
సాక్షి, అమరావతి : 2018 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ముఖ్యమంత్రిని కలిసిన యువ ఐఎఫ్‌ఎస్ అధికారుల్లో సుమన్ బెనీవాల్, వినీత్ కుమార్, జి. విఘ్నేష్ అప్పారావులు ఉన్నారు. కాగా వీరి వెంట రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఎస్. ప్రతీప్ కుమార్ కూడా ఉన్నారు.(మోసం చేసే మాటలు వద్దు: సీఎం జగన్)
ఎస్‌ఎస్‌ఎల్ గ్రూఫ్ రూ. 50 లక్షల విరాళం
అమరావతి : కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఎన్ ఎస్ ఎల్ గ్రూఫ్ రూ.50 లక్షలు విరాళమందించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎల్ గ్రూఫ్ చైర్మన్ ఎం. ప్రభాకర్‌రావు క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి చెక్కును అందించారు. ఆయన వెంట ఎండీ ఎం. వెంకరామచౌదరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. అంతేగాక కోటి రూపాయల విలువైన శానిటైజర్లు పంపిణీ చేయనున్నట్లు ఎన్‌ఎస్‌ఎల్ గ్రూఫ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment