 20 గ్రాములు బంగారం తాకట్టుపెట్టిన ఖాతాదారులకు రూ.2,750చొప్పున రూ.55వేలు చెల్లిస్తోంది. అయితే ఈ డబ్బులతో తిరిగి అదే ఆభరణాన్ని తయారు చేయించాలంటే మరో 2 గ్రాములు తరుగుకింద అదనంగా చేతి నుంచి పడే అవకాశం ఉంది. దీంతో అదే ఆభరణం తయారు చేయించాలంటే రూ.55వేలకు అదనంగా రూ.5,500 ఖాతాదారుడు భరించాల్సి వస్తుంది. చోరీకి గురైన 425మంది ఖాతాదారులకు చెందిన 8.513కిలోల బంగారు ఆభరణాలను తయారు చేయించాలంటే అదనంగా 85.13 గ్రాముల బంగారం పడుతుంది. దీనికిగాను రూ.2.34లక్షలకుపైగా ఖర్చవుతుంది. తీసుకున్న రుణానికి వడ్డీతోసహా చెల్లిస్తుంటే ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. నేటి వరకు వడ్డీ వసూలు.. ఖరీఫ్ సీజన్లో రైతులు వారి బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు. ఈ క్రమంలో నెల రోజులుగా డబ్బులు తీసుకుని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు నగదు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కానీ నేటి వరకు వడ్డీ లెక్కకట్టి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మధిర మండలంలోని వంగవీడు గ్రామానికి చెందిన రైతులు రుణాలు చెల్లించేందుకు రాగా నేటి వరకు వడ్డీ లెక్కించి చెల్లించాలని సూచించారు. నెల రోజులుగా చెల్లిస్తామని తిరుగుతున్నా తీసుకోకుండా ఇప్పుడు అదనపు వడ్డీ వసూలు చేస్తున్నారని గుగులోతు శ్రీను, భూక్యా భద్రు, ధరావత్ ఫణి, గుగులోతు సోమ్లా తదితరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టాన్ని ఎందుకు భరించాలి .. 200 గ్రాముల బంగారం తాకట్టుపెట్టి రూ. 4 లక్షల రుణం తీసుకున్నా. ఆభరణాలు చోరీకి గురికావడంతో తీసుకున్న అప్పుపోను బంగారానికి వెలకట్టి మిగిలిన డబ్బులు ఇస్తున్నారు. అయితే ఆభరణాలు చేయించాలంటే అదనంగా 20 గ్రాముల బంగారాన్ని కొనాల్సి ఉంటుంది. దీనికిగాను రూ.55వేలు అదనపుభారం పడుతుంది. ఈ నష్టాన్ని నేనెందుకు భరించాలి. - వేమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వంగవీడు మా ఆభరణాలు మాకివ్వాలి.. పత్తికి పెట్టుబడి పెట్టేందుకు నా చెల్లెలి మెడలో ఉన్న బంగారపు పుస్తెలతాడును, ఉంగరాన్ని తాకట్టుపెట్టి అప్పు తీసుకున్నా. అయితే ఆభరణాలు నా చెల్లెలికి తిరిగి ఇవ్వాలంటే రూ.10వేలు అప్పుచేసి చేయించాల్సి ఉంటుంది. అసలే పత్తి పంటపోయి నష్టాలు వచ్చాయి. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన మాపై భారాన్ని మోపడం సమంజసంకాదు. - దరావత్ లాలు, వంగవీడు -
జగిత్యాలలో భారీ చోరీ
జగిత్యాల అర్బన్, న్యూస్‌లైన్ : పట్టణంలోని విద్యానగర్‌లో రెండిళ్లలో ఏకకాలంలో దొంగలు పడ్డారు. సుమారు 11 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.50 వేలు దోచుకెళ్లారు. విద్యానగర్‌కు చెందిన కందుకూరి గంగారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సోమవారం సాయంత్రం గంగారెడ్డి అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు ఇంటికి తాళమేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి 3.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకోగా.. తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లిచూడగా.. బీరువాలోని 8 తులాల బంగారు గొలుసు, నెక్లెస్, ముత్యాలహారం, మాటిలతోపాటు రూ.50 వేలు ఎత్తుకెళ్లారు. అలాగే అదే ప్రాంతానికి చెందిన గోపు రాజన్న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే దొంగలు చొరబడ్డారు. ఇంట్లోని 80 తులాల వెండి, 3 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు బోరుమన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ కిరణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని గంగారెడ్డి, రాజన్న ఇళ్లను పరిశీలించారు. కరీంనగర్ నుంచి క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. జగిత్యాలలో ఇటీవల దొంగతనాలు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న క్రమంలో ఇకేసారి రెండిళ్లలో చోరీలు జరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.