దుబాయ్ విమానాశ్రయం
న్యూఢిల్లీ: అభివద్ధి పనులు చేపడుతున్న కారణంగా ఈ రోజు నుంచి 80 రోజుల పాటు దుబాయ్ విమానాశ్రయానికి విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని రెండు రన్‌వేలను అభివద్ధి చేసే నిమిత్తం 80 రోజుల పాటు మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగా దుబాయ్‌కు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య 26 శాతానికి తగ్గిపోనున్నాయి.ఈ నిర్ణయంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, జెట్ ఎయిర్‌వేస్ తదితర సంస్థలు దుబాయ్‌కు నడిపే తమ విమాన సర్వీసులను షార్జా ఎయిర్‌పోర్టుకు మార్చాయి. మరికొన్ని సర్వీసుల సమయాలను మార్పు చేశాయి. ఇండిగో, దుబాయ్ ఎమీరేట్స్ సంస్థలు దుబాయ్ విమాన సర్వీసులను కుదించాయి. మరికొన్ని సర్వీసులను రీషెడ్యూల్ చేశాయి.
ఎయిర్ఇండియాకు చెందిన చెన్నై-దుబాయ్, విశాఖపట్నం-హైదరాబాద్-దుబాయ్ విమానాలను షార్జాకు మార్చారు. ప్రస్తుతం నడిచే తమ విమాన సర్వీసుల సమయాల గురించి ప్రయాణికులు తమని అడిగి తెలుసుకోవాలని ఇండిగో అధికార ప్రతినిధి చెప్పారు. ఇతర విమాన సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి.