Coffee Day Enterprises Reports Total Default At Rs 436.06 Crore, Details Inside - Sakshi
Sakshi News home page

Coffee Day Enterprises: ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే!

Published Mon, Apr 10 2023 12:20 PM | Last Updated on Mon, Apr 10 2023 1:30 PM

Coffee Day Enterprises Total Default At Rs 436.06 Crore - Sakshi

మాళవిక హెగ్డే! పరిచయం అక్కర్లేని పేరు. కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(సీసీడీ) వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ సతీమణే మాళవిక హెగ్డే. రుణాల ఎగవేతతో మాళవిక హెగ్దే మరోసారి తెరపైకి వచ్చారు. మంగళూరు కాఫీ ఘమ ఘుమల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వీజీ సిద్ధార్ధ మరణంతో సీసీడీ సీఈవోగా మాళవిక హెగ్డే బాధ్యతల్ని చేపట్టారు.   

రూ.7వేల కోట్ల అప్పు! ఎలా తీర్చాలో దిక్కు తోచని స్థితులో సిద్ధార్థ తనువు చాలించారు. భర్త మరణం. అంతులేని బాధ. అప్పుల నడిసంద్రంలో మాళవిక కెఫే కాఫీ డే సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఎప్పుడు? ఎక్కడ? ఎలా? మొదలు పెట్టాలో తెలియని అగమ్య గోచర స్థితిలో అప్పుడే మాళవిక ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ.. కాఫీ సామ్రాజ్యాన్ని నిర్మించే పనిలో పడ్డారు. 

సిద్ధార్థ మరణం తర్వాత తొలిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భర్త సిద్ధార్ధ కలల్ని నిజం చేస్తానని, కెఫే కాఫీ డేను లాభాల బాట పట్టించి ఉద్యోగలందరిని కాపాడుకుంటానని చెప్పారు.  ఆమె కృషి ఫలించి కెఫే కాఫీ డే సగర్వంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 

బ్యాంకులు నమ్మాయి. ఉద్యోగులు ఆమె వెంటే నడిచారు. కెఫే కాఫీ డేలో వాటాలు కొనుగోలు చేసేందుకు టాటాలాంటి దిగ్గజ కంపెనీలతో పాటు పెట్టుబడి దారులు ముందుకు వచ్చారు. ఇలా ఒకటిన్నర సంవత్సరం తిరగకుండానే రూ.7,200 కోట్ల రుణాల్ని రూ.3,100 కోట్లుకు తగ్గించగలిగారు. ఇలా ఒకటి రెండేళ్లలో కెఫే కాఫీ డే అప్పుల్ని తీర్చే సామర్ధ్యం ఉంది. 

ఇలాంటి పరిస్థితుల్లో మాళవిక హెగ్డే చిక్కుల్లో పడ్డారు.కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ మార్చి 31 నాటికి మొత్తం రూ.436 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైనట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. స్వల్పకాల, దీర్ఘకాల రుణాలు ఇందులో ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.220 కోట్ల రుణ సదుపాయాల్లో అసలు రూ.190 కోట్లు, వడ్డీ రూ.6 కోట్ల వరకు చెల్లించలేకపోయినట్టు తెలిపింది. మరో రూ.200 కోట్లు, దీనిపై రూ.40 కోట్ల వడ్డీ మేర ఎన్‌సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్‌ల రూపంలో తీసుకున్నవి చెల్లించలేదని సమాచారం ఇచ్చింది. కంపెనీ తన ఆస్తులను విక్రయించడం ద్వారా క్రమంగా రుణ భారాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం.

చదవండి👉 ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం.. ఆ రంగానికి చెందిన ఉద్యోగాలకు భారీ డిమాండ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement