Premium payment
-
వాయిదా పద్ధతిలో ఆరోగ్య బీమా చెల్లింపునకు అవకాశం
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులకు సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) పాలసీదారులకు ఊరటనిచ్చే విధంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. వాయిదా పద్ధ్దతిలో ఆరోగ్య బీమా చెల్లింపులను స్వీకరించే విధంగా బీమా కంపెనీలకు వెసులుబాటు ఇచ్చింది. అయితే.. నెలా, త్రైమాసికం, ఆరు నెలల చెల్లింపులకు అవకాశం కల్పించే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టనిచ్చింది. పాలసీ ప్రీమియం, ప్రాడక్ట్ ఆధారంగా బీమా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. కరోనా దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కారణంగా లాక్డౌన్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అనేక మంది ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కునే అవకాశాలు ఉన్నందున ఐఆర్డీఏఐ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల్లో వెసులుబాటుకు అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు సంబంధించిన పాలసీలకు వాయిదా పద్ధతి అమల్లో ఉండనుంది. -
ఎల్ఐసీ ప్రీమియం గడువు పొడిగింపు
ముంబై: కోవిడ్–19 కారణంగా వాయిదాల చెల్లింపు గడువును 30 రోజుల పాటు పెంచుతున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా పాలసీదారులు సమస్యలు ఎదుర్కొంటున్నందున మార్చి, ఏప్రిల్ గడువుల చెల్లింపులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. గ్రేస్ పీరియడ్ మార్చి 22తో ముగిసినా ఏప్రిల్ 15వరకూ అనుమతిస్తున్నట్లు తెలిపింది. సర్వీసు చార్జీలు లేకుండా ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించవచ్చని పేర్కొంది. మొబైల్ యాప్ ఎల్ఐసీ పే డైరెక్ట్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, భీమ్, యూపీఐల ద్వారా చెల్లించవ్చని తెలిపింది. ఐడీబీఐ, యాక్సిస్ బ్యాంకుల వద్ద, కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్సీ)ల ద్వారా ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొంది. కోవిడ్ –19తో మరణించిన 16 మంది పాలసీదారుల సంబంధీకులకు డబ్బులు చెల్లించినట్లు స్పష్టం చేసింది. అదేవిధంగా, మార్చి, ఏప్రిల్, మే నెలలకు చెల్లించాల్సిన బీమా ప్రీమియంను జూన్ 30 వరకూ పెనాల్టీ లేకుండానే చెల్లించవచ్చని తపాశాల శాఖ ప్రకటించింది. వీటిలో పోస్టల్ లైఫ్ న్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలున్నాయి. రిజిస్టర్డ్ పోర్టల్ ద్వారా వినియోగదారులు ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొంది. -
ప్రీమియంల చెల్లింపునకు మరో 30 రోజుల వ్యవధి
న్యూఢిల్లీ: కరోనావైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జీవిత బీమా పాలసీదారులకు ప్రీమియంల చెల్లింపు విషయంలో వెసులుబాటునిస్తూ బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిర్ణయం తీసుకుంది. మార్చి, ఏప్రిల్‌లో కట్టాల్సిన రెన్యువల్ ప్రీమియంలకు సంబంధించి పాలసీదారులకు మరో 30 రోజుల వ్యవధి ఉంటుందని వెల్లడించింది. జీవిత బీమా సంస్థలు, లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ విజ్ఞప్తుల మేరకు తాజా నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య బీమా, వాహన థర్డ్ పార్టీ బీమా పాలసీలకు ఐఆర్డీఏఐ ఇప్పటికే ఈ వెసులుబాటు ప్రకటించింది. మార్చి 25 – ఏప్రిల్ 14 మధ్య కట్టాల్సిన మోటార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఏప్రిల్ 21లోగా చెల్లించవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఈ వ్యవధిలో రిస్క్ కవర్ కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు, నియంత్రణ సంస్థకు బీమా రంగ సంస్థలు సమర్పించాల్సిన రిటర్న్స్ విషయంలోనూ మరికాస్త వ్యవధినిచ్చింది. నెలవారీ రిటర్న్‌లకు అదనంగా 15 రోజులు, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక రిటర్నులు సమర్పించేందుకు 30 రోజుల వ్యవధి లభిస్తుంది. -
రుణానికి ముందే ప్రీమియం చెల్లింపు
♦ ఆ విధంగా రైతుల తరఫున బ్యాంకులకు అనుమతివ్వాలి ♦ కేంద్రానికి లేఖ రాయాలని వ్యవసాయ శాఖ నిర్ణయం ♦ రుణానికి, ప్రీమియం చెల్లింపునకు మధ్య గందరగోళం సాక్షి, హైదరాబాద్: రుణాలు ఇవ్వడానికి ముందే పంటల ప్రీమియాన్ని రైతుల తర ఫున బ్యాంకులు బీమా కంపెనీలకు చెల్లిం చాలని, ఈ విషయమై బ్యాంకులను ఆదేశించాలని కోరుతూ వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది. పంట సాగు కాలం, వాటి బీమా ప్రీమియం చెల్లింపు గడువు, బ్యాంకు రుణాల పంపిణీ మధ్య అగాధం నెలకొనడంతో వ్యవసాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తి, మిర్చి పంటలకు అనుగుణంగా ప్రీమియం చెల్లింపు గడువు తేదీలు లేవని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. పత్తికి బీమా ప్రీమియం చెల్లించేందుకు జూన్ 15, మిర్చికి జూలై 9వ తేదీ వరకే గడువుంది. పత్తికి జూలై 31 వరకూ పొడిగించారు. 40 శాతానికి మించని చెల్లింపు.. రాష్ట్రంలో ఈ ఏడాది పత్తి పంట అత్యధికంగా సాగవుతోంది. ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. అందులో ఇప్పటివరకు 75.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా 42.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇప్పటివరకు సాగైన అన్ని పంటల్లో ఒక్క పత్తే 55.78 శాతం కావడం గమనార్హం. పత్తికి ఆదరణ ఉన్నా, రైతులు ప్రీమియం చెల్లించడానికి ముందుకు వస్తున్నా గడువు తేదీలు అనుకూలంగా లేకపోవడంతో 101 శాతం పత్తి సాగైనా 40 శాతానికి మించి బీమా ప్రీమియం చెల్లించలేదని వ్యవసాయాధికారులే చెబుతున్నారు. దీంతో పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదముందంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో వ్యవసాయాధికారులు లేవనెత్తారు. ముందే ఏ పంట సాగు చేస్తారో, దానికి బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లింపునకు రైతుల నుంచి లిఖితపూర్వక అంగీకారం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని బ్యాంకు వర్గాలు వ్యవసాయ శాఖకు చెప్పాయి. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటే అమలు చేస్తామని స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి లేఖ రాస్తామని పార్థసారథి వివరించారు. నష్టపోతున్న రైతులు.. ఆయా పంటలకు వాతావరణ పంటల బీమా పథకం కింద రైతులు బీమా ప్రీమియం చెల్లించాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడా ప్రీమియం చెల్లింపు గడువు నాటికి పత్తి, మిర్చి పంటల సాగు పూర్తికాదు. పైగా బ్యాంకులు కూడా జూన్, జూలై నెలల్లో పంట రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో రైతులంతా ఆగస్టు, సెప్టెంబర్‌లోనే రుణాలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అప్పటికే వాతావరణ పంటల బీమా పథకం కింద ప్రీమియం చెల్లించే గడువు తేదీలు ముగిసిపోతున్నాయి. దీంతో బ్యాంకు రుణం ద్వారా బీమా ప్రీమియం చెల్లించాల్సిన రైతులంతా నష్టపోతున్నారని, ఈ అంశాన్ని లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. బ్యాంకు వర్గాలు కూడా ఇదే విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చాయన్నారు. -
పంటల బీమా గోవిందా!
ఈ నెల 9తో ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు గడువు పెంచాలని కేంద్రానికి వ్యవసాయ శాఖ లేఖ హైదరాబాద్: వాతావరణ ఆధారిత పంటల బీమా పరిధిలోకి వచ్చే పత్తి, మిరప పంటల రైతులు ఈసారి పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం నెలకొంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తమకు అక్కరకు వచ్చే పంటల బీమాను రైతులు ఈ నెల 9తో ముగిసిన గడువులోగా చెల్లించలేకపోవడమే అందుకు కారణం. వాస్తవానికి రైతులు బ్యాంకుల నుంచి కొత్త రుణాలు తీసుకొని ప్రీమియం చెల్లించాలనుకున్నా సర్కారు రెండో విడత రుణమాఫీ సొమ్మును సగమే చెల్లించడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. ఫలితంగా రైతులు బీమా సొమ్ము చెల్లించలే ని పరిస్థితి ఏర్పడింది. రుతుపవనాలు సకాలంలో వచ్చి వర్షాలు కురవడంతో ఈ ఖరీఫ్‌లో రైతులు పెద్ద ఎత్తున పంటల సాగు మొదలుపెట్టారు. ఇప్పటివరకు మొత్తం 54.77 లక్షల ఎకరాల్లో పంటల సాగు మొదలవగా అందులో అత్యధికంగా 32.77 లక్షల ఎకరాల్లో పత్తి, 3 వేల ఎకరాల్లో మిరప సాగు మొదలైంది. కానీ గత 20 రోజుల నుంచి వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా రైతులకు వాతావరణ బీమా ప్రయోజనకరంగా ఉండేది. కానీ ఈసారి అత్యధిక శాతం మంది రైతులు వాతావరణ ఆధారిత బీమాకు నోచుకునే పరిస్థితి దాటిపోయింది. పత్తి పంటకు సంబంధించి వాతావరణ ఆధారిత బీమా ప్రీమియానికి ఈ నెల 5న గడువు ముగియగా మిరపకు 9న గడువు ముగిసింది. అప్పటివరకు రైతులందరికీ కలిపి బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ. 1,200 కోట్లకు మించలేదు. అందువల్ల చాలా మంది ప్రీమియం చెల్లించలేకపోయారు. తెలంగాణలో బ్యాంకు రుణాలు పొందే రైతులు దాదాపు 41 లక్షల మంది వరకు ఉంటారు. వారు కాకుండా రుణాలు తీసుకోనివారు మరో 20 లక్షల మంది వరకు ఉండొచ్చని అంచనా. వీరంతా ప్రీమియం చెల్లిస్తారు. వీరిలో ఇప్పటివరకు నాలుగైదు శాతానికి మించి బీమా ప్రీమియం చెల్లించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో వాతావరణ ఆధారిత బీమా ప్రీమియం గడువు పెంచాలని కోరుతూ వ్యవసాయశాఖ కేంద్రానికి లేఖ రాసింది. వచ్చే నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని కోరింది. కేంద్రం అనుమతిస్తే ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది. లేకుంటే అంతే సంగతులు. -
బీమాపై ఏదీ ధీమా
శంషాబాద్ రూరల్: ప్రతికూల పరిస్థితుల్లో పంటల నష్టం నుంచి కాపాడే పంట బీమాపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రీమియం చెల్లింపు గడువుపై ఇంకా స్పష్టత రావడం లేదు. జూలై వరకు ఉన్న గడువును ఆగస్టు నెలాఖరి దాకా పొడగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వ్యవసాయశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఈ విషయంపై రైతులకు సరైన సమాచారం అందడంలేదు. ప్రస్తుతం వర్షాభావం కారణంగా మండల పరిధిలో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. చినుకుపై ఆశ పెట్టుకున్న రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగును భారీగా చేపట్టారు. బోర్లలో నీటిమట్టాలు తగ్గుతుండడం, వర్షాలు మొహం చాటేయడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. రామంజాపూర్, ననాజీపూర్, కాచారం, మల్కారం, సుల్తాన్‌పల్లి, జూకల్, పెద్దషాపూర్, పెద్దగోల్కొండ, పాల్మాకుల, పెద్దతూప్ర, చిన్నగోల్కొండ, నర్కూడ, కవ్వగూడ తదితర గ్రామాల్లో రైతులు బోర్ల కింద వరి సాగు చేపట్టారు. వర్షాధారంగా చాలా చోట్ల మొక్కజొన్న పంటలు వేసుకున్నారు. వర్షాలు సాగుకు అనుకూలంగా లేకపోయినప్పటికీ రైతులు ధైర్యం చేసి పంటలు వేశారు. రోజురోజుకు పరిస్థితులు అధ్వానంగా మారుతుండడంతో రైతులకు దిక్కు తోచడంలేదు. ఇదే సమయంలో పంటలకు బీమా చెల్లించడానికి రైతులకు ఎలాంటి సమాచారం అందడం లేదు. కొన్ని చోట్ల రైతులు వరినాట్లు వేస్తుండగా నెల రోజుల కిందటే మొక్కజొన్న విత్తనాలు వేశారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట ఎండుముఖం పడుతోంది. బోర్ల కింద సాగు చేసిన వరి చేలు బీటలు వారుతున్నాయి. పంటల పరిస్థితిని చూస్తే రైతులకు కన్నీరాగడం లేదు. వానలు కురవక దిగుబడి రాకుంటే పంట బీమా ప్రీమియం కట్టిన రైతులకు నష్టపరిహారం వచ్చే అవకాశాలుంటాయి. ప్రీమియం ధరలు పెరిగే అవకాశాలు.. పంట బీమా ప్రీమియం ధరలు పెరిగే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, జొన్న పంటలను గ్రామం యూనిట్ గా బీమా వర్తింపజేస్తున్నారు. మినుములు, పెసర్లు, కంది, ఆముదం, పత్తి, పసుపు పంటలను వేరుగా బీమా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం ధరలు పెంచనున్నట్లు సమాచారం. ఆగస్టు నెల సగం గడిచిపోయింది, ఇంకా ప్రీమియం గడువుపై ఉత్తర్వులు రాక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. -
బీమా లేనట్టే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : మొక్కజొన్న పంట బీమాపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. వాస్తవానికి జులై నెలాఖరు నాటికి బీమాకు సంబంధించి ప్రీమియం చెల్లింపు గడువు ముగిసింది. అయితే సర్కారు వైఖరితో జిల్లా రైతాంగం ప్రీమియం చెల్లింపునకు నోచుకోలేదు. తాజాగా తేరుకున్న జిల్లా వ్యవసాయ శాఖ.. బీమా చెల్లించేం దుకు రైతులకు గడువు ఇవ్వాలంటూ బీమా సంస్థకు లిఖితపూర్వకంగా కోరినప్పటికీ ఈ అంశంపై స్పష్టత రాకపోవడంతో రైతుల చివరి ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి కనిపిస్తోంది. వారంలో తేలకుంటే అంతేసంగతి.. సాధారణంగా పంటబీమాకు సంబంధించి ప్రతి రైతు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం పొందే రైతులకుగాను నేరుగా వారి బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం డబ్బులు కోత పెట్టి మిగతా రుణాన్ని రైతుకు ఇస్తారు. కానీ బ్యాంకు రుణం పొందని రైతులు మాత్రం నేరుగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జులై31 నాటితో గడువు ముగిసింది. జిల్లాలో మొక్కజొన్న పంటబీమాపై ప్రభుత్వం ఇప్పటికీ ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో అధికారుల్లో గందరగోళం నెలకొంది. ఫలితంగా ప్రీమియంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో జిల్లా రైతులు ప్రీమియం చెల్లించలేకపోయారు. ఇటీవల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ ఈ అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో చర్యలకు దిగిన జిల్లా వ్యవసాయశాఖ ఇన్యూరెన్స్ సంస్థకు లిఖితపూర్వకంగా పరిస్థితిని వివరించారు. స్పందన కరువు.. జిల్లాలో గతేడాది మొక్కజొన్న కు సంబంధించి రెండువేల మంది రైతులు బీమాకు దరఖాస్తు చేసుకుని ప్రీమియం చెల్లించారు. అదేవిధంగా బ్యాంకు రుణాలు పొందిన రైతుల కేటగిరీలో పెద్ద సంఖ్యలో బీమా ప్రీమియం చెల్లించారు. తాజాగా ప్రభుత్వం బీమాకు సంబంధించిన ఉత్తర్వులివ్వకపోవడంతో రైతులు ప్రీమియం చెల్లించలేదు. మరోవైపు బీమా సంస్థకు లిఖిత పూర్వకంగా లేఖ రాసినా స్పందన కరువైంది. ప్రస్తుతం జిల్లాలో 30వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగవుతోంది. తాజాగా నెలకొన్న కరువు పరిస్థితులతో పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులకు బీమాకు అర్హులైతే నష్టం వచ్చినా కొంతైనా లబ్ధి చేకూరేది. కానీ బీమాపట్ల స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది.