స్పైస్‌జెట్‌పై మరో రెండు దివాలా పిటీషన్లు | SpiceJet faces 2 more fresh insolvency pleas | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్‌పై మరో రెండు దివాలా పిటీషన్లు

Published Wed, Nov 20 2024 8:23 AM | Last Updated on Wed, Nov 20 2024 11:25 AM

SpiceJet faces 2 more fresh insolvency pleas

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌పై మరో రెండు దివాలా పిటీషన్లు దాఖలయ్యాయి. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్‌సీఎల్‌టీ) సబర్మతి ఏవియేషన్, జెట్‌ఎయిర్‌17 సంస్థలు వీటిని దాఖలు చేశాయి. సబర్మతి పిటీషన్‌పై స్పైస్‌జెట్‌కు నోటీసులు జారీ చేసిన ఎన్‌సీఎల్‌టీ.. 27 మిలియన్‌ డాలర్ల క్లెయిమ్‌కు సంబంధించి అదనంగా మరిన్ని పత్రాలు సమర్పించాలని జెట్‌ఎయిర్‌17కి సూచించింది.

ఐర్లాండ్‌కి చెందిన జెట్‌ఎయిర్‌17 .. విమాన ప్రయాణికుల రవాణాకు సంబంధించిన పరికరాలను లీజుకు అందిస్తుంది. తాము విల్మింగ్టన్‌ ట్రస్ట్‌ నుంచి విమానాలను లీజుకు తీసుకోగా, బాకీలు తీర్చాలని జెట్‌ఎయిర్‌17 కోరుతోందని స్పైస్‌జెట్‌ వాదించింది. విల్మింగ్టన్‌ ట్రస్ట్‌కి, జెట్‌ఎయిర్‌ 17కి మధ్య సంబంధంపై స్పష్టత లేదని పేర్కొంది.

అయితే, స్పైస్‌జెట్‌ లీజును విల్మింగ్టన్‌ తమకు బదలాయించిందని, దానికి అనుగుణంగానే తాజాగా పిటీషన్‌ దాఖలు చేశామని జెట్‌ఎయిర్‌ 17 వివరించింది. స్పైస్‌జెట్‌పై ఇటీవల విల్లీస్‌ లీజ్, ఎయిర్‌క్యాజిల్‌ ఐర్లాండ్, విల్మింగ్టన్, సెలెస్టియల్‌ ఏవియేషన్‌ తదితర సంస్థలు దివాలా పిటీషన్లు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో చాలా మటుకు పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement