న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులకు సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) పాలసీదారులకు ఊరటనిచ్చే విధంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. వాయిదా పద్ధ్దతిలో ఆరోగ్య బీమా చెల్లింపులను స్వీకరించే విధంగా బీమా కంపెనీలకు వెసులుబాటు ఇచ్చింది. అయితే.. నెలా, త్రైమాసికం, ఆరు నెలల చెల్లింపులకు అవకాశం కల్పించే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టనిచ్చింది. పాలసీ ప్రీమియం, ప్రాడక్ట్ ఆధారంగా బీమా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. కరోనా దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అనేక మంది ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కునే అవకాశాలు ఉన్నందున ఐఆర్‌డీఏఐ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల్లో వెసులుబాటుకు అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు సంబంధించిన పాలసీలకు వాయిదా పద్ధతి అమల్లో ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment