ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎక్కువ మంది ఎక్కడకు వెళ్తారో తెలుసా.. భారతదేశానికే!! 2013లో ఇలాగే జరిగిందని ఓ నివేదికలో వెల్లడైంది. 2012 సంవత్సరంలో 73.47 లక్షల మంది ప్రయాణికులే భారత దేశానికి రాగా, 2013 సంవత్సరంలో అది 84 లక్షలకు పెరిగింది. 14.3 శాతం పెరుగుదల కనిపించింది. ఈ విషయాన్ని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సంస్థ తెలిపింది. భారత్ తర్వాత రెండో స్థానంలో బ్రిటన్ నిలిచింది. ఆ దేశానికి 50.99 లక్షల మంది వెళ్లగా, సౌదీ అరేబియాకు 48.25 లక్షల మంది వెళ్లారు.
దుబాయ్ వైమానిక రంగంలోనే ఇది చాలా చరిత్రాత్మక కాలం అని, ఎయిర్బస్ ఎ-380 విమానాలు కూడా ఇక్కడ దిగేందుకు అవకాశం ఉందని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. ఈ విమానాశ్రయం నుంచి వార్షిక ప్రయాణికుల ట్రాఫిక్ 6.64 కోట్లకు చేరుకోవడంతో మరో ఘనత సాధించినట్లయింది. 2012తో పోలిస్తే ఇది 15.2 శాతం ఎక్కువ.
దుబాయ్ విమానాలన్నింటి గమ్యం భారత్!!
Published Thu, Jan 30 2014 3:18 PM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
Advertisement
Advertisement