
న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ ఉద్యోగాలకు అర్హత కల్పించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఈ నెల 31న జరగాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న తిరిగి మరోమారు యూపీఎస్సీ అధికారులు సమావేశమై దీనిపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష కూడా వాయిదా పడినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు యూపీఎస్సీ వెబ్‌సైట్ చూడాల్సిందిగా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment