
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి వారికి నిజాం కుటుంబం తరపున ప్రిన్సెస్ బేగం సాహిబా ఎస్రా బిర్గెన్ బంగారు హారాన్ని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు ద్వారా అందజేశారు. ఈ హారాన్ని ఆదివారం కిషన్‌రావు ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు.
శ్రీస్వామి వారి ప్రధానాలయం ప్రారంభమైన తరువాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.4లక్షల విలువైన 67 గ్రాముల బంగారు హారాన్ని నిజాం కుటుంబం తరపున పంపించారని ఆలయాధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment