Dubai airport
-
ఎయిర్పోర్ట్ కొత్త రూల్స్.. ఈ వస్తువులకు నో ఎంట్రీ
సురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని దుబాయ్ విమానాశ్రయం దాని నియమాలలో కొన్ని మార్పులు చేసింది. సాధారణంగా ప్రయాణికులు క్యాబిన్ బ్యాగ్‌లో మందులు వంటి ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్లవచ్చు. కానీ ఇప్పుడు దుబాయ్ వెళ్లే విమానంలో ఇది సాధ్యం కాదు. మీరు అన్ని రకాల మందులను తీసుకెళ్లలేరు. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు అనుమతించిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి.దుబాయ్ విమాన లగేజీ నిబంధనలలో మార్పులుచాలా సార్లు ప్రయాణికులు తమకు తెలియకుండానే అనుమతి లేని కొన్ని వస్తువులను తమతో విమానంలోకి తీసుకెళ్తుంటారు. వీటిని విమానంలో తీసుకెళ్లడం చట్టపరమైన నేరంగా పరిగణిస్తారు. మీరు దుబాయ్ వెళ్తుంటే విమానంలో చెక్-ఇన్ లగేజీతో పాటు క్యాబిన్ బ్యాగేజీలో ఏమి ప్యాక్ చేయవచ్చు.. ఏమి చేయకూడదు అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. దుబాయ్‌కి ప్రయాణించేటప్పుడు బ్యాగుల్లో ఎలాంటి వస్తువులను తీసుకువెళ్లవచ్చో ఇక్కడ తెలుసుకోండి.ఈ ఉత్పత్తులను బ్యాగులో తీసుకెళ్లకూడదుకొకైన్, హెరాయిన్, గసగసాలు, మత్తు కలిగించే మందులు.తమలపాకులు, కొన్ని మూలికలు వంటివి కూడా తీసుకెళ్లకూడదు.ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు, జూద వస్తువులు, మూడు పొరల ఫిషింగ్ నెట్లు, బహిష్కృత దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను తీసుకెళ్లడం కూడా నేరంగా పరిగణిస్తారు.ముద్రిత వస్తువులు, ఆయిల్ పెయింటింగ్‌లు, ఛాయాచిత్రాలు, పుస్తకాలు, రాతి శిల్పాలను కూడా తీసుకెళ్లకూడదు.నకిలీ కరెన్సీ, ఇంట్లో వండిన ఆహారం, మాంసాహారం కూడా తీసుకెళ్లకూడదు.ప్రయాణికులెవరైనా ఈ నిషేధిత వస్తువులను తీసుకెళ్తున్నట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.ఈ మందులను అస్సలు తీసుకెళ్లలేరుబెటామెథోడోల్ఆల్ఫా-మిథైల్ఫెనానిల్ గంజాయికోడాక్సిమ్ఫెంటానిల్పాపీ స్ట్రా కాన్సన్ట్రేట్మెథడోన్నల్లమందుఆక్సికోడోన్ట్రైమెపెరిడిన్ఫెనోపెరిడిన్కాథినోన్కోడైన్యాంఫెటమైన్వీటిని చెల్లింపుతో తీసుకెళ్లవచ్చుదుబాయ్ ట్రిప్‌కు వెళ్లేటప్పుడు కొన్ని రకాల వస్తువులను చెల్లింపుతో తీసుకెళ్లవచ్చు. ఈ జాబితాలో మొక్కలు, ఎరువులు, మందులు, వైద్య పరికరాలు, పుస్తకాలు, సౌందర్య సాధనాలు, ట్రాన్స్మిషన్, వైర్లెస్ పరికరాలు, ఆల్కహాలిక్ పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఈ-సిగరెట్లు, ఎలక్ట్రానిక్ హుక్కాలు ఉన్నాయి. -
ఎడారి దేశంలో మళ్లీ వర్షం.. విమాన సర్వీసులు రద్దు
ఎడారి దేశం దుబాయ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. యూఏఈలో గురువారం మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. దుబాయ్ వాతావరణ శాఖ శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దాంతో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. దుబాయ్‌లో బస్సు సర్వీసులను కూడా నిలిపేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, అబుదాబి అంతటా ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్ వంటి విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ముందే నివేదించాయి. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్, అబుదాబి, షార్జాలలో విమాన సర్వీసుల్లో మార్పులుంటాయి. వర్షాల కారణంగా స్థానికంగా రోడ్డు ప్రయాణాల్లో అవాంతరాలు కలుగొచ్చు. అందుకు తగ్గట్టుగా ప్రయాణికులు సిద్ధంకావాలి’ అని ఇండిగో ఎయిర్‌లైన్ తన ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసింది.ఇదీ చదవండి: భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..బుధవారం రోజునే దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లు స్థానిక విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులకు సలహాలు జారీ చేశాయి. అక్కడి జాతీయ దినపత్రిక ఖలీజ్ టైమ్స్ కథనాల ప్రకారం..గురువారం రాత్రి దుబాయ్‌కి వెళ్లే ఐదు ఇన్‌బౌండ్ విమానాలను దారి మళ్లించగా, తొమ్మిది అరైవల్, నాలుగు అవుట్‌బౌండ్ సర్వీసులను రద్దు చేసినట్లు తెలిసింది.#6ETravelAdvisory: Due to bad weather in #Dubai #Sharjah #RasAlKhaimah #AbuDhabi, our flight operations are impacted. Road blockages may disrupt local transport. Plan accordingly and allow extra time for airport travel. Check flight status at https://t.co/F83aKzsIHg— IndiGo (@IndiGo6E) May 2, 2024 -
దుబాయ్‌లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
దుబాయ్‌లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్‌లో నిర్మించబోతున్నారు. ఈ మేరకు దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటన చేశారు. దీని కోసం 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు.వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మించచోతున్నారు. ఈ విషయాన్ని దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ ఆదివారం ప్రకటించారు. ఈ విమానాశ్రయం పేరును అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఈ విమానాశ్రయాం నిర్మించడానికి 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు. ఏడాదికి 260 మిలియన్ల మంది రాకపోకలు కొనసాగించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.ఒక్క ఏడాదిలో దాదాపు 260 మిలియన్ల మంది ప్రయాణీకులు ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణాలు కొనసాగించవచ్చన్నారు. ఈ విమానాశ్రయంలో ఐదు సమాంతర రన్వేలు, 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్స్ దీని ప్రత్యేకతలుగా చెప్పారు. కాగా, అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు నుండి అన్ని కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. Today, we approved the designs for the new passenger terminals at Al Maktoum International Airport, and commencing construction of the building at a cost of AED 128 billion as part of Dubai Aviation Corporation's strategy.Al Maktoum International Airport will enjoy the… pic.twitter.com/oG973DGRYX— HH Sheikh Mohammed (@HHShkMohd) April 28, 2024 ఇక, ఈ ఎయిర్‌పోర్టు ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్, లోబడ్జెట్ విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్‌తో పాటు ప్రపంచాన్ని దుబాయ్‌కి, బయటికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్‌లైన్ భాగస్వాములకు కొత్త డెస్టినేషన్ కానుందని దుబాయ్ ప్రభుత్వ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్-మక్తూమ్ వెల్లడించారు. ఈ నిర్మాణం ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. -
భారీ వరదలు.. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందంటే..
ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇటీవల కురిసిన వర్షానికి వరదల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తిరిగి ఎయిర్పోర్ట్ పూర్తిస్థాయిలో పనిచేసేలా అక్కడి యంత్రాంగం పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. దాంతో దుబాయ్ ఎయిర్పోర్ట్ పూర్తిసామర్థ్యానికి చేరుకుందని సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ప్రకటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ విమానాశ్రయం కార్యకలాపాలపై తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 75 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం నమోదు కాగా, రన్‌వే నీట మునిగింది. దీంతో వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం నుంచి విమానాశ్రయం సాధారణ స్థితికి వచ్చిందని, రోజుకు దాదాపు 1400 విమాన సర్వీసులు నిర్వహిస్తున్నామని గ్రిఫిత్స్ తెలిపారు.ఇదీ చదవండి: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీవిమానాశ్రయం తిరిగి యథావిధిగా పనిచేసేలా కృషి చేసిన వారిని ఉద్దేశించి సీఈఓ మాట్లాడారు. ‘విమానాశ్రయం తిరిగి కార్యకలాపాలు సాగించడంలో సిబ్బంది చాలాచొరవ చూపారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా 2,155 విమానాలు రద్దు చేశాం. 115 ఎయిర్‌క్రాఫ్ట్‌లను దారిమళ్లించాం. దుబాయ్‌లోని రెండు విమానాశ్రయాలు డీఎక్స్‌బీ, డీడబ్ల్యూసీ చుట్టూ నీరు చేరడంతో సామగ్రిని రవాణా చేయడంలో సవాళ్లు ఎదుర్కొన్నాం. రెండు విమానాశ్రయాల్లోని సిబ్బంది, ప్రయాణికులకు 75,000 పైగా ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం. ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు మా ఎయిర్‌లైన్ భాగస్వాములు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య భాగస్వాములు, సేవా భాగస్వాములతో కలిసి పని చేయాల్సి వచ్చింది’అని ఆయన అన్నారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం (ఫొటోలు)
-
దుబాయ్‌లో దంచికొట్టిన వాన.. సముద్రాన్ని తలపిస్తున్న ఎడారి దేశాల (ఫొటోలు)
-
దుబాయికి ఈ సామగ్రి తీసుకెళ్లడం నిషేధం
గల్ఫ్ డెస్క్: దుబాయి ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణించేవారు తమ లగేజీలో కొన్ని రకాల వస్తువులను తీసుకపోవడంపై అక్కడి పోలీసులు నిషేధం విధించారు. ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ.. తాము నిషేధించిన సామగ్రి వివరాలను దుబాయి పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేశారు. స్మార్ట్ బ్యాలెన్స్ వీల్స్(హోవర్ బోర్డ్స్ అని కూడా పిలుస్తారు), రసాయనాలు(కెమికల్స్), మెటాలిక్ ఐటెమ్స్ (పెద్ద సైజు కలిగినవి), కార్ల స్పేర్ పార్ట్స్, అన్ని రకాల గ్యాస్ సిలిండర్లు, బ్యాటరీలు, టార్చ్లైట్లు, పేలుడుకు సంబంధించిన లిక్విడ్లు, అలాగే పేలుడుతో సంబంధం లేకున్నా అధిక మోతాదులో ఉన్న లిక్విడ్లు, ఇ సిగరెట్స్, పవర్ బ్యాంక్స్‌ను లగేజీల్లో తీసుకెళ్లడం నిషేధం. -
'కస్టమ్స్'.. తీర్చేయాప్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి దుబాయ్‌లో తన మేనమామ ఇంట్లో విందుకు హాజరైంది. వారిచ్చిన బంగారు నెక్లెస్‌ను వేసుకుని శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే కస్టమ్స్‌వాళ్లు సరైన పత్రాలు లేవని భారీగా పన్ను విధించారు. హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్యాసింజర్‌కు దుబాయ్ ఎయిర్‌పోర్టులో మరో భారతీయుడు ఒక బ్యాగు ఇచ్చి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తమ వాళ్లకు ఇవ్వాలని కోరాడు. అలా తెచ్చి కస్టమ్స్ అధికారుల తనిఖీలో అందులో బంగా రం ఉండటంతో జైలుపాలయ్యాడు. విదేశీ వస్తువులు భారత్‌కు తీసుకొచ్చే విషయంలో నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన లేకపోవడంతో ఒక్కోసారి అమాయకులు కస్టమ్స్ వద్ద తీవ్ర ఇబ్బందులు పడటం, అధిక పన్ను చెల్లించాల్సి రావడం, కొన్ని సందర్భాల్లో అరెస్టు కావడం జరుగుతోంది. విదేశాలకు వెళ్లేవారు లగేజీ, వస్తువుల విషయంలో నిబంధనలను యాప్ ద్వారా తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు. నిబంధనలు ఇవీ... 1 రెండు లీటర్ల లిక్కర్, 100 సిగరెట్లు, ఒక ల్యాప్‌టాప్, ఒక ఫోన్ మాత్రమే తీసుకొస్తే పన్ను విధించరు. రెండో ఫోన్, రెండో ల్యాప్‌టాప్ తీసుకొస్తే దాని ఖరీదు రూ.50 వేలు దాటితే కస్టమ్స్ డ్యూటీ 38.5 శాతం చెల్లించాలి. 2 కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపు అస్సలుండదు. ఉదాహరణకు.. కొందరు టీవీలు తెచ్చుకుంటారు. దాని ధర రూ.50 వేలలోపు ఉన్నా అధికారులు చెప్పినంత డ్యూటీ కట్టాల్సిందే. 3 చాలామంది మహిళలు విదేశాల్లో నగలు కొనుగోలు చేసి వేసుకుని వస్తుంటారు. విదేశాల్లో ఏడాదికిపైగా ఉండి భారత్ తిరిగి వచి్చన మహిళలకు 40 గ్రాముల (విలువ రూ.లక్ష మాత్రమే) వరకు బంగారానికి డ్యూటీ ఉండదు. విలువ రూ.లక్ష దాటితే 38.5 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. పురుషులకైతే ఇది 20 గ్రాములకే పరిమితం. 4 విదేశాల నుంచి బంగారు బిస్కెట్లు తీసుకొచ్చేవారు ఇమిగ్రేషన్ కౌంటర్లోనే కస్టమ్స్ అధికారులను సంప్రదించి డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి. దాని ఆధారంగా ఎంత పన్ను కట్టాలో అధికారులు చెబుతారు. అది కట్టి బయటికి రావాల్సి ఉంటుంది. కట్టకుంటే అక్రమ రవాణాగా పరిగణించి అరెస్టు చేస్తారు. ఎలాంటి డిక్లరేషన్ చేయాల్సిన అవసరం లేనివాళ్లు గ్రీన్ చానల్ ద్వారా బయటికి రావొచ్చు. 5 విదేశీ నగదు విషయంలోనూ 5,000 డాలర్ల కంటే నగదు, 10,000 డాలర్ల చెక్ కంటే అధికంగా ఉండకూడదు. వీటిని కరెన్సీ డిక్లరేషన్ ఫారం తీసుకుని అందులో పొందుపరచాలి. విదేశాలకు వెళ్లే సమయంలో ఫారిన్ కరెన్సీ విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. కానీ, దాన్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చారన్న విషయంపై సరైన పత్రాలు çసమర్పించాలి. ఒకవేళ ఇండియన్ కరెన్సీని తీసుకెళ్లాలంటే మాత్రం రూ.25 వేల కంటే అధికంగా అనుమతించరు. 6 విదేశాల్లో విందులకు, వివాహాలకు హాజరయ్యే మహిళలకు తాము వెంట తీసుకెళ్లే నగల విషయంలో జాగ్రత్త అవసరం. ఎంత విలువైన నగలను తీసుకెళ్తున్నామన్నది ముఖ్యం. ప్రభుత్వ ఆమోదం పొందిన సంస్థల ద్వారా ఎంత బంగారం తీసుకెళ్తున్నా మన్నది సరి్టఫై చేయించుకోవాలి. దాన్ని ఎక్స్పోర్ట్ డిపార్చర్ ఆఫీసర్ వద్ద సరి్టఫై చేయించుకుని తీసుకెళ్లొచ్చు. వచ్చే సమయంలో దాన్ని చూపిస్తే ఎలాంటి అనుమానాలు రాకుండా ఉంటాయి. 7 ఇలాంటి నిబంధనలు పాటిస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రావు. మరిన్ని వివరాలకు http://www.cbic.gov.in/ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. 8 విదేశీయులు లేదా విదేశాల్లో కొంతకాలం ఉండి ఇండియాకు వచ్చేవారు ఏమేం తీసుకొచ్చే విషయంలో అనుమానాల నివృత్తికి యాప్ కూడా ఉంది. ‘ఇండియన్ కస్టమ్స్ ట్రావెల్ గైడ్ యాప్’ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
దుబాయ్‌లో శివాజీ అడ్డగింత
సాక్షి, హైదరాబాద్: టీవీ9 అధికార మార్పిడి కేసులో నిందితుడిగా ఉన్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ అమెరికా వెళ్లకుండా మరోసారి ఆటంకం ఎదురైంది. కనెక్టింగ్ ఫ్లైట్‌లో అమెరికా వెళ్తుండగా దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఈ నెల 26న (శుక్రవారం) జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌లో అమెరికా విమానం ఎక్కుతుండగా అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.. ఆయన్ను అడ్డుకుని మరో విమానంలో భారత్‌కు పంపించారు. అయితే ఇందుకు కారణాలేంటన్నది స్పష్టంగా తెలియరాలేదు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌తో పాటు శివాజీపై హైదరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని సైబరాబాద్ పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పుడు విచారించిన పంపిన సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు.. పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని శివాజీకి నోటీసులు ఇచ్చారు. ఆయనపై ఎలాంటి ఆంక్షలు లేవు దుబాయ్ విమానాశ్రయంలో శివాజీని అడ్డుకోవడంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. శివాజీ విదేశాలకు వెళ్లే విషయంలో తామెలాంటి ఆంక్షలు విధించలేదని ఆయన స్పష్టంచేశారు. దుబాయ్‌లో ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని ఎందుకు తనిఖీ చేశారు? ఏ కారణంతో వెనక్కి పంపారన్న సంగతి తమకు తెలియదన్నారు. ఈ విషయం ఒక్క శివాజీకి మాత్రమే తెలుసని.. ఆయన మాట్లాడితేనే విషయాలు బయటకొస్తాయని పోలీసులంటున్నారు. తెలంగాణలో నమోదైన కేసులు కాకుండా వీసా లేదా ఇతర వివాదాలేమైనా కారణాలు కావొచ్చని భావిస్తున్నారు. -
దుబాయ్‌లో నటుడు శివాజీకి చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీకి దుబాయ్ విమానాశ్రయంలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్ మీదగా అమెరికా వెళుతున్న అతడిని ఈ నెల 26న దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. శివాజీపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ తిరిగి అతడిని హైదరాబాద్ పంపించివేశారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌తో పాటు శివాజీపై హైదరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడా హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఆ తర్వాత సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అతడికి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు శివాజీపై ఎలాంటి ఆంక్షలు లేవని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. దుబాయ్ పోలీసులు ఎందుకు ఆపారో తెలియదని అన్నారు. -
కుప్పకూలిన డైమండ్ విమానం : నలుగురు మృతి
అమెరికా టెక్ దిగ్గజం హనీవెల్‌కు చెందిన డైమండ్ ఎయిర్ క్రాష్ట్ఖు చెందిన విమానం కుప్పకూలింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నలుగురు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉన్న ఈ బుల్లి విమానం దుబాయ్‌లో కూలిపోయింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన కారణంగా దుబాయ్ విమానాశ్రయంలో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. పలు విమానాలు ఆలస్యమైనాయి. ప్రస్తుతం పరిస్థితి చక్కబడిందనీ, ముందు జాగ్రత్త చర్యగా కొన్ని విమానాలను దారి మళ్లించామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా దుబాయ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత రద్దీగల విమానాశ్రయాల్లో ఒకటిగా పేరుగాంచింది. దుబాయ్‌లో ఫ్లైట్ కాలిబ్రేషన్ సర్వీసెస్ నిమిత్తం డీఏ42 విమానాన్ని అద్దెకు తీసుకున్నామని హనీ వెల్ తెలిపింది. ప్రమాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన సంస్థ బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని ప్రకటించింది. Government of Dubai Media Office: The small plane, a diamond 43 owned by Honeywell, had four passengers on board, when it crashed due to a technical malfunction. — Dubai Media Office (@DXBMediaOffice) May 16, 2019 -
చేతిలో బరువు పెరిగితే బాదుడే..!
దుబాయ్ : అంతర్జాతీయ షాపింగ్ మాల్గా పేరున్న దుబాయ్‌కి ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు వస్తుంటారు. మరి అలాంటి అత్యంత రద్దీగల దేశంలో ఉన్న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించే వారి జేబులకు చిల్లులు పేట్టేందుకు విమానాశ్రయ అధికారులు సిద్ధమవుతున్నారు. చేతిలో ఉన్న బ్యాగుల బరువు ఆధారంగా అదనపు చార్జీలను వసూలు చేయనున్నట్టు ఎయిర్‌పోర్టు అథారిటీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విమానాలలో ప్రయాణించే వారు కొంత లగేజ్‌ను(హ్యాండ్ బ్యాగ్‌లు, చిన్నపాటి సూట్‌కేసులు) తమతో పాటు తీసుకుని వెళ్తారు. సాధారణంగా వాటికి ఎటువంటి చార్జీలు ఉండవు. కానీ దుబాయ్ ఎయిర్ పోర్టులో చేతిలో తీసుకువెళ్లే లగేజ్‌కు అదనపు చార్జీని వసూలు చేయనున్నారు. అయితే, లగేజ్ ఎంత బరువు ఉండాలి, ఎంత మొత్తంలో ఫీజును వడ్డించనున్నారో ఇంకా స్పష్టంగా పేర్కొనలేదు. అదనపు ఫీజు మాత్రం ఉంటుందని ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం ప్రయాణికులు తమ తమ క్యారియర్స్ వెబ్‌సైట్‌ను చూడాల్సిందిగా ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు. -
ఎయిర్‌పోర్టులో పార్కింగ్ చార్జీల పెంపు
దుబాయ్ : ప్రపంచలోనే అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాహనాల పార్కింగ్ చార్జీలను పెంచారు. గత పది సంవత్సరాల తర్వాత చార్జీలను పెంచడం ఇదే మొదటిసారి అని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. వాహనాన్ని ఒక గంటపాటు నిలుపుదల చేస్తే ఇకనుంచి 10 దిర్హమ్ లు వసూలు చేస్తారు. ఇది గతంలో ఒక గంటకు 5 దిర్హమ్లు మాత్రమే పార్కింగ్ ఫీ ఉండేది. తాజా నిర్ణయంపై ఎయిర్ పోర్టు అధికారులు స్పందిస్తూ రేట్ల పెంపుదల చాలా స్వల్పమని చెప్పారు. లాంగ్‌టర్మ్ కారు పార్కింగ్‌పై 20 దిర్హమ్ల నుంచి 25 దిర్హమ్లకు, షార్ట్‌టర్మ్ కారు పార్కింగ్‌పై 20 దిర్హమ్ నుంచి 30 దిర్హమ్లకు పెంచినట్చుటు ప్రకటించారు. అయితే ఈ చార్జీల పెంపుపై దుబాయ్ వాసుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 20 నిమిషాలు కారును పార్క్ చేసినా పూర్తి గంటకు చార్జీని వసులు చేయడం దారుణమని చెప్పారు. ఇలావుండగా, ఒక రోజు - 24 గంటల పార్కింగ్‌పై చార్జీలను తగ్గించినట్టు అధికారులు తెలిపారు. 24 గంటల పార్కింగ్ చార్జీలపై 55 శాతం కోత విధించారు. 280 దిర్హమ్స్ నుంచి 125 దిర్హమ్స్‌కు తగ్గించారు. అలాగే ప్రీమియం కార్ల పార్కింగ్‌పై 39 శాతం చార్జీలను తగ్గించారు. -
ఎమిరేట్స్ అనుచిత ప్రవర్తన!
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌కు దక్షిణాఫ్రికాకు వెళ్లే సమయంలో అనూహ్య ఘటన ఎదురైంది. దుబాయ్ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ధావన్ కుటుంబ సభ్యులను అడ్డుకున్నారు. అతని భార్య, పిల్లల గుర్తింపు కోసం బర్త్ సర్టిఫికెట్తో పాటు ఇతర డాక్యుమెంట్లు చూపించాల్సిందిగా కోరారు. దాంతో సర్టిఫికెట్లు వచ్చే వరకు వారిని అక్కడే ఉంచి ధావన్ జట్టుతో పాటు దక్షిణాఫ్రికా వెళ్లిపోవాల్సి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో ధావన్ తన ఆగ్రహాన్ని ప్రకటించాడు. ‘ఎమిరేట్స్ సంస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. కేప్‌టౌన్ ఫ్లయిట్ ఎక్కే సమయంలో నా కుటుంబ సభ్యులు ప్రయాణించడానికి వీల్లేదని వారు చెప్పారు. నా భార్యా పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర డాక్యుమెంట్లు చూపించమన్నారు. మేం వాటిని వెంట తీసుకుపోలేదు. దాంతో డాక్యుమెంట్ల కోసం ఎదురు చూస్తూ వారు ఇంకా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నారు. అలాంటివి అవసరం అని భావిస్తే మేం ముంబైలో ఫ్లయిట్ ఎక్కే సమయంలోనే అధికారులు చెప్పాలి కదా. కారణం లేకుండా ఎమిరేట్స్ ఉద్యోగి ఒకరు దురుసుగా ప్రవర్తించాడు’ అని ధావన్ ఆక్రోశించాడు. -
ప్రాణాలు పోతున్నా.. ల్యాప్‌టాప్‌ల కోసం ఆగారు!
ఒకవైపు విమానం క్రాష్ ల్యాండింగ్ అవుతోంది. ఏ క్షణంలోనైనా ఎంతటి ప్రమాదం అయినా జరగొచ్చని, వెంటనే బయటకు వెళ్లిపోవాలని విమాన సిబ్బంది చెబుతున్నారు. అయినా చాలామంది ప్రయాణికులు పైన కేబిన్లలో ఉన్న తమ బ్యాగుల గురించి కాసేపు ఆగిపోయారట. ముఖ్యంగా కొంతమంది అయితే ల్యాప్‌టాప్.. ల్యాప్‌టాప్ అని అరవడం కూడా ఈ ఘటనపై తాజాగా బయటకు వచ్చిన వీడియోలో వినిపించింది. దుబాయ్ విమానాశ్రయంలో కొచ్చి నుంచి వెళ్లిన ఎమిరేట్స్ విమానం క్రాష్ ల్యాండ్ కావడం, అందులోని ప్రయాణికులు అంతా త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటం తెలిసిందే. ప్రయాణికులు బయటకు రావడానికి ముందు తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం అవుతోంది. ఆ వీడియోలో... ఎమర్జెన్సీ చూట్లు ఉపయోగించి బయటకు వెళ్లిపోవాలని సిబ్బంది గట్టిగా చెప్పడం వినిపించింది. కాసేపటికి విమానం ముక్కలుగా విడిపోవడం, మంటలు రావడం కూడా వీడియోలో ఉంది. విమానంలో మొత్తం 300 మందికి పైగా ఉండగా, చాలామంది కేరళీయులే. పారాచూట్ తీసుకుని స్లైడ్ మీదుగా దూకాలని విమానంలోని మహిళా అటెండెంటు గట్టిగా అరిచి మరీ చెప్పింది. అయినా కూడా ప్రయాణికుల్లో కొంతమంది మాత్రం ప్రాణాలు కాపాడుకోవడం కంటే తమ విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లడానికే ప్రాధాన్యం ఇచ్చారు. -
ఆ నిమిషమే..300 మంది ప్రాణాలు కాపాడింది
-
విమానం క్రాష్ ల్యాండ్.. తప్పిన పెనుముప్పు!
► తిరువనంతపురం-దుబాయ్ విమానానికి తప్పిన ముప్పు ► అత్యవసర ల్యాండింగ్.. దట్టంగా అలుముకున్న పొగలు ► 300 మందిని క్షేమంగా బయటకు పంపిన సహాయక సిబ్బంది ► ప్రయాణికుల్లో 226 మంది భారతీయులే ► కాసేపటికే పేలిన విమానం.. ► అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు మృతి.. ► గేర్లు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణం! దుబాయ్: అది ఈకే 521 ఎమిరేట్స్ విమానం.. 282 మంది ప్రయాణికులు.. 18 మంది సిబ్బందితో తిరువనంతపురం నుంచి దుబాయ్ బయల్దేరింది.. ఎయిర్‌పోర్టు వచ్చేసింది.. రన్‌వేపై క్రాష్ ల్యాండ్ అయింది.. ఇంతలో ఒక్కసారిగా దట్టమైన పొగలు.. ప్రయాణికుల గుండెలు జారిపోయాయి.. ఇక అంతే అనుకున్నారు.. కానీ విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన స్పందించారు.. విమానాన్ని చుట్టుముట్టి నిమిషాల వ్యవధిలో అందరినీ దింపేశారు.. వారంతా అలా దిగారో లేదో విమానం భగ్గున మండుతూ పేలిపోయింది.. కొద్ది క్షణాలు ఆలస్యమైనా ఘోర ప్రమాదం జరిగిపోయేది..! ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నా వారిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ హఠాత్పరిణామంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. గేర్లు ఫెయిల్ అయ్యాయా? కేరళలోని తిరువనంతపురం నుంచి ఎమిరేట్స్‌కు చెందిన విమానం (బోయింగ్ 777-300) బుధవారం ఉదయం 10.19 గంటలకు దుబాయ్‌కి బయల్దేరింది. మధ్యాహ్నం 12.50 గంటలకు దుబాయ్‌లో దిగాల్సి ఉంది. ఇందులో ప్రయాణిస్తున్న 282 మంది ప్రయాణికుల్లో ఏడుగురు చిన్న పిల్లలు సహా 74 మంది విదేశీయులు ఉన్నారు. విదేశీయుల్లో బ్రిటన్‌కు చెందినవారు 24 మంది, యూఏఈకు చెందినవారు 11 మంది, అమెరికా, సౌదీ అరేబియాకు చెందినవారు ఆరుగురు చొప్పున ఉన్నారు. మిగతావారిలో ఎక్కువ మంది కేరళకు చెందినవారున్నారు. అసలు ప్రమాదానికి కారణం ఏంటన్నది అధికారికంగా వెల్లడించలేదు. అయితే విమానం దిగే సమయంలో గేర్లు పనిచేయకుండా పోయాయని, ఫలితంగా విమానం రన్‌వేపై జారుకుంటూ పోయిందని, కాసేపటికే పేలిందని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదంతో విమానాశ్రయం నిండా దట్టమైన పొగ అలుముకుంది. ఎయిర్‌పోర్టులోని అత్యవసర బృందాలు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి సహాయక చర్యలకు దిగారు. హుటాహుటిన ప్రయాణికులను కిందకు దింపేశారు. ప్రమాదం నుంచి ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారని విమానాశ్రయ వర్గాలు ప్రకటించాయి. అయితే పొగ కారణంగా కొందరు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. వారిలో 10 మందికి చికిత్స అందించి పంపించారు. పొగ ప్రభావానికి ఎక్కువగా గురి కావడంతో ఒక వ్యక్తిని మాత్రం హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానం ఎమిరేట్స్ సంస్థలో 13 ఏళ్ల నుంచి సర్వీసులు అందిస్తోంది. ప్రమాదం నేపథ్యంలో దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి మొత్తం 21 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇందులో రెండు విమానాలు భారత్‌కు రావాల్సినవి కూడా ఉన్నాయి. మరికొన్ని విమానాలను దారి మళ్లించారు. ఒక నిమిషం ఆలస్యమైతే.. ‘‘విమాన ప్రయాణికుల్లో ఎక్కువమంది కేరళవారే. విమానం బయల్దేరిన సమయంలో ఎలాంటి సమస్యా లేదు. సాంకేతిక సమస్య ఉందంటూ ఎలాంటి ప్రకటన చేయలేదు. విమానం ల్యాండ్ అయ్యాక కొద్దిగా ముందుకు కదిలి నేలను ఢీకొంది. విమానంలో పొగ రావడంతో ఏదో అయిందని అర్థమైంది. ఇంకో నిమిషం విమానంలో ఉండుంటే భారీ ప్రమాదం జరిగేది..’’ అని సాయి భాస్కర్ అనే ప్రయాణికుడు వెల్లడించారు. అత్యవసర ద్వారాల నుంచి దూకిన కొందరు ప్రయాణికులు గాయపడ్డారని ఆయన చెప్పారు. తనతో పాటు భార్యా పిల్లలు కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని షాజీ అనే మరో ప్రయాణికుడు చెప్పాడు. -
పైలట్ చివర్లో ఆ విషయం చెప్పారు
దుబాయ్: తిరువనంతపురం-దుబాయ్ ఎమిరేట్స్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 300 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.. బుధవారం దుబాయ్ విమానాశ్రయంలో ఈ విమానం క్రాష్ ల్యాండ్ అయిన దృశ్యాలు చూస్తే ఎంతపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారో తెలుస్తుంది.. విమానం నుంచి దట్టంగా పొగలు వస్తుండగా అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అయితే ప్రమాదంలో చిక్కుకున్నారన్న విషయం విమాన ప్రయాణికులకు చివరకు వరకు తెలియదట. విమానం క్రాష్ ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు పైలట్ ఈ విషయం చెప్పారని ప్రయాణికులు చెప్పారు. విమానం దుబాయ్ దగ్గరకు చేరుకుందని, ల్యాండింగ్ గేర్‌లో సమస్య వచ్చిందని, దీంతో అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నట్టు పైలట్ ప్రకటించారని ప్రయాణికులు తెలిపారు. కొన్ని నిమిషాల తర్వాత విమానం ల్యాండ్ అయిందని చెప్పారు. వెంటనే విమానం ఎమర్జెన్సీ డోర్లు అన్నీ తెరిచి నిమిషాల్లో ప్రయాణికులను సురక్షితంగా బయటకుపంపారని తెలిపారు. విమానంలో 282 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 226 మంది భారతీయులు ఉన్నారు. -
ఎమిరెట్స్ విమానం క్రాష్ ల్యాండ్..!
-
దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఘనత
దుబాయ్: దుబాయ్ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. 2014లో ప్రపంచంలో అత్యంత రద్దీ కలిగిన ఎయిర్ పోర్టుగా నిలిచింది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయాన్ని వెనక్కు నెట్టి ఈ ఘనత సాధించింది. గతేడాది 7 కోట్ల 4 లక్షల మందిపైగా ప్రయాణికులు దుబాయ్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించారు. 2013తో పోలిస్తే ఈ సంఖ్య 6.1 శాతం అధికం. హీత్రూ ఎయిర్ పోర్టు నుంచి 6.8 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అయితే దుబాయ్ విమానాశ్రయం స్థాయిలో వృద్ధి నమోదు చేయలేకపోయింది. ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య 7 కోట్ల 90 లక్షలకు పెరిగే అవకాశముందని దుబాయ్ అంచనా వేస్తోంది. కాగా, 32 బిలియన్ డాలర్ల వ్యయంతో కొత్త విమానాశ్రయం నిర్మించేందుకు దుబాయ్ సన్నాహాలు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఏడాది 24 కోట్ల మంది ప్రయాణికులు దీని గుండా రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు. -
దుబాయ్ వెళ్లే విమానాలకు అంతరాయం
80 రోజుల పాటు రన్‌వేల మూసివేత న్యూఢిల్లీ: దుబాయ్ విమానాశ్రయంలో అభివృద్ధి పనుల కారణంగా కొద్ది రోజుల పాటు విమాన సర్వీసులకు అంతరాయం కలగనుంది. గురువారం నుంచి 80 రోజుల పాటు ఈ ఎడారి నగరానికి విమానాల రాకపోకలకు ఆటంకం కలగనుంది.దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని రెండు రన్‌వేలను అభివృద్ధి చేసే నిమిత్తం 80 రోజుల పాటు మూసేయాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. దీని వల్ల దుబాయ్‌కు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య 26 శాతానికి తగ్గిపోనుంది. ఈ నిర్ణయంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, జెట్ ఎయిర్వేస్ తదితర సంస్థలు దుబాయ్‌కు నడిపే తమ విమాన సర్వీసులను షార్జా ఎయిర్‌పోర్టుకు మార్చాయి. మరికొన్ని సర్వీసుల సమయాలను మార్పు చేశాయి. ఇండిగో, దుబాయ్ ఎమిరేట్స్ సంస్థలు దుబాయ్ విమాన సర్వీసులను కుదించాయి. మరికొన్ని సర్వీసులను రీషెడ్యూల్ చేశాయి. -
80 రోజులపాటు దుబాయ్‌కు విమానాల్లేవు!
న్యూఢిల్లీ: అభివద్ధి పనులు చేపడుతున్న కారణంగా ఈ రోజు నుంచి 80 రోజుల పాటు దుబాయ్ విమానాశ్రయానికి విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని రెండు రన్‌వేలను అభివద్ధి చేసే నిమిత్తం 80 రోజుల పాటు మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగా దుబాయ్‌కు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య 26 శాతానికి తగ్గిపోనున్నాయి.ఈ నిర్ణయంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, జెట్ ఎయిర్వేస్ తదితర సంస్థలు దుబాయ్‌కు నడిపే తమ విమాన సర్వీసులను షార్జా ఎయిర్‌పోర్టుకు మార్చాయి. మరికొన్ని సర్వీసుల సమయాలను మార్పు చేశాయి. ఇండిగో, దుబాయ్ ఎమీరేట్స్ సంస్థలు దుబాయ్ విమాన సర్వీసులను కుదించాయి. మరికొన్ని సర్వీసులను రీషెడ్యూల్ చేశాయి. ఎయిర్ఇండియాకు చెందిన చెన్నై-దుబాయ్, విశాఖపట్నం-హైదరాబాద్-దుబాయ్ విమానాలను షార్జాకు మార్చారు. ప్రస్తుతం నడిచే తమ విమాన సర్వీసుల సమయాల గురించి ప్రయాణికులు తమని అడిగి తెలుసుకోవాలని ఇండిగో అధికార ప్రతినిధి చెప్పారు. ఇతర విమాన సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. -
దుబాయ్ విమానాలన్నింటి గమ్యం భారత్!!
ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎక్కువ మంది ఎక్కడకు వెళ్తారో తెలుసా.. భారతదేశానికే!! 2013లో ఇలాగే జరిగిందని ఓ నివేదికలో వెల్లడైంది. 2012 సంవత్సరంలో 73.47 లక్షల మంది ప్రయాణికులే భారత దేశానికి రాగా, 2013 సంవత్సరంలో అది 84 లక్షలకు పెరిగింది. 14.3 శాతం పెరుగుదల కనిపించింది. ఈ విషయాన్ని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సంస్థ తెలిపింది. భారత్ తర్వాత రెండో స్థానంలో బ్రిటన్ నిలిచింది. ఆ దేశానికి 50.99 లక్షల మంది వెళ్లగా, సౌదీ అరేబియాకు 48.25 లక్షల మంది వెళ్లారు. దుబాయ్ వైమానిక రంగంలోనే ఇది చాలా చరిత్రాత్మక కాలం అని, ఎయిర్‌బస్ ఎ-380 విమానాలు కూడా ఇక్కడ దిగేందుకు అవకాశం ఉందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. ఈ విమానాశ్రయం నుంచి వార్షిక ప్రయాణికుల ట్రాఫిక్ 6.64 కోట్లకు చేరుకోవడంతో మరో ఘనత సాధించినట్లయింది. 2012తో పోలిస్తే ఇది 15.2 శాతం ఎక్కువ.