దివాలా ప్రక్రియ ఆదేశాలపై స్టే
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ (సీడీఈఎల్)కి ఊరట లభించింది. కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఆదేశాలపై ఎన్‌సీఎల్‌ఏటీ తదుపరి విచారణ వరకు స్టే విధించింది. కంపెనీ పిటీషన్‌పై మూడు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఐడీబీఐ ట్రస్టీషిప్ సరీ్వసెస్ (ఐడీబీఐటీఎస్‌ఎల్)ను ఆదేశించింది.
వివరాల్లోకి వెడితే, రూ. 228.45 కోట్ల మొత్తాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయిన కాఫీ డే సంస్థపై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్‌ని ఐడీబీఐటీఎస్‌ఎల్ ఆశ్రయించింది. దీన్ని విచారణకు స్వీకరించిన ఎన్‌సీఎల్‌టీ, కంపెనీ కార్యకలాపాల నిర్వహణ కోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. అయితే, సస్పెండ్ అయిన కంపెనీ బోర్డు సీఈవో మాళవిక హెగ్డే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment