
చవక విమానయాన సేవలు అందిస్తున్న స్పైస్‌జెట్‌కు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. విమానాల లీజు రంగంలో ఉన్న ఐర్లాండ్‌కు చెందిన మూడు సంస్థలు, ఒక మాజీ పైలట్ స్పైస్‌జెట్‌పై ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్లు దాఖలు చేయడం ఇందుకు కారణం. స్పైస్‌జెట్ సుమారు రూ.110 కోట్లు బకాయి పడిందని, ఐబీసీ సెక్షన్ 9 కింద దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఎన్‌జీఎఫ్ ఆల్ఫా, ఎన్‌జీఎఫ్ జెనెసిస్, ఎన్‌జీఎఫ్ చార్లీ పిటిషన్లు దాఖలు చేశాయి.
ఈ వారం ప్రారంభంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా పరిష్కార చర్చలు జరుగుతున్నందున ఈ విషయాన్ని పరిష్కరించడానికి స్పైస్‌జెట్ కొంత సమయం కోరింది. తదుపరి విచారణ కోసం 2025 ఏప్రిల్ 7న మూడు పిటిషన్లను లిస్ట్ చేయాలని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. లీజుదారులు గతంలో స్పైస్‌జెట్‌కు ఐదు బోయింగ్ 737 విమానాలను లీజుకు ఇచ్చాయి.
ఇంజిన్లతో సహా విమానంలోని భాగాలను దొంగిలించి ఇతర విమానాలలో ఉపయోగించారని ఆరోపిస్తూ ఈ కంపెనీలు స్పైస్‌జెట్‌కు లీగల్ నోటీసును పంపించాయి. 19 సంవత్సరాలుగా విమానయాన రంగంలో ఉన్న స్పైస్‌జెట్.. ఎన్‌సీఎల్‌టీ, అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్‌సీఎల్‌ఏటీ వద్ద విల్లిస్ లీజ్, ఎయిర్‌కాజిల్ ఐర్లాండ్, విల్మింగ్టన్, సెలెస్టియల్ ఏవియేషన్ వంటి రుణదాతల నుండి దివాలా పిటిషన్లను ఎదుర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment