Postponement
-
అదే దౌర్జన్యం.. అడుగడుగునా బెదిరింపుల పర్వం
సాక్షి, పుట్టపర్తి/సాక్షి, భీమవరం/నరసరావుపేట రూరల్/కారంపూడి/ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార కూటమి నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డగింతలను నమ్ముకునే ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు, హెచ్చరికలు, గొడవల కారణంగా గురువారం ఏడు చోట్ల వాయిదా పడిన ఎన్నికలు... శుక్రవారం కూడా వాయిదా పడ్డాయి. అధికార పార్టీ నేతల నిర్వాకంతో ఉమ్మడి అనంతపురం జిల్లా గాండ్లపెంట, రామగిరి, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి, యలమంచిలిలో ఎంపీపీ, పల్నాడు జిల్లా నరసరావుపేట, కారంపూడిలో వైస్ ఎంపీపీ, వైఎస్సార్ జిల్లా గోపవరంలో ఉప సర్పంచ్ పదవులకు శుక్రవారం ఎన్నిక నిర్వహించలేకపోయారు.గురువారం రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 40 స్థానాల్లో (ఒక రెబల్‌తో కలిపి) తన హవాను చాటుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఏడు చోట్ల శుక్రవారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఎన్నిక నిర్వహించే కార్యాలయం వద్దకు రాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసులు ఇందుకు వారికి సహకరించారు. వాస్తవానికి కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే తిరిగి నిర్వహిస్తున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టంగా ఎన్నికలు సాగాల్సి ఉంది. అయితే ఈ స్థానాలు కూడా వైఎస్సార్సీపీ వశమైతే ప్రజల్లో కూటమి పట్ల వ్యతిరేకత మరింత ప్రబలుతుందని అధికార పార్టీ పెద్దలు బెంబేలెత్తిపోయారు. అడ్డుకోవాలంటూ స్థానిక నేతలకు కనుసైగ చేశారు. దీంతో శుక్రవారం కూడా ఉప ఎన్నికలు నిర్వహించలేకపోయారు. టీడీపీ నేతల దౌర్జన్యకాండ..టీడీపీ నేతల దాష్టీకంతో శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలు తిరిగి వాయిదా పడ్డాయి. నిర్ణీత సమయంలోగా మూడింట రెండు వంతుల సభ్యులు హాజరు కాకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలంలో ఏడుగురు సభ్యులకు గాను ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. రామగిరిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు రెండు రోజులుగా టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నిక సజావుగా జరిగితే వైఎస్సార్సీపీకి ఎంపీపీ పదవులు దక్కుతాయని భావించి గాండ్లపెంటలో టీడీపీ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, రామగిరిలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ ఎన్నిక జరగకుండా గురువారం ఆటంకాలు సృష్టించిన విషయం తెలిసిందే.ఉప ఎన్నికల వాయిదా.. ఎంపీపీ: 4 వైస్ ఎంపీపీ: 2 ఉప సర్పంచ్: 1 మొత్తం: 7 పశ్చిమలో కూటమి అధికార మదంపశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీకి ఏకపక్షం కావాల్సిన అత్తిలి, యలమంచిలి ఎంపీపీ ఎన్నికలను రెండో రోజైన శుక్రవారం కూడా కూటమి నేతలు తమ అధికార మదాన్ని చూపించి అడ్డుకున్నారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు, అత్తిలిలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెరవెనుక నుంచి తంతు నడిపించారు. సమావేశం ఉందని చెప్పి మండలంలోని ఉపాధి హామీ పథకం కూలీలు, డ్వాక్రా మహిళలను అత్తిలికి తరలించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటి వద్ద మహిళలను మోహరించారు. ఒక్కొక్కరికి రూ.500 నగదు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తామని చెప్పి ఉంచారు. కొందరు టీడీపీ కార్యకర్తలు కారుమూరి నివాసం చుట్టూ మోటారు సైకిళ్లపై హల్చల్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను కవ్వించే ప్రయత్నాలు చేశారు. 13 మంది వైఎస్సార్సీపీ సభ్యులు గురువారం రాత్రి రహస్య ప్రదేశంలో ఉండిపోయారు. శుక్రవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల్లో పాల్గొనాలని భావించారు. అయితే ఎంత ప్రయత్నించినా వైఎస్సార్సీపీ సభ్యులు ఎక్కడున్నదీ తెలియకపోవడంతో ఏ రోడ్డు నుంచైనా వచ్చేస్తారని ఉదయం నుంచి అత్తిలి గ్రామానికి వచ్చే రోడ్లన్నింటినీ కూటమి నేతలు దిగ్బంధించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామానికి వచ్చే బస్సులు, ఆటోలు, ఇతర అన్ని వాహనాలను తనిఖీ చేసి వైఎస్సార్సీపీ సభ్యులు లేరని నిర్ధారించుకున్న తర్వాతే వదిలారు. వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు కూటమి మూకలు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు చేష్టలుడిగి చూడటం గమనార్హం. ఈ నేపథ్యంలో తమ సభ్యులను పోలీసు రక్షణతో ఎన్నికలకు హాజరు పర్చేందుకు మాజీ మంత్రి కారుమూరి పోలీస్ అధికారులను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు.పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల నిర్వాకంపల్నాడు జిల్లా నరసరావుపేట, కారంపూడి మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక రెండోసారీ వాయిదా పడింది. టీడీపీ నేతల దౌర్జన్యం కారణంగా కోరం లేకపోవడంతో ఈ రెండు చోట్ల ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నరసరావుపేటలో కేవలం నలుగురు ఎంపీటీసీ సభ్యులు, కారంపూడిలో ఒకే ఒక్కరు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ సభ్యులు రాకుండా టీడీపీ నేతలు ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. దీంతో కోరం లేదన్న విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబుకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించి ఎన్నికను వాయిదా వేశారు. తదుపరి ఎన్నికల తేదీని తర్వాత ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. బలం లేకపోయినా సరికొత్త నాటకంపశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో ఎన్నిక ప్రారంభానికి ముందే కూటమి నాయకులు నాటకీయ పరిణామాలకు తెరలేపారు. గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు కంభాల సత్యశ్రీ కనిపించడం లేదని ఆమె కుమార్తె ఫిర్యాదు చేసిందంటూ పోలీసులు వచ్చి సత్యశ్రీని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కూటమి నాయకులు ఆమె కుమార్తె ద్వారా సత్యశ్రీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. తాను ప్రాణం పోయినా వైఎస్సార్సీపీని వీడేది లేదని ఆమె స్పష్టం చేయడంతో పోలీసులు తిరిగి ఆమెను మండల పరిషత్ కార్యాలయానికి తీసుకు వచ్చి దించడం గమనార్హం.అనంతరం నిర్ణీత సమయానికి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికకు వైఎస్సార్సీపీ నుంచి 12 మంది, కూటమికి చెందిన నలుగురు సభ్యులు హాజరయ్యారు. అటెండెన్స్ ప్రక్రియ పూర్తయ్యాక కూటమి సభ్యులు లేచి తమను వైఎస్సార్సీపీ సభ్యులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఎన్నిక ఏ విధంగా జరిపిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. సంగతి తేల్చాలంటూ ఘర్షణ వాతావరణం, గందరగోళ పరిస్థితులు సృష్టించారు. ఈ నేపథ్యంలో తనకు గుండెల్లో దడగా ఉందంటూ రిటర్నింగ్ అధికారి ఎం.శ్రీనివాస్ బయటకు వెళ్లిపోయారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నిక నిర్వహించడానికి సరైన వాతావరణం లేనందున వాయిదా వేస్తున్నట్టు ఎంపీడీఓ ఎ.ప్రేమాన్విత్ ప్రకటించారు. తమకు పూర్తి సంఖ్యాబలం ఉండగా కూటమి సభ్యులను భయపెట్టాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించినా వారు స్పందించలేదు. వాళ్లలో వాళ్లే గొడవ పడుతూ హైడ్రామావైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం వైఎస్సార్సీపీ వార్డు సభ్యులపై దౌర్జన్యం, దాడులకు దిగటంతో ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు హైడ్రామాకు తెర తీశారు. ఎన్నికల కార్యాలయంలో.. పథకం ప్రకారం టీడీపీకి చెందిన 7వ వార్డు సభ్యురాలు కాచన రామలక్షుమ్మ, ఉప సర్పంచ్ అభ్యర్థి మండ్ల రమాదేవి వాగ్వాదానికి దిగారు.ఒకరినొకరు ద్వేషించుకున్నారు. వీరు గొడవ పడుతుండగానే 8వ వార్డు సభ్యురాలు గాయత్రి ఎన్నికల అధికారి వద్ద ఉన్న మినిట్స్ బుక్‌ను లాక్కొని చించేశారు. ఈ సందర్భంగా 5వ వార్డు సభ్యుడు ఆదినారాయణరెడ్డి కుర్చీలు విసిరేశాడు. టీడీపీ సభ్యులైన వీరంతా కలిసి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేశారు. ఇంతలోనే ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి తనకు గుండెపోటు వచ్చిందని కుర్చీలో కూర్చుండిపోయారు. అంబులెన్స్‌ను పిలిపించి ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకే ఇక్కడ ఈ హైడ్రామా చోటుచేసుకుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
యాక్సియోమ్–4 మిషన్ వాయిదా?
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే వారిని వెనక్కి తీసుకురావాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, స్పేస్ఎక్స్ సంస్థ తొలుత నిర్ణయించాయి. సాంకేతిక కారణాలతో మార్చి నెలకు వాయిదా వేశాయి. అది కూడా సాధ్యమయ్యే అవకాశం లేదని సైంటిస్టులు అంటున్నారు. ఐఎస్ఎస్ నుంచి ఇద్దరు వ్యోమగాములను రప్పించడానికి స్పేస్ఎక్స్ సిద్ధం చేస్తున్న నూతన అంతరిక్ష వాహనం ‘డ్రాగన్’లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. బ్యాటరీల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఎప్పటిలోగా సరి చేస్తారన్న ఎవరూ చెప్పలేకపోతున్నారు. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ సిద్ధమైతే తప్ప సునీతా విలియమ్స్, విల్మోర్ వెనక్కి రాలేరు. ఏప్రిల్ నాటికి కూడా డ్రాగన్ అందుబాటలోకి రావడం అనుమానమేనని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, సునీతా విలియమ్స్, విల్మోర్ రాక ఆలస్యమవుతుండడం మరో కీలక ప్రయోగంపై ప్రభావం చూపుతోంది. యాక్సియోమ్–4 మిషన్‌లో భాగంగా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే భారత గ్రూప్ కెపె్టన్ శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు ప్రైవేట్ వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకోవాల్సి ఉంది. ఏప్రిల్‌లో ఈ ప్రయోగం చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. డ్రాగన్‌లో సునీతా విలియమ్స్, విల్మోర్ను వెనక్కి వస్తేనే ఈ నలుగురు ఐఎస్ఎస్కు చేరుకోగలుగుతారు. లేకపోతే ప్రయోగం వాయిదా వేయక తప్పదు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 19లోగా ఇద్దరు వ్యోమగాములు వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు యాక్సియోమ్–4 మిషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సునీతా విలియమ్స్, విల్మోర్ గత ఏడాది జూన్‌లో బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం వారం రోజుల్లో భూమిపైకి తిరిగిరావాలి. స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో అది సాధ్యం కాలేదు. వారిద్దరూ అక్కడే ఉండిపోయారు. వారి ఆరోగ్యం బాగుందని, ఎలాంటి సమస్యలు లేవని నాసా అధికారులు ప్రకటించారు. -
స్పేస్ డాకింగ్ 9కి వాయిదా
సాక్షి బెంగళూరు/సూళ్లూరుపేట: రోదసీ పరిశోధనల్లో మరో మైలురాయిని అధిగమించేందుకు ఇస్రో సమాయత్తమైంది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట రెండు ఉపగ్రహాలను భూకక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగం 7న జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఈ నెల 9కి ఇస్రో వాయిదా వేసింది. డాకింగ్ ప్రక్రియకు గ్రౌండ్ సిమ్యులేషన్ ద్వారా మరిన్ని పరీక్షలు అవసరమైనందునే రెండు రోజులు వాయిదా వేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. అంతరిక్ష రంగంలో దేశం మరింత ఎత్తుకు, మరో మెట్టుకు ఎదిగేందుకు ఇస్రోకు డాకింగ్ ప్రయోగం ఎంతో కీలకం. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే స్పేస్ డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసుకోగలిగాయి. ఇస్రో స్పేస్ డాకింగ్ విజయవంతమైతే భారత్ నాలుగో దేశంగా నిలుస్తుంది. -
TG: గ్రూప్-2 వాయిదాపై హైకోర్టు కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలకు లైన్ క్లియరైంది. ఈ నెల 15,16 తేదీల్లో ఉన్న పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.ఒకే తేదీల్లో గ్రూప్2, స్టాఫ్ సెలక్షన్ పరీక్షలుండడం వల్ల వాయిదా వేయాలని అభ్యర్థులు హైకోర్టుకు విన్నవించారు. వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గ్రూప్ 2 పరీక్ష తేదీల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కాగా, తెలంగాణలో 2016లో జరిగిన గ్రూప్ 2 పరీక్ష తర్వాత మళ్లీ ఇప్పుడు జరుగుతుండడం గమనార్హం. -
వివాదాలు.. వాయిదాలు!
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్న హామీ గాల్లో కలిసిపోయింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఫైల్‌పై ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికి విలువ లేకుండా పోయింది. నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ దాగుడుమూతలు ఆడుతూ వచ్చిన సర్కారు చివరకు చేతులెత్తేసింది. గతేడాది డిసెంబర్ నుంచి నిద్రాహారాలు మాని శిక్షణకే అంకితమైన దాదాపు 7.50 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులను తీవ్ర నిస్పృహకు గురి చేస్తూ ‘‘త్వరలో’’ నోటిఫికేషన్ ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రకటించడంతో సర్కారు వాయిదాల వ్యూహం బయటపడింది. ఇక గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను జనవరి 5న నిర్వహిస్తామని తొలుత ప్రకటించి పది రోజుల్లోనే ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఈ వాయిదాల పర్వాన్ని గమనిస్తున్న నిరుద్యోగులు, విద్యారంగ నిపుణులు 2019కి ముందు టీడీపీ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. గతంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన పలు నోటిఫికేషన్లు వాయిదా పడ్డాయని, ప్రభుత్వంలో ఉన్నవారే పోస్టుల భర్తీని ఆలస్యం చేసేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాటవేతలో అందెవేసిన కూటమి‘గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మా హయాంలో 11 నోటిఫికేషన్లు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. గతంలో నోటిఫికేషన్లపై కేసులు పడ్డాయి. వాటిపై అధ్యయనం చేసి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులకు చెప్పాం..’ అని శాసన సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆర్నెళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని జూన్‌లో ఆయన హామీ ఇవ్వగా నవంబర్ 6న నోటిఫికేషన్ జారీ అవుతుందంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. కేసులపై అధ్యయనం జరిపి న్యాయ వివాదాలను పరిష్కరించాక నోటిఫికేషన్ ఇవ్వాలంటే అది ఎప్పటికి సాధ్యమవుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.నెలల తరబడి శిక్షణతో ఆర్థిక భారం..గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే నెల నాటికి ప్రక్రియ పూర్తై జూన్‌లో పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉద్యోగాల్లో ఉంటామన్న ఆశతో లక్షల మంది అభ్యర్థులు ప్రైవేట్ ఉద్యోగాలను వదిలేసి పూర్తికాలం శిక్షణ పొందుతున్నారు. ఇక గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన దాదాపు లక్ష మంది అభ్యర్థులు మెయిన్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో పరీక్ష జరగాల్సి ఉండగా సర్వీస్ కమిషన్‌కు చైర్మన్ లేకుండా చేసిన కూటమి ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసింది. గత నెలలో చైర్మన్‌గా ఏఆర్ అనురాధ రాకతో అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తాయి. ఈ క్రమంలో జనవరి 5న మెయిన్స్ జరుగుతుందని తేదీని సైతం ప్రకటించారు. తీరా పది రోజులు గడవకుండానే మెయిన్స్ పరీక్షను వాయిదా వేసి అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. ‘త్వరలో’..అంటే ఎప్పుడు?గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన డీఎస్సీని కూటమి సర్కారు మెగా డీఎస్సీ ఇస్తామంటూ రద్దు చేసింది. 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేసింది. తర్వాత నవంబర్ తొలివారంలో నోటిఫికేషన్ అంటూ రకరకాల తేదీలను తెరపైకి తెచ్చారు. తీరా గడువు దాటినా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యాయ వివాదాలపై అధ్యయనం చేశాక ‘‘త్వరలో’’ నోటిఫికేషన్ ఇస్తామని తాపీగా ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఏ తరహా న్యాయ వివాదాలు ఉన్నాయో.. అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఐదు నెలలైనా స్పష్టత రాకపోవడంతో నిస్పృహకు గురవుతున్నారు. ఫిబ్రవరిలో డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంటే తీరా ఆ నోటిఫికేషన్ రద్దు చేశారని.. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి ఏడాది కాలంగా ఆర్థికంగా నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. నోటిఫికేషన్‌ను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశారని, మంత్రి చెబుతున్న ‘త్వరలో’ ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. -
రోడ్డెక్కిన స్టాఫ్ నర్సులు
సాక్షి, హైదరాబాద్, సుల్తాన్‌బజార్: వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న హెడ్ నర్సు, స్టాఫ్ నర్సుల కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ నర్సులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని 7 జోన్లకు ఒకేసారి కౌన్సెలింగ్ చేపట్టడంతో కళాశాల ఆడిటోరియంలో గందరగోళం నెలకొంది. డీహెచ్ రవీంద్రనాయక్ నేతృత్వంలో జరిగిన కౌన్సెలింగ్‌లో గ్రేడ్–1 అధికారి సుజాత రాథోడ్ వేదికపైకి వచ్చి బదిలీల లిస్టును మార్పు చేయించడంతో నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బదిలీల కౌన్సెలింగ్‌ను పారదర్శంగా నిర్వహించాలని పెద్దపెట్టున నినదించారు. దీంతో డీహెచ్ కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది స్టాఫ్‌నర్సులు ధర్నాకు దిగారు. తమకు ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించాలని, డీహెచ్ డౌన్ డౌన్ అని నినదించారు. కొందరు అధికారులు యూనియన్ నేతలుగా చెప్పుకుంటున్న వారితో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు.ఓ యూనియన్ నేత రూ.5 కోట్ల వరకు వసూలు చేశాడని.. ఆ సొమ్ములో రూ. 3 కోట్లు ఒక కీలక అధికారికి కూడా ఇచి్చనట్లు ఆరోపించారు. ఉస్మానియా మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డును గంటసేపు దిగ్బంధనం చేశారు. దీంతో సుమారు రెండున్నర గంటల పాటు కోఠి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు వేల సంఖ్యల్లో స్టాఫ్ నర్సులను నిలువరించలేకపోవడంతో రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. -
పరీక్షల వాయిదాకు గూడుపుఠాణి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉద్యోగాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. గ్రూప్స్, డీఎస్సీ పరీక్షల వాయిదాకు దొంగలు గూడు పుఠాణి చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోందని, వారి ధనదాహంతో నిరుద్యోగుల జీవితాలతో చెలాగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం భూత్పూర్ రోడ్డులోని ఏఎస్ఎం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పుట్టగతులుండవనే కుట్రలు ‘పార్టీ ఎప్పుడు బలహీనపడితే అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకొస్తారు. విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. హరీశ్, కేటీఆర్‌కు సవాల్ విసురుతున్నా.. పరీక్షల వాయిదా కోసం మీరు ఆమరణ దీక్షకు కూర్చోండి. మా ప్రభుత్వంలో నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే బిల్లా, రంగాలు పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలి.పేదోళ్ల పిల్లల్ని రెచ్చగొట్టుడు కాదు.. మీ వాదన నిజమైతే వారి పక్షాన మీరు దీక్షకు దిగాలి. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు. నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన. కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవనే వారు కుట్రలు చేస్తున్నారు..’అని సీఎం ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశాయి ‘కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు.. మేం మీలా దొంగ దెబ్బ తీయడం లేదు. మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. కేసీఆర్.. ముందుంది మొసళ్ల పండగ. మా ఎమ్మెల్యేలను నువ్వు గుంజుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలే దా? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాయి. కాంగ్రెస్ పారీ్టతో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవని ఆనాడే చెప్పా. కేసీఆర్ ఇక నీకు రాజకీయ మనుగడ లేదు. చేతనైతే అభివృద్ధికి సహకరించు.. లేకపోతే ఫామ్‌హౌస్‌లోనే పడు కో. నాలుగు రోజులుగా హరీశ్, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. తనదాకా వస్తే గానీ వాళ్లకు నొప్పి తెలియలేదు..’అని రేవంత్ విమర్శించారు.ఆగస్టు 15లోపు రుణమాఫీ ‘నేను కార్యకర్తల్లో ఒక కార్యకర్తను. అందుకే ముఖ్య నాయకులను కలవాలని ఇక్కడికి వచ్చా. మిమ్మల్ని కలిస్తే నాకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. కార్యకర్తల కష్టంతోనే టీపీసీసీ అధ్యక్షుడి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి వరకు ఎదిగా. ఈ ప్రభుత్వం మీది.. మీ సూచనలు, సలహాలను ప్రభుత్వం పాటిస్తుంది. నాయకుల ఎన్నికలు ముగిశాయి.. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.ఇప్పటివరకు మీరు నాయకుల కోసం కష్టపడ్డారు.. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
Parliament Special Session: పార్లమెంట్లో నీట్ రగడ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ) వ్యవహా రం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. నీట్ పరీక్షలో అవినీతి అక్రమాలపై, పేపర్ లీకేజీపై వెంటనే చర్చ చేపట్టాలని శుక్రవారం ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. నినాదాలతో హోరెత్తించాయి. ఇతర వ్యవహారాలు పక్కనపెట్టి నీట్ అభ్యర్థుల భవితవ్యాన్ని కాపాడడంపై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. తర్వాత చర్చిద్దామని సభాపతులు కోరినన్పటికీ ప్రతిపక్ష నేతలు శాంతించలేదు. దీంతో సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. దిగువ సభలో విపక్షాల ఆందోళన లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే సుశీల్‌కుమార్ మోదీ సహా పలువురు మాజీ సభ్యుల మృతి పట్ల స్పీకర్ ఓం బిర్లా సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం విపక్ష సభ్యులు నీట్ అంశాన్ని లేవనెత్తారు. తక్షణమే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్పందిస్తూ... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తెలిపే తీర్మానంపై చర్చ వాయిదా వేయడం కుదరని, ఈ నేపథ్యంలో జీరో అవర్ చేపట్టలేమని అన్నారు. కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని నీట్–యూజీపై చర్చించాలని అన్నారు. డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ ఎంపీలు వారి సీట్ల వద్దే నిల్చొని నినాదాలు ప్రారంభించారు. రాహుల్ గాంధీ విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్య క్రమాలు ప్రారంభించారు. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. సభాపతి ఎంతగా వారించినా వినకుండా నినాదాలు కొనసాగించారు. తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిద్దామని, ఆ తర్వాత నీట్‌పై చర్చకు సమయం కేటాయిస్తానని సభాపతి పేర్కొన్నప్పటికీ విపక్షాలు పట్టువీడలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. సభ పునఃప్రారంభమైన తర్వాత పశి్చమ బెంగాల్‌కు చెందిన నురుల్ హసన్‌తో ఎంపీగా స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం లోక్‌సభలో కమిటీల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు. మరోవైపు నీట్–యూజీపై విపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. సభ సజావుగా సాగేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని స్పీకర్ కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో లోక్‌సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.రాజ్యసభలో వెల్‌లోకి దూసుకొచి్చన ఖర్గే నీట్ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షాలు నిలదీశాయి. విపక్షాల నిరసనలు, నినాదాల వల్ల శుక్రవారం ఎగువ సభను చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మూడుసార్లు వాయిదా వేశా రు. రాష్ట్రప తి ప్ర సంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టగా విపక్షాలు అడ్డుకున్నాయి. నీట్‌పై చర్చించాలని పట్టుబట్టాయి. నీట్లో అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని జేడీ(ఎస్) సభ్యుడు హెచ్.డి.దేవెగౌడ గుర్తు చేశారు. సభ సక్రమంగా జరిగేలా విపక్ష సభ్యులంతా సహకరించాలని కోరారు. నీట్‌పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని, అప్పటిదాకా అందరూ ఓపిక పట్టాలని చెప్పారు. నీట్‌పై చర్చించాలని కోరుతూ ప్రతిపక్షాల నుంచి 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నానని ధన్‌ఖడ్ చెప్పారు. దీనిపై విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్‌లోకి దూసుకురావడంపై రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నాయకు డు వెల్‌లోకి రావడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి అని, పార్లమెంట్‌కు ఇదొక మచ్చ అని ఆక్షేపించారు. పార్లమెంటరీ సంప్రదాయం ఈ స్థాయికి దిగజారిపోవడం తనను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఈ ఘటన దేశంలో ప్రతి ఒక్కరినీ మానసికంగా గాయపర్చిందని చెప్పారు. నీట్‌పై చర్చకు సభాపతి అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఇదిలా ఉండగా, సభలో మాట్లాడేందుకు చైర్మన్ ధనఖఢ్ అవకాశం ఇవ్వకపోవడం వల్లే తాను వెల్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. అయితే, ధన్‌ఖడ్ చెబుతున్నట్లుగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత వెల్‌లోకి వెళ్లడం ఇదే మొదటిసారి కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడించారు. 2019 ఆగస్టు 5న రాజ్యసభలో అప్పటి విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వెల్‌లోకి వెళ్లారని గుర్తుచేశారు. స్పృహతప్పి పడిపోయిన కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలోదేవి నేతమ్ శుక్రవారం స్పృహ తప్పి పడిపోయారు. అధిక రక్తపోటు కారణంగా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. పార్లమెంట్ సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. నేతమ్ ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, కోలుకుంటున్నారని, ఈ మేరకు ఆసుపత్రి నుంచి తనకు సమాచారం అందిందని చైర్మన్ ధన్‌ఖఢ్ సభలో ప్రకటించారు. -
‘గుర్తింపు’నకు గ్రహణం!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27 నుంచి జరగాల్సిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. కొత్త షెడ్యూల్‌ను సాంకేతిక విద్య విభాగం మంగళవారం విడుదల చేసింది. ఈ మార్పునకు కారణాలేంటనేది అధికారులు వెల్లడించలేదు. కొన్ని కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అను మతి పొందాల్సి ఉందని మాత్రమే చెబుతున్నారు. కానీ వాస్తవానికి రాష్ట్ర యూనివర్సిటీల నుంచి ఇప్పటివరకు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాలేదు. ఇది వస్తేనే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది తెలుస్తుంది. కౌన్సెలింగ్ వెబ్సైట్లో కాలేజీలు, కోర్సుల వివరాలు ఉంటేనే విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వగలుగుతారు. ఏటా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. కానీ ఈ ఏడాది ముందే పూర్తయింది. మే 21తో 10 విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల పదవీకాలం ముగిసింది. అయితే వారు ఆలోగానే కాలేజీల్లో తనిఖీలు పూర్తి చేశారు. కానీ కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే సమయంలో తనిఖీలపై ఫిర్యాదులొచ్చాయి. దీంతో కాలేజీలకు ఇప్పుడే గుర్తింపు ఇవ్వొద్దంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మే 21 తర్వాత వీసీల పదవీకాలం ముగియడంతో ప్రతి వర్సిటీకి ఐఏఎస్ అధికారులను ఇన్చార్జి వీసీలుగా ప్రభుత్వం నియమించింది. పాత వీసీలు చేపట్టిన తనిఖీలపై వారికి అనుమానాలు రావడంతో ప్రక్రియను నిలిపివేసినట్లు తెలుస్తోంది. గోల్మాల్ జరిగిందా? రాష్ట్రంలో 178 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిలో 17 కాలేజీలు ప్రభుత్వ అ«దీనంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నాయి. మిగిలిన 161 కాలేజీలు ప్రైవేటువి. ఇంజనీరింగ్ కాలేజీల్లో బ్రాంచీలు, సెక్షన్లు, సీట్లకు సంబంధించి యాజమాన్యాలు ముందుగా ఏఐసీటీఈ నుంచి అనుమతి తీసుకోవాలి. 33 కాలేజీలు మినహా మిగతా కాలేజీలన్నీ ఏఐసీటీఈ అనుమతి తీసుకున్నాయి. అంటే 128 కాలేజీలు తమ పరిధిలోని విశ్వవిద్యాలయం నుంచి గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అయితే వర్సిటీల అధికారులు తనిఖీల సందర్భంగా ఇష్టానుసారం వ్యవహరించారని, ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఫ్యాకల్టి, మౌలికవసతులు లేకున్నా సక్రమంగానే ఉన్నట్లు నివేదికలు ఇచ్చినట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్చార్జి వీసీలుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు తనిఖీల్లో అవకతవకలపై విచారణ మొదలుపెట్టారు. దీంతో అనుబంధ గుర్తింపులో జాప్యం జరుగుతోందని అధికారులు అంటున్నారు. ఈ పరిణామాలపై ఆందోళన చెందుతున్న కాలేజీ యాజమాన్యాలు ఏదో విధంగా గుర్తింపు తెచ్చుకోవడానికి పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో బేరసారాలకు ఆస్కారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీట్ల లెక్క ఇలా.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.22 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా వాటిలో 83 వేల సీట్లు కన్వీనర్ కోటా కింద ఉన్నాయి. అందులోనూ 58 శాతం సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా డిమాండ్ లేని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో సీట్లను, సెక్షన్లను ప్రైవేటు కాలేజీలు తగ్గించుకుంటున్నాయి. వాటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో సీట్లు పెంచాలని కోరుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో 80 కాలేజీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. గతేడాది బ్రాంచీ మార్చుకున్నవి, కొత్తగా మంజూరైన కంప్యూటర్ సైన్స్ సీట్లు 14 వేల వరకు ఉన్నాయి. పెరిగిన సీట్లను ఆఖరి కౌన్సెలింగ్‌లోకి తెచ్చారు. ఏయే కాలేజీల్లో, ఏ బ్రాంచీల్లో సీట్లు పెరుగుతాయి? ఎందులో తగ్గుతాయి? అనే వివరాలతో ముందే కౌన్సెలింగ్ కేంద్రంలో సాఫ్ట్వేర్ రూపొందించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అనుబంధ గుర్తింపే కాలేజీలకు రాకపోవడంతో సీట్లపైనా అధికారులకు స్పష్టత రావడం లేదు. -
నేటి నీట్–పీజీ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్–పీజీ పరీక్షను కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఆఖరి నిమిషంలో వాయిదా వేసింది. విద్యార్థుల ప్రయోజనాల కోసమే ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నామని, వీలైనంత త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ పరీక్ష ఆదివారం జరగాల్సి ఉంది. -
సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: సీఎస్ఐఆర్–యూజీసీ–నెట్ ఉమ్మడి పరీక్ష వాయిదా పడింది. వచ్చే వారం జరగాల్సిన ఈ పరీక్షను అనివార్య పరిస్థితులు, రవాణాపరమైన ఇబ్బందుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం తెలిపింది. పరీక్ష తదుపరి తేదీని వెబ్సైట్లో ప్రకటిస్తామని వివరించింది. అయితే, పేపర్ లీకైందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సీఎస్ఐఆర్–యూజీసీ–నీట్ పరీక్షను జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లెక్చరర్íÙప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తారు. మంగళవారం నిర్వహించిన యూజీసీ నెట్‌ను కూడా అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రద్దు చేయడం తెల్సిందే. -
NEET-UG 2024: నీట్ కౌన్సెలింగ్ వాయిదాకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 6 నుంచి జరగాల్సిన నీట్ యూజీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రధాన పిటిషన్లపై విచారణను కోర్టు ఇప్పటికే జూలై 8కి వాయిదా వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను కూడా ఆ తేదీ దాకా వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీతో కూడిన వెకేషన్ బెంచ్ శుక్రవారం అందుకు నిరాకరించింది. విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. -
పాఠశాలల పునఃప్రారంభం ఒకరోజు వాయిదా
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే తేదీన నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు తెలిసింది. దీంతో గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి.కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటిరోజే పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్‌తో కూడిన విద్యా కానుక కిట్లు అందజేసింది. ఇలా వరుసగా నాలుగేళ్లు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించింది. అయితే, ఈ విద్యా సంవత్సరం పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా ఆలస్యం కానుంది. పుస్తకాలు మండల కేంద్రాలకు చేరినా నూతన విద్యాశాఖ మంత్రి వచ్చాకే వీటి పంపిణీపై నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ 36 లక్షల విద్యా కానుక కిట్లను సిద్ధం చేయగా, ఇప్పటి వరకు సగం మాత్రమే సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ కిట్‌లో అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్‌బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతులకు నోట్‌బుక్స్ ఉన్నాయి. మొదటి సెమిస్టర్‌కు 3.12 కోట్ల పుస్తకాలు ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. కాగా, మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు దాదాపు మండల స్టాక్ పాయింట్లకు చేరాయి. గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడూ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది. అలాగే, 3–10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు.పదో తరగతి సాంఘికశా్రస్తాన్ని సీబీఎస్ఈ బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ సబ్జెక్టులుగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను ఆర్ట్ పేపర్‌పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచి్చంది. ఈ బోధనకు అనుగుణంగా మొత్తం 4.30 లక్షల పుస్తకాలు సైతం ముద్రించి పంపిణీకి సిద్ధం చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు ఈ ఏడాది విద్యావిధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
మళ్లీ వాయిదా పడిన బోయింగ్ రోదసీ యాత్ర
కేప్ కనావెరల్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర మరోసారి ఆగింది. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో రోదసీలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ప్రయోగం శనివారం చివరినిమిషంలో వాయిదాపడింది. అమెరికాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అట్లాస్ 5 రాకెట్ కౌంట్‌డౌన్‌ను ఇంకా మూడు నిమిషాల 50 సెకన్లు ఉందనగా కంప్యూటర్ ఆపేసింది. ప్రయోగం ఆపేయడానికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లాల్సి ఉంది. ఆదివారంలోగా మరోసారి ప్రయోగానికి ప్రయతి్నస్తామని యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఇంజనీర్ డిలియన్ రైస్ చెప్పారు. ప్రయోగం ఆగిపోవడంతో క్యాప్సూల్‌లోని సునీత, విల్మోర్లను టెక్నీíÙయన్లు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ప్రైవేటు అంతరిక్ష సంస్థకు చెందిన అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సాంకేతిక లోపాల కారణంగా ఈ రాకెట్ ప్రయోగం గతంలో రెండుసార్లు వాయిదా పడింది. అందులో తలెత్తిన సాంకేతిక లోపాలను సరిదిద్ది మంగళవారం తెల్లవారు జామున ప్రయోగానికి సిద్ధం చేశారు. అయితే, ప్రయోగానికి కొద్ది సెకన్ల ముందు మరోసారి సాంకేతిక లోపాన్ని గుర్తించి, ప్రయోగాన్ని నిలిపివేశారు. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నై) అనే ప్రైవేటు ఎస్ఓఆర్ టీఈడీ మిషన్–01 అనే ఈ చిన్న తరహా రాకెట్‌ను రూపొందించింది.సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని ధనుష్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఈ ఏడాది మార్చి 22న తొలిసారి దీనిని ప్రయోగానికి సిద్ధం చేశారు. చివర్లో సాంకేతిక లోపంతో వాయిదా వేశారు. మళ్లీ ఏప్రిల్ నెల 6న మరోసారి ప్రయోగానికి సిద్ధమైనప్పటికీ, సాంకేతికపరమైన కారణాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా పడింది. వీటిన్నింటినీ అ«ధిగమించి మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు మరోసారి ప్రయోగానికి పూనుకొన్నారు. 6 గంటల ముందు నుంచి (సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి) కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఆఖర్లో 11 సెకన్లకు ముందు కమాండ్ కంట్రోల్ సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు.తదుపరి ప్రయోగ తేదీని నిర్దిష్టంగా ప్రకటించలేదు. -
ఎమర్జెన్సీ వాయిదా
భారతదేశంలో అమలు చేయబడిన ఎమర్జెన్సీ కాలం (1975 జూన్ 25–1977 మార్చి 21) నేపథ్యంలో రూపొందిన హిందీ చిత్రం ‘ఎమర్జెన్సీ’. భారత దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఇది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జూన్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ విడుదల వాయిదా పడింది.హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం దేశంలో జరగుతున్న ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారామె. దాంతో కంగనా రనౌత్ రాజకీయాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ సినిమాను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. -
Citizenship Amendment Act: సీఏఏ ఎవరికి లాభం?
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కేరళ, అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఫలితాలను బాగా ప్రభావితం చేసేలా కని్పస్తోంది. ఈ చట్టానికి నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు ఆమోదం లభించినా దేశవ్యాప్త వ్యతిరేకత, ఆందోళనలు తదితరాల నేపథ్యంలో అమలు మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సరిగ్గా ఎన్నికల ముందు దేశమంతటా సీఏఏను అమల్లోకి తెస్తూ మార్చి 11న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఎవరేమన్నా సీఏఏ అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పాలక బీజేపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో సీఏఏ ప్రస్తావనే లేకపోవడంపై విపక్ష ఇండియా కూటమి పక్షాలతో పాటు కేరళ సీఎం విజయన్ విమర్శలు గుప్పించారు. దాంతో, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ వివాదాస్పద చట్టాన్ని పార్లమెంటు తొలి సమావేశాల్లోనే రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి.చిదంబరం ప్రకటించారు. దాంతో సీఏఏపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది.బెంగాల్లో మథువా ఓట్లు బీజేపీకేరాష్ట్రంలో 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీఏఏ హామీతోనే బీజేపీ బాగా బలపడింది. రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైన నామశూద్ర (మథువా) సామాజికవర్గంలో బీజేపీకి ఆదరణ పెరిగింది. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ రికార్డు స్థాయిలో ఏకంగా 18 సీట్లు గెలిచింది. తాజాగా చట్టాన్ని అమల్లోకి తేవడం మరింతగా కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. దళితులైన మథువాలు దేశ విభజన సమయంలో, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సందర్భంగా అక్కడి నుంచి భారీగా బెంగాల్లోకి వలస వచ్చారు. ఉత్తర 24 పరగణాలు, నదియా, పూర్వ బర్ధమాన్, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్ జిల్లాల్లో నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులకు పౌరసత్వం లేదు. అందుకే సీఏఏ చట్టానికి అత్యధికంగా మద్దతిస్తున్నది వీరే. 2019 డిసెంబర్లో పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించినప్పటి నుంచీ దాని అమలు కోసం డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్లో మతువా ఓటర్లు దాదాపు 1.75 కోట్లు ఉన్నట్టు అంచనా! బొంగావ్, బసీర్హాట్, రాణాఘాట్, కృష్ణానగర్, కూచ్ బెహార్ తదితర లోక్‌సభ స్థానాల్లో వీరి ఓట్లు నిర్ణాయకం! వీటిలో ఎస్సీ రిజర్వుడు స్థానాలైన బొంగావ్, రాణాఘాట్, కూచ్ బెహార్ 2019 ఎన్నికల్లో బీజేపీ వశమయ్యాయి. బసీర్హాట్, కృష్ణానగర్ తృణమూల్ పరమయ్యాయి. బొంగావ్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి శంతను ఠాకూర్‌ది మథువా సామాజికవర్గమే. ఈసారి కూడా బీజేపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ముస్లిం జనాభా 30 శాతమని అంచనా.అసోం: అసోం (14)తో కలిపి ఈశాన్య రాష్ట్రాల్లో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. వాటిలోనూ సీఏఏ ప్రభావం బాగా ఉంటుందని అంచనా. బెంగాలీ మాట్లాడే శరణార్థులందరినీ ‘హిందూ–ముస్లింలు’గా, ‘చొరబాటుదారులు’గా స్థానికులు పరిగణిస్తారు. వారికి పౌరసత్వమిస్తే తమ గుర్తింపు, సంస్కృతి, సామాజిక సమీకరణాల వంటివన్నీ తలకిందులవుతాయని పలు ఈశాన్య రాష్ట్రాలు ఆందోళనగా ఉన్నాయి. ముఖ్యంగా అసోం రాజకీయాలు దశాబ్దాలుగా బెంగాలీ వ్యతిరేక భావజాలం చుట్టే కేంద్రీకృతమై ఉన్నాయి. అసోంలో ముస్లింలు ఏకంగా 34 శాతం ఉన్నారు. అసోం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 25కు ముందు శరణార్థులుగా వచ్చిన వారిని ఎన్ఆర్సీలో చేర్చేందుకు వీలు కలి్పంచారు. అలా దరఖాస్తు చేసుకున్న 3.3 కోట్ల మందిలో 19 లక్షల మందిని తుది లెక్కింపులో అనర్హులుగా ప్రకటించారు. వారిలో అత్యధికులు హిందువులే. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నిజమైన భారతీయులను పక్కన పెట్టారంటూ ఆందోళనకు దిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మరో 5 లక్షల పై చిలుకు బెంగాలీ హిందువులకూ తుది ఎన్ఆర్సీలో చోటు దక్కలేదు. వారంతా ఇప్పుడు సీఏఏ నుంచి ప్రయోజనం పొందుతారు. అసోం అస్తిత్వ పరిరక్షణే ప్రధాన నినాదంగా 2016, 2021 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రెండుసార్లూ బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అసోంలో స్థిరపడిన మియా ముస్లింలపై స్థానికంగా ఉన్న ఆగ్రహం కారణంగా సీఏఏకు రాష్ట్రంలో బాగా మద్దతు కనిపిస్తోంది. కేరళ: ఈ దక్షిణాది రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. హిందువులతో పాటు ఇక్కడ అధిక సంఖ్యాకులైన క్రైస్తవ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీకి సీఏఏ కొత్త ఆశాకిరణంగా కనిపిస్తోంది. సీఏఏ అమలు నేపథ్యంలో వారు తమకు మద్దతిస్తారని బీజేపీ భావిస్తోంది. తిరువనంతపురంలో క్రెస్తవుల ఓట్లు 14 శాతానికి పైగా ఉన్నాయి. పథనంతిట్ట త్రిసూర్ లోక్‌సభ స్థానాల పరిధిలోనూ హిందూ, ముస్లింల కంటే క్రైస్తవులే అధిక సంఖ్యాకులు. పలు స్థానిక క్రైస్తవ మిషనరీలు ఇప్పటికే సీఏఏకు మద్దతు పలికాయి. ఇదీ విపక్షాల వాదన!సీఏఏ ప్రకారం పౌరసత్వం పొందేందుకు అర్హుల జాబితాలో ముస్లింలను చేర్చకపోవడాన్ని విపక్షాలన్నీ తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పాక్, అఫ్తాన్, బంగ్లాల్లో ముస్లింలు మైనారిటీలు కారు గనకే చేర్చలేదన్న బీజేపీ వాదన సాకు మాత్రమేనని ఆక్షేపిస్తున్నాయి. పౌరసత్వం లేకుండా భారత్‌లో నివాసముంటున్న లక్షలాది మంది ముస్లింలను వెళ్లగొట్టడమే బీజేపీ లక్ష్యమని ఘాటుగా విమర్శిస్తున్నాయి. సీఏఏను నేషనల్ రిజిస్ట్రర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)తో అనుసంధానించడం వెనక ఉద్దేశం కూడా ఇదేనంటున్నాయి. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలంటూ కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం తదితర పారీ్టలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఏమిటీ సీఏఏ చట్టం...?► విదేశాల్లో మతపరమైన వివక్ష బాధితులై ఊచకోతకు గురైన మైనారిటీలకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ–2019 చట్టం ఉద్దేశం.► పాకిస్తాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో ఇలా మత హింస బాధితులై 2014 డిసెంబర్ 31, అంతకు ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు. ఈ జాబితాలో హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శీ, క్రైస్తవ మైనారిటీలున్నారు.► వారికి సీఏఏ చట్టం కింద ఫాస్ట్‌ట్రాక్ విధానంలో ఆరేళ్లలో భారత పౌరసత్వం కల్పిస్తారు. -
ఈసీ ఆదేశాలు.. ఏపీలో డీఎస్సీ వాయిదా
సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఏపీలో డీఎస్సీ వాయిదా పడింది. నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉండగా, మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ముగిసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4 తర్వాత డిఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 20 నుంచి పరీక్షా కేంద్రాల వెబ్ ఆప్షన్లు, 25 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీలో డీఎస్సీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీని వాయిదా వేయాలని సీఈసీ స్పష్టం చేసేంది కాగా, ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ పరీక్షా ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. -
రజాకార్ వాయిదా.. మరో తేదీ ప్రకటించిన మేకర్స్
బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘రజాకర్’. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లో విడుదల కావాల్సింది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం వల్ల వాయిదా వేసినట్లు శనివారం యూనిట్ ప్రకటించింది. మార్చి 15న రిలీజ్ చేస్తామని తెలిపారు. ‘‘మా చరిత్ర.. మా పూర్వీకుల బాధలు, త్యాగాలు.. ఈ గడ్డ కోసం పోరాడిన వాళ్ల చరిత్ర చెప్పడానికే ఈ సినిమా తీశాను. రజాకార్లు చేసిన అన్యాయాల గురించి చెప్పేందుకే సినిమా చేశాం’’ అని ఇటీవల యాటా సత్యనారాయణ పేర్కొన్నారు. -
Winter Parliament Session 2023: లోక్‌సభ నిరవధికంగా వాయిదా
లోక్‌సభ గురువారం నిరవధికంగా వాయిదా పడింది. శీతాకాల సమావేశాల్లో షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే దిగువ సభ వాయిదా పడడం గమనార్హం. ఈ నెల 4న ప్రారంభమైన ఈ సెషన్‌ను షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న ముగించాల్సి ఉంది. పార్లమెంట్ నూతన భవనంలో పూర్తిస్థాయిలో జరిగిన తొలి సెషన్ ఇదే. ఈసారి సభలో 74 శాతం ప్రొడక్టివిటీ నమోదైనట్లు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. మొత్తం 18 బిల్లులను ఆమోదించినట్లు చెప్పారు. శీతాకాల సమావేశాలు ఈసారి వాడీవేడిగా జరిగాయి. లోక్‌సభలో అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించడం, రంగుల గొట్టాలు ప్రయోగించడం వంటివి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. పార్లమెంట్లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయడం, నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడంతో రికార్డు స్థాయిలో 146 మంది ప్రతిపక్ష ఎంపీలు ఉభయ సభల నుంచి సస్పెండయ్యారు. ప్రశ్నలకు లంచాలు కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై సస్పెన్షన్ వేటు పడింది. -
మా వ్యూహం మాకుంది
‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 10న విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ–‘‘వ్యూహం’ చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదు. దీంతో ప్రస్తుతానికి సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకుంటే ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటాం. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా ‘వ్యూహం’ను రిలీజ్ చేసుకుంటాం. ఈ సినిమా విడుదల ఆపాలని నారా లోకేశ్ సెన్సార్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. అయితే అదెంత నిజమో చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. మీడియా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పినట్లే ‘వ్యూహం’ ద్వారా నా అభిప్రాయాలు చెప్పాను. అది ఎవరైనా వింటారా? లేదా అన్నది అర్థం లేని ప్రశ్న. సినిమా ఇవ్వడం వరకే నా బాధ్యత’’ అన్నారు. ‘‘మా సినిమాను రివైజింగ్ కమిటికీ పంపినా నష్టం జరగదు. మేము అనుకున్నట్లే అన్నీ సకాలంలో జరుగుతాయని ఆశిస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’’అన్నారు దాసరి కిరణ్ కుమార్. -
సభలకు బదులు రోడ్ షోలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభల నిర్వహణకు బదులు ప్రస్తుతానికి కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలకే పరిమితం కావాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలన్నింటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం మినహా ఇతర రాష్ట్రాల నేతలతో రోడ్‌షోల నిర్వహణ కోసం ప్లాన్ వేస్తోంది. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను సభకు తీసుకువచ్చే దాని కంటే ప్రజల్లోకి తామే వెళ్లడం మేలన్న ఆలోచనతో కార్యాచరణ రూపొందిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. రోడ్ షోలలో భాగంగా ఉదయం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయాలని.. సాయంత్రం రోడ్ షోలు నిర్వహించాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీని ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ కొత్త జోష్ వస్తుందని అంటున్నారు. నేటి బస్సు యాత్ర వాయిదా సోమవారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్వహించతలపెట్టిన రెండో విడత బస్సు యాత్ర అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లో తిరిగి యాత్ర ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తెలియజేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అగ్రనేతలతో పెద్ద సభలు ఈ నెల 31న కొల్లాపూర్‌లో ప్రియాంకా గాంధీ బహిరంగ సభ జరగనుంది. దీనితోపాటు అగ్రనేతలతో మరో రెండు, మూడు పెద్ద సభ లు నిర్వహించాలని పీసీసీ నేతలు యోచిస్తు న్నారు. ఈ సభల్లో పార్టీ అతిరథ మహారథు లతో హామీలు ఇప్పించాలని భావిస్తున్నారు. అవి మినహా చాలా వరకు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, బస్సుయాత్రతో ఎన్నికల ప్రచారా న్ని కొనసాగించాలని నిర్ణయించారు. -
గ్రూప్–2 వాయిదాతో విద్యార్థిని ఆత్మహత్య
చిక్కడపల్లి: గ్రూప్–2 పరీక్షలు వాయిదా పడటంతో ఆవేదన చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. వరంగల్‌కు చెందిన ప్రవల్లిక(23) అశోక్ నగర్‌లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్లో ఉంటూ గ్రూప్–2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన ప్రవల్లిక తానుంటున్న హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. చిక్కడపల్లి ఏసీపీ ఏ.యాదగిరి, ఇన్స్పెక్టర్ పి.నరేష్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించే సమయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె సూసైడ్ లెటర్ బయటపెట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోటీ పరీక్షలు నిర్వహించడంలో విఫలమైన కేసీఆర్ సర్కార్ దిగిపోవాలని డిమాండ్ చేశారు. టీఎస్సీఎస్సీని రద్దుచేసి యూపీఎస్సీకి ఇవ్వాలని, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అర్ధరాత్రి దాటే వరకు నిరసన కొనసాగింది. విద్యార్థుల నిరసనకు కాంగ్రెస్, బీజేపీలతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గొచ్చు
న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లీజు ఈ ఏడాదిలో 20 శాతం క్షీణించి 40 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితం కావొచ్చని కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తుండడం ఇందుకు కారణమని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ పట్టణాలపై వివరాలతో కూడిన నివేదికను గురువారం విడుదల చేసింది. స్థూలంగా ఆఫీస్ స్పేస్ లీజు 2023లో 40–45 మిలియన్ ఎస్ఎఫ్టీ మధ్య ఉండొచ్చని, క్రితం ఏడాదిలో ఇది 50.3 మిలియన్ చదరపు అడుగులుగా ఉందని తెలిపింది. కాకపోతే ఈ ఏడాది మార్చిలో వేసిన అంచనా కంటే ఎక్కువే ఉంటున్నట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జూన్ వరకు) 24.7 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజు నమోదైంది. ద్వితీయ ఆరు నెలల్లో (డిసెంబర్ వరకు) మరో 15.3–20.3 మిలియన్ చదరపు అడుగుల మధ్య ఉంటుందని అంచనా వేసింది. స్థూల లీజు పరిమాణంలో రెన్యువల్స్‌ను కలపలేదు. వెలుపలి డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ, బలమైన ఆర్థిక కార్యకలాపాలు ఆఫీస్ స్పేస్ లీజు ఈ మాత్రం మెరుగ్గా ఉండడానికి మద్దతుగా నిలిచినట్టు వివరించింది. ‘‘జనవరి–మార్చి మధ్య 10.1 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర కార్యాలయ స్థలాలు భర్తీ అయ్యాయి. తర్వాతి మూడు నెలల కాలంలో ఇది మరింత పుంజుకున్నది. ఏప్రిల్–జూన్ మధ్య 14.6 మిలియన్ చదరపు అడుగులు మేర లీజు నమోదైంది. త్రైమాసికం వారీగా చూస్తే 46 శాతం పుంజుకున్నది’’అని కొలియర్స్ ఇండియా వివరించింది. పట్టణాల వారీగా.. బెంగళూరులో అత్యధికంగా 12–14 మిలియన్ ఎస్ఎఫ్టీ కార్యాలయ స్థలాల లీజు నమోదైంది. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 9–11 మిలియన్ ఎస్ఎఫ్టీ, చెన్నైలో 7–9 మిలియన్ చదరపు అడుగుల మేర కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. హైదరాబాద్, ముంబై, పుణె మార్కెట్లలో ఇది 4–6 మిలియన్ చదరపు అడుగుల మధ్య ఉంది. సరఫరాకు తగ్గట్టు లీజు పరిమాణం నమోదు అవుతుండడం, ఖాళీ స్థలాలు ఫ్లాట్‌గానే ఉండడం వల్ల అద్దెలు పెరిగే అవకాశం ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. ఆఫీస్ స్పేస్ డిమాండ్ మృదువుగా ఉన్నప్పటికీ, ఫ్లెక్సిబుల్ వర్క్స్పేసెస్కు డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నట్టు ఈ విభాగంలో సేవలు అందించే అర్బన్వోల్ట్ సహ వ్యవస్థాపకుడు అమల్ మిశ్రా తెలిపారు. -
‘గ్రూప్-2’పై 14న నిర్ణయం ప్రకటిస్తాం: టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష వాయిదా కోరుతున్న అభ్యర్థులు.. గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అభ్యర్థులు తమ ధర్నాతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మరోవైపు గ్రూప్-2 వాయిదా కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. మిగిలిన పరీక్షల నేపథ్యంలో గ్రూప్2 వాయిదా వేయాలని అభ్యర్థులు కోర్టును అభ్యర్థించగా.. ఇప్పటికే పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ తరుణంలో వాయిదా కష్టమని టీఎస్పీఎస్సీ కౌన్సిల్ తమ వాదనలు వినిపించింది. అయితే.. గ్రూప్-2 పరీక్ష నిర్వాహణపై సోమవారం(ఆగష్టు 14వ తేదీ) స్పష్టమైన ప్రకటన చేస్తామని టీఎస్పీఎస్సీ కౌన్సిల్ హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో కచ్చితంగా ఆ తేదీ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. సోమవారానికి విచారణ వాయిదా వేసింది కోర్టు. అభ్యర్థుల వాదనలు.. ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అయితే.. గ్రూప్-2 పరీక్ష ను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గురుకుల టీచర్ తో పాటు పాలిటెక్నిక్ జూనియర్ లెక్చర్ల పరీక్షల నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా కోరుతున్నారు. అగస్ట్ 2నుండి 30వరకు రకరకాల పరీక్షలు జరగనున్నాయని, గ్రూప్ 2 రాసే అభ్యర్థులు మిగిలిన పరీక్షలు కూడా రాస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పరీక్షల సిలబస్ వేరు, దీంతో అన్ని పరీక్షలకు ఒకే నెలలోనే ప్రిపేర్ అయి రాయడం సాధ్యం కాదు. మొత్తంలో 90 శాతం మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్ష నిర్వయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. Tspsc కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష కోసం 5.5 లక్షలు మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ గురుకుల్ పరీక్ష కు 60 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే గ్రూప్-2 పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. 1,535 సెంటర్లను ఎంపిక చేశాం. పరీక్షలు జరిగే స్కూల్,కాలేజ్ లకు సెలవులు ప్రకటించాం. ఐదున్నర లక్షల మంది అభ్యర్థుల్లో.. పిటిషన్ వేసింది కేవలం 150 మంది మాత్రమే. అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సోమవారం స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తాం అని టీఎస్పీఎస్సీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. దీంతో సోమవారానికి పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇదీ చదవండి: టీఎస్పీఎస్సీ.. పరీక్షల నిర్వహణ పరీక్షే! -
నవంబర్ నుంచి కంప్యూటర్లపై ఆంక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీల దిగుమతులపై విధించిన ఆంక్షల అమలును మూడు నెలలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దిగుమతులపై విధించిన ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) వెల్లడించింది. ఎల్రక్టానిక్స్ కంపెనీలు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీలను భారత్‌కు దిగుమతి చేసుకోవాలంటే నవంబర్ 1 నుంచి ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరి. కాగా, లైసెన్స్ కలిగిన కంపెనీలు మాత్రమే ఈ పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, ఉత్తర్వులు వెంటనే అమలులోకి తీసుకువస్తున్నట్టు ఆగస్ట్ 3న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కంప్యూటర్లలో అంతర్గత భద్రత లొసుగులతో కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తుల డేటాకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్న కారణంతో తప్పనిసరి లైసెన్స్ విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. -
‘ఇండియా’ కూటమి భేటీ వాయిదా?
న్యూఢిల్లీ: ముంబైలో ఆగస్ట్‌లో జరగాల్సిన ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల భేటీ సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కూటమిలోని కొందరు నేతలు ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నామంటున్నందున ఆగస్ట్ 25, 26వ తేదీల్లో సమావేశం జరక్కపోవచ్చని విశ్వసనీయ వర్గాలంటున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఢీకొట్టే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీల నేతల మొదటి రెండు సమావేశాలు పట్నా, బెంగళూరుల్లో జరిగిన విషయం తెలిసిందే. -
గ్రూప్-2 వాయిదా వేయండి.. టీఎస్పీఎస్సీ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఆగష్టు 29, 30తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా.. భారీగా ట్రాఫిక్ ఝామ్ అయ్యింది. ఇప్పటికే గ్రూప్ - 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 వంటి పరీక్షలను పూర్తి చేయగా.... గ్రూప్ - 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. పేపర్ లీకేజీ వ్యవహారంతో బోర్డు ప్రతిష్ట మసకబారిపోగా.. ఇక నుంచైనా అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది. గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోజుల్లో మిగతా ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. మరోవైపు.. జీవో నెంబర్ 46 రద్దు కోరుతూ డీజీపీ కార్యాలయం ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు సైతం ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. -
ఎనిమిదేళ్ల తర్వాత అవతార్ 5
ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన హాలీవుడ్ ‘అవతార్’, సూపర్ హీరోని చూపించిన మార్వెల్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే ఇటు ‘అవతార్’ సీక్వెల్స్ అటు ‘మార్వెల్’ ఫ్రాంచైజీల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ రెండు భారీ ్ర΄ాజెక్ట్స్ని హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ రాజీపడకుండా నిర్మిస్తుం టుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ తొలి భాగం 2009లో రాగా, రెండో భాగం రావడానికి పదమూడేళ్లు పట్టింది. గత ఏడాది ‘అవతార్ 2’ విడుదలైంది. మూడు, నాలుగు, ఐదో భాగం కూడా ఉంటాయని చిత్ర యూనిట్ ప్రకటించి, విడుదల తేదీలను కూడా ప్రకటించింది. అయితే తేదీలు వాయిదా పడ్డాయి. ఇక ‘మార్వెల్’ ఫ్రాంచైజీలను ఒకే దర్శకుడు కాకుండా వేరు వేరు డైరెక్టర్లు తెరకెక్కించే విషయం తెలిసిందే. ఈ చిత్రాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి. 2031లో ఫైనల్ అవతార్ తొలుత ‘అవతార్’ మూడో భాగాన్ని 2024లో, నాలుగో భాగాన్ని 2025లో, ఐదో భాగాన్ని 2028లో విడుదలకు మేకర్స్ ΄్లాన్ చేశారు. అయితే వాయిదా వేశారు. ఈ విషయాన్ని వాల్ట్ డిస్నీ సంస్థ బుధవారం ప్రకటించింది. మూడో భాగాన్ని 2025 డిసెంబర్ 19న, నాలుగో భాగాన్ని 2029 డిసెంబర్ 21న, ఐదో భాగాన్ని.. అంటే ఫైనల్ ‘అవతార్’ని 2031 డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ‘‘ఒక్కో ‘అవతార్’ సినిమా ఒక్కో అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఇవ్వడానికి ఫిలిం మేకర్స్‌గా మేం తగినంత కృషి చేస్తున్నాం. నాణ్యత విషయంలో రాజీపడేది లేదు. 2025లో థియేటర్స్‌లో పండోరా ప్రపంచాన్ని చూపించడానికి యూనిట్ హార్డ్‌వర్క్ చేస్తోంది’’ అని చిత్ర నిర్మాతల్లో ఒకరైన జాన్ లాండవ్ అన్నారు. ఏడాదికి రెండు మార్వెల్ చిత్రాలు వాల్ట్ డిస్నీ ఓ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్న మార్వెల్ చిత్రాలు చాలా ఫేమస్. ఇప్పటికి దాదాపు 30 చిత్రాలు రాగా, మార్వెల్ ఫ్రాంచైజీలో మరో 10 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా... ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించిన చిత్రాల కొత్త విడుదల తేదీలను నిర్మాణ సంస్థ ప్రకటించింది. మార్వెల్ ఫ్రాంచైజీలో వచ్చే ఏడాది మే 3న ‘డెడ్ పూల్ 3’ విడుదల కానుండగా అదే తేదీన విడుదలకు షెడ్యూల్ అయిన ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్’ జూలై 24కి వాయిదా పడింది. కాగా, ‘థండర్ బోల్ట్స్’ని జూలై 24న విడుదల చేయాలనుకున్నారు కానీ, డిసెంబర్ 20కి వాయిదా వేశారు. వచ్చే ఏడాది ఆరు నెలల గ్యాప్‌లో ఈ రెండు చిత్రాలు వస్తాయి. ఇక 2025లో కూడా రెండు మార్వెల్ చిత్రాలు రానున్నాయి. ‘బ్లేడ్’ని 2025 ఫిబ్రవరి 14న, అదే ఏడాది మే 2న ‘ఫెంటాస్టిక్ ఫోర్’ని, ‘ఎవెంజర్స్: ది కాంగ్ డైనాస్టీ’ని 2026 మే 1న, ‘ఎవెంజర్స్: సీక్రెట్ వార్స్’ని 2027 మే 7న విడుదల చేయనున్నారు. -
సంస్కరణలు నెలపాటు వాయిదా
జెరూసలేం: ప్రజాగ్రహానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తలొగ్గారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల ప్రణాళికను నెల పాటు వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్‌ను చీల్చడానికి శత్రువులు ప్రయత్నిస్తున్నారు. వారికి అవకాశం ఇవ్వొద్దు. ఆందోళనలు విరమించండి. హింసకు దూరంగా ఉండండి’’ అని ప్రజలకు సూచించారు. పార్లమెంట్ వేసవి సమావేశాలు ఏప్రిల్ 30న పునఃప్రారంభం కానున్నాయి. సంస్కరణలపై బిల్లును వాటిలో ప్రవేశపెట్టాలని నెతన్యాహూ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సంస్కరణలను శాశ్వతంగా పక్కన పెట్టాలని నిరసనకారులు తేల్చిచెప్పారు. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సోమవారం వేలాదిగా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. సంస్కరణలపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాలన్నదే నెతన్యాహూ ఉద్దేశమని తెలుస్తోంది. -
Sri Lanka: పాపం శ్రీలంక.. నిధులు లేక ఎన్నికలు వాయిదా..!
కొలంబో: అప్పుల ఊబిలో చిక్కుకుని తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ప్రభుత్వ ఖజానా ఎప్పుడో ఖాళీ కావడంతో కనీసం ఎన్నికలు నిర్వహించేందుకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మార్చి 9న నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 3న కొత్త తేదీలను వెల్లడించే అవకాశం ఉంది. శ్రీలంక విదేశీ మారక నిల్వలు 500 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఆర్థికి పరిస్థితి అద్వాన్నంగా మారడంతో ఈ దేశానికి అప్పులు ఇవ్వకుండా ఐఎంఎఫ్, పారిస్ క్లబ్ ఆంక్షలు విధించాయి. దీంతో మిత్ర దేశం చైనా కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చే సూచనలు కన్పించడం లేదు. దీంతో తమపై ఐఎంఎఫ్ ఆంక్షలు ఎత్తివేసేలా చూసి అమెరికా, జపాన్ తమను ఆదుకుంటాయేమోనని లంక గంపెడు ఆశలు పెట్టుకుంది. ఐఎంఎఫ్ ప్రతిపాదించిన విధంగా 10 సంవత్సరాల రుణ మారటోరియంతో ఆర్థిక సహాయం కోసం చైనా వైపు శ్రీలంక చూస్తున్నప్పటికీ అలా జరిగే సూచనలు కన్పించడం లేదు. అసలు సమస్య ఏంటంటే ఒకవేళ శ్రీలంకకు చైనా సాయం చేయాల్సి వస్తే ఇతర దేశాలకు కూడా ఆర్థిక సాయాన్ని అందించవలసి ఉంటుంది. ఆఫ్రికాలో బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)తో పాటు, తమ చిరకాల మిత్ర దేశం పాకిస్తాన్‌కు కూడా చైనా ఆర్థిక సాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే పాకిస్తాన్‌కు 700 మిలియన్ డాలర్ల రుణాన్ని రీఫైనాన్స్ చేసింది తప్ప కొత్తగా రుణాలు ఇవ్వలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకారం ఆ దేశ విదేశీ మారకపు నిల్వలు 3.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది మూడు వారాల దిగుమతికి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్, శ్రీలంకలో పరిస్థితులు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితితో రెండు దేశాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రజలు తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: 'పుతిన్‌కు నెక్ట్స్ బర్త్‌డే లేదు.. ఏడాది కూడా బతకడు..!' -
‘విక్రమ్’ ప్రయోగం వాయిదా
న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారిగా ప్రైవేట్‌రంగంలో రూపుదిద్దుకున్న విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా మూడ్రోజులు వాయిదాపడింది. నవంబర్ 15న చేపట్టాల్సిన ప్రయోగాన్ని నవంబర్ 18న ఉదయం 11.30కి నిర్వహిస్తామని దాని తయారీదారు, హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. శ్రీహరికోటలోని ఇస్రోకు చెందిన సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం వేదిక నుంచి దీనిని ప్రయోగిస్తారు. -
కాంగ్రెస్ మెగా ర్యాలీ వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యకు నిరసనగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ నెల 28వ తేదీన తలపెట్టిన తలపెట్టిన మెగా ర్యాలీ వాయిదా పడింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సెప్టెంబర్ 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ గురువారం తెలిపారు. దేశ రాజధానిలో కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని మెగా ర్యాలీని వాయిదా వేసినట్లు వెల్లడించారు. వచ్చే నెల 4న నిర్వహించబోయే భారీ ర్యాలీతో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బలమైన సందేశం పంపిస్తామని అన్నారు. ప్రజా సమస్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 22న రాష్ట్ర స్థాయిలో, 25న జిల్లా స్థాయిలో, 27న బ్లాక్ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. అలాగే సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్రకు సిద్ధమవుతోంది. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్ దాకా ఆ యాత్ర సాగనుంది. -
కొత్త బండి వద్దు బాస్.. పాతదయితేనే మేలు !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బండి ఇప్పుడు వద్దు. తరువాత కొందాం.. ఇదీ అత్యధికుల మాట. కోవిడ్–19 మహమ్మారి తదనంతర ప్రభావమే ఈ వాయిదా నిర్ణయానికి కారణం. కార్ ట్రేడ్ టెక్ మొబిలిటీ ఔట్లుక్ నివేదిక ప్రకారం ఫోర్ వీలర్‌ను కొనుగోలు చేసే విషయంలో 80 శాతం మంది వాయిదాకే మొగ్గు చూపారట. అదే ద్విచక్ర వాహనాల విషయంలో ఈ సంఖ్య 82 శాతముంది. దేశవ్యాప్తంగా 2022 మార్చి 3–12 మధ్య ఇండియన్ ఆటోమోటివ్ కంజ్యూమర్ కాన్వాస్ పేరుతో 2,56,351 మంది వినియోగదార్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కార్ ట్రేడ్ టెక్ మొబిలిటీ ఔట్లుక్ విడుదల చేసింది. వాహన కొనుగోళ్లను వాయిదా వేసే వ్యక్తుల సంఖ్య 2022లో పెరిగింది. కోవిడ్–19 ప్రభావాల నుండి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని నివేదిక వివరించింది. ఈవీల విషయంలో ఇలా.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) డిమాండ్ ఊపందుకుంది. 40 శాతం ద్విచక్ర వాహనదార్లు ఈ ఏడాది ఈవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 2021లో ఈ సంఖ్య 37 శాతముంది. ఈవీ పట్ల ఆసక్తి చూపుతున్న ఫోర్ వీలర్ కస్టమర్ల సంఖ్య గతేడాది మాదిరిగానే 33 శాతముంది. సర్వే సానుకూల సెంటిమెంట్‌ను సూచిస్తోందని కార్ ట్రేడ్ టెక్ కంజ్యూమర్ బిజినెస్ సీఈవో బన్వారి లాల్ శర్మ తెలిపారు. ‘ప్రజలు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నారు. కస్టమర్ల నిర్ణయాలను ప్రభావితం చేసే అనేక అంశాలున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ తన అమ్మకాలను పెంచుకోవడానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి పెట్టాలి’ అని వివరించారు. ప్రీ–ఓన్డ్‌కు కస్టమర్ల సై.. పాత వాహనం (ప్రీ–ఓన్డ్) కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2021లో వీరి సంఖ్య 14 శాతముంటే.. ఇప్పుడు 20 శాతానికి చేరింది. లీజింగ్, ప్రీ–ఓన్డ్, సబ్స్క్రిప్షన్ మోడల్ విధానాన్ని ఎంచుకోవాలని 26 శాతం మంది భావిస్తున్నారు. కొత్త వెహికిల్ కొనడం కోసం దాచుకున్న డబ్బులు, పాత వాహనం విక్రయంపైనే 18 శాతం మంది నమ్మకం పెట్టుకున్నారట. గతేడాది ఈ సంఖ్య 14 శాతముంది. ఆన్లైన్లో కొనుగోలుకు 49 శాతం మంది ఓకే ఆన్నారట. వాహనాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం లేనందున ఆన్లైన్ పట్ల ఆసక్తి లేకపోవడానికి కారణమని 28 శాతం మంది తెలిపారు’ అని నివేదిక వివరించింది. ప్రీ–ఓన్డ్‌ను ఎంచుకునే వారి సంఖ్య 20 రెట్లు పెరిగిందని ఎవర్ కార్స్ ఎండీ కృష్ణ తిరుగుడు వెల్లడించారు. అదనపు ఖర్చు లేకపోవడం, తక్కువ ధర, మంచి కండీషన్, మెరుగైన మోడల్ లభించడం ఈ స్థాయి డిమాండ్‌కు కారణమన్నారు. -
ఎల్ఐసీ ఐపీవో వాయిదా!
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశముంది. రష్యా– ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలియజేశారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ ఆటుపోట్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు ప్రస్తావించారు. దీంతో ఎల్ఐసీ వాటా విక్రయ అంశాన్ని పునఃపరిశీలించే వీలున్నట్లు తెలియజేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లోనే చేపట్టేందుకు కట్టుబడితే.. ఇది ప్రగతిశీల విషయమేనని వ్యాఖ్యానించారు. అయితే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. ‘2022 ఎకనమిక్స్ ఆఫ్ కాంపిటీషన్ లా’పై నిర్వహించిన ఏడో జాతీయ సదస్సులో భాగంగా పాండే ఈ విషయాలను ప్రస్తావించారు. ఈ నెల 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పాండే వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఏడాదికి సవరించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 78,000 కోట్లను సాధించే బాటలో ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటా విక్రయానికి ప్రణాళికలు వేసిన విషయం విదితమే. -
ఊ అంటావా.. ఊహూ అంటావా .. కరోనా
ఊ అంటావా కరోనా.. ఊహూ అంటావా కరోనా... రమ్మంటావా కరోనా.. రావొద్దంటావా కరోనా.. రెండేళ్లుగా సినిమాల విడుదల విషయంలో కరోనా ఇలానే దోబూచులాడుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని, తెరపై ప్రత్యక్షమవడమే ఆలస్యం అనుకునే టైమ్‌లో కరోనా విజృంభించి ‘ఊహూ’ అంటోంది... ‘రావద్దంటోంది’. కరోనా ఎఫెక్ట్‌తో జనవరి, ఫిబ్రవరి నెలల్లో రావాల్సిన సినిమాలు ఏప్రిల్‌కి వాయిదా పడ్డాయి. అయితే ఆరేడు సినిమాల వరకూ పెద్దవే కావడంతో డేట్ల సర్దుబాబు, థియేటర్ల సర్దుబాటు... ఇలా ఎన్నో సర్దుబాట్లు అవసరం. మరి.. అన్ని సర్దుబాట్లూ చేసుకుని తీరా రిలీజ్ టైమ్‌కి కరోనా ‘ఊ’ అంటుందా... ‘రావొద్దు’ అంటుందా అనేది సమ్మర్లో తెలుస్తుంది. ఇక సమ్మర్లో మెయిన్ సీజన్ అయిన ఏప్రిల్‌లో విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం. ఏప్రిల్ ఎండలు పుంజుకునే టైమ్‌కి నెల తొలి రోజే రావడానికి రెడీ అవుతున్నాడు ‘ఆచార్య’. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల కానుంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే ఓ జంటగా చేశారు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇదిలా ఉంటే.. ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ 1న రిలీజ్‌కు ప్రకటించక ముందే ఇదే తేదీని ముందుగా బుక్ చేసుకుంది ‘సర్కారువారి పాట’ చిత్రం. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ కథానాయిక. నవీన్ ఎర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇటీవల మహేశ్ కాలికి సర్జరీ జరగడం, ఆ తర్వాత కరోనా బారిన పడటం, అలాగే ఈ చిత్రానికి చెందిన కొందరు సాంకేతిక నిపుణులు కూడా కోవిడ్ బారిన పడటంతో ‘సర్కారువారి పాట’ చిత్రం విడుదల ఆగస్టుకు వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి. కానీ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1నే విడుదల చేసే సాధ్యాసాధ్యాలను ఈ చిత్రం యూనిట్ పరిశీలిస్తోందని తెలిసింది. మరి.. ఏప్రిల్ 1నే ‘ఆచార్య’, ‘సర్కారువారి పాట’ విడుదలవుతాయా? ఏదైనా చిత్రం వాయిదా పడుతుందా? మరోవైపు ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యేందుకు ‘కేజీఎఫ్ 2’ ఆల్రెడీ కర్చీఫ్ వేసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాఫ్టర్ 1’కు కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ వస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఇక ఇదే నిర్మాత నిర్మిస్తోన్న మరో భారీ చిత్రం ‘సలార్’ కూడా ఏప్రిల్ 14 విడుదల జాబితాలో ఉంది. ఈ తేదీని చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. అయితే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, ‘సలార్’ చిత్రాలకు ఒకే నిర్మాత, ఒకే దర్శకుడు కాబట్టి, పైగా ‘కేజీఎఫ్ 2’తో పోల్చితే ‘సలార్’ షూటింగ్ ఇంకా చాలా ఉంది కాబట్టి ఈ చిత్రం వాయిదా పడుతుందనే ప్రచారం సాగుతోంది. ‘సలార్’ దసరాకు విడుదలయ్యే చాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. కాగా ఏప్రిల్ 14నే నాగచైతన్య తెరపై కనిపించనున్నారు. కానీ నాగచైతన్య హీరోగా చేసిన చిత్రంతో కాదు. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన ‘లాల్‌సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీ రోల్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న హిందీతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇంకోవైపు సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా çపడిన చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎఫ్ 3’. వెంకీ–వరుణ్–అనిల్ కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ ఏప్రిల్ 29న థియేటర్స్‌కు రానుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా ఇదే తేదీన విడుదలకు రెడీ అవుతోంది. ఎమ్ఎస్ రాజశేఖర రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్. ఇక సమంత నటించిన తొలి మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’ కూడా సమ్మర్ లిస్ట్‌లోనే ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు చిత్రనిర్మాతలు ‘దిల్’ రాజు, నీలిమ గుణ తేదీలు పరిశీలిస్తున్నారని సమాచారం. ఇవే కాదు.. మరికొన్ని మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాలు కూడా ఏప్రిల్ రిలీజ్‌ను టార్గెట్ చేసుకుంటున్నాయి. మరి.. సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఏప్రిల్ మంచి సీజన్ కదా. ఏప్రిల్ వైపు ‘ఆర్ఆర్ఆర్’ చూపు? ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియన్ మూవీ ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్). ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం నెక్ట్స్ రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై అన్ని ఇండస్ట్రీస్‌లో చర్చ జరుగుతోంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ని ఏప్రిల్ 29న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్’ ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్‌ను కన్ఫార్మ్ చేసుకుంటే ‘ఎఫ్ 3’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాల విడుదల్లో మార్పు జరిగే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు. వేసవిలో తెలుగు సినిమాలతో పాటు తమిళ అనువాద చిత్రాలు కూడా విడుదలవుతుంటాయి. ఈ వేసవికి కమల్‌హాసన్ ‘విక్రమ్’, విజయ్ ‘బీస్ట్’, దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వీటిలో ముందుగా విజయ్ ‘బీస్ట్’ ఏప్రిల్ 14న విడుదల అవుతుందని కోలీవుడ్ టాక్. రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ ‘విక్రమ్’ కూడా ఏప్రిల్‌లోనే రానున్నట్లు తెలిసింది. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్ తదితరులు నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ తొలి పార్ట్ వేసవిలోనే రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. కేంద్రానికి ఈసీ కీలక సూచన
ఒమిక్రాన్ భయాందోళనల నడుమ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఎన్నికలు జరిగే ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. 2022 ఏడాది మొదట్లో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతుండడం, మరోవైపు ఒమిక్రాన్ ఉధృతి పెరిగే అవకాశాలు ఉండడంతో ఈసీ, కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. ఎన్నికలు, ర్యాలీల నిర్వహణతో కేసులు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నడుమ.. సోమవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో భేటీ సందర్భంగా ఈసీ ఈ కీలక సూచన చేసింది. వాయిదా ప్రసక్తే లేదు! ఒమిక్రాన్ విజృంభించే నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసే అంశం పరిశీలించాలంటూ ప్రధాని మోదీ, ఈసీని ఉద్దేశించి అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్లపై చీఫ్ ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర స్పందిస్తూ.. యూపీ పరిస్థితుల సమీక్ష తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖతో చర్చలు, ఆయా రాష్ట్రాల్లో పర్యటనకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. అయితే సోమవారం చర్చల అనంతరం ఎన్నికలు వాయిదా వేసే ఉద్దేశంలో ఈసీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ మేరకు వ్యాక్సినేషన్ పెంచాలంటూ కేంద్రంతో చేసిన సూచనలే అందుకు నిదర్శనం. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్, గోవాలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ వంద శాతానికి చేరువైందని, ఉత్తర ప్రదేశ్‌లో 85 శాతం, మణిపూర్ పంజాబ్‌లో 80 శాతం పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ఈసీ, కేంద్రాన్ని కోరింది. వరుస భేటీలు ఆరోగ్య కార్యదర్శి కాకుండా.. ఇంకోవైపు ఐటీబీపీ, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ దళాలను అప్రమత్తం చేస్తోంది ఎన్నికల కమిషన్. ఈ మేరకు ఆయా విభాగాల హెడ్లతో సమావేశమవుతోంది. అంతేకాదు పంజాబ్, గోవా ఎన్నికల్లో డ్రగ్స్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఎన్బీఐని సైతం అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఈసీ ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. చదవండి: PM Modi Mann Ki Baat.. స్వీయ అప్రమత్తతే దేశానికి బలం -
IND vs NZ: రెండో టి20ని వాయిదా వేయండి.. హైకోర్టులో పిల్ దాఖలు
India vs New Zealand 2021 2nd T20I: PIL Filed in Jharkhand HC for Postponement of 2nd T20: టీమిండియా, కివీస్‌ల మధ్య రెండో టి20 నవంబర్ 19న రాంచీ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను వాయిదా వేయాలంటూ దీరజ్ కుమార్ అనే లాయర్ జార్ఖండ్ హైకోర్టులో గురువారం పిల్ దాఖలు చేశారు. స్టేడియంలో వంద శాతం ప్రేక్షకులను ఎలా అనుమతి ఇస్తారంటూ ఆయన తన వాజ్యంలో పేర్కొన్నారు. కరోనా నిబంధనల కారణంగా ప్రజలు ఎక్కువగా గూమిగూడే మాల్స్, సినిమా థియేటర్స్, షాపింగ్ క్లాంపెక్స్ వంటి ప్రదేశాల్లో 50శాతం మందిని మాత్రమే అనుమతించాలని రాష్ట్రంలో్ నిబంధన ఉంది. ఇప్పుడు క్రికుట్ మ్యాచ్ పేరుతో 100 శాతం సీటింగ్‌కు అనుమతించడం కరెక్టు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మ్యాచ్‌కు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని లేదంటే మ్యాచ్‌ను వాయిదా వేయాలని కోర్టును కోరారు. చదవండి: Rishab Pant: ధోనిలా అద్బుతాలు చేస్తాడని ఆశించా.. అలా జరగడం లేదు అయితే రాంచీ వేదికగా జరగనున్న టి20 మ్యాచ్‌కు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మాత్రం మ్యాచ్ జరగనున్న స్టేడియానికి అన్ని సీట్లకు టికెట్స్ బుక్ చేసుకోవచ్చని ప్రకటన ఇవ్వడం వైరల్‌గా మారింది. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టి20లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: Rachin Ravindra Facts: ఎవరీ రచిన్ రవీంద్ర.. సచిన్, ద్రవిడ్‌తో ఏంటి సంబంధం? -
తెలంగాణ అసెంబ్లీ 3 రోజుల పాటు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని శాసనసభ స్పీకర్ పోచా రం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రొటెమ్ చైర్మన్ భూపాల్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్, ప్రొటెమ్ చైర్మన్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి సోమవారం రాత్రి బులెటిన్ విడుదల చేశారు. అక్టోబర్ ఒకటో తేదీ, శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. భారీ వర్షాల నేపథ్యంలో తాము నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. దీంతో అధికార, విప క్ష నేతలను సంప్రదించిన అనంతరం సమావేశాల వాయిదా నిర్ణయం తీసుకున్నారు. చదవండి: తెలంగాణ: రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా -
అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు మళ్లీ వాయిదా
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందేలా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్న తాలిబన్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటును వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆ ముఠా అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ విభాగం చీఫ్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా శనివారమే అఫ్గాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ, చర్చలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే వారం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల మద్దతు లభించేలా ప్రభుత్వాన్ని కూర్చే పనిలో ఉండడం వల్లే కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోందని తాలిబన్ చర్చల కమిటీ సభ్యుడు ఖలీల్ హక్కానీ చెప్పారు. తాలిబన్లకి ఇప్పటికే మద్దతు ప్రకటించిన జమైత్ ఏ ఇస్లామీ అఫ్గానిస్తాన్ చీఫ్, దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సోదరుడైన గుల్బుద్దీన్ హెక్మత్యార్కు ప్రభుత్వంలో చోటు లభించనుంది. పంజ్ïÙర్లో కొనసాగుతున్న పోరాటం అఫ్గానిస్తాన్‌లో పంజ్ïÙర్ లోయ ఇంకా తాలిబన్ల వశం కాలేదు. శనివారం మళ్లీ ఇరు వర్గాల మధ్య పోరాటం మొదలైంది. ఇప్పటివరకు తాలిబన్ల కన్ను పడని పంజ్ïÙర్ను ఆక్రమించుకున్నట్టుగా శుక్రవారం వార్తలు వచ్చాయి. అయితే అవి కేవలం వదంతులేనని తేలింది. పంజ్ïÙర్ తమ స్వాధీనంలోకి వచి్చందని ఇప్పటివరకు తాలిబన్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోవియెట్ యూనియన్ ఆక్రమణలో ఉన్నప్పుడు, తాలిబన్ల పరిపాలనలోనూ పంజ్ïÙర్ స్వతంత్రంగానే వ్యవహరించింది. 1996–2001 మధ్య కాలంలో తాలిబన్లు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఆ ప్రాంతాన్ని కూడా తమ వశం చేసుకోవాలని తాలిబన్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమరుల్లా సలే, తాలిబన్లను తీవ్రంగా వ్యతిరేకించే అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్‌ల అ«దీనంలో పంజ్‌షీర్ లోయ ఉంటుంది. గాల్లోకి కాల్పులు.. 17 మంది మృతి! పంజ్ïÙర్ తాలిబన్ల పరమైందని వదంతులు వ్యాపించడంతో రాజధాని కాబూల్‌లో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కాల్పుల్లో 17 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది. అయితే వారు అలా సంబరాలు చేసుకోవడాన్ని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తప్పు పట్టారు. ఆయుధాలనేవి ప్రభుత్వ ఆస్తి అని, వాటిని గాల్లోకి పేలుస్తూ వృథా చేయరాదని హితవు చెప్పారు. మహిళా కార్యకర్త తలకి గాయాలు మహిళలు తమ హక్కుల్ని కాపాడాలంటూ చేస్తున్న ఉద్యమాన్ని తాలిబన్లు అణగదొక్కేస్తున్నారు. మహిళలు తమ రాజకీయ హక్కుల్ని కాపాడా లంటూ అధ్యక్ష భవనం వరకు తీసిన ర్యాలీని తాలిబన్లు అడ్డుకొని బాష్పవాయువు ప్రయోగిం చారు. మహిళల్ని విచక్షణారహితంగా కొట్టినట్టుగా టోలో న్యూస్ వెల్లడించింది. ఉద్యమకారిణి నర్గీస్ సద్దాత్ను చితకబాదారు. తలకి బలమైన గాయంతో ముఖమంతా నెత్తురోడుతూ ఆమె ఆ నిరసన ప్రదర్శనలో కనిపించారు. అందరినీ కలుపుకొని పోవాలి: అమెరికా తాలిబన్లు ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాము ఆశిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. ఉగ్ర వాదాన్ని నిరోధించడం, మహిళలు, మైనారీ్టల హ క్కుల్ని గౌరవించడంలో తమ చిత్తశుద్ధి చూపించాలన్నారు. మరోవైపు అఫ్గాన్‌లో మానవ సంక్షోభం, ఆరి్థక సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 13న జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం కానుంది. కాబూల్‌కు ఐఎస్ఐ చీఫ్ ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు మంతనాలు, మరోవైపు పంజ్ïÙర్లో కొనసాగుతున్న పోరాటం నేపథ్యంలో పాకిస్తాన్లో అత్యంత శక్తిమంతమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయీజ్ హమీద్ కాబూల్‌కు చేరుకున్నారు. ఆయన వెంట పాక్ అధికారుల బృందం కూడా వచి్చంది. తాలిబన్ల ఆహా్వనం మేరకే హమీద్ అఫ్గాన్ వచ్చారని, రెండు దేశాల భవితవ్యంపై చర్చలు జరిపి, కలసికట్టుగా వ్యూహరచన చేయనున్నట్టుగా పాకిస్తాన్ అబ్జర్వర్ పత్రిక వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఐఎస్ఐ చీఫ్‌ను ఆహా్వనించడంతో వారిమధ్య సుదృఢ బంధాలు తేటతెల్లమవుతున్నాయి. తాలిబన్ అగ్ర నేతలు, కమాండర్లతో ఐఎస్ఐ చీఫ్ çచర్చలు జరపనున్నారు. -
IPL 2021: రూ. 2,200 కోట్ల నష్టం!
ముంబై: ఐపీఎల్ అనూహ్యంగా వాయిదా పడటంతో దీనికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలపై చర్చ మొదలైంది. లీగ్ ఆగిపోవడంతో బీసీసీఐకి సుమారు రూ. 2,200 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. లీగ్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా... 29 మ్యాచ్‌ల నిర్వహణే సాధ్యమైంది. బోర్డుకు టోర్నీ ప్రసారకర్తలు స్టార్ స్పోర్ట్స్‌తో, ఇతర స్పాన్సర్లతో ఉన్న ఒప్పందాల్లో ఎలాంటి షరతులు, నిబంధనలు ఉన్నాయనే అంశంపై పూర్తి సమాచారం లేకున్నా... అందరూ ఒక్కో మ్యాచ్ లెక్కన బోర్డుకు చెల్లిస్తారని తెలుస్తోంది. దీని ప్రకారం బీసీసీఐకి సాధారణంగా వచ్చే ఆదాయంలో దాదాపు 50 శాతం కోత పడవచ్చు. అయితే టోర్నీ ఈ ఏడాదికి పూర్తిగా రద్దయితేనే నష్టం జరుగుతుందని, మున్ముందు ఏవైనా తేదీల్లో మళ్లీ నిర్వహించగలిగితే సమస్య ఉండదని కూడా అధికారులు చెబుతున్నారు. లీగ్‌కు స్టార్ స్పోర్ట్స్ ప్రసారకర్తగా... ‘వివో మొబైల్స్’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆటగాళ్లకు కూడా సగం టోర్నీకి లెక్కగట్టి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే స్పాన్సర్లెవరూ కూడా తమకు జరిగే నష్టం గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతానికి దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని... ఇలాంటప్పుడు లీగ్‌ను వాయిదా వేయాలనే బోర్డు నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని మాత్రమే వారు చెప్పారు. అన్నింటికి మించి ఆటగాళ్ల క్షేమమే తమకూ ముఖ్యమని వారు స్పష్టం చేశారు. -
సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : సమ్మర్ సినిమాలన్ని వాయిదా
సినిమాలకు బెస్ట్ సీజన్ అంటే నాలుగు... సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి. ఉగాది, క్రిస్మస్లకు కూడా సినిమాలు వస్తుంటాయి. అయితే వసూళ్లకు మొదటి నాలుగు పండగలే ప్రధానం. 2020లో సంక్రాంతి సందడి బాగానే సాగింది. అయితే కరోనా దెబ్బకు సమ్మర్ సంబరం మిస్సయింది. దసరా, దీపావళికి కూడా సినిమా పండగ లేదు. సంవత్సరాంతంలో మెల్లిగా సినిమాల విడుదల ఆరంభమైంది. 2021లో సంక్రాంతి సందర్భంగా వెండితెరకు బోలెడన్ని బొమ్మలు వచ్చాయి. కానీ ఈసారి కూడా సమ్మర్ సంబరం పోయే పోచ్! కరోనా సెకండ్ వేవ్‌తో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. గత సమ్మర్‌కి మార్చి చివర్లో థియేటర్లకు లాక్‌పడింది.. ఈ సమ్మర్ కూడా సందడి మిస్. వేసవి సెలవులంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కాసులు కురిపించే రోజులు. పరీక్షలను పూర్తి చేసుకున్న విద్యార్థులు, తమ పిల్లలతో సరదాగా సమయం గడిపేందుకు పెద్దలు ప్రధానంగా ఎంచుకునేది థియేటర్స్‌లో సినిమా చూడడం. అందుకే సంక్రాంతి తర్వాత నిర్మాతలు ఎక్కువగా ఇష్టపడే సీజన్ సమ్మరే. కానీ కరోనా కారణంగా గత ఏడాది సమ్మర్‌కి బాక్సాఫీసు కుదేలయింది. ఈ సమ్మర్‌కి అయినా సినిమాల సందడి ఉంటుందనుకుంటే సెకండ్ వేవ్ కారణంగా ఈసారీ నిరాశే. మార్చి మొదటివారం నుంచి ఏప్రిల్ 9 వరకు థియేటర్స్ వంద శాతం సీటింగ్‌తో నడిచాయి. ఈ సమయంలో ‘వైల్డ్ డాగ్, వకీల్‌సాబ్, రంగ్ దే, జాతిరత్నాలు’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు షెడ్యూల్ అయిన సినిమాల్లో ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ (ఏప్రిల్ 16), నాని ‘టక్ జగదీష్’ (ఏప్రిల్ 23), కంగనా రనౌత్ ‘తలైవి’ (ఏప్రిల్ 23), రానా ‘విరాటపర్వం’ (ఏప్రిల్ 30) ఇప్పటికే అధికారికంగా వాయిదా పడ్డాయి. అలాగే మే నెలలో విడుదలకు షెడ్యూల్ అయిన పెద్ద చిత్రాల్లో చిరంజీవి ‘ఆచార్య’ (మే 13) కూడా వాయిదా పడింది. ఇవే కాదు.. వెంకటేశ్ ‘నారప్ప’ (మే 14), బాలకృష్ణ ‘అఖండ’ (మే 28), రవితేజ ‘ఖిలాడి’ (మే 28) చిత్రాలు విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఇలా ఈ సమ్మర్ కూడా వెండితెరపై బొమ్మ పడకుండా ముగిసిపోయేలా ఉంది. వెండితెర వెలవెల చలన చిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది వేసవికి సినిమా పండగ లేకుండాపోయింది. 2020 మార్చి 13న విడుదలైన సినిమాలు ఓ మూడు నాలుగు రోజులు థియేటర్లలో ఉండి ఉంటాయేమో! ఆ తర్వాత కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల సినిమా థియేటర్లకు లాక్ పడింది. 13న ఓ పది చిన్న సినిమాల వరకూ విడుదలయ్యాయి. వాటిలో ‘బగ్గిడి గోపాల్, మద, అర్జున’ వంటి సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత సినిమాల విడుదలకు బ్రేక్ పడటంతో సమ్మర్ సంబరం మిస్సయింది. ఈసారి కూడా అదే జరిగింది. ఏప్రిల్ 2న నాగార్జున ‘వైల్డ్ డాగ్’, 9న పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ విడుదలయ్యాయి. ఆ తర్వాత విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ వేసవి కూడా వెండితెర వెలవెలపోవడం సినీప్రియులకు బాధాకరం. నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి.. సినిమాని నమ్ముకున్న అందరికీ బాధాకరమే. ఓటీటీలో సినీ హవా తీసిన సినిమా హార్డ్ డిస్క్లోనే ఉండిపోతే నిర్మాతల హార్ట్ హెవీ అయిపోతుంది. పెరిగే వడ్డీలు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఈ పరిస్థితుల్లో కొందరు చిన్న నిర్మాతలకు ‘ఓటీటీ’ ప్లాట్‌ఫామ్ ఓ ఊరట అయింది. గతేడాది లాక్డౌన్లో నేరుగా ఓటీటీలో విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతారామం’. సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదలైంది. అప్పటినుంచి చిన్న, మీడియమ్ బడ్జెట్ చిత్రాలు బోలెడన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలయ్యాయి. వాటిలో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘కలర్ ఫొటో’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వంటి చిత్రాలులొచ్చాయి. ఇలా ఆ సమ్మర్ నుంచి ఈ సమ్మర్ వరకూ ఓటీటీలో విడుదలై, ఇంటికే వచ్చిన సినిమాలెన్నో. పరిస్థితులు చూస్తుంటే ఇకముందు కూడా ఓటీటీ హవా కొనసాగేలా ఉంది. స్మాల్.. మీడియమ్‌లు కూడా... వేసవిలో పెద్ద సినిమాలే కాదు..పెద్ద సినిమాల మధ్యలో చిన్న, మీడియమ్ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతాయి. ఆ సినిమాలు కూడా ఈసారి వాయిదా పడ్డాయి. అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్క జిల్లాల అందగాడు’, తేజా సజ్జా ‘ఇష్క్’, శ్రీకాంత్ ‘తెలంగాణ దేవుడు’, సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’ వంటి ఆ జాబితాలో ఉన్నాయి. అయితే ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమైన అనసూయ ‘థ్యాంక్యూ బ్రదర్’ అనూహ్యంగా ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో మే 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సోలోగా.. ధైర్యంగా... గతేడాది వేసవి, దసరా, దీపావళి పండగలు సినిమాల సందడి లేకుండా వెళ్లిపోయాయి. సంవత్సరాంతంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు ఆరంభమయ్యాయి. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి. ఆ బాధ్యతను ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ తీసుకుంది. సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారా? వసూళ్లు ఏమాత్రం ఉంటాయి? వంటి సందేహాల నడుమ లాక్డౌన్ తర్వాత విడుదలైన తొలి పెద్ద సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి గత మేలో విడుదల కావాల్సింది. లాక్డౌన్ వల్ల వాయిదా పడి, డిసెంబర్ 25న థియేటర్లకు వచ్చింది. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ వంటి స్టార్స్ కూడా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా ప్రేక్షకులను కోరారు. అప్పటినుంచి మెల్లిగా సినీ పరిశ్రమ తేరుకుని, సినిమాల విడుదలకు ముందుకొచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి మంచి వసూళ్లతో టాలీవుడ్ కోలుకున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. -
జేఈఈ మెయిన్ పరీక్షలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఈ నెల 27, 28, 30 తేదీల్లో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించేందుకు ఎన్టీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మొదటి విడత, మార్చి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రెండో విడత పరీ క్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు ఫిబ్రవరిలో 6,20,978 మంది, మార్చిలో 5,56,248 మంది హాజరయ్యారు. ఇక ఈనెల 27, 28, 30 తేదీల్లో మూడో విడత, మే నెలలో నాలుగో విడత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈనెల పరీక్షలను వాయిదా వేస్తు న్నట్లు వెల్లడించింది. మళ్లీ పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలనేది తరువాత నిర్ణయిస్తామని, పరీక్షకు 15 రోజుల ముందుగా తెలియజేస్తా మని వెల్లడించింది. వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. -
వెనక్కి తగ్గిన వాట్సాప్
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానంపై వెనకడుగు వేసింది. కొత్త విధానాన్ని మే 15వ తేదీకి వాయిదా వేసింది. వ్యక్తిగత డేటాను మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటోందంటూ భారత్ సహా ప్రపంచదేశాల వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘ఫిబ్రవరి 8వ తేదీన ఎవరి అకౌంట్‌నూ సస్పెండ్ చేయడం/ తొలగించడం జరగవు. వాట్సాప్‌లో గోప్యత, భద్రతా పరమైన అంశాలపై వస్తున్న అపోహలను తొలగించేందుకు మేం చాలా చేయాల్సి ఉంది. ఆ తర్వాతే, ప్రస్తుత విధానాల్లో క్రమేపీ పరిశీలన జరిపి, మే 15వ తేదీ కల్లా కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెస్తాం’అని బ్లాగ్ పోస్ట్‌లో వాట్సాప్ ప్రకటించింది. ‘ఇటీవలి అప్డేట్ నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు ఎంతో అయోమయానికి గురయ్యారు. ఎన్నో అనుమానా లు తలెత్తాయి. మా విధానాలు, వాస్తవాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేందుకు సాయపడాలనుకుం టున్నాం’అని అందులో తెలిపింది. వాట్సాప్ వేదికపై ఉండే వినియోగదారుల వ్యక్తిగత సమాచారం పూర్తిస్థాయిలో సంకేత రూపంలో ఉంటుంది. ఈ మెసేజీలను వాట్సాప్ గానీ, ఫేస్బుక్ గానీ చూడలేదని కూడా స్పష్టత ఇచ్చింది. యూజర్ల మెసేజీలు, కాల్లకు సంబంధించి తాము ఎలాంటి రికార్డులను నిర్వహించడం లేదని పేర్కొంది. వినియోగదారుల లొకేషన్ కూడా బయటకు వెల్లడయ్యేందుకు అవకాశం లేదని తెలిపింది. ఇటీవల ప్రకటించిన విధానం కారణంగా వ్యక్తిగత మెసేజీలపై ఎలాంటి ప్రభావం పడబోదని తెలిపింది. 40 కోట్లకు పైగా వినియోగదారులతో అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లో వాట్సాప్ నిర్ణయం ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. సేవలు, విధానాల్లో మార్పులు చేపట్టినట్లు వాట్సాప్ గత వారం తెలిపింది. దీని ప్రకారం వినియోగదారులు తమ వాట్సాప్ సేవలను కొనసాగించాలంటే ఫిబ్రవరి 8వ తేదీ కల్లా ఈ విధానాలకు సమ్మతించాల్సి ఉందని తెలిపింది. వాట్సాప్ ప్రకటించిన వ్యక్తిగత గోప్యత విధానాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం కూడా ప్రకటించింది. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన వాట్సాప్ తాజా నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. వాట్సాప్‌లో వ్యక్తిగత డేటా భద్రతపై అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో లక్షలాదిగా వినియోగదారులు గత కొద్ది రోజులుగా సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. -
లంక ప్రీమియర్ లీగ్ మళ్లీ వాయిదా
కొలంబో: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) టి20 క్రికెట్ టోర్నీ ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. తొలుత ఆగస్టు నుంచి నవంబర్ 14కు... అనంతరం 21కు వాయిదా పడ్డ ఎల్పీఎల్... తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆరు రోజులు ఆలస్యంగా నవంబర్ 27న మొదలు కానుంది. ఈ టోర్నీని మూడు వేదికల్లో జరపాలని భావించినా... కరోనా నేపథ్యంలో టోర్నీలో జరిగే మొత్తం 23 మ్యాచ్‌లను ఒకే వేదికలో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఎల్సీ పేర్కొంది. ఇందుకు హంబన్‌తోటను ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది. డిసెంబర్ 17న ఫైనల్ జరగనుంది. ఆటగాళ్లకు విధించే క్వారంటైన్‌ను 14 రోజుల నుంచి 7 రోజులకు కుదించేందుకు శ్రీలంక ఆరోగ్య శాఖ అధికారులు అంగీకరించారు. అయితే జట్ల సహాయక సిబ్బంది మాత్రం 14 రోజుల క్వారంటైన్‌ను çపూర్తి చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ లీగ్‌లో క్రిస్ గేల్, డు ప్లెసిస్, షాహిద్ అఫ్రిది, కార్లోస్ బ్రాత్‌వైట్ వంటి విదేశీ స్టార్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ ఒకరోజు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్ ఒకరోజు వాయిదా పడింది. ఈ ప్రక్రియను శనివారం నుంచి తిరిగి ప్రారంభించేలా ప్రవేశాల కమిటీ సవరించిన షెడ్యూల్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా 333 మందికి ఎంసెట్ ర్యాంకులు పొందే అర్హత లభించనున్నట్లు కమిటీ అంచనా వేసింది. వారందరికీ శుక్రవారం సాయంత్రం వరకు ర్యాంకులను ప్రకటిస్తామని పేర్కొంది. అసలేం జరిగిందంటే.. ఎంసెట్ అర్హత సాధించినా ఇంటర్లో కనీస మార్కులు (సంబంధిత సబ్జెక్టుల్లో ఓసీలు 45 శాతం, ఇతర రిజర్వేషన్ కేటగిరీల వారు 40 శాతం) సాధించలేదన్న కారణంతో చాలా మంది విద్యార్థులకు ఎంసెట్ కమిటీ ర్యాంకుల ను కేటాయించలేదు. అయితే కరోనా కారణంగా ఈసారి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. ఆ పరీక్షల కోసం సిద్ధమైన 1.47 లక్షల మందికి ఇంటర్ బోర్డు కనీస పాస్ మార్కులు (35) ఇచ్చి పాస్ చేసింది. అందులో అనేక మందికి ఎంసెట్ ర్యాంక్ పొందేందుకు అవసరమైన నిర్దే శిత మార్కులు లేకపోవడంతో ఎంసెట్ కమిటీ ర్యాంకులు కేటాయించలేదు. దీంతో ఆయా విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు నిర్వహించనం దునే తమకు కనీస అర్హత మార్కులు లేకుండా పోయాయని, తమకు ర్యాం కులు కేటాయించేలా చూడాలని విన్నవించారు. దీంతో వారికి ర్యాంకులు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గురువారం చర్యలు చేపట్టింది. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉన్నతాధికారులతో సమావేశమై ఎంసెట్‌లో ర్యాంకుల కేటాయింపునకు కావాల్సిన కనీస అర్హత మార్కుల నిబంధనను సడలించి ఆయా విద్యార్థులకు ర్యాంకులను కేటాయించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా జీవో 201ని జారీ చేశారు. సడలింపు నిబంధన ఈ ఒక్క ఏడాదే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంటూ ర్యాంకులను ఎంసెట్ కమిటీ శుక్రవారం కేటాయించనుంది. ఇంజనీరింగ్ చివరి దశ తాజా షెడ్యూల్... 31–10–2020: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్. కొత్త వారికి ఇందులోనే అవకాశం. 1–11–2020: స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్. 30–10–2020 నుంచి 2–11–2020 వరకు: వెబ్ ఆప్షన్లు. 2–11–2020: ఆప్షన్లు ముగింపు. 4–11–2020: సీట్ల కేటాయింపు. 4–11–2020 నుంచి 7–11–2020 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్. సీట్లు పొందిన కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్టింగ్. -
‘ఇంజనీరింగ్ పరీక్షలను రద్దు చేయండి’
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జవహార్‌లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) వద్ద విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇంజనీరింగ్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.. యూనివర్సిటీ గేటు దాటి విద్యార్థులంతా మూకుమ్మడిగా లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థును అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
అడుగుతున్నా చెప్పండి
ఏమిటింత కాలుష్యం! ఎందుకీ అలక్ష్యం?! మిమ్మల్నే మిస్టర్ మోడీ.. చెప్పండి. ఈ కరోనా టైమ్‌లో.. నీట్లేంటి, జేఈఈలేంటి?! అడుగుతున్నది లిసిప్రియా కంగుజమ్. ఎనిమిదేళ్ల బాలిక! ఎనిమిదేళ్లంటే బడికి వెళ్లే వయసు. కొందరికైతే ఇంకా బడిలో చేరని వయసు. లిసిప్రియా కంగుజమ్ ఐదో తరగతి చదువుతోంది. బుధవారం పని మీద ఢిల్లీ వెళ్లింది! ప్రధాని, రాష్ట్రపతుల కార్యాలయాలు తిరిగి పెద్ద మనుషుల్ని కలిసి వచ్చింది. అయితే ఆ అమ్మాయి మాత్రం.. ‘‘వాళ్లు పెద్ద మనుషులైతే నేను కలిసే అవసరం ఎందుకు వస్తుంది?’’ అంటోంది! ఈ మాటను తన ఆరవ యేట నుంచీ అంటోంది. గట్టి క్లయిమేట్ ‘లా’ ను తెమ్మంటోంది లిసిప్రియ. తెస్తే వాతావరణం కొంచెం క్లీన్, కొంచెం కూల్ అవుతుందని కదా అని ఆశ. పని కాలేదు. అందుకే పెద్ద మనుషులు కాదు అంటోంది. గత ఏడాది జూన్‌లో పార్లమెంటు భవనం ముందుకు వెళ్లి ప్లకార్డ్ ప్రదర్శించింది! చట్టాలు తెచ్చేందుకు టైమ్ పడుతుంది అని ఎవరైనా చెప్పకుండా ఉండి ఉంటారా? తెచ్చేవరకు గుర్తు చేస్తూనే ఉంటానని తను. గట్టి పట్టు మీదే ఉంది. ఇప్పుడేమంటుందీ.. కరోనా ఉన్నప్పుడు ప్రవేశ పరీక్షలు ఏంటీ అని. వాటిని పోస్ట్‌పోన్ చెయ్యమని అడగడానికే లిసిప్రియా ఢిల్లీ వెళ్లింది. అడగడమే. అభ్యర్థించదు. విజ్ఞప్తి చెయ్యదు. మోదీజీని ‘మిస్టర్ మోడీ’ అంటుంది! వేరెవర్నైనా అంతే. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిని అయినా ‘మిస్టర్ గ్యుటెరస్’ అనే అంటుంది. ఆ పెద్దాయన్ని గత ఏడాది డిసెంబర్లో స్పెయిన్‌లో కలిసింది లిసిప్రియా. ఆ సెప్టెంబర్ 13న మన దగ్గర ‘నీట్’ ప్రవేశ పరీక్ష ఉంది. అదొకటే కాదు, జరగవలసిన పరీక్షలు చాలానే ఉన్నాయి. జె.ఇ.ఇ. మెయిన్ ఉంది. జె.ఇ.ఇ. అడ్వాన్డ్ ఉంది. థర్డ్ ఇయర్ యూనివర్సిటీ పరీక్షలు ఉన్నాయి. సీబీఎస్ఇ కంపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎన్‌డిఎ ఉంది. డి.యు.ఇ.టి. ఉంది. వీటన్నిటినీ తక్షణం వాయిదా వెయ్యమని లిసిప్రియా డిమాండ్. ‘పరీక్షలు రాసేవారు లక్షల్లో ఉంటారు. కరోనా ఎటాక్ అయితే పరిస్థితి ఏంటి?’ అని లిసిప్రియ ఆందోళన. సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఈ మాట చెప్పీ చెప్పీ రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ఇప్పుడు లిసిప్రియ తన చేతుల్లోకి తీసుకుంది సమస్యను. వివిధ సందర్భాలలో లిసిప్రియ ప్రసంగాలు, ప్రదర్శనలు, ప్రాతినిధ్యాలు లిసిప్రియ మణిపూర్ యాక్టివిస్ట్. బెంగళూరు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. యాక్టివిస్ట్ అన్నది వయసుకు మించినమాటే కానీ.. ఇప్పటికే వాతావరణ పరిరక్షణ మీద కొన్ని అంతర్జాతీయ ప్రసంగాలు ఇచ్చింది! ఈ అమ్మాయిని ఇన్స్పైర్ చేసినవి కూడా సామాజిక కార్యకర్తల ప్రసంగాలే. డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ చిల్డ్రన్ అవార్డు, వరల్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్, ఇండియా పీజ్ ప్రైజ్, రైజింగ్ స్టార్ ఆఫ్ ఎర్త్ డే నెట్వర్క్, ఎస్.డి.జీస్ అంబాసిడర్ అవార్డు, నోబెల్ సిటిజన్ అవార్డు.. ఈ రెండుమూళ్లలోనే లిసిప్రియకు వచ్చేశాయి. ‘సుకీఫూ’ అనే ఒక కిట్‌ను కూడా తయారు చేసింది లిసిప్రియ. సుకీఫూ అంటే సర్వైవల్ కిట్ ఫర్ ద ఫ్యూచర్ శరీరంలోకి స్వచ్ఛమైన గాలిని పంపించే సాధనం అది. లిసిప్రియ తను చేసేది చేస్తోంది. అధికారంలో ఉన్నవాళ్లను కూడా ‘ఫ్రెష్ ఎయిర్’ కోసం ఏదైనా చేయమని అంటోంది. ఆచరించి చూపడం అంటే ఆదర్శంగా ఉండటమే కదా. ‘ఆదర్శం’ అనేది కూడా వయసుకు మించిన మాటే లిసిప్రియను అభినందించడానికి. కానీ తప్పదు. కాసేపు.. ఆదర్శమే ఆమెకన్నా చిన్న అనుకుంటే సరిపోతుంది. -
జేఈఈ, నీట్ వాయిదాకై సుప్రీంకు!
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని వాయిదా వేయాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. ఈ విషయమై ఉమ్మడిగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీజేపీయేతర రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. మరోవైపు డీఎంకే, ఆప్ సైతం ఈ డిమాండ్‌కు మద్దతు పలికాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం పలువురు ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల వాయిదాకు సుప్రీం తలుపుతట్టాలని ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమ యింది. సమావేశంలో సీఎంలు అమరీందర్ సింగ్, అశోక్ గహ్లోత్, భూపేష్ భఘేల్, నారాయణ స్వామి, హేమంత్ సోరేన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రేలు పరీక్షల వాయిదాపై సమష్టి వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశంపై కేంద్రం అత్యంత అజాగ్రత్తగా వ్యవహరిస్తోందని సోనియా విమర్శించారు. పరీక్షల వాయిదాపై మరోమారు కలిసికట్టుగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని మమతాబెనర్జీ ఇతర ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సహా ఇతర సీఎంలతో కలిసి నడవాలని మమతను సోనియా కోరారు. మమత సూచనపై సానుకూలంగా స్పందించిన అమరీందర్ సింగ్, ఈ విషయమై న్యాయసలహా ఇవ్వాలని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌ను కోరారు. అందరం కలిసికట్టుగా కోర్టును ఆశ్రయించి లక్షలాది విద్యార్ధులకు బాసటగా నిలుద్దామన్నారు. ఈ నెల 28న పరీక్షల వాయిదాపై వివిధ రాష్ట్రాలు, జిల్లాల రాజధానుల్లోని కేంద్రప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించాలని, దేశవ్యాప్తంగా #SpeakUpForStudentSafety పేరిట ఆన్లైన్ ఉద్యమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. జాప్యంతో మరింత అనర్థం జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యం చేయడం మెరిట్ విద్యార్ధుల కెరీర్, అకడమిక్ క్యాలెండర్‌పై దుష్ప్రభావం చూపుతుందని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రామ్‌గోపాల్ రావు అభిప్రాయపడ్డారు. పరీక్షలు వాయిదా వేస్తే మొత్తం ఐఐటీ క్యాలెండర్‌పై ప్రభావం పడుతుందని, అప్పుడు ఒకేమారు రెండు బ్యాచులు నడపాల్సి ఉంటుందని చెప్పారు. దీనికితోడు లక్షలాది మంది విద్యార్థులు జీరో అకడమిక్ ఇయర్ బారిన పడతారన్నారు. ఇది మెరిట్ స్టూడెంట్స్ కెరీర్‌పై పెనుప్రభావం చూపుతుందని వివరించారు. ఇప్పటికే ఆరునెలలు వృథా అయ్యాయని, సెప్టెంబర్‌లో పరీక్షలు పెడితే కనీసం డిసెంబర్లో క్లాసులు ఆరంభించవచ్చని, ఇంకా వాయిదా వేయడం సబబుకాదని చెప్పారు. 14 లక్షల అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలకు సంబంధించి దాదాపు 14 లక్షలకు పైగా అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నీట్ పరీక్షకు అడ్మిట్‌కార్డులను బుధవారం మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంచగా తొలి మూడుగంటల్లో 4 లక్షల కార్డులు డౌన్లోడ్ చేసుకున్నారని, సాయంత్రానికి 6.84 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని ఎన్టీఏ అధికారి తెలిపారు. ఈ పరీక్షకు దాదాపు 16 లక్షల మంది రిజిస్టరయ్యారు. జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకున్న 8.58 లక్షల మంది అభ్యర్దుల్లో సుమారు 7.41 లక్షల మంది అడ్మిట్‌కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారు. సెప్టెంబర్ 1–6 తేదీల్లో జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలు నిర్వహించనున్నారు. -
అధ్యక్ష ఎన్నికల వాయిదాకు సంకేతాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్ష ఎన్నికల్ని వాయిదా వేసే ప్రతిపాదనల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ జాప్యం జరుగుతుందన్న సంకేతాలు పంపుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో మెయిల్ ద్వారా వేసే ఓట్లలో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటాయని ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే అమెరికాలో ఎన్నికల్ని వాయిదా వెయ్యడం అంత సులభం కాదు. అమెరికా రాజ్యాంగంలో జాప్యం అన్న పదానికే చోటు లేదు. అయినప్పటికీ ట్రంప్ గురువారం ‘‘దేశ చరిత్రలోనే 2020 ఎన్నికల్లో కచ్చితత్వం లోపిస్తుందని, భారీగా అవకతవకలు జరుగుతాయి. దీనివల్ల అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి’’ అని ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల్లో ఎక్కువ మంది మెయిల్ ఇన్ ఓటింగ్ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. మెయిల్ ద్వారా ఓటు వేసే ప్రక్రియలో విదేశీ హస్తం ఉంటుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా సురక్షితంగా ఓటేసే పరిస్థితులు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేస్తే ఏమవుతుంది ? అని ట్రంప్ ఆ ట్వీట్లో ప్రశ్నించారు. -
నీట్ పరీక్షపై ఎన్టీఏ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పరీక్షలు రద్దవుతాయని వస్తున్న వార్తలు అవాస్తవమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. నీట్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న నిరాధార వార్తను నమ్మవద్దని ఎన్టీఏ ఓ ప్రకటన విడుదల చేసింది. 2020, జులై 26న నీట్ పరీక్ష ఉంటుందని గతంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, నీట్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు జూన్ నెల 15 వ తేదీన నిరాధార వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు. కాగా విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే నిరాధార వార్తపై విచారణ జరుపుతామని ఎన్టీఏ స్పష్టం చేసింది. అయితే, నీట్ పరీక్షలకు సంబంధించి మే 11, 2020న విడుదల చేసిన ప్రకటన ప్రామాణికమని ఎన్టీఏ తెలిపింది. సరైన సమాచారం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు(www.nta.ac.inand ntaneet.nic.in) ఎన్టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. వైద్య విద్య ప్రవేశాల కోసం ఎన్టీఏ నీట్ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: ‘నీట్’గా దొరికిపోతున్నారు) -
యూపీఎస్సీ పరీక్షలు వాయిదా
న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఉద్యోగాలకు అర్హత కల్పించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఈ నెల 31న జరగాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న తిరిగి మరోమారు యూపీఎస్సీ అధికారులు సమావేశమై దీనిపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష కూడా వాయిదా పడినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు యూపీఎస్సీ వెబ్సైట్ చూడాల్సిందిగా సూచించారు. -
వాయిదా పద్ధతిలో ఆరోగ్య బీమా చెల్లింపునకు అవకాశం
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులకు సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) పాలసీదారులకు ఊరటనిచ్చే విధంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. వాయిదా పద్ధ్దతిలో ఆరోగ్య బీమా చెల్లింపులను స్వీకరించే విధంగా బీమా కంపెనీలకు వెసులుబాటు ఇచ్చింది. అయితే.. నెలా, త్రైమాసికం, ఆరు నెలల చెల్లింపులకు అవకాశం కల్పించే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టనిచ్చింది. పాలసీ ప్రీమియం, ప్రాడక్ట్ ఆధారంగా బీమా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. కరోనా దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కారణంగా లాక్డౌన్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అనేక మంది ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కునే అవకాశాలు ఉన్నందున ఐఆర్డీఏఐ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల్లో వెసులుబాటుకు అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు సంబంధించిన పాలసీలకు వాయిదా పద్ధతి అమల్లో ఉండనుంది. -
లేవర్ కప్ టెన్నిస్ టోర్నీ వాయిదా
వాషింగ్టన్: టీమ్ యూరోప్, టీమ్ వరల్డ్ జట్ల మధ్య ప్రతి యేటా జరిగే లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తెలిపాడు. ఫెడరర్ మేనేజ్మెంట్ కంపెనీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ఈ టోర్నీ జరుగుతోంది. ఈ ఏడాది బోస్టన్‌లో సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య లేవర్ కప్ జరగాల్సింది. అయితే మేలో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని సెప్టెంబర్ 20కి వాయిదా వేశారు. దాంతో ఈ ఏడాది లేవర్ కప్‌ను వాయిదా వేస్తూ వచ్చే ఏడాది సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య నిర్వహిస్తామని ఫెడరర్ తెలిపాడు. ‘లేవర్ కప్ వాయిదా వేయాల్సి రావడం నిరాశ కలిగిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు. 2017, 2018, 2019లలో మూడుసార్లూ టీమ్ యూరోప్ జట్టే లేవర్ కప్‌లో విజేతగా నిలిచింది. -
టోక్యో వాయిదా... మాకూ భారమే: ఐఓసీ
టోక్యో: ఈ ఏడాది ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటం వల్ల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)పై కూడా భారం పడుతుందని ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ చెప్పారు. ఓ జర్మన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... వాయిదా వల్ల మాకూ వందల కోట్ల నష్టం (వందల మిలియన్ డాలర్లు) వస్తుంది. ఇక మిగతాదంతా జపానే భరించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ‘ఆతిథ్య ఓప్పందం’లో స్పష్టంగా తెలియజేశాం. జపాన్ ప్రధాని సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగింది. అదనపు భారంలో సింహభాగాన్ని ఆతిథ్య దేశం భరించాల్సిందేనని నియమ నిబంధనల్లో ఉంది. కొంత నష్టాన్ని ఐఓసీ భరిస్తుంది’ అని అన్నారు. తాజా అంచనాల ప్రకారం 2 నుంచి 6 బిలియన్ డాలర్లు (రూ.15 వేల కోట్ల నుంచి రూ.45 వేల కోట్లు) వరకు ఈ భారం ఉంటుంది. అంటే మొత్తం నిర్వహ ణకు అయ్యే వ్యయంలో ఇంచు మించు సగమన్నమాట! ఇప్పటి వరకు జపాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న టోక్యో ఈవెంట్ కోసం రూ. 92 వేల కోట్లు (12.6 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసింది. అయితే ఇటీవల టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ సీఈఓ తోషిరో ముటో వచ్చే ఏడాది కూడా జరిగేది సందేహాస్పదమేనన్నారు. ‘అప్పటికల్లా మహమ్మారి అదుపులోకి వస్తుందని ఎవరైనా చెప్పగలరా’ అని అన్నారు. దీనిపై బాచ్ మాట్లాడుతూ స్పష్టమైన జవాబు ఇచ్చే పరిస్థితిలో తాను లేనని... అయితే మరో వాయిదాకు అవకాశమైతే లేదని జపాన్ వర్గాలు చెప్పినట్లు వెల్లడించారు. -
రాజ్యసభ ఎన్నికలు మరిన్ని రోజులు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ 9తో పదవీ కాలం పూర్తయిన రాజ్యసభ సభ్యుల స్థానాలకు నిర్వహించాల్సిన ద్వైవార్షిక ఎన్నికలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 24న వాయిదావేస్తూ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై మరోసారి సమీక్ష జరిపి ఇంకా కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం మరో ప్రకటన చేసింది. ఎన్నికల నిర్వహణ తేదీని తరువాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 55 స్థానాలకు గాను 37 స్థానాల్లో పోటీ లేకుండా ఎన్నిక పూర్తయింది. కాగా మరో 18 స్థానాల్లో ఎన్నిక జరగాల్సి ఉంది. -
ఒలింపిక్స్ వరకు కోచ్‌ల కొనసాగింపు!
న్యూఢిల్లీ: ప్రత్యేకించి ఒలింపిక్స్ కోసమే విదేశీ కోచ్‌లను నియమించుకున్న భారత క్రీడా సమాఖ్యలు ఇప్పుడు ఆ కోచ్‌ల కాంట్రాక్టు గడువు పొడిగించాలని భావిస్తున్నాయి. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ వల్ల టోక్యో మెగా ఈవెంట్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీంతో ఆ పోటీలు ముగిసే వరకు కోచ్‌లను కొనసాగించాలని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కి పలు క్రీడా సమాఖ్యల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. మహిళా రెజ్లింగ్ కోచ్ ఆండ్రూ కుక్, షూటింగ్ (పిస్టల్) కోచ్ పావెల్ స్మిర్నోవ్, బాక్సింగ్ కోచ్‌లు శాంటియాగో నియెవా, రాఫెల్లె బెర్గమస్కొ, అథ్లెటిక్స్ హైపెర్ఫార్మెన్స్ డైరెక్టర్ హెర్మన్ తదితర విదేశీ కోచ్‌లకు ‘సాయ్’ పొడిగింపు ఇచ్చే అవకాశాలున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగుతున్న దృష్ట్యా క్రీడా శిబిరాలేవీ కొనసాగడం లేదు. ఈ లాక్డౌన్ ముగిశాక కోచ్‌ల సేవలు, శిబిరాలు మొదలవుతాయి. ‘విదేశీ కోచ్‌ల జీతాలను ‘సాయ్’ చెల్లిస్తుంది. ప్రస్తుతం ఉన్న అసాధారణ పరిస్థితులు వారికి తెలుసు. కాబట్టి సహకరించేందుకు వారు సిద్ధంగానే ఉన్నారు’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కార్యదర్శి వీఎన్ ప్రసూద్ తెలిపారు. కుక్ (అమెరికా), టెమొ గెబిష్విలి (జార్జియా), బజ్రంగ్ పూనియా కోచ్ షాకో బెంటినిడిస్ (జార్జియా)లతో డబ్ల్యూఎఫ్ఐ కాంట్రాక్టు పొడిగించుకుంటుంది. 21 రోజుల లాక్డౌన్ పూర్తయ్యాక ఆటగాళ్ల సన్నాహకాలు మొదలవుతాయని ప్రసూద్ ఆశిస్తున్నారు. -
ఆడతారా? అల్విదా చెబుతారా!
అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని గొప్ప విజయాలు సాధించినా ఒలింపిక్ పతకానికున్న విలువ మరే వాటికి ఉండదు. అలాంటిది ఇప్పటికే పతకం గెలిచి దేశానికి మరో పతకం అందించాలని, ఉజ్వలమైన కెరీర్‌కు విశ్వ క్రీడలతో ముగింపు చెప్పాలనుకునే క్రీడాకారులు కొందరు. భారత్ విషయానికొస్తే కొద్ది మంది మాత్రమే ఒలింపిక్స్‌లో మెరిపించారు. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, బాక్సర్ మేరీకోమ్, రెజ్లర్ సుశీల్ కుమార్ పతకాలు కూడా సాధించారు. కెరీర్ చరమాంకంలో ఉన్న వీరందరూ ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌లో ఆడి పతకంతో అల్విదా చెప్పాలని భావించారు. అయితే టోక్యో ఒలింపిక్స్ ఏడాదిపాటు వాయిదా పడటంతో ఈ మేటి క్రీడాకారులకు అవకాశం దక్కుతుందా లేదా వేచి చూడాలి. సాక్షి క్రీడా విభాగం ఊహించని ఉత్పాతం కరోనా కారణంగా ఎన్నడూ లేని విధంగా విశ్వ క్రీడలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ మెగా ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వాయిదా కొంత నిరాశ కలిగించినా... ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), జపాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే సరైనది. అయితే ఈ వాయిదా నిర్ణయం పలువురు వెటరన్ క్రీడాకారుల కెరీర్‌కు అర్ధాంతరంగా ముగింపు పలికే అవకాశముంది. వారెవరంటే... రాకెట్ దూసుకెళ్లేనా? లియాండర్ పేస్... అంతర్జాతీయ వేదికపై భారత టెన్నిస్‌కు పర్యాయపదం. 30 ఏళ్లుగా టెన్నిస్‌లో కొనసాగుతున్నాడు. ఈ మూడు దశాబ్దాల కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాడు. భారత్ పతాకాన్ని రెపరెపలాడించాడు. 1992 నుంచి 2016 దాకా వరుసగా ఏడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న తొలి భారతీయ క్రీడాకారుడిగా, ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి టెన్నిస్ ప్లేయర్‌గా పేస్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాదితో తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతానని... కోచ్‌గా మారి ప్రతిభావంతులైన చిన్నారులకు శిక్షణ ఇస్తానని 46 ఏళ్ల పేస్ ప్రకటించాడు. అదృష్టం కలిసొస్తే చివరిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతానన్న పేస్‌కు టోక్యో క్రీడలు ఏడాది వాయిదా పడటంతో వచ్చే ఏడాది ఆ అవకాశం ఉండకపోవచ్చు. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడాలంటే పేస్ తన రిటైర్మెంట్ను కూడా ఏడాదిపాటు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కరోనా కారణంగా జూన్ వరకు అంతర్జాతీయ టెన్నిస్ జరిగే అవకాశం లేదు. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ వాయిదా పడింది. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలైనా సజావుగా జరుగుతాయా అని చెప్పే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదే ఆటకు వీడ్కోలు పలకాలా లేక వచ్చే ఏడాది వరకు కొనసాగాలా అనే అంశాన్ని పేస్ తేల్చుకోవాలి. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన పేస్ 2004లో మహేశ్ భూపతితో కలిసి ఏథెన్స్ ఒలింపిక్స్‌లో డబుల్స్ విభాగంలో కాంస్య పతక పోరులో ఓడిపోయాడు. ఆఖరి పంచ్ పడిందా? శతాబ్దం కంటే ఎక్కువ చరిత్ర కలిగిన ఒలింపిక్స్ క్రీడల్లో మహిళల బాక్సింగ్‌ను మాత్రం 2012 లండన్ ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టారు. ఈ క్రీడల్లో భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ 51 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. అంతకుముందే మేరీకోమ్ అంతర్జాతీయ మహిళల బాక్సింగ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఏ భారతీయ బాక్సర్‌కు సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోయినా... పట్టు వదలకుండా పోరాడి టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను దక్కించుకుంది. కెరీర్‌ను మరో ఒలింపిక్ పతకంతో ముగించాలని ఆశించింది. అయితే టోక్యో విశ్వ క్రీడలు వాయిదా పడటంతో సంవత్సరంపాటు మేరీకోమ్ వేచి చూడక తప్పదు. ఇటీవల జోర్డాన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా మేరీకోమ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వాయిదా నేపథ్యంలో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ప్రస్తుతం ఒలింపిక్స్‌కు అర్హత పొందిన వారిని అలాగే కొనసాగిస్తుందా లేక మళ్లీ మొదటినుంచి క్వాలిఫయిం గ్ను నిర్వహిస్తుందా స్పష్టత లేదు. దాంతో మేరీకోమ్ కెరీర్‌పై కూడా టోక్యో వాయిదా ప్రభావం చూపనుంది. పట్టు చిక్కేనా? భారత క్రీడల చరిత్రలో వ్యక్తిగత విభాగంలో రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన ఏకైక క్రీడాకారుడు, రెజ్లర్ సుశీల్ కుమార్. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 66 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన సుశీల్... 2012 లండన్ ఒలింపిక్స్‌లో 66 కేజీల విభాగంలోనే రజత పతకం సాధించాడు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నడుమ 2016 రియో ఒలింపిక్స్‌కు దూరమైన సుశీల్... 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. 74 కేజీల విభాగంలో పోటీపడాల్సిన సుశీల్ కీలక సమయంలో గాయం కారణంగా సెలెక్షన్ ట్రయల్స్‌కు దూరం కావడం... సుశీల్ స్థానంలో మరో రెజ్లర్ జితేందర్‌కు ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే అవకాశం లభించింది. టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సుశీల్‌కు మరో అవకాశం ఇస్తుందా లేక జితేందర్‌వైపు మొగ్గు చూపుతుందా వేచి చూడాలి. ఒకవేళ జితేందర్కే డబ్ల్యూఎఫ్ఐ ఓటు వేస్తే సుశీల్ కెరీర్ దాదాపు ముగిసినట్టే. -
పల్లె ప్రగతికి విఘాతం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : స్థానిక సంస్థల ఎ న్నికలు ఈ నెలాఖరులోగా జరగకపోతే పల్లె ప్రగతి కుంటుపడుతుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల తో గ్రామాలు సతమతమవుతాయి. ఎక్కడికక్కడ అభివృద్ధి నిలిచిపోతుంది. పారిశుద్ధ్యాన్ని సైతం మెరుగుపర్చుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతాయి. చంద్రబాబు అండ్‌కో చేసిన కుట్రలకు ప్రజలు ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆరువారాల పాటు ఎన్ని కల కోడ్ అమల్లో ఉంటే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోతాయి. ము ఖ్యంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించాలన్న సంకల్పానికి బ్రేక్ పడనుంది. వైఎస్సార్ కాపు నేస్తం, జననన్న చేదోడు, ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ వంటి పథకాలు నిలిచిపోనున్నాయి. స్థానిక సంస్థల జనాభా దామాషా ప్రకా రం, జిల్లా వెనుకబాటు, స్థానిక సంస్థల పనితీరు తదితర అంశాల ఆధారంగా ఏటా ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి. గతంలో పంచాయతీలకు 50శాతం, మండల పరిషత్‌లకు 25శాతం, జెడ్పీకి 25శాతం నిధులు విడుదలయ్యేవి. కానీ 14వ ఆర్థిక సంఘం వచ్చాక పంచాయతీలకు 90శాతం నిధులు, జెడ్పీ కి కేవలం 10శాతం నిధులను కేటాయిస్తూ వచ్చింది. మధ్యలో మండల పరిషత్‌లకు నిధుల్లేని పరిస్థితి ఉండేది. అయితే, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు గగ్గోలు పెట్టడంతో మునుపటి మాదిరిగా 15వ ఆర్థిక సంఘంలో పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 25 శాతం, జిల్లా పరిషత్‌కు 25 నిధు లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖత చూపింది. పాత పద్ధతిలో నిధులు విడుదల చేయనుండటంతో అటు పంచాయతీలు, ఇటు మండల, జిల్లా పరిషత్‌లు నిధులతో కళకళలాడనున్నాయి. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరులోగా జరిగితేనే.. లేదంటే నిధుల్లేమితో వెలవెలబోతాయి. చెప్పాలంటే ప్రగతి అటకెక్కనుంది. జిల్లాకు రూ.300కోట్లు మార్చిలో ఎన్నికలు పూర్తి చేయగలిగితే రాష్ట్రా నికి రూ.5800కోట్లు వస్తాయి. అందులో మన జిల్లాకు రూ.300కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కులు, క్రీడా మైదానాలు, శ్మశానాలు, కనెక్టవిటీ లేని ప్రాంతాల్లో రహదారులు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు దోహదపడతా యి. జిల్లాలో 1190 పంచాయతీలు, ఒక కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ప్రజలకు అవసరమైన కనీస వసతులు కల్పించడానికి 15వ ఆర్థిక సంఘం నిధులు ఉపయోగపడతాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నిలిచిపోయిన ఎన్నికల కారణంగా వందల కోట్ల నిధులకు జిల్లా దూరమైపోతోంది. ఆరువారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడంతో కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదు. స్థానిక సంస్థలకు పాలక మండళ్లు ఉంటే తప్ప కేంద్రం నిధులు విడుదల చేయదు. అది కూడా ఈనెలాఖరులోగానే పాలక మండళ్లు ఎన్నికవ్వాలి. తాజా ఎన్నికల సంఘం ఆదేశాలతో కేంద్రం నుంచి రావల్సిన ఆర్థిక సంఘం నిధులకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో పల్లెలు, మున్సిపాల్టీల్లో పెద్ద ఎత్తున అభి వృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలగనుంది. సంక్షేమ కార్యక్రమాలకు బ్రేక్ ఎన్నికలు ఆరువారాల పాటు వాయిదా వేయడంతో ఈ లోపు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. ముఖ్యంగా జిల్లాలో 53,660 మందికి ఉగాది రోజున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సిద్ధం చేసింది. లేవుట్లు వేసి, లబి్ధదారులకు ప్లాట్లు లాటరీలో కేటాయింపు కూడా చేశారు. దీంతో ఉగాది ఎప్పుడొస్తుందా అని లబి్ధదారులు ఎ దురు చూస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలు నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లాయి. అదే విధంగా ఏప్రిల్‌లో వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపులకు సాయం చేయాలని నిర్ణయించింది. జిల్లాలో 4111మందికి రూ. 15వేలు చొప్పున అందజేసేందుకు నిర్ణయం కూడా తీసుకుంది. ఆరు వారాల వాయిదాతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈ కార్యక్రమం కూడా ఆగిపోనుంది. జగనన్న చేదోడు పథకం కింద 3188మంది నాయీ బ్రాహ్మణులకు, 6873 మంది రజకులకు, 4785 మంది టైలర్లకు రూ. 10వేలు చొప్పున సాయం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి కూడా బ్రేక్ పడింది. అలాగే, ఆరోగ్య శ్రీ పథకం కింద జిల్లాలో 8లక్షల 44వేల మందికి కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది. ఇప్పుడు వాటికి కూడా అడ్డు పడింది. పది రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలను ఆరువారాలు పాటు వాయిదా వేయడంతో ఈలోపు ఎవరికైనా అరోగ్య పరమైన సమస్యలు వస్తే చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలైతే నిరుపేదలు ఇబ్బందులు పడాల్సిందే. వైద్యం కోసం ఖర్చుపెట్టలేక ప్రాణాలను పణంగా పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వైఎస్సార్ ఆసరా కింద జిల్లాలో 42,278 డ్వాక్రా సంఘాలకు లబ్ధి చేకూర్చాల్సి ఉంది. ఆ సంఘాల్లోని 5లక్షల 20వేల మహిళలు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే జనగన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. వీరంతా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఉసూరుముంటున్నారు. చెప్పాలంటే పది రోజుల్లో పూర్తి కావాల్సిన ఎన్నికలపై చంద్రబాబు అండ్‌కో చేసిన కుట్రలతో జిల్లాలో లక్షలాది మంది ప్రభుత్వ ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. వారంతా ఇప్పుడు ఎన్నికల సంఘం తీరుపై మండిపడుతున్నారు. -
ఆరువారాల కుట్ర!
ప్రాదేశికాలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు పురపోరుకు నామినేషన్ వేసినవారు ఉపసంహరణ కోసం అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరో వైపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అదికారులు సమాయత్తమయ్యారు. ఇంతలో ఆరువారాల పాటు ఎన్నికల వ్యవహారాలు వాయిదా వేస్తున్నట్టు వార్త. అది విన్న అభ్యర్థులంతా అవాక్కయ్యారు. కాసేపు నిశ్చేషు్టలయ్యారు. ఆనక అసలు విషయం తెలుసుకుని ఆగ్రహోదగ్రులయ్యారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని నిర్ద్వందంగా ఖండించారు. రాగధ్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఓ అధికారి ప్రతిపక్షాల ఓటమిని చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం... తాను అనుకు న్నది ఎలాగైనా చేయించుకోవడంలో సిద్ధహస్తుడైన ఓ నాయకుడి దుర్బుద్ధి వల్ల ఇప్పు డు జిల్లా అభివృద్ధి నిలిచిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో పూర్తిగా నిమగ్నమైన రాజకీయ పారీ్టలకు ఎన్నికల కమిషన్ ఆదివారం పెద్ద షాక్ ఇచ్చింది. కరోనా వైరస్‌ను సాకుగా చూపించి స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఈ వార్త విని అవాక్కయిన అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో కరోనా కాదు కదా దాని ‘బాబు’ కూడా అడుగుపెట్టలేరని, అలాంటి వాతావరణ పరిస్థితులు జిల్లాలో ఉన్నా... ఎన్నికలు వాయిదా పడటం ఏమిటని ఆయా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కరోనాపై సర్కారు అప్రమత్తం కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇరవై హాస్పిటళ్లను అందుకోసం సిద్ధం చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 27 మందిని అబ్జర్వేషన్లో ఉంచాలని గుర్తించారు. 15 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు. 12 మందికి 28 రోజుల అబ్జర్వేషన్ కూడా పూర్తయి వారంతా ఆరోగ్యంగా ఉన్నారని తేల్చారు. ఇంత వరకూ విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. నిజానికి ఈ వైరస్ సోకిన వంద మందిలో 85 మంది వైద్యం పొంది వైరస్ నుంచి విముక్తి పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో కేవలం 3 శాతం మంది మాత్రమే మృత్యువాత పడుతున్నారు. వారిలో కూడా వయసుమీద పడిన వారు, హైపర్ టెన్షన్ ఉన్నవారే. ఈ వైరస్ చిన్నపిల్లల జోలికి పెద్దగా వచ్చింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరుపుకునే అవకాశం ఉన్నప్పటికీ వాయిదా వేయడం విమర్శలకు తావిస్తోంది. సంక్షేమానికి అవరోధం ఎన్నికల వాయిదాతో జిల్లాలో సంక్షేమానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజు స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. పేదలందరికీ ఇళ్లు అనే పథకంలో భాగంగా జిల్లాలో ఇళ్ల స్థలాలు లేని 61,781 కుటుంబాలను జిల్లా అధికారులు వలంటీర్ల సాయంతో గుర్తించారు. వీరిలో పట్టణ ప్రాంతాల్లో 30,108 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 31,681 మందిని అర్హులుగా గుర్తించారు. కానీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఇళ్ల స్థలాల పంపిణీ చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల తర్వాతైనా వస్తాయని పేద ప్రజలు ఆశతో ఉండగా ఎన్నికలు వాయిదా వల్ల కోడ్ ఇంకా కొన్నాళ్లు కొనసాగి, స్థలాలు రావడం ఇంకా ఆలస్యం అవుతోంది. జగనన్న చేదోడు పథకం ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏటా రూ.10 వేలు చొప్పున ఐదేళ్లు ఇవ్వాలనుకున్నారు. కోడ్ వల్ల ఈ పథకం ఆగిపోయింది. జగనన్న కాపునేస్తం పథకం ద్వారా ఏటా రూ.15వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75వేలు కాపు సామాజిక వర్గంలోని 45 ఏళ్లు నిండిన మహిళలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనికీ బ్రేక్ పడింది. కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. అలాగే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం అందించే రుణాలకు ఇటీవలే ఇంటర్వ్యూలు జరిగాయి. వాటిని మంజూరు చేసేందుకు కోడ్ అడ్డంకిగా మారింది. ఉపాధిహామీ కన్వర్జన్సీ నిధులు రూ.350 కోట్లు జిల్లాలో ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకూ కేవలం రూ.50 కోట్లు వరకూ మాత్రమే వినియోగించారు. ఈ నెలాఖరులోగా పనులు మొదలు పెట్టకపోతే మిగిలిన నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. త్వరగా ఎన్నికలు పూర్తయితే ప్రజలకు ఈ పథకాలన్నిటినీ చేరువ చేయాలని, ఉన్న నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ‘కరోనా కుట్ర’ వల్ల అది సాధ్యమయ్యేలా లేదు. అధికారుల దిగ్భ్రాంతి జిల్లా అధికారులు సైతం ఎన్నికల కమిషన్ నిర్ణయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా షెడ్యూల్ నిర్ణయించిన అధికారులతో సమీక్షలను జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ రద్దు చేసుకున్నారు. కరోనా వైరస్‌పై మాత్రం సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష చేయనున్నా రు. కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకుని ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేయడంపై జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో జిల్లాలో మూడు జెడ్పీటీసీ, 55 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందని, రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో తమ పారీ్టకి ఇదే ప్రజాదరణ రావడాన్ని చూసి తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు కుట్ర పన్నారని వారు విమర్శిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఎన్నికల కమిషన్ ఈ విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల వాయిదా ఏకపక్ష నిర్ణయం ఎన్నికలు వాయిదా విషయం టీవీల్లో చూసి ఆశ్చర్యపోయా. వెంటనే పంచాయతీరాజ్ కమిషనర్, ప్రిన్స్‌పాల్ సెక్రటరీ, డీజీపీలతో మాట్లాడితే ఎవరికీ తెలియదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఎవరినీ సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారు. చంద్రబాబుకు గురుదక్షిణగా రమే‹Ùకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ఉంటే అధికారులతో ఎందుకు సమీక్షించలేదు. రాజకీయపారీ్టలతో ముందుగా ఎందుకు సమావేశం ఏర్పా టు చేయలేదు. ప్రజాస్వామ్య వాదులంతా ఆలోచించాలి. ఎన్నికల వాయిదాపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. – బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆ నిర్ణయం అప్రజాస్వామ్యం ఎన్నికల వాయిదా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రమేయంతోనే జరిగింది. అన్ని రాజకీయ పారీ్టల సమావేశంలో కరోనా వైరస్ ఉంది ఎన్నికలు వాయిదా వేయాలని టీడీపీ, సీపీఐ కోరాయి. ఎన్నికల కమిషనర్ చంద్రబాబు కులానికి చెందిన వారు. ఆయన టైంలో నియమించిన రమే‹Ùకుమార్ కావడంతో వారి ఆలోచన ప్రకారం వాయిదా వేశారు. ఎన్నికల వాయిదా అప్రజాస్వామ్యం. రాష్ట్రానికి రావాల్సిన రూ.5వేల కోట్లు రాకుండా చేయాలన్న రాజకీయ దురుద్దేశంతో వాయిదా వేశారు. రాష్ట్రాన్ని బాగు చేసే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. – బెల్లాన చంద్రశేఖర్, పార్లమెంటు సభ్యులు, విజయనగరం -
ఢిల్లీ అల్లర్లు : సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : అల్లర్లతో దేశ రాజధాని అట్టుడుకుతున్న క్రమంలో ఈనెల 28, 29 తేదీల్లో ఈశాన్య ఢిల్లీలో జరగాల్సిన పది, పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్టు సీబీఎస్ఈ గురువారం వెల్లడించింది. ఈ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత నిర్వహిస్తామని సీబీఎస్ఈ ట్వీట్ చేసింది. ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్ధితి సజావుగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం సైతం పరీక్షలను వాయిదా వేయాలని సీబీఎస్ఈని కోరింది. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో బోర్డు ఎగ్జామ్స్ కోసం సమగ్ర కార్యాచరణ ప్రకటించాలని ఢిల్లీ హైకోర్టు సీబీఎస్ఈని ఆదేశించింది. ఇక ఈశాన్య ఢిల్లీలోని 80 పరీక్షా కేంద్రాల్లో నేడు జరగాల్సిన పన్నెండో తరగతి బోర్డు పరీక్షను వాయిదా వేసినట్టు సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది. -
ఆగని నిరసనల హోరు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు ఆగలేదు. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్‌తోపాటు ఎన్డీఏ పక్షం సభ్యులు తమ డిమాండ్లపై నిరసనలు తెలిపారు. దీంతో బడ్జెట్ మలి విడత సమావేశాల్లో ఆరో రోజూ ఎటువంటి కార్యకలాపాలు లేకుం డానే సభలు వాయిదాపడ్డాయి. లోక్‌సభ ఉదయం సమావేశం కాగానే వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్లకార్డులతో వెల్‌లోకి వచ్చి నినాదాలు చేపట్టారు. తెలంగాణకు రిజర్వేషన్ల కోటా కోసం టీఆర్ఎస్, కావేరి బోర్డు ఏర్పాటు కోరుతూ ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను 11 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాకా ఆందోళనలు కొనసాగాయి. ఇదే సమయంలో ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శుక్లా ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లును ప్రవేశ పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే సభ్యులు వెల్‌లో నినాదాలు చేస్తుండటంతో ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభ స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాల సభ్యులు నిరసనలు చేపట్టడం తో మధ్యాహ్నానికి వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక వైఎస్సార్సీపీ, టీఎంసీ, ఆప్ సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రాజధాని ఢిల్లీలో సీలింగ్ డ్రైవ్‌ను వెంటనే నిలిపివేయా లంటూ ఆమ్ఆద్మీ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశా రు. తిరిగి సమావేశమయ్యాక నిరసనలు మధ్యనే గ్రామీణాభివృద్ధిపై పార్లమెంట రీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసుల అమలుపై తాగునీరు, పారిశుద్ధ్యం శాఖ సహాయ మంత్రి ఎస్ఎస్ అహ్లూవాలియా ఒక ప్రకటన చేశారు. ఆందోళనలు ఆగకపోవటంతో డిప్యూటీ స్పీకర్æసభను మంగళవారానికి వాయిదావేశారు. -
కుదిపేసిన బ్యాంకింగ్ స్కాంలు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనల మధ్య మలిదశ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఊహించినట్లే బ్యాంకింగ్ కుంభకోణాలపై విపక్షాలు ఉభయ సభల్ని స్తంభింపచేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంపై ప్రత్యేక చర్చ చేపట్టాలని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్, తృణమూల్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభ, రాజ్యసభల్లో పోడియంను చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించాయి. రిజర్వేషన్ల అంశంపై లోక్‌సభలో టీఆర్ఎస్, కావేరీ నదీ జలాల బోర్డు ఏర్పాటుపై సమాధానం చెప్పాలని పట్టుబడుతూ ఉభయ సభల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు ఆందోళన కొనసాగించాయి. ప్రశ్నోత్తరాల్లేకుండానే... పీఎన్బీ కుంభకోణంపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగింది. దీంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టకుండానే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక.. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి పీఎన్బీ కుంభకోణం సూత్రధారి నీరవ్ మోదీ ఎక్కడున్నారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే అంశంపై నినాదాలు చేస్తూ కాంగ్రెస్‌కు జతకలిసింది. తెలంగాణలో ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రానికే విడిచిపెట్టేలా ఆర్టికల్ 16ను సవరించాలని ఆ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఉదయం లోక్‌సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సభలోకి రాగానే బీజేపీ సభ్యులు చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులకు మోదీ అభివాదం చేశారు. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాల విజయానికి సంకేతంగా బీజేపీ ఎంపీలు అస్సామీ గమోసా(కండువా)లతో దర్శనమిచ్చారు. నిబంధన మేరకు చర్చకు అనుమతిస్తా అటు పీఎన్బీ కుంభకోణంపై రాజ్యసభలోను ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే తృణమూల్ కాంగ్రెస్ బ్యాంకింగ్ కుంభకోణాల్ని ప్రస్తావించగా.. కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటుపై సుప్రీం ఆదేశాల్ని అమలుచేయాలని అన్నాడీఎంకే, డీఎంకేలు పట్టుబట్టాయి. దీంతో చైర్మన్ వెంకయ్య నాయుడు సభను పదినిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సమావేశమయ్యాక వెంకయ్య మాట్లాడుతూ.. పీఎన్బీ అంశంపై చర్చించాలని 267 నిబంధన కింద పలువురు సభ్యుల నుంచి నోటీసులు అందాయని తెలిపారు. పీఎన్బీ కుంభకోణం అంశం చాలా ముఖ్యమైందని.. అయితే 267 కింద కాకుండా 176 నిబంధన మేరకు చర్చకు అనుమతి స్తానని చెప్పారు. నీరవ్ మోదీని భారత్‌కు తీసుకురావాలంటూ తృణమూల్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ మరోసారి సమావేశమైనా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించడంతో మంగళవారానికి వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం చర్చ చేపట్టాలి: ప్రతిపక్షాలు బ్యాంకింగ్ స్కాంలపై మంగళవారం 4 గంటలపాటు చర్చించా లని లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన జరిగిన భేటీలో తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ సభ్యులు మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటలకు చర్చను చేపట్టాలని కోరారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ ఈ భేటీలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. -
స్ధానిక ఎన్నికల హంగామా