ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తమ 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు ఫర్‌లాఫ్ చేయాలని నిర్ణయించింది. అంటే మూడు నెలలపాటు పని లేదని, జీతాలు ఇవ్వలేమని, ఉద్యోగులు విధుల్లోకి రావద్దని ప్రకటించింది.
ఆర్థిక ఇబ్బందులు, చట్టపరమైన సమస్యలతో సతమతమవుతున్న స్పైస్‌జెట్ తక్కువ సంఖ్యలో విమానాలతో పనిచేస్తోంది. ప్రస్తుతం కేవలం 22 విమానాలను మాత్రమే నడిపిస్తోంది. సంస్థలోని మొత్తం 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు వేతనం లేకుండా సెలవుపై పంపనున్నట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి తాజాగా తెలిపారు. అంతకుముందు రోజు, ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ స్పైస్‌జెట్‌పై నిఘాను మరింత పెంచినట్లు తెలిపింది.
"స్పైస్‌జెట్ 150 మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా మూడు నెలల పాటు ఫర్‌లాఫ్‌లో ఉంచడానికి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత లీన్ ట్రావెల్ సీజన్, తగ్గిన విమానాల పరిమాణానికి ప్రతిస్పందనగా, సంస్థ దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది" అని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫర్‌లాఫ్ కాలంలో, క్యాబిన్ క్రూ సభ్యులు స్పైస్‌జెట్ ఉద్యోగులుగానే కొనసాగుతారని, అన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఆర్జిత సెలవులు చెక్కుచెదరకుండా ఉంటాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment