cabin crew
-
జీతాల్లేవ్.. మూణ్నెళ్లు ఇంటి దగ్గరే ఉండండి
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తమ 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు ఫర్లాఫ్ చేయాలని నిర్ణయించింది. అంటే మూడు నెలలపాటు పని లేదని, జీతాలు ఇవ్వలేమని, ఉద్యోగులు విధుల్లోకి రావద్దని ప్రకటించింది.ఆర్థిక ఇబ్బందులు, చట్టపరమైన సమస్యలతో సతమతమవుతున్న స్పైస్‌జెట్ తక్కువ సంఖ్యలో విమానాలతో పనిచేస్తోంది. ప్రస్తుతం కేవలం 22 విమానాలను మాత్రమే నడిపిస్తోంది. సంస్థలోని మొత్తం 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు వేతనం లేకుండా సెలవుపై పంపనున్నట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి తాజాగా తెలిపారు. అంతకుముందు రోజు, ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ స్పైస్‌జెట్‌పై నిఘాను మరింత పెంచినట్లు తెలిపింది."స్పైస్‌జెట్ 150 మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా మూడు నెలల పాటు ఫర్లాఫ్లో ఉంచడానికి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత లీన్ ట్రావెల్ సీజన్, తగ్గిన విమానాల పరిమాణానికి ప్రతిస్పందనగా, సంస్థ దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది" అని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫర్లాఫ్ కాలంలో, క్యాబిన్ క్రూ సభ్యులు స్పైస్‌జెట్ ఉద్యోగులుగానే కొనసాగుతారని, అన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఆర్జిత సెలవులు చెక్కుచెదరకుండా ఉంటాయని చెప్పారు. -
ఎయిరిండియా మహిళా సిబ్బందిపై దాడి
ఢిల్లీ:లండన్‌లోని ఓ హోటల్లో ఎయిరిండియాకు చెందిన మహిళా సిబ్బందిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. ఈ విషయాన్ని ఆదివారం ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘లండన్‌లో ఎయిరిండియా క్యాబిన్ క్రూ మెంబర్ బస చేసిన హోటల్ రూమ్‌లో గుర్తు తెలియని దుండగుడు అక్రమంగా చొరబడి దాడికి తెగబడ్డాడు. ఆమెపై దాడి చేశాడు. సమాచారం అందిన వెంటనే స్పందించాం. ఆమెకు, ఆమె సహోద్యోగులకు తక్షణ సహాయం అందించడమే కాకుండా ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నాం’ అని ఎయిరిండియా పేర్కొంది.Air India registers anguish over "unlawful incident of intrusion" after attack on air hostess in London, police begin probeRead @ANI Story lhttps://t.co/6IzBBBBSL0#AirIndia #London #Airhostess pic.twitter.com/MaOXaqh5YD— ANI Digital (@ani_digital) August 18, 2024గురవారం రాత్రి లండన్‌లోని రాడిసన్ రెడ్ హోటల్ రూంలో చొరబడి దాడికి తెగబడిన నిందితుడి అరెస్ట్ చేసినట్లు.. అతను నైజీరియా దేశానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటన ప్రస్తుతం లండన్ పోలీసుల విచారణలో ఉందని, సిబ్బంది గోప్యతను గౌరవించాలని అక్కడి అధికారులకు ఎయిర్ ఇండియా విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిగేలా స్థానిక అధికారులు సహకారం అందిచాలని ఎయిరిండియా కోరింది. -
జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది సమ్మెను విరమించిన రెండు వారాలలోపే మరో ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. విమానాల ఆలస్యం, రద్దు కారణంగా డిపార్చర్ల సంఖ్య తగ్గడం క్యాబిన్ సిబ్బంది జీతాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యూనియన్ పేర్కొంది.ఎయిర్పోర్ట్ ప్రవేశ పాస్‌లు లేకపోవడంతో 100 మందికి పైగా క్యాబిన్ సిబ్బంది గత రెండు నెలలుగా ఫ్లైయింగ్ డ్యూటీలు లేకుండా ఖాళీగా కూర్చున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (AIXEU) పేర్కొంది. ఈ యూనియన్ ఎయిర్‌లైన్ క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.దేశ రాజధాని ఢిల్లీలో మే 9న చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) ఏర్పాటు చేసిన యూనియన్, విమానయాన సంస్థ ప్రతినిధుల సమావేశం తర్వాత క్యాబిన్ క్రూ సమ్మె విరమించింది. ఎయిన్లైన్ యాజమాన్య వైఖరికి నిరసనగా చేపట్టిన ఈ సమ్మె కారణంగా విమాన సర్వీసులకు అంతరాయాలు ఏర్పడ్డాయి.ఎయిర్‌లైన్ షెడ్యూలింగ్ విభాగం కొత్త సాఫ్ట్‌వేర్‌కు మారుతున్న క్రమంలో క్యాబిన్ సిబ్బంది డేటా తొలగిపోయిందని తాజాగా చీఫ్ లేబర్ కమిషనర్‌కు రాసిన లేఖలో యూనియన్ పేర్కొంది. విమానాల రద్దు, ఆలస్యాలను కవర్ చేయడానికి క్యాబిన్ సిబ్బంది బేస్ వారీగా షెడ్యూలింగ్ విభాగానికి మాన్యువల్‌గా సహాయం చేస్తున్నారని యూనియన్ చెబుతోంది.డిపార్చర్ల సంఖ్య తగ్గడం వల్ల క్యాబిన్ సిబ్బంది జీతాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయని, ఈ విషయంలో కమిషనర్ తక్షణ జోక్యాన్ని యూనియన్ కోరుతోంది. క్యాబిన్ సిబ్బంది ఫ్లైయింగ్ హవర్స్‌తో జీతాలు కూడా ముడిపడి ఉంటాయి. అయితే ఈ అంశంపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక ప్రతినిధి నుంచి ఎటువంటి స్పందనా లేదు. -
ఫ్లైట్‌లో ఇండియన్ చెస్ స్టార్.. క్యాబిన్ క్రూ వినూత్న అభినందనలు!
భారత చెస్ యువ సంచలనం, ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు అంతటా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆడి భారత్‌కు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చిన ప్రజ్ఞానందకు ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ వినూత్నంగా అభినందనలు తెలిపారు. ఇటీవల ఇండిగో విమానంలో తల్లితో కలిసి ప్రయాణించిన ప్రజ్ఞానందకు విమానంలో ఉన్న క్యాబిన్ సిబ్బంది ఒక నోట్ అందించారు. చెస్ స్టార్ ప్రజ్ఞానంద, అతని తల్లితో కలిసి క్యాబిన్ క్రూ మెంబర్ దిగిన ఫొటోతో పాటు సిబ్బంది స్వయంగా రాసిన అభినందన నోట్ చిత్రాన్ని ఇండిగో సంస్థ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేసింది. భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ మాస్టర్ ప్రజ్ఞానంద తమ ఫ్లైట్‌లో ప్రయాణించడం గౌరవంగా ఉందని, మొట్టమొదటి ప్రపంచ కప్ ఫైనలిస్ట్‌గా నిలిచిన యువ ఛాంపియన్‌కు అభినందనలు అంటూ ప్రశంసించింది. ప్రజ్ఞానందను విమానంలో ఆన్‌బోర్డ్ చేయడం తమకు నిజంగా గౌరవం, సంతోషాన్ని కలిగిస్తోందని, దేశానికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన అందరికీ స్ఫూర్తి అంటూ క్యాబిన్ క్రూ స్వయంగా రాసి సంతకాలు చేసి ప్రజ్ఞానందకు అందించారు. అజర్బైజాన్లో జరిగిన ఫిడే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ప్రజ్ఞానంద.. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌తో తలపడి రన్నరప్‌గా నిలిచారు. దీంతో ప్రజ్ఞానందకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా అభినందించారు. అలాగే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా ప్రశంసించి మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బహుమతిగా అందించారు. ✈️ Taking chess to new heights! 🏆 We were honored to have Indian chess grandmaster Master R Praggnanandhaa on board. Congratulations to the young champion on becoming the first-ever World Cup finalist!#goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/RmwcMjmy3H — IndiGo (@IndiGo6E) August 31, 2023 -
30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్
రక్షా బంధన్ అనేది తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన బంధానికి సంబంధించిన వేడుక. ఈ శుభ సందర్భాన్ని దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే చాలా మంది సోదర సోదరీమణులు ఒకరికొకరు ఈ రోజు కలవడం కుదరకపోవచ్చు. వృత్తి పరమైన ఇబ్బందులతోపాటు అనేక కారణాల రీత్యా తమ సోదరులను మిస్ అవుతూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో ఈ పండుగ రోజున అనూహ్యంగా కలుసుకొని, రాఖీ వేడుక చేసుకుంటారు. అలాంటి సంఘటన ఒకటి ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ మెంబర్ అయిన శుభకు అలాంటి అదృష్టం వరించింది. ఇండిగో విమాన పైలట్‌గా ఉన్న తన సోదరుడు గౌరవ్‌తో కలిసి రక్షాబంధన వేడుక జరుపుకోవడం ముచ్చటగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. (రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో) విమానం టేకాఫ్‌కి ముందు ప్రయాణికులకు శుభ ప్రత్యేక ప్రకటనతో వీడియో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక క్షణాలను జరుపుకోవడం అన్ని సార్లూ సాధ్యపడదు. ముఖ్యంగా మాకు..ఎందుకంటే మీ ప్రియమైన వారితో కలిసి వేడుకు జరపుకునేలా మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లడం ముఖ్యం కాబట్టి అంటూ ఫ్లైట్ ఇంటర్‌ఫోన్ సిస్టమ్‌లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ రోజు నాకు అన్నకెప్టెన్ గౌరవ్‌కు చాలా ప్రత్యేకమైన రోజు, చాలా ఏళ్ల తర్వాత కలిసి రక్షా బంధన్ జరుపుకుంటున్నాం అని ప్రకటించారు. అందరి అన్నాచెల్లెళ్లలాగానే మేమూ కొట్టుకుంటాం,తిట్టుకుంటాం,నవ్వుకుంటాం..ఏడుస్తాం... కానీ నాకు మాత్రం నా అన్న రాక్, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు పెద్ద ఆలంబన అంటూ అంటూ శుభ సోదరుడికి రాఖీ కట్టి, అన్న ఆశీర్వాదం తీసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రయాణీకులు అందరూ ప్రయాణికులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. 30వేల అడుగల ఎత్తున ఉన్నా, భూమి మీద ఉన్న ఎక్కడున్నా బ్రదర్ అండ్ సిస్టం బాండింగ్ స్పెషల్ అంటూ ఈ వీడియోను ఇండిగో చేసిన ట్వీట్ చేసింది. At 30,000 feet or on the ground, the bond of a brother and sister remains special. A heartwarming moment on board today as our Check Cabin Attendant Shubha celebrates Rakhi with her brother Capt. Gaurav. #HappyRakshaBandhan2023 #HappyRakhi #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/WoLgx8XoIa — IndiGo (@IndiGo6E) August 30, 2023 -
విమానం రెక్కలపై సిబ్బంది డ్యాన్సులు..
విమానం రెక్కపై డ్యాన్స్ చేస్తూ స్విస్ ఎయిర్‌పోర్టు లైన్స్ సిబ్బంది బుక్కయ్యారు. బోయింగ్ 777 విమానం రెక్కపై సిబ్బంది డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విమానయాన సంస్థ చర్యలకు సిద్ధపడింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం సహించరానివని స్పష్టం చేసింది. బోయింగ్ 777 విమానం ఎయిర్‌పోర్టులో ఆగింది. ఈ క్రమంలో ఓ మహిళా సిబ్బంది విమానం రెక్కపై డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అధికారిగా కనిపించే మరో వ్యక్తి కూడా బాడీ బిల్డింగ్ పోజులు ఇచ్చారు. ఈ దృశ్యాలను విమానం కోసం టెర్మినల్ వద్ద వేచి చూస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారి స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు యాజమాన్యానికి చేరింది. Moment air hostesses for #Swiss International Air Lines are caught on camera posing for selfies as they dance on wing of Boeing 777 in #BuenosAires, #Argentina pic.twitter.com/9lCwCrjVRA — Hans Solo (@thandojo) August 27, 2023 బోయింగ్ విమానం రెక్క ఐదు మీటర్ల వెడల్పు, 16.4 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు నుంచి కిందపడితే తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుందని ఎయిర్ పోర్టు యాజమాన్యం తెలిపింది. సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చూడటానికి సరదాగా అనిపించినా.. ఇలాంటి ఘటనలు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా..
టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ ఇండియా తమ పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ఏప్రిల్ 1 నుంచి జీతాలను సవరించింది. ఏ స్థాయి ఉద్యోగం ఎంత జీతం వస్తోందో తాజాగా వెల్లడైంది. సవరించిన జీతాల ప్రకారం.. ఎయిర్ ఇండియా పైలట్‌కు నెలకు కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.8.5 లక్షలు జీతం లభిస్తోంది. ఇక క్యాబిన్ సిబ్బందికి కనీసం రూ.25,000 నుంచి సీనియారిటీ, ఇతర అంశాల ఆధారంగా గరిష్టంగా రూ.78,000 జీతం వస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్లు, ఇతర సిబ్బంది జీతాలు ఇలా.. కనిష్టంగా ట్రైనీ పైలట్‌కు నెలకు రూ.50,000 లభిస్తుంది. లైన్ రిలీజ్ తర్వాత జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు ఒక సంవత్సరం వరకూ నెలకు రూ.2.35 లక్షలు వస్తుంది. ఇక ఫస్ట్ ఆఫీసర్లు రూ. 3.45 లక్షలు, కెప్టెన్ రూ 4.75 లక్షలు జీతం అందుకుంటారు. కెప్టెన్ నుంచి అప్‌గ్రేడ్ అయిన కమాండర్‌కు రూ. 7.50 లక్షలు వస్తుంది. 4 సంవత్సరాల కంటే ఎక్కువ P1 రేటింగ్ ఉన్న సీనియర్ కమాండర్ నెలకు రూ.8.50 లక్షలు పొందుతారు. జీతంతో పాటు జూనియర్ పైలట్‌కు గంటకు రూ. 1,500 నుంచి రూ. 1,950 ఫ్లయింగ్ హవర్స్ అలవెన్సులు చెల్లిస్తారు. కమాండర్లు, సీనియర్ కమాండర్లకు నెలకు రూ.75,000, ఇతర వర్గాల పైలట్లకు రూ.25,000 బాడీ అలవెన్స్ ఉంటుంది. ఇదికాక కమాండర్లు, సీనియర్ కమాండర్లకు ఒక రాత్రికి రూ.2,200 చొప్పున డొమెస్టిక్ లేఓవర్ అలవెన్స్ లభిస్తుంది. ఇక ట్రైనీ క్యాబిన్ సిబ్బందికి ఫ్రెషర్‌కు రూ.25,000, అనుభవజ్ఞులైనవారికి రూ.30,000 స్టైఫండ్ లభిస్తుంది. రెగులర్ క్యాబిన్ సిబ్బందికి రూ.53,000, సీనియర్లకు రూ.64,000, ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ సిబ్బంది నెలకు రూ.78,000 అందుకుంటారు. ఫ్లయింగ్ అలవెన్స్ క్యాబిన్ సిబ్బందికి రూ.375 నుంచి రూ.750 వరకు చెల్లిస్తారు. ఇక సీనియర్ క్యాబిన్ సిబ్బందికి రూ.475 నుంచి రూ.950 వరకు, ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ సిబ్బంది రూ.525 నుంచి రూ.1,050 వరకు ఫ్లయింగ్ అలవెన్స్ అందుకుంటారు. కాగా శాశ్వత క్యాబిన్ సిబ్బందికి సాధారణ భత్యం 0-60 గంటల విమాన ప్రయాణానికి రూ.300, 65-70 గంటలకు రూ.375గా నిర్ణయించారు. సీనియర్ ఉద్యోగులు 0-65 గంటలు ప్రయాణం చేస్తే రూ.400 నుంచి రూ.650, అలాగే 65-70 గంటల వరకు రూ.525 నుంచి రూ.700 వరకు పొందుతారు. ఇదీ చదవండి: వీల్స్ ఆన్ వెబ్: కార్ ఆన్లైన్లో ఆర్డర్ చేయండి.. ఇంటికొచ్చేస్తుంది! -
గోల్డ్ స్మగ్లింగ్: ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ అరెస్ట్
క్రైమ్: బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని బుధవారం అధికారులు కేరళలో అరెస్ట్ చేశారు. బహ్రైన్-కోజికోడ్-కోచి సర్వీస్‌లో సదరు సిబ్బంది పని చేస్తున్నాడు. నిందితుడిని వయనాడ్(కేరళ)కు చెందిన షఫీగా గుర్తించారు. షఫీ బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నాడనే పక్కా సమాచారం అందుకున్న అధికారులు.. బుధవారం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బంగారాన్ని చేతులకు చుట్టి, చొక్కా స్లీవ్‌ను కప్పుకుని గ్రీన్ ఛానల్ గుండా వెళ్లాలని ప్లాన్ చేశాడు. ఈలోపే కస్టమ్స్ అధికారులు పట్టేసుకుని.. షఫీ నుంచి 1,487 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బుధవారం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోనూ సింగపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. మూడున్నర కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. Kochi | Air India cabin crew Shafi, a native of Wayanad, was arrested at Kochi Airport for smuggling 1,487 gms of gold. The cabin crew was of Bahrain-Kozhikode-Kochi service. Further interrogation underway: Customs Preventive Commissionerate pic.twitter.com/1nxVzF2fA7 — ANI (@ANI) March 8, 2023 -
విమానంలో ప్యాసింజర్ వీరంగం.. కొట్టి, ఉమ్మి వేసి..
విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనలకు సంబంధించన పలు ఘటల గురించి విన్నాం. ఇటీవలే సహ ప్రయాణకురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువుకే మునుపే అదే తరహ ఘటనలు వరసగా వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడొక ప్రయాణికురాలు అంతకు మించి అన్నట్టుగా.. చాలా ఘోరంగా ప్రవర్తించింది. ఆమె చేసిన హంగామా...ఆ విమానంలోని సిబ్బందిని హడలెత్తించేలా వికృతంగా ప్రవర్తించింది. తనది కాని సీటులో కూర్చొన్నదే గాక సిబ్బందిని దుర్భాషలాడుతూ..వారిపైనే దాడికి దిగింది. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...విస్తారా అబుదాబి అనే ముంబై విమానంలో 45 ఏళ్ల ఇటాలియన్ ప్రయాణికురాలు నానా బీభత్సం సృష్టిచింది. ఆమె ఎకనామీ టిక్కెట్టు కొనుక్కుని బిజినెస్ సీటులో కూర్చొంటానని పట్టుబట్టింది. ఆ సీటు తనది కాదని విమాన సిబ్బంది చెప్పేందుకు యత్నించగా.. వారిని దుర్భాషలాడుతూ దాడికి దిగింది. ఆ సిబ్బందిలో ఒకర్నీ కొట్టి, మరొకరిపై ఉమ్మి వేసి భయానకంగా ప్రవర్తించింది. అక్కడితో ఆగక అర్థనగ్నంగా నడిచి ప్రయాణికులను, సిబ్బందిని భయబ్రాంతులకు లోను చేసింది. దీంతో కెప్టెన్ ఆమె అనుచిత ప్రవర్తన దృష్ట్యా హెచ్చరిక కార్డ్‌ను జారీ చేసి ప్రయాణికురాలిని నిరోధించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగానే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి..సదరు ప్రయాణకురాలిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రౌండ్ సెక్యూరిటీ ఏజెన్సీలను అలర్ట్ చేశాడు. ఈ మేరకు భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: 13 గంటలు గగన ప్రయాణం.. చివరికి ఊహించని ల్యాండింగ్.. ప్రయాణికుల షాక్) -
ఉద్యోగులకు బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఇండియా.. దాదాపు 8 వేల మందికి
ముంబై/న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా తన ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ ఆఫర్ ఇచ్చింది. శాశ్వత ఉద్యోగులకు ‘ఎంప్లాయీస్ షేర్ బెనిఫిట్ (ఈఎస్‌బీ) స్కీమ్, 2022’ కింద 98 కోట్ల షేర్లను కేటాయించనుంది. 2022 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియా నియంత్రణ టాటా గ్రూపు చేతికి వెళ్లడం తెలిసిందే. ఈ స్టాక్ ఆప్షన్ పథకం కింద 8,000 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నట్టు ఎయిర్ ఇండియా ఉద్యోగి ఒకరు తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా చేసుకున్న షేరు కొనుగోలు ఒప్పందం ప్రకారం.. ప్రైవేటీకరించే నాటికి సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఎంప్లాయీ షేర్ బెనిఫిట్ పథకాన్ని ఆఫర్ చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇందులో ఉండే దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఉద్యోగులకు తెలియజేస్తామని పేర్కొంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పనిచేసే శాశ్వత ఉద్యోగులు అందరికీ ఈ పథకం కింద అర్హత ఉంటుంది. కొనుగోలు చేసే నాటికి ఒక్కో షేరు పుస్తక విలువ 87–90 పైసలు ఉంటే, తాజా పథకంలో భాగంగా ఒక్కో స్టాక్ ఆప్షన్‌ను 27 పైసలకు ఆఫర్ చేసినట్టు తెలిసింది. చదవండి: Union Budget 2023: 6 నెలల నుంచి మొదలు, బాబోయ్ బడ్జెట్ తయారీ వెనుక ఇంత కథ నడుస్తుందా! -
ఆఫీస్‌కి రావాలంటే అవి తప్పనిసరి.. ఎయిర్ ఇండియా కొత్త రూల్స్
టాటా గ్రూప్.. ఈ సంస్థకు ఉన్న పేరు ప్రఖ్యాతలు, మార్కెట్లో వాటికున్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక వ్యాపారంలో అడుగుపెడితే తమ సంస్థ మార్క్ పని తీరుతో లాభాల బాట పట్టించడం టాటా గ్రూప్ ప్రత్యేకత. ఇటీవల భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ఈ సంస్థ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థను కూడా మిగిలిన సంస్థల మాదిరి లాభాలవైపు నడిపేందుకే వ్యూహాలు రచిస్తోంది టాటా గ్రూప్. ఈ క్రమంలోనే యాజమాన్యంలో ఎయిర్ ఇండియా కొత్త రూపు సంతరించుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా విమానాల్లో పనిచేసే క్యాబిన్ క్రూ, సిబ్బంది అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉండేలా వారి ఆహార్యంలో మార్పులు తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే పురుషులు, మహిళా సిబ్బంది వస్త్రధారణకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. అందులో కొన్నింటిని తెలుసుకుందాం.. పురుషుల కోసం ►హెయిర్ జెల్ వాడకం తప్పనిసరి. ► బట్టతల లేదా జుట్టు ఎక్కువగా ఊడిపోయిన వారు పూర్తిగా గుండు చేయించుకోవాలి. ఇక ప్రతి రోజూ షేవ్ చేసుకుంటూ ఉండాలి. ►తెల్లవెంట్రకలు ఉన్నవారు సహజ సిద్దంగా ఉండేలా వారి జుట్టుకు రంగు వేసుకోవాలి. ఫ్యాషన్ రంగులు, హెన్నా వంటివి వేసుకోకూడదు. మహిళల కోసం ►ముత్యాల చెవిపోగులు ధరించకూడదు. ఫ్లైట్ అటెండెంట్లు డిజైన్ లేకుండా బంగారం లేదా డైమండ్ ఆకారపు చెవిపోగులు మాత్రమే ధరించాలి. ►రింగ్స్ వెడల్పు 1 cm కంటే ఎక్కువగా ఉండకూడు. అది కూడా చేతికి ఒకటి మాత్రమే. ►అమ్మాయిలు కూడా జుట్టు నెరిసిపోతే సహజ షేడ్స్ లేదా కంపెనీ హెయిర్ కలర్ షేడ్ కార్డ్‌లో ఉండే రంగు వేసుకోవాలి. చదవండి: షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్? -
విమాన ప్రయాణంలో ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఎందుకు ఆన్ చేస్తారో తెలుసా?
తరుచూ మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? అయితే మీరు ప్లైట్ జర్నీ చేసే సమయంలో క్యాబిన్ క్రూ సిబ్బంది మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని లేదంటే ఫోన్లో ఉన్న ఫ్లైట్ మోడ్ ఆన్ చేయమని అనౌన్స్ చేస్తారు.అసలు ఫ్లైట్ జర్నీలో ఫ్లైట్ మోడ్ ఎందుకు ఆన్ చేయమంటారో తెలుసా? మనఫోన్‌లో వైర్ లెస్ కనెక్షన్స్ అంటే బ్లూటూత్, వైఫై, మొబైల్ డేటా, నెట్ వర్క్ కనక్షన్ మొత్తం ఆఫ్ చేసేస్తుంది. ఎందుకంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థ (ఆర్ఎఫ్సీ) కేబిన్ క్రూ సిబ్బంది మాట్లాడుకునే మాటలు మ్యాచ్ అయితే ఫైలెట్స్కు చిన్న సౌండ్ లాగా వస్తుంది. వాళ్లలో వాళ్లకే కమ్యూనికేషన్లో ఇబ్బందిని కలిగిస్తుంటుంది. అందుకే ప్రతి ఫోన్లో ఏరోప్లెయిన్ మోడ్ ఇస్తారు. అమెరికాలాంటి దేశాల్లో సైతం ఈ ఆప్షన్‌ను తప్పని సరిగా వినియోగించాలి.లేదంటే సదరు విమానయాన సిబ్బంది ఫైన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
రండి రండి.. దయచేయండి!
సాక్షి, హైదరాబాద్: ఏ అంతర్జాతీయ విమానం ఎక్కినా ఎయిర్‌హోస్టెస్ ఆంగ్లంలో ‘వెల్కం’ అని పలకరిస్తూ ఆహ్వానిస్తుంది. కానీ చక్కటి తెలుగులో ‘స్వాగతం.. రండి కూర్చోండి. ప్రయాణ సమయం లో మీకు ఎలాంటి సహాయం కావలసినా మమ్మల్ని సంప్రదించండి’...అంటూ ఆత్మీయంగా పలకరిస్తే ఎలా ఉంటుంది. విమానాల్లో తెలుగుదనం ఉట్టిపడితే ఎంత బావుంటుందో కదా. అలాంటి అద్భుతమైన తెలుగు క్యాబిన్ క్రూ సేవలను అందుబాటులోకి తెచ్చింది బ్రిటిష్ ఎయిర్వేస్. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇకనుంచి తెలుగులో మాట్లాడే క్యాబిన్ క్రూ అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ మాట్లాడవచ్చు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చేందుకు గతంలోనే ప్రతిపాదనలను సిద్ధంచేసిన బ్రిటిష్ ఎయిర్వేస్ తాజాగా హైదరాబాద్ ప్రయాణికులకు తెలుగు క్యాబిన్ క్రూను పరిచయం చేసింది. ఇందుకోసం 25 మంది సిబ్బందికి 6 వారాలు శిక్షణనిచ్చి వారి సేవలను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే బీఏ 276, బీఏ 277 విమానాలలో ప్రయాణికులు ఇక నుంచి మాతృభాషలో పలకరింపులను ఆస్వాదించవచ్చు. 95 ఏళ్లు గా బ్రిటిష్ ఎయిర్వేస్ దేశంలోని వివిధ నగరాల నుంచి విమానాలను నడుపుతోంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైల నుంచి ప్రస్తుతం 28 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. -
సంచలనం: పీకలదాకా మద్యం తాగి విమానం నడుపుతున్న పైలెట్లు!
విమానయాన రంగంలో 30కి పైగా వివిధ రకాలైన ఉద్యోగాలుంటాయి.వాటిలో మిగిలిన ఉద్యోగుల విధులు ఎలా ఉన్నా..ఆకాశంలో ఎగిరే విమానాన్ని నియంత్రించే అధికారం పైలెట్లకు మాత్రమే ఉంటుంది. అందుకే ఈ విభాగంలో ఉద్యోగులు ఎంతో నిబద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇటీవల విమానం పైలెట్ల గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంస్థ విస్తుపోయే వాస్తవాల్ని బయట పెట్టింది. ఏవియేషన్ రెగ్యూలేటర్ ప్రకారం..విమానంలో ప్రయాణించే ముందు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ (బీఏ) టెస్టుల్లో విఫలమైన విమాన సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ ఉద్యోగులకు తీరు ఇలాగే ఉంటుందా అని ప్రశ్నించింది. ఎందుకంటే ఏవియేషన్ రెగ్యులేటర్ జనవరి 1, 2022 నుండి నాలుగు నెలల కాలంలో 48 మంది సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లు చేయగా మద్యం సేవించడంతో పాటు ఇతర నిబంధనల్ని ఉల్లంఘించారు. దీంతో విమానయాన సిబ్బందిపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో 9మంది పైలెట్లు, 30మంది క్యాబిన్ క్రూ సిబ్బందికి మద్యం సేవించినట్లు గుర్తించారు. వీరిలో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు క్యాబిన్ క్రూ సిబ్బంది రెండోసారి మద్యం తాగినట్లు తేలడంతో మూడేళ్లపాటు సస్పెండ్ చేసింది. మిగిలిన 37 మంది సిబ్బందిని తొలిసారి పాజిటివ్ రావడంతో వారిని సైతం 3 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, విమానయాన సంస్థలు కాక్‌పిట్, క్యాబిన్ క్రూ సభ్యులలో 50 శాతం మందిని రోజూ ప్రీ ఫ్లైట్ ఆల్కహాల్ టెస్ట్‌లు చేయించుకోవాలని గత నెలలో డీజీసీఏ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తికి ముందే సిబ్బంది విమాన ప్రయాణానికి ముందే ఆల్కహాల్ టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా 2 నెలలు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ల్ని నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టి, విమానయాన సర్వీసులు ప్రారంభం కావడంతో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ల్ని మళ్లీ ప్రారంభించారు. తాజాగా నిర్వహించిన ఈ టెస్ట్‌ల్లో విమానయాన సిబ్బంది బాగోతం బట్టబయలైంది. చదవండి👉మద్యం తాగి కాక్‌పిట్‌లో ప్రయాణం -
బాబోయ్ ఫ్యూయల్ రేట్లు మండిపోతున్నాయ్! విమానాల్లో మగవాళ్లు వద్దు?
కరోనా దెబ్బతో అతలాకుతలమైన ఏవియేషన్ సెక్టార్‌పై రష్యా - ఉక్రెయిన్ వార్ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయ్యింది. అంతర్జాతీయ ఉద్రిక్తలతో గత మూడు నెలలుగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఏవియేషన్ ఫ్యూయల్ రేట్లు పెరిగాయి. చివరి సారిగా ఏకంగా 18 శాతం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో విమానాలు నడిపించడం కత్తిమీద సాములా మారింది. పెరిగిన ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు సర్వీసు ప్రొవైడర్లకు ఇబ్బందికరంగా మారాయి. విమాన సర్వీసుల నిర్వాహాణలో 40 శాతం వ్యయం కేవలం ఫ్యూయల్‌కే వెళ్తుంది. దీంతో పెరుగుతున్న ధరలు ఫ్లైట్ సర్వీస్ ప్రొవైడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంధన పొదుపుకు సంబంధించి ఏం చేయాలనేది వారికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్‌కి ఆసక్తికరమైన సూచన చేశాడు విశాల్ శ్రీవాత్సవ అనే నెటిజన్. విమానం నడిపే క్యాబిన్ క్రూలో మీరు ఎందుకు ఎక్కువ మంది మగవాళ్లనే నియమిస్తున్నారు? పురుషులతో పోల్చితే మహిళలు తక్కువ బరువు ఉంటారు. దీంతో తక్కువ ఇంధనం ఖర్చవుతుంది. మీరు లేడీ కేబిన్ క్రూను తీసుకోవడం ద్వారా ప్రతీ ఫ్లైట్‌కి కనీసం వెయ్యి రూపాయలు ఆదా అవుతాయి అనుకున్నా.. రోజుకు వంద ఫ్లైట్లు నడిపిస్తారనుకున్నా.. ఏడాదికి కనీసం రూ. 3.5 కోట్ల వ్యయం తగ్గుతుంది కదా ? అంటూ ప్రశ్నించాడు. విశాల్ శ్రీవాత్సవ సంధించిన ప్రశ్నలకు జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందిస్తూ.. మంచి ఐడియా ఇచ్చారు విశాల్. కేవలం కేబిన్ క్రూ విషయంలోనే ఈ నియమం ఎందుకు అమలు చేయాలి ? ప్రయాణికుల్లో కూడా మొత్తం మహిళలే ఉండేలా చూసుకోవడం లేదా కనీసం మగ ప్యాసింజర్లను తగ్గించినా కూడా ఫ్యూయల్ బాగానే ఆదా అవుతుంది కదా అంటూ బదులిచ్చారు. Extending that logic, imagine the savings if one were to carry only female passengers! Or charge male passengers more! 😉 https://t.co/3GP2YETBnV — Sanjiv Kapoor (@TheSanjivKapoor) March 22, 2022 మీరు చెప్పిన లాజిక్ బాగానే ఉన్నా అది దీర్ఘకాలంలో లింగ వివక్షకు దారి తీస్తుంది. అంతే కాదు చట్టపరమైన చిక్కులు కూడా వస్తాయి. ఫ్యూయల్ కాస్ట్ తగ్గించుకునేందుకు మహిళా క్రూ అనేది అంత సబబైన విధానం కాదంటూ వివరణ ఇచ్చారు సంజీవ్ కపూర్. మొత్తంగా పెరుగుతున్న ఫ్యూయల్ ఛార్జీలతో ఏవియేషన్ సెక్టార్ ఎంతగా ఇబ్బంది పడుతుంతో తెలిపేందుకు విశాల్, సంజీవ్ కపూర్ల మధ్య జరిగిన సంభాషణ ఉదాహారణగా నిలుస్తోందంటున్నారు నెటిజన్లు. చదవండి: నష్టాల ఊబిలో ఏవియేషన్ -
‘గాలి ఆడక.. చెమటతో చాలా ఇబ్బంది పడ్డాం’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసులు రెండు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వల్ల విమానాశ్రయాలు, విమానం లోపల పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు విమానాయన సిబ్బంది తొలి రోజు తమ అనుభవాలను మీడియాకు వెల్లడించారు. ‘రెండు నెలల తర్వాత ప్రయాణం చేస్తున్నాము. పద్దతుల్లో ఎలాంటి మార్పు లేదు.. విమానాలు సమాయానికి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.. మేం కాక్‌పిట్‌లో ఉన్నాం కాబట్టి చాలా భద్రంగా ఉన్నాము’ అని పైలెట్, కో పైలెట్ తెలిపారు. (ముఖానికి మాస్కులు.. షీల్డులు) అయితే క్యాబిన్ క్రూ మాత్రం పీపీఈ కిట్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ‘మా యూనిఫామ్‌లు చాలా సౌకర్యంగా ఉండేవి. అసలే వేసవి, అధిక ఉష్ణోగ్రత ఇలాంటి సమయంలో పీపీఈ కిట్లు ధరించి పని చేయడం చాలా కష్టంగా ఉంది. గాలి సరిగా ఆడదు. కొన్ని సార్లు చెమట పట్టి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా అత్యసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించడానికి కుదరదు. అయితే ప్రస్తుతం విమానం లోపల ఆహారం, కూల్‌డ్రింక్‌లు వంటివి అనుమతించకపోవడం వల్ల మా పని కాస్తా సులువు అయ్యింది’ అన్నారు. (కరోనా ప్రభావమే ఎక్కువ..) విమానాశ్రయం లోపల కూడా చాలా మార్పులు వచ్చాయి. ప్రయాణికుల వస్తువులను ఓ డిసిన్ఫెక్టెంట్ కన్వేయర్ బెల్టు గుండా వెళ్లాయి. ప్రయాణికులు రాగానే భద్రతా సిబ్బంది వారి గుర్తింపు కార్డులు చూపించమని కోరారు. సిబ్బంది భద్రత కోసం విమానాశ్రయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు కూడా పూర్తి శరీర రక్షణ సూట్లు ధరించారు. ఓ వ్యక్తి మా తాతను కలవడానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయాను. రెండు నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు.(విడతలుగా విమాన సర్వీసులు?) కరోనా భయంతో విమానాల రాకపోకలకు కొన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం, కొన్ని ఎయిర్‌పోర్టుల్లో పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతించడంతో తొలిరోజే 630 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు విమానాల సర్వీసులను ఇప్పుడే ప్రారంభించడానికి విముఖత వ్యక్తం చేశాయి. అలాగే ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి సర్వీసుల సంఖ్యను కుదించారు. రాష్ట్రాల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ప్రకటన మేరకు సోమవారం 630 విమానాలను రద్దు చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు చేరుకున్నారు. విమానాలు రద్దయ్యాయని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.(630 విమానాలు రద్దు) -
ముఖానికి మాస్కులు.. షీల్డులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలతో దేశీయంగా నిల్చిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది డ్రెస్ కోడ్‌లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. వారు కూడా ముఖానికి మాస్కులు, ఫేస్ షీల్డులు, గౌన్లు వంటి వ్యక్తిగత భద్రత సాధనాలను (పీపీఈ) ఉపయోగించనున్నారు. విధుల నిర్వహణలో ప్రయాణికులకు దగ్గరగా తిరిగే సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఆహార్యాన్ని అమలు చేయాలని ఇండిగో, ఎయిరిండియా, విస్తార, ఎయిర్ఏషియా ఇండియా తదితర సంస్థలు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 27న ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా ఆవిష్కరించిన డ్రెస్ కోడ్ తరహాలోనే ఇది కూడా ఉండవచ్చని వివరించాయి. ఫేస్ షీల్డు, ఫేస్ మాస్కుతో పాటు శరీరాన్ని పూర్తిగా కప్పేసే ఎరుపు రంగు ఫుల్ బాడీ సూట్‌ను ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా రూపొందించింది. ఎయిర్ఏషియా తమ సిబ్బంది.. పీపీఈ కిట్ కింద ఫేస్ షీల్డులు, మాస్కులు, గౌన్లు, ఆప్రాన్స్, గ్లౌజులు ధరించవచ్చని తెలుస్తోంది. విస్తార సంస్థ సిబ్బంది కొత్త డ్రెస్ కోడ్‌లో ల్యాప్ గౌన్, ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డులు ఉండవచ్చని సమాచారం. అటు ఇండిగో సిబ్బంది గౌను లేదా బాడీ సూట్‌తో పాటు సర్జికల్ మాస్కు, గ్లౌజులు, ఫేస్ షీల్డు ధరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఎయిరిండియా ఉద్యోగులు కూడా బాడీ సూట్, గ్లౌజులు, ఫేస్ షీల్డు, ఫేస్ మాస్క్ ఉపయోగించనున్నారని తెలిపాయి. -
విమానం నుంచి బయటికి పంపాలని నానా రభస..
విమానం హఠాత్తుగా నిలిపివేయడంతో వెంటనే మమ్మల్ని బయటికి పంపాలంటూ సిబ్బందిపై ప్రయాణికులు దౌర్జన్యం చేసిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఢిల్లీ నుంచి ముంబయికి గురువారం సాయంత్రం ప్రయాణికులతో బయలుదేరింది. కానీ కొద్ది సేపటికే ఇంజిన్‌లో సాంకేతికత లోపించడంతో విమానంలోని పైలట్ తిరిగి రన్‌వే మీదకు తీసుకువచ్చాడు. ఈ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు అసలేం జరిగిందో తెలుసుకోకుండా క్యాబిన్ క్రూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఊరుకోకుండా కాక్‌పిట్ డోర్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించారు. 'ఒక ప్రయాణికుడు మేము ఎంత చెప్పినా వినకుండా ఇప్పుడు పైలట్ బయటికి రాకుంటే కాక్‌పిట్ డోరును బద్దలు కొడాతానంటూ నానా రభస చేశాడు. మరో మహిళ ఏకంగా మా సిబ్బందిలో ఒకరి చేయి పట్టుకొని వెంటనే మెయిన్ ఎగ్జిట్ గేట్‌ను తొందరగా ఓపెన్ చేయాలంటూ దురుసుగా ప్రవర్తించారు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ప్రయాణికులు ఇలా దౌర్జన్యం చేయడం మాకు చాలా బాధగా అనిపించిందంటూ' సిబ్బంది వాపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎయిర్‌లైన్స్ అధికారులు ప్రయాణికుల దురుసు ప్రవర్తనపై ఒక రిపోర్టును అందజేయాలంటూ విమాన సిబ్బందిని కోరింది.(వైరల్: అమ్మాయిల వేషధారణలో అబ్బాయిలు) 'ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. అంతమాత్రానికే ప్రయాణికులు ఇలా దౌర్జన్యం చేయడం ఏం బాలేదు. దీనిపై సిబ్బంది రిపోర్టు అందజేయగానే విచారణ నిర్వహిస్తాము.దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికులపై చర్యలు తీసుకుంటామని' అధికారి పేర్కొన్నారు. అయితే ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. విమానం నిలిపివేయడానికి కారణం ఏంటో తెలుసుకోకుండా ప్రయాణికులు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. -
ఆ విమానం రన్‌వేపైనే ఆరుగంటలు..
ముంబై : దేశ ఆర్థిక నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై ఏకంగా ఆరు గంటలకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. ఎయిర్‌లైన్స్ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం రాత్రి 9.55 గంటల వరకూ రన్‌వేపైనే నిలిచిపోయింది. విమానం టేకాఫ్‌లో తీవ్ర జాప్యంపై ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తూ ట్విటర్లో కామెంట్స్ చేశారు. విమానంలోనే తమను ఆరుగంటల పాటు కూర్చోబెట్టారని, విమానం టేకాఫ్ తీసుకోదు..తమను వెలుపలికి అనుమతించరు..అసలు ఏం జరుగుతోందని పూజా రాఠీ ట్వీట్ చేశారు. మరికొందరు ఇలాంటి ఎయిర్‌లైన్స్ లైసెన్సును ఎందుకు రద్దు చేయరంటూ పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. కాగా, ముంబైలో అసాధారణ రీతిలో భారీ వర్షాలు కురవడంతో గ్రౌండ్ సపోర్ట్ సిబ్బంది, విమాన సిబ్బంది, కెప్టెన్లు సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోలేదని దీంతో ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన విమానాల్లోనూ జాప్యం చోటుచేసుకుందని, సాధారణ పరిస్థితి నెలకొనేలా ప్రయత్నిస్తున్నామని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది. -
టిఫిన్‌బాక్స్ గొడవతో విమానం ఆలస్యం
యశవంతపుర: టిఫిన్ బాక్స్‌ను శుభ్రం చేయడంపై విమానం పైలట్, క్యాబిన్ క్రూ సిబ్బందికి మధ్య జరిగిన గొడవ కారణంగా ఎయిరిండియా విమానం రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. సోమవారం బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఏఐ–772 విమానంలో ఈ ఘటన జరిగింది. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎయిరిండియా విచారణకు రావాల్సిందిగా పైలట్, సిబ్బందిని ఆదేశించింది. మొదట తెచ్చిన లంచ్ చల్లబడటం వల్ల దీనిని వేడి చేసి ఇవ్వాలని కెప్టెన్ విమానంలోని ఓ పురుష అటెండెంట్‌కు సూచించారు. సిబ్బంది అలాగేనని వేడి చేసి తెచ్చిచ్చారు. లంచ్ ఆరగించిన కెప్టెన్, ఖాళీ బాక్స్‌ను శుభ్రం చేసి ఇవ్వాలని ఓ సిబ్బందిని కోరారు. పదేపదే పనులు పురమాయిస్తున్నారంటూ సిబ్బంది కెప్టెన్‌తో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. కెప్టెన్ అసలు పనిని వదిలేసి గొడవలో మునిగిపోవడంతో విమానం రెండు గంటలు నేలమీదనే ఉండిపోయింది. -
పిల్లాడు ఏడ్చాడని విమానం నుంచి బలవంతంగా...
న్యూఢిల్లీ : పిల్లాడు ఏడ్చాడని ఓ ఇండియన్ ఫ్యామిలీని విమానం నుంచి బలవంతంగా దించేశారు. ఈ దారుణమైన సంఘటన బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ లండన్-బెర్లిన్ విమానం(బీఏ 8495)లో జూలై 23న చోటు చేసుకుంది. ఈ విషయంపై ఈ పిల్లాడి తండ్రి ఏవియేషన్ మంత్రిత్వ శాఖ సురేష్ ప్రభుకు లేఖ రాశాడు. బ్రిటీష్ విమానయాన సంస్థ తమతో వ్యవహరించిన అవమానకరమైన చర్యపై మంత్రికి వివరించాడు. విమానం టేకాఫ్ అవుతుండగా తమ పిల్లాడు బెదిరిపోయి ఏడ్వడం ప్రారంభించాడు. దీంతో తల్లి అతడ్ని ఒళ్లోకి తీసుకుంది. ఇంతలో అక్కడకు చేరుకున్న క్రూ సిబ్బంది ఒకరు.. తమపై గట్టిగా అరవడం ప్రారంభించాడు. చిన్నారిని తన సీట్లోకి వెళ్లాలని గద్దించాడు. దీంతో పసిపిల్లాడు మరింత బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు. ఆ దంపతుల పక్కన సీట్లలో కూర్చున్న ఇతర భారతీయ కుటుంబాలు, పిల్లాడి ఏడుపు ఆపడానికి శతవిథాలా ప్రయత్నించారని, బిస్కెట్లు ఇస్తూ ఏడుపు ఆపేలా ప్రయత్నించారు. అయితే మళ్లీ వచ్చిన ఆ క్యాబిన్ సిబ్బంది.. యూ బ్లడీ.. ఏడుపు ఆపుతావా? లేదా? అంటూ మండిపడ్డాడు. లేకపోతే విండోలో నుంచి బయటకు పడేస్తా అంటూ హెచ్చరించాడు. దీంతో తమ చిన్నారి మరింత దడుచుకున్నాడని మంత్రికి రాసిన లేఖలో ఆ ప్రయాణికుడు పేర్కొన్నాడు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ఆ కేబిన్ సిబ్బంది భారతీయులపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, బ్లడీ ఇండియన్స్ అంటూ వ్యాఖ్యానించాడని లేఖలో తెలిపాడు. విమానాన్ని టెర్మినల్‌కు తీసుకెళ్లి, తమల్ని బలవంతంగా కిందకి దించేశారని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకుని విచారించాలని ప్రయాణికుడు కోరాడు. ప్రయాణికుడు చేసిన ఈ ఫిర్యాదును, తాము చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఇలాంటి వివక్షపూరిత విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటూ బ్రిటీష్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి చెప్పారు. కస్టమర్‌తో ప్రత్యక్షంగా సంప్రదించి, దీనిపై పూర్తి విచారణ ప్రారంభిస్తామన్నారు. -
ఎయిర్ హోస్టెస్‌పై వేధింపుల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: దేశీ, విదేశీ విమానాల్లో వేధింపులు పరిపాటిగా మారిపోయాయి. ఇటీవల భాలీవుడ్ నటి జైరాను లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపగా.. తాజాగా ఎయిర్ విస్తారా మహిళా ఉద్యోగిపట్ల ఓ ప్యాసెంజర్ అనుచితంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. లక్నో-ఢిల్లీ విస్తారా విమానంలో మార్చి 24వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది. లక్నోనుంచి ‘యూకే 997’ విమానం ఢిల్లీలో అడుగుపెట్టినపుడు క్యాబిన్ క్రూ ఉద్యోగి పట్ల ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వైమానిక సిబ్బంది ఎయిర్ పోర్ట్‌లోని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు రాజీవ్ వసంత్ డానీ (62)గా గుర్తించారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని విస్తారా ధృవీకరించింది. సిబ్బందిపై ప్రయాణీకుల అనుచిత ప్రవర్తన, వేధింపులను సహించేది లేదని, ఈ వైఖరి ఇతర ప్రయాణీకులకు కూడా ఇబ్బందిగా మారుతుందని , దీనిపై కఠినచర్యలు తీసుకుంటామని ఎయిర్‌లైన్స్ ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది. కాగా గత ఏడాది దంగల్ నటి జైరా వాసిం తనకు జరిగిన అవమానంపై కంటతడి పెడుతూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై స్పందించిన విస్తారా ఎయిర్‌లైన్స్ జైరాకు క్షమాపణలు చెప్పింది. ఈ కేసులో ముంబైకి చెందిన వ్యాపారవేత్త వికాస్ సచ్దేవ్ లైంగిక వేధింపు ఆరోపణలతో ఐపిసి సెక్షన్ 354 కింద బుక్ అయిన సంగతి తెలిసిందే. -
ఎయిరిండియా సిబ్బందికి కక్కుర్తి ఎక్కువట!
ఎయిర్ ఇండియా.. భారతదేశం గర్వంగా చెప్పుకొనే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ. అయితే ఇందులో సిబ్బంది చేతివాటం కారణంగా సంస్థకు తలవంపులు వస్తున్నాయి. ఎయిరిండియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్లు తమ హోటల్లో బఫే టేబుల్ మీద మాత్రమే తినాల్సిన ఆహార పదార్థాలను బాక్సులలో పెట్టుకుని తీసుకుపోతున్నారని లండన్‌కు చెందిన ఓ ప్రముఖ హోటల్ ఫిర్యాదు చేసింది. దాంతో ఎయిరిండియా తమ సిబ్బంది అందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. 'బఫే అంటే తీసుకెళ్లేది కాదు' అనే శీర్షికతో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) ఈ నోటీసు పంపారు. అందులో, ''మాకు లండన్‌లోని ఒక హోటల్ యాజమాన్యం నుంచి దురదృష్టకరమైన ఈమెయిల్ వచ్చింది. కొంతమంది ఎయిరిండియా సిబ్బంది తరచు తమ హోటల్‌కు ఖాళీ బాక్సులు తెచ్చి, వాటిలో బఫేలో ఉంచిన ఆహార పదార్థాలు తీసుకెళ్లిపోతున్నట్లు చెప్పారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇలా చేస్తున్నారని మాకు తెలుసు గానీ, ఒకరిద్దరైనా అలా చేయడం పరువు తక్కువ. కొద్దిమంది తమ కక్కుర్తి పనులతో సంస్థ పరుపు ప్రతిష్ఠలను మంటగలపొద్దు'' అని ఆ నోటీసులో పేర్కొన్నారు. మొదట్లో లండన్ నుంచి వచ్చిన లేఖను ఫేక్ అనుకున్నామని, కానీ తర్వాత ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి చెప్పారు. అయితే కేవలం 15 రోజుల క్రితమే ఏజీఎంగా ప్రమోషన్ వచ్చిన మహిళ ఈ రకంగా నోటీసు పంపడాన్ని సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి సంస్థలోనూ కొంతమంది చేతివాటం ఉన్నవాళ్లు ఉంటారని, కేవలం కేబిన్ క్రూలో మాత్రమే కాదని ఒక సీనియర్ కేబిన్ సిబ్బంది చెప్పారు. ఇక్కడినుంచి లండన్ వెళ్లే విమానంలో తాము 14-15 గంటలు ప్రయాణం చేసి ఉదయం 7.30 లేదా సాయంత్రం 6.30 గంటలకు వెళ్తామని, అప్పటికి బాగా అలిసిపోయి ఉంటామని అన్నారు. ఇంతకుముందు రెండు రోజుల విశ్రాంతి ఉండేదని, ఇప్పుడు కేవలం 26 గంటలే ఉండటంతో తర్వాతిరోజు విమానంలో పని చేయడానికి విశ్రాంతి తీసుకుంటామని, సిబ్బందిలో కేవలం ఒకరిద్దరు మాత్రమే అలా బాక్సులు తెచ్చుకుని తర్వాత తినడానికి తీసుకుంటారని అన్నారు. రెగ్యులర్ సిబ్బంది కంటే కాంట్రాక్టు సిబ్బందికి 60% జీతాలు తక్కువగా ఉంటాయని, అలాంటివాళ్లు లండన్ లాంటి చోట్ల ఎక్కువ ఖరీదు ఉండే హోటళ్లలో తినడం కష్టమని వివరించారు. పైగా ఆ హోటల్లో రూమ్ సర్వీస్ ఉచితం కాదని, దానికి పది పౌండ్లు అదనంగా వసూలు చేస్తారని చెప్పారు. పైగా మెనూలో కేవలం శాండ్విచ్ల లాంటి పదార్థాలు మాత్రమే ఉంటాయని, ప్రతిసారీ భోజనంలో వాటిని తినడం భారతీయులకు కష్టమని చెప్పారు. -
ఉద్యోగులు బరువు పెరిగారని..
న్యూఢిల్లీ: సంస్ధలో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులు బరువు పెరిగారని భారతీయ విమానయాన సంస్ధ ఎయిర్ ఇండియా వారిని గ్రౌండ్ డ్యూటీలకు బదిలీ చేసింది. క్యాబిన్ క్రూ ఉద్యోగులుగా పనిచేస్తున్న 57 మంది(వీరిలో ఎక్కువ మంది ఎయిర్ హోస్టస్ గా విధులు నిర్వహిస్తున్నారు) అధిక బరువు ఉన్నట్లు ఎయిర్ ఇండియా గత నెలలో గుర్తించింది. త్వరగా బరువు తగ్గకపోతే శాశ్వత గ్రౌండ్ డ్యూటీ ఉద్యోగులుగా చేస్తామని హెచ్చరించింది కూడా. డెడ్ లైన్ లోగా బరువు తగ్గాలని సూచించిన ఎయిర్ ఇండియా అందులో ఫెయిల్ అయిన వారిని గ్రౌండ్ జాబ్స్ కు పంపినట్లు ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్ఐ) ప్రకారం.. అధిక బరువును కలిగివున్నట్లు గుర్తించామని చెప్పారు. గ్రౌండ్ జాబ్ లో చేరడమంటే నెలకు రూ.35 వేల నుంచి రూ.50 వేల ఫ్లైయింగ్ అలవెన్సును కోల్పోయినట్లే. అధిక బరువు కలిగిన వారిని క్యాబిన్ క్రూ జాబ్ కు తొలుత ఆరు నెలల పాటు అన్ ఫిట్ గా పరిగణిస్తారు. 18నెలల్లోగా తిరిగి తక్కువ బరువును చూపించలేకపోతే పర్మనెంట్ గా క్యాబిన్ క్రూ జాబ్ కు అన్ ఫిట్ గా పరిగణిస్తారు. -
ఇక పొట్టి దుస్తుల నుంచి విముక్తి
లండన్: ఎట్టకేలకు బ్రిటన్ విమానాల్లో పనిచేసే మహిళా సిబ్బంది పైచేయి సాధించింది. బ్రిటన్ ఎయిర్ వేస్ విమానాల్లో పనిచేసే సిబ్బందికి పొట్టి దుస్తులు ధరించడం నుంచి విముక్తి లభించింది. మహిళా, పురుష సిబ్బంది ఇకపై తమ కాళ్లను కప్పి ఉంచేలా దుస్తులు ధరించేందుకు అనుమతి లభించింది. దీంతో కొన్నేళ్లుగా ఈ ఎయిర్ వేస్ సంస్థకు సిబ్బందికి మధ్య జరుగుతున్న ఘర్షణలాంటి చర్చకు చివరకు తెరపడింది. సాధారణంగా బ్రిటన్ ఎయిర్ వేస్ లో విమాన కేబిన్ సిబ్బంది స్కర్ట్స్ ధరించడం డ్రెస్ కోడ్ గా ఉంది. అయితే, అది తమ మత సాంప్రదాయాలను గౌరవించేలా, కొన్ని వైద్య సంబంధమైన కారణాల దృష్ట్యా తమకు కాళ్లనిండా దుస్తులు వేసుకునేందుకు అనుమతించాలంటూ విమానంలో పనిచేసే సిబ్బంది డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే, అంతకుముందు వారు కావాలనుకుంటే అలా దుస్తులు ధరించే అవకాశం ఉండేది. కానీ, 2010లో కొత్త నిబంధనలు వచ్చి సిబ్బందికి అలా వస్త్రాలంకరణ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా, ఇటీవల వారిడిమాండ్ ను పరిగణించిన విమాన సంస్థ అందుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి బ్రిటీష్ ఎయిర్ వేస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ'సాధారణంగా మా విమానాల్లో పనిచేసే సిబ్బంది అంబాసిడర్ బ్రిటిష్ ఎయిర్ వేస్ యూనిఫాం ధరిస్తారు. పైజామాలకు అనుమతి ఉండదు. అయితే, ఇక నుంచి వారికి ఆ సౌకర్యం ఉంటుంది' అని చెప్పారు.