Pragathi Bhavan
-
ప్రజా భవన్ కేసు: రహేల్‌కు రిమాండ్ విధింపు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో రహేల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. రహేల్ కోసం గత కొంత కాలంగా పోలీసులు గాలిస్తున్నారు. అరెస్ట్ అనంతరం రహేల్‌ను పోలీసులు.. జడ్జీ ఎదుట హాజరుపరిచారు. దీంతో, ఈనెల 22 వరకు రహేల్‌కు రిమాండ్ విధించారు. అనంతరం, రహేల్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ప్రగతి భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత రహేల్ దుబాయ్‌కు పారిపోయాడు. దీంతో, రహేల్‌కు ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఈరోజు రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, ప్రగతి భవన్ వద్ద జరిగిన ప్రమాదంలో రహేల్‌ను తప్పించేందుకు తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్టు చూపించారు నిందితులు. కానీ, అసలు నిందితుడు రహేల్గానే పోలీసులు గుర్తించారు. అసలేం జరిగిందంటే.. డిసెంబర్ 23 2023వ తేదీన తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్(ప్రస్తుత ప్రజా భవన్) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రగతి భవన్ వద్ద ఉన్న బారికేడ్లపైకి దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేసింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని నిందితులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు రాహేల్ ఈ విధ్వంసం సృష్టించినట్లు తెలిసింది. అయితే పోలీస్ స్టేషన్ నుంచి అతడు తప్పించుకోవడంతో నిందితుడు కావాలనే తప్పిపోయాడా ఎవరైనా తప్పించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అసలు నిందితుడు రహేల్ అని తేల్చారు. మరో కేసులో రహేల్.. జూబ్లీహిల్స్‌లో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదం సమయంలో షకీల్ కొడుకే రహేల్ కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఈ కేసుపై మళ్లీ దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన మహీంద్రా థార్ వాహనం రాత్రి ఎనిమిది గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ముగ్గురు మహిళలకు గాయాలు కాగా రెండు నెలల బాలుడు దుర్మరణం చెందాడు. కారులోని యువకులు పారిపోయినప్పటికీ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో షకీల్ వాహనంగా తేలింది. అయితే అందులో తన కుమారుడు లేడని షకీల్ ప్రకటన ఇచ్చారు. మరోవైపు అఫ్రాన్ అనే మరో యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి లొంగిపోయాడు. స్టీరింగ్‌పై వేలిముద్రలు అఫ్రాన్‌వేనని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. బాధితుల వాంగ్మూలాల సేకరణ సహా, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మాజ్ అనే మరో యువకుడితో పాటు కారులో రాహిల్ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు మలుపు తిరిగింది. తాజాగా దర్యాప్తులో ఆరోజు కారు నడిపింది రహేల్ అని పోలీసులు గుర్తించారు. మరోవైపు.. అప్పట్లో 304-B సెక్షన్ చేర్చకపోవడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఆరా తీయకపోవడం లాంటి కారణాలను విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రకు వెళ్లి బాధితులను నగరానికి తీసుకొచ్చి వారితోపాటు మరికొందరి వాంగ్మూలాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు డ్రైవింగ్ సీట్ నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి రాహేల్ డ్రైవింగ్ సీట్లో ఉన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు. -
నాకు సీఎం సార్ కావాలి...ప్రగతి భవన్ ముందు యువకుడు హల్ చల్
-
సరైన మార్గంలో కొత్త ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో సాధించిన విజయాన్ని గుర్తుచేస్తోంది. తెలంగాణ పాలనలో కూడా రాజశేఖర రెడ్డి స్ఫూర్తి కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే ‘కక్ష సాధింపు ధోరణులు ఉండవు’ అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పరామర్శించిన తీరూ, ఎన్నికల సమయంలో తమ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీల వాగ్దానంతో పాటు తాము ప్రజా స్వామ్యబద్ధంగా పాలన చేయనున్నామనే వాగ్దానాన్నీ ఏడో గ్యారెంటీగా ఇస్తున్నామనీ పేర్కొనడం ప్రజల్లో ఆశను రేకెత్తిస్తున్నఅంశాలే! రేవంత్ రెడ్డి తీరు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నైజాన్నీ, ఆయన స్వభావాన్నీ తలపి స్తున్నది. ఒకరకంగా తెలంగాణ నేటి ముఖ్య మంత్రి.. ఆ మహానేతచే ప్రభావితమయ్యా రేమో అనిపిస్తోంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ మీద తొలి సంతకం చేశారు. ‘ప్రజా దర్బారు’ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. ప్రజల్లో ఉండే పాల నను కొనసాగించారు. అనుచిత రాతలను మాత్రమే ఖండిస్తూ ప్రతికా స్వేచ్ఛను గౌర వించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినవెంటనే ప్రగతి భవన్ చుట్టూ ఆరడగుల ఎత్తులో పాతుకుపోయిన ఇనుపకంచెను తొల గించేశారు. ప్రగతి భవన్‌ను ‘ప్రజా భవన్’గా మార్చారు. ‘ప్రజల సమస్యలు తెలుసుకోని పాలన ఏంటీ? ప్రజా వాణి వినని ప్రజా స్వామ్యం ఏంటని’ రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవచ్చని ‘ప్రజా వాణి’ పేరుతో ప్రజా దర్బా రును పునః ప్రారంభించారు. తామిచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచడం అనేరెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చారు. లక్ష ఉద్యోగాల హామీకీ కసరత్తు మొదలు పెట్టారు. రూ. 500కు సిలిండర్, కుటుంబానికి ఆర్థిక బాసటగా ఉన్న మహిళలకు నెల నెలా 2,500 రూపాయలు ఇవ్వడం వంటి హామీలకూ తెల్లరేషన్ కార్డుల వెరిఫై,మంజూరు వంటి ఎక్స్ర్సైజులు మొదలై పోయాయి. వీటన్నిటి కంటే ముందు... నాడు తెలుగుదేశం ఉప్పెనలో మిణుకు మిణుకు మంటూ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రె స్కి ఎలాగైతే రాజశేఖర రెడ్డి తన పాద యాత్రతో ఊపిరి పోసి మళ్లీ అధికారంలోకి తెచ్చారో... అలాగే తెలంగాణలో రేవంత్కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. ఎన్నికల సమయంలో సీనియర్ లీడర్లందరికీ సము చిత గౌరవం, బాధ్యతలూ ఇచ్చి మంచి ఫలి తాలు రాబట్టారు. నాడు పాదయాత్రతో రాష్ట్ర అవసరాల మీద ఒక అంచనాకు వచ్చి ఎలా గైతే రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు.. అభి వృద్ధి ప్రణాళికలను రచించారో.. అలాగే రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల కంటే ముందే రాష్ట్ర సమస్యల మీద ఒక అవగాహన ఏర్ప రచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతటా తిరిగి ఆ అవగాహన మీద ఒక స్పష్టతను తెచ్చుకున్నారు. నిండు అసెంబ్లీలో ‘మేం పాలకులం కాం సేవకులం’ అంటూ ఆయన చూపిన వినమ్రత, విజ్ఞతే ఆయన ప్రజాస్వామ్యయుత పాలనా నిబద్ధతకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ మాటను చెప్పడమే కాదు.. ఆ బాటలో నడుస్తున్నారు కూడా. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ శాఖ మొదలు శాఖ లన్నిటిలోని అవకతవకల మీద దృష్టి పెట్టారు. తద్వారా ఏ ప్రభుత్వమైనా తమ చర్యల పట్ల ప్రజలకు జవాబుదారీగా ఉండా లని చెబుతూ పాలనలో పారదర్శకత తీసు కొస్తున్నారు. డ్రగ్స్ వంటి వాటిని రాష్ట్రంనుంచి తరిమికొట్టేందేకు ఆయన పడుతున్న తాపత్రయం మన యువత పట్ల ఆయనకున్న కన్సర్న్ను చూపెడుతోంది. రాష్ట్ర అభివృద్ధి... పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం సమష్టి బాధ్యతగా భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనా దక్షత, విజన్‌తో తెలంగాణను 5 లక్షల కోట్ల రూపాయల రుణం నుంచి విముక్తం చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తారని యావత్ తెలంగాణ విశ్వసిస్తోంది. - డా‘‘ వర్రె వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ -
ప్రజాభవన్ ముందు భారీగా ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు
హైదరాబాద్: సమస్యలను ఏకరువు పెట్టుకునేందుకు నగరంలోని ప్రజా భవన్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి అర్జీదారులు బారులు తీరుతున్నారు. శుక్రవారం ప్రజావాణిలో దరఖాస్తులనుసమర్పించేందుకు ప్రజలు వేలాదిగా తరలిరావడంతో ప్రజాభవన్ సమీపంలోని రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచే క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. కొందరు క్యూలైన్లోనే అల్పాహారం తీసుకున్నారు. సందట్లో సడేమియా వలే ఇక్కడ దరఖాస్తులను రాసేందుకు కొందరు తెల్ల కాగితాలను సైతం విక్రయించారు. మొత్తానికి శుక్రవారం గ్రీన్‌హిల్స్‌లోని ప్రజాభవన్ వేలాది మంది అర్జీదారులతో కిటకిటలాడుతూ కనిపించింది. -
TS:ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు..ట్రాఫిక్ జామ్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. వారానికి రెండు రోజులు మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మంగళ, శుక్రవారాల్లో జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్(గత ప్రగతిభవన్)కు భారీగా తరలివస్తున్నారు. ఈ వారంలో రెండోసారి జరిగే శుక్రవారం(డిసెంబర్15) ప్రజావాణి కోసం ప్రజలు పోటెత్తారు. ఉదయం 5 గంటలకే ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. ఈ క్యూ లైను తొమ్మిది గంటలకల్లా రెండు కిలోమీటర్లకుపైగా పెరిగిపోయింది. దీంతో బేగంపేట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజావాణికి వచ్చిన వారిని క్రమపద్ధతిలో నిల్చోబెట్టి ఒక్కొక్కరిగా లోపలికి పంపడం పోలీసులకు కొంత టఫ్ టాస్క్‌గా మారింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలందరూ హైదరాబాద్ ప్రజాభవన్కే రానవసరం లేకుండా ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లోనూ ప్రజావాణి నిర్వహింపజేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా వాణి నియోజకవర్గాల్లోనూ నిర్వహించడం వల్ల స్థానిక సమస్యలు ఎక్కడికక్కడే త్వరగా పరిష్కారమవడమే కాకుండా ప్రజలకు హైదరాబాద్ దాకా వచ్చే భారం తగ్గుతుంది. ప్రజాభవన్ వద్ద రద్దీ తగ్గి ఇక్కడి యంత్రాంగం మీద ఒత్తిడి తగ్గే అవకాశముంటుంది. ప్రజావాణిలో ఎక్కువగా భూముల సంబంధిత సమ్యలు, ధరణి, ఆరోగ్యం,నిరుద్యోగం అంశాలపైనే ఎక్కువ అర్జీలు వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాదర్భార్ పేరుతో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి తొలిరోజు సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం పేరును ప్రజావాణిగా పేరుమార్చారు. అప్పటి నుంచి ఒక్కో రోజు ఒక్కో మంత్రి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రజావాణికి మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హాజరయ్యారు. ఇదీచదవండి..TS: నేటినుంచి జీరో టికెట్ -
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం
-
ప్రజాభవన్‌లోకి భట్టి ఫ్యామిలీ గృహ ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం చేశారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. ఇక, గృహ ప్రవేశం అనంతరం భట్టి దంపతులు అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం సందర్భంగా హోమం కార్యక్రమం చేపట్టారు. ఈ హోమం కార్యక్రమంలో భట్టి దంపతులు పాల్గొన్నారు. అనంతరం, భట్టి విక్రమార్క సచివాలయానికి బయలుదేరారు. కాసేపట్లో సచివాలయంలోని తన చాంబర్లో భట్టి ఛార్జ్ తీసుకోనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చింది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, ప్రజాదర్బార్‌ను కొత్త ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కాగా, రాచరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనంలో నివాసం ఉండేందుకు సకల సదుపాయాలు ఉండటం, భద్రతాపరంగా అనుకూలంగా ఉండటం, పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీని పేరునే ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఎంసీఆర్హెచ్ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు తరలించే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Live Updates.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చ సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు థాకరే ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్.. కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ సీఎం రేవంత్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, మిగతా బెర్తులపై అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ అసెంబ్లీలో మంత్రుల ప్రమాణ స్వీకారం. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష సమీక్షకు హాజరు కాని సీఎండీ ప్రభాకర్ రావు. సమావేశానికి రావాలని ఆదేశించినా హాజరు కాని ప్రభాకర్ రావు. విద్యుత్ శాఖలో ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణంపై సీఎం రేవంత్ సమీక్ష సమీక్షకు హాజరైన రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు మహిళలకు ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల చేయనున్న ప్రభుత్వం. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. విధివిధానాలను రూపొందించాలని అధికారులకు రేవంత్ ఆదేశం. ఆర్టీసీ పరిస్థితులు, ఆదాయం, వ్యయంపై సీఎం రేవంత్ ఆరా. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4కోట్ల భారం పడే అవకాశం. ఆర్టీసీ బస్సుల్లో రోజూ 12-13 లక్షల మంది ప్రయాణం. ►కాసేపట్లో విద్యుత్ శాఖ, ఆర్టీసీపై సీఎం రేవంత్ సమీక్ష ►మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రివ్యూ. ►మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు. ►నిన్న తొలి కేబినెట్లోనే విద్యుత్ శాఖపై వాడీవేడి చర్చ ►నేడు సమీక్షకు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రెడ్డి హాజరుకావాలన్న సీఎం రేవంత్. ►ప్రజా దర్బార్ ముగించుకుని సెక్రటేరియట్ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి ►విద్యుత్ శాఖపై సెక్రటేరియట్లో రివ్యూ చేయనున్న సీఎం రేవంత్ ►సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులు ►జెన్కో ఏఈ నియామక పరీక్ష వాయిదా వేయాలని వినతి. ►సీఎం రేవంత్‌ను కలిసి సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సీఎం రేవంత్. ప్రజా దర్బార్‌లో సీఎంను కలిసిన కొండపోచమ్మ ముంపు బాధితులు. ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని సీఎంకు వివరించిన బాధితులు. ►ఇక, ప్రజా దర్బార్‌కు ప్రత్యేక యంత్రాగం. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించేందుకు 20 మంది సిబ్బంది. వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు సిఫార్స్ చేస్తున్న సీఎం రేవంత్. వచ్చిన ఫిర్యాదులపై మళ్లీ సమీక్ష చేయాలని నిర్ణయించుకున్న సీఎం రేవంత్. ప్రతీ నెల వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష. ►కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా దర్బార్ ప్రారంభమైంది. అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. ►జూబ్లీహిల్స్ నివాసం నుంచి జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌కు బయలు దేరిన సీఎం రేవంత్ రెడ్డి.. ►మరికాసేపట్లో ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌కు హాజరు కానున్న సీఎం రేవంత్ ►కాసేపట్లో ప్రజా దర్బార్.. ►ప్రజా దర్భార్‌లో కోసం భారీగా వచ్చిన ప్రజలు.. గడీల పాలన అంతం కోసం ఇనుప కంచెలను తొలగించి, జ్యోతిరావు పూలే ప్రజా భవన్ కు తెలంగాణ ప్రజలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ప్రజా దర్బార్ లో తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజా భవన్ కు తరలివచ్చిన ప్రజలు.@revanth_anumula#PrajalaTelanganaSarkaar pic.twitter.com/quqLv4pKeT — Telangana Congress (@INCTelangana) December 8, 2023 తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. నేడు, జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బర్ నిర్వహించనున్నారు. ఈ ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ తొలి అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎన్నికల సమయంలో రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక, విద్యుత్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. సెక్రటేరియట్లో విద్యుత్ శాఖపై మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టనున్నారు. సీఏండీ ప్రభాకర్ రావును రివ్యూకు అటెండ్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థలో 85వేల కోట్ల అప్పులపై ఆరా తీయనున్నారు. నేడు సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరోవైపు, విద్యుత్ సంక్షోభం సృష్టించే కుట్ర జరిగిందని తొలి క్యాబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించిన సీఎం రేవంత్. అయితే, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. Praja Telangana - ప్రజల తెలంగాణ 10 గంటలకు ప్రజాభవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్. -- తమ వినతులతో ప్రజా భవన్ కు భారీగా చేరుకున్న ప్రజలు. Telangana Chief Minister Revanth Reddy Praja Darbar at Praja Bhavan at 10 o'clock. -- People reached the Praja… pic.twitter.com/aZUhEhzd43 — Congress for Telangana (@Congress4TS) December 8, 2023 -
ప్రగతి భవన్ వద్ద కంచెలు తొలగింపు
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతున్న సమయంలోనే ప్రగతి భవన్ వద్ద ఆంక్షలను కొత్త ప్రభుత్వం తొలగించినట్లయ్యింది. సుమారు పదేళ్లుగా ఉన్న కంచెలను తొలగించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందడంతో వాటిని యుద్ధ ప్రాతిపదికిన తొలగిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రగతి భవన్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఆంక్షలను విధించగా.. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వాటిని ముందుగా తొలగించేందుకు పూనుకుంది. -
ప్రగతి భవన్ కు ఈసీ నోటీసులు..
-
ప్రగతి భవన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్ సీఎం అధికారిక భవనం. అయినప్పటికీ.. అందులో బీఆర్ఎస్ తన కార్యక్రమాలు నిర్వహిస్తుస్తోంది అని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యల్లో భాగంగా అధికారులు గురువారం సుదీర్ఘంగా చర్చించారు. గురువారం సాయంత్రం సీఈవో వికాస్ రాజ్‌తో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ భేటీ అయ్యారు. ఈ ఫిర్యాదులో ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై చర్చలు జరిపారు. చివరకు.. ప్రగతి భవన్ నిర్వహణ అధికారులు నోటీసులు పంపారు. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్: కేసీఆర్‌కు జూపల్లి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన కామెంట్స్ చేశారు. అహంకారంలో కేసీఆర్‌ను మించిన వాళ్లు ఎవరున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీఎం కేసీఆర్ నిన్న(శుక్రవారం) తెలంగాణ భవన్లో జూపల్లి గురించి మాట్లడుతూ ఎన్నికల సమయంలో అహంకారంగా వ్యవహరించారని అన్నారు. అలాగే, కార్యకర్తలను, ప్రజలను కలవడంలో జూపల్లి అలసత్వం చూపించారని.. అందుకే ఎన్నికల్లో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై జూపల్లి స్పందించారు. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను వేలు పెట్టి చూపించే హక్కు నీకు లేదు. అహంకారంలో కేసీఆర్‌ను మించిన వాళ్లు ఎవరున్నారు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. కమ్యూనిస్టులను తోక పార్టీలు అన్నది అహంకారంతో కాదా?. ఎమ్మెల్యే, మంత్రులను కలవకుండా అహంకారంతో ఉంది నువ్వే కేసీఆర్. ఎన్నికలు రాగానే వేషాలు మారుస్తున్నావు. ఎన్నికల్లో నువ్వెందుకు ఓడిపోయావ్.. వినోద్ ఎందుకు ఓడిపోయాడు. చేసే ప్రతీ పనిలోనూ వాటాలు. కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు. కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం పోయింది. ధర్నాచౌక్ ఎత్తేసిన వ్యక్తి కేసీఆర్’ అంటూ మండిపడ్డారు. ఇది కూడా చదవండి: నేడు బీజేపీ కీలక భేటీ.. అభ్యర్థుల్లో టెన్షన్! -
ప్రభుత్వం సాధించిన విజయాలకు అక్షర చిహ్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయపరంపరకు అక్షరచిహ్నంగా ‘తెలంగాణ మోడల్’ పుస్తకం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన ’తెలంగాణ మోడల్‘’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో గౌరీశంకర్ పొందుపరిచారని చెప్పారు. విజయాలను నమోదు చేయడం అంటే చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలు భద్రపరచడమేనని, ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే ఈ విజయాలు పుస్తకరూపంలో రావడం భవిష్యత్తరాలకు పాఠాలుగా నిలుస్తాయన్నారు. ‘టుడే ఏ రీడర్– టుమారో ఏ లీడర్’ అంటారని గుర్తు చేశారు. శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. ఎర్రోజు శ్రీనివాస్ ‘నడక’ పుస్తకావిష్కరణ తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలన్నీ కలిపి తీసుకొచ్చిన ’నడక’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ వ్యాసాల ద్వారా దశాబ్దాల కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును కేటీఆర్ అభినందించారు. -
సునీతారెడ్డికే టికెట్..
నర్సాపూర్: నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి ప్రగతి భవన్ నుంచి శనివారం రాత్రి పిలుపు వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. నర్సాపూర్ టికెట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నర్సాపూర్ టికెట్ తనకే ఇవ్వాలని మదన్‌రెడ్డి కోరగా.. మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డికే ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని చెప్పినట్లు తెలిసింది పార్టీ నిర్ణయించే అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని మంత్రులు ఆయనకు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. మీరు కేసీఆర్ సమకాలికులని, సన్నిహితులని, మీకు సీఎం అన్యాయం చేయరని మద న్‌రెడ్డికి మంత్రులు నచ్చ చెప్పారని అంటున్నారు. పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సునీతారెడ్డికి టికెట్ ఇవ్వనున్నారని, ఆమెను గెలిపించుకు ని రావాల్సి ఉంటుందని సూచించారని తెలిసింది. మీ స్థాయికి తగిన పదవి వస్తుంది నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందకుండా, వారికి తప్పుడు సమాచారం వెళ్లకుండా మీరు స్పందించాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం మీకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని, మీ స్థాయికి తగిన పదవి ఇచ్చి పార్టీ గౌరవిస్తుందని హామీనిచి్చనట్టు సమాచారం. ఇదిలాఉండగా రేపో మాపో ఒకే వేదికపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సునీతారెడ్డిను కూర్చోబెట్టి చర్చలు జరిపి నర్సాపూర్ పార్టీ టికెట్‌ను అధికారికంగా బీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. -
మళ్లీ మొదలైంది..గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్
-
బీఆర్ఎస్లోకి గాయకుడు ఏపూరి సోమన్న
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ గాయకుడు, వైఎస్సార్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రగతిభవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలిశారు. ఉద్యమంలో కలసి పనిచేసిన రీతిలోనే బీఆర్ఎస్ వెంట నిలిచేందుకు సోమన్న సుముఖత వ్యక్తం చేయగా.. కేటీఆర్ స్వాగతించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో సోమన్న గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. కేటీఆర్ తనను పార్టీలోకి స్వాగతించారని, కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని హామీ ఇచ్చారని ఏపూరి సోమన్న ‘సాక్షి’కి వెల్లడించారు. పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ ఉద్యమంలో భాగమైన తరహాలోనే అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సాయిచంద్ లేని లోటు పూడ్చేందుకే? బీఆర్ఎస్ సాంస్కృతిక విభాగానికి వెన్నెముకగా పనిచేసిన కవి, గాయకుడు సాయిచంద్ ఈ ఏడాది జూన్‌లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సభలు, సమావేశాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలను సాయిచంద్ ముందుండి నడిపించేవారు. ఆయన లేని లోటును పూడ్చేందుకు.. జనాలను ఆకట్టుకునే శక్తి ఉన్నందుకే సోమన్నను చేర్చుకునేందుకు బీఆర్ఎస్ మొగ్గు చూపినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార సభల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు సోమన్న నేతృత్వం వహించే అవకాశం ఉందని అంటున్నాయి. బీఆర్ఎస్లోకి బీజేపీ హైదరాబాద్ నేతలు బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా, కార్పొ రేటర్‌గా పనిచేసిన వెంకట్‌రెడ్డి, ఆయన భార్య కార్పొరేటర్ పద్మ శుక్రవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబర్‌పేటలో కాలేరు వెంకటేశ్ గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. -
రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్ చాలా దగ్గరగా ఉందన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కేసీఆర్ ఫోకస్ అంతా అక్కడేనా?
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. వ్యూహాత్మక రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ బీఆర్ఎస్. అందుకు కారణాలు దాదాపుగా తెలిసినవే!. 2014, 2018 అసెంబ్లీ.. ఎన్నికల్లో జిల్లాలో ఫలితాలు నిరాశ పరిచిన నేపథ్యం, కీలక నేతలు పార్టీని వీడడం.. తదితరాలు. దీంతో రాబోయే ఎన్నికల కోసం వ్యూహం మార్చారు గులాబీ బాస్. పూర్తి స్థాయిలో ఖమ్మంపై ప్రత్యేక దృష్టి సారించారాయన. తాజాగా.. తక్కువ గ్యాప్‌లో వందల కోట్ల నిధుల్ని విడుదల చేయడం గమనార్హం. తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం నియోజకవర్గానికి భారీగా నిధుల కేటాయించింది. ఖమ్మం అభివృద్ది పేరిట ఇవాళ రూ. 100 కోట్లు మంజూరు చేశారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఇదిలా ఉంటే.. పది రోజుల క్రితమే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 690 కోట్లు ప్రభుత్వం కేటాయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వంద కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీంతో మంత్రి పువ్వాడ.. కేటీఆర్‌ను కలిసి ప్రత్యేకంగా కృతజ్క్షతలు తెలియజేశారు. మరోవైపు.. ఉమ్మడి ఖమ్మంలోని అన్ని నియోజక వర్గాల్లోని అభ్యర్థులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు బీఆర్ఎస్ అధినేత. విజయం కోసం శాయశక్తులా కృషి చేయాలని సూచిస్తూ.. మరోవైపు మెజార్టీ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. కూడికలు,తీసివేతల తర్వాత.. ఖమ్మంపై ఒక స్పష్టమైన క్లారిటీతోనే కారు గేర్ మార్చి ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వన్ అండ్ ఓన్లీ.. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఏస్ ప్రయాణంలో.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫలితాలు నిరాశజనకంగానే సాగాయి. ప్రత్యేకించి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది (జలగం వెంకట్రావు). 2018 ఎన్నికల్లో సైతం అదే తరహా ఫలితం వచ్చింది. ఈసారి కూడా ఒక్కటంటే ఒక్క సీటే దక్కింది. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ గెలిచారు. దీంతో.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మెరుగైన ఫలితం రాబట్టాలని బీఆర్ఎస్ అధిష్టానం చూస్తోంది. మార్పులు.. చేర్పులు ఉమ్మడి ఖమ్మంలోని పది నిజయోకవర్గాల్లో.. బీఆర్ఎస్ సీట్ల కేటాయింపులో సిట్టింగ్‌లలో ఒక వైరా మాత్రమే మార్చారు. వైరాలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ స్థానంలో.. మాజీ ఎమ్మేల్యే మదన్‌లాల్‌కు కేటాయించారు. మధిరలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన లింగాల కమల్ రాజ్‌కే అనూహ్యంగా మళ్లీ టికెట్ కేటాయించారు. భద్రాచలంకు సంబంధించి.. పొంగులేటి ప్రధాన అనుచరుడు, ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన తెల్లం వెంకట్రావుకు కేటాయించారు. సీరియస్‌గా వర్క్ చేయండి ఖమ్మం రాజకీయాలను అధికార పార్టీ సీరియస్‌గా తీసుకుంది. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం, తుమ్మల సైతం రేపోమాపో కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు, మిగతా నేతలతో ఏయే పార్టీలు టచ్‌లో ఉన్నాయి.. ఇలా అన్నింటిని బీఆర్ఎస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్ నుంచి బలమైన నేతలు రంగంలోకి దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి. వాళ్లకు చెక్ పెట్టే విధంగా ప్రత్యేక వ్యూహాలు అమలు చేయాలని భావిస్తున్నారు కేసీఆర్. ఉమ్మడి ఖమ్మంలో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని.. ఇటీవలే నియమించిన ఇంచార్జిలకు సీఏం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. చేజారిన.. చేజారుతున్న నేతల ఎఫెక్ట్.. పార్టీ పై పడకుండా చూసుకోవాలని, గ్రౌండ్ లెవల్లో పార్టీ కేడర్ చేజారకుండా చేయగలిగినంత ప్రయత్నాలు చేయాలని సూచించారు. ముఖ్యంగా జనరల్ స్థానాలు అయిన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ‘‘వాళ్లెవరో మనల్ని మళ్లీ అసెంబ్లీ గేటు దాటనివ్వను అని సవాల్ విసిరారు(పొంగులేటిని ఉద్దేశించి..). కాబట్టి.. వాళ్లనే మనం అసెంబ్లీకు వెళ్లకుండా అడ్డుకోవాలి. ఆ సవాల్‌ను దృష్టిలో పెట్టుకుని పని చేయండి’’ అని క్యాడర్‌ను ఆయన అప్రమత్తం చేసినట్లు పార్టీ శ్రేణులు బయటకు చెప్తున్నాయి. ఖమ్మం విషయంలో కేసీఆర్ ఈసారి తన అంచనా ఏమాత్రం తప్పకూడదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఉమ్మడి ఖమ్మంలోని నిజయోజకవర్గాల నుంచి ఎప్పటికప్పుడు నివేదికల్ని ప్రగతి భవన్‌కు తెప్పించుకుంటున్నారు. ఈ లెక్కన.. బీఆర్ఏస్ ‘టార్గెట్ ఖమ్మం’ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి! ::: పసునూరి మహేందర్, సాక్షి TV ప్రతినిధి, ఖమ్మం -
కామారెడ్డి ముఖ్యనేతలకు కేసీఆర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వెళ్లింది. కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నియోజకవర్గంపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిసారించింది. ఈ నెల 7వ తేదీన ప్రగతిభవన్‌లో కామారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చలు జరపనున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో.. ఈ చర్చల ద్వారా క్యాడర్‌ను సమాయత్తం చేయనున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే.. నియోజకవర్గ అభివృద్ధిపైనా ఆయన చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌తో సంబంధం లేకుండా కామారెడ్డిలో పర్యటించడం.. బహిరంగ సభ, ర్యాలీలు తదితర అంశాలపైనా ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ పోటీని సవాల్‌గా తీసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో బీజేపీ తరపున ఎంపీ అర్వింద్ బరిలోకి దిగొచ్చనే ప్రచారం నడుస్తోంది. కామారెడ్డి ప్రజల నినాదాలు కామారెడ్డి నియోజకవర్గంలో పలు గ్రామాలు ఇప్పటికే కేసీఆర్‌ను గెలిపించాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. సీఎం కేసీఆర్ వస్తే కామారెడ్డి అభివృద్ధి చెందుతుందని ఆ నియోజకవర్గం ప్రజలు ఆశిస్తున్నారు.హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో పెళ్లికి హాజరైన కామారెడ్డి ప్రజలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున కేసీఆర్ ముందు నినాదాలు చేశారు.'కేసీఆర్ జిందాబాద్, జై కేసీఆర్', 'సీఎం కేసీఆర్ రావాలి' 'స్వాగతం కామారెడ్డికి స్వాగతం' 'కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి' 'జై కేసీఆర్.. దేశ్‌కీ నేత కేసీఆర్' వంటి నినాదాలతో ఆ వివాహ ప్రాంగణం దద్దరిల్లింది. -
BRS Party: కారులో ‘సిట్టింగ్’ లొల్లి!..తెరపైకీ రోజుకో పంచాయితీ
సీన్ –1 హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజా.. జనగామ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల నేతలు భేటీ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా.. ఈసారి జనగామ బీఆర్ఎస్ టికెట్‌ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇవ్వాలంటూ వారు సమావేశమయ్యారు. ఈ సమాచారం తెలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేరుగా హరిత ప్లాజాకు వెళ్లడం, అక్కడి నేతలతో వాగ్వాదం వంటివి జరిగాయి. అసమ్మతి భేటీకి వచ్చినవారిలో ముఖ్య నేతలెవరూ లేరని ముత్తిరెడ్డి ప్రకటించగా.. నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు, పలువురు సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు భేటీకి వచ్చినట్టు అసమ్మతి వర్గం తెలిపింది. సీన్ –2 మంథని నియోజకవర్గంలో.. ఆ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు మీడియా సమావేశం పెట్టారు. మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వొద్దంటూ బహిరంగంగా డిమాండ్ చేశారు. ఆయన పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇతరులకు ఎవరికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. పుట్టమధుకు వ్యతిరేకంగా త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతామనీ ప్రకటించారు. ..అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అధికార బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. ఆయా ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తిగా ఉన్నవారు, టికెట్ ఆశిస్తున్న ఇతర నేతల అనుచరులు బహిరంగంగానే ఈ వ్యతిరేకతను బయటపెడుతున్నారు. ఇప్పటికే కల్వకుర్తి, దేవరకొండ, చొప్పదండి, రామగుండం, నాగార్జున సాగర్, కోదాడ.. ఇప్పుడు జనగామ, మంథని.. ఇలా చాలాచోట్ల అసమ్మతి వ్యక్తమవుతోంది. వీటిపై దృష్టిపెట్టిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు సన్నాహాలు చేస్తున్నారనే సంకేతాలు ఆ పార్టీలో ‘లొల్లి’ రేపుతున్నాయి. సిట్టింగ్ స్థానాల్లో అసమ్మతులు, ఆశావహుల ప్రయత్నాలతో నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు బలంగా తెరపైకి వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి తమకు అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు నేరుగా కోరుతుండగా.. మరికొందరు తెర వెనుక అసమ్మతిని రాజేస్తున్నారు. మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని, పైగా పోలీసు కేసులు, ఇతర రూపాల్లో వేధిస్తున్నారని నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిలో తాజా, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్మన్లు, ఇతర గ్రామ, మండల స్థాయి క్రియాశీల నేతలు ఉంటుండటం గమనార్హం. అంతర్గత భేటీలే కాకుండా మీడియా సమావేశాలు పెట్టి మరీ తమ అసమ్మతిని, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అసమ్మతి పెరిగితే నష్టమనే అంచనాతో.. పార్టీ టికెట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఏయే నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందనే నివేదికలు అందుతున్నట్టు సమాచారం. వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతలు, సిట్టింగ్‌లు సహా చాలా మందిపై క్షేత్రస్థాయి నుంచి ఆరోపణలు వస్తున్నాయని.. ఏకపక్ష ధోరణి, బంధుప్రీతి, అవినీతి, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని విషయాల్లో జోక్యం, పోలీసు, రెవెన్యూ అధికారులతో సొంత పార్టీ నేతలనే ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలు నివేదికల్లో ఉన్నాయని తెలిసింది. పార్టీ కేడర్‌ను ఎన్నికల దిశగా సన్నద్ధం చేసేందుకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలను విశ్లేషించగా.. చాలాచోట్ల విభేదాలు సమసిపోలేదని గుర్తించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ పాలన, కేసీఆర్ విధానాల పట్ల క్షేత్రస్థాయిలో ‘ఫీల్ గుడ్’ భావన ఉన్నా.. పార్టీ నేతల మధ్య కలహాలు నష్టం చేస్తాయని కేసీఆర్ ఆలోచనకు వచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీలైనంత త్వరగా టికెట్ కేటాయింపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసమ్మతి కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా చెక్‌పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తదితరులతో జరిపిన భేటీలో అసమ్మతుల కట్టడికి వ్యూహాన్ని ఖరారు చేసినట్టు తెలిసింది. ‘‘వీలైనంత త్వరగా అభ్యర్థులను నిర్ణయించాలని సీఎం కేసీఆర్‌ను కోరాం. సిట్టింగ్‌లకు ఇవ్వాలా, అవసరమైన చోట కొత్త వారికి ఇవ్వాలా అనేది పూర్తిగా ఆయనే చూసుకుంటారు. త్వరగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా పార్టీ లో ఉండేదెవరో, వీడేదెవరో అన్నదానిపై స్పష్టత వస్తుంది. తద్వారా అసమ్మతి కట్టడి, ఇతర పార్టీల నుంచి చేరికలు, ప్రచారం తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం కలుగుతుందని కేసీఆర్‌కు వివరించాం’’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కేటీఆర్, హరీశ్ సహా కీలక నేతలకు బాధ్యతలు అసమ్మతులు, అసంతృప్తుల సమస్యను చక్కదిద్దే పనిని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ కవిత వంటి కీలక నేతలకు కేసీఆర్ అప్పగించినట్టు తెలిసింది. వేములవాడలో కేటీఆర్, హుస్నాబాద్, మెదక్, జహీరాబాద్‌లో హరీశ్‌రావు, రామగుండంలో కొప్పుల ఈశ్వర్, చొప్పదండిలో గంగుల కమలాకర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్, బోధన్, జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత, మానకొండూరులో మాజీ ఎంపీ వినోద్ ఇప్పటికే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వరుసగా.. అసంతృప్తి సెగలు! ► కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు టికెట్ కేటాయించవద్దంటూ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, జెడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్ తదితరులు ఇటీవల సమావేశమై పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ► దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు టికెట్ ఇవ్వద్దంటూ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్, మరో 70 మంది ముఖ్య కార్యకర్తలు డిండి మండలం రుద్రాయిగూడంలో సమావేశమై తీర్మానించారు. ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేశారు. ► చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా తప్పించాలంటూ స్థానిక నేతలు కొందరు సీఎంకు ఫిర్యాదు చేశారు. ► రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా అసంతృప్తి నేతలు ఏకమయ్యారు. కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి సర్దుబాటు చేసుకోవాలని నచ్చచెప్పినా.. అక్కడ అసమ్మతి నేతలు, ఎమ్మెల్యే మధ్య పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ► నాగార్జునసాగర్, కోదాడ, మహబూబాబాద్, మహేశ్వరం, తాండూరు, ఉప్పల్, పెద్దపల్లి, ఇల్లందు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోకూడా పార్టీ ఎమ్మెల్యేలపై పార్టీ నేతలే బహిరంగంగా వ్యతిరేకత చూపుతున్నారు. ► కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్‌పై పలు ఆరోపణలు వస్తుండటంతో ఆయనను మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అక్కడ మరో బీసీకి అవకాశం ఇస్తారని, జూలూరి గౌరీ శంకర్ పేరు తెరపైకి వస్తోందని ప్రచారం జరుగుతోంది. ► రాష్ట్రవ్యాప్తంగా మరో 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసమ్మతి వ్యక్తమవుతోంది. ‘పుట్ట మధుకు టికెట్ ఇవ్వొద్దు’ ముత్తారం (మంథని): మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకు ఈసారి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రామగిరి ఎంపీపీ అరెల్లి దేవక్క, మాజీ జెడ్పీటీసీలు నాగినేని జగన్మోహన్రావు, మైదం భారతి, దుర్గం మల్లయ్య, బండం వసంతరెడ్డి, పలువురు సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను పుట్ట మధు పట్టించుకోవడం లేదని, నియంత పోకడలతో అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత ఎజెండాను మంథనిలో అమలుపరుస్తూ.. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెడుతున్నారని మండిపడ్డారు. మంథని టికెట్ పుట్ట మధుకు ఇవ్వవద్దని, ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. పుట్ట మధుకు వ్యతిరేకంగా త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తామన్నారు. జనగామ ‘టికెట్’ రాజకీయం! హైదరాబాద్ హరిత ప్లాజాలో ‘పల్లా’ క్యాంపు అసమ్మతి నేతలు జనగామ: జనగామ నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ లొల్లి హైదరాబాద్‌కు చేరింది. బుధవారం ఇక్కడి బేగంపేటలోని హరిత ప్లాజాలో అసమ్మతి నేతల సమావేశం హాట్‌టాపిక్‌గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపుమేరకు.. జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి నేతృత్వంలో ఈ భేటీ జరిగిందని, పల్లాకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌తో సీఎంను కలవాలని వారు నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. వారికి సీఎం అపాయింట్మెంట్ కూడా దొరికిందని, ఆయన నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తూ హరిత ప్లాజాలో వేచి ఉన్నారని తెలిసింది. అయితే.. ఈ సమావేశం విషయం తెలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేరుగా అక్కడికి వెళ్లారు. అకస్మాత్తుగా సమావేశ గది తలుపులు తీసుకునిలోనికి వెళ్లిన ఆయనను చూసి.. అసమ్మతి నేతలు కొంత ఉలికిపాటుకు గురయ్యారు. ఇక్కడికి ఎందుకు వచ్చారని నేతలను ఎమ్మెల్యే అడగడంతో.. మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు వచ్చామని, రాజకీయమేదీ లేదని చెప్పుకొచ్చారు. దీంతో ముత్తిరెడ్డి స్పందిస్తూ.. ప్రగతిభవన్‌కు తీసుకెళ్తానని, తనతో రావాలని వారితో చెప్పగా, తాము విడిగానే కలుస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సమయంలో సదరు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ‘పల్లా’కు అనుకూలంగా.. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అవకాశం కల్పించాలని నియోజకవర్గంలోని కొందరు ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఇందులో భాగంగా నర్మెట పీఏసీఎస్ చైర్మన్ పెద్ది రాజరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునలింగయ్య, నాగిళ్ల తిరుపతిరెడ్డి, చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ భర్త అంకుగాని శశిధర్‌రెడ్డి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ పగిడిపాట సుగుణాకర్‌రాజు, జనగామ పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్‌రెడ్డి, కొందరు సర్పంచ్‌లు, నాయకులు హరిత ప్లాజా భేటీకి వెళ్లినట్టు తెలిసింది. కాగా.. హోటల్లో గొడవ జరుగుతోందని తెలిసి వెళ్లానే తప్ప, తానే నాయకులను తీసుకువచ్చినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని జనగామ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి పేర్కొన్నారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామన్నారు. ఇలా చేయడం బాధాకరం: ముత్తిరెడ్డి జనగామ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు హరిత ప్లాజాకు వచ్చారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. అక్కడ ముఖ్య కార్యకర్తలు ఎవరూ లేరని, అన్ని మండలాల అధ్యక్షులు తన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. అయినా అధిష్టానం ఇటువంటి చర్యలను క్షమించబోదన్నారు. గతంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి తనకు స్వయంగా ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించబోనని చెప్పారని.. ఇప్పుడిలా చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావుతో ‘పల్లా’ వర్గం భేటీ! హరిత ప్లాజాలో భేటీ అయిన ‘పల్లా’ వర్గీయులు సాయంత్రం ప్రగతిభవన్‌లో మంత్రి హరీశ్‌రావును కలసి పరిస్థితిని వివరించారు. దీనిపై హరీశ్‌రావు స్పందిస్తూ.. జనగామ టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారని, మరో మూడు రోజుల్లో తేల్చేస్తామని చెప్పినట్టు సమాచారం. ముత్తిరెడ్డితో నెల రోజులక్రితమే మాట్లాడి.. ఆయన కుమార్తెతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పామని, అయినా సరిదిద్దుకోక ఆయన సీటుకు ఎసరొచ్చే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. -
మరోసారి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్
-
లైన్ ఎవరు దాటినా ఊకునేది లేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలో సీనియర్ నేతల నడుమ జరుగుతున్న మాటల యుద్ధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. మంగళవారం మధ్యాహ్నాం ప్రగతి భవన్లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కేటీఆర్ సమావేశమై ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించారు. గత కొంతకాలంగా రాజయ్య వర్సెస్ కడియం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయపరంగానే కాదు.. వ్యక్తిగత విమర్శలకు సైతం ఇద్దరూ వెనుకాడడం లేదు. ఈ తరుణంలో పార్టీ పరువును బజారుకీడ్చడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఇవాళ్టి భేటీలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో.. రాజయ్యను మందలించిన ఆయన.. ఇంకోసారి అలాంటి పని చేయొద్దని వారించినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడకూదని, ఎవరూ ఆ పని చేసినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ‘‘ఇద్దరి వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. ఇంతటితో ఈ వివాదం ముగించాలని, ఎన్నికల సమయం దగ్గరపడుతోంది కాబట్టి ఇద్దరూ కలిసి పని చేసుకోవాలని.. లేకుంటే తీవ పరిణామాలు ఉంటాయ’’ని కేటీఆర్ రాజయ్యను హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు ఆయన కడియంతోనూ భేటీ కావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడియం-రాజయ్య వైరం ఈనాటిది కాదు! మాజీ ఉపముఖ్యమంత్రులైన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు.. మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులు. దీంతో స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆధిపత్య పోరు సహజంగానే కొనసాగుతూ వస్తోంది. 2019 సెప్టెంబర్‌లో వేర్వేరుగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన యాత్ర రెండు వర్గాల మధ్య విభేదాలకు ఆజ్యం పోయగా.. ఆ తర్వాత పరిణామాలు కూడా మరింత దూరం పెంచాయి. ఎవరికీ వారుగా నియోజకవర్గంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఫ్లెక్సీలు, ప్రొటోకాల్ వివాదం.. అంటూ ఇరువర్గాల మధ్యన తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 20 రోజుల వరకు కూడా పరోక్షంగా ఆరోపణలు చేసుకున్న ఇద్దరు నేతలు.. ఈ మధ్య కాస్త దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్వరం మరింత పెంచుకోవడంతో.. అధిష్టానం ఈ విమర్శలను తీవ్రంగా పరిగణించింది. ఇదీ చదవండి: నేను నోరు విప్పితే రాజయ్య కుటుంబం సూసైడ్ చేస్కోవాలి-కడియం -
ప్రగతి భవన్‌కు కేఏ పాల్: ‘అఖిలేష్ కంటే నేనే గొప్ప లీడర్ని’
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రగతి భవన్‌కు వెళ్లారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్న సమయంలో కేఏ పాల్ అక్కడకు వచ్చారు. కాగా కేఏ పాల్‌ను పోలీసులు అడ్డుకుని లోపలికి అనుమతించలేదు.దాంతో పోలీసుల తీరును కేఏ పాల్ తప్పుబట్టారు. ఈ క్రమంలోనే పోలీసులతో వాగ్వాదానికి దిగారు కేఏ పాల్ తనను ప్రగతి భవన్ లోపలికి అనుమతించకపోవడాన్ని తీవ్రంగా తప్పు బట్టారు. సీఎం కేసీఆర్ లోపల ఉండగా, తనకు లోనికి ఎందుకు అనుమతి ఇవ్వరని పోలీసుల్ని ప్రశ్నించారు కేఏ పాల్. అఖిలేష్ యాదవ్ కంటే తానే గొప్ప లీడర్‌ను అని, తనకు అపాయింట్ ఇవ్వాలంటూ తనదైన శైలిలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లాంటి వాళ్లకు అపాయింటమెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ తనకు ఎందుకు అపాయింట్‌మెంట ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ని కలిసి రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై చర్చించాలని అనుకున్నానని, కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని కేఏ పాల్ గుస్సా అయ్యారు. చదవండి: బీహార్ జేడీయూలో ముసలం?.. నితీశ్ తిరిగి ఎన్డీయేలోకి.. తప్పదా?! -
ప్రత్యేక బస్సు.. 600 కార్లు
సాక్షి, హైదరాబాద్: రెండురోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్ర బయలుదేరి వెళ్లిన భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం షోలాపూర్‌కు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. కేసీఆర్ సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి ప్రత్యేక బస్సులో మహారాష్ట్రకు బయలుదేరారు. కేసీఆర్ చేతికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి వీడ్కోలు పలికారు. 600 కార్లతో కూడిన భారీ వాహన శ్రేణి ఆయన వాహనాన్ని అనుసరించింది. 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను దాటి ముఖ్యమంత్రి మహారాష్ట్రలో అడుగు పెట్టారు. మొత్తం 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. కాగా మహారాష్ట్రకు వెళ్లే మార్గమంతా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు వెలిశాయి. ప్రజలు, పార్టీ శ్రేణులు పూలు, గులాబీ కాగితాలు వెదజల్లుతూ పార్టీ జెండాలతో స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట సుమారు 6 కిలోమీటర్ల పొడవున వాహన శ్రేణి బారులు తీరింది. ఒమర్గాలో మధ్యాహ్న భోజనం కేసీఆర్ వాహన శ్రేణి తెలంగాణలోని పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ మీదుగా ప్రయాణించి కర్ణాటకలో అడుగు పెట్టింది. ముర్కుంద, మన్నెకెల్లి, తలమడిగి, హుమ్నాబాద్, బసవకళ్యాణ్ మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్రలోని దారాశివ్ (ఉస్మానాబాద్) జిల్లా ఒమర్గాకు కేసీఆర్ చేరుకున్నారు. స్థానిక మహిళలు సాంప్రదాయ పద్ధతిలో హారతి ఇచ్చి స్వాగతం పలికారు. తన వెంట వచ్చిన నేతలతో కలిసి ఒమర్గాలో సీఎం మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం షోలాపూర్ చేరుకున్న కేసీఆర్‌కు స్థానిక తెలుగు ప్రజలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలకగా, మహిళలు హారతులు ఇచ్చారు. భారీగా డప్పు చప్పుళ్లు, స్థానిక కళారూపాల ప్రదర్శన నడుమ తాను బస చేసే బాలాజీ సరోవర్ హోటల్‌కు కేసీఆర్ చేరుకున్నారు. మాజీ ఎంపీ సాదుల్ ధర్మన్న ఇంటికి కేసీఆర్ షోలాపూర్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత ధర్మన్న ముండయ్య సాదుల్ ఆహా్వనం మేరకు పార్టీ ముఖ్య నేతలతో కలిసి షోలాపూర్ భావనారుషి పేట్‌లోని ఆయన నివాసానికి కేసీఆర్ తేనీటి విందుకు వెళ్లారు. తిరిగి హోటల్‌కు వెళ్తున్న సమయంలో మీడియా ప్రశ్నించడంతో.. తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ సాధించిన తర్వాత పండరీపూర్ విఠలేశ్వరుని మంత్రివర్గ సహచరులు, ప్రజా ప్రతినిధులతో కలిసి దర్శించుకుంటానని మొక్కుకున్నానని చెప్పారు. ఇప్పుడు దైవ దర్శనం కోసమే వచ్చానని, రాజకీయాలు మాట్లాడనని అన్నారు. నలుగురు మినహా కేబినెట్ మొత్తం.. సీఎం కేసీఆర్ వెంట నలుగురు మంత్రులు మినహా రాష్ట్ర కేబినెట్ మొత్తం తరలి వెళ్లింది. మంత్రులు కేటీ రామారావు, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, మహమూద్ అలీ మినహా మిగతా మంత్రులంతా ఆయన వెంట ఉన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె.కేశవ రావు, ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, బీబీ పాటిల్, సంతో‹Ùతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వెళ్లారు. మొత్తంగా వందలాది మంది నేతలు షోలాపూర్‌కు వెళ్లడంతో స్థానిక హోటళ్లు, లాడ్జీలు కిక్కిరిసిపోయాయి. బసకు ఇబ్బందులు ఎదుర్కొన్న కొందరు స్థానికంగా స్థిరపడిన తెలంగాణవాసుల ఇళ్లలో ఆశ్రయం పొందారు. నేడు పండరీపూర్, తుల్జాపూర్లో ప్రత్యేక పూజలు కేసీఆర్ మంగళవారం ఉదయం పండరీపూర్‌లోని శ్రీ విఠల్ రుక్మిణి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి సమీపంలోని సర్కోలి పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే సభకు హాజరవుతారు. సర్కోలి సభ వేదికగా స్థానిక ఎన్సీపీ నేత భగీరథ్ భల్కే బీఆర్ఎస్లో చేరుతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం తుల్జాపూర్‌కు చేరుకుని భవానీ మాత ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం సమీపంలోని ఉస్మానాబాద్ (దారాశివ్) విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. -
మహారాష్ట్రలో అడుగుపెట్టిన సీఎం కేసీఆర్..సోలాపూర్‌లో రాత్రి బస
Updates. ►ముఖ్యమంత్రి మహారాష్ట్రలో అడుగుపెట్టారు. సోమవారం సాయంత్రం సోలాపూర్‌కు చేరుకున్నారు. కాగా రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన కోసం ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్ల కాన్వాయ్‌తో బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ రాత్రి సోలాపూర్‌లోనే రాత్రి బస చేయనున్నారు. ►మంగళవారం ఉదయం స్థానికంగా అధిక సంఖ్యలో ఉండే తెలుగు ప్రజలతో పాటు వివిధ రంగాలు, వర్గాలకు చెందిన ప్రతినిధులతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం పండరీపూర్ పట్టణానికి చేరుకుని శ్రీ విఠల రుక్మిణీ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత స్థానికంగా జరిగే బీఆర్ఎస్ సభలో ఎన్సీపీ దివంగత ఎమ్మెల్యే భరత్ భాల్కే కుమారుడు భగీరథ్ భాలే్క.. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతారు. మధ్యాహ్నానికి తుల్జాపూర్ చేరుకుని భవానీమాత మందిరంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడికి సమీపంలోని ఉస్మానాబాద్ (దారాశివ్) ఎయిర్‌పోర్టుకు చేరుకుని, ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్‌కు వస్తారు. ►సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ జాతీయ రహదారి 65 నుండి బై పాస్ రోడ్డు మీదుగా భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు ముఖ్యమంత్రి కేసీఆర్ తరలివెళ్లారు. ► జహీరాబాద్ జాతీయ రహదారి 65 వెంట భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు తరలిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జ తీయ రహదారిపై కొహీర్ క్రాస్ రోడ్డు వద్ద, హుగ్గేలీ వై జంక్షన్, అల్గోల్ క్రాస్ రోడ్డు, చిరాగ్ పల్లి బార్డర్ చెక్ పోస్ట్ వద్ద బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వీరికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సు నుంచి చేతులు ఊపి అభివాదం చేశారు. నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నేతలు భారీ కాన్వాయ్ తో తరలివెళ్లారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ వస్తుండడంతో బై పాస్ రోడ్డు పై ట్రాఫిక్ ను పోలీసు అధికారులు నిలిపివేశారు. ముఖ్యమంత్రి తరలిన అనంతరం ట్రాఫిక్‌ను వెళ్ళనిచ్చారు. ► జహీరాబాద్ దాటి కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించిన సీఎం కాన్వాయ్ ► సంగారెడ్డి జిల్లా దాటిన సీఎం కాన్వాయ్ ► సీఎం పర్యటన సందర్భంగా గులబీమయమైన హైదరాబాద్- ముంబై జాతీయ రహదారి ► కార్యకర్తలకు అభివాదం తెలుపుకుంటు వెళ్లిన సీఎం సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మంత్రులు, నేతలు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. - ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మంత్రులతో కలిసి ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు. - రోడ్డు మార్గంలో కేసీఆర్ మహారాష్ట్రకు బయలుదేరారు. - దాదాపు 600 కార్లతో ప్రగతి భవన్ నుంచి భారీ కాన్వాయ్ బయలుదేరింది. - సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలోనే ఉంటారు. ఈ సందర్బంగా పండరీపూర్‌లో విఠలేశ్వరస్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. - సోమవారం రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో బయలుదేరి.. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. -
భారత్ పరివర్తనతోనే కష్టాల నుంచి విముక్తి
సాక్షి, హైదరాబాద్: పరివర్తన చెందిన భారతదేశంతో మాత్రమే రైతులు, దళిత, బహుజన ఆదివాసీలు సహా సకల జనుల కష్టాలు తొలగిపోతాయని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సాంప్రదాయ పార్టీలు తమ చిత్తశుద్ధి లేని కార్యాచరణతో, మూస పద్ధతితో కూడిన పాలనారీతులు కొనసాగించినంత కాలం దేశాభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు బుధవారం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వనరులను ఉపయోగించుకోవాలనే తపన ఉండాలి.. ‘దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి రాకెట్ సైన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలనే తపన, మనసు పాలకులకు ఉండాలి. ప్రజల కోసం సృజనాత్మకంగా పనిచేసే ఆలోచనా విధానాలు ఏడు దశాబ్దాలుగా పాలకులకు లేకపోవడం ఈ దేశ ప్రజల దురదృష్టం. భూగోళం మీద ఏ దేశానికి లేనన్ని సహజ వనరులు భారత్ సొంతం. అయినప్పటికీ, ఇన్ని దశాబ్దాలైనా.. రైతులు, బడుగు బలహీన వర్గాలు కనీస అవసరాలైన నీరు విద్యుత్ కోసం తపిస్తున్నారు. ప్రభుత్వాలు రైతు కేంద్రంగా, దళిత ఆదివాసీ బలహీన వర్గాలు కేంద్రంగా పాలనా ప్రాధమ్యాలను ఖరారు చేసుకోవాలి. మేం అలా చేసుకోగలిగాం కాబట్టే నేడు తెలంగాణ దేశానికే రోల్ మోడలయ్యింది..’అని సీఎం తెలిపారు. మనసుంటే మార్గం ఉంటుందని తెలంగాణ నిరూపించింది.. ‘ఈ దేశంలోని పెద్ద పెద్ద రాష్ట్రాల కంటే అతి పిన్నవయసున్న తెలంగాణ అత్యంత తక్కువ కాలంలో ఎట్లా ఓ రోల్ మోడల్ కాగలిగింది? నేడు అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మోడల్‌నే కోరుకోవడానికి కారణమేంటి?’అనే విషయాలను కేసీఆర్ వివరించారు. ‘తెలంగాణను అభివృద్ధి చేసుకున్న పద్ధతిలో ఈ దేశంలో పాలన సాగటం లేదు. దేశంలో పరివర్తన తీసుకువచ్చే ఆలోచన కేంద్రంలోని పాలకులకు లేదు. ప్రజా సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలనే మనసు లేనే లేదు..’ అని విమర్శించారు. మనసుంటే తప్పకుండా మార్గం ఉంటుందనే విషయాన్ని తొమ్మిదేళ్ల తెలంగాణ నిరూపించిందని అన్నారు. అభివృద్ధి దిశగా భారతదేశంలో సమూల మార్పును తీసుకువచ్చేందుకు పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, అందుకు ముందడుగు మహారాష్ట్ర నుంచి పడుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా రైతులు, మహిళలు, యువత చైతన్యమై కలసికట్టుగా నిలబడి పార్టీలను కాకుండా ప్రజా ఆంకాంక్షలను గెలిపించుకునేందుకు కృషి కొనసాగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో.. ఎన్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనశ్యామ్ షెలార్‌తో పాటు ఆ పార్టీ ఓబీసీ సెల్ అహ్మద్‌నగర్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ ఆనంద్కర్, దర్శకుడు ప్రకాష్ నింభోర్, కుక్డి చక్కెర కర్మాగారం సభ్యుడు అబాసాహెబ్ షిండే, మాజీ చైర్మన్ విలాస్ భైలుమే, సర్పంచ్‌లు కేశవ్ జెండే, షాహాజీ ఇతాపే, శరద్‌పవార్‌తో పాటు చంద్రకాంత్ పవార్, ప్రకాష్ పోతే, ప్రశాంత్ షెలార్, సిద్ధేష్ ఆనంద్కర్, ప్రవీణ్ షెలార్, సంజయ్ వాగాస్కర్, వహతుక్ సేన అధ్యక్షుడు సందీప్ దహతోండే, సేవాదళ్‌కు చెందిన షామ్ జారే తదితరులు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతలు ఖదీర్ మౌలానా, హిమాన్షు తివారీ తదితరులు పాల్గొన్నారు. -
తాతలు, తండ్రుల పేర్లతో రాజకీయాలు చెల్లవు!
సాక్షి, హైదరాబాద్: ‘‘పార్టీ వ్యవస్థాపకులు, సిద్ధాంతకర్తలు, తాతల, తండ్రుల పేర్లు చెప్పుకొని ఇంకా రాజకీయాలు చేసే పరిస్థితులు చెల్లవు. ఇప్పుడు దేశ ప్రజలకు పేర్లతో పనిలేదు.. పని చేయగలిగిన వాళ్లతోనే పని (నామ్ దారీ నహీ కామ్ దారీ హోనా చాహియే)’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కేంద్రంలో పాలన నిర్లక్ష్యంగా, దశ దిశ లేకుండా కొనసాగుతోందని విమర్శించారు. ఈ తీరు దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో మధ్యప్రదేశ్ బీఆర్ఎస్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సహా 200 మంది నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చాంద్వాడా జిల్లా జున్నార్‌దేవ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామ్‌దాస్ యికే, సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభారామ్ బాలావి, భువన్ సింగ్ కోరం, లక్ష్మణ్ మస్కోలే తదితరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మార్పు తీసుకొచ్చే బాధ్యత ప్రజలదే.. దేశంలో ప్రకృతి ప్రసాదించిన నీరు, వ్యవసాయ యోగ్యమైన భూమి, విద్యుత్‌కు అవసరమైన బొగ్గు నిల్వలు, వ్యవసాయానికి అవసరమైన సమతల శీతోష్టస్థితి, సూర్యరశ్మి వంటి ప్రకృతి వనరులన్నీ అందుబాటులో ఉన్నాయని.. అయినా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి ఉండటం దారుణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలోని పాలకులకు లక్ష్యశుద్ధి లోపించడమే దీనికి కారణమన్నారు. దళితులు, బహుజనులు సహా అన్ని వర్గాల వారు ఇంకా అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితి పోవాలంటే కేంద్రంలో పార్టీలను మార్చడం కాకుండా.. తమ ఆకాంక్షలను గెలిపించుకునే దిశగా ప్రజలు చైతన్యం కావాలన్నారు. ‘‘ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపిస్తే.. పార్టీలు, వాటి నాయకుల పేర్లే మారుతాయి. ప్రజలకు ఒరిగేదేమీ లేదు. పని విధానంలో మార్పు తీసుకువచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కాదు.. మిషన్.. బీఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, దేశాన్ని మార్చడానికి ఏర్పాటు చేసిన మిషన్ అని కేసీఆర్ చెప్పారు. మన కోసం పనిచేసుకునే వారికి ఓటు వేస్తేనే మన ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మధ్యప్రదేశ్ ఎందుకు అమలు కావని ప్రశ్నించారు. ఆదివాసీలు, దళితులు, బహుజనులు పీడితులుగానే కొనసాగే దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. ఆ వర్గాల వారు ఉత్తర భారతంలో కనీస జీవన ప్రమాణాలకు నోచుకోకుండా వివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం విఫలమైంది! తప్పుడు వాగ్దానాలతో, విద్వేషాలు రెచ్చగొడుతూ ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కొనసాగుతున్న దుర్మార్గాలను నిలువరించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని కేసీఆర్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మధ్యప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల్లో వాహనాలను ఏర్పాటు చేసుకుని పార్టీ భావజాలాన్ని, ప్రచారాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్లాలని కొత్తగా చేరిన నేతలకు సూచించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. మధ్యప్రదేశ్‌లోని ప్రతి గ్రామంలో పార్టీ తరఫున రైతు, దళిత, మహిళ, యువ, బీసీ వంటి 9 కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శంకరన్న దోంగ్డే, మాణిక్ కదమ్, హిమాన్షు తివారీ, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మెట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: దేశంలో కేంద్రం, అరాచకాలు, ఆగడాలు మితిమీరాయని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీతో గెలిచిందని.. అయినా మేయర్ పదవిపై బీజేపీ హంగామా చేసిందని మండిపడ్డారు. చివరికి సుపప్రీంకోర్టుకు వెళ్లి మేయర్ ఎన్నిక నిర్వహించాల్సి వచ్చిందన్నారు. సామాజిక ఉద్యమం ద్వారా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మూడుసార్లు అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. అధికారుల బదిలీలన్నీ ఢిల్లీ ప్రభుత్వ హయాంలోనే జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ కేంద్ర ఆర్డినెన్స్ తెచ్చిందని, సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా కేంద్రం గౌరవించడం లేదని మండిపడ్డారు. లెఫ్టెనెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోందని, ఇది దేశమంతా చూస్తోందని తెలిపారు. సంబంధిత వార్త: హైదరాబాద్: కేసీఆర్‌తో కేజ్రీవాల్, భగవంత్ మాన్ భేటీ కేజ్రీవాల్‌కు పూర్తి మద్దతు లెఫ్టెనెంట్ గవర్నర్‌ను తీసుకొచ్చి ఎన్నికైన ప్రభుత్వపై కూర్చోబెట్టారు. ఢిల్లీ పాలనాధికారాలపై ఆర్డినెన్స్‌ను కేంద్రం వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో ప్రజలు మోదీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతారు. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. ఢిల్లీ పాలనాధికారాలపై ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో వ్యతిరేకిస్తాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను కాలరాసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సుప్రీంకోర్టును తీర్పును కూడా లెక్కచేయరా? ఆర్డినెన్స్‌ను ప్రధాని వెనక్కి తీసుకోవాలి. దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు. బడ్జెట్‌ను పాస్‌కానివ్వనని గవర్నర్ అంటే ఎలా? అసలీ గవర్నర్ల వ్యవస్థ ఏంది?. కర్ణాటక ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారు. కేజ్రీవాల్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్ర ఆర్డినెన్స్ ప్రజాస్వామ్య విఘాతం: కేజ్రీవాల్ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ సరికాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ ప్రజల కోసమే కాదు దేశ ప్రజల కోసం తమ పోరాటమని తెలిపారు. ఢిల్లీలో వరుసగా రెండుసార్లు తామే గెలిచాం. ప్రజల మద్దతుతో గెలిచిన ప్రభుత్వం అంటే గౌరవం లేదా అని ప్రశ్నించారు. అధికారుల బదిలీలన్నీ ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరగాలని సుప్రీం చెప్పిందని పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రజాస్వామ్య విఘాతమని, షీలాదీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు అన్ని అధికారులు ఆమె చేతిలోనే ఉన్నాయని గుర్తు చేశారు. సీఎంగా కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా. ‘కేంద్రం తీరు వల్ల ఢిల్లీ సీఎంగా నేను కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా. కొన్ని శాఖల కార్యదర్శలను సైతం బదిలీ చేసే పరిస్థితి లేదు. కేంద్రం తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. గవర్నర్లతో రాజకీయం చేస్తున్నారు. ఆ ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలకు అవమానకరం. 8 ఏళ్లు పోరాటం చేశాం. సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా కోర్టు ఆదేశాలను పక్కనబెడుతూ మోదీ సర్కార్ ఆర్డినెన్స్ తెచ్చింది. కేసీఆర్ మద్దతుతో అండ పెరిగింది. మోదీ వచ్చాక ఆ అధికారాలన్నీ పోయాయి. 2015 లో మేం అధికారంలోకి వచ్చాక మా నుంచి అధికారాన్ని లాక్కున్నారు. గవర్నర్ల వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తుంది. బీజేపీ తీరుతో దేశం ప్రమాదకర స్థితిలో ఉంది. సీఎం కేసీఆర్ మద్దతుతో మాకు అండ పెరిగింది మాకు మద్ధతు ప్రకటించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఢిల్లీ ప్రజలకు న్యాయం జరగాలి’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. చదవండి: ప్రజాస్వామ్య సౌధం.. చారిత్రక ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షి.. ఎన్నింటినో తట్టుకుని.. -
Hyderabad: కేసీఆర్‌తో కేజ్రీవాల్, భగవంత్ మాన్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ కానున్నారు. కేజ్రీవాల్‌తో పాటు కూడా వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం ఈ భేటీలో పాల్గొంటారు. ప్రగతి భవన్ చేరుకున్న ఈ ఇద్దరికీ కేసీఆర్ ఆత్మీయ స్వాగతం పలికారు. లంచ్ తర్వాత వీళ్ల భేటీ జరగనున్నట్లు సమాచారం. అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రంతో ఢీ కొట్టడానికి కేజ్రీవాల్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. పలువురు ముఖ్యమంత్రులను కలిశారు కూడా. తాజాగా కేసీఆర్‌తోనూ కేజ్రీవాల్ ఇదే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఓవైపు నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరు అయ్యి మరీ ఈ ముగ్గురు సీఎంలు భేటీ అవుతుండడం గమనార్హం. సమావేశం అనంతరం ముగ్గురు సీఎంలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. చదవండి: త్వరలో సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య.. వందేభారత్ -
కోట్లుపెట్టి కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ఎందుకు?: కిషన్ రెడ్డి
సాక్షి, వికారాబాద్: కేసీఆర్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం భూ ఆక్రమణలకు పాల్పడుతోందన్నారు కిషన్ రెడ్డి. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, కిషన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు. ధరణితో లక్షలాది మంది రైతులు, భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోర్టల్ కారణంగా చట్టబద్ధమైన లక్షల ఎకరాల భూమి ప్రొబేటరీ ల్యాండ్‌గా ప్రకటించడం వల్ల చాలా మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పోర్టల్ ను అడ్డుపెట్టుకుని మధ్యవర్తులు, దళారీలను బీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయం లేక దళారీల ఉచ్చులో పడి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. హైకోర్టును ఆశ్రయించడం తప్ప ఎవరిని కలిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందనేది తెలియడంలేదు గతంలో గతంలో కొన్ని భూ సంబంధిత సమస్యలు ఉంటే ధరణి పోర్టల్ వల్ల ఇవి భారీగా పెరిగిపోయాయి. పాస్ పుస్తకంలో తప్పులను సరిదిద్దేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ధరణిలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా అది ప్రగతిభవన్ నుంచే చేపట్టాలి. సాక్షాత్తు ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడుతోంది. ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యేవి.. కానీ నేడు ప్రగతిభవన్ వరకు అది వచ్చిందంటే ప్రభుత్వం ఎంత ఆక్రమణలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం వాస్తవం కాదా?. కొందరు ప్రజాప్రతినిధులు, రియల్ వ్యాపారులు కుమ్మక్కై ప్రజల నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములకు విక్రయాలు చేపడుతున్నారు. ధరణిలో తప్పొప్పుల సవరణ కూడా జరగకపోవడంతో ప్రభుత్వ పథకాలు, ఇతర స్కీమ్ లు సామాన్యులకు చేరడం లేదు. వాటిని బీఆర్ఎస్ నేతలు గద్దల్లా తన్నుకుపోతున్నారు బ్రోకర్లను పెంచి పోషిస్తున్నట్లుగా ధరణి పోర్టల్ ఉందని న్యాయస్థానాలు కూడా చెప్పాయి. రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని అందించిన దరఖాస్తులు ఏమయ్యాయి? ధరణి బాగానే ఉంటే కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేసినట్లు కేసీఆర్. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఏముంది? బయటపెట్టాలి. ధరణిలో భూ సమస్యలపై ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పరిష్కరించారో బయటపెట్టండి. ప్రగతిభవన్‌లో అవినీతి, అక్రమాలకు ఆలోచన చేసే వ్యక్తులు ఇచ్చే సలహాలను అమలుచేస్తున్నారు తప్ప.. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను అమలుచేయడం లేదు. ఒవైసీ గతంలోనే చెప్పాడు.. కారు స్టీరింగ్ నా చేతిలోనే ఉందని. తాను బ్రేకులు వేస్తేనే ఆగుతుంది.. తాను యాక్సిలరేటర్ ఇస్తేనే ముందుకు పోతుందని చెప్పాడు. రాజాసింగ్ సెక్రటేరియట్‌కు వెళ్తే ఎందుకు అడ్డుకున్నారు?. ఒక ఎమ్మెల్యేను అడ్డుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది?. జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు కూడా సెక్రటేరియట్‌కు వెళ్లేందుకు అనుమతిలేదు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి వారినే లోనికి పంపించడం లేదు. పాతబస్తీలోకి ఓ పోలీస్, ఓ ప్రభుత్వ అధికారి కానీ ధైర్యంగా వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం ఎంతసేపు ఫోన్లు ట్యాప్ చేయడం, ధర్నాలు చేసేవారిని అడ్డుకోవడం వంటి పనులు మాత్రమే చేస్తోంది. తెలంగాణ పోలీసుల చాలా ధైర్యవంతులు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి. కానీ, తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. హైదరాబాద్‌లో రూ.కోట్లతో కట్టిన కమాండ్ కంట్రోల్ రూం ఏం చేస్తోంది. పోలీసులకు ప్రభుత్వం స్వేచ్చ ఇవ్వాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్‌షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు -
చాంబర్లోకి తొలుత సీఎం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30న జరిగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ భవన సముదాయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం సచివాలయం ప్రారంభం కాగానే ముందుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన చాంబర్లో ఆసీనులు కానున్నారు. ఆ తర్వాత మంత్రులు, కార్యదర్శులు సీఎంవో, సచివాలయ సిబ్బంది వారి చాంబర్లలోకి వెళ్లి కూర్చోనున్నారు. సచివాలయ ప్రారంబోత్సవం సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఉదయం శాస్త్రోక్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం జరగనుంది. సంబంధిత సమయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. సచివాలయ ప్రారంబోత్సవ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు మేయర్లు తదితరులు కలిపి దాదాపు 2,500 మంది హాజరవుతారని అంచనా. నాలుగు ద్వారాలు నూతన సచివాలయంలో రక్షణ సహా పలు రకాల పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సచివాలయం నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలున్నాయి. తూర్పు ద్వారాన్ని (మెయిన్ గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహా్వనితులు, దేశ, విదేశీ అతిథులు, ప్రముఖుల కోసం మాత్రమే వినియోగించనున్నారు. వాయవ్య (నార్త్–వెస్ట్) ద్వారాన్ని అవసరం వచ్చినప్పుడే తెరవనున్నారు. ఈశాన్య (నార్త్–ఈస్ట్) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది కార్యదర్శులు, అధికారుల రాకపోకలు సాగించనున్నారు. అదే వైపు పార్కింగ్ కూడా ఉండనుంది. ఆగ్నేయ (సౌత్–ఈస్ట్) ద్వారాన్ని కేవలం సందర్శకుల కోసమే తెరవనున్నారు. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉండనుంది. వికలాంగులు, వృద్ధుల కోసం విద్యుత్‌తో నడిచే బగ్గీల ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు వాహనాలకు సచివాలయంలోకి అనుమతి లేదు. సచివాలయ రక్షణకు సంబంధించి డీజీపీ విధివిధానాలు రూపొందించి పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో సీఎం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు... ♦ ఖాళీ జాగలున్న వారికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం అమలుకు సత్వరమే విధివిధానాలను రూపొందించాలి. ♦ పోడు భూముల పట్టాల పంపిణీని త్వరలో ప్రారంభించాలి. ♦ దళితబంధు పథకాన్ని కొనసాగించాలి. ♦ గొర్రెల పంపిణీని సత్వరమే ప్రారంభించాలి. -
రేవంత్, బండి సంజయ్‌కు వైఎస్ షర్మిల ఫోన్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం పొలిటికల్ హీట్‌ను పెంచింది. పేపర్ లీక్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అన్ని పార్టీలు ఏకంగా కావాలని పిలుపునిచ్చారు. అయితే, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్దం చేద్దామని షర్మిల తెలిపారు. ఈ క్రమంలోనే ప్రగతి భవన్ మార్చ్ పిలుపునిద్దామని సూచించారు. సీఎం కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని అన్నారు. కలిసి పోరాడకుంటే ప్రతిపక్షాలను కేసీఆర్ బ్రతకనివ్వరు అంటూ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. - ఇక, ఈ సందర్బంగా ఉమ్మడి పోరాటం చేసేందుకు బండి సంజయ్.. షర్మిలకు మద్దతు తెలిపారు. తర్వలో సమావేశం అవుదామని షర్మిలకు చెప్పారు. - మరోవైపు, రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుందామని రేవంత్ తెలిపారు. -
ప్రగతి భవన్‌కు కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ తనయు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నగరానికి చేరుకున్నారు. బుధవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారామె. ఇక బేగంపేట విమానాశ్రయం నుంచి సరాసరి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. అంతకు ముందు ట్విటర్ ద్వారా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారామె. కవిత వెంట సోదరుడు.. మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి హరీష్ రావు, మరికొందరు పార్టీ నేతలు ఉన్నారు. ప్రగతి భవన్‌కు వెళ్లిన ఆమె.. పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ విచారణ గురించి ఆమె వివరించొచ్చని సమాచారం. ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాంలో ఆమె వరుసగా రెండు రోజులపాటు(సోమ, మంగళవారాల్లో.. ) ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచే ఆమె ఈడీ ఆఫీస్‌కు వెళ్లారు కూడా. ఇక.. ఈడీ తనని విచారించిన తీరును ఆమె కేసీఆర్‌కు వివరించొచ్చని పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు ఉగాది నేపథ్యంలో ఆమె ఇవాళ మొత్తం ప్రగతి భవన్‌లోనే కుటుంబ సభ్యుల మధ్య గడుపుతారని తెలుస్తోంది. ఇక లిక్కర్ స్కాంలో ఈడీ ఆమెను మరోసారి విచారించే అవకాశం లేకపోలేదు. Wishing you all a happy and prosperous #Ugadi pic.twitter.com/t0EbIyjQgI — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2023 ఇదీ చదవండి: తప్పుడు ఆరోపణలు చేయడం కాదా?-కవిత -
ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో కవిత భేటీ
-
ఈడీ విచారణ వివరాలను కేసీఆర్ తో చర్చించే అవకాశం
-
దిగ్గజ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం.. లక్ష మందికి ఉద్యోగాలు!
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’( Hon Hai Fox Conn)సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ ( Young Liu) నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్లో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా హోన్ హై ఫాక్స్ కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి లభించనుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైంది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయం. ఈ ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించింది. యంగ్ ల్యూ పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సిఎం కేసీఆర్ స్వయంగా యాంగ్ లీకి అందచేశారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రగతి భవన్ లో యంగ్ ల్యూ ప్రతినిధి బృంధానికి మధ్యాహ్న భోజనంతో సీఎం కేసీఆర్ ఆతిథ్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్, వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, డైరక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. చదవండి: గవర్నర్ తమిళిసై తీరుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ -
ప్రగతిభవన్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్.. అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే, రాజాసింగ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెడిపోయిన తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని తీసుకొని ఎమ్మెల్యే శుక్రవారం ప్రగతి భవన్ వద్దకు వెళ్లారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ మార్చాలని, లేదంటే ఆ వాహనం మీరు తీసుకోవాలంటూ ప్రగతిభవన్ వద్ద వదిలేసి రాజాసింగ్ వెళుతున్నారు. ఇది గమనించిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మీడియా కంట పడకుండా పూర్తిగా మూసేసిన పోలీస్ డీసీఎంలో అసెంబ్లీకి తీసుకొచ్చారు. కాగా గతంలో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆయనను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మొరాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ కారు కాగా రాజాసింగ్ బుల్లెట్‌ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ నుంచి గురువారం బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో ఇంటికి వెళ్తుండగా ముందుభాగం టైరు ఊడిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ధూల్‌పేట ప్రాంతంలో వాహనం నుంచి భారీ శబ్దం వచ్చి ముందువైపు టైరు బయటకు రావడంతో డ్రైవర్ చాకచక్యంగా కారును నిలిపాడు. దీంతో రాజాసింగ్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. వాహనం నెమ్మదిగా వెళ్లడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూజజ ఈ ఘటన చూసైనా హోంమంత్రి మహమూద్ అలీ, పోలీసు ఉన్నతాధికారులు సిగ్గుపడాలన్నారు. వెంటనే తనకు వాహనం మార్చాలని డిమాండ్ చేశారు. -
'రేవంత్ ఎక్కడ అడుగు పెడితే ఆ పార్టీ ఖతం'
హైదరాబాద్: ప్రగతి భవన్‌ను పేల్చేయాలి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పాదయాత్రకు ఆదరణ కరువు కావడంతో అసంఘటిత శక్తులు మాట్లాడే మాటలు ఆయన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్‌ను పేల్చాలని నక్సలైట్లకు పిలుపునివ్వడమేంటమని మండిపడ్డారు. 'రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండిస్తోంది. భట్టి విక్రమార్క రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తారా? అది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమాలేక వ్యక్తిగతమా చెప్పాలి. కాంగ్రెస్ నైతిక బాధ్యత వహించాలి.' అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. బయట తిరగలేడు.. 'రేవంత్‌వి అన్ని అబద్ధాలే. వ్యవస్థ మీద ఆయనకు నమ్మకం లేదు. నక్సలైట్లను చర్చలకు పిలిచి కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ది. అనర్హుడికి పీసీసీ పదవి ఇచ్చారు. రేవంత్ ఇలాగే మాట్లాడితే బయట తిరగలేడు. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో తిరుగుతున్నావ్... ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రజలకు, నక్సలైట్లకు క్షమాపణ చెప్పాలి' అని మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. ఐటెం సాంగ్.. 'రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ పార్టీ ఖతం. తెలుగుదేశంలోకి వచ్చి ఆ పార్టీని నాశనం చేశారు. రేవంత్‌ను ప్రజలు ఐటెం సాంగ్ గానే చూస్తారు. ఆయన వెంట ఉండేవారు కిరాయివాళ్లే. నర్సంపేటలో పాదయాత్ర ఎందుకు చేయలేదు? అక్కడ తంతారనా? రేవంత్ ఓ బ్రోకర్. ఆయనకు ఇంగిత జ్ఞానం ఉందా? ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. మోదీ ఆఫీస్‌ను కూడా పేల్చేయాలని రాహుల్ గాంధీకి రేవంత్ ఎందుకు చెప్పలేదు? ఇలాగే మాట్లాడితే ప్రజలు తరిమి కొడతారు. నక్సలైట్ల ఎజెండా మంచిగానే ఉంటుంది. నాకు చదువు రాకపోతేనే ఏడు సార్లు గెలిచానా?' అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. చదవండి: రేవంత్ వ్యాఖ్యల దుమారం.. పీడీ యాక్ట్ పెట్టాలని ఫిర్యాదు! -
ప్రగతిభవన్‌పై రేవంత్ మరోసారి సీరియస్ కామెంట్స్.. కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్!
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, అధికార పార్టీ నేతల మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా పాదయాత్ర సందర్భంగా ప్రగతి భవన్‌ను పేల్చాయాలని టీపీసీసీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులు చేయడం, వార్నింగ్ సైతం చేశారు. కాగా, తన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి సమర్థించుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. కేసులు మాకేమీ కొత్త కాదు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. ప్రగతి భవన్‌లోకి ప్రజలకు ఎందుకు ప్రవేశం లేదని మేము అడుగుతున్నాము. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సామాన్య ప్రజలను ఎందుకు రానివ్వడంలేదని ప్రశ్నిస్తున్నాము. అమరవీరుల కుటుంబాలను సైతం ప్రగతిభవన్‌లో అడుగుపెట్టనివ్వకుండా నిషేధం పెట్టినప్పుడు ప్రగతి భవన్ ఉంటే ఎంత? పోతే ఎంత?. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ ద్రోహులను వెతికి మరీ ప్రగతి భవన్లో కూర్చోబెట్టి పంచభక్ష్య పరమాన్నం పెడుతున్నారు. తెలంగాణ అనే పదాన్ని అసహ్యించుకున్న వారందరినీ ప్రగతి భవన్లో కూర్చోపెడుతున్నారు.. దాన్ని ఎలా సమర్ధించుకుంటారు?. కేసీఆర్ తెలంగాణ సమాజానాకి ఏం సమాధానం చెబుతారు?. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబమే అంటున్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ ద్రోహులు మంత్రులయ్యారు. మంత్రుల్లో 90 శాతం తెలంగాణ ద్రోహులే ఉన్నారు. కోవర్టు ఆపరేషన్‌లో మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఎక్స్పర్ట్ అన్నారు. ఎర్రబెల్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
రేవంత్ వ్యాఖ్యల దుమారం.. పీడీ యాక్ట్ పెట్టాలని ఫిర్యాదు!
సాక్షి, వరంగల్: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కొత్త ప్లాన్స్‌తో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ములుగు జిల్లాలోని మేడారం నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభమైంది. కాగా, పాదయాత్రలో భాగంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. అయితే, రేవంత్ రెడ్డి.. ప్రగతిభవన్‌ను పేల్చేయాలనే వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రపై టెన్షన్ నెలకొంది. మరోవైపు.. రేవంత్ రెడ్డి మూడోరోజు పాదయాత్ర నేడు మహబూబాబాద్‌లో జిల్లా కొనసాగనుంది. కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో జెండా ఆవిష్కరణతో యాత్ర ప్రారంభం కానుంది. కాంగ్రెస్ శ్రేణులు తొర్రురు బస్టాండ్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాత్రి పెద్దవంగర వద్ద రేవంత్ బస చేయనున్నారు. -
ప్రగతి భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్లో జాతీయ పతాకా విష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మారక స్తూపాన్ని సందర్శించి జ్యోతి ప్రజ్వలన చేయడంతో పాటు అమర జవాన్లకు నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, శంభీపూర్ రాజు, మధు సూదనాచారి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, సీఎంవో ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రగతి భవన్లో గణతంత్ర వేడుకలు.. జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. 74వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, సీఎస్, డీజీపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్‌రావు, శంభీపూర్ రాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు సికింద్రాబాద్ మైదానంలో అమరజవాన్ల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించారు. చదవండి: తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు -
జీవో 317: ప్రగతి భవన్ వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం, కార్యాలయం అయిన ప్రగతి భవన్ ముట్టడికి ఉపాధ్యాయులు యత్నించారు. ఆదివారం మధ్యాహ్నం ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో పంజాగుట్ట, సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. జీవో 317ను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు ముట్టడికి యత్నించారు. ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ జీవో కారణంగా ఏడాది నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోయారు. వెంటనే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని, జీవోకు సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆపై ముట్టడికి యత్నించిన ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి ఉప్పల్ పీఎస్‌కు తరలించారు పోలీసులు. ఇక ముట్టడి భగ్నం కాగా.. పంజాగుట్ట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రాష్ట్రంలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో 317. అందుకు సంబంధించిన మార్గదర్శకాలే ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు సైతం జీవో రద్దు కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. -
దేశం మూడ్ మారేలా.. బీఆర్ఎస్ సభ నిర్వహణకు ఏర్పాట్లు!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ ఖమ్మం అర్బన్: దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అనిపించేలా.. జాతీయ రాజకీయాలకు సంబంధించి దేశం మూడ్ మారేలా ఖమ్మం బహిరంగ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జన సమీకరణకు ఓ వైపు.. పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నేతలనూ రప్పించేందుకు మరోవైపు కసరత్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నుంచి ఖమ్మం స్థానిక నేతల వరకు ఈ పనిలోనే బిజీబిజీగా గడుపుతున్నారు. ఖమ్మం సభ వేదికగానే పలు రాష్ట్రాల బీఆర్ఎస్ అధ్యక్షులను ప్రకటించేందుకు, పలువురు నేతలను చేర్చుకునేందుకు, చిన్న పార్టీల విలీన ప్రకటనలకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ విస్తరణతోపాటు జాతీయస్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయ కూటమిపైనా కేసీఆర్ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సన్నాహక సమావేశాలతో.. ఈ నెల 18న ఖమ్మం కొత్త కలెక్టరేట్ ప్రారంభంతోపాటు బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఐదు లక్షల మందితో భారీగా సభ నిర్వహిస్తామని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మంత్రి హరీశ్‌రావు స్వయంగా రంగంలోకి దిగి ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పరిధిలో నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ జనసమీకరణపై దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్ బిజీబిజీ ఖమ్మం సభ, బీఆర్ఎస్ జాతీయస్థాయి విస్తరణ పనులపై సీఎం కేసీఆర్ కూడా బిజీగా గడుపుతున్నారు. వివిధ రాష్ట్రాల రాజకీయ నేతలు, విభిన్న రంగాల ప్రముఖులతో మంతనాలు జరుపుతున్నారు. ఖమ్మం సభ వేదికగా వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు, పలు పార్టీల విలీన ప్రకటనలు ఉంటాయని సమాచారం. ఈ సభ వేదికగానే బీఆర్ఎస్ గుజరాత్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర శాఖల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. విలీనాలకు సంబంధించి 13కిపైగా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుగుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఖమ్మం సభా వేదికపై అన్ని రాష్ట్రాల ప్రతినిధులకు ప్రాతినిధ్యం దక్కేలా ఆహ్వానాలు పంపినట్టు సమాచారం. అయితే చేరికలు, విలీనాలకు సంబంధించి ప్రగతిభవన్ వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి. కీలక నేతలకు ఆహ్వాన బాధ్యతలు ఖమ్మం సభకు మూడు రాష్ట్రాల సీఎంలు అర్వింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్‌మాన్ (పంజాబ్), పినరయి విజయన్ (కేరళ)తోపాటు మాజీ సీఎంలు అఖిలేశ్‌యాదవ్, శంకర్‌సింహ్ వాఘేలా, గిరిధర్ గమాంగ్, పలు ఇతర పార్టీల నేతలు హాజరుకానున్నారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ఇతర కార్యక్రమాల షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నట్టు సమాచారం. మొత్తంగా ఖమ్మం సభకు వచ్చే నేతల ఆహ్వానాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి సమన్వయం చేస్తున్నారు. కేసీఆర్‌తో జరిగే భేటీలు, సభకు హాజరయ్యే నేతల వసతి, బస, రవాణా ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పీయూసీ చైర్మన్ ఎ.జీవన్‌రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. దావోస్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖమ్మం సభకు హాజరుకావడం లేదు. సభలో ఎలాంటి ఇబ్బందీ రావొద్దు – పోలీసు అధికారులతో సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ ఖమ్మం సభ విజయవంతం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ సూచించారు. శనివారం ఉదయం వారు ఖమ్మం కలెక్టరేట్, సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించారు. తర్వాత పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, ఇతర అధికారులతో సమీక్షించారు. సభ వద్దకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధుల వాహనాల కోసం అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని.. ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. సీఎం, ఇతర వీఐపీలు వస్తుండటంతో భద్రత పకడ్బందీగా ఉండేలా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం సాయంత్రం సభా స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. సభ కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందన్నారు. 200 మంది కూర్చునేలా వేదిక సభ కోసం 50 ఎకరాలకుపైగా స్థలాన్ని చదును చేయించారు. వాస్తుపరంగా దక్షిణం, పడమరవైపు ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఉత్తర ముఖంగా ఎనిమిది అడుగుల ఎత్తుతో 200 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. దీని వెనక 70 అడుగుల ఫ్లెక్సీతోపాటు పూలతో అలంకరించనున్నారు. ► వేదిక, దానిపై టెంట్‌ను వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ సామగ్రితో నిర్మిస్తున్నారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెంట్లను ఉపయోగిస్తున్నారు. ► ప్రధాన స్టేజీ పక్కనే కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేలా మరో స్టేజీ నిర్మిస్తున్నారు. ఒకేసారి 50 మంది కళాకారులు ప్రదర్శన ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. ► సభకు 5 లక్షల మందిని సమీకరించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకోగా.. వేదికకు దగ్గరలో లక్ష కుర్చీలు వేస్తున్నారు. వాటి వెనకాల కూడా మరిన్ని కుర్చీలు వేయాలా, నిలబడేందుకు ఏర్పాట్లు చేయాలా అన్నది పరిశీలిస్తున్నారు. -
ప్రగతి భవన్ ముట్టడికి ‘డీవైఎఫ్ఐ’ యత్నం.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లో అవకతవకలు జరిగాయాంటూ ప్రగతి భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు సోమవారం యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు నియామకాల్లో అవకతవకలు జరిగాయని డీవైఎఫ్ఐ ఆరోపించింది. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేసింది. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో నిరసనలకు దిగిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక స్టేషన్లకు తరలించారు. ఇదీ చదవండి: ఖమ్మం బీఆర్ఎస్కు ఒకేసారి భారీ షాకులు?.. తుమ్మలతో పాటు పొంగులేటి.. షాతో చర్చలు?? -
ప్రగతిభవన్ ముట్టడించిన బీజేవైఎం కార్యకర్తలు
-
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత.. బీజేవైఎం కార్యకర్తల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎస్ఎల్పీఆర్బీ పోలీసు నియామకాల్లో కొత్త నిబంధనల వల్ల లక్షల మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ నిరసిస్తూ ప్రగతి భవన్‌ను ముట్టడించారు బీజేవైఎం కార్యకర్తలు. పోలీసు నియామకాల్లో గతంలో ఉన్న శారీరక పరీక్షల్లో మార్పులు చేయడంపై నిరసనలకు దిగారు. నిబంధనలను మార్చి, ఎవరైతే ఫిజికల్ టెస్టుల్లో నష్టపోయారో వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రగతి భవన్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు బీజేవైఎం కార్యకర్తలు. దీంతో ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఆందోళనకారులను అరెస్టులు చేసి స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇదీ చదవండి: ‘కేసీఆర్ సర్కార్ సర్పంచ్ల గొంతులు నొక్కేస్తున్నది’ -
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత
-
ప్రగతిభవన్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం
-
సీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భేటీ
-
సీఎం కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం సమావేశయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ భేటీలో దేశంలోని ప్రస్తుత రాజకీయాలతోపాటు పంజాబ్ రాష్ట్ర పరిస్థితులపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించినట్లు తెలుస్తుంది. కేసీఆర్‌తో భేటీ ముగియడంతో ప్రగతి భవన్ నుంచి పంజాబ్ సీఎం బయలు దేరారు. కాగా తాజ్ కృష్ణలో ఓ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్‌లో పాల్గొనడానికి భగవంత్ మాన్ హైదరాబాద్ విచ్చేసిన సంగతి తెలిసిందే. 24న పంజాబ్ స్పీకర్ రాక పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్‌సింగ్ సంధ్వాన్ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు. చదవండి: బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ -
TS: తెలంగాణ కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిన మరుసటి రోజే.. తెలంగాణ కేబినెట్ భేటీ కావడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, దళిత బందు అమలు, సొంత ఇంటి స్థలం కలిగిన వారికి రూ. 3 లక్షల ఆర్ధిక సహాయం, రైతు బంధు నిధుల విడుదల తో పాటు అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. గవర్నర్ వద్ద పెండింగ్ లో బిల్లులపై ఏం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు.. పోడు భూములకు పట్టాలు పంపిణీ తేదీల ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. గిరిజన బంధు లాంటి కీలకాంశంపై నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ నడుస్తోంది. -
తెలంగాణ చేనేతకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చేనేత కళా నైపుణ్యానికి ప్రపంచ మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉందని అమెరికాకు చెందిన చేనేత, వస్త్ర పరిశోధకురాలు కైరా వెల్లడించారు. భారత్‌లో చేనేత ఉత్పత్తులు కేవలం చీరలకు మాత్రమే పరిమితం అవుతున్నాయన్నారు. ఇతర దుస్తులు, ఉత్పత్తులకు చేనేత, పట్టు పరిశ్రమను అనుసంధానించడం ద్వారా మార్కెటింగ్ విస్తృతి పెరుగుతుందని ఆమె తెలిపారు. చేనేత, వస్త్ర రంగంపై పరిశోధనలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కైరా బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యటనలో తాను అధ్యయనం చేసిన విషయాలను కేటీఆర్‌కు వివరించారు. మరమగ్గాల కార్మికులు డబుల్ జకార్డ్ వంటి వినూత్న టెక్నిక్‌తో వస్త్రాలను ఉత్పత్తి చేయడాన్ని ప్రశంసించారు. రాష్ట్రంలోని పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో జరుగుతున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి, అక్కడి స్థితిగతులపై తాను అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా ఇప్పటి వరకు 9 దేశాల్లో పర్యటించగా, చేనేత అధ్యయనానికి భారత్‌లో తెలంగాణను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకున్నట్లు కైరా చెప్పారు. చేనేత కళా నైపుణ్యం, వస్త్రాలపై ప్రేమతో దీర్ఘకాల పరిశోధన కోసం తన సమయాన్ని వెచ్చిస్తున్న కైరా ప్రయత్నాన్ని కేటీఆర్ అభినందించారు. -
SR నగర్ పోలీస్ స్టేషన్ కు వైఎస్ షర్మిల
-
ధ్వంసమైన కారుతో వైఎస్ షర్మిల
-
హైదరాబాద్‌లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్ర సందర్భంగా సోమవారం రోజు టీఆర్ఎస్ నేతలు చేసిన దాడికి నిరసనగా ప్రగతి భవన్‌కు ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నేతల దాడిలో ధ్వంసమైన కారును తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు షర్మిల బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం కారు డోరు తెరిచి బలవంతంగా ఆమెను కిందకు దించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు ఆమెను తరలించారు. ఈ సందర్బంగా పోలీసుల తీరుపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన వాహనాన్ని కేసీఆర్‌కు చూపించడానికి వెళ్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించకూడదా?. అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.? -
‘ప్రభుత్వం నుంచి నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా ప్రజావసరాలు పెరుగుతున్నాయి. సమిష్టితత్వం, సమన్వయంతో పనిచచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయి. తెలంగాణలో అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. ప్రభుత్వం నుంచి నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజాదరణకు నోచుకుని ప్రభుత్వాస్పత్రులు నేడు రద్దీగా మారాయి. మరింత నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదే అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఈ మధ్యాహ్నం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష
-
పేదల ఆరోగ్యానికి ఎంతైనా ఖర్చు చేస్తాం: సీఎం కేసీఆర్
-
తెలంగాణ చరిత్రలో ఇది కొత్త అధ్యాయం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయని ఎవరూ ఊహించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ వేదికగా తెలంగాణలో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయంగా పేర్కొన్నారు. కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చేందుకు మంత్రి హరీష్‌రావు ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈ కాలేజీలతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,790కి పెరిగిందని చెప్పారాయన. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మెడికల్ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయి. పీజీ సీట్లు కూడా 1,180కి చేరి.. రెట్టింపు అయ్యాయి. మొత్తంగా తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా మారుతోందని అన్నారు. ఈ సందర్భంగా.. ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసుల్ని వర్చువల్‌గానే ప్రారంభించారు సీఎం కేసీఆర్. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలలో ఈ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. ఇదీ చదవండి: కేటీఆర్ అంకుల్.. కాలనీకి నల్లానీరు ఇప్పించరూ! -
గన్ షాట్ : తెలంగాణ రాజకీయాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయా ..?
-
‘ఎమ్మెల్యేలకు ఎర’ వికటించడం వల్లే నడ్డా సభ రద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోకుండా ప్రధాని మోదీ పేద ప్రజలకు పెద్ద ఉపద్రవంలా పరిణమించారని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’ ప్లాన్ బెడిసికొట్టడంతోనే మునుగోడులో జేపీ నడ్డా సభ రద్దు చేసుకున్నారని, ఓటమి భయంతోనే అమిత్‌షా ముఖం చాటేశారన్నారు. రాహుల్‌గాంధీ నోటికి ఏదొస్తే అది మాట్లాడకుండా మొదట కాంగ్రెస్ ప్రాధాన్యతలేమిటో నిర్ణయించుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. మోదీ, బీజేపీ విధానాలపై ఆధారాలతో సహా విమర్శల దాడి చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ జడ పదార్ధంలా తయారైంది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో.. మోదీ 22 సార్లు అక్కడికి వెళితే, కేజ్రీవాల్ తరచూ పర్యటిస్తున్నారు. రాహుల్ మాత్రం ఒక్కసారి కూడా వెళ్లలేదు. గుజరాత్లో అస్త్ర సన్యాసం చేసి ఇక్కడ గాలి విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ మొదట సొంతింటిని చక్కదిద్దుకోవాలి. దేశ రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఉందనే విషయం ఆ పార్టీకి అర్థం కావడం లేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ కుటుంబ నామినీ మాత్రమే. బీఆర్ఎస్కు మొదటి మెట్టు మునుగోడు మునుగోడు ఉప ఎన్నిక భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు మొదటి మెట్టు లాంటిది. ఇక్కడి ఫలితం పార్టీకి కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మునుగోడులో తొలినుంచీ టీఆర్ఎస్కే అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఫ్లోరోసిస్ నుంచి బయటపడేయడంతో మహిళల్లో మాకు ఆదరణ ఉంది. కమ్యూనిస్టులతో పొత్తు అదనపు బలాన్ని ఇచ్చింది. నియోజకవర్గం బయట ఉన్న 40వేల మంది ఓటర్ల పాత్ర బలంగా ఉండబోతోంది. అన్ని పార్టీలు తమ బలగాలను మోహరించినపుడు మేం మా ఎమ్మెల్యేలను రంగంలోకి దింపాం. అందులో తప్పేముంది? కేసీఆర్ దెబ్బకు అంతా కకావికలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి జేపీ నడ్డా సభలో చేర్చుకునేలా బీజేపీ ఎత్తుగడ వేసింది. అది బెడిసికొట్టడంతో నడ్డా సభ రద్దు చేసుకోగా.. అమిత్‌షా ముఖం చాటేశారు. మరో రెండు, మూడు పార్టీలకు సాధన సంపత్తి సమకూర్చి మా ఓటు బ్యాంకును దెబ్బతీయాలని చూశారు. విద్వేషం, కుటుంబ పాలన ఆరోపణలు, మత కలహాలు వంటి ‘ప్లే బుక్’ను అడ్డుపెట్టుకుని ఓట్లను పోలరైజ్ చేసేందుకు ప్రయత్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ బహుళ మార్గాల్లో ప్రయత్నించినా కేసీఆర్ ‘మాస్టర్ స్ట్రాటజీ’తో వారు కకావికలం అయ్యారు. బీజేపీకి పెద్దగా కేడర్ లేదనే విషయం రాబోయే రోజుల్లో బయటపడుతుంది. ‘కోవర్టు బ్రదర్స్’పదం కోమటిరెడ్డి సోదరులకు అతికినట్టు సరిపోతుంది. సీబీఐ మోదీ చేతిలో చిలుక! బీజేపీ మఠాధిపతుల ముసుగులో ఉన్న ముఠాను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని నడిపింది. మా ఎమ్మెల్యేలు దీనిని తొలుత నాదృష్టికి, తర్వాత కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముఠా ఆట కట్టించారు. ఈ వ్యవహారంలో స్వామీజీలు సంచలన విషయాలు బయటపెట్టారు. కుట్ర గురించి బీజేపీ నేతలకు తెలిసినందునే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేకపోతే బీజేపీ నేతలు కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? గతంలో సీబీఐని ‘కాంగ్రెస్ చిలుక’అని మోదీ అభివర్ణించారు. ఇప్పుడు అది మోదీ చేతిలో చిలుకలా మారింది. ముందస్తు అనుమతితోనే సీబీఐ అడుగు పెట్టాలనే జీవో రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. బ్రిటీషు కాలానికి ప్రతీక గవర్నర్ గిరీ.. కొందరు వ్యక్తులు తమ స్థాయిని, శక్తిని అపరిమితంగా ఊహించుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థ బ్రిటీషు కాలం నాటిది. బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల పనితీరును చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి మంత్రివర్గం నిర్ణయాలకు అనుగుణంగా గవర్నర్ నడుచుకోవాలి. కానీ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టి రాజ్యాంగ సంస్థల నడుమ వివాదం రేపేందుకు గవర్నర్ బిల్లులను ఆపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గొంతు నొక్కి ప్రజల దృష్టిలో కేసీఆర్‌ను చెడుగా చూపేందుకు బీజేపీ అనేక రూపాల్లో ప్రయత్నిస్తోంది. గవర్నర్ అందులో భాగం కావడం సరికాదు. 2024 ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్కు గుర్తింపు లభించిన తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా పనిచేస్తాం. పొరుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై దృష్టి పెడతాం. బీజేపీలో పది మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు కేసీఆర్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. మునుగోడు ఓటమి తర్వాత బీజేపీ తన వ్యూహాన్ని సమీక్షించుకుని వెనక్కి తగ్గొచ్చు. లేదా కొత్త ‘ప్లేబుక్’తో రూల్స్ మార్చుకుని జనం ముందుకు రావచ్చు. 2023 ఎన్నికల్లో బీజేపీ శక్తినంతా కేంద్రీకరిస్తే.. ఆ పరిస్థితుల్లో పోటీపడి గెలవడంలోనే మజా ఉంటుంది. మునుగోడు కంటే వారణాసి, గుజరాత్ ఎన్నికలే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. మోదీ గుజరాత్లో ఇప్పటికే రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. చదవండి: సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్ -
హైడ్రామా: నేరుగా ప్రగతిభవన్‌కే.. కేసీఆర్‌తో ఆ నలుగురు భేటీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డిజిల్లా: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బేరసారాలకు ప్రయత్నించారంటూ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన ఫామ్‌హౌజ్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి చెందినదే. మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఈ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసినప్పుడు రోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడకుండా లోపలే ఉండిపోయారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఆయనను రహస్యంగా విచారించారు. అనంతరం రోహిత్‌రెడ్డిని పోలీసు వాహనంలో ఎక్కించుకుని బయలుదేరారు. ఆ వాహనం నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకుంది. రోహిత్‌రెడ్డికి చెందిన సొంత వాహనం పోలీసు వాహనం వెనకాలే వెళ్లింది. మిగతా ముగ్గురు ఎమ్యెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి ముగ్గురూ ముందుగానే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు నడుమ రోహిత్‌రెడ్డి కూడా రాత్రి 11 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్‌తో ‘ఆ నలుగురు’ భేటీ.. నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు! టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో పాటు మరికొందరు పార్టీ ముఖ్య నేతలు కూడా బుధవారం రాత్రి ప్రగతిభవన్‌కు వచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలందరితోనూ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బుధవారం అర్ధరాత్రి వరకూ ఈ భేటీ కొనసాగింది. తమతో బీజేపీ దూతలు సంప్రదింపులు జరిపిన తీరు, ప్రలోభాలకు గురిచేసిన వైనాన్ని నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు పూసగుచి్చనట్లు వివరించినట్లు తెలిసింది. దీనిపై గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై నలుగురు ఎమ్మెల్యేలు గురువారం మీడియా ముందుకు వచ్చే అవకాశమున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియాతో మాట్లాడే అవకాశముందని సమాచారం. గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు టీఆర్ఎస్ పిలుపునిచి్చంది. కాగా, మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసు కమిషనర్ ప్రెస్‌మీట్ ముగిసిన సెకన్లలోనే.. ఫేస్ బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు రావడం, ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయతి్నంచారనే ఆరోపణలు, ఇతర వివరాలూ వైరల్ కావడం గమనార్హం. ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో.. రోహిత్‌రెడ్డి 2017లో పోలీస్ అకాడమీ జంక్షన్ నుంచి మొయినాబాద్ వెళ్లే మార్గంలో అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధి టలో ఐదెకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో మామిడి చెట్లు నాటారు. మధ్యలో విశాలమైన ఫామ్‌హౌజ్‌ను నిర్మించారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు ఒకట్రెండు కిలోమీట ర్ల దూరంలోనే ఈ ఫామ్‌హౌజ్ ఉంటుంది. రోహిత్‌రెడ్డి తరచూ ఇక్కడికి వస్తూపోతూ ఉంటారని.. సమీపంలో జనం పెద్దగా ఉండరని పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. పూజల కోసమే వచ్చాం: నందకుమార్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఇంట్లో పూజల కోసమే తాము వచ్చామని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన నందకుమార్ చెప్పారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ చైతన్యపురికి చెందిన ఆయన ఘటన అనంతరం వివరాలు వెల్లడించారు. తనతోపాటు ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో ఉన్న ఆలయ పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, తిరుపతిలోని శ్రీమనాథరాజపీఠం పీఠాధిపతి డి.సింహయాజులు వచ్చారని తెలిపారు. బ్యాగులు తెరవకుండానే.. మొయినాబాద్ రూరల్, రాజేంద్రనగర్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ సైబరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారని, అందుకోసమే ముగ్గురు వ్యక్తులు ఫామ్‌హౌస్ వద్దకు వచ్చారని ఆరోపణలు వినిపించాయి. దీనికి సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించినప్పుడు.. రోహిత్‌రెడ్డికి చెందిన కారులో ఉన్న రెండు ట్రావెల్ బ్యాగులను తెరవాలని మీడియా కోరినప్పటికీ.. పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. గంట సేపు రోహిత్ రెడ్డిని రహస్యంగా విచారించిన పోలీసులు అతన్ని పోలీస్ వాహనంలోనే ఎక్కించుకొని ప్రగతి భవన్‌కు తీసుకెళ్లారు. దాదాపు నాలుగైదు గంటల పాటు ఫామ్‌హౌస్ వద్ద హైడ్రామా సాగింది -
ప్రగతిభవన్‌కు మునుగోడు పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక సమయం దగ్గరపడినా ఆ పార్టీలో అసంతృప్తి సద్దుమణగడం లేదు. ఉపఎన్నిక సంకేతాలు వెలువడింది మొదలుకుని కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటూ గళం విప్పిన నేతలు నామినేషన్ల స్వీకరణ మొదలైనా పట్టు వీడటం లేదు. కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని రెండు రోజుల క్రితం ప్రకటించారు. కానీ నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు ఇంకా పట్టు వీడటం లేదు. ఈ నేపథ్యంలో మునుగోడుకు చెందిన అసంతృప్త నేతలతో శనివారం ప్రగతిభవన్‌లో కీలక భేటీ జరిగింది. కేటీఆర్, హరీశ్‌రావులతో భేటీ మునుగోడు నియోజకవర్గానికి చెందిన పార్టీ అసంతృప్త నేతలను వెంట బెట్టుకుని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ శనివారం ప్రగతిభవన్‌కు వచ్చారు. నారాయణపూర్ ఎంపీపీ, మునుగోడు వైస్ ఎంపీపీ, పలువురు సర్పంచులు సహా సుమారు 70 మంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులతో భేటీ అయ్యారు. గతంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమను ఇబ్బంది పెట్టిన తీరును ఏకరువు పెట్టారు. తమపై కేసులు నమోదు చేయించడం, ఆర్థికంగా దెబ్బతీయడం వంటివీ చేశారని వివరించారు. ఉప ఎన్నిక వాతావరణం ప్రారంభమైనా తమకు పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఇతర పార్టీల నుంచి చేరికలకు ఒత్తిడి, ప్రలోభాలు వస్తున్నా టీఆర్ఎస్పై అభిమానంతో కొనసాగుతున్నామని.. పార్టీ ఇన్చార్జులుగా నియమితులైన నేతలు కూడా తమను సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తాం మునుగోడు టీఆర్ఎస్ అసంతృప్త నేతల అభిప్రాయాలు విన్న కేటీఆర్, హరీశ్‌రావు రెండు, మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అసంతృప్త నేతలను కలుపుకొని వెళ్లాలని ప్రస్తుతం యూనిట్ ఇన్‌చార్జీ్జలుగా నియమితులైన నేతలకు సూచించినట్టు సమాచారం. అయితే అసంతృప్త నేతలు కేటీఆర్, హరీశ్‌లతో జరిగిన భేటీపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే.. తమ ఇబ్బందులను పరిష్కరించకపోతే సొంత దారి చూసుకుంటామనే సంకేతాలు ఇస్తున్నట్టు తెలిసింది. -
కాంగ్రెస్‌కు ఇద్దరు ఎంపీల గుడ్‌బై!
సాక్షి, హైదరాబాద్: రాహుల్‌గాంధీ భారత్ జోడో పాద యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించేటప్పటికి తెలంగాణకు చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్తారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. శుక్రవారం ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వారు పార్టీ మారతారన్న సమాచారం మీకు (మీడి యా) ఇస్తున్నానని, ఏ పార్టీలో చేరతారో మీరే తెలుసుకోండంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘భారత్ జోడో యాత్ర కాదు. ముందు కాంగ్రెస్ జోడో చూసుకోవాలి. రాహుల్ పాదయాత్ర ప్రారంభించగానే గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడిగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పోటీ చేస్తారనగానే.. అక్కడి ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకం అయ్యింది. అక్కడి ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేశారు. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఓ పెద్ద జోక్. అక్కడ పోటీ ఏముంది..? 76 ఏళ్ల పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిగిపోయి 80 ఏళ్ల వృద్ధుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడు అవుతారంట. యువకులతో కూడిన భారత్‌లో 80 ఏళ్లున్న వ్యక్తి ఓ ప్రధాన పార్టీకి అధ్యక్షుడు కావడం విడ్డూరం. గతంలో సీతారాం కేసరి ఉన్నప్పుడు పార్టీ ఎలా ఉందో అలానే ఉంటుంది..’అని ఎద్దేవా చేశారు. రాహుల్ 15 నెలలున్నా ఎలాంటి ప్రభావం ఉండదు ‘ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్. అందుకే దేశంలో రాజకీయ శూన్యత. కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసం పాకులాడుతోంది. దేశంలో ఎక్కడా ఆ పార్టీ కనీస పోటీ ఇవ్వని పరిస్థితి. 2024 ఎన్నికల తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ తెలంగాణలో 15 రోజులున్నా, 15 నెలలున్నా ఎలాంటి ప్రభావం ఉండదు. కర్ణాటక నుంచి తెలంగాణలోకి వస్తారు. ఇక్కడ కార్యక్రమాలు చూసి సైలెంట్ అవుతారు..’అని కేటీఆర్ అన్నారు. -
దసరాపై ఉత్కంఠ.. మునుగోడులో జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. జాతీయ పార్టీ విషయంలో వేగంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్.. మంత్రులు, జిల్లాలో అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో తాజా రాజకీయాలు, కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చ జరిగింది. ఇక, ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశంలో డిసెంబర్ 9వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభకు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, తెలంగాణభవన్‌లో దసరా రోజున టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. అదే రోజున జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్నారు. మరోవైపు.. జాతీయ స్థాయిలో వివిధ సంఘాల నేతలతో త్వరలో కేసీఆర్ భేటీ కానున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మునుగోడుపై కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీ పేరుతో మునుగోడు ఎన్నికల బరిలో ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈసారి మునుగోడు బరిలో మూడు జాతీయ పార్టీలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో అన్ని వర్గాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. మునుగోడులో అన్ని సర్వేలు టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మొదలైన లంచ్ మీటింగ్
-
ప్రగతి భవన్లో మంత్రి ‘కేటీఆర్’ ఎమోషనల్ సీన్..
సాక్షి, హైదరాబాద్: ఆడ పిల్లల విద్య విషయంలో అండగా ఉండేందుకు ఎప్పుడు ముందుండే కేటీఆర్ మరోసారి తన మంచి మనసుతో నిరుపేద విద్యార్థిని జీవితాన్ని నిలబెట్టారు. తల్లిదండ్రులు లేని రుద్ర రచన అనే ఇంజనీరింగ్ విద్యార్థిని చదువుకు అవసరమైన సహాయం చేసి ఆమె ఇంజనీరింగ్ పూర్తి అయ్యేలా చూశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి స్థానిక బాలసదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివింది. చదవండి: ప్రతిపాదనల్లోనే ‘మినీ ట్యాంక్‌బండ్’.. మంత్రి కేటీఆర్ ఆదేశాలు బేఖాతర్! ఆ తర్వాత హైదరాబాద్ యూసుస్‌గూడాలోని స్టేట్ హోంలో ఉంటూ పాలిటెక్నిక్‌ని పూర్తి చేసింది. ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ సీబీఐటి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంబ్‌లో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది. అయితే తల్లిదండ్రులు లేని రుద్ర రచన తన ఇంజనీరింగ్ ఫీజులు చెల్లించలేకపోయింది. రుద్ర రచన ఆర్థిక ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా 2019లో తెలుసుకున్న కేటీఆర్, ఆమెను ప్రగతి భవన్ పిలిపించుకొని ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యేందుకు అవసరమైన ఖర్చులను భరిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజనీరింగ్ ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను కేటీఆర్ వ్యక్తిగతంగా భరించారు. కేటీఆర్ ఆర్థిక సహాయంతో ఇంజినీరింగ్ చదువుతున్న రుద్ర రచన, ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాన్ని సాధించింది. ఈ సందర్భంగా ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ ను రుద్ర రచన కలిసింది. ఆమె చదువు, ఉద్యోగాల విషయం తెలుసుకుని కేటీఆర్ సంతోషపడ్డారు. తనకంటూ ఎవరూ లేకున్నా ఆత్మ విశ్వాసంతో రుద్ర రచన జీవితంలో విజయం సాధించిందని మెచ్చుకున్నారు. తల్లిదండ్రులు లేని తనకు మంత్రి కేటీఆర్.. ఒక అన్నగా అండగా నిలబడ్డారని, తన కల సాకారం కోసం తండ్రిగా తపించారని రచన భావోద్వేగానికి లోనయింది. ఈ సంవత్సరం రాఖీ కట్టాలనుకున్నానని అయితే కేటీఆర్ కాలికి గాయం అయిందన్న విషయం తెలుసుకుని బాధపడ్డానని రుద్ర రచన చెప్పింది. తాను పొదుపు చేసుకున్న డబ్బులతో వెండి రాఖీ తయారు చేయించానన్న రచన, వాటిని కేటీఆర్‌కు కట్టింది. రచన మాటలకు, అభిమానానికి మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. రచన చేత రాఖీ కట్టించుకున్న తాను, ఆమె జీవితంలో మరింత స్థిరపడేందుకు చేసే ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని వాటిని సవాలుగా స్వీకరించి నాలుగు కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన రచన యువతరానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి సివిల్ సర్వెంట్ కావాలన్నా తన లక్ష్యానికి అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. రచన చివరి సంవత్సరం ఇంజినీరింగ్ ఫీజు, హాస్టల్ బకాయిలు మొత్తం నగదు సహాయాన్ని కేటీఆర్ అందించారు. -
మీ అనుభవాన్నిదేశానికి విస్తరించండి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రజాస్వామిక ఫెడరల్ స్ఫూర్తిని మంటగలుపుతూ మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి సాగిస్తోందని.. దాన్ని నిలువరించేందుకు సరైన వేదిక అవసరముందని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్ వాఘేలా అన్నారు. వర్తమాన జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వం దేశానికి ఎంతో అవసరం ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం ద్వారా బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో వాఘేలా శుక్రవారం సుమారు 5 గంటలపాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు జాతీయస్థాయి కీలకాంశాలపై చర్చ జరిగింది. ‘కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలను ఎదుర్కొనేందుకు సరైన వేదిక, నాయకత్వం లేకపోవడంపై విపక్ష నేతలంతా ఆందోళన చెందుతున్నారు. మోదీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర పాలన, రాజకీయ విధానాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నా ప్రజాస్వామికవాదులు మౌనం వహించడం సరికాదు. దేశంలోని ప్రతి విపక్ష రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ నియంతృత్వ ధోరణితో లొంగదీసుకోవాలనే కుట్రలను బీజేపీ అమలు చేస్తోంది. దేశంలో మత సామరస్యానికి, ప్రాంతీయ సామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలి’ అని వాఘేలా అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రేస్ పార్టీ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోందన్నారు. బీజేపీ దుర్మారా్గలను ఎదుర్కొనేందుకు కావాల్సిన రాజకీయ వ్యూహాన్ని, ఎత్తుగడలను అమలు చేస్తూ అందరినీ కలుపుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. కేంద్రం ఇబ్బందిపెడుతున్నా కేసీఆర్ తెగువ.. ‘కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తున్న మీ తీరు నా లాంటి సీనియర్ నాయకులను ప్రభావితం చేసింది. శాంతియుత మార్గంలో పార్లమెంటరీ పంథాలో తెలంగాణను సాధించి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. విభజన తర్వాత తెలంగాణకు అండగా నిలవాల్సిన కేంద్రం కొత్త రాష్ట్రాన్ని అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నా తెగువ చూపుతున్నారు. బీజేపీ పీడన నుంచి తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలను కూడా విముక్తం చేయాల్సిన అవసరం ఉంది. మీ అనుభవాన్ని కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా యావత్ దేశానికి విస్తరించాల్సిన సమయం వచ్చింది. దేశంలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్ల కోరిక మేరకే నేను మీతో భేటీ అయ్యా. మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని కేసీఆర్‌తో భేటీలో శంకర్‌సిన్హ్ వాఘేలా పేర్కొన్నారు. దేశ రాజకీయాలు, పాలనలో గుణాత్మక మార్పు కోసం కృషి చేస్తానని, వాఘేలా వంటి సీనియర్ జాతీయ నాయకుడు తనకు మద్దతు పలకడంపట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. -
ప్రగతిపై గొప్ప విజన్ ఉన్న నేత కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అభివృద్ధిపై గొప్ప విజన్ ఉన్న నేత అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో జరిగిన సమావేశం అర్థవంతంగా సాగిందని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా కర్ణాటక – తెలంగాణ రాష్ట్రాల సమస్యలు, జాతీయ రాజకీయాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కేటీఆర్ అందించిన ఆతిథ్యం, చూపించిన అభిమానంతో తన హృదయం నిండిపోయిందని కుమారస్వామి పేర్కొన్నారు. -
స్కాలర్షిప్లు పెంచకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో విద్యార్ధులకు స్కాలర్షిప్లు పెంచకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు స్కాలర్షిప్ రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన సదస్సులో ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. పేద విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీసీ గురుకులాలకు ఒక ఐఏఎస్‌ను నియమించకపోవటం బాధాకరమన్నారు. తెలంగాణలో బీసీ సంక్షేమశాఖ నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 240 బీసీ హాస్టళ్లు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయని, వాటికి సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో విద్యకోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి బీసీ విద్యార్థికి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
రైతులంతా సంఘటితం కావాలి
సాక్షి, హైదరాబాద్:‘‘చట్టసభల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి దేశంలో కొనసాగుతుండటం మనందరి దురదృష్టం..’’ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు పోరాడాల్సి ఉందని చెప్పారు. ఈ సంఘర్షణ ప్రారంభ దశలో కలిసి వచ్చే శక్తులు కొంత అనుమానాలు, అపోహలకు గురవుతుంటాయని.. ఈ అడ్డంకులు దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు వచ్చిన 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమపథకాలను రైతు నేతలు తెలుసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్యవేదిక ఏర్పాటు కావాలని అభిప్రాయపడ్డారు. అనంతరం ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ ఆరా తీయగా.. కేంద్ర రైతు వ్యతిరేక, అసంబద్ధ విధానాలతో నష్టం జరుగుతోందని రైతు నాయకులు వివరించారు. తెలంగాణలో మాదిరిగా తమకూ సహకారం దొరికితే కష్టాల నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై కలిపి ముందుకెళదామని సీఎం కేసీఆర్ వారికి సూచించారు. ఇంకా వ్యవసాయ సంక్షోభం ఎందుకు? ‘‘దేశంలో సాగునీరుంది. కరెంటుంది. కష్టపడే రైతులున్నారు. అయినా వ్యవసాయ సంక్షోభం ఎందుకుంది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి? కేంద్ర పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచాక కూడా కేంద్రంలో పాలనా వ్యవస్థ ఇంకా గాడిన పడకుండా, ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను మనం అన్వేషించాలి. అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు సిద్ధపడుతుండటం ఎందుకో ఆలోచించాలి. దేశంలో రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడం లేదో, ఈ దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో చర్చించుకోవాలి. దేశంలో అవసరానికి మించి నీళ్లు ఉన్నా ప్రజలు సాగునీటికి, తాగునీటికి ఇంకా ఎందుకు ఎదురు చూడాల్సి వస్తోంది? దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యమున్నా 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌ను కూడా వినియోగించుకోలేకపోతున్నాం. మేం తెలంగాణలో రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ, సాగునీటిని అందిస్తున్నపుడు.. ఇదే పనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదు? తెలంగాణలో ఉన్నట్టు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్‌లు ఉన్నాయా?’’అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దేశ వనరులను సరిగా వినియోగించుకుంటూ.. రైతు వ్యవసాయ సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం దేశంలోని రైతాంగమంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. దేశానికి కేసీఆర్ వంటి నాయకత్వం కావాలి! నిన్నటితరం రైతు సంఘాల నేతలు చరణ్ సింగ్, దేవీలాల్, జయప్రకాశ్ నారాయణ్, శరద్ పవార్ తదితరులతో కలిసి పనిచేసిన 80 ఏళ్ల వయసు పైబడిన పలువురు రైతు నేతలు కేసీఆర్‌తో సమావేశంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. దేశానికి సీఎం కేసీఆర్‌లాంటి నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, సాగునీరు తదితర రంగాల్లో తెలంగాణ ప్రగతిపై ప్రదర్శించిన డాక్యుమెంటరీ చూసి మెచ్చుకున్నారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు ఉంటే.. తాము కూడా ఎంతో అభివృద్ధి చెందేవారమని పేర్కొన్నారు. తెలంగాణ సహా ఢిల్లీ, ఒడిశా, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హరియాణా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, అసోం, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలి తదితర రాష్ట్రాల రైతు సంఘాల నేతలు 100 మంది వరకు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం కూడా రైతుల సమావేశం కొనసాగనుంది. -
ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అటు.. అసెంబ్లీలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. -
ప్రగతిభవన్‌లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు (ఫొటోలు)
-
సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టిన అక్కలు, చెల్లి
సాక్షి, హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం సీఎం కేసీఆర్ నివాసంలో ఘనంగా వేడుకలు జరిగాయి. కేసీఆర్ అక్కాచెల్లెళ్ల రాకతో ప్రగతిభవన్‌లో సందడి నెలకొంది. ఇంటికి వచ్చిన తమ ఆడ బిడ్డలను సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ సాదరంగా, సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరుడికి రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. మంత్రి కేటీఆర్‌కు రాఖీ కడుతున్న కవిత. చిత్రంలో కేటీఆర్ సతీమణి శైలిమ తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసీఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారు తమ సోదరుడిని నిండు మనసుతో ఆశీర్వదించారు. అదే విధంగా కేటీఆర్, కవిత సీఎం కేసీఆర్ మనుమడు, మనుమరాలు కూడా రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ కూతురు అలేఖ్య తన అన్న హిమాన్షుకు రాఖీ కట్టింది. తమ మనుమడు, మనుమరాలును నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు దీవించారు. ఈ వేడుకల్లో మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతిభవన్ ఎదుట తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్యాయత్నం
పంజగుట్ట: తెలంగాణ ఉద్యమకారుడు గురువారం ప్రగతిభవన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి రక్షణ సిబ్బంది అడ్డుకుని అతన్ని పంజగుట్ట పోలీస్‌స్టేషన్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, రాయనిగూడెం గ్రామానికి చెందిన పిడమరితి నాగరాజు (27) తెలంగాణ ఉద్యమకారుడు. ఉద్యమ సమయంలో రైల్‌రోకోలో భాగంగా రైలు కింద పడి రెండు కాళ్లు, ఒక చెయ్యి పోగొట్టుకున్నాడు. ఇంత త్యాగం చేసినప్పటికీ తెలంగాణ వచ్చాక ఒక్క నాయకుడు కూడా పరామర్శించలేదని, ఏ ఆసరా చూపించలేదని ఆయన మనస్తాపానికి గురయ్యాడు. గురువారం సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో ప్రగతిభవన్ వద్దకు వచ్చాడు. ముఖ్యమంత్రిని కలవాలని కోరగా.. అప్పటికే మంత్రివర్గ సమావేశం జరుగుతుండడంతో అపాయింట్మెంట్ లేనందున ప్రవేశం లేదని సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో నాగరాజు వెంటతెచ్చుకున్న పెట్రోల్ పైన పోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన రక్షణ సిబ్బంది అతన్ని స్టేషన్‌కు తరలించారు. తనకు ప్రభుత్వోద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని నాగరాజు డిమాండ్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రగతిభవన్‌కు వికారాబాద్ పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో రోజుకో జిల్లాకు సంబంధించిన అసమ్మతి రాజకీయం ప్రగతిభవన్‌కు చేరుకుంటోంది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఆ నియోజకవర్గ నేతలు బుధవారం ప్రగతిభవన్ మెట్లెక్కారు. తాజాగా వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతలు తమ మధ్య విభేదాలు ఉన్నాయని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఈ నెల 16న వికారాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాలను ప్రారంభించి.. కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. తర్వా త బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కాలె యాదయ్య (చేవెళ్ల), మహేశ్వర్‌రెడ్డి (పరిగి), రోహిత్‌రెడ్డి (తాండూరు), పట్నం నరేందర్‌రెడ్డి (కొడంగల్) భేటీ అయ్యారు. అయితే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత ఈ సమావేశంలో పాల్గొనలేదు. సీఎంతో భేటీకి సంబంధించి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య సునీతకు సమాచారం లేనందునే హాజరుకాలేదని సమాచారం. సబితకు సభ బాధ్యతలు వికారాబాద్ సభకు జన సమీకరణ, పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యే కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు తదితరాల అంశాలపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్ల సమన్వయ బాధ్యతలను మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. తర్వాత సీఎంతో వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేశారు. కేటీఆర్‌తో మహేందర్‌రెడ్డి భేటీ కేసీఆర్తోభేటీకి హాజరుకాని పట్నం మహేం దర్‌రెడ్డి.. గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం భేటీకి వెళ్లకపోవడానికి కారణాలను చెప్పినట్టు తెలిసింది. వికారాబాద్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ల రాజీనామా చుట్టూ రాజకీయం జరుగుతోందని, కొత్త చైర్మన్ల ఎన్నిక కోసం ఆ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోద్బలంతో తెరవెనుక మంత్రాంగం సాగుతోందని మహేందర్‌రెడ్డి వివరించినట్టు సమాచారం. మరికొన్ని మున్సి పాలిటీల్లోనూ ఈ పరిస్థితి ఉందని.. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ల రాజీనామా తలనొప్పులు తెచ్చిపెడుతుందని కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. చదవండి: కేంద్ర ఆర్థిక దిగ్బంధాన్ని ఎండగడదాం! -
అసెంబ్లీ హాల్లో జయశంకర్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ హాల్లో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ పులమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసన మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్, శాసనసభ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, భానుప్రసాద్, తాతా మధు, దండే విఠల్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏడు రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ జిల్లాలో జూలై 7వ తేదీ నుంచి 7 రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ప్రగతి భవన్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్నాహక సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, కవులు, సాహితీవేత్తలను గౌరవించే విధంగా తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవాన్ని చాటేలా ‘కాకతీయ వైభవ సప్తాహం’ను నిర్వహించాలని ఆదేశించారు. కాకతీయుల వైభవాన్ని, ప్రతిష్టను పెంచేవిధంగా రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనేలా కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు భాగస్వాములు అయ్యేలా సాహితీ, సాంస్కృతిక, కళా కార్యక్రమాలను, మేధో చర్చలను రూపొందించాలన్నారు. విద్యార్థి, యువత కూడా ఉత్సాహంగా పాల్గొనేలా, అందరూ గర్వ పడేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, పండుగ వాతావరణం నెలకొనేలా విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. కాకతీయ వైభవ సప్తాహంను విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: దిశ ఎన్కౌంటర్: హైకోర్టుకు చేరిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక -
‘ప్రగతిభవన్’ పాదయాత్ర భగ్నం
అశ్వారావుపేటరూరల్/ములకలపల్లి: ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్‌కు చెప్పుకునేందుకు ప్రగతిభవన్‌కు పాదయాత్రగా బయలుదేరిన గిరిజనులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెం గిరిజనులు.. పాత పట్టాదారు పాసు పుస్తకాలున్న వారందరికీ డిజిటల్ పాసుబుక్కులు ఇవ్వాలని, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సర్వే నంబర్లు 30, 36, 39లోని పట్టాభూములను రైతులకు అప్పగించాలని, వెంకమ్మ చెరువు వరద కాలువ నిర్వాసితులకు ఎకరానికి రూ.8లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రగతిభవన్‌కు పాదయాత్రగా వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలవాలని నిర్ణయించారు. పోలీసులు, అధికారులు, టీఆర్ఎస్ నేతలు ఆదివారం రాత్రినుంచే నచ్చజెప్పచూసినా గిరిజనులు ఒప్పుకోలేదు. 120 మంది గ్రామస్తులు సోమవారం తెల్లవారుజామున పాదయాత్రను ప్రారంభించారు. రామన్నగూడెం నుంచి గంగారం చేరుకునేలోగా అశ్వారావుపేట సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు వచ్చారు. పాదయాత్ర విరమించాలని సూచించారు. గిరిజనులు వినకపోవడంతో అదుపులోకి తీసుకుంటుండగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పరస్పర దాడులతో ఆ ప్రాంతం రణరంగమైంది. ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు గిరిజన మహిళలపై లాఠీచార్జ్ చేశారు. రెండు డీసీఎం వ్యాన్లలో ఆందోళనకారులను బలవంతంగా ఎక్కించి ములకలపల్లి, కిన్నెరసాని పోలీస్స్టేషన్లకు తరలించారు. ‘చంటి బిడ్డతో ఉన్నానని చూడకుండా పోలీసులు నన్ను బలవంతంగా డీసీఎం వ్యాన్ ఎక్కించారు’ అని రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప బోరున విలపించారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎంపీపీ శ్రీరామ్మూర్తిలు తమపైకి పోలీసులను ఉసిగొల్పారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు తాటి వెంకటేశ్వర్లు ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. ములకలపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట నాలుగు గంటల పాటు రాస్తారోకో చేశారు. కాగా, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు.. అటవీ, రెవెన్యూ సిబ్బందితో జాయింట్ సర్వే చేయించి, వారంలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. అరెస్టయిన వారందరినీ పోలీసులు సాయంత్రానికి విడుదల చేశారు. -
క్రీడాకారులకు అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ క్రీడాకారులకు ఎల్లవేళలా అండగా ఉంటానని సీఎం కేసీఆర్ చెప్పారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించి, రేపటి తరాలను శారీకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్‌లను చూసి తెలంగాణ యువతీ యువకులు స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. నిఖత్, ఇషా సింగ్‌లతో పాటు వారి తల్లిదండ్రులను గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు ఆహ్వానించిన ఘనంగా సన్మానించి, ఆతిధ్యం ఇచ్చారు. వారితో కలిసి భోజనం చేశారు. కాసేపు ముచ్చటించారు. బాక్సింగ్ క్రీడపట్ల చిన్నతనం నుంచే మక్కువ చూపించడానికి గల కారణాలను, గోల్డ్ మెడల్ సాధించడానికి పడిన శ్రమను నిఖత్‌ను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, చేసిన ఆర్థిక సాయం తనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిందంటూ ధన్యవాదాలు తెలిపారు. నిఖత్ పట్టుదల, ఆత్మస్థైర్యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. మరొకసారి కేసీఆర్ ‘పంచ్’ 2014లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగదు బహుమతిగా తనకు రూ.50 లక్షల చెక్కును అందిస్తూ, తన అభ్యర్థన మేరకు సీఎం బాక్సింగ్ పంచ్ పోజిచ్చిన విషయాన్ని నిఖత్ గుర్తు చేశారు. ‘మీరిచ్చిన స్ఫూర్తితోనే ఇంతటి విజయాన్ని సాధించాను. నేను విజయంతో తిరిగి వచ్చినందుకు మరోసారి ఆరోజు మాదిరి పిడికిలి బిగించండి’అని సీఎంను కోరారు. ఆమె విన్నపాన్ని అంగీకరించిన కేసీఆర్ పిడికిలి బిగించి ఫొటో దిగారు. రూ.2 కోట్ల నగదు బహుమతిని అందించి, విలువైన నివాస స్థలాన్ని ఇస్తున్నందుకు ఆమె తల్లిదండ్రులు జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇషాతో కూడా సీఎం మాట్లాడారు. ఆమె తల్లిదండ్రు లు సచిన్ సింగ్, శ్రీలతను అభినందించారు. -
ఎనిమిదేళ్లలో ఎన్నెన్నో విజయాలు
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే ఘన విజయాలెన్నో కళ్లముందు సాక్షాత్కరిస్తాయని, 75 ఏళ్లలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అవతరించే నాటికి, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. రాష్ట్రం సాధించిన అభివృద్ధిపై ప్రసంగించారు. అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందన్నారు. సత్ఫలితాలిస్తున్న పథకాలు కరెంటు కష్టాలను అధిగమించి 24 గంటల సరఫరా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, రైతు రుణమాఫీ, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, చేపపిల్లల పెంపకం, గొర్రెల పంపిణీ, సెలూన్లు.. దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్, గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి పథకాలు, కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ కిట్, బస్తీ దవాఖానాలు, పల్లె/పట్టణ ప్రగతి, టీఎస్–ఐపాస్, భూరికార్డుల ప్రక్షాళన, ధరణి వంటివి కూడా మంచి ఫలితాల్నిచ్చా యని అన్నారు. ఎనిమిదేళ్ళలో లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలుపొందిన తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్‌కు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా రూ.2 కోట్ల నగదు బహుమతికి సంబంధించిన చెక్కును సీఎం అందజేసి సత్కరిం చారు. జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో స్వర్ణపతకం సాధించిన ఇషా సింగ్‌కు కూడా రూ.2 కోట్ల చెక్కును, పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న కిన్నెరమెట్ల మొగిలయ్యకు రూ.కోటి చెక్కును అందజేశారు. -
కేసీఆర్‌ను కలిసిన స్టార్ హీరో విజయ్
సాక్షి, హైదరాబాద్: తమిళ స్టార్ నటుడు విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిశారు. బుధవారం సాయంత్రం ప్రగతి భవన్‌కి వెళ్లి మరీ సీఎం కేసీఆర్‌ను కలిశారు విజయ్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, విజయ్ను సన్మానించారు. ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఇది మర్యాదపూర్వక భేటీగానే తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. విజయ్ తాజా చిత్రం బీస్ట్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదన్న విషయం తెలిసిందే. ఆయన హైదరాబాద్ ఎందుకు వచ్చారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. தெலங்கானா முதல்வர் சந்திரசேகர் ராவை சந்தித்தார் நடிகர் விஜய். Said to be casual meeting.@actorvijay | #ThalapathyVijay | #Vijay | #Thalapathy67 pic.twitter.com/FcBRObtsbJ — Aathiraa Anand (@AnandAathiraa) May 18, 2022 தெலங்கானா முதல்வர் சந்திரசேகர் ராவை சந்தித்தார் நடிகர் விஜய். Said to be casual meeting.@actorvijay | #ThalapathyVijay | #Vijay | #Thalapathy67 |@BussyAnand pic.twitter.com/b99gwdJGQ9 — மேலூர் தலைவா அய்யனார் (@melurvjayyanar) May 18, 2022 -
‘పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి’పై సీఎం సమీక్ష 18న
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈనెల 18న ప్రగతిభవన్‌లో ‘పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి’కార్యక్రమాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. సమీక్ష సమావేశంలో మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్‌బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డీపీవోలు, అటవీశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు పాల్గొంటారు. -
ప్రాంతీయపార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురువారం రాత్రి ప్రగతిభవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య దేశ రాజకీయాలు, వర్తమాన అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని, దీనికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి త్వరలో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాల్సిన అవసరముందని ఇరువురు అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరి, ఎన్నికల్లో లబ్ధిపొందడానికి రాష్ట్రాల్లో మత ఘర్షణలను రెచ్చగొట్టే ప్రయత్నాలు, మత ఘర్షణలతో పెట్టుబడుల రాకపై పడే దుష్ప్రభావాలు, విపక్షాలపై కక్ష సాధింపు కోసం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి విభాగాల దుర్వినియోగం, గవర్నర్లు సృష్టిస్తున్న ఇబ్బందులు వంటి అంశాలపై చర్చించినట్టు సమాచారం. మూడు రోజులు ఇక్కడే... తల్లి వైద్యం కోసం గురువారం రాష్ట్రానికి చేరుకున్న హేమంత్ సోరెన్ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో ఉండనున్నారు. రాష్ట్ర అతిథిగా ఆయనకు నగరంలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం బస ఏర్పాటు చేసింది. శుక్రవారం ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి శనివారం తిరిగి రానున్నారు. శనివారం రాత్రి ఇక్కడే హోటల్లోనే బస చేస్తారు. ఆదివారం సోరెన్ రాంచీకి తిరిగి వెళ్లే అవకాశం ఉంది. -
కేసీఆర్‌కు రాజయోగమే
సాక్షి, హైదరాబాద్: ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశిలో జన్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సంవత్సరం చాలా బాగుంటుందని శృంగేరీ ఆస్థాన పండితులు, పౌరాణికులు బాచంపల్లి సంతోషకుమార్ శాస్త్రి తెలిపారు. ‘రాహులో రవి అంతర్దశ ఫిబ్రవరి 27తో ముగిసింది. అనుకూలం కాని సమయం ముగిసిపోయింది. ఇక గుహ నుంచి బయటకు వచ్చుడే తర్వాయి అన్నట్టుగా ఉంటుంది. జాతక బలం గతేడాది కంటే మెరుగ్గా ఉంటుంది. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంది. శని గోచారం వల్ల ప్రత్యర్థులు నిరంతరం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా వారికి ఏమాత్రం సందివ్వకుండా వారినే ఆక్రమించేలా ముందుకు సాగుతారు. దేశం మొత్తం కూడా దృష్టి సారించదగ్గ సాహసోపేత నిర్ణయాలను కేసీఆర్ తీసుకుంటారు. విశ్వరూపమే చూపిస్తారు..’అని చెప్పారు. ఈ ఏడాది కరోనా భయం ఉండదని, శుభకృత్ నామ సంవత్సరంలో మానవాళి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. శుభకృత్ నామ ఉగాది సందర్భంగా శనివారం ప్రగతి భవన్లో ప్రభుత్వపరంగా నిర్వహించిన వేడుకల్లో బాచంపల్లి పంచాంగాన్ని పఠించి వివరించారు. అద్భుత పాలన చూస్తాం ‘తృతీయాధిపతి రవి రాజ్యస్థానంలో ఉండటం వల్ల మందీ మార్బలం, వాగ్ధాటి ఉన్నవారిదే ఇక హవా. జాతక రీత్యా పంటలతో పాటు తెలంగాణలో అద్భుత పాలనను మనం ఈ సంవత్సరం చూస్తాం. దేశం దృష్టి తెలంగాణపై పడేలా రాష్ట్రం పురోగమిస్తుంది. చక్కటి పాలనతో ముఖ్యమంత్రి కేసీఆర్ రంజింపజేస్తారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్ రూపంలో మూడో కన్ను ఉంది. ఎవరు ఎవరిని కలుస్తున్నారో తెలుసుకుంటూనే ఉంటారు. పార్టీలు మారే వారికి గడ్డుకాలం..’అని చెప్పారు. మంచి వానలు, పంటలతో రైతు రాజ్యం ‘మంచి వానలు, మంచి పంటలతో రైతు రాజ్యం వెల్లివిరుస్తుంది. కర్షక ప్రజాస్వామ్యం కోరుకుంటున్నందున, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణలో రైతులే రాజులు కానున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు వానలకు ఇబ్బంది లేనట్టే ఈ యేడు కూడా మంచి వానలు కురుస్తాయి. వరి, గోధుమలు, వేరుశనగలు, ధనియాలు, జొన్న, రబీ పంటలు అద్భుతంగా పండుతాయి. మొక్కజొన్న, రాగి, కందులు, నువ్వులు, ఇతర పప్పు ధాన్యాలు లాంటి పంటలకు కొంత ఇబ్బంది తప్పదు. శ్రావణ, భాద్రపద ఆశ్వయుజ మాసాల్లో భారీ వర్షాలు కురుస్తాయి..’అని బాచంపల్లి తెలిపారు. మహిళకు దేశంలో అత్యున్నత పదవి ‘విద్యారంగంలో సంస్కరణలు, కొత్త విధివిధానాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయి. తెలంగాణ నిరుద్యోగుల కలలు నెరవేరబోతున్నాయి. దీన్ని ఉద్యోగనామ సంవత్సరంగా భావించొచ్చు. దేశంలో అత్యున్నత పదవి మహిళకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సంవత్సరం వేములవాడ రాజరాజేశ్వరుడి ప్రభ వెలగబోనుంది. ప్రజలకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వృద్ధి చేసే ఉత్సవాలతో సంవత్సరం గడుస్తుంది. ఆన్లైన్ క్లాసులుండవు, బడి గంటలే వినిపిస్తాయి. ఆర్టీపీసీఆర్ టెస్టులు, మాస్కుల అవసరం ఉండదు. ఆనందంగా ఊపిరి పీల్చుకోవచ్చు..’అని చెప్పారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు. ‘సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొంత పెరుగుతాయి. రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. ఏప్రిల్, మేలలో ముఖ్యనేతలకు భద్రతాపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మత ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకుంటాయి. పాకిస్తాన్‌తో దౌత్యపరమైన యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. హైదరాబాద్ వరకు రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుండగా, మిగతా ప్రాంతాల్లో అనుకూలంగా ఉండదు. యావత్ భారతదేశం దృష్టి హైదరాబాద్ మీదే ఉంటుంది..’అని వివరించారు. -
Ugadi 2022: మనమే మార్గదర్శి
విద్య, విద్యుత్తు, విద్వత్తు, తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం.. ఇలా చదివితే చాంతాడంత లిస్టు అయ్యేన్ని రంగాల్లో తెలంగాణ ముందుంది. కొన్ని దుష్టశక్తులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా.. తెలంగాణ ప్రజలు ఏకోన్ముఖంగా ముందుకు కలిసిరావటం వల్లనే ఈ పురోగతి సాధ్యమైంది. ప్రజల అండ, భగవంతుడి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కలగటం వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతృప్తి నిచ్చింది. మనకు జాతి, కులం, మతం భేదం లేదు. తెలంగాణ జాతి అంతా ఒకటే. అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. మన బంగారు తెలంగాణ స్వప్నం నిజం కావాలి. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం సాధించనంత అద్భుత ఫలితాలు ఎన్నిం టినో తెలంగాణ సాధించి చూపిందని సీఎం కె.చంద్రశేఖరరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో కరెంటు కష్టాలు, తాగునీరు, సాగునీటి వసతి.. తదితరాలపై ఎన్నో సందేహాలు, అనుమానాలు రేకెత్తించారన్నారు. వాటన్నింటినీ అధిగమించి తెలంగాణ దేశంలోనే వేగంగా ప్రగతిపథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధి పథంలో ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లాంటి రాష్ట్రాల కంటే ముందు వరసలో ఉండి అభివృద్ధి దిశలో పరుగుపెడుతోందన్నారు. కుల, మత, వర్గ భేదాలకతీతంగా, అన్ని వర్గాల సహకారంతో తెలం గాణ గొప్పగా రాణిస్తోందని, ఎలాంటి పథకంలోనైనా యావత్తు దేశం తెలంగాణను చూసి నేర్చుకోవాల్సిన స్థితికి చేరిందని చెప్పారు. శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. శృంగేరీ ఆస్థాన పౌరాణికులు బాచంపల్లి సంతోష్‌కుమారశాస్త్రి పంచాంగాన్ని పఠించారు. అనంతరం సీఎం యావత్తు తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగానికి ఉపక్రమించగానే ‘లాంగ్‌లివ్ కేసీఆర్’ అంటూ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. సమైక్య రాష్ట్రాన్ని మించి ఆదాయం ‘పంచాంగ పఠనం సందర్భంలో పౌరాణికులు కొన్ని మంచి మాటలు చెప్పారు. ఇక మాస్కుల్లేవు, ఆర్టీపీసీఆర్ లేదు, పీసీఆర్ లేదు.. వాటి గొడవే లేదంటూ శుభం పలికారు. చాలా సంతోషం. సర్వజనులకు శుభకృత్ నామ సంవత్సరంలో సుఖ శాంతి ఐశ్వర్యాలు కలగాలని భగవంతుడిని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. అపోహలు, అనుమానాలు, అసహాయతలు, నిస్సహాయతలు, ఔతుందా కాదా అన్న సందిగ్ధం, చర్చోప చర్చల మధ్య 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రస్తుతం అన్నిరంగాల్లో ముందున్నాం. గత ఏడాది రాష్ట్రం రూ.1,77,630 కోట్ల ఆదాయాన్ని సాధించినట్టుగా రిజర్వు బ్యాంకు తేల్చిందని అధికారులు చెప్పారు. 23 జిల్లాల సమైక్య రాష్ట్రాన్ని మనం ఎప్పుడో దాటిపోయామని, అంతకుమించిన ఆదాయాన్ని సాధిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ కలిసి రావడం వల్లే ఈ విధంగా ఎంతో సంపద సృష్టించాం. ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి పోయి పరిశీలించినా ఎకరం రూ.25 లక్షలు, రూ.30 లక్షల లోపు లేదు. మరి ఈ సంపద ఎలా సృష్టించగలిగాం. ఇది ఒక్క అధికారుల ఘనతే కాదు, అనేక అంశాలు కలిసి రావటంతోనే ఇది సాధ్యమైంది..’అని కేసీఆర్ చెప్పారు. దళిత బంధుతో అద్భుతాలు ‘దళితుల జీవితాలు మార్చేందుకు తెచ్చిన దళిత బంధు అద్భుతాలు ఆవిష్కరించబోతోంది. దళిత జాతి వజ్రాలు అద్భుత ఫలితాలు సాధించబోతున్నారు. దేశానికే కొత్త మార్గనిర్దేశం ఇచ్చే దిశగా తెలంగాణ నిలవబోతోందని శుభకృత్ సంవత్సరం తొలిరోజు నేను సంకల్పిస్తున్నాను. ఎన్నికల కోసం, రాజకీయ స్టంట్ల కోసం కాకుండా ఈ విషయంలో ఎవరూ చేయని సాహసాన్ని మనస్ఫూర్తిగా చేశాను. దళితుల సంక్షేమం విషయంలో ఇప్పుడు యావత్తు దేశం తెలంగాణ నుంచే నేర్చుకునే పరిస్థితి కల్పించాం. ఇదొక్కటే కాదు.. ఏ పథకం అయినా దేశం మొత్తం తెలంగాణ నుంచే నేర్చుకునేలా చేశాం..’అని అన్నారు. అన్ని వర్గాల సమున్నతికి కృషి ‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్ ఏనాడూ రూ.10 వేల కోట్లు కూడా దాటలేదు. తాజా బడ్జెట్‌ను మనం రూ.రెండున్నర లక్షల కోట్లుగా పెట్టుకున్నాం. 95 శాతం ఉద్యోగాలు మనకే వచ్చేలా కొత్త విధానాన్ని ఇటీవలే ఆవిష్కరించుకున్నాం. వివక్ష లేకుండా అన్ని వర్గాల సమున్నతి కోసం యత్నిస్తున్నాం. అద్భుత, అపురూప, ఆర్థిక సౌష్టవంతో, సంస్కారంతో, సర్వమత సామరస్యంతో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది. దీనికి ఎక్కడా అపశృతి రాకుండా ఇంకా గొప్పగా, ఉజ్వలంగా దేశానికే అన్నంపెట్టే విధంగా ముందుకు సాగాలని, తెలంగాణ రైతుల కష్టం ఫలించాలని, అద్భుతంగా పంటలు పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, మన సామూహిక స్వప్నం బంగారు తెలంగాణ నిజం కావాలని కోరుకుంటున్నా..’అని సీఎం చెప్పారు. బ్రాహ్మణులకు సత్కారాలు, వసతులు ‘బ్రాహ్మణులు దేశంలో ఎక్కడా లేనివిధంగా వారి స్థాయికి తగ్గట్టు సత్కారాలు, వసతులు తెలంగాణలో పొందుతున్నారని కాలర్ ఎగరేసి చెప్పగలను. బంజారాహిల్స్‌లో కట్టిన బ్రాహ్మణ సదనాన్ని త్వరలో ప్రారంభిస్తాం. ఆధ్యాత్మిక రంగంలో తెలంగాణ దేనికీ తీసిపోదు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దాం. సర్వజనుల సంక్షేమం కోసం పరితప్పిస్తున్న మనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరి అభ్యుదయం మనందరి అభిమతం అయ్యేలా ఆశీర్వదించాలని దేవదేవుడిని కోరుకుంటున్నా..’అని కేసీఆర్ తెలిపారు. పంచాంగం ఆవిష్కరణ కాగా కృష్ణమాచార్య రూపొందించిన పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించారు. వారిని ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన ‘మా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం’పుస్తకాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. -
ప్రగతి భవన్‌పై నీలిరంగు జెండా
జఫర్‌గఢ్: ప్రగతిభవన్‌పై నీలిరంగు జెండా ఎగురవేయాలన్నదే తమ లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. బహుజన రాజాధికార యాత్ర స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల, జఫర్‌గఢ్ , పాలకుర్తి మండలాల్లో ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, రాష్ట్రం బాధల తెలంగాణగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం కేసీఆర్ తన కుటుంబాన్నే బంగారంగా మార్చుకున్నారని ఆరోపించారు. బీఎస్పీ ద్వారానే బడుగుల జీవితాలు బాగుపడుతాయని తెలిపారు. రానున్న బహుజన రాజ్యంలో అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అందుతుందని, రానున్న రోజుల్లో పేదింటి విద్యార్థులే ఈ దేశాన్ని శాసిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
CM KCR Health: అంతా ఓకే.. విశ్రాంతి చాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 8 గంటల సమయంలో నీరసం, ఎడమచేయి నొప్పితో కేసీఆర్ ఇబ్బందిపడుతున్నట్టుగా సోమాజిగూడ యశోద ఆస్పత్రికి ఫోన్ వచ్చింది. దీనితో ఆస్పత్రి వైద్యులు ప్రగతిభవన్‌కు వెళ్లి పరీక్షించారు. ఆస్పత్రికి వచ్చి సాధారణ టెస్టులతోపాటు ముందుజాగ్రత్త పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించడంతో.. సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి ప్రగతిభవన్‌కు వెళ్లిపోయారు. సీఎం ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్న డాక్టర్ ప్రమోద్‌కుమార్. చిత్రంలో డాక్టర్ విష్ణురెడ్డి, డాక్టర్ ఎంవీ రావు నరంపై ఒత్తిడితో.. సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్య వల్ల కేసీఆర్ ఎడమ చేతి నొప్పితో బాధపడుతున్నట్టు గుర్తించామని ఆ యన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. ఎడ మ చేయికి వెళ్లే నరంపై ఒత్తిడి పడటంతో ఇలా నొప్పి వస్తుందన్నారు. పత్రికలు చదవడం, ఐ– ప్యాడ్ వాడే అలవాటు ఉండటంతోపాటు వయసు రీత్యా నొప్పి వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇది మినహా ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్నారు. కేసీఆర్‌కు పరీక్షలు చేసిన ఆస్పత్రి చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ విష్ణురెడ్డి, చీఫ్ కార్డియాలజీ డాక్టర్ ప్రమోద్ కుమా ర్తో కలిసి ఎంవీ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయినట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదన్నారు. అన్నీ నియంత్రణలోనే..: సీఎం కేసీఆర్‌కు ఏటా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ఈసారి పరీక్షల సమ యం కూడా ఆసన్నమైందని ఎంవీరావు తెలిపారు. 90శాతం పరీక్షల నివేదికలు వచ్చాయని, సీఎం ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ధారించామని చెప్పారు. యాంజియోగ్రామ్ నార్మల్ వచ్చిందని.. రక్తంలో హిమోగ్లోబిన్, కిడ్నీ, లివర్ ఫంక్షన్, కొలెస్ట్రాల్ అన్నీ బాగున్నాయన్నారు. బీపీ, మధుమేహం నియంత్రణలోనే ఉన్నాయన్నారు. అల్ట్రాసౌండ్ పరీక్షలు సైతం చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఈ మధ్య వరుస పర్యటనలు, బిజీ షెడ్యూల్స్కు తోడు ఎండాకాలం వల్ల నీరసానికి గురైనట్టు గుర్తించామని.. వారం పాటు విశ్రాంతి అవసరమని సూచించామని చెప్పారు. కేసీఆర్‌కు యాంజియో గ్రామ్ తర్వాత.. కళ్లు తిరుగుతాయనే ఉద్దేశంతో బెడ్‌పై పడుకోబెట్టి వార్డులోకి తీసుకెళ్లా మని వివరించారు. విశ్రాంతి తర్వాత కేసీఆర్ మళ్లీ అన్ని పనులు చేస్తారని ఎంవీరావు పేర్కొన్నారు. సీఎం గుండె పదిలమే.. కేసీఆర్‌కు ఎడమ చేతి నొప్పిరావడంతో.. కరోనరీ ఆర్టరీస్‌లో (గుండెకు రక్తం సరఫరా చేసే ధమనుల్లో) రక్తం గడ్డకట్టి ఉంటుందేమోనని యాంజి యోగ్రామ్ నిర్వహించాం. అదృష్టవశాత్తు ఎలాం టి బ్లాక్‌లు లేవని గుర్తించాం. గుండె పనితీరు తెలుసుకోవడానికి నిర్వహించిన ఈసీజీ, 2డీ ఎకో టెస్టుల ఫలితాలు బాగా వచ్చాయి. గుండెకు సంబంధించి సీఎంకు ఎలాంటి సమస్యా లేదని నిర్ధారించాం. ఎడమచేతి నొప్పి వెనుక కారణమేంటో తెలుసుకోవడానికి మెడ, మెదడుకు సంబంధించిన ఎంఆర్ఐ టెస్టులు నిర్వహించాం. వైద్యులందరం కూర్చుని పరిశీలించి.. సర్వైకల్ స్పాండిలోసిస్ కారణమని తేల్చాం. – ప్రమోద్‌కుమార్, చీఫ్ కార్డియాలజిస్ట్, యశోద ఆస్పత్రి -
ప్రగతి భవన్.. కేసీఆర్ జైలుఖానా
సంగారెడ్డి అర్బన్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం కేసీఆర్‌కు ప్రగతి భవన్ జైలు ఖానా అయ్యిందని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో టీజేఎస్ ద్వితీయ ప్లీనరీని జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోదండరాం మాట్లాడుతూ ప్రగతి భవన్ పాలన కొనసాగడం విడ్డూరంగా ఉందన్నారు. పేదల భూములు దోచి పెద్దలకు అప్పగించడం సరికాదన్నారు. పరిశ్రమల ముసుగులో ప్రభుత్వం భూముల అక్రమ దందా చేస్తోందని, నిమ్జ్ భూసేకరణను ఆపాలని డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యా యని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎత్తిపోతల కంటే 10 వేల ఎకరాలు నీట మునగడం బాధాకరమన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ కాలుష్యం, బూడిదతో నీళ్లు కలుషితం కావడంతో ఆ ప్రాంత ప్రజలు కిడ్నీ, ఉదరకోశ వ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పగించడం సరికాదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పరాయివాళ్లమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు చెప్పారు. -
బీజేపీ పోతేనే దేశం బాగుండు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతోందని.. ఎక్కడ చూసినా అవినీతిమయంగా మారిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగి, పారిశ్రామిక ఉత్పత్తి శరవేగంగా పడిపోతోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ చెప్తున్న అబద్ధాలతో దేశం పరువు పోతోందని.. బీజేపీ పోతేనే దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో పార్టీ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, రంజిత్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరు, ప్రధాని మోదీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పలు జాతీయ అంశాలు, రాజకీయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టారు. కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. విద్యుత్ సంస్కరణల పేరిట రాజ్యాంగ ఉల్లంఘన మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. విద్యుత్ సంస్కరణల బిల్లు ఆమోదం పొందక ముందే అమలు చేయడం పార్లమెంటుకు అవమానం. ప్రతిపాదిత సంస్కరణలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే.. ఐదేళ్లపాటు 0.5 శాతం అదనపు ఎఫ్ఆర్బీఎం పరిమితి ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఏడాదిలోపు అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టడంతోపాటు మూడేళ్లలో అన్ని కనెక్షన్లకు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని చెప్తోంది. కేంద్రం ఒత్తిడితో పొరుగు రాష్ట్రంలో ఇప్పటికే 25వేల మీటర్లు పెట్టారు. అదనపు ఎఫ్ఆర్బీఎంతో రాష్ట్రానికి ఏటా రూ.5వేల కోట్లకుపైగా అదనంగా నిధులు అందుతాయి. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు నష్టపోయినా సరేనని.. రాష్ట్రంలో వ్యవసాయానికి మీటర్లు పెట్టబోమని తెగేసి చెప్పాం. సంస్కరణలు అమలు చేస్తే లాండ్రీలు, బార్బర్ షాప్‌లు, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర రంగాలకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలపై ప్రభావం పడుతుంది. విద్యుత్ రేట్లపై పచ్చి అబద్ధాలు గజ్వేల్‌లో మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ విద్యుత్ ధరలపై పచ్చి అబద్ధాలు చెప్పారు. యూనిట్ విద్యుత్‌ను రూపాయి పది పైసలకే ఇస్తున్నామని చెప్పి దేశ ప్రజలను మోసం చేశారు. దేశంలో 40వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న విద్యుత్ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు వాటిలో ఉత్పత్తి జరపడం లేదు. పైగా బీజేపీకి చందాలు ఇచ్చే వారి కోసం సౌర విద్యుత్ కొనాలని ఒత్తిడి చేస్తున్నారు. తెలంగాణలో 2,500 మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులో ఉన్నా.. సోలార్ పవర్ కొనాలంటున్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వొద్దంటూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. సింగరేణిని కూడా రక్షించుకోవాలి. కేంద్రానికి అంతగా ఇష్టం లేకుంటే మీ వాటా 49శాతం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామని ఇప్పటికే చెప్పాం. బీజేపీ అబద్ధాలతో పరువుకు దెబ్బ వాట్సాప్ యూనివర్సిటీలో బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారంతో దేశం పరువు పోతోంది. దేశంలోని రాజకీయ పార్టీలు, నాయకులకు వ్యతిరేకంగా విష ప్రచారం జరుగుతోంది. వీటిపై హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లోనూ చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ అబద్ధాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. ఆయన అసలు రూపాన్ని బయటపెడుతూ అనేక పుస్తకాలు వస్తున్నాయి. దొంగలను దేశం దాటించడమే దేశభక్తా? మోదీ ప్రభుత్వం పేదలకు సబ్సిడీ బంద్ పెట్టి గజదొంగలకు పంచిపెట్టింది. బీజేపీ çహయాంలో 33 మంది ఆర్థిక నేరస్తులు సీబీఐ కేసులు పెట్టిన తర్వాత విదేశాలకు పారిపోయారు. లండన్‌లో పిక్నిక్ చేసుకుంటున్నరు. వాళ్లంతా మోదీ దోస్తులే. గుజరాతీలే. మీ దేశభక్తికి ఇదా తార్కాణం? గెలవకున్నా సిగ్గులేకుండా పరిపాలన ప్రజా నిర్ణయాలను గౌరవించే సంస్కారం లేని అప్రజాస్వామికమైన ప్రభుత్వం మోదీది. ప్రతిపక్షాల పట్ల అసహన వైఖరి. ఓడిపోతే అంగీకరించకపోవడం. ఈడీ, సీబీఐని దింపడం. మందిని ఆగమాగం చేయడం. ఎన్నికల్లో గెలవకపోయినా పాలన చేసే సిగ్గులేని ఒకే ఒక పార్టీ బీజేపీ. కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్‌లో గెలవకున్నా పరిపాలిస్తున్నరు. మహారాష్ట్రలో ఆ పని చేయబోయి పరువు తీసుకున్నరు. తప్పు చేయడం.. క్షమాపణలు కోరడం.. యూపీ ఎన్నికల్లో డబ్బాల్లో ఓట్లు పడిన తెల్లారే పెట్రోల్ ధరలు పెంచుతరు. వాళ్ల ఏ విధానం బాగోలేదు. వ్యవసాయ చట్టాలను ఎందుకు ఉపసంహరించుకున్నరు? రైతులకు క్షమాపణ ఎందుకు చెప్పారు? ప్రధాని మోదీకి క్షమాపణ కోరే అలవాటుంది. ప్రధాని అయితే గోద్రా అల్లర్లు వంటివి దేశంలో కూడా చేస్తావా అని జనం అడిగితే.. అప్పుడు ముస్లింలను క్షమాపణ కోరిండు. దేశంలో మళ్లీ అలా జరగవని చెప్పిండు. మతం పేరుతో ద్వేషపు మంటలు బీజేపీ వాళ్లు వాడే భాష అత్యంత బాధాకరం. దేశంలో ఎవరినీ గౌరవించరు. తిడ్తరు. దూషిస్తరు. మన బెంగళూరు, కర్ణాటకలో ఏం జరుగుతుందో యువత ఆలోచించాలి. అక్కడ యువతీయువకులను ద్వేషం నేర్పుతున్నారు. దేశం ఎక్కడికిపోతోంది? ఇలాంటివి ప్రేరేపిస్తే ఏమవుతుంది? కర్ణాటకలోని దౌర్భాగ్యం దేశవ్యాప్తంగా చెలరేగితే పరిస్థితితేమిటి? ఏడేళ్లు కష్టపడి తెలంగాణలో అభివృద్ధి, సామరస్యత తీసుకువచ్చాం. పెట్టుబడులు, ఉద్యోగవకాశాలు పెరిగాయి. ఇంత మంచి వాతావరణం మత ఘర్షణలతో దెబ్బతింటే ఇక్కడ పెట్టుబడులకు ఎవరొస్తారు? కాంగ్రెస్ వాళ్లందరూ అర్బన్ నక్సలైట్లుగా మారారని అని సాక్షాత్తు ప్రధాని మోదీ పార్లమెంట్లో చెప్పేవరకు ఈ ద్వేషంవెళ్లింది. క్షమాపణ చెప్పాల్సిందే.. రాహుల్‌గాంధీ తాత దేశ స్వాతంత్య్రం కోసం ఏళ్ల తరబడి జైళ్లలో గడిపారు. వాళ్ల నాయనమ్మ (ఇందిరా గాంధీ), తండ్రి (రాజీవ్ గాంధీ) దేశం కోసం ప్రాణాలిచ్చారు. అలాంటి చరిత్ర గల కుటుంబాన్ని పట్టుకుని అసోం సీఎం నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఈ విషయంలో క్షమాపణ చెప్పే వరకు బీజేపీని వెంటాడుతాం. ఇది బీజేపీ సంస్కృతా? ఏ తండ్రికి పుట్టావు వంటి మాటలను బీజేపీ ఎలా ప్రోత్సహిస్తది? కాంగ్రెస్‌తో పొత్తు కోసం కాదు ఇది అంటున్నది. రాహుల్‌గాంధీపై వేసిన నిందను వ్యతిరేకించిన. భవిష్యత్తులో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడంపై ఇప్పుడే ఊహించలేను. గవర్నర్ల వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని సర్కారియా కమిషన్ చెప్పింది. బీజేపీ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువగా దుర్వినియోగం అవుతోంది. నా ఇంట్లో ఇద్దరు వ్యక్తులు కరోనా బారినపడటంతోనే రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానిని ఆహ్వానించడానికి వెళ్లలేదు. రఫేల్‌పై సుప్రీంలో కేసుపెడతాం! నన్ను జైలుకు పంపిస్తామంటున్నారు. రండి.. దమ్ముంటే జైల్లో వేయాలి? అవినీతి, అక్రమ సంపాదన చేసినోడికి భయం. నువ్వు మమ్మల్ని వేసేదేంది? మిమ్మల్ని వేసేది పక్కా. భయంకరమైన అవినీతి చిట్టా ఉంది. మొత్తం బద్దలు కొడ్తం. రఫేల్ డీల్‌పై రాహుల్ గాంధీ మాట్లాడితే తప్పుపట్టారు. క్లీన్చిట్ తీసుకున్నట్టు చెప్పుకున్నరు. ఇన్నేళ్లకు అసలు దొంగతనం బయటపడుతోంది. రఫేల్ డీల్‌లో మోదీ ప్రభుత్వం వేల కోట్లు దిగమింగింది. మన దేశం 36 రఫేల్ జెట్స్‌ను మన దేశం 9.4 బిలియన్ డాలర్లకు కొంటుంటే.. నిన్న ఇండోనేషియా 42 రఫేల్ జెట్లను 8 బిలియన్ డాలర్లకే కొన్నది. ఈ కుంభకోణం బయటపడాలి. ఎవరు జైలుకు వెళ్లాలో వారు వెళ్లాలి. దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. ఇదొక్కటే కాదు చాలా ఉన్నయి నా దగ్గర. మోదీది తుపాకీ రాముడి ప్రగతి 2025 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవుతుందని వడ్డీ వ్యాపారులు, గుమస్తాలు కూడా లెక్కలు చెప్పగలరు. మోదీది తుపాకీ రాముడి ప్రగతి. దేశాన్ని నడిపే పద్ధతి ఇదికాదు. ప్రధానికి వినూత్న నైపుణ్యాలు, మంచి ప్రభుత్వం ఉంటే.. చైనా, సింగపూర్ తరహాలో అభివృద్ధి సాధించండి. బీజేపీని తరిమి కొడితే దేశం బాగుపడతుంది. యాదాద్రికి పిలవడంపై ఆలోచిస్తాం తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని చాలా దుర్మార్గమైన కామెంట్ చేశారు. తెలంగాణ, ఏపీని ఆదుకున్నది మాత్రం లేదు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ఆయన్ను ఆహ్వానించే అంశంపై ఆలోచిస్తాం. -
ట్రెసా డైరీని ఆవిష్కరించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)రెవెన్యూ డైరీని సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతం కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నె ప్రభాకర్, నిరంజన్, బోనాల రామ్‌రెడ్డి, శైలజ, నిరంజన్ తదితరులు పాలొన్నారు. -
తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే గొప్ప లౌకిక రాష్ట్రంగా తెలంగాణ ముందుకెళ్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతోపాటు పలు అంశాల్లో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ యజ్ఞయాగాలు చేస్తున్నా, యాదాద్రి ఆలయాన్ని గొప్పగా నిర్మిస్తున్నా, అన్ని కులాలు, మతాలు, వర్గాలపట్ల ఏ మాత్రం వివక్ష కనబర్చకుండా సమదృష్టితో ముందుకు సాగుతున్నారని అన్నారు. పలువురు క్రిస్టియన్ ప్రముఖులు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఏడున్నరేళ్ల ఈ చిన్న రాష్ట్రంలో శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, వాతావరణంపట్ల ఆకర్షితులైన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం పైసా నిధులివ్వకుండా, కేవలం మాటలు, ప్రశంసలతోనే కాలం వెళ్లదీయడమేకాకుండా పలు విషయాల్లో అడ్డుతగులుతోందని విమర్శించారు. కేటీఆర్‌ను కలిసినవారిలో ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, స్టీఫెన్సన్, ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఫుడ్ కమిషన్ సభ్యుడు ఆనంద్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎం.డి. కాంతివెస్లీ తదితరులు ఉన్నారు. -
317 జీవోపై ఆగని పోరు
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: జోనల్ విధానం అమలు కోసం ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోపై ఉపాధ్యాయుల వ్యతిరేకత రోజురోజుకూ పెరగుతోంది. పలు సంఘాలు సోమవారం వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలిపాయి. సీనియారిటీ ప్రాతిపదికగా కేటాయింపులు చేయడం, భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే ఆప్షన్లను పరిగణలోనికి తీసుకోకపోవడంపై టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలకు కేటాయించినా ఆ జిల్లాల్లో పట్టణ ప్రాంతాలకు సమీపంలోని స్కూళ్లను బ్లాక్ చేశారని, దీంతో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పలువురు నేతల వద్ద వాపోయారు. జీవోకు వ్య తిరేకంగా ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని యూటీ ఎఫ్ సహా పలు సంఘాలు నిర్ణయించాయి. టీచర్ల అరెస్ట్: సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం నేతలు కరివేద మహిపాల్‌రెడ్డి, అరికెల వెంకటేశం నేతృత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు ప్రయత్నించారు. దీంతో ఎస్జీటీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను సంఘం నేతలు కలిసి 317 జీవో వల్ల తమకు కలిగే అసౌకర్యాన్ని వివరించారు. ఇదెక్కడి అన్యాయం?: బాధిత ఉద్యోగులు 317 జీవో అమలులో స్పౌజ్ కేసులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. వేర్వేరుగా బదిలీ అయిన భార్యాభర్తల ఉద్యోగులు తమ ఆందోళనను మీడియాకు వివరించారు. 33 జిల్లాల్లో కేవలం 19 జిల్లాల్లోనే భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టులు ఇచ్చారని, 13 జిల్లాల్లో పోస్టులు బ్లాక్ చేసి, భార్యభర్తలను వేర్వేరు ప్రాంతాలకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. భారీ పోలీసు బందోబస్తు: 13 జిల్లాల స్పౌజ్ బాధితులు సుమారు 150 మందికి పైగా ప్రెస్‌క్లబ్‌కు రావడంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో వీళ్లంతా ప్రెస్‌క్లబ్ నుండి ప్రగతిభవన్ వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు. 8 నెలల బాబుతో ఎలా ఉండాలి? నాకు యాదాద్రి జిల్లాకు బదిలీ అవగా నా భర్త అనిల్‌కు రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. 250 కిలోమీటర్ల దూరం. నాకు 8 నెలల బాబు ఉన్నాడు. చిన్న పిల్లాడితో భర్త ఒకచోట, నేను ఒకచోట ఎలా ఉంటాం? – సుమ చాలా ఇబ్బంది పడుతున్నాం నేను పదేళ్లుగా గద్వాల జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్నా. నాకు అదే గద్వాలకు పోస్టింగ్ ఇచ్చి నా భర్తకు రంగారెడ్డి జిల్లాకు ఇచ్చారు. ఇద్దరు అమ్మయిలు వారానికోసారి ఇంటికి వచ్చి వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణం చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. అత్తమామను చూసుకోలేకపోతున్నాం. – భార్యాభర్తలు పద్మ, శంకర్ -
ప్రగతి భవన్ వద్ద టెన్షన్.. కంటతడి పెట్టిన టీచర్లు
-
బాపూ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
కవాడిగూడ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన సంవత్సర బాపూ డైరీనీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రగతిభవన్‌లో గురువారం ఆవిష్కరించారు. అనంతరం గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ వడ్ల సుబ్రమణ్యం మాట్లాడుతూ... తమ డైరీలో ఐక్యరాజ్య సమితి సూచించిన 17 స్థిర అభివృద్ధి లక్ష్యాలను పొందుపరిచినట్లు వెల్లడించారు. గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సంస్థ ప్రతినిధుల కృషిని మంత్రి కేటీఆర్ అభినందించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని గోశాలలో నిర్వహిస్తున్న రామచంద్ర ప్రకృతి ఆశ్రమానికి హాజరు కావాలని మంత్రి కేటీఆర్‌ను కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి, ఆశ్రమానికి వస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల కార్యదర్శి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డిగ్రీ కళాశాల సంఘం అధ్యక్షుడు ఎస్.వి.సి.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. -
జట్టు కట్టి.. బీజేపీ కట్టడి..
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని నిలువరించేందుకు లౌకికవాద, ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ దిశగా పావులు కదుపుతున్న సీఎం, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదిశగా మరో అడుగు ముందుకేశారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ నేతృత్వం లోని బృందంతో మంగళవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి, సం క్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న విచ్ఛిన్నకర, అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ తక్షణమే ఏకం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతులు సహా వివిధ వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని గద్దె దించేంత వరకు జరగాల్సిన పోరాటంపై త్వరలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో కీలకమైన ఓ మంత్రి ఆ పదవితోపాటు పార్టీకి కూడా రాజీనామా చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. యూపీ రాజకీయాల్లో తాజా పరిణామాలపై కేసీఆర్, తేజస్వి చర్చించి నట్టు సమాచారం. యూపీలో బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటం ఆ పార్టీ పతనానికి ప్రారంభమని వారు విశ్లేషించుకున్నట్టు తెలిసింది. యూపీ ఎన్నికల్లో ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్‌కు శరద్‌పవార్ మద్దతు ప్రకటించడం కూడా బీజేపీని ఎదుర్కొనే విషయంలో సానుకూల పరిణామని వారు చర్చించుకున్నట్టు సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఆర్జేడీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తేజస్వీ బృందం హామీ ఇచ్చినట్టు తెలిసింది. తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ, సాగునీటి రంగ అభివృద్ధి కార్యక్రమాలపై తేజస్వీ ఆరా తీసినట్టు సమాచారం. జాతీయ స్థాయిలో పాత్ర పోషించండి: లాలూ తేజస్వీ యాదవ్‌తో భేటీ సందర్భంగా ఆయన తండ్రి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. లాలూ ఆరోగ్యం, క్షేమ సమాచారాన్ని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆర్జేడీ మద్దతిచ్చిన విషయాన్ని లాలూ ప్రసాద్ గుర్తు చేశారు. ‘‘జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు మీరు ముందుకు రావాలి. తెలంగాణ కోసం త్యాగాలు, పోరాటాలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారు. అన్ని మతాలు, కులాలు, సబ్బండ వర్గాలకు అనుకూలంగా సాగుతున్న మీ పాలనానుభవం దేశానికి అవసరం. దేశ లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అరాచక పాలననుంచి దేశాన్ని రక్షించేందుకు లౌకికవాద శక్తులన్నీ ఒక్కటి కావాలి. అందుకు మీరు ముందుకు రావాలి’’ అని సీఎం కేసీఆర్‌ను లాలూ కోరినట్టు సమాచారం. కాగా.. తెలంగాణ భవన్‌కు వచ్చిన తేజస్వీ యాదవ్ బృందానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్ తదితరులు స్వాగతం పలికారు. తేజస్వీ బృందంలో బిహార్ మాజీ మంత్రి అబ్దుల్ బారి సిద్దిఖీ, మాజీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వ్యతిరేకశక్తుల విశ్వాసం కోసమే? ‘బీజేపీ ముక్త్ భారత్’ నినాదంలో భాగంగా లౌకకవాద, ప్రజాస్వామిక శక్తులను ఏకం చేసేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్న కేసీఆర్.. మరింత వేగంగా ముందుకు అడుగు వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. గతేడాది డిసెంబర్లో చెన్నై వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడ డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 8న ఒకేరోజు సీపీఎం, సీపీఐ పార్టీల జాతీయ అగ్రనేతలతో ప్రగతిభవన్‌లో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీల సందర్భంగా బీజేపీ వ్యతిరేక శక్తుల విశ్వాసం చూరగొనే ప్రయత్నంతోపాటు జాతీయ స్థాయిలో ఐక్యత అవసరాన్ని కేసీఆర్ నొక్కి చెప్తున్నట్లు సమాచారం. గతంలో జనతా, జనతాదళ్, యూపీఏ భాగస్వామ్య పార్టీల వైఫల్యానికి కారణాలపైనా ఈ భేటీల్లో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. చాలా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు గణనీయ ప్రభావాన్ని కలిగి ఉన్నా జాతీయ స్థాయిలో వాటి మధ్య సూత్రప్రాయంగా ఐక్యత లేకపోవడం బీజేపీకి కలిసివస్తోందనే అభిప్రాయాన్ని విశదీకరిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యతను చాటేందుకు జాతీయ స్థాయిలో ఒక సదస్సునుగానీ, సమావేశాన్ని నిర్వహించాలనే ప్రతిపాదనను ముందుకు తెస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. యూపీతో మొదలుపెడదాం.. బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో గట్టిగా గొంతు వినిపిస్తున్న టీఆర్ఎస్.. యూపీ ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రయత్నాలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. త్వరలో జరుగనున్న యూపీ ఎన్నికల ప్రచారానికి.. టీఆర్ఎస్ బృందాన్ని పంపేందుకు చురుకైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జాబితాను కేసీఆర్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అవసరమైతే తాను కూడా యూపీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రచారానికి వెళ్లాలనే అభిప్రాయాన్ని కూడా కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. యూపీ ఎన్నికల సమయంలోనే బీజేపీ వ్యతిరేక శక్తుల సదస్సును నిర్వహించాలనే ప్రతిపాదనను మంగళవారం నాటి భేటీలో తేజస్వీ ముందు పెట్టినట్లు తెలిసింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్–ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ భేటీలో అభిప్రాయాలివి.. ►బీజేపీ దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టాలి. చాలా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు గణనీయ ప్రభావాన్ని కలిగి ఉన్నా.. జాతీయ స్థాయిలో వాటి మధ్య సూత్రప్రాయంగా ఐక్యత లేకపోవడం బీజేపీకి కలిసివస్తోంది. అందువల్ల ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ తక్షణమే ఏకం కావాల్సిన అవసరం ఉంది. బీజేపీని గద్దె దించేంత వరకు జరగాల్సిన పోరాటంపై త్వరలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలి. ►యూపీ ఎన్నికల సమయంలోనే దీనికి బీజం పడాలి. బీజేపీ వ్యతిరేక ప్రచారం కోసం మంత్రులు, సీనియర్లతో కూడిన ప్రచార బృందాన్ని పంపేందుకు సిద్ధం. అవసరమైతే సీఎం కేసీఆర్ కూడా వెళ్లాలనే అభిప్రాయం. ►బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఆర్జేడీ నుంచి సంపూర్ణ మద్దతు. ‘జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు మీరు ముందుకు రావాలి. దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారు. మీ పాలనానుభవం దేశానికి అవసరం. బీజేపీ అరాచక పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు లౌకిక శక్తులన్నీ ఒక్కటి కావాలి. అందుకు మీరు ముందు నడవాలి’ – సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ చదవండి: (ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ) -
సిద్ధంగా ఉన్నాం.. జాగ్రత్తగా ఉందాం!
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయమై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. అదే సమయంలో అజాగ్రత్త కూడా పనికిరాదని చెప్పారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ మాస్క్ ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ నిబంధనలను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం సోమవారం ప్రగతిభవన్‌లో వైద్యారోగ్య శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, అధికారులు శ్రీనివాసరావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో కరోనా ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజలు గుంపులు గుంపులుగా చేరకుండా చూడాలి. బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ విధించే పరిస్థితులు లేవు. అవసరం కూడా లేదు’ అని వైద్యారోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యం, ఐసొలేషన్, టెస్టింగ్ కిట్లు పెంచండి ‘రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మార్చారు. మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలి. అలాగే ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మెట్రిక్ టన్నుల నుంచి 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగాం. దీనిని 500 మెట్రిక్ టన్నులకు పెంచాలి. హోం ఐసోలేషన్ కిట్ల లభ్యతను 20 లక్షల నుంచి ఒక కోటికి, టెస్టింగ్ కిట్ల సంఖ్యను సైతం 35 లక్షల నుంచి రెండు కోట్లకు పెంచాలి. అన్ని దవాఖానాల్లో వైద్యులు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలి. ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలి. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలి. జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో వైద్యులు, బెడ్లు, మౌలిక వసతులను పెంచుకొని వైద్యసేవలను మెరుగుపరచాలి..’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా ఖాళీ అయిన పాత కలెక్టరేట్ కార్యాలయాలు, ఆయా శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్య శాఖల అవసరాలకు ప్రత్యేకించి కేటాయించాలని ఆదేశించారు. పది వేల మంది కిడ్నీ రోగులకు డయాలిసిస్ సేవలు అందుతున్న నేపథ్యంలో డయాలిసిస్ మిషన్లను మరిన్ని పెంచి సేవలను విస్తృతం చేయాలని సూచించారు. అన్నిచోట్లా బస్తీ దవాఖానాలు ‘హైదరాబాద్ తరహాలో బస్తీ దవాఖానాలను నగరపాలికలకు విస్తరించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా వీటి సంఖ్యను పెంచాలి. హెచ్ఎండీఏ పరిధిలోని కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు మెరుగుపరిచేందుకు వార్డుకొకటి చొప్పున 6 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలి. రసూల్పురలో 2, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, జల్పల్లి, మీర్‌పేట, పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్ నగర్, నిజాంపేటలో ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4, నిజామాబాద్‌లో 3, మహబూబ్ నగర్, నల్లగొండ, రామగుండం, ఖమ్మం, కరీంనగర్లో రెండు చొప్పున, జగిత్యాల, సూర్యాపేట, సిద్దిపేట, మిర్యాలగూడ, కొత్తగూడెం, పాల్వంచ, నిర్మల్, మంచిర్యాల, తాండూరు, వికారాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్, గద్వాల్, వనపర్తి, సిరిసిల్ల, తెల్లాపూర్, బొల్లారం, అమీన్ పూర్, గజ్వేల్, మెదక్ పురపాలికల్లో ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి..’ అని కేసీఆర్ ఆదేశించారు. -
కేసీఆర్‌తో రవీందర్ సింగ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి శాసన మండలి స్థానిక సంస్థల కోటాలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గురువారం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. సీఎం నుంచి అందిన ఆహ్వానం మేరకే రవీందర్‌సింగ్ ప్రగతిభవన్‌కు చేరుకున్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. భేటీ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలు సిక్కు సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను రవీందర్ సింగ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందిం చిన సీఎం రాబోయే రోజుల్లో పరిష్కారానికి హామీ ఇచ్చారు. రవీందర్‌సింగ్ వెంట సాదవేణి శ్రీనివాస్, గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము, వినయ్‌తో పాటు సిక్కు సామాజికవర్గం నాయకులు ఎక్బాల్ సింగ్, అర్బన్ సింగ్, ఇందర్‌సింగ్, దర్శన్‌సింగ్ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవిని ఆశించినా దక్కక! టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సర్దార్ రవీందర్ సింగ్ ఉద్యమ సమయంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో కరీంనగర్ మేయర్ పదవిని చేపట్టి దక్షిణ భారతదేశంలో ఈ పదవిని చేపట్టిన ఏకైక సిక్కు నాయకుడిగా రవీందర్‌సింగ్ నిలిచారు. స్థానిక సంస్థల ప్రతినిధిగా 20 ఏండ్ల అనుభవం కలిగిన రవీందర్ సింగ్‌కు కరీంనగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. అయితే మంత్రి గంగుల కమలాకర్, రవీందర్ సింగ్ నడుమ నెలకొన్న విభేదాలు హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మరింత ముదిరినట్లు ప్రచారం జరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించక పోవడం, ఈటల రాజేందర్‌తో కుమ్మక్కయినట్లు ప్రచారం జరగడంపై రవీందర్ సింగ్ మనస్తాపం చెందినట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తూ గత నెల 18న ఇందిరాపార్క్ ధర్నా వేదిక సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా సాధ్యపడక పోవడంతో రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్ సింగ్ 230కి పైగా ఓట్లు సాధించి టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులు, రెండు దశాబ్దాలతో తనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని తనను కలవాలని రవీందర్ సింగ్‌కు సీఎం కబురు పంపినట్లు సమాచారం. కేసీఆర్‌తో విభేదించిన నేతలెవరూ తర్వాతి కాలంలో ఆయనను కలిసిన దాఖలాలు లేవు. దీంతో రవీందర్ సింగ్ ఎపిసోడ్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. -
'ఆ రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.3 లక్షలు'
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సంవత్సరం టార్గెట్ ఇవ్వమంటే స్పందించడం లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఢిల్లీకి వెళ్తున్నాం. కేంద్ర మంత్రులు, అధికారులను కలుస్తాం. అవకాశముంటే ప్రధానమంత్రిని కలుస్తాం. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని వార్త వచ్చింది. అది గాలివార్తా లేక నిజమా అనేది తెలుసుకుంటాం. రైతులకు ప్రధాని సారీ చెప్తే సరిపోదు. రైతులపై పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలి. సాగుచట్టంపై పోరాటంలో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన రైతు కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం. రైతు ఆందోళనలో చనిపోయిన ప్రతిరైతు కుటుంబానికి తెలంగాణప్రభుత్వం తరపున రూ.3 లక్షలు అందిస్తాం. కేంద్రం కూడా ప్రతిరైతు కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి. కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలి. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై పోరాటం చేస్తాం అని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషం. ఆ చట్టాలను కూడా కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి విద్యుత్ చట్టం తెచ్చి రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నారు. మా రాష్ట్రంలో మీటర్లు పెట్టే ఉద్దేశం లేదు. మాపై ఒత్తిడి తెస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మీటర్లు పెట్టుకుంటె ఇబ్బంది లేదు. విద్యుత్ చట్టాలన్ని వెంటనే కేంద్రం వెనక్కి తీసుకోవాలి. నదులలో నీటి వాటా కేటాయింపులపై రేపు మళ్ళీ జలశక్తి మంత్రిని కలుస్తా. టైం పిరియడ్ పెట్టి వాటా తేల్చాలని కోరుతాం. టైం పిరియడ్ పెట్టకుంటే.. పెద్ద ఎత్తున ఉధ్యమాలు చేస్తాం ఇతర రాష్ట్రాల మద్దతు కూడా తీసుకుంటాం. రిజర్వేషన్లపై కేంద్ర తేల్చాలి గిరిజనుల రిజర్వేషన్లను కూడా కేంద్రం తేల్చాలి. లేదంటే పెద్ద ఎత్తున గిరిజన ఉధ్యమాలు మొదలవుతాయి. ఎస్సీ రిజర్వేషన్లు కూడా వీలైనంత త్వరగా తేల్చాలి. బీసీ కులగణనను వెంటనే చేపట్టాలి. ఎందుకు బీసీ కుల గణన చేయట్లేదు. ఎస్సీ, ఎస్టీలాగే బీసీ కులగణన చేయాల్సిందే. ప్రభుత్వమే కులం సర్టిఫికెట్ ఇచ్చినపుడు.. బీసీ కులగణన చేయడానికి ఏం ఇబ్బంది. రాష్ట్ర బీజేపీ నేతల బండారు బయటపడ్డది. ప్రజల ముందు స్థానిక బీజేపీ నేతలు తప్పు ఓప్పుకొని క్షమాపణ కోరాలి. వర్షాకాల చివరి గింజ వరకు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడాన్ని ఎన్నికల స్టంట్ అంటున్నారు. బీజేపీని దేశంలో ఎవరు నమ్మడం లేదు. -
బీజేపీ వ్యవహారాన్ని క్షమించేది లేదు: సీఎం కేసీఆర్
-
కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం
-
నవంబర్ 18న హైదరాబాద్‌లో మహాధర్నా: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. సుమారు మూడు గంటలపాటు సమావేశం జరిగింది. ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ నెలాఖరున టీఆర్ఎస్ ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ ధర్నా కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. గవర్నర్ కోటాలో మధుసూదనాచారికి ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదం తెలపనున్నారు. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోంది. బఫర్ స్టాక్ చేయాల్సిన భాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక్కో రాష్ట్రానికి ఒక నీతి అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోంది. పంజాబ్‌లో కొనుగోలు చేస్తూ మన దగ్గర కొనుగోలు చేయడం లేదు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నుంచి స్పందన లేదు. ఎఫ్‌సీఐ ధాన్యం కొంటామంటుంది. కేంద్రం కొనమంటుంది. గత యాసంగి ధాన్యం ఇంకా మన గోదాములలో ఉంది. వానాకాలం పంట కొంటారో కొనరో తెలియదు. చదవండి: (తెలంగాణ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు..) ఇలాంటి పరిస్థితుల్లో యాసంగిలో వరి వేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎలా చెపుతాడు. కొనుగోలు కేంద్రాలలో డ్రామాలు చేసేందుకు బీజేపీ నేతలు వెళ్లారు. రైతు నిరసన చేస్తే బీజేపీ నేతలు రాళ్లతో దాడి చేస్తున్నారు. రైతులను తప్పుదోవ పట్టించానని బండి సంజయ్ చెంపలు వేసుకోవాలి. వరి ధాన్యం కొంటారో కొనరో సమాధానం చెప్పాలి. బీజేపీ వ్యవహారాన్ని క్షమించేది లేదు. కొనుగోలు కేంద్రాల దగ్గర ధర్నా ఎందుకు?. టీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు కాదా.. వాళ్ళు కొనుగోలు కేంద్రాల దగ్గరకు ఎంధుకు రాకూడదు' అని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో భారీ ధర్నా వరి ధాన్యం కొనుగోలు విషయంలో రేపు ప్రధానికి, సంబంధిత మంత్రికి లేఖ రాస్తా. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసినట్లుగా.. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేస్తుందా లేదా చెప్పాలి. కేంద్రం పాలసీ స్పష్టంగా చెప్పాలి. యాసంగిలో వరి ధాన్యం వేయాలి అని చెప్పిన బండి సంజయ్ అదే మాట మీద ఉన్నడా లేదా అనేది తేలాలి. ఈ నెల 18న హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ భారీ ధర్నా చేస్తారు. ధర్నా తర్వాత, రాజ్ భవన్లో గవర్నర్‌కు మెమోరాండం ఇస్తాం. 18న ధర్నా తర్వాత కేంద్రానికి రెండు రోజుల సమయం ఇస్తాం. అప్పటికీ సమాధానం రాకపోతే రైతులకు ప్రత్యమ్నాయ పంటలను వేయాల్సిందిగా సూచిస్తాం. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. లోక్‌సభలో, రాజ్యసభలో మా పార్లమెంట్ పక్షం వ్యతిరేకించింది అని సీఎం కేసీఆర్ అన్నారు. చదవండి: (బీజేపీ నేతలకు సిగ్గుండాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి) -
దమ్ముంటే టచ్ చేయండి: సీఎం కేసీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నోటి కొచ్చినట్టు మితిమీరి అడ్డం పొడవు మాట్లాడుతున్నడు. ఇప్పటిదాకా ఎన్ని మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా.. నాస్థాయి కాదు, చిన్న వాడన్న ఉద్దేశంతో పట్టించుకోకుండా క్షమిస్తూ వచ్చిన. కానీ ఏడేండ్లుగా కాపాడుకుంటూ వస్తున్న తెలంగాణ రైతుల బతుకు ఆగం చేసేలా, ధర్నాలతో రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు చేస్తున్న ప్రకటనలతో బాధ కలుగుతోంది. నన్ను జైలుకు పంపుతమని అంటున్నడు. ఎందుకింత అహంకారం. దమ్ముంటే టచ్ చేసి చూడండి...’’ అని సీఎం కేసీఆర్ సవాల్ చేశారు. ఇటీవల బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలను ఉద్దేశించి తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుకలు చీరేస్తామని హెచ్చరించారు. సమావేశం లో కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. అవన్నీ పచ్చి అబద్ధాలు ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నడు. వరి వేయండి, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనేలా మెడలు వంచుతం అంటున్నడు. నాదా, కేంద్రానిదా ఎవరి మెడ వంచుతరు. బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడుతున్నడు. ఈ సొల్లు మాటలతో ఏర్పడిన గందరగోళం తొలగించేందుకే నేను మాట్లాడాల్సి వస్తోంది. ఢిల్లీ బీజేపీ వరి సాగు చేయొద్దు అంటోంది. రాష్ట్రంలోని సిల్లీ బీజేపీ వరి వేయాలని అంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పనికిమాలిన మాటలు నమ్మి వరి వేస్తే దెబ్బతింటం. తెలంగాణ నుంచి వరి కొంటామని కేంద్రం నుంచి ఆర్డర్ తెస్తే.. నాతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి 70, 80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేలా చూస్తాం. అలా తెచ్చే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? కేంద్రం పునర్విభన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి తెలంగాణకు రూ. పది పనిచేశారా? మీరు కాదు.. మేమే ధర్నాలు చేస్తం.. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్లో, ఢిల్లీలో కొట్లా డుతం. ధాన్యం కొనుగోలులో మా వాటా ఏంటో చెప్పాలని 6,200 కొనుగోలు కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తం. అవసరమైతే నాతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ప్రతినిధులతో ఢిల్లీలో ధర్నాకు దిగుతాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకొనేందుకు అన్నిరకాల పోరాటానికి సిద్ధం. చిల్లరగాళ్లు, కిరికిరిగాళ్లు, కిరాయిగాళ్లు తెలంగాణను ఆగం చేస్తే కేసీఆర్ మౌనం పాటిస్తాడా? నా ప్రాణం పోయినా సరేనని ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని తెచ్చా. ఇకపై మన్నించం. కేంద్రంతో కొట్లాడేందుకు ఎవరిని కలుపుకోవాలో వారిని కలుపుకొంటం. రైతులకు అండగా ఉంటం వ్యవసాయ చట్టాల పేరిట రైతుల ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్ని స్తోంది. ఏడాదికాలంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల మీద కార్లు ఎక్కించి చంపుతున్నరు. బృందాలుగా ఏర్పడి రైతులను కొట్టాలని బీజేపీ సీఎంలే రెచ్చగొడుతున్నరు. ఉత్తర భారత్‌లో రైతుల ఆందో ళనలకు అండగా ఉంటం. రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని మేమూ ధర్నాలు చేస్తం. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకోండి ఇన్నాళ్లూ పిచ్చికూతలు కూసినా క్షమించి వదిలేసినం. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి బిడ్డా. మాది పవర్ ఫుల్ పార్టీ. మాకు 103 మంది ఎమ్మెల్యేలు, మా మిత్రపక్షం ఎంఐఎంకు మరో ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. 119లో 110 మందిమి మేమే. మేం ఢిల్లీ నుంచి కాకుండా.. ప్రజలు నామినేట్ చేస్తే వచ్చాం. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే విచారణ చేసుకోవచ్చు. సిద్ధంగా ఉన్నాం. కానీ వీధుల్లో ఏం మాట్లాడుతున్నరు. కుక్కల్లా ఇష్టమొచ్చినట్లు మొరుగుతరా? మేం ఉద్యమాలు చేసినోళ్లం. బీ కేర్‌ఫుల్.. కుసంస్కారులు, హీనుల్లా రాజకీయ విలువలు దిగజారుస్తూ ఎంతకాలం మోసం చేస్తరు. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి ఓ మెడికల్ కాలేజీనో, ఇంకేదో తెచ్చిండా? ఆ మనిషికి ఇంగ్లిషో, హిందీయో వస్త దా? కేంద్రం నుంచి వచ్చిన లెటర్లు అర్థమైతయా? అలాంటి దుర్మార్గుడు తెలంగాణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వద్దని లేఖ ఇచ్చిండు. ఓడితే భూమి బద్దలైతదా? ఉప ఎన్నికలు అన్నంక ఓ పార్టీ ఓడుతది, మరొకరు గెలుస్తరు. మొన్నసాగర్లో బీజేపీ ఓడి డిపాజిట్ పోయింది. హుజూరాబాద్‌లో ఓడితే భూమి బద్దలవుతదా. హుజూర్‌నగర్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై గెలిచినం. తెలంగాణ ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని అంటున్నరా. ఈ రోజు దేశంలో 30కిపైగా సీట్లలో ఉప ఎన్నిక జరిగితే.. బీజేపీవి అన్ని పొయినయి. అంటే బీజేపీకి వ్యతిరేకంగా తీర్పువచ్చినట్టా? ఉప ఎన్నికల పరిణామాలను మేం పట్టించుకోం. అసలు మీకు రాష్ట్రంలో ఆర్గనైజేషన్ ఉందా? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 107 చోట్ల డిపాజిట్ కోల్పోయింది. అలాంటిది ఇప్పుడు ఉప ఎన్నిక రాగానే సోషల్ మీడియాలో అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నరు. దళితులు, ఎస్టీల కోసం పెట్టిన చట్టాన్ని ఓ వెధవ లొట్టపీసు చట్టం అంటున్నడు. వారికి చట్టాలు, కోర్టులు అంటే గౌరవం లేదు. దళితులు, గిరిజనులు అంటే భయం లేదు. కేసీఆర్ బతికి ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లోనూ దళితబంధు స్కీం ఆగదు. కేవలం హుజూరాబాద్‌లోనే కాదు, రాష్ట్రమంతటా అమలు చేస్తం.’’ ఏడేండ్లలో దేశాన్ని నాశనం చేశారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా అడుగుతున్నా.. బీజేపీ ఏడేండ్ల పాలనలో దేశానికి ఏం ఒరగబెట్టారు. దళితులు, ఎస్టీలు, బీసీలు, నిరుద్యోగులు, రైతులకు ఏదైనా చేశారా? అంతర్జాతీయ సరిహద్దు సమస్యలు, మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే రాజకీయంతో దేశాన్ని నాశనం చేశారు. చైనా మన అరుణాచల్‌ప్రదేశ్‌లో ఊళ్లకు ఊళ్లే కడుతూ దంచుతోంది. అక్కడ చేతకాక బీజేపీ తోకముడిచింది. జీడీపీ, ఆహార భద్రతను దెబ్బతీసింది. ఎల్ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలను దెబ్బతీసింది. అడ్డగోలు పన్నులతో ప్రజల మీద భారం పెంచింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు వంటి అంశాల్లో రాష్ట్రాల మీద ఒత్తిడి పెంచి బ్లాక్మెయిల్ చేస్తోంది. ఇకపై ఇలాంటి వాటిమీద అటు కేంద్రం, ఇటు రాష్ట్ర బీజేపీ వెంట పడతం. కళ్లు నెత్తికొచ్చాయా? బీజేపీ నేతలు మితిమీరి మాట్లాడుతూ నన్ను నిందిస్తున్నా పడుతూ వచ్చినం. కానీ ‘కేసీఆర్‌ను జైలుకు పంపుతం, మా వ్యూహం మాకుంది, మా జాతీయ అధ్యక్షుడు నాకు చెప్పాడు’ అని బండి సంజయ్ అంటున్నడు. నన్ను జైలుకు పంపుతరా? బలుపా.. అహంకారమా? కళ్లు నెత్తికొచ్చాయా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంత అహంకారం ఎందుకు? పరిపాలించే శక్తిలేని కేంద్రం చేతకానితనాన్ని రాష్ట్రాల మీద రుద్ది సీఎంలను జైలుకు పంపుతరా? కేసీఆర్‌ను జైలుకు పంపుతరా? నన్ను ముట్టి చూడు బిడ్డా.. టచ్ చేసి చూడు కేసీఆర్‌ను. నన్ను జైలుకు పంపి ఇక్కడ బతికి బట్టకట్టి తిరుగుత అనుకుంటున్నవా? మేం చేతులు ముడుచుకుని కూర్చున్నమా? –కేసీఆర్ -
‘ఇన్నాళ్లూ ఓపికగా అన్నీ సహించాం.. ఇక సహించేది లేదు’
సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం సేకరించబోమని కేంద్రం స్పష్టం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం మీడియ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అందుకే తెలంగాణలో రైతులు వరి పండించొద్దని వ్యవసాయశాఖ మంత్రి చెప్పారని తెలిపారు. తెలంగాణను తీర్చిదిద్దే అవకాశం ప్రజలు తమకు ఇచ్చారని అన్నారు. శిథిలమైన చెరువులను కూడా మిషన్ కాకతీయతో అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. తెలంగాణలో సాగుకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రైతుబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, ఒకప్పుడు రాష్ట్రంలో విత్తనాలు కూడా దొరికేవి కావని సీఎం కేసీఆర్ తెలిపారు. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ పెట్టిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణలో ఏడాదికి 55 లక్షల టన్నుల ఎరువుల వాడకం జరుగుతోందని తెలిపారు. కరోనా సమయంలోనూ పూర్తిగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. దేశంలో ఆహార కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. ధాన్యం తీసుకోవడానికి కేంద్రం నిరాకరిస్తోంది: ధాన్యం నిల్వ చేసే వ్యవస్థ కేంద్రం వద్దే ఉందని, కేంద్రం పూర్తి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ధాన్యం తీసుకోవడానికి కేంద్రం నిరాకరిస్తోందని, ధాన్యం నిల్వ చేసే సదుపాయం, వ్యవస్థ రాష్ట్రాల వద్ద లేదని తెలిపారు. పంట మార్పిడి చేయాలని కేంద్రమే మూడుసార్లు చెప్పిందని గుర్తుచేశారు. యాసంగిలో వచ్చిన ధాన్యాన్ని తీసుకోవడానికి కేంద్రం నిరాకరిస్తోందని తెలిపారు. భవిష్యత్‌లో బాయిల్డ్ రైస్ ఇవ్వమని హామీ ఇవ్వాలని కేంద్రం షరతు పెట్టిందని అన్నారు. వర్షాకాలంలో 62 లక్షల ఎకరాల్లో తెలంగాణలో వరిధాన్యం వేశారని అన్నారు. వర్షాకాలంలో పండించిన ధాన్యాన్నే.. కేంద్రం కొంటుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలో శాస్త్రవేత్తలతో చర్చించామని అన్నారు. తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోందని చెప్పారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడివి పచ్చి అబద్ధాలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. రైతులు వరి పంటనే పండించాలని బీజేపీ అధ్యక్షుడు చెబుతున్నారని తెలిపారు. ఢిల్లీ బీజేపీ ధాన్యం కొనుగోలు చేయమంటోందని, రాష్ట్ర బీజేపీ ధాన్యమే పండించాలని అంటోందని దుయ్యపట్టారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని చాలా రోజులు క్షమిస్తున్నానని అన్నారు. తనను వ్యక్తిగతంగా మాటలన్నా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కొద్దిరోజులుగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా.. తప్పుడు మాటలు విని వరిపండిస్తే నష్టపోతారని తెలిపారు. కేంద్రం రైతు విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని మండిపడ్డారు. రైతుల మీద కార్లు ఎక్కించి చంపుతున్నారని ఫైర్ అయ్యారు. రైతులను కొట్టమని బీజేపీ ముఖ్యమంత్రులే చెబుతున్నారని అన్నారు. కేంద్రం రైతుల ప్రయోజనాలను కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందని ఫైర్ అయ్యారు. ఏడేళ్లుగా ఏం మాట్లాడుతున్నా.. సహిస్తూ వచ్చామని హెచ్చరించారు. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలకు తాకట్టు పెడితే సహించబోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. బీజేపీని ప్రజలు తిరస్కరించానే భయంతో.. పెట్రోలు, డీజిల్ ధరలపై కేంద్రం అద్భుతమైన అబద్ధం చెప్పిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయని కేంద్రం అబద్ధం చెప్పిందని అన్నారు. గత ఏడేళ్లలో పెట్రోలు, డీజిల్ ధరలు కేంద్రం అమాంతం పెంచేసిందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఉపఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించానే భయంలో కేంద్రం పెట్రోలుపై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించిందని ఎద్దేవా చేశారు. గత ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూపాయి కూడా వ్యాట్ పెంచలేదన్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని ఇదే బండి సంజయ్ చిల్లర మాటాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసమర్థతను, తెలివితక్కువతాన్ని రాష్ట్రాలపై రుద్దుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను టచ్ చేసి చూడండి.. కేసీఆర్‌ను జైలుకు పంపడం మీ తరమా? అని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను ముట్టుకుంటే బతికి బట్టకడతారా? అని నిలదీశారు. మంత్రులు, ముఖ్యమంత్రులపై పెద్దంతరం, చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నిరోజులు మీ ఆటలు చెల్లినాయి.. ఇకపై చెల్లవని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇన్నాళ్లూ ఓపికగా అన్నీ సహించాం.. ఇక సహించేది లేదు ఏడేళ్ల పరిపాలనలో కేంద్రం ఈ దేశ ప్రజలకు ఒరగబెట్టింది ఏంటీ? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రూ.15 లక్షలు ఇస్తామని, రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని నిలదీశారు. భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దుండుకోవడం రాజకీయామా? అని మండిపడ్డారు. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా మన జీడీపీ తక్కువ ఎలా అయ్యిందని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం రకరకాల ఒత్తిళ్లు తీసుకొస్తోందని మండిపడ్డారు. ప్రతి రైతు బావి దగ్గర మీటర్లు పెట్టాలని కేంద్రం బలవంతంపెడుతోందని అన్నారు. ఇన్నాళ్లూ ఓపికగా అన్నీ సహించాం.. ఇక సహించేది లేదు అని హెచ్చరించారు. ‘మా మెడలు వంచుతామని చెబుతారా? మీ మెడలు విరుస్తాం బిడ్డా’ అని మండిపడ్డారు. 119 ఎమ్మెల్యేల్లో 110 ఎమ్మెల్యేలు మాతో ఉన్నారని అన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతామంటే మెడలు విరుస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటున్నారు.. దమ్ముంటే విచారణ చేసుకోండని అన్నారు. ‘మేము మహామహా రాకాసులతో పోరాడాం.. మీలాంటి గోకాసురుల మాకు లెక్కకాదు’ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. -
‘పోడు’కు బదులు సర్కారీ భూమి
సాక్షి, హైదరాబాద్: అడవుల లోపల పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా సమీపంలోని ప్రభుత్వ భూములను కేటాయించాలని.. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే అడవుల అంచున భూమిని ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీనితోపాటు వారికి నీరు, విద్యుత్, నివాస సదుపాయాలు కూడా కల్పించాలని.. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యపై శనివారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. పోడు సాగుచేస్తున్న గిరిజనులు, గిరిజనేతరుల నుంచి దరఖాస్తుల స్వీకరణను వచ్చే నెల 8న ప్రారంభించాలని.. డిసెంబర్ 8 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు వచ్చేనెల 8లోగా అన్నిస్థాయిల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్)–2006 ప్రకారం గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని.. రెండు, మూడు గ్రామాలకో నోడల్ అధికారిని నియమించాలని, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. అడవులకు శాశ్వత సరిహద్దులు అటవీ భూములకు శాశ్వత సరిహద్దులను నిర్ణయించి, ప్రొటెక్షన్ ట్రెంచ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ట్రెంచ్‌లపై గచ్చకాయ ప్లాంటేషన్ చేపట్టాలని.. ట్రెంచ్ ఏర్పాటుకు అటవీ, ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. పోడు భూముల ఆక్రమణల్లో 87శాతందాకా భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ తదితర 12 జిల్లాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. పీడీ చట్టం ప్రయోగించండి గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని, బయటి నుంచి వచ్చేవారే అడవిని నాశనం చేస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోండు, కోలం, కోయ వంటి గిరిజన తెగల ప్రజలు అడవికి నష్టం చేయరన్నారు. అడవిపైనే ఆధారపడి బతికే వీరికి మేలు చేయాలని, బయటి శక్తులు అడవులను ధ్వంసం చేయకుండా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాల కలెక్టర్లు అటవీ భూముల రక్షణలో కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అడవుల రక్షణ చర్యల్లో సంబంధిత శాఖల అధికారులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై అన్నిజిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలను నిర్వహించాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. ఇప్పటివరకు పోడు సాగు చేస్తున్న గిరిజనులు, ఇతరులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పించడంతోపాటు.. ఇక ముందు అంగుళం కూడా అటవీ భూమి ఆక్రమణకు గురికావొద్దన్న అంశంలో అఖిలపక్ష నాయకుల నుండి ఏకాభిప్రాయం తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. గంజాయి సాగు చేస్తే జైలుకే.. గంజాయి సాగుచేస్తే రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ సౌకర్యం నిలిపివేయడంతోపాటు అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగుచేస్తే ఆర్వోఎఫ్ఆర్ పట్టాల రద్దుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీని పూర్తిగా అరికట్టి తయారీదారులకు ఉపాధి, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పదెకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానం.. సామాజిక వనాల పెంపకంలో భాగంగా ఎన్ని కోట్ల మొక్కలు నాటినా అడవితో సమానం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. కేవలం పదెకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానమన్నారు. గజ్వేల్ తరహాలో అన్ని జిల్లాల్లో అడవుల పునరుజ్జీవానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అడవులు లేని జిల్లాల్లో ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో చెట్లను పెంచాలన్నారు. -
‘ముందస్తు’ ఉండదు..
గతంలో ముందస్తుకు వెళ్లడంతో ఎంపీ సీట్లు తగ్గాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేర్వేరుగా జరగడంతో కొంత నష్టం జరిగింది. ప్రస్తుతం లోక్‌సభ స్థానాల సంఖ్యను కూడా మరిన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో మనం కేంద్రంలోనూ కీలక పాత్ర పోషించేందుకు వీలుంటుంది. సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుండి నడిపిన టీఆర్ఎస్కు ప్రజలు అప్పగించిన బాధ్యతకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం. ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామనే అనవసర అపోహలతో ఆందోళన వద్దు. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ముందస్తు ఎన్నికలు ఉండవు..’ అని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కూడిన లెజిస్లేచర్, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో సుమారు రెండు గంటలకు పైగా ఆయన మాట్లాడారు. ఎన్నికలు, విపక్షాల విమర్శలు, ప్లీనరీ తదితర అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్టపడండి ‘మరిన్ని ఎంపీ స్థానాలు సాధిస్తే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధుల కోసం మనం మరింత కొట్లాడేందుకు వీలుంటుంది. మరోవైపు మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. మనముందున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని చేపట్టిన పనులన్నీ పూర్తి చేసుకుందాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా మరింత కష్టపడి పనిచేయండి..’ అని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘అధికారంలోకి వచ్చిన సుమారు ఏడున్నరేళ్లలో మేనిఫెస్టోలో చెప్పిన వాటితో పాటు అనేక ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. కానీ వాటిని మనం సరైన రీతిలో ప్రజలకు చెప్పుకోలేక పోతున్నాం. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ యంత్రాంగం ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. ఇదే సమయంలో విపక్షాలు చేసే విమర్శలను ఎక్కడిక్కడ తిప్పికొట్టాలి..’ అని సూచించారు. కుక్కలు, నక్కల నోర్లు మూయించాలి ‘ఓట్ల రాజకీయాలే పరమావధిగా పనిచేస్తున్న కొన్ని రాజకీయ పక్షాలు మనమీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. అలాంటి కుక్కలు, నక్కల నోర్లు మూయించేలా వచ్చే నెల 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయ గర్జన’ సభను దిమ్మదిరిగేలా నిర్వహిద్దాం. ఒక్కో గ్రామం నుంచి కనీసం 50 మంది చొప్పున సభకు హాజరయ్యేలా సుమారు పది లక్షల మందితో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభ నిర్వహణ బాధ్యతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిర్వర్తిస్తారు. సభను విజయవంతం చేసేందుకు వెంటనే సన్నాహాలు ప్రారంభించాలి. నేటి నుంచి నేతలతో కేటీఆర్ భేటీలు సోమవారం నుంచి రోజుకు 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ వేర్వేరుగా భేటీ అవుతారు. విజయగర్జన సభకు జన సమీకరణ, ఇతర ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేస్తారు. ఈ సన్నాహక సమావేశాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి 20 మంది వరకు ముఖ్య నేతలు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత ఎCమ్మెల్యేలపై ఉంటుంది. సభకు హాజరయ్యే వారి కోసం కనీసం 22 వేల బస్సులు, ఇతర వాహనాలు సమకూర్చుకునేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలి..’ అని కేసీఆర్ ఆదేశించారు. హుజూరాబాద్‌లో 13% ఆధిక్యత ‘హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ కంటే మనమే 13 శాతానికి పైగా ఓట్ల ఆధిక్యతలో ఉన్నాం. ఈ నెల 25న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ సమావేశం ముగిసిన తర్వాత 26 లేదా 27వ తేదీన హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధుల సంఖ్యను 14 వేల నుంచి 6 వేలకు కుదించాలి. గ్రామ, మండల కమిటీల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులకు ఆహ్వానం పంపాలి. ప్లీనరీకి హజరయ్యేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. చేయాల్సిన తీర్మానాలపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సూచనలు ఇవ్వవచ్చు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తీర్మానాలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టన దళితబంధుపై దేశ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్లీనరీలో ఈ అంశానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి చర్చించాలి..’ అని సీఎం ప్రతిపాదించారు. ‘సుమారు 60 లక్షల మందితో కూడిన పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి గ్రామ, వార్డు, మండల, పట్టణ స్థాయిలో కమిటీల ఏర్పాటు పూర్తయింది. త్వరలో పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం, ఆ తర్వాత కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి..’ అని ప్రకటించారు. -
Dussehra: కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
సాక్షి, హైదరాబాద్: విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్దంగా వాహన పూజ, అయధపూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన టీజేఎస్ నాయకులు
-
గట్టెక్కించండి.. మరో మార్గం లేదు..
రూ.3 వేల కోట్లు కోల్పోయాం.. గత ఏడాదిన్నరగా డీజిల్ ధర లీటర్‌పై రూ.22 మేర పెరిగింది. దీంతో రూ.550 కోట్ల అదనపు భారం పడింది. విడిభాగాల ధరలూ బాగా పెరిగాయి. దీంతో సాలీనా రూ.600 కోట్ల భారం పెరిగింది. కరోనా లాక్డౌన్లతో మొత్తంగా రూ. 3 వేల కోట్ల ఆదాయాన్ని సంస్థ కోల్పోయింది. –ఆర్టీసీ అధికారులు తీవ్ర నష్టాలు వచ్చాయి విద్యుత్ సంస్థలు కూడా కోవిడ్ ప్రభావానికి గురై తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. రాష్ట్రంలో ఆరేళ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదు. విద్యుత్ శాఖను గట్టెక్కించేందుకు చార్జీలు పెంచాలి. – విద్యుత్ అధికారులు ఆదాయంపై దృష్టి పెట్టండి.. ఎంతసేపూ సిటీ బస్సుల నష్టాలు, పల్లె వెలుగు కష్టాల గురించి మాట్లాడకుండా.. ఆదాయాన్ని తెచ్చిపెట్టే దూరప్రాంత సర్వీసులపై దృష్టి సారించాలి. సంస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కొత్త ఎండీ సజ్జనార్‌పై ఉంది. ఆయనకు అధికారులు పూర్తి సహాయసహకారాలు అందించాలి. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పెంచనుంది. కోవిడ్‌తో ఈ రెండు విభాగాలు బాగా దెబ్బతిని తీవ్ర నష్టాలు వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఆ సేవలు ప్రజలకు సాఫీగా అందాలంటే చార్జీలు తక్షణం పెంచాల్సిన అవసరం ఉందని విద్యుత్, ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దృష్టికి తెచ్చారు. కోవిడ్ తర్వాత పరిస్థితులు, వాటితో సంస్థలకు వాటిల్లిన నష్టాలను ఆయనకు వివరించారు. దీంతో చార్జీల పెంపు ఎంతవరకు ఉండొచ్చో.. రెండుమూడు ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి అందిస్తే, ఆ భేటీలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మంగళవారం ప్రగతి భవన్లో ఆర్టీసీ, విద్యుత్ విభాగాల అధికారులతో కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు ఆయన చర్చించారు. సాలీనా రూ.600 కోట్ల భారం... తొలుత ఆర్టీసీపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలోని 97 డిపోలు నష్టాల్లో కూరుకుపోయాయని సమావేశంలో అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇలాంటి తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో సంస్థ మనుగడ సాగాలంటే ఇప్పటికిప్పుడు బస్సు చార్జీలు పెంచుకోవాల్సిన పరిస్థితి తప్ప గత్యంతరం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. డీజిల్ ధర లీటర్‌కు రూ.65 ఉన్నప్పుడు 2019, డిసెంబర్లో చార్జీలు పెంచామని, ఆ తర్వాత పెంచలేదని, ప్రస్తుతం లీటరు డీజిల్ ధరల రూ.100కు చేరువైందని లెక్కలు ముందుంచి వివరించారు. గతేడాది మార్చిలోనే ఆర్టీసీ చార్జీలు పెంచనున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించిందని, అయితే కోవిడ్ కారణంగా ప్రజల సమస్యలను గుర్తించి వారిపై భారం మోపొద్దన్న ఉద్దేశంతో పెంచలేదని మంత్రి అజయ్‌కుమార్, అధికారులు వెల్లడించారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల సంక్షేమానికి ఇబ్బంది రాకుండా చూసుకుంటూనే ఆర్టీసీని పటిష్ట పరిచే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తే కోవిడ్ నష్టం, డీజిల్ భారం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీని పరిరక్షించడం, దాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్ అన్నారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి అందించాలని సూచించారు. విద్యుత్తు చార్జీలు కూడా.. సమావేశం ముగిసే సమయంలో విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి, జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌రావు.. విద్యుత్ అంశాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ తరహాలో విద్యుత్ సంస్థలు కూడా కోవిడ్ ప్రభావానికి గురై తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరేళ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించేందుకు చార్జీలు పెంచాలని వారు సీఎంను కోరారు. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి విద్యుత్ బిల్లుల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు అందించాలని సీఎం వారికి సూచించారు. ఈ సమీక్షలో ఇందులో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి రాజశేఖరరెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జెన్కో అండ్ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
వినూత్న ఆలోచనలను ఆవిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు బాల్యం నుంచే వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సారించేవిధంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) కృషి చేస్తోందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలకు రూపునిచ్చేందుకు, ఆవిష్కరణల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు టీఎస్ఐసీ తోడ్పాటునిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో టీఎస్ఐసీ, యునిసెఫ్, యువాహ్, ఇంక్వి ల్యాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన ‘స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్–2021’ను విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి కేటీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ప్రారంభించారు. ఈ ఛాలెంజ్‌లో సుమారు 50 వేలమంది విద్యార్థులు పాల్గొనే అవకాశముందని కేటీఆర్ వెల్లడించారు. 2020లో నిర్వహించిన తొలి స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌కు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. 21వ శతాబ్దంలో నైపుణ్యాలు, డిజైన్లపై వినూత్న ఆలోచనలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఆలోచనలకు ‘ఛాలెంజ్’... గత ఏడాది నిర్వహించిన తొలిదశ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో 33 జిల్లాల పరిధిలోని 5 వేలకుపైగా పాఠశాలల నుంచి 25 వేలకుపైగా విద్యార్థులు పాల్గొన్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తమ పరిసరాల్లో ఉండే వివిధ అంశాలకు సంబంధించి విద్యార్థుల ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చేందుకు స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం, యునిసెఫ్ ప్రతినిధి జాన్ బ్రి ట్రూ, ఇంక్విలాబ్ సహ వ్యవస్థాపకులు సాహిత్య అనుమోలు తదితరులు పాల్గొన్నారు. ఈసారి గురుకుల, ప్రైవేట్ స్కూళ్లకు కూడా.. ఆవిష్కరణలపై యునిసెఫ్ రూపొందించిన పాఠ్యాంశాల్లో 5,200 మంది ఉపాధ్యాయులతోపాటు 6 నుంచి 10వ తరగతి చదివే 25 వేలమంది విద్యార్థులను టీఎస్ఐసీ భాగస్వాములను చేసింది. 2020 స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో భాగంగా సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతూ 7వేలకుపైగా ఆవిష్కరణలు అందాయి. గతేడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను పరిమితం చేయగా, ఈసారి సాంఘిక, గిరిజన గురుకుల పాఠశాలలు, ప్రైవేట్ స్కూల్స్‌ను కూడా ఇందులో భాగస్వాములను చేయనున్నారు. 33 జిల్లాల నుంచి ఎంపిక చేసి ఫైనలిస్టులకు నగదు బహుమతి అందజేస్తారు. -
Hyderabad Metro: మెట్రోను ఆదుకుంటాం!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రయాణికులు తగ్గి నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ మెట్రో రైల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ఈ దిశగా ఏమేం అవకాశాలు ఉన్నాయో అన్వేషిస్తామని.. మెట్రో రైలు తిరిగి గాడినపడేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. మెట్రో రైల్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ అధికారులు మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కరోనా, లాక్డౌన్లతో మెట్రోకు నష్టాలు, పేరుకుపోతున్న రుణాలు, వడ్డీల భారాన్ని వివరించి.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల అన్నిరంగాల తరహాలోనే మెట్రో రైల్ కూడా ఇబ్బందుల్లో పడిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దినాదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్తులో మరింతగా విస్తరించాల్సి ఉందని చెప్పారు. అన్ని రంగాలను ఆదుకున్నట్టే హైదరాబాద్ మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి తోడ్పడతామని హామీ ఇచ్చారు. ఎటువంటి విధానాలు అవలంబించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలమో విశ్లేషిస్తామని, మెట్రో తిరిగి పుంజుకోవడంతోపాటు సేవల విస్తరణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీనకి సంబంధించి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో.. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్, పురపాలక శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మెట్రో రైల్‌ను ఆదుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలపై అధ్యయనం చేసి, త్వరగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించారు. జాప్యంతో వ్యయం పెరిగి.. హైదరాబాద్ మెట్రో రోజుకు రూ.కోటి నష్టంతో నడుస్తోంది. మూడు మార్గాల్లో 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉన్నా.. ప్రయాణికుల ఆదరణ అంతంతగానే ఉంది. తొలుత రూ.16 వేల కోట్ల అంచనాతో మెట్రో చేపట్టినా.. నిర్మాణం రెండేళ్లు ఆలస్యం కావటంతో వ్యయం 19 వేల కోట్లకు పెరిగింది. ఈ మేరకు పెరిగిన నిర్మాణ వ్యయాన్ని చెల్లించాలని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రభుత్వాన్ని కోరింది. ఇక కరోనా కారణంగా రూ.300 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఎల్అండ్టీ చెప్తోంది. -
ప్రగతిభవన్‌లో దళితబంధు పథకం అమలుపై కేసీఆర్ సమీక్ష
-
ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు
-
ప్రగతిభవన్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ యత్నం; ఉద్రిక్త పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలంటూ నిరుద్యోగ జేఏపీ మంగళవారం ప్రగతిభవన్ ముట్టడికి యత్నించింది. అయితే నిరుద్యోగులు తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కొంతమంది జేఏసీ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ వద్ద ఉన్న గేటు ఎక్కి ఆందోళనకారులు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల ఆందోళనతో ప్రగతి భవన్ వద్ద ట్రాఫిక్ కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కేబినెట్ కూడ ఈ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
ప్రగతి భవన్ లో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
-
ప్రగతి భవన్ ముట్టడికి యత్నం
-
నా రాజీనామా వల్లే కేసీఆర్ ప్రగతిభవన్ వదిలి దళితకాలనీకి వచ్చారు
-
ఏనుగెక్కి ప్రగతి భవన్ పోవాలె..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మనం ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు పోవాలి. ఎర్రకోటపై మన నీలి జెండా (బీఎస్పీ జెండా)ను ఎగురవేయాలి’ అని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. బహుజనులకు రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి ఖర్చు చేయనున్న రూ. 1,000 కోట్లు ఎవరి పైసలని ప్రశ్నించారు. దళితులపై సీఎంకు నిజమైన ప్రేమే ఉంటే ఆయన సొంత ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలోని ఎన్.జి. కాలేజీ మైదానంలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. ఆయనకు రాంజీ గౌతమ్ బీఎస్పీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. అలాగే ఆయన్ను బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌గా ప్రకటించారు. సభకు తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ సుదీర్ఘంగా ప్రసంగించారు. తన రాజకీయ ప్రాధాన్యతలు, ఆకాంక్షలను వివరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఆదివారం నల్లగొండలో జరిగిన రాజ్యాధికార సంకల్ప సభకు హాజరైన అశేష జనవాహిని మీ కోసమే రాజకీయాల్లోకి వచ్చా... ‘ఈ సభను చూస్తుంటే దొరల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మీ ఉత్సాహం చూస్తుంటే ప్రగతి భవన్ చాలా దగ్గరలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. బహుజనులు బానిసలు కాదు.. పాలకులుగా మార్చాలన్న బాధ్యతను నాపై పెట్టారు. మీ అందరి కోసమే ఆరున్నర ఏళ్ల సర్వీసు ఉన్నా రాజీనామా చేసి వచ్చా. లక్షల మంది బహుజనుల బతుకులు మార్చాలంటే త్యాగం చేయాల్సిన అవసరం ఉందని అమ్మకు చెప్పా. రెక్కాడితే కానీ డొక్కాడని, ఆకలైతే అన్నం దొరకని కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ న్యాయం చేయాలి.. వారి గొంతుకను కావాలని చెప్పి వచ్చా. కొట్లాడి, 1,300 మంది ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పాదాభివందనం చేశా. మేం కష్టపడి త్యాగాలు చేస్తే అధికారం మరొకరు చెలాయిస్తున్నారు. పంతం నెగ్గే వరకు వదలొద్దని అమరులు నాకు చెప్పి పంపించారు. గొప్పగా బహుజన రాజ్యం... జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా ఇవ్వాలి. ఇవ్వకపోతే గుంజుకుంటాం. మీరు గ్రామాలకు వెళ్లి మన బహుజన రాజ్యం ఎంత గొప్పగా ఉండబోతోందో మన వారికి చెప్పండి. బహుజన రాజ్యంలో అన్ని కులాల వారికీ సమాన అధికారం ఉంటుంది. లక్షల మంది అమెరికాకు వెళతారు. ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. కల్లుగీత కార్మికుల బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లుగా ఉంటారు. మైనారిటీలు మిలియనీర్లు అవుతారు. మాల మాదిగలు డాలర్లు సంపాదిస్తారు. బంజారా బిడ్డలు బంగళాలు కొంటరు. గిరిజన బిడ్డలు విదేశాలకు వెళతారు. రాళ్లు గొట్టిన వారు రాకెట్ ప్రయోగిస్తారు. చిందు కళాకారుల బిడ్డలు సినిమా రంగంలోకి వెళ్తారు. మన పిల్లలు కంపెనీలు పెట్టి సంపదను సృష్టించి, ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తాం. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు రావాలి. అవి సాధించే వరకు నిద్రపోను. బహుజన రాజ్యం మీరంతా తలచుకుంటే వస్తుంది. తరతరాలుగా మనల్ని దోపిడీ చేసి సంపాదించిన ఆధిపత్య కులాల వారు రకరకాల పథకాలు, కుట్రల ద్వారా ఆ సొమ్మును మనపై చల్లుతారు. ఓటును అమ్ముకోవద్దు. నల్లగొండ సభ రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను మార్పు చేసే అవకాశం ఉంది. మీ ఆస్తులమ్మి ‘దళితబంధు’ ఇవ్వండి సీఎం కేసీఆర్ ‘దళితబంధు’కు రూ. 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవి ఎవరి పైసలు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కష్టపడిన సొమ్ము కాదా? వాటిని మీరు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. మాపై నిజమైన ప్రేమే ఉంటే మీ ఆస్తులు అమ్మి మాకు పెట్టండి. మా భవిష్యత్ మేమే నిర్ణయించుకునేలా చేయండి. 1,000 గురుకులాలు పెడితే మారిపోతుందా? అందులో చదివేది 4 లక్షల మందే. ఈ కొద్దిమంది చదివితే బంగారు తెలంగాణ అన్నట్టా? రాష్ట్రంలో వేల సంఖ్యలో పాఠశాలల ఉన్నాయి. సీఎం ఎన్నిసార్లు రివ్యూ చేశారు. వారికి ఏం ఒరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు 61.70 లక్షల మంది స్కూళ్లలో చదువుకుంటున్నారు. వాటిల్లోకి సీఎం ఎందుకు పోవడం లేదు? ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో వసతుల్లేవు. నియామకాలు లేవు. బడ్జెట్ ప్రకటనే కానీ నిధుల విడుదల ఏదీ? పేదల బిడ్డలు చదివే విశ్వవిద్యాలయాలను పట్టించుకోకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇచ్చారు. మాటల గారడీతో ప్రజలు ఏడున్నర ఏళ్లుగా మోసపోతున్నారు. ఇలాంటి వాటికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. అది నల్లగొండ నుంచే మొదలైంది. మీరే అపరజ్ఞానులా? సంపద 5 శాతం మంది చేతిలో ఉంటే 95 శాతం మంది పేదలే. 46 మందికి భారతరత్న వస్తే ఒక్కరే ఓబీసీ ఉన్నారు. దళితులు, బహుజనులు లేరు. 52 శాతం మంది ఓబీసీల్లో అర్హులే లేరా. మాకు చేతగాదా.. మీరే అపరజ్ఞానులా. 60 వేల బుక్కులు చదివారా? 11 మంది సీఎంలు అయ్యారు. అందులో పది మంది ఆధిపత్య కులాల వారే. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. -
ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదు: సీఎం కేసీఆర్
-
ప్రగతి భవన్ కు బయలుదేరిన దళితులు
-
Huzurabad: కార్యకర్తకు సీఎం కేసీఆర్ ఫోన్
-
ఈటల చిన్నోడు.. తర్వాత చూసుకుందాం
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ఇల్లందకుంట(కరీంనగర్): ‘ఈటల రాజేందర్ చిన్నోడు.. అయ్యేది లేదు.. సచ్చేది లేదు..’’ అని టీఆర్ఎస్ హుజూరాబాద్ నేతతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు దానికి సంబంధించి అన్ని విషయాలు మాట్లాడుకుందామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘దళిత బంధు’ పథకానికి సంబంధించి ఈ నెల 26న ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 427 మంది దళిత ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఇల్లందకుంట మండలం తనుగుల గ్రామ ఎంపీటీసీ వాసాల నిరోష భర్త రామస్వామికి సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. దళితులను ప్రగతిభవన్ సమావేశానికి తీసుకెళ్లే ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. రామస్వామితో సీఎం కేసీఆర్ సంభాషణ ఇదీ.. సీఎం: హలో రామస్వామి గారు.. బాగున్నారా? రామస్వామి: బాగున్నాను.. సార్. సీఎం: రామస్వామిగారు దళితబంధు విజయం మీద తెలంగాణ దళిత జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది బాధ్యతతో, ఓపికతో, çస్పష్టమైన అవగాహన దృక్పథంతో చేసే పని. రామస్వామి: అవును సార్.. సీఎం: నా రిక్వెస్ట్ ఏందంటే.. మీ జిల్లా కలెక్టర్ మీకు ఫోన్ చేస్తడు. మీరు ఆయన దగ్గర రేపు లంచ్ చేయాలె. 26 నాటి కార్యక్రమం గురించి అవగాహన చేసుకోవాలె. 26న ఉదయం అందరూ మీ మండల కేంద్రంలో జమ అయితరు. అక్కడ ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేస్తది. బస్సు ఉంటది. అంతా బస్సులో ఎక్కి హుజూరాబాద్ టౌన్‌కు వెళ్తరు. అన్ని మండలాల బస్సులు అక్కడికి వస్తయి. అంతా మొత్తం 427 మంది.. 30, 40 మంది అధికారులు ఉంటరు. అక్కడి నుంచి నా దగ్గరకు వస్తరు. ఆ రోజంతా నేను మీతోనే ఉంటా. రామస్వామి: సంతోషం సార్.. సీఎం: ప్రగతిభవన్‌కు రాగానే టీ తాగి మీటింగ్ స్టార్ట్ చేసుకుంటం. రెండు గంటలు మీటింగ్.. తర్వాత లంచ్ చేసుకొని.. మళ్లీ 2 గంటలు కూర్చొని అపోహలు, అనుమానాలు, మంచీచెడ్డా మాట్లాడుకుందాం. హుజూరాబాద్ నియోజకవర్గం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పోవాల్సి ఉంటుంది. అన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీతోనే ఉంటాను. రామస్వామి: థ్యాంక్స్ సార్. మా జాతికి న్యాయం జరుగుతుందనే సంపూర్ణ భరోసా ఉంది. మీరు ఫిక్స్ అయితే అవుతుంది సార్. సీఎం: వందకు వంద శాతం చేద్దాం. ప్రాణం పోయినా వెనుకాడేదిలేదు. రెండేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడి పోతమో ప్రపంచానికి చూపిద్దాం. రామస్వామి: ఓకే సార్.. నమస్కారం సార్. ఈటలది చిన్న విషయం! రామస్వామి: నేను 2001 నుంచీ పనిచేస్తున్నాను సర్. కానీ ఈటల రాజేందర్ నన్ను ఎప్పుడూ పట్టించుకోలే. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రతి విషయంలో పక్కనపెట్టిండు. అయినా నేను మీ (కేసీఆర్) నాయకత్వం మీద నమ్మకంతో పనిచేసుకుంటూ వచ్చిన. మొన్న 2018లో కూడా ఎంపీటీసీ టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచినం సర్. తర్వాత ఈటల రాజేందర్ దగ్గరికి ఎప్పుడూ కూడా పోలేదు. నాకు వినోద్‌కుమార్ సార్, పరిపాటి రవీందర్‌రెడ్డి సార్ నాకు దేవుడిలా ఉన్నారు. సీఎం: ఒక రిక్వెస్టు ఏందంటే.. మీరు వచ్చేయండి ఇక్కడికి (ప్రగతి భవన్‌కు).. ఆ రోజు చెప్తాను. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వాడు చిన్నోడు.. రాజేందర్‌తో అయ్యేది లేదు.. సచ్చేది లేదు. విడిచిపెట్టండి. అది చిన్న విషయం.. చూసుకుందాం.. దళితబంధు మనకు పెద్ద విషయం. ప్రపంచానికే సందేశం ఇచ్చే మిషన్ ఇది. దీన్ని విజయవంతం చేసి చూపిద్దాం. -
రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.6 వేల కోట్లు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీపై సీఎం.. ప్రగతి భవన్లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.రెండో విడత పంపిణీకి రూ.6వేల కోట్లు కేటాయిస్తునట్లు సీఎం వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేపట్టామని పేర్కొన్నారు. కుల వృత్తులను ఒక్కొక్కటిగా గాడిన పెడుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. -
దళిత బంధు మాదిరిగా తమకు నిధులు విడుదల చేయాలి : లంబాడా నేతలు
-
ప్రగతి భవన్ వద్ద కలకలం: ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం
పంజగుట్ట (హైదరాబాద్): మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్న సమయంలోనే ప్రగతి భవన్ ముందు ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేపింది. మెదక్ జిల్లా, చిన్నశంకరం పేటకు చెందిన మొయినుద్దీన్ (38) బుధవారం సాయంత్రం తన ఆటోలో ప్రగతి భవన్ వద్దకు వచ్చి, బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ ఒంటి పైన పోసుకున్నాడు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బంధువులు ఊర్లోఉన్న 100 గజాల ఇంటిని, స్థలాన్ని ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోరేందుకే అక్కడికి వచ్చానని వెల్లడించాడు. -
ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మనవడు బర్త్ డే
సాక్షి, హైదరాబాద్: ’గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీ రామారావు కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మొక్క నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్, హరితహారంలో అందరూ భాగస్వాములై మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని హిమాన్షు కోరారు. -
ఎల్.రమణ కారెక్కడమే ఆలస్యమా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఎల్.రమణ ప్రగతిభవన్‌కు వెళ్లారు. దీంతో ఆయన టీఆర్ఎస్లో చేరబోతున్నాడనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది. టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఎల్.రమణ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఇక తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్షం(టీడీఎల్పీ) ఇటీవలే అధికార టీఆర్ఎస్ పక్షంలో విలీనం కాగా, ఎల్.రమణ కూడా గుడ్‌బై చెబితే రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగైనట్టేనని చెప్పవచ్చు. టీఆర్ఎస్లో చేరికకు సంబంధించి పార్టీ నేతలు కొందరు రమణతో కొంతకాలంగా మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. అయితే, తాజాగా ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడురోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఎల్.రమణ అంటే సీఎం కేసీఆర్‌కు అభిమానం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. చేనేత వర్గాలకు చాలా చేశాం.. ఇంకా చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనకు ఎల్.రమణ సానుకూలంగా స్పందించారని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. -
ప్రగతి భవన్ ముట్టడికి కాంట్రాక్ట్ నర్సుల యత్నం
-
ప్రగతిభవన్ ఎదుట యువతి హల్చల్
సాక్షి, పంజగుట్ట: ప్రగతిభవన్‌లో దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ కోసం అఖిలపక్ష సమావేశం జరుగుతున్న సందర్భంలో ఓ యువతి హల్చల్ చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని, డబుల్బెడ్రూంలు ఇవ్వాలని గట్టిగా కేకలు వేస్తూ ప్రగతిభవన్ ఎదుట బైఠాయించింది. వివరాలివీ... ఆర్మూర్‌కు చెందిన తలారి రాజ్యలక్ష్మి(21) కేపీహెచ్‌బీలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఆదివారం ఉదయం 11:40 గంటల ప్రాంతంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి బైఠాయించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, డబుల్బెడ్రూం ఇవ్వాలని ముఖ్యమంత్రి పేదల గురించి పట్టించుకోవాలంటూ గట్టిగా నినాదాలు చేసింది. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చదవండి: యూపీలో 100 స్థానాల్లో పోటీ చేస్తాం: అసదుద్దీన్ బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం.. మార్గదర్శకాలివే -
సఫాయన్నా నీకు సలాం అన్న: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: 'సఫాయన్న నీకు సలాం అన్న .. అనే నినాదం నాది. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎవరూ డిమాండ్ చేయకున్నా ప్రతీసారీ సఫాయి కార్మికుల జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం’ అంటూ ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. అఖిల పక్ష భేటీలో ఆయన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలన్నారు. ఈ సందర్భంగా లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పది పదిహేను రోజులు దళితుల భూముల గణన మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికదిగా సిద్ధం చేసుకోవాలన్నారు. 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు సమకూర్చి, దళిత సాధికారత కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమష్టి కార్యాచరణ అందరం కలిసి చేపట్టాలని అఖిల పక్ష నేతలతో కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రాజెక్టులు తదితర ప్రజావసరాల కోసం భూసేకరణలో భాగంగా సేకరించాల్సి వచ్చిన అసైన్డ్ భూములకు కూడా, పట్టాభూములకు చెల్లించిన ఖరీదునే ప్రభుత్వం చెల్లిస్తుందని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత్ ఎంపవర్మెంట్ పథకం కోసం ఈ బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించామని తెలిపారు. ఎటువంటి బ్యాంక్ గారెంటీ జంజాటం లేకుండానే ఈ పథకం ద్వారా దళితులకు సహకారం అందిస్తామన్నారు. అద్దాల అంగడి మాయా లోకపు పోటీ ప్రపంచంలో, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దళిత బిడ్డలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు. అందుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. చదవండి: సీఎం దళిత్ ఎంపవర్మెంట్కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం: కేసీఆర్ -
కాసేపట్లో ప్రగతి భవన్ లో అఖిల పక్ష సమావేశం
-
లాక్‌డౌన్‌పై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ జరిగింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్‌లో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆమోదం తెలిపింది. టిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించాలని నిర్ణయించింది. చెస్ట్ ఆస్పత్రి, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణాల్లో ఆస్పత్రుల నిర్మాణం, అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మరో ఆస్పత్రి నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత అంశాలతో పాటుగా గోదావరి వాటర్ లిఫ్ట్, హైడల్ పవర్ ఉత్పత్తిపై కేబినెట్ చర్చించింది. చదవండి: లాక్డౌన్, బడులు, కర్ఫ్యూనే మంత్రివర్గ అజెండా రసవత్తరంగా టీపీసీసీ పీఠం: ఐదుగురిలో ఎవరో..? -
పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆదివారం సమీక్ష నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై సీఎం సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పనుల పురోగతిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల తదుపరి లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. వెబ్సైట్ నిలిపివేత! -
Photo Feature: చేపలు.. గుంపులు.. నిరసనలు
మృగశిర కార్తె సందర్భంగా మంగళవారం చేపలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. చేపలను కొనేందుకు వినియోగదారులు దుకాణాల ముందు గుమిగూడారు. కరోనా నిబంధనలకు ఖాతరు చేయకుండా గుంపులు గుంపులుగా తిరగడంతో ఆందోళన వ్యక్తమయింది. కాగా, కోవిడ్ వ్యాక్సిన్, ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. -
ప్రగతి భవన్ వద్ద అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: తమను పేట్‌బషీర్‌బాగ్ సీఐ వేధిస్తున్నాడంటూ ఓ కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం చేశారు. అది కూడా ప్రగతి భవన్ వద్ద వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, మరొకరు మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌కు అడ్డంగా పడిపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక బిల్డర్‌తో కుమ్మక్కైన పేట్‌బషీర్‌బాగ్ సీఐ తమను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ప్రగతి భవన్ వద్ద కలకలం రేపింది. కాగా, చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఆ అన్నదమ్ముల ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. -
Telangana: జూన్ 15నుంచి రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 15వ తేదీ నుంచి రైతుబంధు ఆర్థిక సహాయం పంపిణీ ప్రారంభించి 25వ తేదీలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడూ అనుసరిస్తూ రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావుకు సూచించారు. ఇప్పటిదాకా ఇచ్చిన కేటగిరీల వారీగానే రైతు బంధు ఆర్థిక సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు. జూన్ 10ని కటాఫ్ తేదీగా పెట్టుకుని, ఆ తేదీలోగా పార్ట్–బీ (ధరణిలోని నిషేధిత భూముల జాబితా) నుంచి పార్ట్–ఏ లోకి చేరిన భూములకు సైతం రైతుబంధు వర్తింపజేయాలని ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పీడీ యాక్టు కింద అరెస్టులు చేయండి ‘వారం రోజుల్లో రుతుపవనాలు వస్తున్నందున రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అందుబాటులో ఉంచాలి. పత్తి, కంది, వరి ధాన్యం విత్తనాలను అవసరమైన మేరకు సేకరించి రైతులకు అందించాలి. కల్తీ విత్తనాలు, పురుగుల మందులపై, బయో పెస్టిసైడ్స్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద వ్యవసాయ, పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలు ఉక్కుపాదం మోపాలి. జిల్లాల్లో కల్తీ విత్తన తయారీదారులపై దాడులు జరపాలి. వలవేసి పట్టుకోవాలి. ఎంతటి వారినైనా పీడీ యాక్టు కింద అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చిత్తశుద్ధితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులకు ఆక్సిలరీ ప్రమోషన్, ప్రోత్సాహకాలతో పాటు ఉత్తమ సేవ పతకం అందజేస్తాం..’అని సీఎం ప్రకటించారు. తక్షణమే జిల్లాల వారీగా పోలీసులను రంగంలోకి దించాలని డీజీపీని ఫోన్లో ఆదేశించారు. నిఘావర్గాల ద్వారా కల్తీ విత్తన తయారీ ముఠాలను కనిపెట్టాలని ఇంటిలిజెన్స్ ఐజీని ఆదేశించారు. మీరు నర్సింహావతారం ఎత్తాలె.. ‘ఇగ మీరు నర్సింహావతారం ఎత్తాలె. దొరికినోన్ని దొరికినట్టే పట్టుకొని íపీడీయాక్టు పెట్టాలె. ఇగ తెలంగాణల కల్తీ విత్తనాలు అమ్మలేమురా అనేటట్టు మీ చర్యలుండాలె. కల్తీ విత్తనాల మీద యుద్దం ప్రకటించాలె’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కల్తీని అరికట్టడానికి చట్ట సవరణ చేయాలని, అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను కోరారు. అనుమతి కలిగిన కంపెనీల ద్వారానే విత్తనాలు, పురుగుల మందుల విక్రయాలు జరిగేలా చూడాలని, ప్రభుత్వం జారీ చేసే క్యూఆర్ కోడ్ సీడ్ ట్రేసబిలిటీ విధానాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కేసీఆర్ సూచించారు. స్మార్ట్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే తక్షణమే విత్తన కంపెనీల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ‘వ్యవసాయ అధికారులు ఎవరైన కల్తీ విత్తన ముఠాలతో కుమ్మక్కై వారికి సహకరించినట్టు రుజువైతే తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. కల్తీ నియంత్రణ కోసం జిల్లా వ్యవసాయ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్లు బాధ్యత వహించాలి. కల్తీ నిర్మూలనపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలు, పోలీసు కమిషనర్లు సమీక్షలు నిర్వహించాలి. తెలంగాణలో గోదాముల సామరŠాధ్యన్ని 40 లక్షల టన్నులకు పెంచేందుకు మార్కెంటింగ్ శాఖ చర్యలు తీసుకుంటోంది..’అని సీఎం తెలిపారు. వ్యవసాయ శాఖ రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించుకోవాలని సూచించారు. విత్తనాలు వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలి విత్తనాలు వెదజల్లి వరి సాగు చేస్తే.. రెండు పంటలకు కలిపి ఏడాదిలో కోటి ఎకరాలు సాగు చేసే తె లంగాణ రైతులకు సుమారు రూ.10 వేల కోట్లపైనే పెట్టుబడి మిగులుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ‘ఈ పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి 2–3 బస్తాలు (1–2 క్వింటాళ్లు) అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీని గురించి రైతులకు అధికారులు విస్తృత అవగాహన కల్పించాలి. వరి విత్తనాలను వెదజల్లడం ద్వారా బురదలో కాలు పెట్టకుండానే వరి పంట వేసుకోవచ్చు. నారు పోసే పని లేదు. నారు పీకే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30– 35 శాతం తగ్గుతుంది. 10–15 రోజుల ముందు పంట వస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8కిలోల విత్తనపొడ్లు సరిపోతయి. వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిది. కాళేశ్వరం సహా అన్ని సాగు నీటి ప్రాజెక్టులు, లిఫ్టులు, సుమా రు 30 లక్షల బోరుబావుల పరిధిలో వరి సాగు చేసే రైతులకు ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వివక్ష తగదు ‘రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యాన్ని కొనడం అంటే ఒక సాహసం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ చేసింది. కరోనా సమయం లో లారీలు, హమాలీలు, డ్రైవర్లు అన్నీ కొరతే అయి నా వాటన్నిటినీ అధిగమిస్తూ, ఇప్పటికే 87శాతం ధాన్యం సేకరించినం. మరో నాలుగైదు రోజుల్లో సంపూర్ణంగా సేకరిస్తాం. ఎఫ్‌సీఐతో మాట్లాడి ఎం త ధాన్యం వచ్చినా తప్పకుండా ప్రభు త్వం కొం టుంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళనలకు గురికావద్దు. ఆగమాగం కావద్దు. తెలంగాణలో పండుతున్న వరి ధాన్యం మొత్తాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నాం. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయనున్నాం..’అని కేసీఆర్ తెలిపారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో వంద శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్‌సీఐ .. తెలంగాణలో సేక రించక పోవడంపై సీఎం అసంతృప్తి్త వ్యక్తం చేశా రు. కేంద్రం ఇలా వివక్ష చూపడం సరికాదన్నారు. మా లక్ష్యం నెరవేరింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కొత్త రాష్ట్రం తెలంగాణలో వ్యవసాయ రంగానికి పునరుజ్జీవం పోసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ‘మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించాం. రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చి వేశాం. కేసులేసి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అవాకులు చెవాకులు పేలినా, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వెనకడుగు వేయకుండా పట్టుపట్టి పూర్తి చేసుకోగలిగాం. తద్వారా తెలంగాణ రైతుకు నేడు వ్యవసాయం మీద ధీమా పెరిగింది. తెలంగాణ వ్యవసాయం ఎక్కడ ప్రారంభమైంది. ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నదనే విషయాన్ని పరిశీలించినప్పుడు సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. నీటికి కటకటలాడిన తెలంగాణలో నేడు 75 శాతం చెరువులు నదీ జలాలలతో నిండి ఉన్నయి. నడి వేసవిలో నిండుకుండలను తలపిస్తున్నయి. పంజాబ్‌తో సమానంగా దిగుబడి రెండు పంటలకు కలిపి రాష్ట్రంలో నేడు కోటిన్నర టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారంటే మామూలు విషయం కాదు. పంజాబ్‌కు సరిసమానంగా తెలంగాణలో వరి దిగుబడి అవుతున్నది. అలాగే ప్రభుత్వం ఒక్క గింజను కూడా పోనియ్యకుండా నేరుగా రైతుల కల్లాల్లోనే కొంటున్నది..’అని సీఎం అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని ప్రతిపక్షాలు కుయుక్తులకు పాల్పడుతుంటే రైతులు తిప్పి కొడుతున్నారని, వారి ఆటలు సాగనిస్తలేరని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు సహాయం వల్ల రైతులు శావుకారు దగ్గరికి అప్పులకు పోకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలు కొని అధిక దిగుబడిని సాధించగలుగుతున్నారని చెప్పారు. రైతుబంధు కింద రూ.35,676 కోట్లు జమ సాక్షి, హైదరాబాద్: రైతన్నల వ్యవసాయ వ్యయాన్ని కొంతమేరకు తగ్గించడంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి యేటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది. ఇప్పటి వరకు మొత్తం రూ.35,676 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. అందులో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వానాకాలం, యాసంగి పంటల కోసం రైతుల ఖాతాల్లోకి రూ.14,656.01 కోట్ల రూపాయలను జమచేసింది. ఈసారి వానాకాలం పంటల కోసం రైతులకు వారి బ్యాంకు అకౌంట్లలో జూన్ 15 నుంచి 25వ తేదీలోగా మరో దఫా ఆర్థిక సాయాన్ని అందించనుంది. 2020 సంవత్సరం వానాకాలం సమయంలో 58.02 లక్షల మంది రైతులు సాగు చేసుకునే 145.77 ఎకరాల కోసం రూ.7,288.70 కోట్లు, అలాగే 2020–21 యాసంగి కాలానికి గాను 59.32 లక్షల మంది రైతులకు 147.35 లక్షల ఎకరాల కోసం రూ.7,367.32 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో వేసింది. చదవండి: ఇక ఐటీ ప్రాంతానికి వేగంగా ప్రయాణించే అవకాశం: కేటీఆర్ -
ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కోవిడ్‌పై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ, ఆస్పత్రుల్లో సదుపాయాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా హైకోర్టు సూచనల దృష్యా వీకెండ్ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గత నెల 19న కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. యాంటీజెన్ పరీక్షలో ఆయనకు పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు కలిగిన ఆయన ఫాం హౌస్‌లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. గత మంగళవారం ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం కోవిడ్ నెగిటివ్ అని తేల్చింది. తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు, 52 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,75,748కు చేరగా.. 2,579 మంది మరణించారు. ఇప్పటివరకు 3,96,042 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. -
రైతుకు బాసటగా మార్కెటింగ్.. మరింత బలోపేతం
సాక్షి, హైదరాబాద్: ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్న ఆగం కాకూడదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అభిలషించారు. తాజా పరిస్థితుల్లో రైతులకు బాసటగా నిలిచేందుకు రాష్ట్రంలో మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ఫలితంగా దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా పరిణామం చెందినప్పటికీ, తెలంగాణలో మాత్రం సజీవంగా ఉంచడమే కాకుండా... మరింత బలోపేతం చేస్తామన్నారు. పది రోజుల్లోగా రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేశారనే విషయంలో సరైన లెక్కలు తీయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక. తెలంగాణలో వాటిని కొనసాగిస్తామన్నారు. రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి మార్కెట్లో పంటలు అమ్ముకునే విధానం తీసుకురావాలన్నారు. ఏ గ్రామానికి చెందిన రైతులు ఏ రోజు మార్కెట్‌కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీ చేయాలన్నారు. ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉందనే విషయంలో రైతులకు సూచనలు చేయాల న్నారు. ఇందుకోసం మార్కెటింగ్ శాఖలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కొత్త చట్టాల అమలు వల్ల మార్కెట్ సెస్ రాకున్నా ప్రభుత్వమే నిధులను సమకూర్చి మార్కెటింగ్ శాఖను బలోపేతం చేస్తుందన్నారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జిల్లా వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ శాఖాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. వ్యవసాయాభి వృద్ధి– రైతు సంక్షేమం విషయంలో ఈ రెండు శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను ముఖ్య మంత్రి విడమర్చి చెప్పారు. దాదాపు 8 గంటల పాటు జరిగిన సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మార్కెట్ల వారీగా ఎంత ధాన్యం వస్తున్నది, అక్కడి వ్యాపారులకు ఎంతవరకు కొనుగోలు శక్తి ఉన్నదన్న వివరాలు సేకరించాలన్నారు. వరిలో ఆధునిక సాగు పద్ధతులు వచ్చాయి. వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేయడం వల్ల ఎకరానికి 10 వేల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. పత్తిలో సింగిల్ పిక్ పద్ధతి వచ్చింది. ఇంకా అనేక పంటల్లో కొత్త వంగడాలు, కొత్త పద్ధతులు వచ్చాయి. వాటిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. చదవండి: (తక్షణమే పీఆర్సీ చర్చల.. సీఎం కేసీఆర్ ఆదేశం) ‘పొలం– హలం’శాఖగా మారాలి ‘తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగింది. వ్యవసాయ శాఖ కాగితం – కలం శాఖగా కాకుండా పొలం – హలం శాఖగా మారాలి. ఈ రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలి. వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. రైతులు పండించిన పంటలను మార్కెట్లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు అవలంభించే బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వెనువెంటనే వాడుకలోకి తేవాలి. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఏఈఓ, రైతు బంధు సమితి కార్యాలయాలు కూడా రైతువేదికలోనే భాగంగా ఉండాలి. ఇందుకు అవసరమైన ఫర్నీచర్, ఇతర వసతులు కల్పించాల’ని ముఖ్యమంత్రి ఆదేశించారు. చదవండి: (యాదాద్రి పునర్నిర్మాణం కేసీఆర్ కలల ప్రాజెక్టు) దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ ‘అమెరికా, చైనా, రష్యా, జపాన్, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో ఇలా జరిగింది... అలా జరిగింది అంటూ చెప్పుకునే విజయగాథలను ఇంతవరకు విన్నాం. కానీ ఇప్పుడా అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రమే గతంలో కనీవినీ ఎరుగని ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వంద శాతం నల్లాల ద్వారా నీరందించి నెంబర్ వన్‌గా నిలవడం మిషన్ భగీరథ వల్ల సాధ్యమైంది. దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న కరెంటు సమస్యను పరిష్కరించుకున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసుకోగలుగుతున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామసీమల రూపురేఖలే మారిపోయాయి. అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి. ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు వచ్చాయి. డంప్ యార్డులు, శ్మశానవాటికలు, రైతు వేదికలు, కల్లాలు వచ్చాయి. అదే తరహాలో వ్యవసాయరంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి’అని సీఎం కేసీఆర్ అన్నారు. పంటల మార్పిడి విధానం రావాలి ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఏడాదికి కేవలం 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారు. కానీ నేడు 1 కోటి పది లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల 1 కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలుగుతాం. బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలకు పైగా నీరు అందుతోంది. ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ ఎంతో బలోపేతం కావాలి. వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలి. రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి. దీనివల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉంది. సాగులో ఆధునిక పద్ధతులు రావాలి. ఈ అంశాలపై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా 2,600 క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలను వెంటనే వినియోగంలోకి తేవాలి. రైతులతో సమావేశాలు నిర్వహించాలి. పంటల సాగు, పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. క్లస్టర్ల వారీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించాలి. ఏ గుంటలో ఏ పంట వేశారనే వివరాలు నమోదు చేయాలి. పది రోజుల్లోగా రాష్ట్రవ్యాప్తంగా సాగవుతున్న పంటల విషయంలో స్పష్టత రావాల’ని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు.... – యాంత్రీకరణ పెంచడం కోసం ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. – మండల వ్యవసాయాధికారులను ఆగ్రోనమిస్టులుగా మార్చడానికి నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. – ఆధునిక సాగు పద్ధతులను అధ్యయనం చేయడానికి వ్యవసాయాధికారులు ఇజ్రాయిల్‌లో పర్యటించాలి. – పప్పుదినుసులు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పప్పులు, నూనె గింజలు పండించే ప్రాంతాల్లో దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది. – ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం స్ట్రాటజిక్ పాయింట్లను గుర్తించాలి. – వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయి పద్ధతిలో దొరికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. – మార్కెట్లలో ట్రేడ్ లైసెన్స్ ఇచ్చే విషయంలో సులభతరమైన విధానాలను తీసుకురావాలి. -
ఆ ప్రాజెక్టులకు నిధులు ఆగొద్దు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వలసల జిల్లా ఉమ్మడి మహ బూబ్‌నగర్‌కు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ఎత్తి పోతల ప్రాజెక్టును ఈ ఏడాది చివరి కల్లా వంద శాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవర కొండ ప్రాంతాలకు సాగునీరు అం దించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని కోరారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దని, ఈ ఏడాది బడ్జెట్లో కూడా వీటికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనుల బిల్లులు చెల్లించడానికి తక్షణం రూ.2 వేల కోట్లు విడుదల చేయా లని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావును ఆదేశించారు. పాలమూరు – రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లోని మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని నిర్ణయించినట్లు కేసీఆర్ ప్రకటించారు. వారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్లు సీఎం వెల్లడించారు. ‘పాలమూరు’తో సస్యశ్యామలం.. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన... నార్లాపూర్ రిజర్వాయర్, పంపుహౌజ్, నార్లాపూర్ – ఏదుల కాలువ, ఏదుల పంపుహౌజ్, ఏదుల–వట్టెం కాలువ, వట్టెం రిజర్వాయర్, వట్టెం–కర్వెన కాలువ, కర్వెన రిజర్వాయర్, కర్వెన– ఉద్దండాపూర్ కాలువ, టన్నెల్ పనులను ఆయన సమీక్షించారు. ఉద్దండాపూర్ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం వెల్లడించారు. డిండి ప్రాజెక్టు పరిధిలోని కాలువలు, రిజర్వాయర్ల పనులను సీఎం సమీక్షించారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ పూర్తికి తక్షణం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని నాగర్‌కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను సీఎం కోరారు. చట్టప్రకారం ఇవ్వాల్సిన పరిహారం రైతులకు అందించి, వెంటనే భూ సేకరణను పూర్తి చేసి, భూమిని నీటి పారుదల శాఖకు అప్పగించాలని సూచించారు. బీహెచ్ఈఎల్ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌ను సీఎం కోరారు. మిషన్ భగీరథకు నీరివ్వడానికి వీలుగా అన్ని రిజర్వాయర్లలో మినిమమ్ డ్యామ్ డ్రాయింగ్ లెవల్‌ను మెయింటేన్ చేయాలని ఆదేశించారు. ప్రతీ ఏడాది ముందుగా అన్ని చెరువులను నింపాలన్నారు. పనులు ఆగొద్దనే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆర్థికాధికారాలు... ‘కోటి 25 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమవుతున్నది. ఈ శాఖ ప్రాధాన్యం, పరిధి ఎంతో పెరిగింది. సమర్థవంతంగా నిర్వహించడానికి నీటి పారుదల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆయా ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, తూములు, చెక్ డ్యాములు, ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు అన్నీ కూడా ఒకే సీఈ పరిధిలోకి తేవడం జరిగింది. డీఈఈ స్థాయి నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయి వరకు ప్రతీ అధికారికి నిర్ధిష్టమైన ఆర్థిక అధికారాలను ప్రభుత్వం బదిలీ చేసింది. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా, స్థానిక అధికారులే నిధులు మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రాత్మక నిర్ణయం. ఇంజనీర్ ఇన్ చీఫ్ (జనరల్)కు ఒక్కొక్క పనికి రూ.కోటికి మించకుండా ఏడాదికి రూ.25 కోట్ల వరకు, చీఫ్ ఇంజనీర్ (సీఈ)కు ఒక్కొక్క పనికి రూ.50 లక్షలకు మించకుండా ఏడాదికి రూ.5 కోట్ల వరకు, పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ)కు ఒక్కొక్క పనికి రూ.25 లక్షలకు మించకుండా ఏడాదికి రూ.2 కోట్ల వరకు, కార్యనిర్వాహక ఇంజనీర్ (ఈఈ)కు ఒక్కొక్క పనికి రూ.5 లక్షలు మించకుండా ఏడాదికి రూ.25 లక్షల వరకు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్(డీఈఈ)కు ఒక్కొక్క పనికి రూ.2 లక్షలు మించకుండా ఏడాదికి రూ.5 లక్షల వరకు తమ స్థాయిలోనే మంజూరు చేసే ఆర్థిక అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని చిన్నచిన్న పనులను వెంటనే పూర్తి చేసుకోవాలి. రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలి’అని సీఎం కేసీఆర్ కోరారు. ‘నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. ఈ విభజన, ఆయా అధికారులకు నిర్ణయించిన పరిధి సౌకర్యవంతంగా, పనులు చేయడానికి అనువుగా ఉందో? లేదో? ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. అవసరమైన పక్షంలో మార్పులు చేయాలి’అని ఆదేశించారు. -
ఆ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తిచేయాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి వందశాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దని, ఈ ఏడాది బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తామని సిఎం స్పష్టం చేశారు. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా, వివిధ స్థాయిల అధికారులే మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇచ్చే చారిత్రిక నిర్ణయం తీసుకున్నట్లు సిఎం వెల్లడించారు. మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు, వారికి తగు శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్లు సిఎం కేసీఆర్ వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సురేందర్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఇఎన్సీ మురళీధర్ రావు, సిఇలు మోహన్ కుమార్, రమేశ్, రఘునాథరావు, ఎస్ఇలు ఆనంద్, విజయభాస్కర్ రెడ్డి, ఉమాపతి రావు, సూర్య నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టుపై సమీక్షలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్, పంపుహౌజ్, నార్లాపూర్ – ఏదుల కాలువ, ఏదుల పంపుహౌజ్, ఏదుల-వట్టెం కాలువ, వట్టెం రిజర్వాయర్, వట్టెం-కర్వెన కాలువ, కర్వెన రిజర్వాయర్, కర్వెన-ఉద్దండాపూర్ కాలువ, టన్నెల్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఉద్దండాపూర్ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సిఎం వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవతుందని కేసీఆర్ అన్నారు. డిండి ప్రాజెక్టు పరిధిలోని కాలువలు, రిజర్వాయర్ల పనులను సిఎం సమీక్షించారు. - పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులకు వెంట వెంటనే బిల్లులు చెల్లించడానికి తక్షణం రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. - ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణను పూర్తి చేయడానికి తక్షణం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను సిఎం కోరారు. చట్ట ప్రకారం ఇవ్వల్సిన పరిహారం రైతులకు అందించి, వెంటనే భూ సేకరణను పూర్తి చేసి, భూమిని నీటి పారుదల శాఖకు అప్పగించాలని చెప్పారు. - బిహెచ్ఇఎల్ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌ను సిఎం కోరారు. విద్యుత్ శాఖ అధకారులతో ఎప్పటికప్పుడు సమన్వయంతో వ్యవహరించాలి. - ప్రతీ ఏడాది ముందుగా అన్ని చెరువులను నింపాలి. - మిషన్ భగీరథకు నీరివ్వాడానికి వీలుగా అన్ని రిజర్వాయర్లలో మినిమమ్ డ్యామ్ డ్రాయింగ్ లెవల్ ను మెయింటేన్ చేయాలి. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగేది. ఇప్పుడు కోటి పది లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది. సాగునీటి వసతి పెరగడం వల్లే ఇది సాధ్యమైంది. కోటి 25 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమవుతున్నది. బోర్ల ద్వారా సాగయ్యే భూమి దీనికి అదనం. సాగునీరు అందించడంతో పాటు మిషన్ భగీరథకు కావాల్సిన నీరు, పరిశ్రమలకు నీరు అందించే బాధ్యత కూడా నీటి పారదుల శాఖకే ఉంది. దీంతో నీటి పారుదల శాఖ ప్రాధాన్యం, పరిధి ఎంతో పెరిగింది. సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి నీటి పారుదల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆయా ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, తూములు, చెక్ డ్యాములు, ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు అన్నీ కూడా ఒకే సిఇ పరిధికి తేవడం జరిగింది. డిఇఇ స్థాయి నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయి వరకు ప్రతీ అధికారికి నిర్ధిష్టమైన ఆర్థిక అధికారాలను ప్రభుత్వం బదిలీ చేసింది. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకుండా, స్థానిక అధికారులే మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రాత్మక నిర్ణయం. దేశంలో మరెక్కడా ఈ విధానం లేదు. ఇంజనీర్ ఇన్ చీఫ్ (జనరల్)కు ఒక్కొక్క పనికి 1 కోటి మించకుండా సంవత్సరానికి 25 కోట్ల రూపాయల వరకు, చీఫ్ ఇంజనీర్(సి.ఈ.)కు ఒక్కొక్క పనికి 50 లక్షలు మించకుండా సంవత్సరానికి 5 కోట్ల వరకు, పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్.ఈ )కు ఒక్కొక్క పనికి 25 లక్షలు మించకుండా సంవత్సరానికి 2 కోట్ల వరకు, కార్యనిర్వాహక ఇంజనీర్(ఇ.ఇ.)కు ఒక్కొక్క పనికి 5 లక్షలు మించకుండా సంవత్సరానికి 25 లక్షల వరకు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్(డి. ఇ. ఇ.)కు ఒక్కొక్క పనికి 2 లక్షలు మించకుండా సంవత్సరానికి 5 లక్షల వరకు ఆర్థిక అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేసుకోవాలి. రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలి’’ అని సిఎం కేసీఆర్ కోరారు. ‘‘నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. ఈ విభజన, ఆయా అధికారులకు నిర్ణయించిన పరిధి సౌకర్యవంతంగా, పనులు చేయడానికి అనువుగా ఉందో లేదో అనే విషయంలో ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. అవసరమైన పక్షంలో మార్పులు చేయాలి’’ అని సిఎం అధికారులను ఆదేశించారు. -
పీఆర్సీపై సీఎం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో సమీక్ష నిర్వహించారు. సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గత నెల 31న సీఎస్ సోమేశ్‌కుమార్‌కు పీఆర్సీ నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. సీల్డ్కవర్లో ఉన్న ఈ నివేదికతో సీఎస్.. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి చర్చించినట్టు తెలిసింది. సీఎం సమక్షంలో ఈ నివేదికను తెరిచి అధ్యయనం జరిపినట్టు సమాచారం.. గత నెల 31న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు.. ఈ నెల 6, 7 తేదీల్లో ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ అమలుపై సీఎస్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమావేశమై చర్చలు జరపాల్సి ఉంది. ఉద్యోగ సంఘాలతో సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో సీఎస్‌కు వివరించినట్టు తెలిసింది. ఇటు బుధవారం జరగాల్సిన సమావేశానికి సంబంధించి సీఎస్ నేతృత్వంలోని కమిటీ నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆహ్వానం అందలేదని ఉద్యోగ సంఘాల నాయకులు మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. బుధవారం పిలుపు రావచ్చని ఆశాభావంతో ఉద్యోగ సంఘాల నేతలున్నారు. సీఎంతో జరిగిన భేటీలో ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు ఆర్థిక, నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, రజత్‌కుమార్ పాల్గొన్నట్టు తెలిసింది. సీఎంకు చేరిన అంతర్రాష్ట్ర బదిలీల ఫైల్.. ఏపీలో పనిచేస్తున్న 654 మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులను సొంత రాష్ట్రం తెలంగాణకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనలకు సంబంధించిన ఫైల్ మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేరిందని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే రెండు మూడ్రోజుల్లోగా ఉత్తర్వులు రావచ్చని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. -
బీజేపీ ముట్టడి: ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం, పాలకమండలి ఏర్పాటు చేయాలనే ఎజెండాతో నిరసన తెలియజేశారు. ముందుగానే పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము గెలిచి నెల రోజులు అవుతున్నా కూడా తమకి ఎలాంటి గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (రేవంత్‌కు షాక్.. టీపీసీసీ చీఫ్‌గా సీనియర్ నేత!) ప్రజలు ఎన్నుకుంటే, ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచాము.. ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి మేము అంటూ మండిపడ్డారు. తమని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, తామే ఏమన్నా రౌడీలమా అంటూ కార్పొరేటర్లు ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో సమావేశం నిర్వహించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ మృతికి సంతాపం తెలిపారు. -
ఒకే గొడుకు కిందకు నీటి పారుదల శాఖలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై ఆ శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. భారీ, మధ్య, చిన్న తరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతోపాటు, ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జల వనరుల శాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్వ్యవస్థీకరణ చేశారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచారు. 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలు..: రాష్ట్రం మొత్తాన్ని 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క దానికి ఒక్కో సీఈని నియమించి పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆరుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)లను నియమించి వారికి కూడా బాధ్యతలు పంచాలని నిర్ణయించారు. జనరల్, అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఈఎన్సీలు ఉంటారు. ప్రాదేశిక సీఈల స్థానంలో కూడా ముగ్గురు సీనియర్ అధికారులకు ఈఎన్సీ క్యాడర్లో బాధ్యతలు అప్పగించారు. చదవండి: (కొత్త వైరస్: యూకే నుంచి తెలంగాణకు..!) 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం సోమవారం ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ►రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాం . ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. – సీఎం కేసీఆర్ 945 అదనపు పోస్టులు ... ప్రస్తుతం ముగ్గురు ఈఎన్సీలు ఉంటే కొత్తగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను మంజూరు చేశారు. సీఈ పోస్టులను 19 నుంచి 22కు, ఎస్ఈల పోస్టులు 47 నుండి 57కు, ఈఈల పోస్టులు 206 నుంచి 234కు, డీఈఈల పోస్టులు 678 నుంచి 892కు, ఏఈఈల పోస్టులను 2,436 నుంచి 2,796కు, టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 129 నుంచి 199కి, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 173 నుంచి 242కు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 346 నుంచి 398కి, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ల సంఖ్యను 31 నుంచి 45కు, సూపరింటెండెంట్ల సంఖ్యను 187 నుంచి 238కి, రికార్డు అసిస్టెంట్ల సంఖ్యను 134 నుంచి 205కు పెంచారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జూన్‌లోగా ఛనాక–కొరాట పూర్తి చేయాలి.. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఆ జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షించారు. ఛనాక–కొరాట ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌస్, కాల్వలను 2021 జూన్ లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చెన్నూరు లిఫ్టు ఇరిగేషన్ స్కీంతోపాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్యతరహా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి, మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టును అభివృద్ధి చేయడానికి ప్రాణహిత ప్రాజెక్టుపై అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కుప్టి ప్రాజెక్టు, మహబూబ్‌నగర్ జిల్లాలో గట్టు ప్రాజెక్టు, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి, పనులు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. వర్షాకాలంలోగా గోదావరి కరకట్టలు.. వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్టల పనులను వచ్చే వానాకాలంలోపు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని కోనారెడ్డి చెరువుకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు. పరకాల నియోజకవర్గం పరిధిలోని కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన పనులను తక్షణం పూర్తి చేయాలని సూచించారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం చేపట్టాలని, దీనికోసం వెంటనే సర్వే నిర్వహించాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని చెరువులకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. హుజూర్నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి , జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీలు సి.మురళీధర్, బి.నాగేంద్రరావు, హరిరామ్ పాల్గొన్నారు. -
‘ఒకే గొడుగు కిందకు నీటి పారుదల శాఖలు’
సాక్షి, హైదరాబాద్: ప్రధాన ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆదేశించారు. సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడానికి నిర్ణయించారు. (చదవండి: ‘అప్పుడు తిట్లు.. ఇప్పుడు మద్దతా..’) రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హుజూర్నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అత్యంత ప్రాధాన్యతా అంశంగా నీటిపారుదల ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.(చదవండి: న్యూ ఇయర్ కానుకగా పీఆర్సీ!) -
విజిల్స్ మోత.. దారులు మూసివేత
పంజగుట్ట(హైదరాబాద్): కట్టుదిట్టమైన భద్రత.. బారులుగా బారికేడ్లు.. ఒక్కసారిగా విజిల్స్ మోత.. హోరెత్తిన నినాదాలు.. అటుగా దూసుకొచ్చిన యువతీయువకులు.. ప్రధాన ద్వారం వైపు పరుగులు.. ద్వారాలు, దారులు మూసివేత... అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగింపు.. ఇదీ ప్రగతిభవన్ వద్ద సోమవారం చోటుచేసుకున్న సన్నివేశం. గురుకుల వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురుకుల పీఈటీ అభ్యర్థులు సోమవారం ఇక్కడి ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, విజిల్ సౌండ్లతో ప్రగతిభవన్ వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గురుకుల పీఈటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాదగోని సైదులుగౌడ్ మాట్లాడుతూ 616 గురుకుల వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు 2017 ఏప్రిల్ 20న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2017 సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో అర్హత పరీక్షలు రాశామని తెలిపారు. 2018 మే 17న ఒక్క పోస్టుకు ఇద్దరు చొప్పున 1,232 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, 2018 మే 18 నుండి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారని, తర్వాత కోర్టు తీర్పు పేరుతో నియామకాలు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నియామకాలు చేపట్టాలని కోరారు. పీఈటీ టీచర్ల పోరుకు బీసీ సంఘం సంఘీభావం వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ హైదరాబాద్ (గన్‌ఫౌండ్రీ): పీఈటీ ఉపాధ్యాయులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం ప్రగతిభవన్ ముట్టడికి యత్నించి అరెస్టయి గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉన్న పీఈటీ ఉపాధ్యాయులను ఆయన కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పీఈటీ టీచర్ల ఆందోళనకు సంఘీభావం ప్రకటించి కృష్ణయ్య మాట్లాడారు. 1,232 మంది పీఈటీ ఉపాధ్యాయులుగా ఎంపికై మూడేళ్లు గడిచినా నేటికీ పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టింగ్ వచ్చిందనే ఆశతో ఇతర పనులకు వెళ్లలేక, పోస్టింగ్ రాక ఎంపికైన వారు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను ఒక పథకం ప్రకారం ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ప్రతినిధులు వేముల రామకృష్ణ, ఉదయ్, సుధాకర్ పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు -
పీఈటీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడి
సాక్షి, హైదరాబాద్ : గురుకుల పీఈటీ మహిళా అభ్యర్థులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముట్టడించారు.. సోమవారం పెద్ద ఎత్తున మహిళలు విజిల్ సౌండ్లతో సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వరంగల్, నాగర్ కర్నూల్, మహాబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ నుంచి ఈ ముట్టడికి భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. 2018 నుంచి గురుకుల పీఈటీ ఫలితాలు విడుదల చేయడంలేదని ఆందోళన చేస్తున్నామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసును ప్రభుత్వం కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్ 2017లో నోటిఫికేషన్ ఇచ్చి 2018లో పరీక్ష రాశామని, ఫలితాలు ఇప్పటికీ విడుదల చేయకపోవటంతో అభ్యర్తులు నిరసనకు దిగారు. కారుణ్య మరణాలే శరణ్యం అంటూ.. ప్రగతి భవన్ వద్ద మహిళా అభ్యర్థులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అభ్యర్థుల ఆందోళనతో క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
గ్రేటర్లో గెలవాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు నేడో రేపో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఓటరు తుది జాబితా కూడా శుక్రవారం వెలువడుతున్నందున ఎన్నికలకు పార్టీపరంగా పూర్తి సన్నద్ధంగా ఉండటంతో పాటు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’అని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కొం దరు ముఖ్యనేతలతో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం భేటీ అయ్యారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి దాదాపు ఆరున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు మొదలుకుని రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. వివిధ అంశాలకు సంబంధించి పలుమార్లు మంత్రులు, పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ‘గ్రేటర్ ఎన్నికల్లో డివిజన్లవారీగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తాం. ఇప్పటికే డివిజన్లవారీగా పార్టీ ఇన్చార్జీల జాబితా కూడా సిద్ధం చేశాం. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ పటిష్ట స్థితిలో ఉన్నట్లు అంతర్గత సర్వేల్లో వెల్లడైంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి’అని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకొన్న వివిధ సమస్యలను ప్రస్తావించడంతో పాటు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నగర అభివృద్దిని సుదీర్ఘంగా నేతలకు వివరించారు. బెంబేలు పడాల్సిన అవసరం లేదు ‘దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం చూసి అధైర్యపడొద్దు. గాలివాటు గెలుపును చూసి గాభరా చెందాల్సిన అవసరం లేదు. మనకు పటిష్టమైన పార్టీ యం త్రాంగం, బలమైన నేతలు ఉన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్దాం. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలి తాల మాదిరిగానే ఈ దఫా కూడా పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చాం. రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.60వేల కోట్లకు పైగా నిధులను ఐదేళ్లలో ఖర్చు చేశాం. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ ఇన్చార్జీలు కీలకంగా వ్యవహరించాలి. డివిజన్ల వారీగా క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ సమన్వయంపై ఇన్చార్జీలు ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది’అని మంత్రులు, పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం వివరించినట్లు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత తీసుకోవాలని.. ఎవరికీ మినహాయింపులు ఉండవని సీఎం స్పష్టంచేశారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేదిగా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘అభూతకల్పనలు, అవాస్తవాలు ప్రచారం చేయడంతో పాటు అభ్యర్థులు, నాయకుల వ్యక్తిత్వం కించపరిచేలా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. దీనిని అరికట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుంది. అ దిశగా ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తేవాల్సిన అవసరముంది’అని కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చ శుక్రవారం సాయంత్రం జరిగే మంత్రిమండలి సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చిస్తామని సీఎం వెల్లడించినట్లు తెలిసింది. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్రావు తదితరుల పేర్లు వినిపిస్తుండగా.. శుక్రవారం కేబినెట్ భేటీలో వీటిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. గోరటి వెంకన్న పేరు ఇప్పటికే ఖరారు కాగా, మరో రెండు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఔత్సాహిక నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, శాసనమండలి రెండు పట్టభద్రుల కోటా స్థానాల్లో ఓటరు నమోదు జరిగిన తీరును కూడా సీఎం కేసీఆర్ గురువారం జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా దిశానిర్దేశం చేశారు. అలాగే ధరణి పోర్టల్, సన్నరకం వడ్లు తదితర అంశాలను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మరోవైపు మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం ముగిసిన తర్వాత ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రగతిభవన్‌లో సీఎంతో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోణంలో ఈ భేటీ జరిగి ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దుబ్బాకపై సీఎంకు హరీశ్ నివేదిక.. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి గురువారం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రస్తావన, సమీక్ష చేయలేదని సమాచారం. అయితే దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార బాధ్యతను ఒంటిచేత్తో నిర్వహించిన ఆర్దికశాఖ మంత్రి హరీశ్‌రావు.. సమావేశం ప్రారంభానికి ముందే సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలిసింది. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని అంశాలను సీఎం కేసీఆర్‌కు ఆయన వివరించినట్లు సమాచారం. అభ్యర్థి ఎంపిక మొదలు పార్టీ పరంగా జరిగిన ప్రచారం, విపక్షాలు.. ప్రత్యేకించి బీజేపీ అనుసరించిన విధానాలు, స్థానిక పరిస్థితులు తదితరాలపై సీఎంకు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. -
వ్యూహ రచన: కేసీఆర్‌తో ఒవైసీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)పై అధికార టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. గత ఎన్నికల్లో సాధించిన ఫలితాలనే మరోసారి పునరావృత్తం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే స్థానిక నేతలను, మంత్రులను రంగంలోకి దించింది. ఓవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుతూనే రాజకీయంగా వ్యూహరచన చేస్తోంది. పొత్తులు ఎత్తులపై ప్రగతి భవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలతో మంతనాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎలానైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలను అధికార పార్టీతో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పటికే విడతల వారీగా సమావేశాలు నిర్వహించింది. ఇక దుబ్బాక విజయం నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీ సైతం రేసులోకి దూసుకొచ్చింది. గ్రేటర్లో 75 స్థానాల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమని కాషాయ దళపతి బండి సంజయ్ ఇదివరకే ప్రకటించారు. దుబ్బాక విజయం తమకు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చిందని, అదే స్ఫూర్తితో గ్రేటర్‌లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మరింత అప్రమత్తమైంది. బీజేపీ నుంచి ముంచుకొస్తున్న ముప్పును అంచనా వేసిన గులాబీ బాస్ కేసీఆర్ ఆ మేరకు ఎత్తులు సైతం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కేసీఆర్ భేటీ అయ్యారు. గురువారం ప్రగతిభవన్ వేదికగా సాగిన వీరి సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్లు సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 150 సీట్లకు గాను టీఆర్ఎస్ 99, ఎంఐఎం 40 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అవే ఫలితాలను సాధించాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఇరు పార్టీలు ముందగానే అవగాహానకు వచ్చి ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుంటాయా, లేక విడివిడిగా పోటీ చేస్తాయా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. డిసెంబర్ మొదటివారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. -
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. రేపు ఉదయం (శుక్రవారం) ప్రగతి భవన్లో ఈ భేటీ జరుగనుంది. త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం తొలిసారి మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. దుబ్బాక ఫలితాలపై కూడా ఈ సమావేశంలో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఓటమికి గల కారణాలను మంత్రులతో కలిసి విశ్లేషించనున్నారు. అలాగే పట్టభద్రుల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. (డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు?)