![Raksha Bandhan Celebrations Held At Telangana CM KCR Residence - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/13/KKP_4411.jpg.webp?itok=Qkxv-KXW)
సీఎం కేసీఆర్‌కు రాఖీ కడుతున్న సోదరి. చిత్రంలో సోదరీమణులు, సతీమణి శోభ, కుటుంబ సభ్యులు.
సాక్షి, హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం సీఎం కేసీఆర్ నివాసంలో ఘనంగా వేడుకలు జరిగాయి. కేసీఆర్ అక్కాచెల్లెళ్ల రాకతో ప్రగతిభవన్‌లో సందడి నెలకొంది. ఇంటికి వచ్చిన తమ ఆడ బిడ్డలను సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ సాదరంగా, సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరుడికి రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు.
మంత్రి కేటీఆర్‌కు రాఖీ కడుతున్న కవిత. చిత్రంలో కేటీఆర్ సతీమణి శైలిమ
తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసీఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారు తమ సోదరుడిని నిండు మనసుతో ఆశీర్వదించారు. అదే విధంగా కేటీఆర్, కవిత సీఎం కేసీఆర్ మనుమడు, మనుమరాలు కూడా రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ కూతురు అలేఖ్య తన అన్న హిమాన్షుకు రాఖీ కట్టింది. తమ మనుమడు, మనుమరాలును నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు దీవించారు. ఈ వేడుకల్లో మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment