30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్‌ రాఖీ వేడుక: వీడియో వైరల్‌ | IndiGo Crew MemberTies Rakhi On FlightTo Her Brother video viral | Sakshi
Sakshi News home page

30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్‌ రాఖీ వేడుక: వీడియో వైరల్‌

Published Thu, Aug 31 2023 2:41 PM | Last Updated on Thu, Aug 31 2023 3:25 PM

IndiGo Crew MemberTies Rakhi On FlightTo Her Brother video viral - Sakshi

రక్షా బంధన్ అనేది తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన బంధానికి సంబంధించిన వేడుక. ఈ శుభ సందర్భాన్ని దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే చాలా మంది సోదర సోదరీమణులు ఒకరికొకరు ఈ రోజు కలవడం కుదరకపోవచ్చు. వృత్తి పరమైన ఇబ్బందులతోపాటు అనేక కారణాల  రీత్యా తమ సోదరులను మిస్‌ అవుతూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో ఈ పండుగ రోజున అనూహ్యంగా కలుసుకొని, రాఖీ వేడుక చేసుకుంటారు. అలాంటి సంఘటన ఒకటి ఇండిగో విమానంలో చోటు చేసుకుంది.

ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ మెంబర్ అయిన శుభకు అలాంటి అదృష్టం వరించింది. ఇండిగో విమాన పైలట్‌గా ఉన్న తన సోదరుడు గౌరవ్‌తో కలిసి    రక్షాబంధన వేడుక జరుపుకోవడం ముచ్చటగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. (రక్షాబంధన్‌ అందరిదీ..అపోలో టైర్స్‌ యాడ్‌ అదిరిపోయింది.. వైరల్‌ వీడియో)

విమానం టేకాఫ్‌కి ముందు ప్రయాణికులకు శుభ ప్రత్యేక ప్రకటనతో వీడియో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక క్షణాలను జరుపుకోవడం అన్ని సార్లూ సాధ్యపడదు.  ముఖ్యంగా మాకు..ఎందుకంటే మీ ప్రియమైన వారితో కలిసి వేడుకు జరపుకునేలా  మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లడం  ముఖ్యం కాబట్టి  అంటూ ఫ్లైట్ ఇంటర్‌ఫోన్ సిస్టమ్‌లో అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. ఈ రోజు నాకు అన్నకెప్టెన్  గౌరవ్‌కు చాలా ప్రత్యేకమైన రోజు,  చాలా  ఏళ్ల  తర్వాత కలిసి రక్షా బంధన్ జరుపుకుంటున్నాం అని  ప్రకటించారు.

అందరి అన్నాచెల్లెళ్లలాగానే మేమూ కొట్టుకుంటాం,తిట్టుకుంటాం,నవ్వుకుంటాం..ఏడుస్తాం... కానీ  నాకు మాత్రం నా అన్న రాక్, నా బెస్ట్ ఫ్రెండ్,  నాకు పెద్ద ఆలంబన అంటూ అంటూ శుభ సోదరుడికి రాఖీ కట్టి, అన్న ఆశీర్వాదం తీసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రయాణీకులు అందరూ ప్రయాణికులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. 30వేల అడుగల ఎత్తున​ ఉన్నా, భూమి మీద ఉ‍న్న ఎక్కడున్నా బ్రదర్‌ అండ్‌ సిస్టం బాండింగ్‌ స్పెషల్‌ అంటూ ఈ వీడియోను ఇండిగో చేసిన ట్వీట్ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement