ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కాఫీడే (కేఫ్ కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్- సీడీజీఎల్) దశ తిరిగిట్టు కనిపిస్తోంది. నష్టాల ఊబి నుంచి బయటపడి ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.24.57 కోట్ల నికర లాభం వచ్చినట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.11.73 కోట్ల నష్టాన్ని కాఫీడే చవిచూసింది.
మొత్తంగా ఏడాది క్రితం తొలి త్రైమాసికంలో రూ.189.63 కోట్లుగా ఉన్న కంపెనీ ఆపరేషన్స్ ఆదాయం ఈ ఏడాది రూ.223.20 కోట్లకు చేరుకున్నట్లు క్యూ1 ఫలితాల వెల్లడి సందర్భంగా కాఫీ డే పేర్కొంది. సీడీజీఎల్ అన్‌లిస్టెడ్ కంపెనీ కావడంతో దాని మాతృ సంస్థ కాఫీడే ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ (సీడీఈఎల్) ప్రతి త్రైమాసికం ఫలితాలను వెల్లడిస్తుంది. కాగా ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 250 కోట్లు.
మరోవైపు ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో కాఫీ డే దేశవ్యాప్తంగా ఉన్న తమ అవుట్‌లెట్ల సంఖ్యను సీక్వెన్షియల్ ప్రాతిపదికన 467కి తగ్గించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 493 అవుట్‌లెట్లు ఉండేవి. కానీ, వెండింగ్ యంత్రాలను మాత్రం 46,603 నుంచి 50,870కి పెంచుకుంది. ఒక్కో అవుట్‌లెట్‌లో సరాసరి రోజువారీ ఆదాయం రూ.19,537 నుంచి రూ.20,824కి పెరిగినట్లు కాఫీడే కంపెనీ వెల్లడించింది. క్యూ1 ఫలితాల నేపథ్యంలో కాఫీడే షేర్లు ఆగస్ట్ 16న లాభాల బాటలో పయనించాయి.
ఇదీ చదవండి: Vietnam Richest man: అదృష్టం కాదిది.. అంతకు మించి! ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద..
Comments
Please login to add a commentAdd a comment