సాక్షి, అమరావతి : కరోనా వైరస్ నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం రైతులు, వర్తక, వాణిజ్య సంఘాలు, విద్యా సంస్ధల తరపున 2 కోట్ల 2 లక్షల 2 వేల 112 రూపాయల విరాళం అందింది. దీంతో పాటు లోటస్ ట్రేడింగ్ కంపెనీ, డాల్ఫిన్ పాలిమర్స్ తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి మరో 25 లక్షల రూపాయలు విరాళం అందింది. శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళాలకు సంబంధించిన చెక్కులను కైకలూరు ఎమ్మెల్యే డి.నాగేశ్వరరావు, డి.వినయ్, డి.శ్యామ్‌లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పాల్గొన్నారు.
గుంటూరు : జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) తరపున రూ.25 లక్షలు విరాళం అందింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును డీసీఎంఎస్ ఛైర్ పర్సన్ కె హెనీ క్రిస్టినా, కె సురేష్ కుమార్‌లు సీఎం జగన్‌కు అందజేశారు . ఈ కార్యక్రమంలో హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్యశాఖ మంత్రి మోపిదేవిలు పాల్గొన్నారు.
► బండి సాహితి రెడ్డి ఛారిటబుల్ ట్రస్టు తరపున రూ.25 లక్షలు విరాళం. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును బండి సాహితి రెడ్డి చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ బండి అశోక్ రెడ్డి, బండి సుధావాణి, బి మల్లేశ్వరరెడ్డి(ఏపీటీఎఫ్, అధ్యక్షుడు), పి మల్లీశ్వరిలు ముఖ్యమంత్రికి అందజేశారు.
► కరోనా నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు, వివిధ సంస్ధల తరపున 36 లక్షల 50 వేల రూపాయల విరాళం అందింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కులను హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment