దుబాయ్ : ప్రపంచలోనే అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాహనాల పార్కింగ్ చార్జీలను పెంచారు. గత పది సంవత్సరాల తర్వాత చార్జీలను పెంచడం ఇదే మొదటిసారి అని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. వాహనాన్ని ఒక గంటపాటు నిలుపుదల చేస్తే ఇకనుంచి 10 దిర్హమ్ లు వసూలు చేస్తారు. ఇది గతంలో ఒక గంటకు 5 దిర్హమ్‌లు మాత్రమే పార్కింగ్ ఫీ ఉండేది.
తాజా నిర్ణయంపై ఎయిర్ పోర్టు అధికారులు స్పందిస్తూ రేట్ల పెంపుదల చాలా స్వల్పమని చెప్పారు. లాంగ్‌టర్మ్ కారు పార్కింగ్‌పై 20 దిర్హమ్‌ల నుంచి 25 దిర్హమ్‌లకు, షార్ట్‌టర్మ్ కారు పార్కింగ్‌పై 20 దిర్హమ్ నుంచి 30 దిర్హమ్‌లకు పెంచినట్చుటు ప్రకటించారు. అయితే ఈ చార్జీల పెంపుపై దుబాయ్ వాసుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 20 నిమిషాలు కారును పార్క్ చేసినా పూర్తి గంటకు చార్జీని వసులు చేయడం దారుణమని చెప్పారు. ఇలావుండగా, ఒక రోజు - 24 గంటల పార్కింగ్‌పై చార్జీలను తగ్గించినట్టు అధికారులు తెలిపారు. 24 గంటల పార్కింగ్ చార్జీలపై 55 శాతం కోత విధించారు. 280 దిర్హమ్స్ నుంచి 125 దిర్హమ్స్‌కు తగ్గించారు. అలాగే ప్రీమియం కార్ల పార్కింగ్‌పై 39 శాతం చార్జీలను తగ్గించారు.
Comments
Please login to add a commentAdd a comment