80 రోజుల పాటు రన్‌వేల మూసివేత
న్యూఢిల్లీ: దుబాయ్ విమానాశ్రయంలో అభివృద్ధి పనుల కారణంగా కొద్ది రోజుల పాటు విమాన సర్వీసులకు అంతరాయం కలగనుంది. గురువారం నుంచి 80 రోజుల పాటు ఈ ఎడారి నగరానికి విమానాల రాకపోకలకు ఆటంకం కలగనుంది.దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని రెండు రన్‌వేలను అభివృద్ధి చేసే నిమిత్తం 80 రోజుల పాటు మూసేయాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. దీని వల్ల దుబాయ్‌కు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య 26 శాతానికి తగ్గిపోనుంది. ఈ నిర్ణయంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, జెట్ ఎయిర్‌వేస్ తదితర సంస్థలు దుబాయ్‌కు నడిపే తమ విమాన సర్వీసులను షార్జా ఎయిర్‌పోర్టుకు మార్చాయి. మరికొన్ని సర్వీసుల సమయాలను మార్పు చేశాయి. ఇండిగో, దుబాయ్ ఎమిరేట్స్ సంస్థలు దుబాయ్ విమాన సర్వీసులను కుదించాయి. మరికొన్ని సర్వీసులను రీషెడ్యూల్ చేశాయి.
దుబాయ్ వెళ్లే విమానాలకు అంతరాయం
Published Fri, May 2 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM
Advertisement