Malavika Hegde
-
ఒకప్పుడు భర్త, ఇప్పుడు తండ్రి మరణం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన ఎస్ఎం కృష్ణ ఇటీవల కన్నుముశారు. ఆయన కుమార్తె మాళవిక హెగ్డే ప్రముఖ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(సీసీడీ) వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ సతీమణి. మంగళూరు కాఫీ ఘుమ ఘుమల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వీజీ సిద్ధార్ధ మరణంతో సీసీడీ సీఈవోగా మాళవిక హెగ్డే బాధ్యతల్ని చేపట్టిన విషయం తెలిసిందే.భర్త మరణం.. చెదరని విశ్వాసం2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇలాంటి సందర్భంలో మనకు ఏమనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా! ఈ రెండు కోణాలు మాళవికకు ఎదురయ్యాయి. కేఫ్ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, ఉద్యోగులకు అండగా ఉంటూ సంస్థనూ ముందుకు నడుపుతున్నారు.సగానికిపైగా అప్పులు క్లియర్కేఫ్ కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు అనే దానికి ఈ విషయం ఒక ఉదాహరణ. కేఫ్ కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. అలాగే, తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు.ఇదీ చదవండి: బిగ్‌బీను వెనక్కి నెట్టిన కెప్టెన్ కూల్భర్త, తండ్రిని కోల్పోయిన మాళవిక అధైర్య పడకుండా రెట్టించిన ఉత్సాహాంతో పని చేసి కంపెనీని అప్పుల ఊబిలో నుంచి బయటపడేసి లాభాల్లోకి తీసుకురావాలని శ్రేయోభిలాషులు ఆశిస్తున్నారు. -
ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే!
మాళవిక హెగ్డే! పరిచయం అక్కర్లేని పేరు. కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(సీసీడీ) వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ సతీమణే మాళవిక హెగ్డే. రుణాల ఎగవేతతో మాళవిక హెగ్దే మరోసారి తెరపైకి వచ్చారు. మంగళూరు కాఫీ ఘమ ఘుమల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వీజీ సిద్ధార్ధ మరణంతో సీసీడీ సీఈవోగా మాళవిక హెగ్డే బాధ్యతల్ని చేపట్టారు. రూ.7వేల కోట్ల అప్పు! ఎలా తీర్చాలో దిక్కు తోచని స్థితులో సిద్ధార్థ తనువు చాలించారు. భర్త మరణం. అంతులేని బాధ. అప్పుల నడిసంద్రంలో మాళవిక కెఫే కాఫీ డే సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఎప్పుడు? ఎక్కడ? ఎలా? మొదలు పెట్టాలో తెలియని అగమ్య గోచర స్థితిలో అప్పుడే మాళవిక ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ.. కాఫీ సామ్రాజ్యాన్ని నిర్మించే పనిలో పడ్డారు. సిద్ధార్థ మరణం తర్వాత తొలిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భర్త సిద్ధార్ధ కలల్ని నిజం చేస్తానని, కెఫే కాఫీ డేను లాభాల బాట పట్టించి ఉద్యోగలందరిని కాపాడుకుంటానని చెప్పారు. ఆమె కృషి ఫలించి కెఫే కాఫీ డే సగర్వంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకులు నమ్మాయి. ఉద్యోగులు ఆమె వెంటే నడిచారు. కెఫే కాఫీ డేలో వాటాలు కొనుగోలు చేసేందుకు టాటాలాంటి దిగ్గజ కంపెనీలతో పాటు పెట్టుబడి దారులు ముందుకు వచ్చారు. ఇలా ఒకటిన్నర సంవత్సరం తిరగకుండానే రూ.7,200 కోట్ల రుణాల్ని రూ.3,100 కోట్లుకు తగ్గించగలిగారు. ఇలా ఒకటి రెండేళ్లలో కెఫే కాఫీ డే అప్పుల్ని తీర్చే సామర్ధ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాళవిక హెగ్డే చిక్కుల్లో పడ్డారు.కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ మార్చి 31 నాటికి మొత్తం రూ.436 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైనట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. స్వల్పకాల, దీర్ఘకాల రుణాలు ఇందులో ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.220 కోట్ల రుణ సదుపాయాల్లో అసలు రూ.190 కోట్లు, వడ్డీ రూ.6 కోట్ల వరకు చెల్లించలేకపోయినట్టు తెలిపింది. మరో రూ.200 కోట్లు, దీనిపై రూ.40 కోట్ల వడ్డీ మేర ఎన్సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్‌ల రూపంలో తీసుకున్నవి చెల్లించలేదని సమాచారం ఇచ్చింది. కంపెనీ తన ఆస్తులను విక్రయించడం ద్వారా క్రమంగా రుణ భారాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం. చదవండి👉 ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం.. ఆ రంగానికి చెందిన ఉద్యోగాలకు భారీ డిమాండ్!