Coffee Day Enterprises
-
ఎన్సీఎల్ఏటీలో కాఫీ డే సంస్థకి ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్)కి ఊరట లభించింది. కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఆదేశాలపై ఎన్సీఎల్ఏటీ తదుపరి విచారణ వరకు స్టే విధించింది. కంపెనీ పిటీషన్‌పై మూడు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఐడీబీఐ ట్రస్టీషిప్ సరీ్వసెస్ (ఐడీబీఐటీఎస్ఎల్)ను ఆదేశించింది. వివరాల్లోకి వెడితే, రూ. 228.45 కోట్ల మొత్తాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయిన కాఫీ డే సంస్థపై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్‌ని ఐడీబీఐటీఎస్ఎల్ ఆశ్రయించింది. దీన్ని విచారణకు స్వీకరించిన ఎన్సీఎల్టీ, కంపెనీ కార్యకలాపాల నిర్వహణ కోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. అయితే, సస్పెండ్ అయిన కంపెనీ బోర్డు సీఈవో మాళవిక హెగ్డే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
కష్టాల్లో కాఫీ డే: రూ.434 కోట్ల చెల్లింపుల వైఫల్యం
Coffee Day Enterprises ఆర్ధిక సవాళ్లు ఎదుర్కొంటున్న కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఈ జులై–సెపె్టంబర్ త్రైమాసికంలో దాదాపు రూ. 434 కోట్ల రుణ(అసలు, వడ్డీ) చెల్లింపుల్లో విఫలమైనట్లు వెల్లడించింది. అంతకుముందు ఏప్రిల్–జూన్‌లోనూ రూ. 440 కోట్ల చెల్లింపుల్లో వైఫల్యం చెందడం గమనార్హం! తాజా త్రైమాసికంలో స్వల్ప, దీర్ఘకాలిక రుణాల చెల్లింపులను పూర్తిచేయలేకపోయినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు వెల్లడించింది. వీటిలో క్యాష్ క్రెడిట్ తదితర రుణాలు రూ. 189.14 కోట్లుకాగా.. వీటిలో అసలు విలువ రూ. 183.36 కోట్లుగా కంపెనీ తెలియజేసింది. ఇక చెల్లించవలసిన అన్‌లిస్టెడ్ రుణ సెక్యూరిటీల(ఎన్సీడీలు, ఎన్సీఆర్పీఎస్లు) విలువ రూ. 244.77 కోట్లలో అసలు రూ. 200 కోట్లుకాగా.. వడ్డీ రూ. 44.77 కోట్లుగా వివరించింది. డిఫాల్ట్ నేపథ్యంలో రుణదాతలు రుణ రికవరీ నోటీసుల జారీతోపాటు.. న్యాయ వివాద చర్యలకు దిగినట్లు తెలియజేసింది. రికవరీ నోటీసులు, న్యాయ వివాదాలు, రుణదాతలతో వన్‌టైమ్ సెటిల్మెంట్ పెండింగ్‌లోఉన్న కారణంగా 2021 ఏప్రిల్ నుంచి వడ్డీ మదింపు చేయలేదని వెల్లడించింది. -
కాఫీ డే ఆడిటర్లకు రూ. 1.25 కోట్లు జరిమానా.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: కాఫీ డే గ్లోబల్ (సీడీజీఎల్), ఎంఏసీఈఎల్ ఖాతాల ఆడిటింగ్‌లో అవకతవకలకు సంబంధించి నలుగురు ఆడిటర్లు, ఒక ఆడిట్ సంస్థకు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) రూ. 1.25 కోట్ల జరిమానా విధింంది. అలాగే ఆడిటింగ్ పనులు చేపట్టకుండా వేర్వేరుగా రెండు నుంచి అయిదేళ్ల పాటు నిషేధింంది. దివంగత వీజీ సిద్ధార్థకు చెందిన కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్)కు ఈ రెండూ అనుబంధ సంస్థలు. సీడీఈఎల్ నుం ఎంఏసీఈఎల్ (మైసర్ అవల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్)కు రూ. 3,535 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి గాను సీడీజీఎల్, ఎంఏసీఈఎల్ ఆర్థిక ఫలితాల స్టేట్మెంట్ల తయారీలో ఆడిటర్లు నిబద్ధతతో వ్యవహరించలేదని ఎన్ఎఫ్ఆర్ఏ నిర్ధారింంది. ఆడిట్ సంస్థ ఏఎస్ఆర్ఎంపీతో పాటు ఏఎస్ సుందరేశా, మధుసదన్ యూఎ, లవితా శెట్టి, ప్రణవ్ జి అంబేకర్ తదితరులకు తాజా జరివనాలు విధింంది. -
ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే!
మాళవిక హెగ్డే! పరిచయం అక్కర్లేని పేరు. కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(సీసీడీ) వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ సతీమణే మాళవిక హెగ్డే. రుణాల ఎగవేతతో మాళవిక హెగ్దే మరోసారి తెరపైకి వచ్చారు. మంగళూరు కాఫీ ఘమ ఘుమల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వీజీ సిద్ధార్ధ మరణంతో సీసీడీ సీఈవోగా మాళవిక హెగ్డే బాధ్యతల్ని చేపట్టారు. రూ.7వేల కోట్ల అప్పు! ఎలా తీర్చాలో దిక్కు తోచని స్థితులో సిద్ధార్థ తనువు చాలించారు. భర్త మరణం. అంతులేని బాధ. అప్పుల నడిసంద్రంలో మాళవిక కెఫే కాఫీ డే సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఎప్పుడు? ఎక్కడ? ఎలా? మొదలు పెట్టాలో తెలియని అగమ్య గోచర స్థితిలో అప్పుడే మాళవిక ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ.. కాఫీ సామ్రాజ్యాన్ని నిర్మించే పనిలో పడ్డారు. సిద్ధార్థ మరణం తర్వాత తొలిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భర్త సిద్ధార్ధ కలల్ని నిజం చేస్తానని, కెఫే కాఫీ డేను లాభాల బాట పట్టించి ఉద్యోగలందరిని కాపాడుకుంటానని చెప్పారు. ఆమె కృషి ఫలించి కెఫే కాఫీ డే సగర్వంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకులు నమ్మాయి. ఉద్యోగులు ఆమె వెంటే నడిచారు. కెఫే కాఫీ డేలో వాటాలు కొనుగోలు చేసేందుకు టాటాలాంటి దిగ్గజ కంపెనీలతో పాటు పెట్టుబడి దారులు ముందుకు వచ్చారు. ఇలా ఒకటిన్నర సంవత్సరం తిరగకుండానే రూ.7,200 కోట్ల రుణాల్ని రూ.3,100 కోట్లుకు తగ్గించగలిగారు. ఇలా ఒకటి రెండేళ్లలో కెఫే కాఫీ డే అప్పుల్ని తీర్చే సామర్ధ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాళవిక హెగ్డే చిక్కుల్లో పడ్డారు.కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ మార్చి 31 నాటికి మొత్తం రూ.436 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైనట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. స్వల్పకాల, దీర్ఘకాల రుణాలు ఇందులో ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.220 కోట్ల రుణ సదుపాయాల్లో అసలు రూ.190 కోట్లు, వడ్డీ రూ.6 కోట్ల వరకు చెల్లించలేకపోయినట్టు తెలిపింది. మరో రూ.200 కోట్లు, దీనిపై రూ.40 కోట్ల వడ్డీ మేర ఎన్సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్‌ల రూపంలో తీసుకున్నవి చెల్లించలేదని సమాచారం ఇచ్చింది. కంపెనీ తన ఆస్తులను విక్రయించడం ద్వారా క్రమంగా రుణ భారాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం. చదవండి👉 ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం.. ఆ రంగానికి చెందిన ఉద్యోగాలకు భారీ డిమాండ్! -
మైసూర్ కాఫీపై సెబీ జరిమానా
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్(ఎంఏసీఈఎల్)పై రూ. కోటి జరిమానా విధించింది. రూ. 3,535 కోట్ల నిధులను అక్రమ బదిలీ చేసేందుకు ప్రయివేట్ రంగ కంపెనీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(సీడీఈఎల్)ను ప్రేరేపించిన కేసులో ఫైన్ వేసింది. 45 రోజుల్లోగా జరిమానాను చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఈ రెండు సంస్థలూ దివంగత వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థ, ఆయన కుటుంబ సభ్యుల అజమాయిషీలో ఉన్న కంపెనీలు కాగా.. సీడీఈఎల్ అనుబంధ సంస్థల నుంచి నిధుల అక్రమ బదిలీకి ఎంఏసీఈఎల్ సహకరించినట్లు సెబీ పేర్కొంది. తద్వారా సెబీ చట్టం, పీఎఫ్‌యూటీపీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలియజేసింది. -
'కెఫె కాఫీ డే' కు మరో ఎదురు దెబ్బ..కొండంత అప్పును మంచులా కరిగించేసింది..కానీ!
బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ప్రయివేట్ రంగ కంపెనీలు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ విఫలమైంది.సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం(క్యూ2)లో దాదాపు రూ. 466 కోట్లమేర అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కేఫె కాఫీ డే సంస్థ తెలిపింది. వీటిలో ఎన్సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్ తదితర అన్‌లిస్టెడ్ రుణ సెక్యూరిటీలున్నట్లు పేర్కొంది. అయితే భర్త వీజీ సిద్ధార్థ మరణంతో కొండలా పేరుకు పోయినా అప్పును మాళవిక హెగ్డే మంచులా కరిగించేశారు.కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో కెఫె కాఫీ డే ఆర్ధిక వ్యవహారాలు బిజినెస్ వరల్డ్‌లో హాట్ టాపిగ్గా మారాయి. ఎందుకంటే? మాళవిక హెగ్డే మాళవిక హెగ్డే అనే పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కూతురిగా మాత్రమే మాళవిక హెగ్డే సుపరిచితం. ఇది అంత గతం. ఇప్పుడు తన గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇక నుంచి ఆమెను ఎప్పటికీ మరిచిపోరు. ఇంకా చెప్పాలంటే.. భర్త మరణంతో వెలుగులోకి 2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కొండంత అప్పును మంచులా కరిగించేసింది కేఫె కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కెఫె కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా! -
లిక్విడిటీ సంక్షోభం: కాఫీ డే రూ. 470 కోట్ల డిఫాల్ట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం ఆఖరు నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మొత్తం రూ. 470.18 కోట్ల రుణాలు, వడ్డీల చెల్లింపులో డిఫాల్ట్ అయినట్లు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్) వెల్లడించింది. నగదు కొరత సంక్షోభం వల్లే రుణాలపై వడ్డీల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు తెలిపింది. ఇందులో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న క్యాష్ క్రెడిట్‌కు సంబంధించి రూ. 216 కోట్లు, వాటిపై రూ. 5.78 కోట్ల వడ్డీ, అలాగే రూ. 200 కోట్ల ఎన్సీడీలు, నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల చెల్లింపులు, వాటిపై రూ. 48.41 కోట్ల వడ్డీ ఉన్నట్లు సంస్థ పేర్కొంది. సీడీఈఎల్కు మొత్తం రూ. 495.18 కోట్ల రుణాలు ఉన్నాయి. -
కాఫీడే టెక్ పార్క్ విక్రయానికి యస్ బ్యాంకు బ్రేక్!
బెంగళూరు: కాఫీడే ఎంటర్ప్రైజెస్ బెంగళూరులో తనకున్న టెక్నాలజీ పార్క్‌ను బ్లాక్‌స్టోన్ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, దీనికి యస్ బ్యాంకు ఆమోదం చెప్పకపోవడంతో నిలిచిపోయినట్టు సమాచారం. కాఫీ డే గ్రూపునకు రుణాలిచ్చిన సంస్థల్లో యస్ బ్యాంకు కూడా ఒకటి. ఈ ఒప్పందానికి యస్ బ్యాంకు ఇప్పటి వరకు నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వలేదని ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు చెప్పాయి. కాఫీ డే తీసుకున్న ఇతర రుణాల తాలూకు చెల్లింపులపై హామీ ఇవ్వాలని యస్ బ్యాంకు కోరినట్లు తెలిసింది. ఇతర రుణదాతలంతా ఇప్పటికే కాఫీడే టెక్ పార్క్– బ్లాక్‌స్టోన్ ఒప్పందానికి ఆమోదం తెలిపారని, యస్ బ్యాంకు మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. కాఫీ డేకు చెందిన ట్యాంగ్లిన్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బెంగళూరులో గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ నడుస్తోంది. ఈ కంపెనీ యస్ బ్యాంకుకు రూ.100 కోట్లు బకాయి పడింది. కాఫీ డే కూడా యస్ బ్యాంకుకు రూ.1,400 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆకస్మిక ఆత్మహత్య తర్వాత కంపెనీ యాజమాన్యం ఆస్తుల విక్రయం ద్వారా అప్పులు చెల్లించే ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కు రూ.2,600– 3,000 కోట్ల విలువకు విక్రయించేందుకు నాన్ బైండింగ్ ఒప్పందం చేసుకుంది. తాజా పరిణామాలతో బీఎస్ఈలో కాఫీడే షేరు సోమవారం 9 శాతం నష్టంతో రూ.43.85 వద్ద క్లోజయింది. -
కాఫీ డే...కలసివచ్చిన ‘మైండ్ ట్రీ’ వాటా విక్రయం
కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కంపెనీ నికర లాభం జూన్ క్వార్టర్లో భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో (ఏప్రిల్–జూన్ క్వార్టర్) రూ.21 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,567 కోట్లకు పెరిగిందని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఐటీ కంపెనీ మైండ్‌ట్రీలో వాటా విక్రయం కారణంగా వచ్చిన అసాధారణ లాభాల కారణంగా ఈ క్యూ1లో నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందిందని తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.966 కోట్ల నుంచి రూ.942 కోట్లకు తగ్గిందని పేర్కొంది. షేర్ 5% లాభంతో రూ.43 వద్ద ముగిసింది. -
బ్లాక్ స్టోన్ చేతికి కాఫీ డే గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్
న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కంపెనీ బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను రూ.2,700 కోట్లకు విక్రయించింది. ఈ ప్రొపర్టీని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్, రియల్టీ సంస్థ సలర్పూరియా సత్వలకు విక్రయించామని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఈ మేరకు సదరు సంస్థలతో నిశ్చయాత్మక ఒప్పందాలు కుదుర్చుకున్నామని పేర్కొంది. తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించడానికి, రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ ప్రాపర్టీని విక్రయించామని వివరించింది. ఈ డీల్ వచ్చే నెల 31లోపు పూర్తవ్వగలదని అంచనా. ప్రమోటర్ సిద్దార్థ ఆత్మహత్య తర్వాత రుణ భారం తగ్గించుకునే చర్యల్లో భాగంగా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఆస్తులను విక్రయిస్తోంది. పోర్ట్ టర్మినల్స్, కంటైనర్ ప్రైయిట్ స్టేషన్స్ నిర్వహించే తన అనుబంధ సంస్థ, సికాల్ లాజిస్టిక్స్ రుణ భారం తగ్గించుకోవడంపై కూడా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ దృష్టి పెట్టింది. సికాల్ లాజిస్టిక్స్ బహిర్గత రుణాలు రూ.1,488 కోట్ల మేర ఉంటాయని గత వారమే ఈ కంపెనీ ప్రకటించింది. ►గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ విక్రయ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్ 2 శాతం నష్టంతో రూ.72.75 వద్ద ముగిసింది. -
ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు
న్యూఢిల్లీ: ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడం (డీలివరేజింగ్) ద్వారా లిక్విడిటీ మెరుగునకు కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ చర్యలు చేపట్టింది. ఇటీవలే కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (సీడీఈఎల్) దీర్ఘకాలిక రేటింగ్‌ను ‘డి’ (ప్రతికూల దృక్పథానికి) ఇక్రా సంస్థ డౌన్ గ్రేడ్ చేసింది. అంతకుముందు వరకు బీబీ ప్లస్ నెగెటివ్ రేటింగ్ ఉండేది. రూ.315 కోట్ల దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఈ రేటింగ్‌ను ఇచ్చింది. సీడీఈఎల్ ఫ్లాగ్షిప్ సబ్సిడరీ అయిన కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్, సికాల్ గ్రూపు కంపెనీలకు సంబంధించి రుణ చెల్లింపులు ఆలస్యం అవడంతో రేటింగ్‌ను తగ్గించినట్టు స్వయంగా సీడీఈఎల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడంతోపాటు, నిధుల లభ్యత పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్టు సికాల్ లాజిస్టిక్స్ శుక్రవారం ప్రకటించింది. ఈ కంపెనీకి రూ.1,488 కోట్ల రుణభారం ఉంది. దీనికి కాఫీ డే గ్రూపు ప్రమోటర్, ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న వీజీ సిద్ధార్థ వ్యక్తిగత హామీదారుగా ఉన్నారు. సికాల్ లాజిస్టిక్స్ పోర్ట్ టెరి్మనళ్లు, ఫ్రైట్ స్టేషన్లలను నిర్వహిస్తోంది. సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత... సీడీఈఎల్ తన రుణ భారాన్ని తగ్గించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించడాన్ని గమనించొచ్చు. ఇందులో భాగంగానే బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్నాలజీ పార్క్‌ను సుమారు రూ.3,000 కోట్లకు బ్లాక్‌స్టోన్ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కూడా చేసుకుంది. -
అమ్మకానికి కాఫీ డే ’గ్లోబల్ పార్క్’
న్యూఢిల్లీ: వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమన్న వార్తల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈ) తాజాగా రుణాల భారం తగ్గించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 3,000 కోట్ల దాకా ఉంటుంది. అలాగే, అనుబంధ సంస్థ అల్ఫాగ్రెప్ సెక్యూరిటీస్‌లో కూడా వాటాలను ఇల్యూమినాటి సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించే ప్రతిపాదనకు కూడా సీడీఈ బోర్డు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ‘రుణభారం తగ్గించుకునే మార్గాలపై డైరెక్టర్ల బోర్డు చర్చించింది. ఈ సందర్భంగా అనుబంధ సంస్థ టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో భాగమైన గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కి విక్రయించే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 2,600 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల దాకా ఉంటుంది. మదింపు ప్రక్రియ, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించడం మొదలైనవన్నీ పూర్తయ్యాకా వచ్చే 30–45 రోజుల్లో ఈ డీల్ పూర్తి కావచ్చు‘ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు సీడీఈ తెలియజేసింది. ఈ రెండు ఒప్పందాలతో కాఫీ డే గ్రూప్ రుణభారం గణనీయంగా తగ్గగలదని పేర్కొంది. ఇన్వెస్టర్లు, రుణదాతలు, ఉద్యోగులు, కస్టమర్లు మొదలైన సంబంధిత వాటాదారులందరికీ ఈ డీల్స్ ప్రయోజనకరంగా ఉండగలవని వివరించింది. ఆతిథ్య, రియల్టీ తదితర రంగాల్లోని అన్‌లిస్టెడ్ వెంచర్స్ కారణంగా వీజీ సిద్ధార్థ నెలకొల్పిన సీడీఈ రుణభారం రెట్టింపై రూ. 5,200 కోట్లకు చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో గత నెల సిద్ధార్థ అదృశ్యం కావడం, ఆ తర్వాత నేత్రావతి నదిలో శవమై తేలడం ఆయన మరణంపై సందేహాలు రేకెత్తించాయి. సిద్ధార్థ అకాల మరణంతో జూలై 31న స్వతంత్ర డైరెక్టర్ ఎస్వీ రంగనాథ్ సీడీఈ తాత్కాలిక చైర్మన్‌గా నియమితులయ్యారు. రంగనాథ్‌తో పాటు సీవోవో నితిన్ బాగ్మానె, సీఎఫ్‌వో ఆర్ రామ్మోహన్‌లతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటైంది. కాఫీ డే గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఈ కమిటీ పరిశీలిస్తోంది. -
కాఫీ డే అప్పులు రూ. 5,200 కోట్లు!!
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అకాల మరణం నేపథ్యంలో ఆయన గ్రూప్ సంస్థల రుణ భారం చర్చనీయాంశంగా మారింది. సిద్ధార్థతో పాటు ఆయనకు చెందిన పలు సంస్థలు .. వివిధ ఆర్థిక సంస్థలు మొదలుకుని బ్యాంకుల దాకా చాలా చోట్ల నుంచి ఎంత దొరికితే అంత అన్నట్లుగా రుణాలు సమీకరించాయి. అత్యంత తక్కువగా రూ. 1 లక్ష నుంచి అనేక కోట్ల దాకా తీసుకున్నాయి. స్టాక్ ఎక్సే్చంజీలు, కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఆయా సంస్థలు దాఖలు చేసిన ఫైలింగ్స్ ద్వారా ఈ వివరాలు ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. బీఎస్ఈలో లిస్టయిన కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్) రుణభారం 2019 మార్చి 31 నాటికి రూ. 5,251 కోట్లుగా ఉంది. ఇది గతేడాది మార్చి ఆఖరున ఉన్న రూ. 2,457 కోట్లతో పోలిస్తే ఏకంగా రెట్టింపు కావడం గమనార్హం. ఇక సీడీఈఎల్ ప్రమోటర్ కంపెనీలు దేవదర్శిని ఇన్ఫో టెక్నాలజీస్, కాఫీ డే కన్సాలిడేషన్స్, గొనిబేడు కాఫీ ఎస్టేట్స్, సివన్ సెక్యూరిటీస్ మొదలైనవి కూడా పలు దఫాలుగా పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాయి. సోమవారం అదృశ్యమైన సిద్ధార్థ.. బుధవారం నేత్రావతి నదిలో శవంగా తేలిన సంగతి తెలిసిందే. తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యం కావడానికి ముందు ఆయన రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖలోని అంశాలు సిద్ధార్థ ఆర్థిక సమస్యల వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ)కు ఆయన సంస్థలు దాఖలు చేసిన ఫైలింగ్స్‌లోని విషయాలు బైటికి వస్తున్నాయి. వీటిని బట్టి చూస్తే.. ► టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీస్, క్లిక్స్ క్యాపిటల్ సర్వీసెస్ (గతంలో జీఈ మనీ ఫైనాన్స్ సర్వీసెస్), షాపూర్జీ పల్లోంజీ ఫైనాన్స్ (ఎస్పీఎఫ్) వంటి సంస్థల నుంచి కూడా సిద్ధార్థ రుణాలు తీసుకున్నారు. ఇందులో టాంగ్లిన్ డెవలప్మెంట్స్ అనే అనుబంధ సంస్థకు ఎస్పీఎఫ్ రూ. 12 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించినట్లు 2018 ఏప్రిల్‌లో ఎంసీఏకు సమర్పించిన ఫైలింగ్‌లో ఉంది. ► ఇక మరో ఫైలింగ్‌లో కాఫీ డే హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు ‘రూ. లక్ష దాకా టర్మ్ రుణ సదుపాయం కల్పించేందుకు‘ క్లిక్స్ క్యాపిటల్ అంగీకరించిన డీల్ గురించిన ప్రస్తావన ఉంది. ► సిద్ధార్థకు చెందిన అన్‌లిస్టెడ్ కంపెనీలు (ఆతిథ్య, రియల్టీ రంగాలవి) ఎంత మేర రుణాలు తీసుకున్నాయన్నది ఇంకా ఇథమిథ్థంగా తెలియనప్పటికీ.. వీటి అప్పుల భారం కూడా సీడీఈఎల్ స్థాయిలోనే ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ► 2017 తర్వాత సిద్ధార్థ రుణాల పరిమాణం గణనీయంగా పెరిగింది. అయితే, గడువులోగా వీటిలో ఎన్ని రుణాలను చెల్లించారు, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎన్ని మొండిబాకీలుగా మారా యన్నది ఇంకా పూర్తిగా తెలియాల్సి వుంది. ► ఎంసీఏ డేటా ప్రకారం 2018 మార్చి ఆఖరు నాటికి కాఫీ డే కన్సాలిడేషన్స్ స్వల్పకాలిక రుణాలు, తక్షణం జరపాల్సిన చెల్లింపుల పరిమాణం రూ. 36.53 కోట్లుగా ఉన్నాయి. ► వీజీ సిద్ధార్థ, సీడీఈఎల్ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు తమ వద్ద ఉన్న షేర్లలో మూడొంతుల షేర్లను తనఖా పెట్టాయి. ఇటీవలే రెణ్నెల్ల క్రితం జూన్‌లో కూడా సిద్ధార్థ కొన్ని షేర్లను అదనంగా తనఖా పెట్టారు. జూన్ ఆఖరు నాటికి సీడీఈఎల్‌లో సిద్ధార్థకు 32.7 శాతం, ఆయన భార్య మాళవిక హెగ్డేకు 4.05 శాతం, నాలుగు ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు 17 శాతం మేర వాటాలు ఉండేవి. ► ప్రమోటింగ్ సంస్థలు తమ మొత్తం హోల్డింగ్‌లో 75.7 శాతం (సుమారు 8.62 కోట్ల షేర్లు) తనఖాలో ఉంచాయి. జూన్ ఆఖర్లో కూడా సిద్ధార్థ కొత్తగా మరో 1.39 శాతం (29.2 లక్షల షేర్లు) తనఖా పెట్టారు. గ్రూప్ కంపెనీలు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి తీసుకున్న రుణాలకు పూచీకత్తుగా వీటిని కోటక్ మహీంద్రా బ్యాంక్ పేరిట తనఖా పెట్టారు. ► ఇక సీడీఈఎల్‌లో సివన్ సెక్యూరిటీస్‌కి ఉన్న మొత్తం వాటాలు (0.21 శాతం) వాటాలు తనఖాలోనే ఉన్నాయి. అటు సీడీఈఎల్‌లో కాఫీ డే కన్సాలిడేషన్స్‌కు ఉన్న 5.81 శాతం వాటాల్లో 95.96 శాతం షేర్లు తనఖాలో ఉన్నాయి. ► దేవదర్శిని ఇన్ఫో టెక్నాలజీస్ వాటాల్లో 83.07 శాతం, గొనిబేడు కాఫీ ఎస్టేట్స్ వాటాల్లో 78.9 శాతం వాటాలు తనఖాలో ఉన్నాయి. పార్లమెంటులోనూ సిద్ధార్థ విషాదాంతం ప్రస్తావన.. దివాలా స్మృతి (ఐబీసీ)పై చర్చ సందర్భంగా పార్లమెంటులో కూడా సిద్ధార్థ విషాదాంతం ప్రస్తావన వచ్చింది. వ్యాపార వైఫల్యాలనేవి జరగరానివేమీ కాదని, వ్యాపారవేత్త విఫలమైనంత మాత్రాన చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వ్యాపారం సజావుగా సాగని పక్షంలో వ్యాపారవేత్తలు గౌరవప్రదంగా తప్పుకునేందుకు తగు పరిష్కారమార్గం చూపడమే ఐబీసీ ఉద్దేశమని వివరించారు. అటు.. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ విషాదాంతాన్ని ప్రస్తావిస్తూ వ్యాపారపరమైన వైఫల్యాల కారణంగా పరిశ్రమలు మూతబడుతున్నాయని వైసీపీ ఎంపీ ఎం శ్రీనివాసులు రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారాన్ని సులభతరం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే.. వ్యాపారాలు నడపడంలో కష్టాలు మరింతగా పెరుగుతున్నాయన్నారు. వ్యాపారసంస్థల్లో భయాందోళనలు నెలకొన్నాయని, వీటిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నిజాయితీగా పనిచేసే సంస్థలను, తప్పుడు విధానాలు పాటించే సంస్థలను ప్రభుత్వం ఒకే రీతిగా చూస్తోందంటూ ‘గుర్రాలు, గాడిదలను ఒకే గాటన కట్టేయడం సరికాదు’ అని శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పూచీకత్తు కారణంగా ఒక పారిశ్రామికవేత్త ఆత్మహత్య చేసుకోవాల్సిన తీవ్ర పరిస్థితులు తలెత్తడం సరికాదని టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా తెలిపారు. -
కాఫీ డే ఫౌండర్‌కు ఐటీ శాఖ ఝలక్
కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త, కెఫే కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థకు ఆదాయ పన్నుశాఖ భారీ షాక్ ఇచ్చింది. ఐటీ సంస్థ మైండ్ ట్రీలో సిద్దార్థకున్న వాటాలను ఐటీ శాఖ ఎటాచ్ చేసింది. ఈ మేరకు మైండ్ ట్రీ శనివారం అందించిన రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. సిద్ధార్థతోపాటు, సిద్దార్థ అండ్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు ఉన్న రూ.665కోట్ల విలువైన వాటాలను ఎటాచ్ చేసిందని మైండ్ ట్రీ వెల్లడించింది. సిద్ధార్థకు చెందిన 52.7లక్షల షేర్లు, కాఫీడేకు సంబంధించిన 22.2 లక్షల ఈక్విటీ షేర్ల విక్రయాలు, లేదా బదలాయింపులను కూడా నిషేధించిందని పేర్కొంది. ఐటీ ఆదేశాల ప్రకారం ఈ నిషేధం జనవరి 25నుంచి ఆరునెలల పాటు అమల్లో ఉంటుందని తెలిపింది. మైండ్ ట్రీలో ఆయనకున్న 21 శాతం వాటాను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బెంగళూరు ఐటీ విభాగం ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబరు 2018 త్రైమాసికానికి సిద్ధార్థ మైండ్ ట్రీ లో 3.3 శాతం వాటా (54.69 లక్షల షేర్లు)ను కలిగి ఉండగా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు 1.74 కోట్ల షేర్లు (10.63 శాతం వాటా) ఉన్నాయి. మరో సంస్థ కాఫీ డే ట్రేడింగ్ లిమిటెడ్ 1.05 కోట్ల షేర్లను (6.45 శాతం) కలిగి ఉంది. సంస్థ మిగిలిన ప్రమోటర్లైన సుబ్రతో బాగ్చి, కృష్ణకుమార్ నటరాజన్, ఎన్.ఎస్. పార్థసారథి, రోస్తోవ్ రావణన్లకు కలిపి కంపెనీలో 13 శాతా వాటాను కలిగి ఉన్నారు. మిడ్ సైజ్ ఐటీ సంస్థ మైండ్ ట్రీలోని తన వాటాలను ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మరో ప్రయివేటు సంస్థ కెకెఆర్‌కు విక్రయించే క్రమంలో తుది దశ చర్చల్లో ఉన్నట్టు సమాచారం. మరో పదిరోజుల్లో ఈ డీల్‌ను సిద్ధార్థ్ పూర్తి చేసుకునేందుకు సిద్ధమవుతుండగా ఐటీ శాఖ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిణామంపై అటు మైండ్ టీ ఫౌండర్లు , ఇటు వీజీ సిద్ధార్థ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా 2017లోనే కాఫీడే సంస్థల యజమాని వీజీ సిద్ధార్థ నివాసం, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఈ సందర్బంగా రూ.650 కోట్ల విలువైన అప్రకటిత ఆస్తులను గుర్తించినట్టు తెలిపింది. అలాగే దీనిపై చర్యలు తీసుకుంటామని కూడా ఐటీ శాఖ ప్రకటించింది. అయితే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నరు, మాజీ కేంద్ర మంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడే వీజీ సిద్ధార్థ. -
కాఫీ డే ఐపీఓకు సెబీ అనుమతి
ఈ ఐపీఓ ద్వారా రూ.1,150 కోట్లు సమీకరణ న్యూఢిల్లీ: కేఫ్ కాఫీ డే చెయిన్‌ను నిర్వహిస్తున్న కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఐపీఓకు సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా రూ.1,150 కోట్లు సమీకరించాలని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ యోచిస్తోంది. ఈ ఐపీఓ నిధులతో రూ.632 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకుంటామని, కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తామని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ పేర్కొంటోంది. కాగా సెబీ ఇప్పటిదాకా ఐపీఓకు అనుమతిచ్చిన కంపెనీల సంఖ్య 25కు పెరిగింది.