cm relief fund
-
సీఎంకు చెక్కులు అందజేసిన మెగాస్టార్ చిరంజీవి
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరద ధాటికి నష్టపోయిన బాధితులకు సినీతారలు అండగా నిలిచారు. తమవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇరు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చిరంజీవి రూ. 50 లక్షలు చెక్ అందించారు. అంతేకాకుండా తన కుమారుడు రామ్ చరణ్ తరఫున మరో రూ.50 లక్షలు అందజేశారు.కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. -
‘ఎంఈఐఎల్’ రూ.5 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్/ఖమ్మంవన్‌టౌన్: ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఈఐఎల్ సంస్థ రూ.5 కోట్ల విరాళంఅందజేసింది. సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి, బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి, సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్టీ రావు పాల్గొన్నారు. ఏపీకి కూడా రూ.5 కోట్ల విరాళాన్ని అందించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రేస్ క్లబ్ తరఫున రూ.2 కోట్లు హైదరాబాద్‌లోని రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి.. మరో డైరెక్టర్ నరసింహరెడ్డితో కలిసి వరద బాధితుల సహాయార్థం రూ.2 కోట్ల చెక్కును మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. రూ.కోటి చొప్పున.. సీఎం సహాయ నిధికి సైయెంట్ కంపెనీ యాజమాన్యం రూ.కోటి విరాళాన్ని అందజేసింది. అలాగే లలితా జ్యువెల్లర్స్ అధినేత కిరణ్ రూ.కోటి, మైత్రా ఎనర్జీ గ్రూప్ అండ్ అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు విక్రం కైలాస్, రవికైలాస్ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని సచివాలయంలో కలిసి చెక్కులను అందజేశారు. సినీ నిర్మాత దిల్ రాజు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు. -
తెలంగాణ సీఎం సహాయనిధికి క్రెడాయ్ భారీ విరాళం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఎస్టేట్ డెవలపర్స్ సంఘాల సమాఖ్య క్రెడాయ్ (కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) రూ.కోటి విరాళం అందించింది. క్రెడాయ్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా దెబ్బతినింది. పలు జిల్లాలలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు పలు వ్యాపార సంస్థలు, ప్రముఖులు ముందుకు వస్తున్నారు. భారీగా విరాళాలు అందిస్తున్నారు. -
Ravi Raheja: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం
హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్ల భారీ విరాళం అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.ఎన్నడూ లేనంతగా ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా కె.రహేజా కార్పొరేషన్ గ్రూప్ అధినేత రవి రహేజా విరాళం అందించారు. ఈ సంస్థకు రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర విభాగాల్లోనూ పలు వ్యాపారాలు ఉన్నాయి. -
డ్వాక్రా మహిళలు డబ్బులు ఇవ్వాలి లేదంటే శిక్ష తప్పదు..
-
Tollywood: మేము సైతం
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల కేరళలో సంభవించిన వరదల సమయంలో తెలుగు నటులు కొందరు భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం తెలుగు హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు ‘మేము సైతం’ అంటూ విరాళాలు ప్రకటించారు.‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు కలచివేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో ΄ాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూ΄ాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షలు చొప్పున) విరాళంగా ప్రకటిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు చిరంజీవి.→ ‘‘అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుండేవారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి యాభై లక్షల రూ΄ాయల చొప్పున విరాళంగా అందిస్తున్నాం. ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి’’ అని అక్కినేని కుటుంబం పేర్కొంది. విశాఖపట్నంలోని అలు ఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ విరాళాన్ని అందజేస్తున్నాయి.→ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం రూ. 6 కోట్ల విరాళం ప్రకటించారు నటుడు, జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఏపీ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడిన 400 పంచాయితీలకు రూ. 1 లక్ష చొప్పున రూ. 4 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఇలా మొత్తంగా రూ. ఆరు కోట్లను పవన్ కల్యాణ్ విరాళంగా అందించనున్నారు. → తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళాన్ని అందజేయనున్నట్లుగా ఆయన సిబ్బంది వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి కోటి రూ΄ా యల చొప్పున విరాళం అందించనున్నట్లుగా ప్రభాస్ టీమ్ పేర్కొంది.→ ‘‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూ΄ాయలు విరాళంగా ప్రకటిస్తున్నా’’ అంటూ రామ్‌చరణ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.→ ‘‘తెలగు రాష్ట్రాల్లోని వరద పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉంది. నా వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూ΄ాయల విరాళం అందిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు అల్లు అర్జున్.→ తెలుగు రాష్ట్రాల్లోని వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రుల సహాయ నిధులకు రూ. 10 లక్షల చొప్పున 20 లక్షలు... అలాగే విజయవాడలోని అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ .5 లక్షలు.. ఇలా మొత్తంగా రూ. 25లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు సాయిదుర్గా తేజ్.→ తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తన వంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నానని, తన సిబ్బంది వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తూ, సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా ΄ాల్గొంటున్నారని సోనూసూద్ తెలి΄ారు. బుధవారం పైన పేర్కొన్న నటులు విరాళం ప్రకటించగా, అంతకుముందు విరాళం ప్రకటించినవారి వివరాల్లోకి వెళితే... ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి రూ. 50 లక్షలు చొప్పున కోటి రూ΄ాయలు బాలకృష్ణ, మహేశ్‌బాబు, ఎన్టీఆర్ విరాళంగా ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్– ఎస్. రాధాకృష్ణ–ఎస్. నాగవంశీ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందజేస్తున్నట్లుగా తెలి΄ారు. తెలుగు రాష్ట్రాలకు 15 లక్షల రూ΄ాయల చొప్పున మొత్తంగా రూ. 30 లక్షలు విరాళంగా ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. విశ్వక్ సేన్, దర్శకుడు వెంకీ అట్లూరి మొత్తంగా పది లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ల 5 లక్షలు (ఏపీ 2.5 లక్షలు, తెలంగాణకు 2.5 లక్షలు) విరాళం ప్రకటించారు. దర్శకుడు–నటుడు తల్లాడ సాయికృష్ణ రూ. లక్షా యాభై వేలుని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు విరాళంగా ప్రకటించారు. -
ఉద్యోగుల తరఫున రూ.100 కోట్లు
మహబూబాబాద్/సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని, తమ వంతుగా సీఎం సహా య నిధికి ఒక రోజు మూల వేతనాన్ని ప్రకటించినట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మా రం జగదీశ్వర్, జనరల్ సెక్రెటరీ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని కలెక్టరేట్లో ఉద్యోగుల జేఏసీ నాయకులు కలిసి ఒకరోజు మూల వేతన తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒక్కరోజు మూల వేతనం ప్రభుత్వ ఖజానాలో జమయ్యేలా చూడాలని సీఎంను కోరారు. సీఎస్‌కు సమ్మతి పత్రం అందజేత.. వరద బాధితుల సహాయార్థం రాష్ట్రంలోని ఉద్యోగులందరి తరఫున ఒక రోజు వేతనాన్ని ఇవ్వనున్నట్టు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు రూ.100 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి అందజేయాలని కోరుతూ మంగళవారం సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిసి సమ్మతి పత్రాన్ని అందజేశారు. సీఎస్‌ను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, నేతలు డాక్టర్ నిర్మల, కె.రాములు, శశిధర్‌రెడ్డి, దర్శన్‌గౌడ్, గోపాల్, అశ్వత్థామరెడ్డి, రమాదేవి, రాబర్ట్ బ్రూష్, మహిపాల్‌రెడ్డి, కె.రామకృష్ణ, ఎస్.రాములు, మహేశ్, తిరుపతి, సంపత్ తదితరులు ఉన్నారు. వరద బాధితులకు ఒక రోజు మూలవేతనం భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకునేందుకు ఒకరోజు మూలవేతనం ఇవ్వా లని నిర్ణయించినట్లు తెలంగాణ ఉద్యోగు ల సంఘం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఉద్యోగుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంది. సమావేశంలో చైర్మన్ పద్మాచారి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మఠం రవీంద్రకుమార్, సీహెచ్ హరీశ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్.నర్సింగ్‌రావు, సంఘం నేతలు జాకబ్, కృష్ణారావు, కిశోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేము సైతం అంటూ పెన్షనర్ల జేఏసీ... వరద బాధితుల సహయార్థం ఒక రోజు మూల వేతనాన్ని ఇస్తున్నట్లు పెన్షనర్ల జేఏసీ ప్రకటించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు విరాళం ఇచ్చేందుకు ఏకగ్రీవంగా నిర్ణయించామని, ఇది రూ.33 కోట్ల వరకు ఉంటుందని జేఏసీ చైర్మన్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి శుభాకర్‌రావు తెలిపారు. -
వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?
డార్లింగ్ హీరో ప్రభాస్ భారీ విరాళం ప్రకటించాడు. రీసెంట్గా కేరళలోని వయనాడ్‌లో వరద బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 300 మందికి పైగా చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే వీళ్లని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, చిరంజీవి-రామ్ చరణ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రభాస్ చేరారు.(ఇదీ చదవండి: బంగ్లాదేశ్ అల్లర్లలో విషాదం.. యువ హీరోని కొట్ట చంపారు)కేరళ వరద బాధితుల కోసం అల్లు అర్జున్ రూ.25 లక్షలు ఇవ్వగా.. చిరంజీవి-రామ్ చరణ్ కలిపి రూ.కోటి రూపాయలు అందించారు. ఇప్పుడు ప్రభాస్ ఏకంగా రూ.2 కోట్ల రూపాయల్ని కేరళ సీఎమ్ రిలీఫ్ ఫండ్‌కి ఇచ్చారు. దీంతో డార్లింగ్ హీరోని అందరూ మెచ్చుకుంటున్నారు.దక్షిణాది నుంచి సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాజిల్, రష్మిక, నయనతార తదితరులు లక్షల రూపాయలు విరాళాలుగా ప్రకటించారు. అయితే తెలుగు నుంచి ఇప్పటివరకు బన్నీ, చిరు-చరణ్, ప్రభాస్ మాత్రమే ఇచ్చారు. మిగిలిన యాక్టర్స్ కూడా ఎంతో కొంత విరాళమిస్తే బాగుంటుందని నెటిజన్స్ అంటున్నారు.(ఇదీ చదవండి: నయనతార కాంట్రవర్సీ సినిమా.. ఇప్పుడు మళ్లీ ఓటీటీలోకి) -
వయనాడ్ ఘటన: గౌతమ్ అదానీ భారీ విరాళం
వయనాడ్‌లో కొండచరియలు విరిగిన ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కకు మించిన జనం నిరాశ్రయులయ్యారు. ఈ తరుణంలో వీరికి అండగా నిలబడటానికి ప్రముఖ వ్యాపార దిగ్గజం 'గౌతమ్ అదానీ' కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు.వయనాడ్ బాధితుల సహాయార్థం గౌతమ్ అదానీ కేరళ సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళంగా ప్రకటించారు. వయనాడ్‌లో జరిగిన ప్రాణనష్టం పట్ల అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు సంఘీభావంగా నిలుస్తోందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 200 కంటే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా సుమారు ఏడువేలకంటే ఎక్కువమంది రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రమాదయినా గురైనవారికి ప్రభుత్వం సాయం కూడా ప్రకటించింది. ఈ సమయంలో పలువురు ప్రముఖులు కేరళ రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు.Deeply saddened by the tragic loss of life in Wayanad. My heart goes out to the affected families. The Adani Group stands in solidarity with Kerala during this difficult time. We humbly extend our support with a contribution of Rs 5 Cr to the Kerala Chief Minister's Distress…— Gautam Adani (@gautam_adani) July 31, 2024 -
సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు ఇకపై ఆన్లైన్లోనే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో వ్యవహరించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సచివాలయంలో ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫారసు లేఖ జత చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధిత దరఖాస్తుదారుల బ్యాంక్ ఖాతా నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. సంబంధిత ఆస్పత్రులకు ఆన్లైన్లోనే పంపించి నిర్ధారించుకున్న తర్వాత అన్ని వివరాలు సరిగ్గా ఉంటే దరఖాస్తును ఆమోదించి చెక్‌ను సిద్ధం చేస్తారు. చెక్‌పై తప్పనిసరిగా దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా నంబర్ ముద్రిస్తారు. (దీనివల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు) ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్‌లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15వ తేదీ తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https//cmrf.telangana.gov.in/ సైట్లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. -
నిరుపేద కుటుంబంలో వెలుగులు
సాక్షి, అమరావతి: నిరుపేద కుటుంబాన్ని పెద్దకష్టం చుట్టుముట్టింది. ఊహించని ప్రమాదంలో తొమ్మిదేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడి నోట మాటలేక, శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బాలుడి చికిత్సలకు రూ.లక్షల్లో ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో అంత డబ్బును సమకూర్చలేని నిస్సహాయత వారిది. ఆపద సమయంలో సీఎం జగన్ ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇవ్వడమే కాకుండా.. ఖరీదైన చికిత్సను చేయించింది. ఆ నిరుపేద కుటుంబంలో వెలుగులు నింపింది. స్వరపేటిక, శ్వాసనాళం చితికిపోయి.. పల్నాడు జిల్లా నకరికల్లులోని పాతూరుకు చెందిన షేక్ బాజీ, ఖాజాబీ ఇటుక బట్టీల్లో కూలీ పనులు చేసుకుంటుంటారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తొమ్మిదేళ్ల అనాస్ మహమ్మద్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ కిందపడిపోయాడు. ప్రమాదంలో బాలుడి గొంతుకు ఇనుపరాడ్ బలంగా గుచ్చుకుపోయింది. స్వరపేటిక, శ్వాసనాళం పూర్తిగా చితికిపోయాయి. హుటాహుటిన నరసరావుపేట ప్రభుత్వా్రస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అవసరమని నిర్ధారించిన వైద్యులు అంబులెన్స్‌లో వెంటిలేటర్‌పై హైదరాబాద్ తరలించారు. మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 3,257 ప్రొసీజర్లతో లక్షలాది మంది బాధితులకు అండగా సీఎం జగన్ నిలిచారు. అక్కడితో ఆగకుండా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని అరుదైన జబ్బుల బారినపడి రూ.లక్షలు, కోట్లలో వైద్యానికి ఖర్చయ్యే వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్ విషయంలోనూ సీఎం జగన్ మానవతా ధృక్పథంతో స్పందించారు. బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా వెనుకాడొద్దని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎంవో అధికారులు హైదరాబాద్‌లోని ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్‌చేసి బాలుడి శస్త్ర చికిత్సకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, వెంటనే శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించారు. దీంతో వైద్యులు అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ శస్త్ర చికిత్సను చేపట్టారు. చికిత్స అనంతరం వైద్యుల పరిశీలన ముగించుకుని ఈ నెల 14న బాలుడు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు. మరో మూడు నెలల అనంతరం ఇంకొక సర్జరీ చేస్తే బాలుడు ముందులా మాట్లాడగలుగుతాడని వైద్యులు చెబుతున్నారు. ఆపద కాలంలో సీఎం జగన్ చేసిన మేలును ఎప్పటికీ మరువలేమని ఖాజాబీ దంపతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ బిడ్డ తమకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యామని భావోద్వేగానికి గురవుతున్నారు. ఒక్క ట్వీట్‌తో స్పందించిన ప్రభుత్వం దెబ్బతిన్న స్వరపేటిక, శ్వాసనాళానికి అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించారు. ఆ చికిత్స నిర్వహణ, వైద్య పరీక్షలు, మందులకు రూ.6 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. రెక్కలు ముక్కలయ్యేలా కష్టం చేసే ఖాజాబీ దంపతులకు అంత పెద్దమొత్తంలో అప్పు పుట్టని పరిస్థితి. వారి నిస్సహాయ స్థితిని చూసిన గ్రామస్తులంతా తలా కొంత ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయినప్పటికీ.. చికిత్సకు సరిపోయేంత డబ్బు సమకూరకపోవడంతో మహమ్మద్‌ను ఆదుకోవాలంటూ ఓ డాక్టర్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఏపీ సీఎంవో అధికారులు స్పందించారు. ఈ విషయాన్నివెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దేవుడిలా ఆదుకున్నారు రోజూ పనికెళ్లి కూలి డబ్బులతో జీవిస్తున్నాం. తెచ్చుకుంటే తినాలి.. లేదంటే పస్తులుండాలి. ఇది మా జీవితం. అలాంటి మాపై ఉపద్రవంలా పెద్ద కష్టం వచ్చిపడింది. వెంటిలేటర్‌పై బాబును చూసి మాకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యాను. ఆపరేషన్‌కు రూ.6 లక్షలు ఖర్చవుతుందనగానే నా నోట మాట లేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో కూడా దిక్కుతోచని పరిస్థితి. ఆ సమయంలో దేవుడిలా సీఎం జగన్ ఆదుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చంతా భరిస్తామని చెప్పారు. ఈ రోజు మా బాబు సీఎం జగన్ దయవల్లే దక్కాడు. – షేక్ ఖాజాబీ, బాలుడి తల్లి మా పిల్లల చదువులకు అండగా నిలిచారు ఆ దేవుడు మా బిడ్డకు జన్మ ఇస్తే. సీఎం జగన్ పునర్జన్మ ఇచ్చారు. మా కుటుంబంలో వెలుగులు నింపారు. ఏమిచ్చినా ఆయన రుణం మేం తీర్చుకోలేం. అమ్మ ఒడి రూపంలో మా బిడ్డల చదువులకు చేదోడుగా ప్రభుత్వం నిలిచింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం మాకు ఇంటిస్థలం కూడా మంజూరు చేసింది. – షేక్ బాజీ, బాలుడి తండ్రి -
మా మంచి సీఎం
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేయడానికి గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలు కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. ఆపదలో ఉన్నామని.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన వెంటనే మానవతా దృక్పథంతో వారికి ఆర్థిక సాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులును సీఎం ఆదేశించారు. దీంతో వెంటనే కలెక్టర్ బాధితుల వివరాలు తెలుసుకుని 16 మందికి రూ.16.30 లక్షలను సీఎం రిలీఫ్‌ఫండ్ కింద ఆర్థిక సాయం అందజేశారు. – సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన వారి వివరాలు ► నంద్యాల పట్టణం గాంధీనగర్‌కు చెందిన లక్కా కేశవ పక్షవాతంతో బాధపడుతుండడంతో చికిత్స నిమి త్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష అందజేశారు. ► నంద్యాల పట్టణం గాంధీనగర్‌కు చెందిన కె.మార్తమ్మ మూర్ఛ వ్యాధితో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► అవుకు మండలం సంగపట్నానికి చెందిన షేక్ షరీఫ్ ఫిజియో థెరపీ చికిత్స కోసం రూ. 2 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. ► అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన ఎస్.గణేష్ బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష అందజేశారు. ► అవుకు మండలం సింగనపల్లెకు చెందిన ఎ.తారకేశవ్ మాన సిక వికలత్వంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన కాటసాని గణేష్ బ్రెయిన్లో నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. బాధితుని చికిత్స కోసం రూ. 50 వేల చెక్కును కలెక్టర్ అందజేశారు. ► బనగానపల్లె మండలం గుండ్ల సింగవరం గ్రామానికి చెందిన కంబగిరి స్వామి మెదడులో నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. అతని చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం ఒద్దిరాళ్ల గ్రామానికి చెందిన సుబ్బరాయుడవ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అతనికి చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► అనంతపురం పాతబస్తీకి చెందిన పి.ముష్కస్ బ్యాక్ బోన్ ఫ్యాక్చర్‌తో బాధపడుతోంది. ఆమెకు చికిత్స కోసం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► రోడ్డు ప్రమాదంలో మోకాలు పోగొట్టుకున్న అనంతపురానికి చెందిన బాధితుడు ఎస్.ఖాజాకు రూ.50 వేల చెక్కును అందజేశారు. ► ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామానికి చెందిన సి.సోమశేఖర్ పేదరికం కారణంగా గృహ నిర్మా ణం నిమిత్తం రూ.లక్ష చెక్కును అందజేశారు. ► ప్రకాశం జిల్లా ఓబులంపల్లికి చెందిన బాల గురువయ్య వైద్య ఖర్చుల కోసం అతని భార్యకు రూ.లక్ష చెక్ అందజేశారు. -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణానికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసితుడు హరిజన గోరంట్ల తాను వికలాంగుడనని, పేదరికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని.. బీకాం డిగ్రీ పూర్తి చేశానని పై చదువులకు, కోచింగ్ కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా.. సీఎం వెంటనే స్పందించారు. పైచదువులకు 15,000 రూపాయలు, జీవనోపాధికి మరో 15,000 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 30 వేల రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్.. హరిజన గోరంట్లకు అందజేశారు. బనగానపల్లె మండలం తిమ్మాపురం గ్రామ నివాసితుడు షేక్ అబ్దుల్ వజీద్ తన కుమారుడు కిడ్నీ సమస్యతో ఒకటిన్నర సంవత్సరం నుండి బాధపడుతున్నాడని.. నెలకు 5000 రూపాయలు వైద్యానికి ఖర్చవుతుందని తాను పేద వాడినని ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరగా.. వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ అబ్దుల్ వజీద్‌కు లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. అలాగే అవుకు మండలం వేములపాడు గ్రామ నివాసితుడు బి.మనురాహుల్ తాను 6 సంవత్సరాల నుంచి వికలాంగత్వంతో బాధపడుతున్నానని వ్యాధి చికిత్సకు తగిన ఆర్థిక స్తోమత తమ వద్ద లేదని, సహాయం చేయాలని కోరగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. బనగానపల్లె పట్టణ వాస్తవ్యులు అబ్దుల్ హజీమ్ తనకు 20 సంవత్సరాల వయసు ఉందని ఇంటర్ ఫెయిల్ అయ్యానని.. నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డా. డా.కె.శ్రీనివాసులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వ్యాపారం చేసుకునేందుకు 2 లక్షల రూపాయల చెక్కును అబ్దుల్ హజీమ్‌కు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగవైకల్యం, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఇప్పటివరకు వారు సొంత నిధులతో ఖర్చుపెట్టిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తూ భవిష్యత్తులో జరిగే వైద్య ఖర్చులకు కూడ ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సభా వేదిక, హెలిపాడు ప్రాంతంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన 22 మంది అర్జీదారులకు ఆర్థిక సహాయం, పెన్షన్లతో పాటు వ్యాధిగ్రస్తులు ఇప్పటివరకు వారి సొంత నిధులతో వైద్యానికి ఖర్చు పెట్టుకున్న మొత్తానికి పూర్తిస్థాయి రీయింబర్స్‌మెంట్‌కు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అడిగిన వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌కు సంబంధిత అర్జీదారులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
టీడీపీ ఎంపీటీసీ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్
జరుగుమల్లి: ఆపదలో ఉన్నవారిని ఆదుకునే క్రమంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మరోమారు రుజువయింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎడ్లూరపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ బత్తిన మోహనరావు (53) బ్లాక్ ఫంగస్ వ్యాధికి గురై అనేక ఆస్పత్రులకు తిరిగి దాదాపు రూ. 30 లక్షల వరకు ఖర్చుచేశారు. అయినా ఫలితం లేక గతేడాది నవంబర్‌లో మరణించారు. ధుఃఖంలో ఉన్న మోహనరావు కుటుంబానికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పార్టీలకు అతీతంగా అండగా నిలిచారు. స్థానిక నాయకులు చుండి శ్రీనివాసరావు, చుండూరి సురేష్ ఈ విషయాన్ని మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 8 లక్షలు మంజూరు చేయించారు. ఈ నెల 19న మోహనరావు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. మానవత్వంతో ఆదుకున్నారు మా పెదనాన్న గత ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనారోగ్యానికి గురవడంతో పలు ఆస్పత్రులకు తిప్పి మా శక్తికి మించి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశాం. అయినా ఆయన మాకు దక్కలేదు. ఆ సమయంలో స్థానిక నాయకులు, మంత్రి సురేష్ పార్టీలు చూడకుండా మానవత్వంతో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.8 లక్షలు మంజూరు చేయించి ఇచ్చారు. – బత్తిన శరత్‌బాబు, మృతుని తమ్ముని కుమారుడు -
గంగపుత్రులపై పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, కాకినాడ: గంగపుత్రులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. గత డిసెంబర్ 1న బైరవపాలెం వద్ద నడి సముద్రంలో బోటు దగ్ధమవ్వగా, బోటులో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్ బృందం రక్షించింది. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం జగన్.. బోటు యజమాని కాటాడి రామకృష్ణ పరమహంసకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఇదీ చదవండి: షర్మిలను నిలదీసిన సామాన్యుడు -
టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్ ప్రభుత్వం
‘కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడం చివరికి ఎవరికి ఓటు వేసారన్నది కూడా చూడకుండా మంచి చేస్తామని ఎన్నికల వేళ ఏదైతే చెప్పామో.. ఆ చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను తూచా తప్పకుండా అందరికీ అందించాం. నా వాళ్లు, కాని వాళ్లు అని ప్రజలను విభజించే జన్మభూమి కమిటీలను పూర్తిగా రద్దు చేసి, ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ నా వాళ్లే అనే గొప్ప సందేశాన్ని ఈ నాలుగేళ్ల కాలంలో ఇవ్వగలిగాం’. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పారదర్శక పాలన గురించి ఇలా వివరించారు. సంక్షేమ పథకాలే కాదు పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని చెప్పేందుకు నంద్యాలకు చెందిన టీడీపీ కార్యకర్తనే నిదర్శనం. నంద్యాల(అర్బన్): ఆయనొక కరుడుగట్టిన టీడీపీ వీరాభిమాని. అంతటి అభిమానికి గుండె సంబంధిత వ్యాధి సోకింది. పార్టీ కోసం పాటు పడిన కార్యకర్త మృత్యువుతో పోరాడుతున్న విషయం పార్టీ ఇన్‌చార్జ్‌లకు తెలిసింది. అయినా సహాయం అందించక పోగా కనీసం పరామర్శకు కూడా రాలేదు. ఆ గుండెకు ఏమి కాకుండా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. ఆర్థిక సహాయం చేసి ప్రాణాన్ని నిలిపారు. నంద్యాల మండలం అయ్యలూరు మెట్టకు చెందిన దాది నాగేశ్వరరావు కొద్ది నెలల క్రితం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ నంద్యాల, కర్నూలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఈ వ్యాధి పరిధిలోకి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రిని కాపాడుకునేందుకు పార్టీలను పక్కనపెట్టిన కుమారులు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు బసవేశ్వరరెడ్డి, రవికుమార్ రెడ్డిల ద్వారా విషయాన్ని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలు ముఖ్యం కాదని, ఓ ప్రాణాన్ని కాపాడటానికి మానవతా దృక్పథంతో ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు మంజూరయ్యేలా ఎమ్మెల్యే శిల్పా రవి సీఎంఆర్ఎఫ్కు సిఫారసు చేశారు. ఎమ్మెల్యే లెటర్ తీసుకున్న నాగేశ్వరరావు కుమారులు నాగరాజు, నాగార్జున అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే శిల్పారవితో ఫోన్ చేయించుకోవడంతో రూ.8.50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ త్వరితగతిన విడుదల అయ్యింది. సీఎం రిలీఫ్ ఫండ్‌తో నాగేశ్వరరావుకు ఆగస్టు నెలలో హైదరాబాద్ నిమ్స్‌లో ఆపరేషన్ చేయించారు. క్షేమంగా ఇంటికి చేరుకున్న ఇంటి పెద్దను చూసి కుటుంబీకులు సంతోషించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగేశ్వరరావు బతికేందుకు సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని అతని భార్య లక్ష్మీదేవి, కుమారులు నాగరాజు, నాగార్జున చెబుతున్నారు. నాగేశ్వరరావు మృత్యుంజయుడిగా తిరిగి వచ్చినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ పరామర్శించడానికి రాలేదన్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వచ్చి భరోసా కల్పించారన్నారు. ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని చెప్పడంతో ఎంతో ధైర్యం వచ్చిందన్నారు. టీడీపీకి చెందిన ఫొటో లను కేసీ కాల్వలో పడేశామని, ప్రస్తుతం తమ కుటుంబానికి జగనన్నే దేవుడు అని చెబుతున్నారు. -
సీఎం జగన్ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం
అమలాపురం రూరల్: బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ఆమె వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పలివెల బ్లెస్సీ కొన్నాళ్లుగా తలనొప్పితో బాధపడుతోంది. తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా.. బ్రెయిన్ క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు రూ.41.50 లక్షలు అవుతుందని చెప్పారు. బిడ్డకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో తండ్రి రాంబాబు తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న అమలాపురం పర్యటనకు వచ్చిన సీఎం జగన్ దృష్టికి తన బిడ్డ సమస్యను రాంబాబు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ద్వారా తీసుకువెళ్లారు. ఆ చిన్నారి సమస్య విని చలించిపోయిన సీఎం జగన్ రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి విశ్వరూప్ భార్య బేబీమీనాక్షి, కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ సోమవారం ఆ కుటుంబానికి అందజేశారు. చదవండి: దమ్ము లేకనే.. దత్తపుత్రుడు -
టీడీపీ నేతకు లివర్ వ్యాధి.. సీఎం రిలీఫ్ ఫండ్ రూ.20 లక్షలు మంజూరు
తుని: కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరానికి చెందిన టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ మాజీ సభ్యుడు కె.కృష్ణకు లివర్ వ్యాధి చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.20 లక్షలు మంజూరు అయింది. ఇందుకు సంబంధించిన ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణ భార్య లక్ష్మికి అందజేశారు. కొంతకాలంగా కృష్ణ లివర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని ఏఎంసీ మాజీ చైర్మన్ మురళి మంత్రి రాజా దృష్టికి తీసుకొచ్చారు. విశాఖపట్నం మణిపూర్ ఆస్పత్రిలో కృష్ణకు వైద్య సేవలు అందిస్తున్నారు. తమ ప్రభుత్వం పథకాలతో పాటు వైద్య సేవలను పార్టీలకు అతీతంగా అందిస్తున్నదని మంత్రి రాజా అన్నారు. చదవండి: Fact Check: బురద రాతలే పునరావృతం -
జబర్దస్త్ పంచ్ ప్రసాద్ వైద్యానికి సీఎం రిలీఫ్ నుంచి సహాయం
-
పేరుకే బిచ్చగాడు.. సీఎం సహాయనిధికి భారీగా విరాళం
తిరువళ్లూరు: బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేల నగదును సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడో యచకుడు. తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం సమీపంలోని ఆళంగినర్ గ్రామానికి చెందిన యాచకుడు పూల్పాండి(75). భార్య మృతి చెందిన తరువాత తన పిల్లలు ఉద్యోగం కోసం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదును విద్య, వైద్యం, ఆనాథ ఆశ్రమాలకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పదేళ్లలో పాండిచ్చేరితో పాటు చైన్నె, తూత్తుకుడి, కన్యాకుమారి, విల్లుపురం, వేలూరు, సేలం, నీలగిరి, కోయంబత్తూరు సహా వేర్వేరు జిల్లాలకు చెందిన కలెక్టర్లను కలిసి ఇప్పటి వరకు యాచించిన రూ. 5.60 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. తాజాగా రెండు నెలల్లో బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేలను కల్తీసారా తాగి విల్లుపురం చెంగల్పట్టు జిల్లాలో మృతి చెందిన కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు. మంగళవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్‌ను కలిసి నగదు అందజేశారు. అనంతరం మీడియాతో పూల్పాండి మాట్లాడుతూ.. డబ్బులు ఉంటే మనఃశాంతి ఉండదని, మనస్సు ఉన్న వారి వద్ద డబ్బులు ఉండడం లేదని తెలిపారు. తాను బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదులో కొంత భాగాన్ని తిండి కోసం ఉపయోగిస్తున్నానని చెప్పారు. తనకు మూడుపూటల ఆహారం, కట్టుకోవడానికి గుడ్డ ఉంటే చాలని పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే వృద్ధాశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోనున్నట్లు పాండి తెలిపారు. -
కరోనాతో పేరెంట్స్ మృతి.. పిల్లలకు 10లక్షలు అందజేత
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన కొల్లు శ్రీవాసవి ప్రవళిక, కొల్లు ఉమాశంకర్ అక్కాతమ్ముళ్లకు సీఎం సహాయ నిధి నుండి రూ.10 లక్షల చెక్కులను హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అందజేశారు. కొవ్వూరులోని హోం మంత్రి కార్యాలయంలో ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున రెండు చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. కాగా.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని జండా పంజా రోడ్డులో నివాసం ఉంటున్న కొల్లు శ్రీ వాసవి ప్రవళిక, ఉమాశంకర్‌లు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే తమ తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయారు. 2021లో కరోనాతో తండ్రి కొల్లు శ్రీనివాసరావు(47) జూన్ 5 న మరణించగా, తల్లి కొల్లు శ్యామల(41) జూన్ 9న మృతి చెందారు. ప్రస్తుతం అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న అక్క తమ్ముళ్లకు సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందించారు. తల్లిదండ్రులను ఇద్దర్నీ ఒకేసారి కోల్పోయి తీవ్ర మనోవేదనలో ఉన్న తమకు ధైర్యాన్ని, భవిష్యత్ పట్ల నమ్మకాన్ని కలిగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోం మంత్రి తానేటి వనితలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి సాయం అందించడానికి హోం మంత్రి చేసిన కృషి, చొరవ ఎప్పటికీ మరువలేనిదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసం, ఆపద కాలంలో వారికి అండగా ఉండడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందజేస్తున్నామని తెలిపారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తి విశ్వాసం కల్పిస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ అహర్నిషలు కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఎందరో అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలిచి బతుకుపై భరోసానిచ్చిందని తెలిపారు. -
భిక్షాటనతో వచ్చిన రూ.10 వేలు..
తమిళనాడు: ఓ వృద్ధుడు భిక్షాటన ద్వారా వచ్చిన రూ.10 వేలును మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చాడు. వివరాలు.. పెరంబలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మంగళవారం తూత్తుకుడి జిల్లా సాత్తాంగుళం తాలూకా అలంగినారు ప్రాంతానికి చెందిన భూల్ పాండియన్ (73) వచ్చాడు. తన భిక్షాటన ద్వారా తనకు వచ్చిన రూ.10 వేలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని కలెక్టర్ కార్యాలయ అధికారుల వద్దకు వెళ్లాడు. తరువాత వాటిని బ్యాంకుల ద్వారా ప్రభుత్వ నిధుల్లోకి జమ చేయమని సూచించారు. దీంతో బ్యాంకుకు వెళ్లి తన పొదుపు సొమ్ము రూ.10 వేలను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు. -
టీడీపీ నేత కుటుంబానికి రూ.5 లక్షల ప్రభుత్వ సాయం
శాంతిపురం: చిత్తూరు జిల్లా చెంగుబళ్ల పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు, గతంలో జన్మభూమి కమిటీ సభ్యుడిగా ఉన్న మునిసిబ్ గారి ప్రసాద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేసింది. చెంగుబళ్ల పంచాయతీ పరిధిలోని సోగడబళ్లలో ఆదివారం ఎమ్మెల్సీ భరత్ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ప్రసాద్ కుమారుడు మోహన్‌కు ఎమ్మెల్సీ భరత్ అందజేశారు. ప్రసాద్ భార్య రూప తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రస్తుతం కోలుకుంటున్నారని.. ఆమె వైద్యానికి అయిన ఖర్చులను ప్రభుత్వం మంజూరు చేసిందని భరత్ చెప్పారు. -
ఆ దౌర్భాగ్యం ఉంటే పదవిని తృణప్రాయంగా వదిలేస్తా: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లా ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయాలు నేను చేయను అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు మంజూరైన పరిహారంలో రూ.2లక్షలు తీసుకునే దౌర్భాగ్యం ఉంటే పదవిని తృణపాయంగా వదిలేస్తానని మంత్రి అంబటి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఒక్కొక్క కుటుంబానికి రూ.7 లక్షలు చొప్పున మొత్తం రూ. 84 లక్షలను ప్రభుత్వం పరిహారంగా చెల్లించాం. ఆగస్టు 20న మృతి చెందినవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా చంద్రబాబు జేబు పార్టీ నాపై ఆరోపణలు చేస్తే నేనెలా ఊరుకుంటా?. నాపై తప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు. జనసేన అభిమాని చనిపోతే కనీసం పలకరించని కుసంస్కారం పవన్‌ది' అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చదవండి: (బాపట్ల జిల్లా యడ్లపల్లిలో పర్యటించనున్న సీఎం జగన్) -
కడపలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ