Disruption
-
ప్రజలు తిరస్కరించినా పార్లమెంట్‌పై పెత్తనమా?
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఇలా వేర్వేరు ఎన్నికల్లో వేర్వేరు సంవత్సరాల్లో ఇప్పటిదాకా దాదాపు 80–90 సార్లు ఓటమిని చవిచూసినా విపక్షాలు తమ తీరును మార్చకోలేదని ప్రధాని మోదీ అసహనం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రక్రియలో పదేపదే ప్రజల చేతిలో తిరస్కరణకు గురైనాసరే కొన్ని పార్టీలు పార్లమెంట్‌పై పట్టుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్షాలనుద్దేశించి మోదీ ఘాటు విమర్శలు చేశారు. ఈ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంట్ సభాకార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు. సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు నూతన పార్లమెంట్ భవనం ఎదుట మీడియాతో మోదీ మాట్లాడారు. పార్లమెంట్‌పై పట్టుకు యత్నం‘పార్లమెంట్లో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. అయితే, దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. అంతరాయాలు, గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. 80–90 సార్లు ఎన్నికల్లో ఓడినా విపక్షాల తీరు మారలేదు. విపక్ష పార్టీలు, ఆ పార్టీల నేతలు పార్లమెంట్లో చర్చలు జరగ నివ్వట్లేదు. ప్రజాస్వామ్య సూత్రా లను, ప్రజల ఆకాంక్షలను గౌరవించరు. ప్రజల పట్ల తమకున్న బాధ్యతను గుర్తించడం లేదు’’ అని మోదీ విమర్శల దాడి చేశారు. కొన్ని ప్రతిపక్షపార్టీలు సహకరిస్తున్నా‘‘కొందరు విపక్ష నేతలు పనిగట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. వీళ్ల వైఖరిని ప్రజలు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు తగిన శిక్ష విధిస్తున్నారు. ప్రతిపక్షాల ప్రవర్తన కొత్త ఎంపీల హక్కులను అణచివేస్తుంది. వారి కొత్త ఆలోచనలను పంచుకునే అవకాశాన్ని దెబ్బతీస్తోంది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని ముందుకొచ్చాయి. అయితే ఈ పార్టీల మనసుల్ని వాటి మిత్రపక్షాలు మార్చేస్తు న్నాయి. సభలో ఆందోళనలు, నిరసనలకే మొగ్గుచూపుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నాయి. సభా సజావుగా సాగేందుకు సిద్ధపడ్డ కొన్ని విపక్షపార్టీల గొంతును వాటి భాగస్వామ్య పార్టీలే నొక్కేస్తున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తు న్నాయి. వీళ్ల గొడవ వల్ల తొలిసారిగా సభకు ఎన్నికైనవారు కనీసం ప్రసంగించే అవకాశాన్ని కూడా పొందలేకపోతున్నారు’’ అని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు.భారత్‌లో వచ్చిన అవకాశం అరుదైంది‘‘ప్రపంచదేశాల పార్లమెంట్లతో పోలిస్తే భారత పార్లమెంట్లో సభ్యత్వం పొంది అభిప్రాయాలు వెల్లడించే అవకా శం రావడం నిజంగా అరుదు. పార్లమెంట్ వేదికగా ఇచ్చే సందేశం ప్రజా స్వామ్యంపై ప్రజలకున్న అంకితభావా నికి అద్దంపట్టాలి. నేడు ప్రపంచమంతా భారత్ వైపు ఆశగా ఎదురుచూస్తోంది. అందుకు అనుగుణంగా దేశ గౌరవాన్ని, ఖ్యాతిని ఇనుమడింపజేసేలా సభ్యులు సభా సమయాన్ని వినియోగించుకో వాలి. ప్రస్తుత సమావే శాలు అత్యంత ఫలవంతమవ్వాలి. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలు పూర్తిచేసు కుంటున్న ఈ తరుణంలో రాజ్యాంగ ప్రతిష్టను మనందరం పెంచుదాం. కొత్త ఆలోచనలతో సరికొత్త స్ఫూర్తిని నింపుదాం’ అని మోదీ అన్నారు. -
కుండపోత.. జల దిగ్బంధంలో విజయవాడ (ఫొటోలు)
-
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
ముంబై: ముంబై మహా నగరాన్ని వర్షం ముంచెత్తింది. ముంబై ప్రధాన నగరంతో పాటు శివార్లలోని పలు ప్రాంతాల్లో సోమవారం(మే13) భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.సాయంత్రం 5గంటలకు విమాన సర్వీసులను మళ్లీ పునరుద్ధరించారు. సర్వీసులను నిలిపివేసిన సమయంలో మొత్తం 15 విమానాలను డైవర్ట్ చేసినట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. వర్షం వల్ల మెట్రో, లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రోడ్ల మీద చెట్లు విరిగి పడిపోయాయి. -
Supreme Court of India: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగం కలి్పంచిన భావప్రకటన స్వేచ్ఛకు, సమాచార హక్కుకు విఘాతం కలిగిస్తోందంటూ కుండబద్దలు కొట్టింది. 2018లో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పారదర్శకత, నల్లధనం కట్టడి కోసమే పథకం తెచ్చామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఈ పథకం కింద ఇప్పటిదాకా కొనుగోలు చేసిన బాండ్ల మొత్తం, కొనుగోలుదారులు, స్వీకర్తల పేర్లు తదితరాల వివరాలన్నింటినీ వెల్లడించాల్సిందేనని ఆదేశించింది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ‘‘ఓటేసేందుకు పౌరులకు ఉన్న స్వేచ్ఛపై ఎలాంటి అవాంఛిత ఒత్తిళ్లూ ఉండరాదు. ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతేగాక ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయత ప్రభుత్వాల ప్రజాస్వామిక స్ఫూర్తికి అత్యంత కీలకం. అందుకే రాజ్యాంగం కూడా స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యమిచి్చంది. కార్పొరేట్ల నుంచి పారీ్టలకందే ఆర్థిక విరాళాలకు రెండు కారణాలుంటాయి. తద్వారా తమ మద్దతును వ్యక్తీకరించడం. లేదా సదరు విరాళాలు క్విడ్ ప్రొ కో తరహావి కావడం. పరిమిత స్థాయిలో ఉండే వ్యక్తిగత విరాళాలను, అపరిమితమైన కార్పొరేట్ విరాళాలను ఒకే గాటన కట్టలేం. కార్పొరేట్ విరాళాలు స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు విఘాతంగా మారాయి. కనుక సంస్థలు, కంపెనీల నుంచి పార్టీలకు అందే భారీ విరాళాలకు కారణాలను గోప్యంగా ఉంచడాన్ని అనుమతించరాదు’’అని స్పష్టం చేసింది. కేవలం ఎన్నికలే ప్రజాస్వామ్యానికి ఆది, అంతం కావంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా రెండు విడి తీర్పులు రాశారు. మోదీ సర్కారుకు భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్న ఈ తీర్పుపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ హర్షం వెలిబుచ్చాయి. పలువురు మాజీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్లు కూడా తీర్పును సమరి్థంచడం విశేషం. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. తనతో పాటు జస్టిస్ గవాయ్ తరఫున సీజేఐ 152 పేజీల తీర్పు, తనతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ పార్డీవాలా, జస్టిస్ మిశ్రాల తరఫున జస్టిస్ ఖన్నా 74 పేజీల తీర్పు వెలువరించారు. చాలా లోపాలున్నాయి... ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ తదితరులు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై ధర్మాసనం 2023 అక్టోబర్ నుంచి వాదనలు ఆలకిస్తూ వస్తోంది. ఈ పథకం రహస్య బ్యాలెట్ విధానం వంటిదేనని, విరాళాలిచ్చేవారి గోపనీయతను కాపాడుతుందని కేంద్రం చేసిన వాదన లోపభూయిష్టమని తాజా తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. బాండ్లను కొనుగోలు చేసేలా వ్యక్తులను, సంస్థలను ఈ పథకం ద్వారా ఒత్తిడి చేయవచ్చని పేర్కొంది. బాండ్‌పై దాత పేరుండదు గనుక అవి ఎవరి నుంచి వచ్చాయన్న ఆ విరాళాన్ని అందుకునే పారీ్టకి కూడా తెలిసే అవకాశం లేదన్న కేంద్రం వాదననూ తోసిపుచి్చంది. ‘‘ఈ పథకం లోపరహితం కాదు. విరాళాలు ఇచి్చందెవరో పార్టీలు తెలుసుకునేందుకు అవకాశం కలి్పంచే లోపాలెన్నో ఇందులో ఉన్నాయి’’అని స్పష్టం చేసింది. ‘‘పౌరులు రాజకీయ విశ్వాసాలు, అభిప్రాయాలు ఏర్పరచుకోవడం వారి రాజకీయ వ్యక్తీకరణలో తొలి దశ. అందుకే పౌరుల రాజకీయ విశ్వాసాలకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 19(1)(ఎ) రక్షణ కలి్పస్తోంది. కానీ ఈ పథకం నిబంధనల ప్రకారం బాండ్ల కొనుగోలుదారుల వివరాలను ఓటర్లకు తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. ఇది కలి్పస్తున్న రాజ్యాంగం కలి్పస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమే’’అంటూ తప్పుబట్టింది. అంతేగాక కార్పొరేట్ సంస్థలు పార్టీలకు అపరిమితంగా విరాళాలు అందజేసేందుకు వీలు కలి్పంచేలా కంపెనీల చట్టంలోని నిబంధనను తొలగించడం ఆరి్టకల్ 14 ద్వారా రాజ్యాంగం కలి్పస్తున్న సమానత్వపు హక్కుకు విరుద్ధమని పేర్కొంది. ఎన్నికల బాండ్ల పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటిదాకా దీనికింద కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను మార్చి 6కల్లా కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని బాండ్ల జారీ అ«దీకృత సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ప్రతి బాండ్ ముఖ విలువ, కొనుగోలు తేదీ, కొనుగోలుదారు పేరు, తద్వారా పారీ్టలవారీగా అందుకున్న విరాళాలు వంటి అన్ని వివరాలనూ పొందుపరచాలని పేర్కొంది. వాటన్నింటినీ మార్చి 13 కల్లా ఈసీ అధికారిక వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. ఇంకా నగదుగా మార్చుకోని బాండ్లను సంబంధిత పారీ్టలు తిరిగి ఎస్బీఐలో జమ చేయాలని, సదరు మొత్తాలను కొనుగోలుదారు ఖాతాకు బ్యాంకు జమ చేయాలని ఆదేశించింది. పార్టీలు బాండ్ల ద్వారా తమకందిన విరాళాల పూర్తి వివరాలను ఈసీకి సీల్డ్ కవర్లో సమరి్పంచాలని 2019 ఏప్రిల్ 12న ధర్మాసనం మధ్యంతర తీర్పు వెలువరించడం తెలిసిందే. గోప్యత కీలకం: సీజేఐ రాజకీయ పారీ్టకి అందే విరాళాల గురించిన సమాచారం ఓటరుకు తెలియడం తప్పనిసరని సీజేఐ తన తీర్పులో పేర్కొన్నారు. అప్పుడే ఓటు హక్కును ప్రభావవంతంగా వినియోగించుకోగలడన్నారు. ‘‘ఎన్నికల వ్యయంలో నల్లధనం కట్టడికి బాండ్లే ఏకైక మార్గం కాదు. దీనితో పోలిస్తే సమాచార హక్కు స్ఫూర్తికి గండి కొట్టని మెరుగైన ఇతర మార్గాలెన్నో ఉన్నాయి. అయితే అన్ని రాజకీయ విరాళాలనూ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలుగా చూడలేం. చట్టసభల్లో పెద్దగా ప్రాతినిధ్యం లేని పారీ్టలకు కూడా విరాళాలందుతున్నాయి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు, విధానాలను ప్రభావితం చేసేందుకు డబ్బు ఎంతో అవసరం. ఎన్నికల్లో ప్రజాస్వామికంగా పాల్గొనేందుకు కూడా డబ్బు కావాల్సిందే’’అన్నారు. అయితే, ‘‘వ్యక్తుల రాజకీయ విశ్వాసాలకు సంబంధించిన సమాచారాన్ని అసమ్మతిని అణచివేసేందుకు ప్రభుత్వం రాజకీయంగా వాడుకునే ఆస్కారముంది. అంతేగాక సదరు వ్యక్తులకు ఉద్యోగావకాశాల వంటివాటిని నిరాకరించే ప్రమాదం కూడా ఉంది. అంతేగాక అవి మెజారిటీ అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండే పక్షంలో వారిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే పౌరులకు తమ రాజకీయ విశ్వాసాలను గోప్యంగా ఉంచుకునే హక్కు చాలా ముఖ్యం’’అని సీజేఐ అన్నారు. గోప్యత హక్కుకు రాజ్యంగపరమైన రక్షణ ఉంటుందంటూ 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచి్చన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘ఓటు ఎవరికేస్తున్నదీ గోప్యంగా ఉంచే హక్కు లేకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయి. తమకు వ్యతిరేకంగా ఓటేసేవారి ఓట్లను తొలగించేందుకు వాడుకునే ప్రమాదమూ ఉంది. నియోజకవర్గాలను కూడా ఓటర్ల రాజకీయ మొగ్గుదల ఆధారంగా విభజించే ఆస్కారముంది. అప్పుడు ఎన్నికల వ్యవస్థకే అర్థం లేకుండా పోతుంది’’అని ఆందోళన వెలిబుచ్చారు. కాకపోతే ఈ గోప్యత హక్కును పారీ్టలకు అందే విరాళాలకు కూడా వర్తింపజేయవచ్చా అన్నదే ప్రశ్న అని సీజేఐ చెప్పారు. పారీ్టలకు ఆర్థిక విరాళాలకు కూడా రాజ్యంగపరమైన రక్షణ ఉందా అన్న అంశంపై విచారణ జరపాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. క్విడ్ ప్రొ కోకు ఆస్కారం పారీ్టలకు భారీగా ఆర్థిక విరాళాలిచ్చే వారి ఉద్దేశమేమిటన్నది బహిరంగ రహస్యమేనని సీజేఐ అన్నారు. సాధారణంగా కార్పొరేట్ విరాళాల ఉద్దేశం క్విడ్ ప్రొ కో ప్రయోజనాలేనన్న వాదనతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా విభేదించలేదని గుర్తు చేశారు. రాజకీయ సమానత్వానికి మన దేశంలో రాజ్యాంగ రక్షణ ఉన్నా ఆ విషయంలో ఇప్పటికీ అసమానత కొనసాగుతూనే ఉందని సీజేఐ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయడంలో వ్యక్తుల సామర్థ్యంలో అసమానతలున్నాయి. ఆర్థిక అసమానతలే అందుకు కారణం. పారీ్టలకందే ఆర్థిక సాయాన్ని కూడా ఈ అసమానతలు నియంత్రిస్తున్నాయి. సంపన్నులకు పారీ్టలకు భారీ ఆర్థిక విరాళమిచ్చే సామర్థ్యముంటుంది. తద్వారా ప్రజాప్రతినిధులకు దగ్గరయ్యేందుకు, ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు కూడా అవకాశముంటుంది. ఇది వారికి కావాల్సిన లైసెన్సులివ్వడమో, వారికి అనుకూలమైన విధాన నిర్ణయాలు తీసుకోవడమో జరగే ఆస్కారముంది. ఇలా క్విడ్ ప్రొ కో జరిగే అవకాశముంది’’అన్నారు. రాజకీయ సమానత్వాన్ని పాటించే సమాజంలో పౌరులందరికీ రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసే విషయంలో సమానంగా గళమెత్తే అవకాశం చాలా కీలకమని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేయడానికి జస్టిస్ ఖన్నా తన తీర్పులో పలు కారణాలను ఉటంకించారు. స్పందనలు ‘‘ఈ తీర్పు ద్వారా నల్లధన మారి్పడి వ్యవస్థను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేంద్రం ఇప్పటికైనా ఇలాంటి మతిలేని ఆలోచనలు కట్టిపెడుతుందని ఆశిస్తున్నా. ఎన్నికల బాండ్ల పథకం కింద 95 శాతం నిధులు ఒక్క బీజేపీకే అందాయి’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘‘మోదీ ప్రభుత్వ అవినీతి విధానాలకు ఇది మరో నిదర్శనం. ఎన్నికల బాండ్లను లంచాలు, కమిషన్లు తీసుకునే మార్గంగా బీజేపీ మార్చుకుంది. దీనికి సుప్రీంకోర్టు తెర దించింది’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘‘ఎన్నికల బాండ్లు సదుద్దేశంతో తెచి్చన పథకం. విపక్షాలు దీన్ని అవసరంగా రాజకీయం చేస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం’’ – బీజేపీ ‘‘తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తెచ్చేందుకు ఇదెంతగానో దోహదపడుతుంది’’ – ఆమ్ ఆద్మీ పార్టీ ‘‘పాలక పార్టీ లబ్ధి కోసం తీసుకొచి్చన అక్రమ పథకానికి సుప్రీంకోర్టు తీర్పు తెర దించింది’’ – సీపీఎం ‘‘తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికల బాండ్లు అప్రజాస్వామికం, రాజ్యాంగవిరుద్ధం’’ – సీపీఐ (ఎంఎల్) ‘‘ఇది గత ఆరేడేళ్లలో వెలువడ్డ అత్యంత చరిత్రాత్మక తీర్పు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని ఈ తీర్పు పునరుద్ధరిస్తుంది. – కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ ‘‘తీర్పు స్వాగతించదగ్గదే. అయితే ఎన్నికల నిధుల వ్యవస్థ ప్రక్షాళనకు చేయాల్సింది చాలా ఉంది’’ – కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి. -
Winter Parliament Sessions 2023: సభలో గందరగోళం..!
న్యూఢిల్లీ: పార్లమెంట్లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై గురువారం ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ప్రతిపక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం జరిగిన అవాంఛనీయ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభలో తీవ్ర అలజడి సృష్టించారు. వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని పట్టుబట్టారు. అరుపులు, కేకలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. తీవ్ర గందరగోళం నెలకొంది. ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లోక్‌సభ నుంచి 13 మంది విపక్ష ఎంపీలపై, రాజ్యసభలో ఒక ప్రతిపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్ మొత్తం వారు సభకు హాజరు కాకూడదని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ స్పష్టం చేశారు. లోక్‌సభలో నినాదాల హోరు లోక్‌సభ గురువారం ఉద యం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రా రంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. వెనక్కి వెళ్లాలని స్పీకర్ పదేపదే కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు శాంతించలేదు. దీంతో సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న ఐదుగురు విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. టీఎన్ ప్రతాపన్, హిబీ ఎడెన్, జోతీమణి, రమ్య హరిదాస్, దీన్ కురియాకోస్‌పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో ప్రహ్లాద్ జోషీ మరో తీర్మానం ప్రవేశపెట్టారు. 9 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. వీకే శ్రీకందన్, బెన్నీ బెహనన్, మొహమ్మద్ జావెద్, పీఆర్ నటరాజన్, కనిమొళి, కె.సుబ్బరాయన్, ఎస్ఆర్ పార్తీబన్, ఎస్.వెంకటేశన్, మాణిక్కం ఠాగూర్‌ను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతను పర్యవేక్షించే బాధ్యత లోక్‌సభ సెక్రెటేరియట్దేనని స్పీకర్ ఓంబిర్లా చెప్పారు. సభ వాయిదా పడిన తర్వాత పలువురు విపక్ష సభ్యులు సభలోనే ఉండి ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని సస్పెండ్ చేశారు: కాంగ్రెస్ పార్లమెంట్ ఉభయ సభల నుంచి గురువారం మొత్తం 14 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విపక్ష ఎంపీలను కాదు, దేశ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం నుంచి సమాధానం కోరినందుకు ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం, భయానక చర్య అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం హత్య చేసిందని, పార్లమెంట్‌ను రబ్బర్ స్టాంప్ స్థాయికి దిగజార్చిందని దుయ్యబట్టారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆగంతకులు పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు కారణమైన బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. ఎగువ సభలో తీవ్ర అలజడి పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశాయి. ఈ రోజు మిగతా కార్యకలాపాలను పక్కనపెట్టి, కేవలం భద్రతా వైఫల్యంపైనే సభలో చర్చ చేపట్టాలని పలువురు ఎంపీలు గురువారం ఉదయం 28 నోటీసులు ఇచ్చారు. వీటిని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తేలి్చచెప్పారు. సభకు సహకరించాలని కోరారు. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేస్తుండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ చైర్మన్ వేదిక ముందుకు చేరుకొని, గాల్లోకి చేతులు విసురుతూ గట్టిగా అరిచారు. ఆయన తీరుపై చైర్మన్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను «ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. డెరెక్ ఓబ్రెయిన్‌ను సభ నుంచి సస్పెండ్ చేయడానికి రూల్ 256 కింద తీర్మానం ప్రవేశపెట్టడానికి బీజేపీ పక్షనేత పీయూష్ గోయల్‌కు అనుమతి ఇచ్చారు. పీయూష్ గోయల్ తీర్మానం ప్రవేశపెట్టడం, మూజువాణి ఓటుతో అమోదం పొందడం, డెరెక్ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్ వేటు వేయడం వెంటనే జరిగిపోయాయి. ఆయనను ఈ సెషన్లో మిగిలిన కాలమంతా స్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. సస్పెండ్ అయినప్పటికీ బయటకు వెళ్లకుండా సభలోనే కూర్చున్న డెరెక్ ఓబ్రెయిన్‌పై ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. నియమ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. అయినా ఓబ్రెయిన్ వినిపించుకోలేదు. రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ చెప్పారు. ఇదిలా ఉండగా, సభ నుంచి సస్పెండ్చేసినా బయటకు వెళ్లకుండా నిబంధనలను ఉల్లంఘించిన డెరెక్ ఓబ్రెయిన్ తీరుపై విచారణ జరపాలని సభా హక్కుల కమిటీకి జగదీప్ ధన్‌ఖడ్ సిఫార్సు చేశారు. సభలో లేకున్నా సస్పెన్షన్ లోక్‌సభలో రెండో విడతలో సస్పెండైన విపక్ష ఎంపీల్లో తమిళనాడుకు చెందిన ఎస్ఆర్ పార్తీబన్ పేరు కూడా ఉంది. వాస్తవానికి ఆయన గురువారం సభకు రాలేదని, చెన్నైలో ఉన్నారని ప్రతిపక్ష సభ్యులు చెప్పారు. సభలో లేని ఎంపీని సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. పొరపాటు జరిగిందని అంగీకరించారు. ఆయన పేరును తొలగిస్తున్నట్లు చెప్పారు. పార్తీబన్‌పై సస్పెన్షన్ వేటును స్పీకర్ ఉపసంహరించినట్లు తెలిపారు. గురువారం లోక్‌సభ నుంచి మొత్తం 13 మందిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. బుధవారం నాటి ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామన్నారు. -
సొరంగం కుప్పకూలిన ఘటన.. డ్రిల్లింగ్ పనుల్లో అంతరాయం
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ మార్గంలో సొరంగం కుప్పకూలి 60 గంటలకు పైగా లోపల చిక్కుబడిపోయిన 40 మంది కార్మికులను రక్షించే పనుల్లో మంగళవారం రాత్రి అంతరాయం ఏర్పడింది. కుప్పకూలిన టన్నెల శిథిలాల గుండా ఆగర్ మెషీన్ సాయంతో వెడల్పాటి స్టీల్ పైపులను లోపలికి పంపే పనులు మంగళవారం మొదలైనట్లు తెలిపారు. డ్రిల్లింగ్ పరికరాలను ఉపయోగించి 800, 900 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన స్టీలు పైపులను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకురావడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. అన్నీ సజావుగా సాగితే బుధవారాని కల్లా అందరినీ వెలుపలికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, రాత్రి వేళ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి టన్నెల్ శిథిలాలు విరిగిపడటంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రులకు ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ పనులకు మాత్రం అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పారు. ఎటువంటి అపాయం లేదు సొరంగం లోపల చిక్కుకున్న కారి్మకులకు ఆక్సిజన్, మంచి నీరు, టీ, ఆహారం ప్యాకెట్లు, మందులను ట్యూబుల ద్వారా లోపలికి పంపిస్తున్నామని అధికారులు వివరించారు. కార్మికులు 400 మీటర్ల వెడల్పుండే బఫర్ జోన్లో చిక్కుబడి పోయారన్నారు. వారు తేలిగ్గా, నడవొచ్చు, గాలి పీల్చుకోవచ్చు అని వివరించారు. అందరూ ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారన్నారు. ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మఖాల్–యమునోత్రి జాతీయ రహదారిలో సిల్క్యారా– దండల్గావ్ మధ్య నిర్మిస్తున్న సొరంగం ఆదివారం ఉదయం సిల్క్యారా వైపు కూలిన విషయం తెలిసిందే. సొరంగంలో చిక్కుబడిన వారిలో బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులున్నారు. ధైర్యంగా ఉండండి టన్నెల్లో చిక్కుబడిపోయిన 40 మందిలో ఒకరైన ఉత్తరాఖండ్‌కు చెందిన కార్మికుడితో ఆయన కుమారుడు కొద్ది సెకన్ల పాటు మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నాడు. భయపడాల్సిన అవసరం లేదని, తనతోపాటు ఉన్న తోటి వారికి కూడా ధైర్యం చెబుతున్నానని అతడు పేర్కొన్నాడు. సొరంగం కుప్పకూలడంతో ఆదివారం ఉదయం నుంచి లోపలే ఉండిపోయిన 40 మందిలో ఉత్తరాఖండ్‌లోని కొట్‌ద్వార్‌కు చెందిన గబ్బర్ సింగ్ నేగి కూడా ఉన్నారు. నేగి సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఘటనా స్థలి వద్దకు మంగళవారం ఉదయం నేగి కొడుకు ఆకాశ్, అన్న మహరాజ్ చేరుకున్నాడు. అధికారులు పైపు ద్వారా ఆకాశ్‌కు తండ్రితో మాట్లాడే అవకాశం కల్పించారు. తమకు ఆక్సిజన్ అందుతోందని, భయపడొద్దని కుమారుడికి నేగి ధైర్యం చెప్పారు. ఇంట్లో వాళ్లకి కూడా ఇదే విషయం చెప్పాలని కోరారు. ‘సొరంగం కూలిన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మాకు చాలినంత ఆహారం, నీరు అందుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే సురక్షితంగా బయటకు వచ్చేందుకు ఇంజినీర్లు కృషి చేస్తున్నారు’అని కూడా నేగి తన కుమారుడికి తెలిపారు. -
ఆన్లైన్ గేమింగ్‌లో పెట్టుబడులకు విఘాతం
న్యూఢిల్లీ: రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయంతో పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు చేసిన 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రైటాఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీకి దేశ, విదేశాలకు చెందిన 30 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సంయుక్తంగా లేఖ రాశాయి. అలాగే, వచ్చే 3–4 ఏళ్లలో రాబోయే సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులపైనే ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. లేఖ రాసిన ఇన్వెస్టర్లలో పీక్ ఫిఫ్టీన్ క్యాపిటల్, టైగర్ గ్లోబ ల్, డీఎస్టీ గ్లోబల్, ఆల్ఫా వేవ్ గ్లోబల్ మొదలైనవి ఉన్నాయి. జీఎస్టీ మండలి నిర్ణయం తమను షాక్‌కు గురి చేసిందని, ఇలాంటి వాటి వల్ల గేమింగ్‌పై మాత్రమే కాకుండా భారత్‌లో ఇతరత్రా వర్ధమాన రంగాలపైనా ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతుందని అవి తెలిపాయి. -
మూగబోయిన ట్విట్టర్ పిట్ట.. కారణం అదేనా?
న్యూయార్క్: ట్విట్టర్ మళ్లీ మొరాయించింది. గంటలపాటు స్తంభించిపోయింది. ట్విట్టర్ సేవలకు అంతరాయం కలగడం కొన్ని నెలలుగా పరిపాటిగా మారడం తెల్సిందే. సంస్థను మస్క్ హస్తగతం చేసుకున్నాక వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దాంతో ఉన్న కాస్త సిబ్బందికి నిర్వహణ తలకు మించిన భారంగా మారినట్లు కనిపిస్తోంది. తాజాగా 200 మంది ఇంజనీర్లను మస్క్ తొలగించారు. వీరిలో ప్రొడక్ట్ మేనేజర్లు, ఇంజనీర్లు, డేటా సైన్స్ విభాగ సిబ్బంది ఉన్నారు. బ్లూ వెరిఫికేషన్ చందా, త్వరలో అమలు చేయబోయే పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌లకు సారథిగా ఏస్తర్ క్రాఫోర్డ్నూ సాగనంపారు. తాజా ఉద్యోగుల ఉద్వాసన పర్వంలో సేల్స్ విభాగ చీఫ్ క్రిస్ రేడీని మస్క్ వెళ్లగొట్టడం గమనార్హం. -
విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకకు అంతరాయం
సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. సోమవారం ఈ అంతరాయం ఏర్పడింది. కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో గూడ్స్ పట్టాలు తప్పించింది. దీంతో పిఠాపురంలో యశ్వంత్‌పూర్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ప్రకృతే నేస్తం.. ప్రకృతే పరమాత్మ..!
చిన్న..చిన్న మొక్కలే ఓ పెద్ద వనం అవుతుంది. మనం నాటిన మొక్కే మనకు నీడను ఇస్తుంది, ప్రాణ వాయువు ఇస్తుంది. మానవ జీవితంలో మనం చేయాల్సిన ముఖ్య విధానం ప్రకృతి పరిరక్షణ. ప్రకృతి అనేది భగవంతుడే ఏర్పరచిన ఓ అద్భుత సంపద. దాన్ని వినాశనానికి గురి చేయకుండా ప్రకృతి పట్ల అర్థవంతంగా నడచుకో అనే సందేశాన్ని ప్రతి వారు గ్రహించాలి. అప్పుడే ప్రకృతికి పరమార్థం ఇచ్చినట్లు అవుతుంది. ఈ ప్రకృతి ఏర్పడటమే ఓ విచిత్రం. చెట్లు, చేమలు, వివిధ జంతువులు, విహంగాలు, నదులు, పర్వతాలు... ఇవన్నీ ఎవరి సృష్టి అని ప్రశ్నించుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సృష్టికర్త ఆజ్ఞ వలన ఈ సృష్టి ఏర్పడింది. సృష్టిని నిర్మించింది ఆ పరమాత్మనే అనే మాట వినిపిస్తుంది. పరమాత్మ ప్రకృతికి ప్రాణం పోస్తే, పరమాత్మ ద్వారా సృష్టించబడిన మానవుడు నేడు ప్రకృతి వినాశనానికి కారకుడు అవుతున్నాడు. స్వేచ్చగా చెట్లు నరకడం, అనువుగాని చోట్ల నిర్మాణాలు చేయడం, పర్యావరణానికి విఘాతం కలిగించే కలుషిత కర్మాగారాలు స్థాపించడం వంటి వాటి వలన ప్రకృతి పాడవుతున్నది. మానవుడు తన స్వలాభాలను చూసుకుంటున్నాడే గాని పదిమందికి ఉపయోగపడే ప్రకృతికి ప్రాణం పోయాలి అనే విషయం మరచి నట్లు ఉన్నాడు. విచ్చలవిడిగా వ్యర్ధ పదార్థాలను ధరణిపై వేసి ప్రకృతి నిరోధానికి పరోక్షంగా కారకుడు అవుతున్నాడు. ప్రకృతి అనేది ఓ దైవం అనే మాటను విస్మరిస్తున్నాడు. పచ్చని ప్రకృతిని ఓ క్షణం పరిశీలిస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది. ప్రకృతిలోని పక్షుల కిల.. కిల రావాలు, పారే సెలయేర్లు, శబ్దం చేసే పాల పొంగులాంటి జలపాతాలు, అందంగా పేర్చినట్లు ఉండే పర్వత శ్రేణులు చూస్తుంటేనే ఓ మధురానుభూతికి లోనవుతాం. రోజు కొంత సేపు ప్రకృతిలో విహరిస్తే మనం పొందే అనుభూతే వేరు. అయితే నేడు చాలామంది వాకింగ్ వంకతో ప్రకృతిని ఆస్వాదిస్తామంటారే కానీ వాళ్ళు ఆస్వాదించేది అంతా వాళ్ళ చెవులలో పెట్టుకుని వినే పాటలే. ఈరోజుల్లో ఎక్కడ చూసినా ఇయర్ ఫోన్లు పెట్టుకునే వారే కనిపిస్తారు. వాళ్ళు ఏమి ఆస్వాదిస్తున్నారో, ఏమి వింటున్నారో అర్థం కాదు. మనం ప్రయాణిస్తున్నప్పుడు కనపడే చెట్టు, చేమ చూడటం వలన ఓ ఆనందం కలుగుతుంది. ఈ విశ్వంలో జరిగే కార్యాలు అన్నీ ప్రకృతి వల్లనే జరుగుతూ ఉంటాయి. కానీ అహంకారం, గర్వం కారణం మూలంగా మనిషి మాత్రం తానే అన్నిటికీ కర్తనని, మూలం తానేననీ, తన ప్రయోజకత్వం వల్లనే అన్ని కార్యాలు జరుగుతున్నాయని భావిస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి అయినా ‘నేను చేస్తున్నాను’ అనుకోకపోతే ఏ పనినీ చేయలేడు. చిక్కు అంతా ఎక్కడ వస్తుందీ... అంటే సమస్తం నేను చేస్తున్నాను. నా వల్లే అన్నీ జరుగుతున్నాయి అని అహంకార పూరితుడిగా మారినప్పుడే. అప్పుడే వ్యక్తి పతనపు అంచులకు ప్రయాణం సాగిస్తున్నాడని తెలుసుకోవాలి. ఇటువంటి అహంకారం మానవుణ్ణి కిందకు లాగుతుంది. సత్వ రజస్తమోగుణాలతో కూడిన ఈ ప్రకృతిని అధిగమించడం కష్టం. ఈ సువిశాల విశ్వమంతా చాలా వరకు అన్ని కార్యాలు ప్రకృతి పర్యవేక్షణలోనే జరిగిపోతూ ఉంటాయి. భూమిలో విత్తనం వేసి నీళ్ళు పోయాడమే మనం చేయగలిగేది. కాని ఆ విత్తనం నుండి మొలక రావడం, మొక్క పెరగడం, అది కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా సూర్యుని నుండి ఆహారం స్వీకరించడం మొదలగు అన్ని క్రియలలో వ్యక్తి ఏమి చేయగలుగుతున్నాడో అని బేరీజు వేసుకుంటే విశ్వంలో జరిగే ప్రతి క్రియలో ప్రకృతి పాత్ర మిక్కుటం. తల్లి గర్భంలో ఫలదీకరణ చెందిన జీవి ఎన్ని మార్పులకు గురవుతుందో సరిగ్గా ఆచి తూచగలిగే జ్ఞానం, విజ్ఞానం మనకు ఇప్పటికీ అందుబాటులో లేదు. ఇది కేవలం ప్రకృతి ద్వారానే సాధ్యం. ఇంతటి మహత్తర కార్యం ప్రకృతి వలననే జరుగుతుండగా మనిషి ‘నేనే కర్తను’ అని అహంకరించడం ఏ మాత్రం సబబు? ఎప్పుడైతే నేనే అని అనుకుంటున్నాడో అప్పుడే నాది... నాదే అనే మమకారం మొదలవుతుంది. ఈ ‘అహం’, ‘మమ’ అనే రెండు భావాలే ఇరువైపులా నుండి వ్యక్తిని పతనం వైపుకు నెడతాయి. అహంతో నేనే కర్తను అని భావించుకుంటూ తమ పతనానికి తానే గోతిని తవ్వుకుంటూ ఉంటారు కనుక ఈ సృష్టిలో ఏది జరిగినా అంతా ప్రకృతి మయమనే, ప్రకృతే సర్వం, సర్వం ప్రకృతే అని భావించవలసి వస్తుంది. అందమైన ప్రకృతిని వీక్షించడం అంటే ఆ భగవంతుని చూడటమే. ప్రకృతికి మనం ఎంత దగ్గర అవుతామో అంత భగవంతునికి దగ్గర అయినట్లు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క ను నాటి దాని ఆవశ్యకతను తెలియజేస్తే మొక్కలు పట్ల అభిరుచి పెరుగుతుంది. విద్యార్థులలో కూడా ప్రకృతి అంటే జిజ్ఞాస కలుగుతుంది. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర ఉపన్యాసకులు. -
దేశాభివృద్ధి ఆగదు
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో భారత్ మరింత రెట్టించిన ఉత్సాహంతో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ప్రధాని మోదీ అభిలషించారు. కోవిడ్ విసిరే సవాళ్లు దేశాభివృద్ధికి విఘాతం కలిగించడాన్ని భారత్ ఏమాత్రం అనుమతించబోదని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘ జాతి ప్రయోజనాలే పరమావధిగా పూర్తి అప్రమత్తతతో, ముందస్తు జాగ్రత్తలతో కోవిడ్‌పై పోరును భారత్ కొనసాగిస్తుంది’ అని మోదీ ప్రకటించారు. శనివారం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం పదో విడత నిధుల విడుదల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. 2021 ఏడాదిలో కోవిడ్ కల్లోక కాలంలోనూ ఆరోగ్య, రక్షణ, వ్యవసాయ, మౌలిక సదుపాయాలు, అంకుర సంస్థల రంగాలు సాధించిన పురోగతిని మోదీ గుర్తుచేశారు. ‘ భిన్న రంగాల్లో సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. ఆధునిక మౌలిక సదుపాయాలను భారత్ సమకూర్చుకుంది. ఈ అభివృద్ధి పథాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ క్రమంలో ఎదురయ్యే కోవిడ్ సవాళ్లను భారత్ ఎంతమాత్రం అనుమతించబోదు. గత సంవత్సరాల ఘన విజయాల నుంచి స్ఫూర్తి పొంది దేశం నూతన సంవత్సరంలో కొత్త ప్రయాణం మొదలుపెడుతోంది’ అని మోదీ అన్నారు. ‘కోవిడ్ సంక్షోభ కాలంలో రూ.2.6 లక్షల కోట్ల విలువైన ఆహార ధాన్యాలను మొత్తంగా 80 కోట్ల ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాం. కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు, కొత్త వైద్య కళాశాలలు, వెల్నెస్ సెంటర్లు, ఆయుష్మాన్ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్లతో దేశ వైద్య మౌలిక వ్యవస్థను మరింత పటిష్టంచేశాం’ అని మోదీ చెప్పారు. ఎన్నో అంశాల్లో కోవిడ్‌కు ముందునాటి ఆర్థిక గణాంకాలను దాటేందుకు భారత ఆర్థికవ్యవస్థ సిద్ధమైందన్నారు. సెమీ కండక్టర్ల(చిప్‌లు) తయారీ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు భారత్ పటిష్ట ప్రణాళికలతో ముందుకెళ్తోందని ఆయన చెప్పారు. 10 కోట్ల రైతులకు రూ.20,946 కోట్లు పీఎం–కిసాన్ పథకం పదో విడత నిధుల విడుదలలో భాగంగా శనివారం ప్రధాని మోదీ 10.09 కోట్ల రైతులకు పంపిణీ చేసేందుకు రూ.20,946 కోట్లు విడుదలచేశారు. వినూత్న సాగు పద్దతులు, ప్రకృతి వ్యవసాయం వైపు వ్యవసాయం మళ్లాల్సిన ఆవశ్యకతను ప్రధాని గుర్తుచేశారు. పీఎం–కిసాన్ కింద అర్హులైన రైతు కుటుంబానికి కేంద్రం ఏటా రూ.6,000 నగదు సాయం చేస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో ఇస్తారు. 2019 బడ్జెట్ సందర్భంగా పీఎం–కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటిదాకా మోదీ సర్కార్ మొత్తంగా రూ.1.8 లక్షల కోట్ల నిధులను రైతులకు పంపిణీ చేసింది. మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త ఏడాది తొలిరోజున ప్రధాని మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ మంచి ఆరోగ్యంతో, ఆనందంతో జీవించాలని ఆయన అభిలషించారు. -
పల్లె ప్రగతికి విఘాతం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : స్థానిక సంస్థల ఎ న్నికలు ఈ నెలాఖరులోగా జరగకపోతే పల్లె ప్రగతి కుంటుపడుతుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల తో గ్రామాలు సతమతమవుతాయి. ఎక్కడికక్కడ అభివృద్ధి నిలిచిపోతుంది. పారిశుద్ధ్యాన్ని సైతం మెరుగుపర్చుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతాయి. చంద్రబాబు అండ్‌కో చేసిన కుట్రలకు ప్రజలు ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆరువారాల పాటు ఎన్ని కల కోడ్ అమల్లో ఉంటే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోతాయి. ము ఖ్యంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించాలన్న సంకల్పానికి బ్రేక్ పడనుంది. వైఎస్సార్ కాపు నేస్తం, జననన్న చేదోడు, ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ వంటి పథకాలు నిలిచిపోనున్నాయి. స్థానిక సంస్థల జనాభా దామాషా ప్రకా రం, జిల్లా వెనుకబాటు, స్థానిక సంస్థల పనితీరు తదితర అంశాల ఆధారంగా ఏటా ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి. గతంలో పంచాయతీలకు 50శాతం, మండల పరిషత్‌లకు 25శాతం, జెడ్పీకి 25శాతం నిధులు విడుదలయ్యేవి. కానీ 14వ ఆర్థిక సంఘం వచ్చాక పంచాయతీలకు 90శాతం నిధులు, జెడ్పీ కి కేవలం 10శాతం నిధులను కేటాయిస్తూ వచ్చింది. మధ్యలో మండల పరిషత్‌లకు నిధుల్లేని పరిస్థితి ఉండేది. అయితే, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు గగ్గోలు పెట్టడంతో మునుపటి మాదిరిగా 15వ ఆర్థిక సంఘంలో పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 25 శాతం, జిల్లా పరిషత్‌కు 25 నిధు లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖత చూపింది. పాత పద్ధతిలో నిధులు విడుదల చేయనుండటంతో అటు పంచాయతీలు, ఇటు మండల, జిల్లా పరిషత్‌లు నిధులతో కళకళలాడనున్నాయి. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరులోగా జరిగితేనే.. లేదంటే నిధుల్లేమితో వెలవెలబోతాయి. చెప్పాలంటే ప్రగతి అటకెక్కనుంది. జిల్లాకు రూ.300కోట్లు మార్చిలో ఎన్నికలు పూర్తి చేయగలిగితే రాష్ట్రా నికి రూ.5800కోట్లు వస్తాయి. అందులో మన జిల్లాకు రూ.300కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కులు, క్రీడా మైదానాలు, శ్మశానాలు, కనెక్టవిటీ లేని ప్రాంతాల్లో రహదారులు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు దోహదపడతా యి. జిల్లాలో 1190 పంచాయతీలు, ఒక కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ప్రజలకు అవసరమైన కనీస వసతులు కల్పించడానికి 15వ ఆర్థిక సంఘం నిధులు ఉపయోగపడతాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నిలిచిపోయిన ఎన్నికల కారణంగా వందల కోట్ల నిధులకు జిల్లా దూరమైపోతోంది. ఆరువారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడంతో కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదు. స్థానిక సంస్థలకు పాలక మండళ్లు ఉంటే తప్ప కేంద్రం నిధులు విడుదల చేయదు. అది కూడా ఈనెలాఖరులోగానే పాలక మండళ్లు ఎన్నికవ్వాలి. తాజా ఎన్నికల సంఘం ఆదేశాలతో కేంద్రం నుంచి రావల్సిన ఆర్థిక సంఘం నిధులకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో పల్లెలు, మున్సిపాల్టీల్లో పెద్ద ఎత్తున అభి వృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలగనుంది. సంక్షేమ కార్యక్రమాలకు బ్రేక్ ఎన్నికలు ఆరువారాల పాటు వాయిదా వేయడంతో ఈ లోపు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. ముఖ్యంగా జిల్లాలో 53,660 మందికి ఉగాది రోజున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సిద్ధం చేసింది. లేవుట్లు వేసి, లబి్ధదారులకు ప్లాట్లు లాటరీలో కేటాయింపు కూడా చేశారు. దీంతో ఉగాది ఎప్పుడొస్తుందా అని లబి్ధదారులు ఎ దురు చూస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలు నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లాయి. అదే విధంగా ఏప్రిల్‌లో వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపులకు సాయం చేయాలని నిర్ణయించింది. జిల్లాలో 4111మందికి రూ. 15వేలు చొప్పున అందజేసేందుకు నిర్ణయం కూడా తీసుకుంది. ఆరు వారాల వాయిదాతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈ కార్యక్రమం కూడా ఆగిపోనుంది. జగనన్న చేదోడు పథకం కింద 3188మంది నాయీ బ్రాహ్మణులకు, 6873 మంది రజకులకు, 4785 మంది టైలర్లకు రూ. 10వేలు చొప్పున సాయం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి కూడా బ్రేక్ పడింది. అలాగే, ఆరోగ్య శ్రీ పథకం కింద జిల్లాలో 8లక్షల 44వేల మందికి కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది. ఇప్పుడు వాటికి కూడా అడ్డు పడింది. పది రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలను ఆరువారాలు పాటు వాయిదా వేయడంతో ఈలోపు ఎవరికైనా అరోగ్య పరమైన సమస్యలు వస్తే చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలైతే నిరుపేదలు ఇబ్బందులు పడాల్సిందే. వైద్యం కోసం ఖర్చుపెట్టలేక ప్రాణాలను పణంగా పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వైఎస్సార్ ఆసరా కింద జిల్లాలో 42,278 డ్వాక్రా సంఘాలకు లబ్ధి చేకూర్చాల్సి ఉంది. ఆ సంఘాల్లోని 5లక్షల 20వేల మహిళలు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే జనగన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. వీరంతా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఉసూరుముంటున్నారు. చెప్పాలంటే పది రోజుల్లో పూర్తి కావాల్సిన ఎన్నికలపై చంద్రబాబు అండ్‌కో చేసిన కుట్రలతో జిల్లాలో లక్షలాది మంది ప్రభుత్వ ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. వారంతా ఇప్పుడు ఎన్నికల సంఘం తీరుపై మండిపడుతున్నారు. -
అంతం ఐదు కాదు.. ఆరు!
న్యూయార్క్: ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లుగా భూ వినాశనం ఐదు సార్లు కాదు.. ఆరు సార్లు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది 26 కోట్ల ఏళ్ల క్రితం సంభవించింది. ఆరు వినాశనాలూ పర్యావరణ విధ్వంసం కారణంగానే చోటుచేసుకున్నాయి. అగ్ని పర్వతాలు భారీ విస్ఫోటనం చెంది లావాను వెదజల్లాయని, దీంతో లక్షల చదరపు కిలోమీటర్ల భూమి లావా ప్రవాహంతో నిండిపోయిందని అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైఖెల్ రాంపినో వెల్లడించారు. భూమి ఇప్పటికే ఆరు వినాశనాలను ఎదుర్కొంది. ఈ ఆరు వినాశనాల్లో పర్యావరణ విధ్వంసం కారణంగా భూమిపై అనేక జంతు, వృక్ష జాతులు కనుమరుగయ్యాయి. ఇదే ప్రస్తుతం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ఎందుకంటే ఆనాటి పరిస్థితులే ఇప్పుడు పునరావృతమవుతున్నాయి. -
పురుగును చంపిన మనిషి!
ఒకపక్క కీచురాళ్ల రొద.. ఇంకోపక్క ఝుమ్మంటూ తూనీగలు.. పచ్చటి గరిక, గడ్డిలో ఎర్ర ఎర్రటి ఆరుద్రలు! చిమ్మచీకట్లో పచ్చటి వెలుగులు జిమ్ముతూ మిణుగురులు! వాన చినుకుకు తడిసిన మట్టిలోంచి ఆత్రంగా బయటకొస్తూ.. వానపాములు! అగ్గిపెట్టెల్లో దాచుకుని మురిసిపోయిన బంగారు పురుగులు పేడ పురుగులు.. ఉసిళ్లు...తేనెటీగలు..అబ్బో చెప్పుకుంటూ పోతే.. పురుగుల పేర్లు సహస్రం దాటేస్తాయి! కానీ.. ఇదంతా ఒకప్పటి మాట! ప్రకృతి గత వైభవం! పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇంకొన్నేళ్లకు.. ఈ భూమ్మీద పురుగన్నది లేకుండా పోతుంది. సోవాట్.. పురుగుల్లేకపోతే మనకేమిటి నష్టం? ఈ భూమ్మీద ఉండే 700 కోట్లపై చిలుకు మనుషుల కంటే పురుగుపుట్ర బరువు 17 రెట్లు ఎక్కువ అని! సముద్రాలు, చెరువుల్లోని జలచరాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉండే ఈ క్రిమి కీటక సామ్రాజ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ విషయం చాలా కాలంగా వింటున్నదే అని అంటున్నారా.. అయితే ఇదిగో తాజా వార్త. కొన్ని దశాబ్దాల్లో ఉన్న కీటకాల్లో కనీసం 40 శాతం కనిపించకుండా పోతాయని హెచ్చరిస్తోంది తాజా అధ్యయనం ఒకటి. బయలాజికల్ కన్సర్వేషన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ప్రమాదం ఒక్క తేనెటీగలకే పరిమితం కాలేదు.. సీతాకోకచిలుకలు, పేడ పురుగులు కూడా వినాశనం అంచుల్లో ఉన్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో ఈ చిన్ని జీవాల పాత్రను గుర్తించకపోయినా.. కాపాడుకునే ప్రయత్నం చేయకపోయినా.. మనిషి మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదముందని స్పష్టం చేస్తోంది. గత 40 ఏళ్లలో జరిగిన 73 వేర్వేరు పరిశోధనల ఫలితాలను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. భూమ్మీది మొత్తం పురుగుల బరువు ఏటా 2.5% చొప్పున తగ్గుతోందని.. అమెరికా సహ అనేక దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇది ప్రపంచ సమస్యే అన్నది సుస్పష్టం. కారణాలేమిటి? కీటక జాతుల నాశనానికి 4 కారణాలు ఉన్నా యని అంటున్నారు శాస్త్రవేత్తలు. ముందుగా చెప్పుకోవాల్సింది... ఆవాస ప్రాంతాల నష్టం. అడవులు, చెట్లు.. పచ్చిక బయళ్లు.. వంటివి తగ్గిపోవడం, భూములను వ్యవసాయానికి వాడుకోవడం ఎక్కువ కావడం వంటివన్న మాట. రెండో కారణం.. వ్యవసాయం లో కీటకనాశినుల వాడకం పెరగడం. శిలీంధ్రాల కోసం ఫంగిసైడ్, చిన్న చిన్న పురుగుల కోసం పెస్టిసైడ్స్, కీటకాల కోసం ఇన్సెక్టిసైడ్స్.. ఇలా వేర్వేరు పేర్లతో వాడుతున్న రసాయనాలు భూమిని.. పరిసరాల్లోని పురుగులను నాశనం చేసేశాయన్నది నిర్వివాద అంశం. ఇప్పటివరకూ నశించిపోయిన కీటకాల్లో 8 శాతం కీటకనాశినుల కారణంగానే అని అధ్యయనం చెబుతోంది. ఎరువులు, పారిశ్రామిక వ్యర్థాలు మూడో కారణమైతే.. మారిపోతున్న వాతావరణం ఇంకో కారణమని తేల్చింది. వీటితోపాటు.. ఇన్వెసివ్ స్పీషీస్ (ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశించి.. సహజ శత్రువులు లేనికారణంగా విచ్చలవిడిగా పెరిగే జీవజాతులు), పరాన్నజీవులు, వ్యాధులూ కీటకాల సంతతి తగ్గిపోయేందుకు దోహ దపడుతున్నాయి. మరి ఏం చేద్దాం? నశించిపోతున్న కీటకజాతిని రక్షించుకునేందుకు మనుకున్న సులువైన ఉపాయం సేంద్రీయ ఆహారం వాడకాన్ని ఎక్కువ చేయడమే. పరిసరాల్లో వీలైనన్ని ఎక్కువ జాతుల మొక్కలను పెంచితే.. అవి కాస్తా కీటకాలకు ఆవాసంగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ వీటిఅవసరమేమిటి? కీటక జాతులు తగ్గిపోతుండటం పర్యావరణానికి జరుగుతు న్న నష్టానికి సూచిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. వానపాములనే తీసుకుంటే.. మట్టిని తిని అవి విడిచే వ్యర్థాలు భూమిని సారవంతం చేస్తాయి. వీటిమాట ఇలా ఉంటే.. మిగిలిన పురుగులు కీటకాలు.. ఆహార పిరమిడ్‌లో అట్టడుగున ఉంటూ.. మిగిలిన పక్షులు, జంతువులకు ఆహారంగా మారతాయి. పరపరాగ సంపర్కం ద్వారా పూల పుప్పొడిని, విత్తనాలను సుదూర ప్రాంతాలకు విస్తరించడంలోనూ వీటి పాత్ర చాలా ముఖ్యం. ఇలాంటి పర్యావరణపరమైన సేవలన్నింటికీ విలువ కడితే.. అది ఏటా కొన్ని కోటానుకోట్లకు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతటి కీలకమైన పురుగులు నాశనమైపోతే పర్యావరణ సమతౌల్యత దెబ్బతినడం ఖాయం. కన్యా శాస్త్రవేత్త డినో మార్టిన్స్ మాటల్లో చెప్పాలంటే.. ‘కీటకాల్లేపోతే.. ఆహారమే లేదు... అంటే మనుషులే లేరు’. -
జటాయు పోరాటం!
రావణుడు సీతను అపహరించి, రథం మీద కూర్చోబెట్టుకుని వినువీధులలో దూసుకెళ్తున్నాడు. సీతమ్మ భయ విహ్వల అయి, తన భర్తను తలచుకుంటూ, రావణుని నిందిస్తోంది. ఈ దృశ్యం అల్లంత దూరాన చెట్టునీడలో విశ్రాంతి తీసుకుంటున్న జటాయువు దృష్టిలో పడింది. సరిగ్గా అదే సమయంలో సీతమ్మ కూడా జటాయువును చూసింది. రెండు చేతులూ జోడించి ‘ఆర్యా! ప్రణామాలు. నన్ను ఈ దుష్ట రావణుడుఅపహరించుకుని పోతున్నాడు. మీరు వెంటనే ఈ విషయాన్ని రామలక్ష్మణులకు తెలియజేయండి. వారే వీడి పీచమణుస్తారు’’ అంటూ అభ్యర్థించింది. కంటిముందు జరుగుతున్న ఆ ఘోరాన్ని చూసి జటాయువు చలించిపోయాడు. ఆగ్రహావేశాలతో రావణుడి రథాన్ని వెంబడిస్తూ, ‘‘ఓరీ దుష్టరాక్షసా! పిరికిపందలాగా రామలక్ష్మణులు లేని సమయాన సీతమ్మను అపహరించుకు వెళుతున్నావా! సిగ్గులేదా నీకు? చావు దగ్గర పడినవాడు స్వీయ వినాశనం కోసమే నీలాంటి అధర్మ కార్యాలకు ఒడిగడతాడని నిన్ను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, మర్యాదగా సీతమ్మను తీసుకెళ్లి, సగౌరవంగా రామునికి అప్పగించి, శరణు వేడు. ఆ దయామయుడు నిన్ను క్షమించి వదులుతాడు’’ అంటూ హితవు చెప్పాడు. రావణుడు ఆ మాటలను వినిపించు కోకుండా ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఇలా లా¿¶ ం లేదనుకుని. జటాయువు, తన బలమైన ముక్కుతో, గోళ్లతో రావణుని పొడిచాడు. కాళ్లతో రావణుని ధనుస్సును విరిచిపారేశాడు. క్రోధంతో భగ్గుమన్న రావణుడు, జటాయువు మీదికి ఎన్నో శస్త్రాస్త్రాలను ప్రయోగించాడు. వాటన్నింటినీ తన రెక్కలతో ఆవలికి విసిరికొడుతూనే, సువర్ణ సదృశమైన తన వాడి గోళ్లతో రావణుణ్ణి పొడిచి చికాకు పెట్టసాగాడు. ఇది సామాన్యమైన పక్షి కాదని గ్రహించిన రావణుడు మహిమాన్విత మైన తన ఖడ్గంతో జటాయువు ముక్కును, రెక్కలను, పార్శా్వలను ఖండించివేశాడు. దాంతో, ఆ వృద్ధ పక్షిరాజం మొదలు నరికిన చెట్టులా నేలకూలింది. అది చూసిన రావణుడు, రెట్టించిన వేగంతో లంకవైపు దూసుకుపోయాడు. అవతలి వాడు అమిత బలశాలి అని ఆ పక్షికి తెలుసు. అయినప్పటికీ, అతణ్ణి నిలువరించేందుకు తన ప్రయత్నం తాను చేసి, ఈ వార్తను రామలక్ష్మణులకు చేరవేసేందుకు ప్రాణాలు ఉగ్గబట్టుకుని వేచి చూసింది. చివరికి రాముడికి వర్తమానం అందించింది జటాయువు. నీతి ఏమిటంటే, చెడును అడ్డుకోవడానికి చివరి వరకూ పోరాటం చేయాల్సిందే! అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావలసిందే! – డి.వి.ఆర్. భాస్కర్ -
కొనసాగిన ఆందోళనలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని మోదీ చేసిన కుట్ర ఆరోపణల నేపథ్యంలో వరుసగా మూడో రోజు కూడా లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ప్రారంభమైన కొద్ది నిమిషాలకే లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు మోదీ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు ప్రారంభించారు. ఆ సమయంలో మోదీ సభలోనే ఉన్నారు. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి జీరో అవర్‌తో ప్రారంభమయింది. నిరసన కొనసాగించిన కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. తమ నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయగా స్పీకర్ స్పందించలేదు. తర్వాత కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే లేచి.. మన్మోహన్‌కు వ్యతిరేకంగా ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరగా స్పీకర్ అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యులువాకౌట్ చేశారు. ప్రధాని క్షమాపణ చెప్పరు: మోదీ ఆరోపణలకు నిరసనగా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. బుధవారం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ప్రధాని క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చి గొడవ చేయటంతో చైర్మన్ వెంకయ్య నాయుడు స్పందించారు. సభ లోపల ఆరోపణలు చేయనందున ప్రధాని క్షమాపణలు చెప్పబోరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళన తీవ్రతరం కావటంతో సభ గురువారానికి వాయిదా పడింది ► అటవీ చెట్ల జాబితా నుంచి వెదురును తొలగిస్తూ చేసిన చట్ట సవరణకు, దేశ భద్రత అవసరాల కోసం స్వాధీనం చేసుకునే స్థిరాస్తులకు ఇచ్చే పరిహారానికి సంబంధించిన స్థిరాస్తి బిల్లుల సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. -
ఫడ్నవిస్‌కు ‘ఓవర్ లోడింగ్’ అంతరాయం
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హెలికాప్టర్ ప్రయాణానికి మరోసారి అంతరాయం కలిగింది. నాసిక్ నుంచి శనివారం ఆయన ఔరంగాబాద్‌కు హెలికాప్టర్లో వెళ్తుండగా పరిమితికి మించి మనుషులు ఎక్కడంతో టేకాఫ్ తీసుకోగానే మళ్లీ కిందకు తీసుకొచ్చి ఒకరిని దింపేశారు. హెలికాప్టర్‌ను ఎందుకు కిందకు దింపారో పోలీసులు చెప్పనప్పటికీ...ఒక మనిషిని, కొంత సామగ్రిని దించేయడాన్ని బట్టి చూస్తుంటే పరిమితికి మించిన బరువు హెలికాప్టర్లో ఉన్నందునే ఇలా జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ‘హెలికాప్టర్ నిర్దేశిత ఎత్తుకు ఎగరలేకపోవడంతో కొంత లగేజిని దించేశాం. సీఎం పర్యటనకు ఇబ్బంది లేదు’ అని ఒక అధికారి చెప్పారు.∙మే నెలలో రెండుసార్లు, జూలైలో ఒకసారి ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లు వివిధ కారణాలతో స్వల్ప ప్రమాదాలకు గురైనా ఆయన క్షేమంగా బయటపడ్డారు . -
రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఆలేరు/భువనగిరిఅర్బన్: గూడ్స్ రైలులో ఏర్పడిన సాంకేతిక లోపంతో గురువారం సికింద్రాబాద్– కాజీపేట రైల్వేమార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఉదయం 8.30 గంటలకు కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే సాంకేతిక సమస్య తలెత్తి పది నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇదే సమయంలో కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైల్‌ను జమ్మాపురం, వంగపల్లి ట్రాక్ వద్ద నిలిపివేశారు.అలాగే కాకతీయ ప్యాసింజర్ గంటన్నర, పుష్పుల్ రైలును గంటపాటు ఆలేరు స్టేషన్లో నిలిపివేశారు. గూడ్స్ రైలులో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగాయని రైల్వే పోలీసులు తెలిపారు. -
ఇది నా రాజ్యం
క్రికెట్ మ్యాచ్‌లకు జంతువులు, పక్షులు అంతరాయం కలిగించడం కొత్తేం కాదు. గతంలో అనేకసార్లు మైదానంలోకి కుక్కలు వచ్చి మ్యాచ్‌కు ఆటంకం కలిగించాయి. తొలి రోజు వైజాగ్‌లో కూడా ఓ కుక్క సందడి చేసింది. టీ విరామానికి ముందు బ్రాడ్ ఓవర్లో రెండు బంతులు వేశాక కుక్క మైదానంలోకి వచ్చింది. మైదానం సిబ్బంది వచ్చి దానిని బయటకు పంపారు. కానీ ఒక్క నిమిషంలోపే మళ్లీ అది తిరిగి మైదానంలోకి వచ్చింది. ఇది నా రాజ్యం... మీరెవరూ అనే తరహాలో అక్కడే కాలకృత్యాలు తీర్చుకునే ప్రయత్నం చేసింది. దీంతో దానిని తరుముతున్న సిబ్బందిలో ఒకరు షూ తీసి విసిరేసి దాని వెంటపడ్డాడు. మైదానం అంతా పరుగులు పెట్టించిన తర్వాత గానీ అది బయటకు వెళ్లలేదు. ఈ ఆలస్యంతో అంపైర్లు కాస్త ముందుగానే టీ విరామం ప్రకటించాల్సి వచ్చింది. బహుశా ఇలా మాత్రం గతంలో ఎప్పుడూ జరిగినట్లు లేదు! -
రాజమండ్రి-విశాఖ మధ్య రాకపోకలకు అంతరాయం
రాజానగరం (తూర్పు గోదావరి) : జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి రాజానగరం మండలం సూర్యరావుపేట వద్ద గల 16వ నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు కాలువలా ప్రవహిస్తోంది. దీంతో రాజమండ్రి- విశాఖపట్నం మద్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరద నీటిని దాటలేక కార్లు, ద్విచక్రవాహనాలు నీటి మధ్యన నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రేపటి నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం
∙డోర్నకల్–విజయవాడ–కాజీపేట మార్గంలో పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు ∙ఎక్స్‌ప్రెస్‌లను దారిమళ్లించనున్న అధికారులు డోర్నకల్ / రైల్వే గేట్ : విజయవాడ రైల్వేస్టేçÙ¯ŒSలో బుధవారం నుంచి ఈనెల 28వ తేదీవరకు రూట్‌రిలే ఇంటర్‌లాకింగ్ సిస్టం (ఆర్ఆర్ఐ) పునరుద్ధరణ పనులు జరగనున్నాయి. ఈ మేరకు డోర్నకల్ – విజయవాడ మార్గంలో నడిచే ప్యాసింజర్ రైళ్లతో పాటు మరికొన్నింటిని రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రద్దు కానున్న రైళ్లు, ఆయా తేదీల వివరాలిలా ఉన్నాయి. విజయవాడ – కొత్తగూడెం ప్యాసింజర్(57254) ఈనెల 21 నుండి 28 వరకు, కొత్తగూడెం – విజయవాడ ప్యాసింజర్(57253) 21 నుండి 28వ తేదీ వరకు, కాజీపేట–విజయవాడ పుష్పుల్(57237) 21 నుండి 26వ తేదీ వరకు, డోర్నకల్ – విజయవాడ వెళ్లే ప్యాసింజర్(67251) 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు, విజ యవాడ – కాజీపేటకు వెళ్లే పుష్పుల్ రైలు(57238) 21 నుండి 27వ తేదీ వరకు, విజయవాడ–మహబూబాబాద్ పెద్దపల్లి ప్యాసింజర్(77253) 21, 24, 28వ తేదీ ల్లో, మహబూబాబాద్–విజయవాడ పెద్దపల్లి ప్యాసింజర్(77254) 23, 27వ తేదీ ల్లో, విజయవాడ–డోర్నకల్ ప్యాసింజర్(67272) 21 నుండి 27వ తేదీ వరకు రద్దుకానుంది. అలాగే, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 22, 23, 24 తేదీల్లో సికింద్రాబాద్ నుండి ఖమ్మం వరకే నడపనుండగా 25వ తేదీన పూర్తిగా రద్దు చేస్తా రు. ఇక ఇంటర్సిటీ, గోల్కొండ, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లను నడికుడి మీదుగా, షిర్డీ–కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 20, 22, 25వ తేదీల్లో డోర్నకల్, ఖమ్మం మీదుగా రాయ¯ŒSపాడు బైపాస్ నుండి కాకినాడకు, కాకినాడ – షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను 21, 24, 26వ తేదీల్లో రాయ¯ŒSపాడు బైపాస్ మీదు గా డోర్నకల్, వరంగల్ నుండి షిర్డీకి నడపనున్నారు.అలాగే, లింక్ఎక్స్ప్రెస్, మచి లీపట్నం, గౌతమి ఎక్స్‌ప్రెస్‌లను ఇదే మా ర్గంలో విజయవాడ స్టేష¯ŒSకు వెళ్లకుండా రాయ¯ŒSపాడు బైపాస్ మీదుగా నడపనున్నారు. అంతేకాకుండాగోదావరిఎక్స్ప్రెస్, గౌతమి, కోణార్క్, ఈస్ట్‌కోస్ట్, ఏపీ, స్వర్ణజయంతి మొదలైన రైళ్లు విజయవాడ వర కు వెళ్లకుండా కొండపల్లి గుణదల రైల్వేస్టే ష¯ŒS నుంచి వైజాగ్ వెళ్లనున్నాయి. చైన్నై వైపు వెళ్లే రైళ్లు సంఘమిత్ర, గోరఖ్‌పూర్, గరీబ్‌రథ్, దర్బంగా, నవజీవ¯ŒS, గంగాకావేరి, జనతా, కేరళ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు సంపర్క్‌క్రాంతి రైళ్లు వయా కాజీపేట నుం చి కాచిగూడ మీదుగా చెన్నై వైపు వెళ్తాయ ని అధికారులు చెప్పారు. ఇక కృష్ణా, ఇంటర్సిటీ రైళ్లు సికంద్రాబాద్ నుంచి నడికుడ మీదుగా గుంటూరు వైపు వెళతాయి. -
కేటీపీపీలో విద్యుదుత్పత్తికి అంతరాయం
గణపురం(వరంగల్): వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (కేటీపీపీ)లో 600 మెగావాట్ల ప్లాంట్‌లో మంగళవారం మధ్యాహ్నం ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ప్లాంట్‌లోని బాయిలర్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇంజనీర్లు ప్లాంట్‌ను షట్‌డౌన్ చేసి మరమ్మతులు మొదలు పెట్టారు. -
అంధకారంలో ఆదిలాబాద్ డివిజన్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆదిలాబాద్ డివిజన్ పూర్తిగా అంధకారంలో మునిగింది. బలంగా వీచిన గాలులకు పలు చోట్ల కరెంట్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించింది. మంగళవారం ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు. డివిజన్ పరిధిలో పూర్తిగా విద్యుత్ సరఫరా జరగాలంటే మరో రెండు రోజులు పడుతుందని విద్యుత్ ఎస్ఈ తెలిపారు. -
విద్యుత్ సేవలకు విఘాతం
సమ్మెలో 1,200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పలు సేవలకు బ్రేక్ కదలని అధికారుల వాహనాలు ఆపరేటర్ల సమ్మెతో సబ్‌స్టేషన్‌లో సేవలకు అంతరాయం అయినా స్పందించని ప్రభుత్వం విజయవాడ : విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెతో ఆ శాఖ సతమతమవుతోంది. సబ్స్టేషన్లలో పనిచేసే ఆపరేటర్లు సమ్మెకు దిగడంతో పలు కీలక సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. అధికారుల వాహనాలకు డ్రైవర్లుగా, సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్లుగా, బిల్లు రీడర్లుగా, బిల్లుల చెల్లింపు కేంద్రాల్లో ఆపరేటర్లుగా.. ఇలా పలు విభాగాల్లో పనిచేస్తున్న వారంతా సమ్మెకు దిగడంతో ఇబ్బందులు మొదలయ్యూరుు. జిల్లాలో మొత్తం 1,200 మంది వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండగా, విద్యుత్ శాఖలో ఆపరేటర్లుగానే 850 మంది పనిచేస్తున్నారు. వీరందరినీ రెగ్యులర్ చేస్తామని తెలుగుదేశంపార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా సీఎం చంద్రబాబునాయుడు దీని గురించి పట్టించుకోకపోగా, కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై సమీక్షలు నిర్వహించిన దాఖాలాలు కూడా లేవు. ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘ నేతలు గతనెల 25వ తేదీన సదరన్ స్కామ్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు వెళ్తామని వారు ప్రకటించగా.. 23వ తేదీన ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని, సమ్మె ఉపసంహరించుకోవాలని డిస్కమ్ అధికారులు కోరారు. అరుుతే, వారి నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలోకి వచ్చారు. 15వ తేదీ నుంచే అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 16వ తేదీ నుంచి నిరవధిక దీక్షలు కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులను కలిసి వారి సమ్మెకు మద్దతు ప్రకటించడమే కాకుండా దీనిపై అసెంబ్లీలో పోరాడతానని ప్రకటించడంతో సమ్మె మరింత ఉధృతమైంది. ఎక్కడి పనులు అక్కడే.. ప్రస్తుతం 180 సబ్స్టేషన్లలో మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి సబ్‌స్టేషన్‌లో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ ఉన్నారు. అరుుతే, కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న స్థానాల్లో ఇప్పటికే సీనియర్ ఉద్యోగులు, ఆపరేటర్లను నియమించారు. ఉదాహరణకు విజయవాడ సబ్‌డివిజన్ పరిధిలోని 52 సబ్స్టేషన్లలో 316 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 93 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 53 మంది సమ్మెలో ఉన్నారు. వారి స్థానాల్లో రెగ్యులర్ ఉద్యోగులను నియమించారు. అయితే, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె వల్ల విద్యుత్ శాఖ అధికారుల వాహనాలు కార్యాలయాలకే పరిమితమయ్యాయి. బిల్లు రీడర్లు కూడా సమ్మెలో ఉండటంతో బిల్లులు ఇంటింటికీ రాని పరిస్థితి ఏర్పడింది. సబ్‌స్టేషన్‌లో బేర్, లైన్ కటింగ్ సమస్యలతో పాటు మానిటరింగ్.. వంటి అనేక సేవలకు ఇబ్బంది కలుగుతోంది. కంప్యూటర్ ఆపరేటర్లు కూడా లేకపోవటంతో శాఖాపరమైన పనులకు కూడా బ్రేక్ పడింది. -
దుబాయ్ వెళ్లే విమానాలకు అంతరాయం
80 రోజుల పాటు రన్‌వేల మూసివేత న్యూఢిల్లీ: దుబాయ్ విమానాశ్రయంలో అభివృద్ధి పనుల కారణంగా కొద్ది రోజుల పాటు విమాన సర్వీసులకు అంతరాయం కలగనుంది. గురువారం నుంచి 80 రోజుల పాటు ఈ ఎడారి నగరానికి విమానాల రాకపోకలకు ఆటంకం కలగనుంది.దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని రెండు రన్‌వేలను అభివృద్ధి చేసే నిమిత్తం 80 రోజుల పాటు మూసేయాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. దీని వల్ల దుబాయ్‌కు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య 26 శాతానికి తగ్గిపోనుంది. ఈ నిర్ణయంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, జెట్ ఎయిర్వేస్ తదితర సంస్థలు దుబాయ్‌కు నడిపే తమ విమాన సర్వీసులను షార్జా ఎయిర్‌పోర్టుకు మార్చాయి. మరికొన్ని సర్వీసుల సమయాలను మార్పు చేశాయి. ఇండిగో, దుబాయ్ ఎమిరేట్స్ సంస్థలు దుబాయ్ విమాన సర్వీసులను కుదించాయి. మరికొన్ని సర్వీసులను రీషెడ్యూల్ చేశాయి.