Indian Forest Service
-
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాలు విడుదల.. బాపట్ల యువకుడికి ఫస్ట్ ర్యాంక్
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) ఎగ్జామినేషన్-2022 తుది ఫలితాలను యూపీఎస్సీ జులై 1న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 147 మందిని ఐఎఫ్ఎస్కు యూపీఎస్సీ ఎంపిక చేసింది. కాగా బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ మొదటి ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన సాహితిరెడ్డికి 48, తొగరు సూర్యతేజకు 66వ ర్యాంకు వచ్చింది. జనరల్ క్యాటగిరీలో 39 మంది, ఈడబ్ల్యూఎస్- 21, ఓబీసీ 54, ఎస్సీ-22- ఎస్టీ 11.. మొత్తం 147 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. కాగా ఐఎఫ్ఎస్ పరీక్షకు సంబంధించి గతేడాది నవంబర్‌లో రాత పరీక్షలను నిర్వహించగా.. ఇంటర్వ్యూలను ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పొరుగింటి పచ్చదనం
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : గత పదేళ్లలో తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ (647 చ.కి.మీ) తర్వాత పచ్చదనం పెరిగిన రెండో రాష్ట్రం తెలంగాణ అని ఇండియన్ ఫారెస్ట్ సర్విస్ రిపోర్ట్ తాజాగా వెల్లడించింది. తెలంగాణలో వేగంగా పట్టణీకరణ పెరుగుతున్న సమయంలో ఇది సంతోషకర పరిణామమే అయినా.. పర్యావరణవేత్తలు, జీవ వైవిధ్య నిపుణులు మాత్రం ఒక అంశంపై పెదవి విరుస్తున్నారు. అదేమిటంటే.. విస్తరిస్తున్న వనాల్లో స్థానిక మొక్కలు లేకపోవడం, ట్రాన్స్‌లొకేషన్ (భారీ వృక్షాలను ఒకచోటి నుంచి మరోచోటికి తరలించడం)లో సక్సెస్ రేటు సగం కూడా లేకపోవటమే. దక్కన్ పీఠభూమి విస్తారమైన ఆయుర్వేద మొక్కల నిలయమని, దేశంలోని జీవవైవిధ్య మండలాల్లో అత్యధిక దిగుబడి, పునరుత్పత్తి కలిగిన పశ్చి మ, తూర్పు కనుమల్లోని మొక్కలు, వృక్షాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కనిపించే పరిస్థితి ఉండేదని నిపుణులు చెప్తున్నారు. కానీ నేడు ఎక్కడ చూసినా విదేశీ జాతుల మొక్కలకే ప్రాధాన్యమివ్వటం వల్ల జీవవైవిధ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తలెత్తుకు నిలబడింది.. మూసీ ఒడ్డున ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోని ఈ చింతచెట్టు వయసు సుమారు 425 సంవత్సరాలపైనే. అయినా నిటారుగా నిలబడింది. వానలు, వరదలెన్ని వచ్చినా కదల్లేదు.. కారణం లోకల్ జాతి కావటమే. ఇక్కడి వాతావరణం, భూమితో పెనవేసుకున్న బలమైన బంధంతో ఇంకా అందరి ‘చింత’తీరుస్తోంది. ఈ చెట్టే 1908 నాటి మూసీ వరదల్లో 150 మంది ప్రాణాలు కాపాడింది. ఆ ఏడాది సెపె్టంబర్ 27, 28 తేదీల్లో కుండపోత వానతో మూసీ ఉప్పొంగి తీర ప్రాంతాలను ముంచెత్తగా.. ఈ చెట్టు ఎక్కి కూర్చున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. అందుకే ఈ చెట్టుకు ఏటా సెప్టెంబర్ 28న ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ‘బాగ్’నగర్లో.. బాగ్‌లు మాయం.. హైదరాబాద్ అంటేనే ‘బాగ్ నగర్’.. అంటే ఉద్యాన వనాల నగరం అని అర్థం. అప్పట్లో నగరమంతా పరుచుకున్న మొక్కలు, వృక్షాలన్నీ అన్నీ స్థానిక వెరైటీలే. నగరంలో జాంబాగ్, కుందన్‌బాగ్, సీతారాంబాగ్, బషీర్‌బాగ్, రాంబాగ్, పూల్‌బాగ్, కిషన్‌బాగ్,, మూసారాంబాగ్ , ఇబ్రహీంబాగ్, బాగ్లింగంపల్లిలతోపాటు చింత వనాలతో నిండిన ఇమ్లీబన్, చింతలబస్తీలతో హైదరాబాద్ నగరం ప్రపంచ జీవ వైవిధ్య పటంలో ప్రత్యేకంగా నిలిచేది. తూర్పు, పశ్చి మ కనుమల్లో ఉండే ప్రతిమొక్క, వృక్షం మూసీ పరీవాహకంతోపాటు హైదరాబాద్ నగరంలో కనిపించేవని పర్యావరణవేత్త డాక్టర్ కె.పురుషోత్తంరెడ్డి చెప్తున్నారు. అందులో అత్యధికం ఔషధ గుణాలున్నవేనని.. గండిపేట నీళ్లు, హైదరాబాద్ గాలి తాకగానే మనుషుల్లో మార్పు స్పష్టంగా కనిపించేదని అంటున్నారు. కానీ క్రమంగా జనావాసాలు పెరగడం, కాలనీలు, రోడ్ల విస్తరణ, ప్రభుత్వ, చెరువు భూముల కబ్జాలతో స్థానిక రకాలైన మర్రి, రావి, వేప, చింత, నేరేడు తదితర వృక్షాలన్నీ కనిపించకుండా పోయాయి. వాటి స్థానంలో అందం కోసమంటూ ఇతర ప్రాంతాలు, దేశాలకు చెందిన మొక్కలు, చెట్లను పెంచేశారు. కానీ అవి బలంగా లేక, ఈదురుగాలులకు కూలిపడుతుండటంతో ఏటా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. హరితహారంలోనూ ఇలాగే..! రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలోనూ విదేశీ జాతుల మొక్కలనే ఎక్కువగా నాటుతున్నారు. స్థానిక జాతులైతే పెరిగేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయని.. వేగంగా పెరిగే విదేశీ జాతులను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఎడారి దేశాల్లో పెరిగే ‘కోనోకార్పస్’అనే మొక్కను రాష్ట్రమంతటా నాటారు. పెద్దగా నీటి తడి లేకున్నా పెరిగి, ఏడాదంతా పచ్చగా కనిపించే ఈ చెట్లు ఇప్పుడు అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోనూ కనిపిస్తున్నాయి. అయితే కోనోకార్పస్ పూల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ, ఆస్తమా వంటి సమస్యలు వస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. వాటి వేర్లు లోతుగా పాతుకుపోతూ.. మధ్యలో అడ్డు వచ్చే కమ్యూనికేషన్ కేబుళ్లు, డ్రైనేజీ లైన్లు, మంచినీటి వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని.. సమీపంలో ఇతర చెట్లు పెరగకుండా చేస్తున్నాయని గుర్తించారు. ఈ చెట్ల ఆకులను స్థానిక జంతువులేవీ తినవు కూడా. దీంతో ఇప్పటికే పలు దేశాలు, రాష్ట్రాలు కోనోకార్పస్ నాటడాన్ని నిషేధించాయి. ట్రాన్స్‌లొకేషన్.. ట్రాజెడీయే.. రహదారుల విస్తరణ సమయంలో భారీ వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్ చేస్తున్నా.. తదనంతర జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఆశించిన ఫలితం రావటం లేదు. అదే విధంగా వేసవి కాలంలో ట్రాన్స్‌లొకేషన్ చేయొద్దు. అయినా ఇదే సమయంలో చేస్తున్నారు. ట్రాన్స్‌లొకేషన్‌కు సంబంధించి త్వరలోనే ఓ ప్రొటోకాల్ విడుదల చేయనున్నాం. – ఉదయకృష్ణ, వట ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఇక్కడి ప్రతి మొక్కలో ఔషధ గుణాలే.. దక్కన్ పీఠభూమిలో పెరిగే ప్రతి మొక్క జీవ వైవిధ్యానికి పనికి వచ్చేదే. ప్రకృతి వర ప్రసాదాన్ని మనం రక్షించుకోలేకపోతున్నాం. ఇక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడ్డ వృక్షాలను తొలగించి.. వాటి స్థానంలో కాత, పూత లేని విదేశీ మొక్కలను నాటుతున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. తూర్పు, పశ్చి మ కనుమల్లో కనుగొన్న అపార వృక్ష సంపదను ప్రత్యేక విభాగాలతో సంరక్షించాల్సి ఉంది. – డాక్టర్ కె.తులసీరావు, జీవ వైవిధ్య నిపుణుడు -
కెమెరా కంటికి చిక్కిన అరుదైన చిరుత.. ఫోటో వైరల్..
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న అరుదైన చిరత ఒకటి కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోను ఫారెస్ట్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ ట్విట్టర్లో షేర్ చేయగా.. దాన్ని చూసి నెటిజన్ల వావ్ అంటున్నారు. రాత్రివేళ అడవిలో సంచరిస్తున్న వన్యమృగం అత్యద్భుతంగా కన్పిస్తోంది. ఈ అరుదైన చిరుతను క్లౌడెడ్ లీపార్డ్ అంటారు. దీని చారలు మేఘాల్లా కన్పించడం వల్ల ఆ పేరు వచ్చింది. ఈ వన్యప్రాణులు అత్యంత అరుదుగా కన్పిస్తుంటాయి. భారత్, నేపాల్ హిమాలయ పర్వత ప్రాంతం, ఇండోనేసియాలో మాత్రమే వీటి ఉనికి ఉంది. A fast, arboreal and one of the rare big cat species found in #India. Very less studied and understood. The range is also limited. Clouded leopards are beautiful creatures. See the amazing patterns. pic.twitter.com/dlJz0CoWNP — Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 18, 2022 ఈ క్లౌడెడ్ లీపార్డ్ల ఆహారపు అలవాట్లు ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దీని జీవన విధానం మిస్టరీగానే ఉంది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనే ఇవి కన్పిస్తుంటాయి. దీని గోర్లు చాలా పదునుగా ఉంటాయి. ఇవి ఎత్తు తక్కువే అయినప్పటికీ అత్యంత శక్తమంతంగా ఉంటాయి. బ్యాలెన్స్ మెయింటెన్ చేయడానికి పొడవాటి తోకను కలిగిఉంటాయి. ఆడ క్లౌడెడ్ లీపార్డ్.. ఏడాదికి ఐదు పిల్లల వరకు జన్మనివ్వగలదు. పుట్టిన 10 నెలల వరకు మాత్రమే ఈ చిరుతలు తల్లిపై ఆధారపడతాయి. ఆ తర్వాత స్వయంగా ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. చదవండి: 6 అడుగుల ఎత్తు.. 30 లక్షల ఉద్యోగం ఉన్నోడే కావాలి..! -
అడవిబిడ్డల గుండెల్లో శ్రీనివాస్
మైసూరు: తమ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించి, అడవిదొంగ వీరప్పన్ చేతిలో 29 ఏళ్ల కిందట హతమైన ఆంధ్రాకు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిని కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని అడవి బిడ్డలు నేటికీ ఆరాధిస్తున్నారు. వీరప్పన్ జన్మస్థలంలో ఆ అధికారి విగ్రహాన్ని ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజమండ్రికి చెందిన పందిళ్లపల్లి శ్రీనివాస్ కర్ణాటకలో డిప్యూటీ ఫారెస్ట్ కన్సర్వేటర్గా ఉంటూ వీరప్పన్‌ను పట్టుకునే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలో చామరాజనగర జిల్లాలోని గిరిజన గ్రామాలకు విద్యుత్, తాగునీరు, రోడ్ల నిర్మాణం, పక్కా ఇళ్ల మంజూరు వంటివి చేపట్టడంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. వీరప్పన్ స్వగ్రామం గోపినాథంలో శ్రీనివాస్ సొంత డబ్బుతో మారియమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో 1991, నవంబరు 10వ తేదీన తన స్వగ్రామం గోపినాథంలో లొంగిపోతానని శ్రీనివాస్‌కు వీరప్పన్ సమాచారం పంపించాడు. అయితే, వీరప్పన్ పథకం ప్రకారం గోపినాథం గ్రామంలోకి శ్రీనివాస్ రాగానే కాల్చి చంపాడు. శ్రీనివాస్ అందించిన సేవలను గోపినాథం, సమీప గ్రామాల అడవిబిడ్డలు నేటికీ మరిచిపోలేదు. శ్రీనివాస్ మరణించిన గోపినాథం గ్రామంలోని మారియమ్మ ఆలయం పక్కన ఆయన కాంస్య విగ్రహాన్ని గ్రామస్తులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదివారం శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొని శ్రీనివాస్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. (చదవండి: తల నరికేసే ఊరిలో రెండు దేశాల బోర్డర్) -
పీఎంవో డైరెక్టర్‌గా శ్వేతా సింగ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) డైరెక్టర్‌గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి శ్వేతా సింగ్ నియమితులయ్యారు. 2008 బ్యాచ్ అధికారి అయిన శ్వేతా సింగ్ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం పేర్కొంది. శ్వేతా సింగ్ జాయిన్ అయిన నాటి నుంచి మూడేళ్లపాటు నూతన బాధ్యతల్లో కొనసాగుతారు. అదేవిధంగా, పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా అనికేత్ గోవింద్ మాండవ్గానె నియామకాన్ని ఏసీసీ రద్దు చేసింది. 2009 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అధికారి అయిన అనికేత్ జూలై 18వ తేదీన ఆ పదవిలో నియమితులయ్యారు. -
ఈ ఫొటోలో చిరుత ఎక్కడుందో చెప్పుకోండి చూద్దాం!
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రమేష్ పాండే షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొండపై నక్కి ఉన్న మంచు చిరుతకు సంబంధించిన ఫొటోను ఫాంటమ్ క్యాట్ (పర్వతాల దెయ్యం )పేరిట ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రమేష్ పాండే పోస్ట్ చేసిన ఈ ఫోటోలో దాగి ఉన్న చిరుతను గుర్తించడానికి నెటిజన్లు చాలా కష్టపడుతున్నారు.అయితే, అది కొండ రంగులో కలిసిపోవడం వల్ల ఫొటో చూసిన వెంటనే గుర్తుపట్టడం కష్టం. ఇటువంటి సవాళ్లు ఆసక్తికరంగా ఉంటాయి.. కొన్నిసార్లు కష్టంగా ఉంటాయి. అయితే, ఈ ఫొటోలో చిరుతను గుర్తించలేక నెటిజన్లు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. మీకు కూడా చిరుత ఎక్కడుందో తెలియడం లేదా.. పర్లేదు మంచు చిరుతను మేం పట్టుకున్నాం. ఆ ఫొటోను మీకోసం అందిస్తున్నాం. Phantom cat….!They are called ghost of the mountains. If you can locate. @ryancragun pic.twitter.com/sG5nMyqM0S — Ramesh Pandey (@rameshpandeyifs) July 13, 2021 -
ఐఎఫ్ఎస్ల బదిలీ.. సీఎస్ కీలక ఉత్తర్వులు
సాక్షి,హైదరాబాద్: అటవీశాఖలో పనిచేస్తున్న పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ములుగులోని ఫారెస్ట్‌కాలేజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) పర్సన్ ఇన్చార్జి, డీన్‌గా ఉన్న డా.జి.చంద్రశేఖర్‌రెడ్డిని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా పోస్టింగ్ ఇచ్చారు. సీఎం కార్యాలయ ఓఎస్డీ /హైదరాబాద్ ఆర్ అండ్ డీ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రియాంక వర్ఘీస్‌కు ఎఫ్సీఆర్ఐ పర్సన్ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్ప గించారు. ఇక ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్‌గా బి.శ్రీనివాస్ నియమితులు కాగా ఆ స్థానంలో పనిచేస్తున్న డా.అశోక్ కుమార్ సిన్హా ను స్టేట్ ట్రేడింగ్ సర్కిల్ అదనపు పీసీసీఎఫ్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్‌గా ఉన్న ఎన్.క్షితిజను మహబూబ్‌నగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్‌గా బదిలీ చేశారు. -
జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది!
న్యూఢిల్లీ : తలుపులు మూసి కొడితే పిల్లి కూడా పులిలా విరుచుకుపడుతుందన్నట్లు.. కోపం వస్తే ఏ జంతువైనా తిరగబడటం కామన్. సాధు జంతువులు కూడా ఇందుకేమీ మినహాయింపు కాదు. పొడుగు కాళ్ల జీవి జిరాఫీకి కోపం తెప్పిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. దాన్నుంచి తప్పించుకుని పరిగెడదామన్నా కూడా ఆ ఛాన్స్ మనకు ఉండదు. ఎందుకంటే మనం 20 అడుగులు వేస్తే అది ఒక అడుగు వేస్తుంది! పిక్కబలంతో టక్కున పట్టేసుకుంటుంది. తాజాగా జిరాఫీ కోపానికి సంబంధించిన ఓ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుధా రమెన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ( వైరల్: పాము నీళ్లు తాగడం ఎప్పుడైనా చూశారా? ) దీనిపై ఆమె స్పందిస్తూ..‘‘ జిరాఫీ కాళ్లు ఎంత దృఢమైనవో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఒక్క దెబ్బతో మనిషిని మట్టి కరిపిస్తుంది. అలుపు లేకుండా అవి చాలా వేగంగా పరిగెత్తగలవు. ఫేస్బుక్లో చూసిన వీడియో’’ అని పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు..‘‘తర్వాత ఏమైంది? సగం వీడియోతో ఆత్రుత ఎలా వస్తుంది.. జురాసిక్ పార్క్ సినిమా చూసినట్లుంది. జిరాఫీతో గొడవ పెట్టుకోకండి. జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( పీక్కుతింటున్నా.. 5 గంటల పాటు ఓపికగా ) -
వైరల్: పాము నీళ్లు తాగడం చూశారా?
న్యూఢిల్లీ: పాము నీళ్లు తాగడం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా? అయితే ఇప్పుడు ఒక పాము అరచేతి నుంచి నీళ్లు తాగుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ అరుదైన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో పాము మనిషి అరచేతిలోని నీటిని నాలుకతో తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది సాధ్యం కాకపోవడంతో రెండు దవడలపై కొంచెం ప్రతికూల ఒత్తిడిని కలిగించి నీటిని తీసుకుంటుంది. ఆ వెంటనే నోటిని మూసివేసి సానుకూల ఒత్తిడిని సృష్టించుకొని నీటిని శరీరంలోకి పంపుతుంది' అంటూ వ్యాఖ్యానిస్తూ నందా ట్వీట్ చేశారు. కాగా.. ముద్దుగా, మురిపెంగా పాము నీటిని తాగుతూ గుటకలేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యింది. చదవండి: చిన్నారి ఏడుపు.. పాలు అందించిన పోలీస్ Snake sipping in some water. Tongue doesn’t help a snake get water. It is said that they depress their jaws creating negative pressure to draw the water & then seal up the mouth to create a positive pressure & push the water into their body. pic.twitter.com/5KZPxWsHDf — Susanta Nanda (@susantananda3) June 18, 2020 -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ప్రొబేషనరీ ఆఫీసర్స్
సాక్షి, అమరావతి : 2018 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ముఖ్యమంత్రిని కలిసిన యువ ఐఎఫ్ఎస్ అధికారుల్లో సుమన్ బెనీవాల్, వినీత్ కుమార్, జి. విఘ్నేష్ అప్పారావులు ఉన్నారు. కాగా వీరి వెంట రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఎస్. ప్రతీప్ కుమార్ కూడా ఉన్నారు.(మోసం చేసే మాటలు వద్దు: సీఎం జగన్) ఎస్ఎస్ఎల్ గ్రూఫ్ రూ. 50 లక్షల విరాళం అమరావతి : కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఎన్ ఎస్ ఎల్ గ్రూఫ్ రూ.50 లక్షలు విరాళమందించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎల్ గ్రూఫ్ చైర్మన్ ఎం. ప్రభాకర్‌రావు క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి చెక్కును అందించారు. ఆయన వెంట ఎండీ ఎం. వెంకరామచౌదరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. అంతేగాక కోటి రూపాయల విలువైన శానిటైజర్లు పంపిణీ చేయనున్నట్లు ఎన్ఎస్ఎల్ గ్రూఫ్ పేర్కొంది. -
యూపీఎస్సీ పరీక్షలు వాయిదా
న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఉద్యోగాలకు అర్హత కల్పించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఈ నెల 31న జరగాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న తిరిగి మరోమారు యూపీఎస్సీ అధికారులు సమావేశమై దీనిపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష కూడా వాయిదా పడినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు యూపీఎస్సీ వెబ్సైట్ చూడాల్సిందిగా సూచించారు. -
మంత్రుల అవినీతిని బయటపెట్టండి
న్యూఢిల్లీ: 2014–17 మధ్యకాలంలో కేంద్ర మంత్రులపై వచ్చిన అవినీతి ఫిర్యాదులను, వారిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని ముఖ్య సమాచార కమిషనర్ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆదేశించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సంజీవ్ చతుర్వేది పిటిషన్ మేరకు సమాచార కమిషనర్ రాధాకృష్ణ మాధుర్ పీఎంవోకు పైవిధంగా సూచించారు. మోదీ ప్రధాని అయిన తరువాత విదేశాల నుంచి రప్పించిన నల్లడబ్బుపై పూర్తి సమాచారం ఇవ్వాలని, రప్పించిన నల్లధనం దేశప్రజల బ్యాంకు ఖాతాల్లో ఎంత డిపాజిట్ చేశారో కూడా వెల్లడించాలని ఆయన పీఎంవోను ఆదేశించారు. సంజీవ్ చతుర్వేది గతంలోనే సమాచార హక్కు చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయానికి పై విషయాలపై దరఖాస్తు చేసుకున్నారు. అయితే నల్లధనం ‘సమాచారం’ కిందకు రాదని ఆయన దరఖాస్తును ప్రధాని కార్యాలయ వర్గాలు తిరస్కరించాయి. అయితే సమాచార కమిషనర్ ఈ వాదనను కొట్టిపారేశారు. దరఖాస్తుదారుడు తప్పుగా దరఖాస్తు చేశారనడంలో వాస్తవం లేదని, పీఎంవో వాదన సరికాదని ఆయన తేల్చిచెప్పారు. -
ఆత్మవిశ్వాసంతో అందలం
చిలకలూరిపేట: పుట్టింది పేద కుటుంబం..తండ్రి సా«ధారణ ఫొటోగ్రాఫర్..ఎన్నో ఆర్థిక ఇబ్బందులు..ఎడ్యుకేషన్ లోన్‌పై ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కృషీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. ఎందరో సామాన్య విద్యార్థులు యువకులకు ఆదర్శంగా నిలిచాడు చిలకలూరిపేట పట్టణానికి చెందిన చందోలు విజయనాగమణికంఠ. ఇటీవల యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 206 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. ఆదివారం ఒక అభినందన కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్టణానికి వచ్చిన ఆయన సాక్షితో అనుభవాలను పంచుకున్నారు. 2017లో ఇండియన్ ఫారెస్టు సర్వీసుకు ఎంపిక 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై ప్రిలిమ్స్‌లో అవలీలగా విజయం సాధించాను. మేము సిద్ధమైన తీరుకు భిన్నంగా అప్పటి వరకు కొనసాగుతున్న ప్యాట్రన్‌ను మార్చడంతో మెయిన్స్‌లో విజయం సాధించలేకపోయా. దీంతో నిరాశ అలుముకుంది. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. సివిల్స్‌కు సిద్ధమైన అనుభవంతో ఎస్బీఐ పీవో, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, సెంట్రల్ పారామిలటరీ ఫోర్సు పరీక్షల్లో విజయం సాధించా. సెంట్రల్ పారా మిలటరీ ఫోర్సులో డీఎస్పీ కేడర్ ఉద్యోగం లభించినా, చదువుకునే అవకాశం ఉండదని సర్కిల్ ఇన్స్పెక్టర్ కేడర్‌కు చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి శిక్షణలో చేరా. ఈ శిక్షణ కారణంగా 2014లో సివిల్స్‌కు హాజరు కాలేకపోయాను. 2015లో ప్రిలిమ్స్‌లో విజయం సాధించినా ఎఫ్ఆర్వో ఉద్యోగ శిక్షణ కారణంగా మెయిన్స్‌కు హాజరు కాలేదు. మూడో ప్రయత్నంగా 2017లో ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఇండియన్ ఫారెస్టు సర్వీసు ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యాను. డెహ్రడూన్‌లో శిక్షణ పొందుతున్నాను. నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్ శిక్షణకు ముందు కొంత సమయం ఖాళీ ఉండటంతో తిరిగి సివిల్స్ పరీక్ష రాసి 2018 ఏప్రిల్ 27న ప్రకటించిన ఫలితాల్లో నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. నాకు ఐపీఎస్, ఐఏఎస్‌లలో ఏదో ఒకటి సాధిస్తే చాలనుకున్నాను. ఏది సాధించినా ఎలా ప్రజలకు సేవ చేయాలి అనే విషయంలో పూర్తి స్పష్టత ఉంది. సివిల్స్‌కు మరో రెండు అవకాశాలు ఉన్నా ఐపీఎస్ పట్ల సంతృప్తి ఉండటంతో మరోసారి రాయదల్చుకోలేదు. ఐపీఎస్ అధికారిగా ప్రజలకు పూర్తిస్థాయి సేవలు అందించడమే లక్ష్యం. ఆత్మవిశ్వాసంతో మెలగాలి సాధారణ, నిరుపేద కుటుంబాలకు చెందినవారు తాము సివిల్స్‌లో విజయం సాధించలేమని నిరాశ పడుతుంటారు. ఆ భావన సరికాదు. ఎవరికైనా పట్టుదల, కృషి ఉంటే విజయం దానంతట అదే వరిస్తుంది. ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా కష్టపడి చదివించిన తల్లిదండ్రులు మంగాచారి, శారదదేవితో పాటు నన్ను నిరంతరం ప్రోత్సహించి ఐఏఎస్ అకాడమీలో శిక్షణకు సహకరించిన చిలకలూరిపేట డీఆర్ఎన్ఎస్సీవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఆర్యవైశ్య విద్యానిధి సంఘ కన్వీనర్ పొట్టి శ్రీరాములుకు జీవితాంతం రుణపడి ఉంటాను. రైల్వే ఉద్యోగం చేస్తూనే సన్నద్ధం నాన్న మంగాచారి సాధారణ ఫోటోగ్రాఫర్. అమ్మ శారదాదేవి గృహిణి. అన్న మధుబాబు డిగ్రీ చదివి ఉద్యోగం లభించక పోవడంతో ఫొటోగ్రాఫర్‌గా కొనసాగుతున్నాడు. ఇంటర్ వరకు ప్రకాశం జిల్లా మార్టూరులో చదువుకున్నాను. గుంటూరు జిల్లా బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్(కంప్యూటర్ సైన్సు) 2010లో పూర్తి చేశాను. ఎంటెక్ చదవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. టీసీఎస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం లభించినా ఏడాది తర్వాత చేరమన్నారు. బీటెక్ చదివే రోజుల్లో కొందరు సీనియర్లు కళాశాల లైబ్రరీలోని ప్రత్యేక విభాగంలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండేవాళ్లు. అప్పుడే నేనూ అవ్వాలన్న ఆకాంక్ష మొదలైంది. మనసులో సివిల్స్‌పై బలమైన కోరిక ఉన్నా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉండటం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా 2011లో రైల్వే మెయిల్ సర్వీసులో క్లరికల్ గ్రేడ్ ఉద్యోగం లభించడంతో అందులో చేరాను. పోస్టింగ్ ఏలూరులో లభించింది. డ్యూటీ సాయంత్రం 5 గంటల నుంచి మర్నాడు తెల్లవారు 5 గంటల వరకు రోజుమార్చి రోజు ఉండేది. చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకున్నా రోజుమార్చి రోజు డ్యూటీ కావడంతో చదువుకునేందుకు సమయం దొరికేది. గ్రంథాలయమే తొలిగురువు ఏలూరులోని జిల్లా గ్రంథాలయానికి వెళ్లేవాణ్ని. అక్కడ పోటీ పరీక్షలకు ప్రిపేర్అయ్యే కొందరు నిరుద్యోగులు క్యారేజీలలో అన్నం కట్టుకొని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు పుస్తకాలు, మ్యాగజైన్లు, న్యూస్‌పేపర్లు చదువుతుండేవారు. వారిని చూసి నేను ఎక్కువ సమయం చదివేందుకు కేటాయించడం ప్రారంభించాను. అక్కడ ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు చేరుకున్నాను. నేను పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. సివిల్స్ పరీక్షలు తెలుగులో రాసే అవకాశం ఉన్నా మెటీరియల్ లభ్యత ఇతర అవకాశాలు ఆంగ్లంలో ఎక్కువగా ఉండటంతో అందులోనే ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. నా రూంలో టీవీ కూడా లేకపోవడంతో చిన్న ట్రాన్సిస్టర్‌ను తెచ్చుకుని ఆల్ఇండియా రేడియోలో ఇంగ్లిష్ వార్తలు వినేవాణ్ని. అర్థం కాకపోయినా డిక్షనరీ తెచ్చుకుని పదేపదే ఇంగ్లిష్ మ్యాగజైన్లు చదివి ఆంగ్లంపై పట్టు సాధించా. 2012లో డాక్టర్ కొణిజేటి రోశయ్య ఐఏఎస్ అకాడమీలో చేరాను. వారు 10 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చారు. -
ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం ప్రకటించింది. గత నవంబర్‌లో ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి జరగబోయే తుది విడత మౌఖిక పరీక్ష(ఇంటర్వ్యూ)కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వారు తమ అర్హతల ధ్రువీకరణ పత్రాలను సమర్పించవలసి ఉంటుందని యూపీఎస్సీ ప్రకటించింది. ఫలితాల కోసం http://www.upsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది. -
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ దేశంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో.. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో.. కీలకపాత్ర పోషిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడుతోంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)! ఈ సర్వీస్‌కు ఎంపికకావడం ద్వారా ఉన్నత కెరీర్‌తో పాటు దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుంది. తాజాగా యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం... మొత్తం ఖాళీలు అంచనా 110 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 27, 2016 అఖిల భారత సర్వీసుల్లో భాగంగా కేంద్ర అటవీ శాఖలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ లేదా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ హోదాతో కెరీర్ ప్రారంభించేందుకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష వీలుకల్పిస్తుంది. ఐఎఫ్ఎస్కు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కేడర్ కంట్రోలింగ్ అథారిటీగా వ్యవహరిస్తోంది. అర్హత * యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ సబ్జెక్టుల్లో కనీసం ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ. (లేదా) * అగ్రికల్చర్/ ఫారెస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ (లేదా) ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. వయసు 2016, ఆగస్టు 1 నాటికి కనీస వయసు 21 ఏళ్లు. గరిష్ట వయసు 32 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం * ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎంపిక విధానం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ. * గతంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ప్రిలిమినరీ రాత పరీక్షను యూపీఎస్సీ ప్రత్యేకంగా నిర్వహించేది. ప్రస్తుతం సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కూడా నిర్వహిస్తోంది. అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లోని మెయిన్స్‌కు ఎంపిక కావాలంటే ముందుగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాలి. * ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మళ్లీ ప్రత్యేకంగా మెయిన్స్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూకు సాధారణంగా ఖాళీల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ ఇందులో రెండు ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు) పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు. పేపర్‌కు రెండు గంటలు సమయం అందుబాటులో ఉంటుంది. పేపర్-2 అర్హత పేపర్ మాత్రమే. ఇందులో కనీసం 33 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ఆబ్జెక్టివ్ పేపర్లలో నెగిటివ్ మార్కులుంటాయి. ప్రశ్నపత్రాలు హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటాయి. విజయానికి సూచనలు * బలహీనంగా ఉన్నామనుకున్న అంశాలను ప్రణాళిక ప్రకారం అధ్యయనం చేస్తూ, పట్టుసాధించాలి. * తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను అధ్యయనం చేసేందుకు వీలుకల్పించే మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి. * పరీక్ష విధానం, అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. * జనరల్ స్టడీస్ ప్రిపరేషన్‌కు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్ను ఉపయోగించుకోవాలి. * ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు ఒకేసారి ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలకు వ్యవధి చాలా తక్కువ ఉంటుంది. పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువగా ఉండటంతో సివిల్ సర్వీసెస్ కంటే ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉంటాయి. మెయిన్స్‌కు కూడా ఉపయోగపడేలా జనరల్ స్టడీస్ పేపర్లను ప్రిపేర్‌కావాలి. మెయిన్స్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకుంటే విస్తృత అధ్యయనం అవసరం. సివిల్స్‌కు, ఐఎఫ్ఎస్కు ఒకే ప్రిలిమ్స్ పరీక్ష అయినప్పటికీ, కటాఫ్ మార్కులు ఐఎఫ్ఎస్కు ఎక్కువగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. - గుంటుపల్లి వరుణ్, ఐఎఫ్ఎస్ నాలుగో ర్యాంకు (2014) మెయిన్ ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్) పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 300 మార్కులు పేపర్-2 జనరల్ నాలెడ్జ్ 300 మార్కులు పేపర్-3 పేపర్-4 పేపర్-5 పేపర్-6 (ఆప్షనల్ పేపర్లు. అభ్యర్థులు రెండు సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు) ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్ సర్వీసుకు సంబంధించిన విధులను నిర్వర్తించే సామర్థ్యం అభ్యర్థికి ఏ మేరకు ఉందో పర్సనాలిటీ టెస్ట్ ద్వారా పరీక్షిస్తారు. దీనికి 300 మార్కులు కేటాయించారు. -
సివిల్స్‌కు దరఖాస్తులు షురూ
న్యూఢిల్లీ: ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించే ప్రక్రియ ప్రారంభమయింది. ఈ సారి అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ లేదా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లలో ఏదానికైనా లేదా రెండింటికైనా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. 2011లో జరిగిన పరీక్షతో నిర్ణీత అవకాశాలు పూర్తయిన వారికి ఈసారి మరో అవకాశం ఇస్తున్నట్లు వివరించింది. ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 23న నిర్వహించనున్నారు. ‘అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో www.upsconline.nic.in వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల ప్రక్రియ మే 23న ప్రారంభమై జూన్19నాటికి ముగియనుంది. -
కార్పొరేట్ కొలువు నుంచి ఐఎఫ్ఎస్కు..
కార్పొరేట్ కొలువు.. ఆపై చేతినిండా సంపాదన.. ఈ రెండూ ఉన్నాయి! ఇంకేం బాగా బతికేయొచ్చు..! అని సరిపెట్టుకోకుండా సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలి.. అలాంటి అవకాశాన్ని కల్పించే ఉద్యోగాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచనే సివిల్ సర్వీసెస్ పరీక్ష దిశగా వెళ్లేలా చేసింది. ఆ సర్వీస్ సాధించకున్నా, దానికోం చేసిన సాధన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)లో నాలుగో ర్యాంకు రావడానికి ఉపయోగపడిందంటున్నాడు గుంటుపల్లి వరుణ్. ఈ విజయ ప్రస్థానం అతని మాటల్లోనే... సక్సెస్ స్టోరీ నాన్న చిన్న స్థాయి వ్యాపారవేత్త, అమ్మ గృహిణి. చెల్లి సాఫ్ట్వేర్ ఉద్యోగి. పదో తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. పదో తరగతి పరీక్షల్లో స్కూల్ టాపర్‌గా నిలిచాను. తర్వాత ఇంటర్మీడియెట్, మద్రాస్ ఐఐటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ పట్టా తీసుకున్నాక, ఐఐఎం-ఇండోర్ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) పూర్తిచేశాను. చదువు తర్వాత ఉద్యోగం ముంబైలో ఏడాదిన్నర పాటు డెస్టిమనీ ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేశా. తర్వాత ఎడెల్వైస్ సెక్యూరిటీస్ సంస్థలో ఈక్విటీ రీసెర్చ్ అనలిస్టుగా మూడేళ్లు ఉద్యోగం చేశాను. ఐఎఫ్ఎస్ దిశగా మంచి సంస్థల్లో ఉద్యోగం, సంతృప్తికరమైన సంపాదన ఉన్నా సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుందన్న ఉద్దేశంతో అటువైపు అడుగులు వేశాను. సివిల్ సర్వీసెస్ వల్ల అణగారిన ప్రజల ఉన్నతికి కృషి చేయొచ్చని, ఉద్యోగంలోనూ మంచి సంతృప్తి లభిస్తుందని భావించి, సివిల్స్ ప్రిపరేషన్‌ను ప్రారంభించాను. అయితే ఉద్యోగంలో తీరిక లేకుండా ఉండటం వల్ల ప్రిపరేషన్ సరిగా సాగలేదు. దీంతో రెండు సార్లు విఫలమయ్యాను. ఇక లాభం లేదనుకొని, 2012, సెప్టెంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తిస్థాయిలో సివిల్స్ సన్నద్ధతపై దృష్టిపెట్టాను. ఉమ్మడి సన్నద్ధత మొదట్లో ఐఎఫ్ఎస్పై దృష్టి పెట్టలేదు. 2013లో యూపీఎస్సీ పరీక్ష విధానాన్ని మార్చింది. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలో ఒక ఆప్షనల్‌ను తగ్గించడంతో పాటు సివిల్స్‌కు, ఐఎఫ్ఎస్కు ఉమ్మడి ప్రిలిమినరీ పరీక్ష వెసులుబాటు నాకు ఎంతగానో ఉపయోగపడింది. ఒకేసారి రెండు పరీక్షలకు ప్రిపేరయ్యే అవకాశం లభించింది. ఐఎఫ్ఎస్లో రెండోసారి విజయం ఐఎఫ్ఎస్కు చేసిన తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 29మార్కుల తేడాతో సర్వీస్ చేజారింది. రెండోసారి (2014) మ్యాథమెటిక్స్, ఫారెస్ట్రీ ఆప్షనల్ సబ్జెక్టులతో విజయం సాధించా. మ్యాథ్స్‌పై పట్టుసాధించాలంటే కనీసం ఆర్నెల్లు పడుతుంది. మొదటిసారి సరైన ప్రిపరేషన్ లేకపోవడం వల్ల మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. ఈ అనుభవం దృష్ట్యా లోపాలను సరిచేసుకొని రెండోసారి అధిక సమయం ప్రాక్టీస్ చేశాను. ఫలితంగా మ్యాథ్స్‌లో ఎక్కువ మార్కులు సాధించగలిగాను. ఫారెస్ట్రీ పేపర్‌కు ఎక్కువ సమయం కేటాయించకున్నా, జనరల్ స్టడీస్‌లో ఎన్విరాన్మెంట్ అంశాలను బాగా చదవడం ఆ ఆప్షన్‌ను సంతృప్తికరంగా రాసేందుకు ఉపయోగపడింది. ప్రిపరేషన్ సొంతంగానే సివిల్స్‌కు, ఐఎఫ్ఎస్కు సిద్ధమయ్యాను. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఉమ్మడి ప్రణాళికతో చదివాను. జనరల్ స్టడీస్‌లోని పేపర్ల కోసం ఎన్సీఈఆర్టీ, ఇతర ప్రామాణిక పుస్తకాలు చదివాను. కరెంట్ అఫైర్స్ కోసం పత్రికలు, ఇంటర్నెట్ను ఉపయోగించుకున్నా. సివిల్స్ మెయిన్స్ పేపర్ల కోసం రాయడం ప్రాక్టీస్ చేశాను. ఇది ఐఎఫ్ఎస్ జనరల్ నాలెడ్జ్ పేపర్‌కు ఉపయోగపడింది. ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడిని జయించేందుకు సుడోకోను సాధించడం, పాటలు వినడం, స్నేహితులను కలవడం చేసేవాడిని. ఒకవేళ సర్వీస్ రాకపోతే తిరిగి కార్పొరేట్ ఉద్యోగంలో చేరేందుకు అవకాశం ఉండటంతో ఆందోళనకు గురికాకుండా దృష్టిని పూర్తిస్థాయి ప్రిపరేషన్‌పై పెట్టగలిగాను. ఇంటర్వ్యూ ఆర్థిక సంబంధిత సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఇంటర్వ్యూలో వాటిపై ప్రశ్నలడిగారు. స్టాక్ మార్కెట్, ఫారెస్ట్రీలపై ప్రశ్నలు వచ్చాయి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడంకుళం ప్రాజెక్టు, గ్రీన్ పీస్ ఎన్జీవో, పర్యావరణ కాలుష్యంతో పాటు నేను చదివిన మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఐఎఫ్‌ఎస్‌కి ఎలా ఉపయోగపడుతుందని భావిస్తున్నావనే ప్రశ్న కూడా అడిగారు. ఇంటర్వ్యూ 25 నిమిషాల పాటు జరిగింది. విజయానికి అండగా ఈ విజయాన్ని పూర్తిగా నా కుటుంబానికే అంకితమిస్తున్నాను. వారి ప్రోత్సాహం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఐఎఫ్‌ఎస్‌కి సిద్ధమవుతున్న వారు కనీసం ఏడాది సమయం కేటాయించాలి. జనరల్ నాలెడ్జ్, రెండు ఆప్షనల్ సబ్జెక్టులను సమగ్రంగా చదవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు ఒకేసారి ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలకు వ్యవధి చాలా తక్కువ ఉంటుంది. పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువగా ఉండటంతో సివిల్ సర్వీసెస్ కంటే ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు సాధించాలి. మెయిన్స్‌కి రెండు నెలల ముందే సిలబస్ పూర్తిచేసి, రివిజన్‌పై దృష్టిసారించాలి. వారాలు, నెలల వారీ లక్ష్యాలను నిర్దేశించుకొని, చదివితే విజయం ఖాయం. -
ఏపీకి 211, తెలంగాణకు 163
ఐఏఎస్‌ల కేటాయింపుపై కేంద్రం నోటిఫికేషన్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 211 ఐఏఎస్, 144 ఐపీఎస్, 82 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) పోస్టులను కేటాయిస్తున్నట్టు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి 163 ఐఏఎస్, 112 ఐపీఎస్, 65 ఐఎఫ్ఎస్ పోస్టులను కేటాయించింది. మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రత్యూష్‌సిన్హా నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ రూపొందించిన మార్గదర్శకాల మేరకు కేంద్రం ఈ కేటాయింపులు జరిపింది. ఏపీ ఐఏఎస్‌లలో ఒక చీఫ్ సెక్రటరీ, ఇద్దరు అడిషనల్ చీఫ్ సెక్రటరీలు, 12 మంది ముఖ్య కార్యదర్శులు, 11 మంది కార్యదర్శులు, 23 మంది సెక్రటరీ కమ్ కమిషనర్లు, ఒక సెక్రటరీ టు సీసీఎల్ఏ, 13 మంది కలెక్టర్లు, 13 మంది జాయింట్ కలెక్టర్లు, ఐటీడీఏ పీవో/పీడీ డీఆర్డీఏ/జెడ్పీ సీఈవోలు 8 మంది, వాణిజ్య పన్నుల విభాగంలో జాయింట్/డిప్యూటీ కమిషనర్లు ఇద్దరు, డెరైక్టర్లు 22 మంది, చీఫ్ రేషనింగ్ అధికారి , అడిషనల్ సెక్రటరీలు ఆరుగురు ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 144 మంది ఐపీఎస్ ఆఫీసర్లను కేటాయించగా.. వీరిలో ఒకరు డీజీపీ (పోలీసు బలగాల హెడ్), మరొక డీజీపీ ర్యాంకు అధికారి, ఏడుగురు అడిషనల్ డీజీపీలు, 17 మంది ఐజీపీలు, 13 మంది డీఐజీలు, 40 మంది ఎస్పీలు ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టులు 82 కేటాయించగా.. వీరిలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్(విభాగ అధిపతి), మరొక ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, ఐదుగురు అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్లు, ఆరుగురు చీఫ్ కన్జర్వేటర్లు, 13 మంది కన్జర్వేటర్లు, 25 మంది డిప్యూటీ కన్జర్వేటర్లు ఉంటారు. -
ప‘వన’విజయం..
‘‘జీవితమంటే కేవలం డబ్బు సంపాదన ఒక్కటే కాదు.. చుట్టూ ఉన్న నిస్సహాయుల్లో కొందరికైనా సాయపడినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుంది..’’ అంటూ తరచూ నాన్న చెప్పే మాటలే అతడి ఆచరణకు మార్గదర్శకాలయ్యాయి. ఇప్పుడు ఆ ఆశయ సాధనకు మార్గం సుగమం చేసే ఆలిండియా సర్వీసుకు ఎంపికయ్యాడు వైఎస్సార్ కడప జిల్లా యువకుడు గడికోట పవన్‌కుమార్‌రెడ్డి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు పరీక్షలో 26వ ర్యాంకు సాధించిన పవన్ సక్సెస్ స్పీక్స్ ఆయన మాటల్లోనే.. మాది వైఎస్సార్ కడప జిల్లాలోని సుద్దమల్ల గ్రామం. నాన్న బాలకృష్ణారెడ్డి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అమ్మ రాజేశ్వరి గృహిణి. తమ్ముడు యోగానందరెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాన్నకు ఇంజనీరింగ్ చదవాలనే కోరిక ఉండేదట. కానీ, ఆర్థిక పరిస్థితులు ఆ ఆశకు అడ్డుతగిలాయి. అలాంటి పరిస్థితి మాకు రాకూడదనే ఉద్దేశం తో కష్టపడి చదివించారు.ఉన్నదాంట్లో తోటివారికి సాయపడాలని ఎప్పుడూ చెబుతుండేవారు. చెప్పడమే కాదు తాను స్వయంగా ఆచరించేవారు. ఇలా నాన్న నింపిన స్ఫూర్తి.. ఐఎఫ్ఎస్ దిశగా అడుగులు వేయించింది. సివిల్స్ దిశగా: పాఠశాల స్థాయి నుంచి బాగానే చదివేవాణ్ని. తిరుపతిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఇందులో 84 శాతం మార్కులు సాధించా. గేట్లో 38వ ర్యాంకు వచ్చింది. ముంబై ఐఐటీ నుంచి 9.1 పర్సంటైల్‌తో ఎంటెక్ పూర్తిచేశా. 2008లో క్యాంపస్‌లో ఉన్నప్పుడే టాటా టెక్నాలజీస్‌లో సీఏఈ అనలిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. మూడేళ్ల తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి, సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా. అపజయమే తొలిమెట్టు: ఢిల్లీలో సివిల్స్‌కు సిద్ధమయ్యాను. తొలి ప్రయత్నంలో అపజయం ఎదురైంది. రెండోసారి మెయిన్స్‌కు ఎంపికయ్యాను. ప్రస్తుతం వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాను. సివిల్స్, ఐఎఫ్ఎస్కు ప్రిలిమ్స్ ఉమ్మడిగా ఉంటుంది. వేర్వేరు కటాఫ్ మార్కులతో వీటి మెయిన్స్ రాసేందుకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సివిల్స్‌లో నా ఆప్షనల్ ఫిలాసఫీ. ఐఎఫ్ఎస్కు ఫారెస్ట్రీ, జియాలజీ సబ్జెక్టులు ఆప్షనల్స్. ఒక్కో ఆప్షనల్‌కు రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. ఐఎఫ్ఎస్కు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యాను. మార్కెట్లో దొరికే మెటీరియల్‌ను సేకరించి, సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాను. మెయిన్స్ పరీక్షలలో ప్రశ్నకు కిందే సమాధానం రాసేందుకు కొంత స్థలాన్ని కేటాయిస్తారు. దీనివల్ల క్షుణ్నంగా, క్లుప్తంగా సమాధానం రాయడంతో సమయం కలిసొచ్చింది. అటవీ రంగానికి అన్వయిస్తూ.. చివరి ఘట్టమైన ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తిచేయడానికి మాక్ ఇంటర్వ్యూలు ఉపయోగపడ్డాయి. స్నేహితులతో ప్రాక్టీస్ చేసిన మాక్ ఇంటర్వ్యూ భయాన్ని, ఒత్తిడిని అధిగమించేందుకు తోడ్పడింది. నలుగురు సభ్యులున్న బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేసింది. ప్రశాంత వాతావరణంలో ఇంటర్వ్యూ సాగింది. నా ప్రొఫైల్‌లోని అంశాలను, అటవీ రంగానికి అన్వయిస్తూ ప్రశ్నలు అడిగారు. ఆదివాసీలు-వారిలో వెనుకబాటుకు సంబంధించి ప్రశ్న లు అడిగారు. ప్రాంతాల వారీగా లభించే సహజ సంపదపై ప్రశ్నించారు. ఆప్షనల్స్ ప్రిపరేషన్.. ఇంటర్వ్యూకు కూడా బాగా ఉపయోగపడింది. చాలామంది ఇంటర్వ్యూ అనగానే భయపడతారు. రకరకాల అనుమానాలతో సతమతమవుతుంటారు. ఇలా భయంతో ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెడితే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. బోర్డు సభ్యులెప్పుడూ అభ్యర్థి భయాన్ని దూరం చేసేలా వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రశ్నలడుగుతారు. లక్ష్య నిర్దేశనం అవసరం: ఇంటర్ వరకు తెలుగు మీడియంలోనే చదివాను. తర్వాత రోజువారీ సాధనతో ఇంగ్లిష్‌పై పట్టు చిక్కింది. ఆలిండియా సర్వీసు పరీక్షల్లో విజయం సాధించాలంటే పటిష్ట ప్రణాళిక, కష్టపడే తత్వం అవసరం. వీటికంటే ముందు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ప్రధానం. సివిల్స్‌కు సిద్ధమవుతున్న వారిలో చాలా మంది సరైన చేతిరాత లేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక అంశానికి సంబంధించి విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోదు.. ఆ పరిజ్ఞానాన్ని ఎగ్జామినర్‌కు అర్థమయ్యేలా స్పష్టంగా రాయడమూ ప్రధానం. దీనికోసం రోజూ ప్రాక్టీస్ చేయాలి. ఎస్సే పేపర్ కోసం సొంత నోట్స్ బాగా ఉపయోగపడుతుంది. పక్కా వ్యూహంతో కష్టపడితే ఆలిండియా సర్వీస్‌ను చేజిక్కించుకోవడం కష్టమేమీ కాదు. -
ప‘వన’ విజేత
వైవీయూ, న్యూస్‌లైన్ : యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ ఫారెస్టు సర్వీసు ఫలితాల్లో కడప నగరం బాలాజీనగర్‌కు చెందిన గడికోట పవన్‌కుమార్‌రెడ్డి 26వ ర్యాంకు సాధించాడు. రామాపురం మండలం నల్లగుట్టపల్లె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడికోట బాలకృష్ణారెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమారుడైన ఈయన విద్యాభ్యాసం అంతా జిల్లాలోనే సాగింది. పాథమిక విద్య రామాపురంలోను, హైస్కూల్ కడప నాగార్జునలోను, ఇంజినీరింగ్ కేఎస్ఆర్ఎం కళాశాలలో పూర్తిచేసిన అనంతరం గేట్లో జాతీయస్థాయిలో 38వ ర్యాంకు సాధించి ముంబయ్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశాడు. అనంతరం టాటాటెక్నాలజీస్ కంపెనీలో సీఏఈ అనలిస్టుగా పనిచేశాడు. ఉపాధ్యాయుడైన తండ్రి ప్రజలకు సేవచేయాలని తరచూ చెప్పే మాటలు ఆయన చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్బాట పట్టాడు. అక్కడ ఒకటిరెండు సార్లు ఒటమి ఎదురైనా కుటుంబసభ్యులు, స్నేహితులు ఇచ్చిన స్ఫూర్తితో యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. తొలిప్రయత్నంలోనే దేశంలోనే 26వ ర్యాంకు సాధించి తన పట్టుదలను చాటాడు. ఐఏఎస్ సాధనకు మరోసారి సివిల్స్ రాసి మెయిన్స్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ప్రస్తుతం వచ్చిన ర్యాంకు ఎంతో సంతోషాన్నిస్తోందని పవన్‌కుమార్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపాడు. పడిన కష్టానికి తగిన ఫలితం దక్కడంతో పాటు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టినందుకు సంతోషంగా ఉందన్నాడు. -
ఐఎఫ్ఎస్లో మురళీధర్‌కు 12వ ర్యాంక్
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెం దిన కొమ్మిశెట్టి మురళీధర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు పరీక్షా ఫలితాల్లో ఆలిండియా 12వ ర్యాంక్ సాధించారు. ఇది స్టేట్ ఫస్ట్ర్యాంక్గా ఉండవచ్చని సమాచారం. మున్సిపాలిటీలో శానిటరీ సూపర్వైజర్గా పనిచేస్తున్న కొమ్మిశెట్టి రాంప్రసాద్, ప్రభుత్వ టీచర్ బండారు గోపాలమ్మల కుమారుడైన మురళీధర్ చెన్నై ఐఐటీలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. బుధవారం కుటుంబసభ్యులందరూ తిరుమలలో ఉండగా ఫలితాలు వెలువడ్డంతో ఆనందపరవశులయ్యారు.