'కస్టమ్స్‌'.. తీర్చేయాప్‌ | Must be vigilant when bringing foreign goods | Sakshi
Sakshi News home page

'కస్టమ్స్‌'.. తీర్చేయాప్‌

Published Mon, Aug 12 2019 3:24 AM | Last Updated on Mon, Aug 12 2019 4:53 AM

Must be vigilant when bringing foreign goods - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి దుబాయ్‌లో తన మేనమామ ఇంట్లో విందుకు హాజరైంది. వారిచ్చిన బంగారు నెక్లెస్‌ను వేసుకుని శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగగానే కస్టమ్స్‌వాళ్లు సరైన పత్రాలు లేవని భారీగా పన్ను విధించారు. 

హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్యాసింజర్‌కు దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో మరో భారతీయుడు ఒక బ్యాగు ఇచ్చి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తమ వాళ్లకు ఇవ్వాలని కోరాడు. అలా తెచ్చి కస్టమ్స్‌ అధికారుల తనిఖీలో అందులో బంగా రం ఉండటంతో జైలుపాలయ్యాడు. 

విదేశీ వస్తువులు భారత్‌కు తీసుకొచ్చే విషయంలో నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన లేకపోవడంతో ఒక్కోసారి అమాయకులు కస్టమ్స్‌ వద్ద తీవ్ర ఇబ్బందులు పడటం, అధిక పన్ను చెల్లించాల్సి రావడం, కొన్ని సందర్భాల్లో అరెస్టు కావడం జరుగుతోంది. విదేశాలకు వెళ్లేవారు లగేజీ, వస్తువుల విషయంలో నిబంధనలను యాప్‌ ద్వారా  తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు. 

నిబంధనలు ఇవీ... 
1 రెండు లీటర్ల లిక్కర్, 100 సిగరెట్లు, ఒక ల్యాప్‌టాప్, ఒక ఫోన్‌ మాత్రమే తీసుకొస్తే పన్ను విధించరు. రెండో ఫోన్, రెండో ల్యాప్‌టాప్‌ తీసుకొస్తే దాని ఖరీదు రూ.50 వేలు దాటితే కస్టమ్స్‌ డ్యూటీ 38.5 శాతం చెల్లించాలి. 

2 కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపు అస్సలుండదు. ఉదాహరణకు.. కొందరు టీవీలు తెచ్చుకుంటారు. దాని ధర రూ.50 వేలలోపు ఉన్నా అధికారులు చెప్పినంత డ్యూటీ కట్టాల్సిందే.  

3 చాలామంది మహిళలు విదేశాల్లో నగలు కొనుగోలు చేసి వేసుకుని వస్తుంటారు. విదేశాల్లో ఏడాదికిపైగా ఉండి భారత్‌ తిరిగి వచి్చన మహిళలకు 40 గ్రాముల (విలువ రూ.లక్ష మాత్రమే) వరకు బంగారానికి డ్యూటీ ఉండదు. విలువ రూ.లక్ష దాటితే 38.5 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. పురుషులకైతే ఇది 20 గ్రాములకే పరిమితం. 

4 విదేశాల నుంచి బంగారు బిస్కెట్లు తీసుకొచ్చేవారు ఇమిగ్రేషన్‌ కౌంటర్‌లోనే కస్టమ్స్‌ అధికారులను సంప్రదించి డిక్లరేషన్‌ ఫామ్‌ సమర్పించాలి. దాని ఆధారంగా ఎంత పన్ను కట్టాలో అధికారులు చెబుతారు. అది కట్టి బయటికి రావాల్సి ఉంటుంది. కట్టకుంటే అక్రమ రవాణాగా పరిగణించి అరెస్టు చేస్తారు. ఎలాంటి డిక్లరేషన్‌ చేయాల్సిన అవసరం లేనివాళ్లు గ్రీన్‌ చానల్‌ ద్వారా బయటికి రావొచ్చు. 

5 విదేశీ నగదు విషయంలోనూ 5,000 డాలర్ల కంటే నగదు, 10,000 డాలర్ల చెక్‌ కంటే అధికంగా ఉండకూడదు. వీటిని కరెన్సీ డిక్లరేషన్‌ ఫారం తీసుకుని అందులో పొందుపరచాలి. విదేశాలకు వెళ్లే సమయంలో ఫారిన్‌ కరెన్సీ విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. కానీ, దాన్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చారన్న విషయంపై సరైన పత్రాలు çసమర్పించాలి. ఒకవేళ ఇండియన్‌ కరెన్సీని తీసుకెళ్లాలంటే మాత్రం రూ.25 వేల కంటే అధికంగా అనుమతించరు. 

6 విదేశాల్లో విందులకు, వివాహాలకు హాజరయ్యే మహిళలకు తాము వెంట తీసుకెళ్లే నగల విషయంలో జాగ్రత్త అవసరం. ఎంత విలువైన నగలను తీసుకెళ్తున్నామన్నది ముఖ్యం. ప్రభుత్వ ఆమోదం పొందిన సంస్థల ద్వారా ఎంత బంగారం తీసుకెళ్తున్నా
మన్నది సరి్టఫై చేయించుకోవాలి. దాన్ని ఎక్స్‌పోర్ట్‌ డిపార్చర్‌ ఆఫీసర్‌ వద్ద సరి్టఫై చేయించుకుని తీసుకెళ్లొచ్చు. వచ్చే సమయంలో దాన్ని చూపిస్తే ఎలాంటి అనుమానాలు రాకుండా ఉంటాయి. 

7 ఇలాంటి నిబంధనలు పాటిస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రావు. మరిన్ని వివరాలకు http://www.cbic.gov.in/ వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు. 

8 విదేశీయులు లేదా విదేశాల్లో కొంతకాలం ఉండి ఇండియాకు వచ్చేవారు ఏమేం తీసుకొచ్చే విషయంలో అనుమానాల నివృత్తికి యాప్‌ కూడా ఉంది. ‘ఇండియన్‌ కస్టమ్స్‌ ట్రావెల్‌ గైడ్‌ యాప్‌’ను ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఫోన్ల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement