Raksha Bandhan celebrations
-
ఉరి సెక్టార్ లో సైనికులకు రాఖీలు కట్టిన స్థానిక మహిళలు
-
Raksha bandhan 2024 : ప్రముఖుల రక్షాబంధన్ వేడుక (ఫొటోలు)
-
30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్
రక్షా బంధన్ అనేది తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన బంధానికి సంబంధించిన వేడుక. ఈ శుభ సందర్భాన్ని దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే చాలా మంది సోదర సోదరీమణులు ఒకరికొకరు ఈ రోజు కలవడం కుదరకపోవచ్చు. వృత్తి పరమైన ఇబ్బందులతోపాటు అనేక కారణాల రీత్యా తమ సోదరులను మిస్ అవుతూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో ఈ పండుగ రోజున అనూహ్యంగా కలుసుకొని, రాఖీ వేడుక చేసుకుంటారు. అలాంటి సంఘటన ఒకటి ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ మెంబర్ అయిన శుభకు అలాంటి అదృష్టం వరించింది. ఇండిగో విమాన పైలట్‌గా ఉన్న తన సోదరుడు గౌరవ్‌తో కలిసి రక్షాబంధన వేడుక జరుపుకోవడం ముచ్చటగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. (రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో) విమానం టేకాఫ్‌కి ముందు ప్రయాణికులకు శుభ ప్రత్యేక ప్రకటనతో వీడియో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక క్షణాలను జరుపుకోవడం అన్ని సార్లూ సాధ్యపడదు. ముఖ్యంగా మాకు..ఎందుకంటే మీ ప్రియమైన వారితో కలిసి వేడుకు జరపుకునేలా మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లడం ముఖ్యం కాబట్టి అంటూ ఫ్లైట్ ఇంటర్‌ఫోన్ సిస్టమ్‌లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ రోజు నాకు అన్నకెప్టెన్ గౌరవ్‌కు చాలా ప్రత్యేకమైన రోజు, చాలా ఏళ్ల తర్వాత కలిసి రక్షా బంధన్ జరుపుకుంటున్నాం అని ప్రకటించారు. అందరి అన్నాచెల్లెళ్లలాగానే మేమూ కొట్టుకుంటాం,తిట్టుకుంటాం,నవ్వుకుంటాం..ఏడుస్తాం... కానీ నాకు మాత్రం నా అన్న రాక్, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు పెద్ద ఆలంబన అంటూ అంటూ శుభ సోదరుడికి రాఖీ కట్టి, అన్న ఆశీర్వాదం తీసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రయాణీకులు అందరూ ప్రయాణికులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. 30వేల అడుగల ఎత్తున ఉన్నా, భూమి మీద ఉన్న ఎక్కడున్నా బ్రదర్ అండ్ సిస్టం బాండింగ్ స్పెషల్ అంటూ ఈ వీడియోను ఇండిగో చేసిన ట్వీట్ చేసింది. At 30,000 feet or on the ground, the bond of a brother and sister remains special. A heartwarming moment on board today as our Check Cabin Attendant Shubha celebrates Rakhi with her brother Capt. Gaurav. #HappyRakshaBandhan2023 #HappyRakhi #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/WoLgx8XoIa — IndiGo (@IndiGo6E) August 30, 2023 -
రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో
Apollo Tyres-Raksha Bandhan 2023: రాఖీ పండుగ లేదా రక్షా బంధన్.. అంటే రక్షణ.. బాధ్యతకు ప్రతీక. సోదరులు, సోదరీమణుల మధ్య బంధాన్ని మాత్రమే కాదు మనిషికి మనిషికీ మధ్య ఉంటే బంధానికి రక్షణ. ఒక నమ్మకం. ఈ రక్షణ స్ఫూర్తికి హద్దులు ఉండవు. ఈ నమ్మకాన్నే పునరుద్ఘాటిస్తూ ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ రక్షా బంధన్‌పై అద్భుతమైన యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్ ఇపుడు నెటిజనులను ఆకట్టుకుంటోంది. అపోలో టైర్స్ రక్షా బంధన్ సారాంశాన్ని షార్ట్ ఫిల్మ్ ద్వారా స్పెషల్‌గా ప్రకటించింది. రక్షా బంధన్ ప్రతి ఒక్కరి కోసం అంటూ ఈ స్టోరీని అందంగా వివరించింది. నిజానికి రాఖీ పండుగ అన్నదమ్ములు, సోదరీ మణుల అనుబంధాన్ని ప్రత్యేక జరుపు కోవడం ప్రతీతి. కానీ రక్షా బంధన్ ప్రతి ఒక్కరికీ, మన జీవితంలో పరిధీయ పాత్రలు పోషిస్తున్న వారందరిదీ అంటూ ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏముందంటే.. ఒక యువతి రక్షా బంధన్ రోజున తన ఇంటికి కారులో వెడుతూ ఉంటుంది. అయితే, ఒక ట్రక్కు తనను తాను వెంబడిస్తూ, హారన్మోగిస్తూ ఉంటాడు. దీంతో ఆమె అసౌకర్యానికి గురవుతుంది.. ఏదో అనుమానంతో చూస్తుంది. కానీ అకస్మాత్తుగా కారు ఆగిపోతుంది. హైవేలో ఒంటరిగా మిగిలిపోతుంది. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆమె ఇక్కడే ఆశ్చర్యానికి లోనవుతుంది. తనను అప్పటిదాకా వెంబడించిన ట్రక్ డ్రైవరే ఆమె పాలిట ఊహించని రక్షకుడిగా మారతాడు. భయపడొద్దు అంటూ భరోసా ఇచ్చి...ఆమెను గమ్య స్థానానికి చేరుస్తాడు. దీనికి ప్రతిఫలంగా ఆమె డబ్బులు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరిస్తూ.. నా సోదరి లాంటిదానికి వద్దు అంటాడు. ఇక తర్వాత మీకు తెలిసిందే.. అతని సహృదయానికి, తన పట్ల బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్‌కి రాఖీ కడుతుందన్న మాట ఆ యువతి. రక్షా బంధన్ అంటే అందరిదీ. అపరిచితులైనా సరే.. ఆపదలో ఉన్న వారి పట్ల బాధ్యతగా ఉండటం, రక్షణగా నిలబడటమే దీని ఔచిత్యం అనే సందేశంతో ఈ షార్ట్ ఫిలిం ముగుస్తుంది. అంతేకాదు అపోలో టైర్స్ ప్రతి ప్రయాణంలో వినియోగదారులకు భద్రత నిస్తుంది. ఈ భద్రతను నిర్ధారించే తన నిబద్ధతను మరోసారి నొక్కి చెబుతుంది ఈయాడ్‌లో.. -
ప్రగతిభవన్‌లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు (ఫొటోలు)
-
సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టిన అక్కలు, చెల్లి
సాక్షి, హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం సీఎం కేసీఆర్ నివాసంలో ఘనంగా వేడుకలు జరిగాయి. కేసీఆర్ అక్కాచెల్లెళ్ల రాకతో ప్రగతిభవన్‌లో సందడి నెలకొంది. ఇంటికి వచ్చిన తమ ఆడ బిడ్డలను సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ సాదరంగా, సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరుడికి రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. మంత్రి కేటీఆర్‌కు రాఖీ కడుతున్న కవిత. చిత్రంలో కేటీఆర్ సతీమణి శైలిమ తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసీఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారు తమ సోదరుడిని నిండు మనసుతో ఆశీర్వదించారు. అదే విధంగా కేటీఆర్, కవిత సీఎం కేసీఆర్ మనుమడు, మనుమరాలు కూడా రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ కూతురు అలేఖ్య తన అన్న హిమాన్షుకు రాఖీ కట్టింది. తమ మనుమడు, మనుమరాలును నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు దీవించారు. ఈ వేడుకల్లో మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ తదితరులు పాల్గొన్నారు. -
రాఖీ పౌర్ణమి సందర్భంగా.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా...
అమ్మానాన్నలు మనకు జన్మనివ్వడంతో పాటు మనకు ఇచ్చే మరో గొప్ప వరం తోబుట్టువులు. ఈ ప్రపంచంలోని బంధాల అన్నింటిలోనూ సోదర, సోదరీ బంధం ప్రత్యేకమైనది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధం వెలకట్టలేనిది. అంతేకాదు తోడబుట్టకపోయినా కొంతమంది అంతటి ఆప్యాయత, అనుగారాలు పంచే బంధాలు కలిగి ఉండి అదృష్టవంతులు అనిపించుకుంటారు. ఇలా సహోదర భావంతో మెలుగుతూ.. ‘నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష’ అంటూ రాఖీ కట్టుకునే పర్వదినం నేడు. మరి ఈ పండుగ రోజు మీ ఆప్తులకు ఇలా శుభాకాంక్షలు చెప్పేయండి. దూరంగా ఉన్నా సరే నేను నీతోనే ఉన్నా అనే భావనతో మనల్ని దగ్గర చేసేందుకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలను ఇలా ఉపయోగించుకోండి! సోదరసోదరీమణుల బంధానికి ప్రతీక రాఖీ పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన రహస్యాలు తెలిసిన వాళ్లు మనకు అత్యంత ఆప్తులు. వాళ్లే మన తోబుట్టువులు. రాఖీ పూర్ణిమ అందరిలో సరికొత్త కాంతులు తేవాలి. హ్యాపీ రాఖీ బంధన్ ఈ బంధం పెవికాల్ కంటే పటిష్టమైనది. దీన్ని విడగొట్టడం ఎవరి తరమూ కాదు. ప్రతీ అణువులోనూ నిండిన సోదర, సోదరీ ప్రేమానుబంధం. అందరికీ హ్యాపీ రాఖీ పూర్ణిమ. డైరెక్టుగా కట్టినా, పోస్ట్ ద్వారా వచ్చినా.. రాఖీ రాఖీయే. దాన్ని పంపే సోదరి తన ప్రేమంతా అందులో కూర్చుతుంది. అలాంటి వారందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. రాఖీపూర్ణమ అంటే నాకెంతో ఇష్టం. చేతులకు రాఖీలు, సోదరీమణుల దీవెనలూ ఎప్పటికీ కావాలని కోరుకుంటూ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అక్కా, చెల్లీ, అన్నా, తమ్ముడూ.. ఈ పిలుపుల్లో ఉండే తీపి చక్కెర కంటే తియ్యన. తోబుట్టువుల బంధం కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ హ్యాపీ రక్షా బంధన్. Raksha Bandhan Wishes: ‘అమ్మలోని ‘అ' పదం.. నాన్నలోని ‘నా' పదం కలిపితేనే ‘అన్న' అన్నైనా.. తమ్ముడైనా నీకు అందివ్వగలిగేది ఆనందమే'' మీకు మీ కుటుంబసభ్యులు, మీ బంధుమిత్రులందరికీ హ్యాపీ రక్షా బంధన్ ‘‘గులాబీకి ముళ్లు రక్ష.. చేపకి నీరు రక్ష.. పుట్టిన బిడ్డకు తల్లి రక్ష.. నా అక్క చెల్లెళ్లందరికీ నేను రక్ష''గా ఉంటానని హామీ ఇస్తూ సోదరీమణులందరికీ హ్యాపీ రక్షాబంధన్.. ‘‘చిరునవ్వుకు చిరునామా.. మంచి మమతకు మారురూపం... ఆప్యాయతకు నిలువెత్తు రూపమే రక్షాబంధన్'' రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.. ‘‘నేను ఏమి చేస్తే మంచిగా ఉంటానో.. నా సోదరులకు బాగా తెలుసు.. అందుకే వారు నాతో ఎప్పటికీ ఉంటారు'' ‘నాకు ఉన్న సోదరుడు స్నేహితుడి లాంటి వాడు. అలాంటి సోదరుడు ఎవ్వరికీ ఉండరు. అందుకే నేను చాలా లక్కీ అని నమ్ముతాను'' Raksha Bandhan Quotes: ప్రపంచం మారుతుంది, కాలం గడుస్తుంది. తోబుట్టువుల ప్రేమానురాగాలు మాత్రం స్థిరంగా ఉంటాయి. వాటికి కాలపరిమితి లేదు. ప్రకృతి ఇచ్చిన స్నేహితుడు సోదరుడు తోబుట్టువుకి తగిన గుర్తింపు తోబుట్టువు వల్లే వస్తుంది. వారి మధ్య బంధం అపరిమితం. ఒకే రక్త సంబంధం కలిగిన పిల్లలలో ఏర్పడిన అనుబంధం తెలియని శక్తిని ఇస్తుంది. ఆ శక్తిని మరేదీ ఇవ్వలేదు. మన సహోదరులు, సోదరీమణులూ మన వ్యక్తిగత కథల్లో తెల్లవారుజాము నుంచి సాయం సంధ్య వరకు మనతో ఉంటారు. హృదయపూర్వకంగా లభించే బహుమతి సోదరి. తను కట్టే రాఖీ.. మన జీవితానికి అర్థం, పరమార్థం. నాకు సొంత తోబుట్టువులు లేకపోవచ్చు. నా చేతికి కట్టే ప్రతీ రాఖీలో ఆ అనుబంధాన్ని నేను పొందుతాను. రాఖీ పౌర్ణమి వేళ ఈ విషెస్, కోట్స్ మీ స్నేహితులు, బంధువులకు పంపుకోండి. -
సీఎం జగన్ కు రాఖీలు కట్టిన ఎంపీలు
-
అన్న చెల్లెల్ల అనుబంధానికి రాఖీ ప్రతీక
-
పర్యావరణం ఉట్టిపడేలా రాఖీ పండుగను నిర్వహించేందుకు గ్రీన్ వేవ్స్ సంస్థ ప్లాన్
-
బిగ్‌బాస్ దివితో రక్షాబంధన్ స్పెషల్ చిట్ చాట్
-
Raksha Bandhan: ఆవుపేడతో అందమైన రాఖీలు
సాక్షి, జగిత్యాల: ప్లాస్టిక్‌తో తయారయ్యే వస్తువులు పర్యావరణం, మనిషి ఆరోగ్యానికి హానికరంగా మారాయి. ఈనేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా లెక్చరర్‌గా పనిచేస్తున్న ఓ అభ్యుదయ మహిళ, ఆవు పేడ, సహజసిద్ధమైన పూలతో అందమైన రాఖీలు తయారు చేసి, హైదరాబాద్ లాంటి నగరాల్లో విక్రయిస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన డాక్టర్ చెన్నమనేని పద్మ హైదరాబాద్‌లో లెక్చరర్‌గా పనిచేస్తోంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు ఎలాంటి రసాయనాలు లేని పంటలు పండించడమంటే ఇష్టం. బోర్నపల్లిలో 200 దేశీయ ఆవులతో మురిళీధర గోదామం గోశాల ఏర్పాటు చేసింది. వీకెండ్‌తో పాటు సెలవుల్లో ఆవు మూత్రం, పేడతో రకరకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు దీపావళికి ప్రమిదలు, వరలక్ష్మీ పూజకు అవసరమైన సామగ్రి తదితర వస్తువులను ఆవు పేడతో తయారు చేసి శభాష్ అన్పించుకుంది. గోమయ రాఖీలు.. గోశాలలో ఆవులు విసర్జించిన పేడను దాదాపు నెల రోజుల పాటు ఎండబెట్టారు. పిడకల మాదిరిగా తయారైన ఆవుపేడను గ్రైండర్ లేదా ప్రత్యేక మిషన్‌లో వేసి గోధుమ పిండిలా తయారు చేశారు. అలా తయారైన మెత్తటి పేడకు గోరు గమ్ పౌడర్ (సోయా చిక్కుడుతో తయారైనది)తో పాటు కొంత చెరువు మట్టిని రొట్టె పిండిలా కలిపి రకరకాల డిజైన్ సాంచా(మోడల్)ల్లో పెట్టి నీడలో ఆరబెట్టి, దారాన్ని అతికించారు. తర్వాత చామంతి, గులాబీ పూలను ఎండబెట్టి, పూల రేకులను గ్రైండ్ చేసి రంగులు తయారు చేస్తారు. రాఖీలకు ఏ రంగు అవసరమనుకుంటే ఆ రంగులను వాడుతారు. ఉపయోగాలు.. రక్షాబంధన్ అనంతరం చేతిక కట్టిన రాఖీ తీసివేసిన తర్వాత అది ఎరువుగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా రాఖీ చేతులకు ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా గోమయ రాఖీ యాంటీ రేడియేషన్గా పనిచేసి, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దీంతో వీటికి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది. అయితే వీటి ద్వారా సంపాదన కంటే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జీవితం విలువైనది మనిషి జీవితం చాలా విలువైనది. ప్రస్తుత మన అలవాట్లు, వాడే రసాయన పదార్థాల వల్ల అనారోగ్యం పాలవుతున్నాం. ఆవు మూత్రం, పేడను పంటలకు ఎరువుగానే కాకుండా, మనిషి రోజు వారీ అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. దీంతో రాఖీలు తయారు చేశాం. – డాక్టర్ పద్మ, గోమాయ రాఖీల తయారీదారు గి‘రాఖీ’ వెలుగులు సిరిసిల్ల: కొన్నేళ్ల క్రితం వరకు రాజన్న సిరిసిల్ల్ల వస్త్రోత్పత్తి, బీడీల తయారీకి ప్రసిద్ధి చెందింది. నేత కుటుంబంలోని మహిళలు బీ డీలు తయారు చేస్తూ ఇంటి పోషణలో తోడుగా నిలిచేవారు. ఈనేపథ్యంలో చాలా రోజులు గా సిరిసిల్లలో బీడీ పరిశ్రమ కుదేలై పనిదొ రక్క సతమతమవుతున్న మహిళలు ప్రత్యామ్నాయ ఉపాధిగా రాఖీలు తయారు చేస్తూ ఆర్థికంగా సంపాదిస్తున్నారు. బీడీల తయారీ కంటే మంచిది కావడంతో యువత, విద్యార్థులు, గృహిణులు ఉత్సాహంగా ఏడాదిలో పదినెలలు రాఖీలు తయారు చేస్తున్నారు. కలిసొచ్చిన లాక్డౌన్.. లాక్డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి రాఖీల దిగుమతి చాలా వరకు తగ్గింది. అయితే సిరిసిల్ల, చందుర్తిలో రాఖీ పరిశ్రమను శ్రీహరి–తేజస్విని దంపతులు ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నారు. ఇక్కడి రాఖీలు ప్రజలను ఆకట్టుకోవాలంటే మహా నగరాల్లో నుంచి వచ్చే రాఖీలకు దీటుగా తయారు చేయాలి. ఈక్రమంలో రాఖీల తయారీకి ముడి సరుకును ముంబాయిలోని మల్లాడ్ ప్రాంతం నుంచి తీసుకొస్తున్నారు. రంగురాళ్లు, సిల్వర్, గోల్డెన్, దేవుళ్ల బొమ్మలు, వివిధ పార్టీల గుర్తులతో రాఖీలు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. మణికంఠ రాఖీ సెంటర్ బ్రాండ్ పేరు పక్క జిల్లాలకు పాకింది. రాఖీల నాణ్యత ఎక్కువ, ఖరీదు తక్కువ కావడం, లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల్లో రాఖీల తయారీ తగ్గడం సిరిసిల్ల రాఖీలకు మరింత కలిసొచ్చింది. తక్కువ ధరల్లో.. సిరిసిల్లలో తయారయ్యే రాఖీలు చూసేందుకు అందంగా, తక్కువ ధరలో దొరకడం వీటికి క్రేజ్ పెరిగింది. రూ.2 నుంచి రూ.100 వరకు ఖరీదు చేసే రాఖీలు ఇక్కడ తయారవుతున్నాయి. ఏటా జిల్లా కేంద్రంతో పాటు చందుర్తి మండలం లింగంపేట లో సుమారు 16లక్షల రాఖీలు తయారు చేస్తున్నా రు. జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ తది తర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. -
వైభవంగా రక్షాబంధన్
వరంగల్ : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ఆడపడుచులు తమ సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు. బైక్‌లు నడిపేటప్పుడు ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవడానికి పలు ప్రాంతాల్లో హెల్మెట్లను బహూకరించారు. సోదరులు తమకు తోచిన కట్నకానుకలను అందించారు. వృద్ధాశ్రమాలు, అనాథ బాలల ఆశ్రమాల్లో కూడా వేడుకలు వైభవంగా జరిగాయి. -
రాఖీ పండగ: ఆదర్శంగా నిలిచిన గంభీర్..!
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ వినూత్న నిర్ణయాలతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. రక్షా బంధన్ సందర్భంగా ట్రాన్స్జెండర్లతో రాఖీ కట్టించుకుని సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఆడా, మగా అనే లింగభేదం ఎందుకు. ముందు మనుషులుగా మసలుకోవడం ప్రధానం. అభినా అహెర్, సిమ్రాన్ షైక్ ప్రేమతో నా చేతికి కట్టిన రాఖీలు ఎప్పుడూ గుర్తుంటాయి’అని అని ట్విటర్లో పేర్కొన్నారు. వారిద్దరి సోదర ప్రేమను నేను అంగీకరించాను. మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. మనుషులను మనుషులుగా గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు. ట్రాన్స్‌జెండర్లయినా.. వారూ మనుషులేనని చెప్తూ.. లింగమార్పిడి చేయించుకున్న వారిపట్ల అమానుషంగా ప్రవర్తించే కొందరికి ఆయన హితవు పలికారు. కేరళలో జరుపుకునే ఓనమ్ పండుగకు క్రికెటర్లంతా.. శుభాకాంక్షలు తెలుపుతుంటే భారతదేశ వ్యాప్తంగా జరుపుకునే రాఖీ పండుగకు గంభీర్ ఇలా స్పందించాడు. -
స్త్రీజాతికి పూర్వ గౌరవం రావాలి
మొయినాబాద్(చేవెళ్ల) : ప్రస్తుత సమాజంలో స్త్రీజాతికి పూర్వ గౌరవం రావాలనే సంకల్పంతో చిలుకూరు బాలాజీ దేవాలయంలో చేపట్టిన ‘రక్షా బంధనం’ ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకుడు రంగరాజన్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అర్చకులు రాఖీలతో ప్రదక్షిణ చేసి ప్రధాన ఆలయం ఎదుట ఉన్న మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. సూర్య భగవానుడికి, అమ్మవారికి అష్టోత్తరంతో అర్చన నిర్వహించారు. పూజాకార్యక్రమాల అనంతరం రాఖీలను ఆలయానికి వచ్చిన మహిళా భక్తులకు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో వారు ముక్కుమొఖం తెలియని కొత్త వ్యక్తులకు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమమంతా కనులపండగలా జరిగింది. ఈ సందర్భంగా అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరిపై అదే భావన కలిగే విధంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త వ్యక్తులకు రాఖీలు కట్టే కార్యక్రమం చేపట్టామన్నారు. సమాజంలో మార్పుకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని.. ఇప్పటితో ఇది ఆగిపోదన్నారు. మహిళల ఆత్మగౌరవం పెరిగే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. సమాజంలో అందరూ సోదరభావంతో మెలగా ల్సిన అవసరం ఉందని రంగరాజన్ అభిప్రా యపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు కన్నయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు. -
రాఖీ సందడి
సదాశివపేట/సిద్దిపేట టౌన్: రక్షాబంధన్ వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో పండుగ సందడి కనిపించింది. ఆయా చోట్ల వెలిసిన దుకాణాల్లో రాఖీల ను కొనుగోలు చేసేందుకు మహిళలు, యువతులు బారులుతీరారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మీయ అనురాగాలకు చిహ్నంగా జరుపుకునే సంబరాలను వైభవంగా నిర్వహించుకునేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. రూ.1 నుంచి రూ.150 వరకు మార్కెట్లలో అందుబాటులో ఉన్న రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. సిద్దిపేటలోని సుభాష్‌రోడ్, బస్టాండ్, మెదక్ రోడ్, మెయిన్‌రోడ్, కాంచీట్ చౌరస్తా, కరీంనగర్ రహదారి పక్కన వందలాది రాఖీల దుకాణాలు వెలిశాయి. 50 పైసల నుంచి రూ. 500ల ఖరీదైన రాఖీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో విక్రయానికి పెట్టారు. రాఖీలు దుకాణాలు, స్వీట్ దుకాణాలు కొనుగోలుదారులతో సందడి గా మారాయి. ఆదివారం పండుగ నిర్వహ ణకు వివిధ సంఘాలు ఏర్పాట్లు చేశాయి.