
సీఎం కేసీఆర్‌కు చెక్కును అందిస్తున్న బీఎస్‌ఎన్‌రెడ్డి, వీవీఎస్‌రెడ్డి. చిత్రంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహాయంగా ఆదివారం పలువురు ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. పోకర్న గ్రూప్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందజేసింది. దీనికి సంబంధించిన చెక్కును గ్రూప్ చైర్మన్ గౌతమ్ జైన్ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. అలాగే నాష్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.కోటి విరాళాన్ని అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ బీఎస్‌ఎన్ రెడ్డి, డైరెక్టర్ వీవీఎస్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment