
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) డైరెక్టర్‌గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) అధికారి శ్వేతా సింగ్ నియమితులయ్యారు. 2008 బ్యాచ్ అధికారి అయిన శ్వేతా సింగ్ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం పేర్కొంది.
శ్వేతా సింగ్ జాయిన్ అయిన నాటి నుంచి మూడేళ్లపాటు నూతన బాధ్యతల్లో కొనసాగుతారు. అదేవిధంగా, పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా అనికేత్ గోవింద్ మాండవ్‌గానె నియామకాన్ని ఏసీసీ రద్దు చేసింది. 2009 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్ అధికారి అయిన అనికేత్ జూలై 18వ తేదీన ఆ పదవిలో నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment