
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అటు.. అసెంబ్లీలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.