ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎం పురంలో క్షీణించిన పారిశుద్ధ్యం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : స్థానిక సంస్థల ఎ న్నికలు ఈ నెలాఖరులోగా జరగకపోతే పల్లె ప్రగతి కుంటుపడుతుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల తో గ్రామాలు సతమతమవుతాయి. ఎక్కడికక్కడ అభివృద్ధి నిలిచిపోతుంది. పారిశుద్ధ్యాన్ని సైతం మెరుగుపర్చుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతాయి. చంద్రబాబు అండ్‌కో చేసిన కుట్రలకు ప్రజలు ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆరువారాల పాటు ఎన్ని కల కోడ్ అమల్లో ఉంటే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోతాయి. ము ఖ్యంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించాలన్న సంకల్పానికి బ్రేక్ పడనుంది. వైఎస్సార్ కాపు నేస్తం, జననన్న చేదోడు, ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ వంటి పథకాలు నిలిచిపోనున్నాయి. స్థానిక సంస్థల జనాభా దామాషా ప్రకా రం, జిల్లా వెనుకబాటు, స్థానిక సంస్థల పనితీరు తదితర అంశాల ఆధారంగా ఏటా ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి.
గతంలో పంచాయతీలకు 50శాతం, మండల పరిషత్‌లకు 25శాతం, జెడ్పీకి 25శాతం నిధులు విడుదలయ్యేవి. కానీ 14వ ఆర్థిక సంఘం వచ్చాక పంచాయతీలకు 90శాతం నిధులు, జెడ్పీ కి కేవలం 10శాతం నిధులను కేటాయిస్తూ వచ్చింది. మధ్యలో మండల పరిషత్‌లకు నిధుల్లేని పరిస్థితి ఉండేది. అయితే, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు గగ్గోలు పెట్టడంతో మునుపటి మాదిరిగా 15వ ఆర్థిక సంఘంలో పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 25 శాతం, జిల్లా పరిషత్‌కు 25 నిధు లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖత చూపింది. పాత పద్ధతిలో నిధులు విడుదల చేయనుండటంతో అటు పంచాయతీలు, ఇటు మండల, జిల్లా పరిషత్‌లు నిధులతో కళకళలాడనున్నాయి. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరులోగా జరిగితేనే.. లేదంటే నిధుల్లేమితో వెలవెలబోతాయి. చెప్పాలంటే ప్రగతి అటకెక్కనుంది.
జిల్లాకు రూ.300కోట్లు
మార్చిలో ఎన్నికలు పూర్తి చేయగలిగితే రాష్ట్రా నికి రూ.5800కోట్లు వస్తాయి. అందులో మన జిల్లాకు రూ.300కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కులు, క్రీడా మైదానాలు, శ్మశానాలు, కనెక్టవిటీ లేని ప్రాంతాల్లో రహదారులు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు దోహదపడతా యి. జిల్లాలో 1190 పంచాయతీలు, ఒక కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ప్రజలకు అవసరమైన కనీస వసతులు కల్పించడానికి 15వ ఆర్థిక సంఘం నిధులు ఉపయోగపడతాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నిలిచిపోయిన ఎన్నికల కారణంగా వందల కోట్ల నిధులకు జిల్లా దూరమైపోతోంది. ఆరువారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడంతో కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదు. స్థానిక సంస్థలకు పాలక మండళ్లు ఉంటే తప్ప కేంద్రం నిధులు విడుదల చేయదు. అది కూడా ఈనెలాఖరులోగానే పాలక మండళ్లు ఎన్నికవ్వాలి. తాజా ఎన్నికల సంఘం ఆదేశాలతో కేంద్రం నుంచి రావల్సిన ఆర్థిక సంఘం నిధులకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో పల్లెలు, మున్సిపాల్టీల్లో పెద్ద ఎత్తున అభి వృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలగనుంది.
సంక్షేమ కార్యక్రమాలకు బ్రేక్
ఎన్నికలు ఆరువారాల పాటు వాయిదా వేయడంతో ఈ లోపు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. ముఖ్యంగా జిల్లాలో 53,660 మందికి ఉగాది రోజున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సిద్ధం చేసింది. లేవుట్లు వేసి, లబి్ధదారులకు ప్లాట్లు లాటరీలో కేటాయింపు కూడా చేశారు. దీంతో ఉగాది ఎప్పుడొస్తుందా అని లబి్ధదారులు ఎ దురు చూస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలు నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లాయి. అదే విధంగా ఏప్రిల్‌లో వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపులకు సాయం చేయాలని నిర్ణయించింది. జిల్లాలో 4111మందికి రూ. 15వేలు చొప్పున అందజేసేందుకు నిర్ణయం కూడా తీసుకుంది. ఆరు వారాల వాయిదాతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈ కార్యక్రమం కూడా ఆగిపోనుంది.
జగనన్న చేదోడు పథకం కింద 3188మంది నాయీ బ్రాహ్మణులకు, 6873 మంది రజకులకు, 4785 మంది టైలర్లకు రూ. 10వేలు చొప్పున సాయం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి కూడా బ్రేక్ పడింది. అలాగే, ఆరోగ్య శ్రీ పథకం కింద జిల్లాలో 8లక్షల 44వేల మందికి కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది. ఇప్పుడు వాటికి కూడా అడ్డు పడింది. పది రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలను ఆరువారాలు పాటు వాయిదా వేయడంతో ఈలోపు ఎవరికైనా అరోగ్య పరమైన సమస్యలు వస్తే చేతి చమురు వదిలించుకోవాల్సిందే.
ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలైతే నిరుపేదలు ఇబ్బందులు పడాల్సిందే. వైద్యం కోసం ఖర్చుపెట్టలేక ప్రాణాలను పణంగా పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వైఎస్సార్ ఆసరా కింద జిల్లాలో 42,278 డ్వాక్రా సంఘాలకు లబ్ధి చేకూర్చాల్సి ఉంది. ఆ సంఘాల్లోని 5లక్షల 20వేల మహిళలు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే జనగన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. వీరంతా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఉసూరుముంటున్నారు. చెప్పాలంటే పది రోజుల్లో పూర్తి కావాల్సిన ఎన్నికలపై చంద్రబాబు అండ్‌కో చేసిన కుట్రలతో జిల్లాలో లక్షలాది మంది ప్రభుత్వ ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. వారంతా ఇప్పుడు ఎన్నికల సంఘం తీరుపై మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment